moral stories in telugu

ఏకమనస్సు 

  • జీవితంలో నూటికి 99 శాతం మంది సక్సెస్ కాలేకపోవడానికి ప్రధానమైన కారణం మారుతున్న మనసు. ఏ పని మీద ఏకాగ్రత లేకపోవడం ఒక పనిమీద స్థిరమైనటువంటి మనసు లేకపోవడమే
  • (moral stories in Telugu)
  •  .
  • ఫ్రెండ్స్ భగవంతుడు మనకి ఒక జీవితాన్నే ఇచ్చాడు. కాబట్టి మనము కూడా ఒక రంగంలోనే ప్రావీణ్యము సాధించగలం.
  • ఏ రంగంలోనైనా నువ్వు పరిపూర్ణత సాధించినప్పుడు ఆ రంగమే నిన్ను ఉన్నతమైన స్థాయిలోకి సమాజంలో మంచి గౌరవప్రదమైన స్థితిలోకి తీసుకొని వెళ్లగలుగుతుంది.
  • అయితే ఏదైనా ఒక రంగంలో శిఖరాగ్రాన్ని నువ్వు చేరుకున్నప్పుడే అది నీకు సాధ్యమవుతుంది.
  • ఎవరెస్టు శిఖరాన్ని ఎక్కాలి అనుకుంటే పదేపదే ఆశిఖరాన్ని మాత్రమే ఎక్కుతూ ఉండాలి. హిమాలయాల్లో ఉండే ప్రతి శిఖరాన్ని ఎక్కుతూ ఉంటే చివరికి ఏ శిఖరాన్ని కూడా నువ్వు చేరుకోలేవు.
  • ప్రారంభంలోనే ఒక మంచి రంగాన్ని ఎంచుకోవాలి. ఆ రంగం భవిష్యత్తులో అనేకులు విమర్శించడానికి తావు లేకుండా మరియు లంచగొండితనానికి మనలని బలి చేసేదిగా లేకుండా చూసుకోవాలి.
      ఒకటే లక్ష్యం    
  • నువ్వు ఎంచుకున్న పర్వత శిఖరాన్ని నువ్వు చేరేవరకు వెనుకకు దిగి మరో పర్వతాన్ని ఎక్కడానికి ప్రయత్నించకూడదు.
  • ఇప్పటివరకు నీవు కొనసాగిన రంగాన్ని విడిచి మరొక రంగానే నువ్వు ఎంచుకున్నప్పుడు ఇప్పటివరకు నువ్వు పడినటువంటి కష్టము సమయము అంతా వృధా అయిపోతుంది.
  • ఇప్పటివరకు ఆ రంగంలో నీవు సాధించిన అనుభవము బూడిదలో పోసిన పన్నీరు లాగా అయిపోతుంది.
  • మరో కొత్త రంగాన్ని ప్రారంభిస్తాం ఆ రంగంలో అనుభవం వచ్చి ఆ రంగంలో నీవు ఆదాయాన్ని సంపాదించే స్థాయికి చేరు కోగానే  నీ వయసు అయిపోతుంది, నీ శరీరం సహకరించదు.
  • ఫ్రెండ్స్ జీవితం చాలా విచిత్రమైనది, చిన్నది ఒక మనిషి బాగా సంపాదించి తీరికగా కూర్చుని తిందాం అనుకునేసరికి నోటిలో పళ్ళన్నీ ఊడిపోయి ఉంటాయి.
  • రోగాలు ఆ వ్యక్తిని చుట్టుముట్టి ఉంటాయి.
  • భగవంతుడు మనకు ప్రసాదించిన జీవితం చాలా చిన్నది అది ఏదైనా ఒక రంగంలో మాత్రమే ప్రావిణ్యతను సాధించడానికి సరిపోతుంది .
  • కాబట్టి నువ్వు ఇప్పుడు ఏ రంగంలో ఉన్నావో అది సమాజానికి నష్టం కలిగించేదిగా, మోసం లేనిది గా ఉంటే ఆ పనిని విడిచిపెట్టకు.
  • ఆ రంగంలో ఇప్పటివరకు సాధించిన అనుభవం ఆ రంగంలో సృజనాత్మకతను, కొత్త విషయాలను వెలుగులోకి తీసుకొని రావడానికి నీకు ఉపయోగపడుతుంది.
  • మారుతున్న మనసు మన లైఫ్ లో పేదరికం తీసుకుని రావడానికి కారణం అవుతుంది.
  • అయితే నువ్వు ఇప్పుడు నన్ను ఒక మాట అడగవచ్చు ప్రపంచంలో ఉన్న ధనవంతులు అనేక రంగాలలో వ్యాపారాలు చేస్తున్నారు. మరి వారు ఎలా సక్సెస్ అయ్యారు అని.
