Let =చేయనివ్వండి

చేయనివ్వండి, వెళ్ళనివ్వండి, చూడనివ్వండి, రాయనివ్వండి, మాట్లాడనివ్వండి,  ఈ విధంగా చివరిలో  “నివ్వండి” అని వస్తుంది

Let ఉపయోగించి సెంటెన్స్ నిర్మాణం ఏ విధంగా చేస్తారో  చూద్దాం

Let + object pronoun + V1 

Object pronoun అంటే ఏమిటి? క్రింది  టేబుల్ బాగా గమనించండి

 

Subject PronounObject Pronoun
He = అతడుHim=  అతనిని
She=  ఆమెHer=  ఆమెని
It=   ఇదిIt=  దీనిని
I=  నేనుMe=  నన్ను
We=  మేముUs=  మమ్మును
You=  నీవు/ మీరుYou=  నిన్ను
They=   వారుThem=  వారిని
Rames=  రమేష్Rames=  రమేష్ ని

సెంటెన్స్ లో  పురుషుల పేర్లకు బదులుగా, స్త్రీల పేర్లకు బదులుగా ఉపయోగించే వాటిని Pronouns (సర్వనామం)  అంటారు. సబ్జెక్టు ప్రొనౌన్స్ గురించి మనకి తెలుసు.

He,  ఆబ్జెక్ట్  ప్రొనౌన్సులో Him గా మారుతుంది. అలాగే అన్ని గమనించండి. ఏమైనా పేర్లు ఉంటే రెండు చోట్ల   మార్పు లేకుండా ఉంటాయి. అలాగే ప్రతిదానికి చివర  “ని” లేదా  ‘ను’ అని వస్తుంది  అతనిని, ఆమెని, దీనిని, నన్ను, మమ్మును, నిన్ను, వారిని, రమేష్ ని.   

 Let + object pronoun + V1 

Example: Let him go = అతనిని వెళ్ళనివ్వు 

వ్యతిరేక వాక్యాలు ఎలా రాయాలి?

చేయనివ్వండి, వెళ్ళనివ్వండి, చూడనివ్వండి, రాయనివ్వండి, మాట్లాడనివ్వండి,  అని మనం ఎవరితో చెప్తాం ఎదుటి వ్యక్తితోనే చెప్తాం. ఎదుటి వ్యక్తి you అవుతాడు + verb 1 ఉన్న వాక్యాలను వ్యతిరేక వాక్యాలుగా రాయటానికి do not (or)  don’t  ఉపయోగిస్తారు కాబట్టి

 Let + object pronoun + V1   ఈ స్ట్రక్చర్ ప్రకారం నిర్మించే ప్రతి వాక్యంలో కూడా వ్యతిరేక వాక్యం రాయుటకు  don’t మాత్రమే ఉపయోగించాలి. object pronoun సింగులర్ అయిన ప్లూరల్ అయిన don’t మాత్రమే ఉపయోగించాలి. కాబట్టి పై వాక్యానికి వ్యతిరేక వాక్యం క్రింది విధంగా రాయవచ్చు

Don’t let him go = అతనిని వెళ్ళ నివ్వవద్దు.

ప్రశ్న వాక్యాలుగా మార్చుటకు హెల్పింగ్ వెర్బ్ అవసరం. Let  ఉపయోగించి చెప్పే ఇటువంటి వాక్యాలలో హెల్పింగ్ వెర్బ్ ఉండదు కాబట్టి ప్రశ్న వాక్యాలుగా మార్చుటకు shall we/ should we ఉపయోగిస్తారు. 

 కాబట్టి పై రెండు వాక్యాలను ప్రశ్నా వాక్యాలుగా క్రింది విధంగా రాయవచ్చు

Shall we Let him go? =మేము అతన్ని వెళ్ళనివ్వలా?

Shall we not let him go?  = మేము అతన్ని వెళ్ళనివ్వకూడదా?