  •   ప్రపంచంలోనే ధనవంతులందరూ మొదట ఒక రంగంలో ప్రావీణ్యత సాధించి ఆ రంగంలో వారు సంపాదించిన ధనమును తీసుకుని ఇతర రంగాల్లో పెట్టుబడిగా పెడతారు.
  • వివిధ రంగాల్లో అనుభవం గల వారిని ఆయా సంస్థలకు అధిపతిగా నియమించి వారానికి ఒకసారి నెలకు ఒకసారి వారిని సమావేశపరిచి కొన్ని సూచనలు చేసి వారిని పంపించేసి మిగతా సమయం ఇంటికి వెళ్లి పిల్లలతో ఆడుకుంటా ఉంటారు.
     ఇతర రంగాలు   
  • నేను చెప్పేది  ఒక రంగంలో నువ్వు సంపూర్ణత సాధించినప్పుడు ఆ రంగంలో పీక్ స్టేజ్ కి వెళ్ళినప్పుడు ఆ తర్వాత నువ్వు కష్టపడకుండా హ్యాపీగా కుర్చీలో కూర్చున్నప్పటికీ ఆ రంగం నీకు డబ్బులు ఇస్తూనే ఉంటుంది.
  • అప్పుడు ఆ రంగంలో నువ్వు సంపాదించిన డబ్బులను ఇతర రంగాల్లో పెట్టుబడిగా పెట్టవచ్చు అయితే నువ్వు ఏ రంగంలోనూ పరిపూర్ణత సాధించనప్పుడు నీకు డబ్బులు ఏ రంగం నుండి రావు.
  •   వివిధ రంగాల్లో నీవు పెట్టుబడి పెట్టవచ్చు కానీ ప్రతి పనిలో కూడా నువ్వు వెళ్లి వేలు పెడితేనే కానీ ఆ పని ముందుకు వెళ్ళేటట్లు ఉండకూడదు.
  • ఉదాహరణకు నువ్వు ఒక షాప్ నడిపిస్తున్నావు. మరోచోట ఇంకొక షాపు ఓపెన్ చేయాలి అనే ఆలోచన నీకు వచ్చింది.
  • అయితే నీకు వున్న అనుభవాన్ని ఉపయోగించి అక్కడ వేరొక మనిషిని నిర్ణయించి అతనికి కొన్ని ఇన్స్ట్రక్షన్ ఇచ్చి వారానికి ఒకసారి లేదా నెలకు ఒకసారి వెళ్లి చెక్ చేసుకునే అంతవరకు మాత్రమే ఆ పని ఉండాలి.
  • అంతేకానీ ఇక్కడికి ఒకసారి అక్కడికి ఒకసారి ప్రతిరోజు ఉరుకులు పరుగులుగా ఉండకూడదు.
  • నీ శారీరక శ్రమకు ఒక లిమిట్ ఉండాలి నీ శారీరక శ్రమకు లిమిట్ అనేది లేకపోతే అది త్వరగా అనారోగ్యాలకు గురవుతుంది. చివరికి నీ ప్రాణాన్ని కూడా తీసివేస్తుంది.
  • పనిచేయటానికి కుటుంబ సభ్యులతో భార్య పిల్లలతో గడపడానికి ఇంత శ్రమ నాకు చాలు అనుకున్నప్పుడు అంతకు మించిన శారీరిక శ్రమను నువ్వు సృష్టించుకోకూడదు.
  • మనసుని శ్రమ పెట్టకుండా శరీరాన్ని శ్రమ పెట్టడం వృధాపయాస. శారీరక శ్రమకి లిమిట్ ఉంటుంది కానీ మనసుకి మన మెదడుకి లిమిట్ అనేది ఉండదు.
  • పెద్ద పెద్ద ధనవంతులు ఎన్ని రంగాలలో ఉన్నప్పటికీ ఆయా రంగాలలో నిష్ణాతులైన వారిని నియమించి వారు ఇంటికి వెళ్లి తమ పిల్లలతో హ్యాపీగా గడుపుతుంటారు.
  • ఫైనల్ గా నేను చెప్పాలనుకున్నది ఏమిటంటే ఇప్పుడు నీవు ఉన్నటువంటి ప్రొఫెషన్ విడిచిపెట్టి మరో ప్రొఫెషన్ జోలికి వెళ్ళవద్దు.
  • బ్రూస్లీ గురించి మనకందరికీ తెలుసు అతను ఏమన్నాడు అంటే 1000 కిక్కులను ప్రాక్టీస్ చేసిన వాడికి కాదు ఒక కిక్కని 1000 సార్లు ప్రాక్టీస్ చేసిన వాడికి నేను భయపడతాను అని అన్నాడు.‌
  • కాబట్టి 1000 పనులు జోలికి వెళ్లడం కాదు ఒక పనిని 1000 సార్లు చేయడానికి ప్రయత్నించు.
  • కొంటె కుర్రాడు 

  • సిరిపురం అనే గ్రామంలో కొండయ్య అనే అల్లరి పిల్లవాడు ఉండేవాడు.
  • ఇతను ప్రతిరోజు ఊరికి బయట ఉన్న అడవికి మేకలు తోలుకొని పోయి వాటిని మేపుకొని తిరిగి వస్తూ ఉండేవాడు.
  • అతను ప్రతిరోజు ఎవరో ఒకరిని భయపెట్టడం, ఏడిపించడం, ఎగతాళి చేయడం లాంటివి చేసి ఆనందిస్తూ ఉండేవాడు.అతను గ్రామ ప్రజలను భయపెట్టాలని అనుకున్నాడు వెంటనే కొండయ్య చెట్టుఎక్కి పులి పులి  రక్షించండి నన్ను రక్షించండి అని పెద్దగా కేకలు వేశాడు.
  • వెంటనే గ్రామ ప్రజలు కర్రలు తీసుకుని గ్రామం బయటికి పరిగెత్తుకొని వచ్చారు.
  • అప్పుడు కొండయ్య పులి లేదు గిలి లేదు  మిమ్మల్ని భయపెట్టాలని ఆ విధంగా అరిచాను అని పెద్దగా నవ్వాడు.
  • రెండో రోజు కూడా కొండయ్య అదేవిధంగా చెట్టు ఎక్కి రక్షించండి నన్ను రక్షించండి పులి పులి పులి అని పెద్దగా కేకలు వేశాడు.
  • మరలా గ్రామ ప్రజలు అందరూ కర్రలు తీసుకుని పులిని చంపడానికి ఊరు బయటకు పరిగెత్తుకుని వచ్చారు. మరలా కొండయ్య పులి లేదు గిలి లేదు మిమ్మల్ని భయపెట్టాలని ఆ విధంగా అరిచాను అని చెప్పి మరలా పెద్దగా నవ్వాడు.
  • మూడోసారి కూడా ఆ విధంగానే చేశాడు మరలా గ్రామ ప్రజలు కర్రలు తీసుకుని పులిని చంపడానికి ఊరి బయటకు పరిగెత్తుకుని వచ్చారు.
  • మరల కొండయ్య అదేవిధంగానే వారిని మరలా ఎగతాళి చేశాడు.కానీ నాలుగో సారీ నిజంగానే మేకలు తినడానికి పులి వచ్చింది
  • అప్పుడు కొండయ్య పెద్దగా అయ్యో పులి పులి రక్షించండి నన్న రక్షించండి అని పెద్దగా అరిచాడు.
  • నాలుగో సారి గ్రామ ప్రజలు అతని అరుపులను పట్టించుకోలేదు.
  • పులి వచ్చి మేకలు అన్నింటినీ చంపి తిని వెళ్లిపోయింది కొండయ్య మాత్రం చెట్టు ఎక్కి ప్రాణాలు కాపాడుకున్నాడు.ప్రతిసారి అబద్ధం చెబితే ఆ అబద్ధం ఏదో ఒక రోజు మన కీడుకి కారణం అవుతుంది.
  • మనం ప్రతిరోజు ఇతరులతో నిజం మాత్రమే మాట్లాడాలి అప్పుడే మన నోటికి విలువ ఉంటుంది.
  • నోరు ఉంది కదా అని వ్యర్థమైన మాటలన్నీ  మాట్లాడుతూ ఉండకూడదు మన నోటి నుండి ఒక మాట వచ్చింది అంటే అది ఎంతో విలువైనదిగా ఉండేటట్లు మనమే జాగ్రత్త పడాలి.