(Shall we Don’t let him go? అని రియకూడదు  shall, don’t ఈ విధంగా ఒక వాక్యంలో రెండు helping verbs ఉండకూడదు)

 

Examples:

1. Let him go. అతన్ని వెళ్ళనివ్వండి
Don’t let him go. అతన్ని వెళ్ళనివ్వకండి
Shall we let him go? మేము అతన్ని వెళ్ళనివాలా ?
Shall we not let him go? మేము అతన్ని వెళ్ళనికూడదా ?
2. Let her speak. ఆమెను మాట్లాడనివ్వండి
Don’t let her speak. ఆమెను మాట్లాడినవ్వకండి
Shall we let her speak? మేము ఆమెను మాట్లాడనివ్వాలా?
Shall we not let her speak? మేము ఆమెని మాట్లాడానివ్వకూడదా?
3. Let them enter. వారిని లోపలికి రానివ్వండి
Don’t let them enter.  వారిని లోపలికి రానివ్వకండి
Shall we let them enter? మేము వారిని లోపలికి రానివ్వాలా?
Shall we not let them enter?  మేము వారిని లోపలికి రానివ్వకూడదా?
4. Let me try.నన్ను ప్రయత్నించండి
5. Let him finish. అతన్ని పూర్తి చేయనివ్వండి
6. Let her decide. ఆమెని నిర్ణయించుకోనివ్వండి
7. Let them play. వాళ్ళని ఆడుకోనివ్వండి
8. Let him explain.అతన్ని వివరించనివ్వండి
9. Let her choose. ఆమెని ఎంచుకోనివ్వండి
10. Let them stay. వాటిని ఉండనివ్వండి
11. Let him start. అతన్ని ప్రారంభించనివ్వండి
12. Let her win.  ఆమెని గెలవనివ్వండి
13. Let them leave. వాళ్లని వెళ్ళిపోనివ్వండి
14. Let him answer.  అతన్ని సమాధానం చెప్పనివ్వండి
15. Let her sing.ఆమెని  పాడనివ్వండి
16. Let them work. వారిని పని చేయనివ్వండి
17. Let him rest. అతన్ని విశ్రాంతి తీసుకుని ఇవ్వండి
18. Let her drive. ఆమెని డ్రైవ్ చేయనివ్వండి
19. Let them learn. వారిని నేర్చుకోనివ్వండి
20. Let me check.  నన్ను తనిఖీ చేయనివ్వండి 
21. Let him read. అతన్ని చదవనివ్వండి
22. Let her write.ఆమెని  వ్రాయనివ్వండి
23. Let them build.  వారిని  నిర్మించనివ్వండి
24. Let him climb. అతన్ని ఎక్కనివ్వండి
25. Let her dance.  ఆమెని నృత్యం చేయనివ్వండి
26. Let them grow. వాటిని పెరగనివ్వండి
27. Let him jump. అతన్ని దూకనివ్వండి
28. Let her paint.ఆమెని పెయింట్ చేయనివ్వండి
29. Let them travel. వారిని ప్రయాణించనివ్వండి
30. Let him search.  అతన్ని  వెతకనివ్వండి
31. Let her cook. ఆమెని వండనివ్వండి 
32. Let them watch. వారిని చూడనివ్వండి
33. Let him listen. అతడిని  విననివ్వండి
34. Let her teach. ఆమెని బోధించనివ్వండి
35. Let them swim. వాటిని ఈత కొట్టనివ్వండి
36. Let him repair.  అతన్ని మరమ్మతు చేయనివ్వండి
37. Let her organize.  ఆమెని నిర్వహించనివ్వండి
38. Let them collect. వాటిని సేకరించనివ్వండి
39. Let him deliver.  అతన్ని  బట్వాడా చేయనివ్వండి
40. Let her prepare. ఆమెని  సిద్ధం కానివ్వండి
41. Let them arrange.  వారిని ఏర్పాటు చేసుకోనివ్వండి
42. Let him protect. అతన్ని రక్షించనివ్వండి
43. Let her manage. ఆమెని నిర్వహించనివ్వండి
44. Let them create.  వారిని సృష్టించనివ్వండి
45. Let him improve. అతన్ని మెరుగుపరుచుకోనివ్వండి
46. Let her solve.ఆమెని పరిష్కరించనివ్వండి
47. Let them discover. వారిని కనుగొననివ్వండి
48. Let him borrow. అతన్ని అప్పు తీసుకోనివ్వండి
49. Let her return.  ఆమెని తిరిగి రానివ్వండి
50. Let them celebrate.వారిని  కార్యక్రమం జరుపుకోనివ్వండి