    నిజమైన స్నేహం

    జాయి చిన్నప్పటినుంచి చాలా బుద్ధిమంతుడుగా పెరిగాడు అతడు యదార్ధవంతుడు, నిజాయితీపరుడు ఇతరులతో అబద్ధం ఆడని మంచి స్వభావి.

  • కుటుంబ సభ్యులకు తల్లిదండ్రులకు బంధువులకు అందరికీ విధేయుడుగా ఉండేవాడు. ఎవరు ఏ పని చెప్పినా కాదనకుండా చేసేవాడు. కానీ జాయ్ చాలా నిరుపేద కుటుంబానికి చెందిన వాడు.
    ఒకరోజు జాయ్ స్కూల్ కి వెళుతూ ఉండగా ఒక పర్సు అతనికి దొరికింది ఆ పర్సులో 1500 రూపాయలు మరియు ఆఫర్స్ పోగొట్టుకున్న వ్యక్తి యొక్క ఫోటో కూడా అందులో ఉంది.
  • అందులో ఉన్న వ్యక్తి పేరు స్టీఫెన్ అని ఉన్నది. అయితే చాయ్ తడువు చేయకుండా వెంటనే ఆ అడ్రస్ ఉన్న ఇంటికి వెళ్లి స్టీఫెన్ ని కలిశాడు వెళ్లి స్టీఫెన్ ని కలిసి నీవేమైనా మనసు పోగొట్టుకున్నావా అని అడిగాడు
  • అందుకు వెంటనే స్టీఫెన్ తన జేబులను తుడుముకొని పరుసు లేకపోవటం చూచి అయ్యో అయ్యయ్యో నా పర్సు ఎక్కడో పోయింది అని అన్నాడు
  • వెంటనే జాయ్ నువ్వు భయపడనక్కరలేదు నీ పర్సు నాకు దొరికింది ఇదిగో తీసుకో అని ఇచ్చాడు.
  • స్టీఫెన్ జాయ్ యొక్క నిజాయితీకి ఎంతో మురిసిపోయాడు ఆరోజు నుండి స్టీఫెన్ జాయిదో స్నేహం చేయడానికి చాలా ఇష్టపడ్డాడు.అప్పుడు స్టీఫెన్ జాయ్ తో ఇలా అన్నాడు ఈరోజు నుండి మనమిద్దరం స్నేహితులం నీకు ఏది కావలసినప్పటికీ ఏ అవసరమైనప్పటికీ నన్ను అడుగు నేను తప్పకుండా నీకు సహాయం చేస్తాను అని చెప్పాడు.
  • జాయ్ చాలా నిరుపేద కుటుంబంలో పుట్టినవాడు, కానీ స్టీఫెన్ చాలా ఉన్నతమైన ధనవంతులైన కుటుంబంలో పుట్టినాడు అతనికి ఏ కుదువా లేదు.
  • అప్పటినుండి స్టీఫెన్ జాయ్ అక్క ప్రతి అవసరానికి కూడా ఆదుకుంటూ వచ్చాడు.జాయ్ మరియు స్టీఫెన్ పెరిగి పెద్దవారయ్యారు వివాహాలు కూడా చేసుకున్నారు.
  • జాయ్ యొక్కఉన్నత చదువులకు కూడా స్టీఫెన్ ఆర్దికంగా ఎంతో సహాయం చేశాడు.
  • వారిద్దరూ మంచి ప్రాణ స్నేహితులు అయినారు. స్టీఫెన్ చేసిన ఆర్థిక సహాయం వలన‌ జాయ్ ఇతర దేశాలలో మంచి ఉద్యోగం సంపాదించినాడు.స్టీఫెన్ దయవలన జాయ్ ఇతర దేశాలలో ఆర్థికంగా బలపడినాడు.
  • చివరికి స్వదేశంలో స్థిర పడడానికని తిరిగి వచ్చినప్పుడు ముందుగా స్టీఫెన్ ఇంటికి వెళ్లాలని ఎంతో ఆతుర పడ్డాడు.
  • జాయ్ స్టీఫెన్ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ ఎవరూ లేకపోగా చూసి ఆశ్చర్యపోయి చుట్టుపక్కల వారిని అడిగాడు
  • అందుకు వారు స్టీఫెన్ అతని భార్య రోడ్డు ప్రమాదంలో చనిపోయినారు అతని ఇద్దరు పిల్లలను ఆదరించే వారు లేక ఆ చిన్న పిల్లలు ఇద్దరు ఎక్కడికి వెళ్లారో ఎవరికీ తెలియదు అని చెప్పినారు.
    జాయ్ ఆవేదన 

    ఈ వార్త విన్న వెంటనే జాయ్ గుండెలు పగిలేలా రోదించాడు స్టీఫెన్ ని జ్ఞాపకం చేసుకుని అతని సహాయాన్ని జ్ఞాపకం చేసుకుని మనసులోనే ఎంతో కృతజ్ఞత చెప్పాడు.

  • ఒక దినమున ఇద్దరు పిల్లలు భిక్షాటన చేస్తూ జాయ్ ఇంటికి వచ్చారు.
  • తమకు ఏదైనా తినటానికి ఇవ్వమని ఇద్దరు పిల్లలు జాయ్ ఇంటి గేటు దగ్గర నిలబడి ఉండగా జాయ్ వారిని చూసి మీరు ఎందుకు బిక్షమెత్తుకుంటున్నారు మీకు తల్లిదండ్రులు లేరా అని వారిని అడగెను.
  • అందుకో చిన్న పిల్లలు మా తల్లిదండ్రులు రోడ్డు ప్రమాదంలో చనిపోయిరి అని చెప్పెను.
  • మీ తల్లిదండ్రుల పేర్లు ఏమిటి అని వారిని అడిగినప్పుడు వారు మా తండ్రి పేరు స్టీఫెన్ మా అమ్మ పేరు బ్లేస్సి అని చెప్పి రి.
  • జాయ్ ఇంకా పరిశీలనగా అన్ని విషయాలు తెలుసుకుని ఆ చిన్నపిల్లలు ఇద్దరు తన స్నేహితుడైన స్టీఫెన్ పిల్లలు అని తెలుసుకుని పరిగెత్తి వారిని కౌగిలించుకొని ముద్దు పెట్టుకుని తన ఇంటిలోకి వారిని తీసుకొని పోయొను.
  • ఆనాటి నుండి జాయ్ స్టీఫెన్ పిల్లలను తన పిల్లలుగా భావించి వారిని ఇంటిలో చేర్చుకొనెను వారిని తన పిల్లలతో సమానంగా పెంచి పెద్ద చేసి వారికి మంచి భవిష్యత్తును ఇచ్చెను.స్టీఫెన్ చనిపోయాడు కానీ వారి స్నేహం చనిపోలేదు.
  • జాయ్ కి మంచి భవిష్యత్తుని ఇచ్చింది స్టీఫెన్ మాత్రమే అయితే జాయ్ దానిని గుర్తు పెట్టుకొని అతని తర్వాత అతని పిల్లలకు సహాయం చేయుట మనలేదు.

మనము కూడా జాయ్ వలె యదార్ధంగా నిజాయితీగా నీతిగా జీవించుటకు ప్రయత్నం చేద్దామా మరి.

జ్ఞానముగల రాజు

పురాతన కాలంలో పాలస్తీనా దేశాన్ని ఒక తెలివైనటువంటి రాజు                           పరిపాలన చేశాడు అతడు తన సుబుద్ధి చేత రాజ్యాన్ని పరిపాలించాడు