 

Long sentences:

1.Let her go. She has to attend the meeting.ఆమెను వెళ్ళనివ్వండి. ఆమె సమావేశానికి హాజరు కావాలి.
లెట్ హర్ గో. షీ హాస్ టు అటెండ్ ది మీటింగ్. 
2.Let him speak. He wants to explain everything.అతన్ని మాట్లాడనివ్వండి. అతను ప్రతిదీ వివరించాలనుకుంటున్నాడు.
లెట్ హిమ్ స్పీక్. హీ వాంట్స్ టు ఎక్స్‌ప్లేన్ ఎవ్రీథింగ్. 
3.Let the children play. They need some fresh air.పిల్లలను ఆడుకోనివ్వండి. వారికి కాస్త స్వచ్ఛమైన గాలి అవసరం.
లెట్ ద చిల్డ్రన్ ప్లే. దే నీడ్ సమ్ ఫ్రెష్ ఎయిర్. 
4.Let me help you. You seem tired.నన్ను మీకు సహాయం చేయనివ్వండి. మీరు అలసిపోయినట్లున్నారు.
లెట్ మీ హెల్ప్ యూ. యూ సీమ్ టైర్డ్. 
5.Let them enter. They are our guests.వాళ్ళని లోపలికి రానివ్వండి. వాళ్ళు మన అతిథులు.
లెట్ దెమ్ ఎంటర్. దే ఆర్ అవర్ గెస్ట్స్. 
6.Let us start. The class is about to begin.మమ్ములను మొదలుపెట్టనివ్వండి. క్లాస్ ప్రారంభం కానుంది.
లెట్ అస్స్ స్టార్ట్. ది క్లాస్ ఈస్  అబౌట్ టు బిగిన్. 
7.Let him try again. He didn’t succeed the first time. అతన్ని మళ్ళీ ప్రయత్నించనివ్వండి. అతను మొదటిసారి విజయం సాధించలేదు.
లెట్ హిమ్ ట్రై అగేన్. హీ డిడ్న్ట్ సక్సీడ్ ది ఫస్ట్ టైమ్. 
8.Let her choose. She knows best.ఆమెని ఎంచుకోనివ్వండి. ఆమెకే బాగా తెలుసు.
లెట్ హర్ చూజ్. షీ నోస్ బెస్ట్. 
9.Let the dog out. It has been inside for too long.కుక్కను బయటకి రానివ్వండి. అది చాలా సేపటి నుండి లోపలే ఉంది.
లెట్ ద డాగ్ ఔట్. ఇట్ హాస్ బీన్ ఇన్‌సైడ్ ఫర్ టూ లాంగ్. 
10.Let me explain. You might misunderstand otherwise.నన్ను వివరించనివ్వండి. లేకపోతే మీరు తప్పుగా అర్థం చేసుకోవచ్చు.
లెట్ మీ ఎక్స్‌ప్లేన్. యూ మైట్ మిస్ అండర్‌స్టాండ్ అదర్వైజ్. 
11.Let him finish the work. He is almost done. అతన్ని పని పూర్తి చేయనివ్వండి. అతను దాదాపు పూర్తి చేసాడు.
లెట్ హర్ ఆన్సర్ ది క్వశ్చన్. షీ స్టడీడ్ వెల్. 
12.Let them decide. They are responsible.వాళ్లని నిర్ణయించుకోనివ్వండి.  వాళ్లదే బాధ్యత.
లెట్ దెమ్ ప్లే ఔట్‌సైడ్. దే నీడ్ సమ్ ఎక్సర్‌సైజ్. 
13.Let her answer the question. She studied well. ఆమెని ప్రశ్నకు సమాధానం చెప్పనివ్వండి. ఆమె బాగా చదువుకుంది.
లెట్ హర్ ఆన్సర్ ది క్వశ్చన్. షీ స్టడీడ్ వెల్. 
14.Let him rest. He has been working hard.అతన్ని విశ్రాంతి తీసుకోనివ్వండి. అతను చాలా కష్టపడి పనిచేస్తున్నాడు.
లెట్ హిమ్ రెస్ట్. హీ హాస్ బీన్ వర్కింగ్ హార్డ్. 
16.Let them play outside. They need some exercise.వాళ్ళని బయట ఆడుకోనివ్వండి. వాళ్ళకి కొంత వ్యాయామం అవసరం.
లెట్ దెమ్ ప్లే ఔట్‌సైడ్. దే నీడ్ సమ్ ఎక్సర్‌సైజ్. 
17.Let me try this. I think I can do it.నన్ను దీన్ని ప్రయత్నించనివ్వండి. నేను చేయగలనని అనుకుంటున్నాను.
లెట్ మీ ట్రై దిస్. ఐ థింక్ ఐ కాన్ డు ఇట్. 
18.Let him join us. He is our friend.అతన్ని మనతో చేరనివ్వండి. అతను మన స్నేహితుడు.
లెట్ హిమ్ జాయిన్ అస్స్. హీ ఈజ్ అవర్ ఫ్రెండ్. 
19.Let her win. She deserves it. ఆమెని గెలవనివ్వండి. ఆమె దానికి అర్హురాలు.
లెట్ హర్ విన్. షీ డిజర్వ్స్ ఇట్. 
21.Let him read the book. It will help him learn.అతన్ని పుస్తకం చదవనివ్వండి. అది అతనికి నేర్చుకోవడానికి సహాయపడుతుంది.
లెట్ హిమ్ రీడ్ ది బుక్. ఇట్ విల్ హెల్ప్ హిమ్ లెర్న్. 
22.Let her take the lead. She has more experience.ఆమెని నాయకత్వం వహించనివ్వండి. ఆమెకు ఎక్కువ అనుభవం ఉంది.
లెట్ హర్ టేక్ ది లీడ్. షీ హాస్ మోర్ ఎక్స్పీరియన్స్. 
23.They are safe. Let them stay here.వాళ్ళు క్షేమంగా ఉన్నారు. వాళ్లని ఇక్కడే ఉండనివ్వండి.
దే ఆర్ సేఫ్. లెట్ దెమ్ స్టే హియర్. 
24.I don’t want mistakes. Let me check it.నేను తప్పులు కోరుకోవడం లేదు.  నన్ను తనిఖీ చేయనివ్వండి
ఐ డోంట్ వాంట్ మిస్టేక్స్. లెట్ మీ చెక్ ఇట్. 
25.He has important news. Let him call you.అతనికి ముఖ్యమైన వార్త ఉంది. అతన్ని మీకు ఫోన్ చేయనివ్వండి.
హీ హాస్ ఇంపార్టెంట్ న్యూస్. లెట్ హిమ్ కాల్ యూ. 
27.She has a beautiful voice. Let her sing the song.ఆమెకు అందమైన గొంతు ఉంది. ఆమెని పాట పాడనివ్వండి.
షీ హాస్ ఏ బ్యూటిఫుల్ వాయిస్. లెట్ హర్ సింగ్ ది సాంగ్. 
28.They started earlier. Let them finish first.వాళ్ళు ముందే మొదలుపెట్టారు. వాళ్ళని ముందుగా పూర్తి చేయనివ్వండి.
దే స్టార్టెడ్ ఎర్లియర్. లెట్ దమ్ ఫినిష్ ఫస్ట్. 
29.You are carrying things. Let me open the door.నువ్వు వస్తువులు మోస్తున్నావు. నన్ను తలుపు తెరవనివ్వు.
యూ ఆర్ క్యారీయింగ్ థింగ్స్. లెట్ మీ ఓపెన్ ది డోర్. 
30.He has a right to it. Let him know the truth.అతనికి దానిపై హక్కు ఉంది.  అతన్ని  నిజం తెలుసుకొని ఇవ్వండి 
హీ హాస్ ఏ రైట్ టు ఇట్. లెట్ హిమ్ నో ది ట్రూత్.