  • ప్రజలకు శత్రువుల భయం లేకుండా చేశాడు దేశాన్ని సిరి సంపదలతో నింపాడు. దేశంలో శాంతి సామరస్యం ఉండేలా తన జ్ఞానం చేత పరిపాలన చేశాడు.
  • అతడు ప్రజల సమస్యలను పరిష్కరిస్తూ ప్రతి వారికి కూడా న్యాయం చేస్తూ సుబుద్ధి కలిగి పరిపాలన చేయుచుండెను.ఈ రాజు పరిపాలన చేయుచుండగా ఆయన రాజ్యంలోని ఒక కుటుంబంలో వచ్చిన వివాదాన్ని పరిష్కరించడం ద్వారా ఈ రాజు యొక్క జ్ఞానాన్ని గురించి మనం తెలుసుకోవచ్చు.
  • ఆయన రాజ్యంలోని ఒక కుటుంబంలో ఇద్దరు తోడికోడళ్ళు ఒకేసారి బిడ్డలకు జన్మనిచ్చారు.
  • వారు రాత్రిపూట నిద్రించుచుండగా వారిద్దరిలో ఒక స్త్రీ నిద్రమత్తులో తన బిడ్డ మీద పడడం వలన ఆ బిడ్డ చనిపోయింది.
  • ఆమె వేకువనే లేచి చూసినప్పుడు తన బిడ్డ చనిపోయి ఉండెను.
  • అయితే ఆ స్త్రీ తంత్రముగా ప్రవర్తించి తన తోడికోడలైన ఆమె మంచం దగ్గరికి వెళ్లి చనిపోయిన తన బిడ్డను ఆమె ప్రక్కలో పరుండబెట్టి బ్రతికి ఉన్న ఆమె బిడ్డను తీసుకుని వచ్చి తన మంచం మీద పండుకొనబెట్టెను ఈ విధంగా ఆ స్త్రీ తన తోడికోడలు యొక్క బిడ్డను దొంగిలించెను.అయితే ఆమె తోడికోడలు నిద్రలేచి చూసినప్పుడు తన పక్కలో ఉన్న బిడ్డ చనిపోయి ఉండెను అయితే ఆమె పరిశీలనగా చూసినప్పుడు ఆ బిడ్డ తనది కాదని గుర్తించెను.
  • వెంటనే ఆమె నా బిడ్డ ఏమైనది ఈ బిడ్డ చనిపోయి ఉన్నది అయితే చనిపోయిన బిడ్డ నాది కాదని తన తోడి కోడలుతో అనెను.
  • అందుకు ఆమె తోడికోడలు నీ బిడ్డకు నేనేమైనా కాపలానా? నీ బిడ్డ చనిపోయిన దానికి నేనేం చేసేదెను అని తిరిగి సమాధానం చెప్పెను.
  • అయితే బ్రతికి ఉన్న బిడ్డ గురించి వారిద్దరికీ పెద్ద వివాదం జరిగింది బ్రతికి ఉన్న బిడ్డ నాదంటే నాది అని ఇద్దరువాదము పెట్టుకొనిరి.
  • చివరికి న్యాయం కోసం ఇద్దరు ఆ దేశ రాజు దగ్గరికి చేరిరి.
    రాజు తల్లిని గుర్తించుట
  • అప్పుడు రాజు వారిద్దరి విజ్ఞాపనలను విని వీరిద్దరికీ ఏ విధంగా న్యాయం చేయాలో ఎటు తోచక యుండెను ఇద్దరు స్త్రీలు బ్రతికి ఉన్న బిడ్డ నాదంటే నాది అని రాజు ముందు వాదము పెట్టుకొనుచుండిరి.
  • వెంటనే  రాజు తన ప్రక్కన ఉన్న సైన్యాధిపతిని చూచి ఒక ఖడ్గము తీసుకుని రమ్ము బ్రతికి ఉన్న ఈబిడ్డను మధ్యకు నరికి ఈమెకు సగము ఆమెకు సగము ఇచ్చెదనని చెప్పెను.
  • అప్పుడు చనిపోయిన బిడ్డ యొక్క తల్లి అవును రాజా నీవు చెప్పినదే న్యాయము బ్రతికి ఉన్న ఈ బిడ్డను నరికి నాకు సగము ఆమెకు సగము ఇప్పించమని చెప్పెను.
  • అయితే బ్రతికి ఉన్న బిడ్డ యొక్క తల్లి తన పొట్టను తొడుముకొనెను తన బిడ్డ మీద ప్రేమ పొర్లుకొని వచ్చెను.
  • అయితే బ్రతికి ఉన్న బిడ్డ యొక్క తల్లి ఓ రాజా ఈ బిడ్డను ఎంత మాత్రమూ చంపవద్దు.
  • ఈ బిడ్డను భూమి మీద సజీవంగా ఉంచమని నేను నిన్ను వేడుకుంటున్నాను.
  • ఈ బిడ్డను చంపక నా సహోదరికి పూర్తిగా ఇచ్చివేయమని వేడుకొనుచున్నాను అని అనెను.
  • అప్పుడు వెంటనే రాజు బ్రతికి ఉన్న బిడ్డ యొక్క తల్లిని గుర్తించెను ఏ స్త్రీ అయితే బిడ్డను చంపవద్దని రాజును బ్రతిమాలెనో ఆమె ఆ బిడ్డ యొక్క తల్లి అని గుర్తించి బ్రతికి ఉన్న బిడ్డను సజీవంగా ఆమె తల్లికి అప్పగించెను.
  • మన తల్లి మనలను ఎంతో ప్రేమిస్తుంది కాబట్టి ఆమెను, మన తల్లిదండ్రులను మనము ప్రేమించాలి.
  • మనం కూడా వివిధ సమస్యల పరిష్కారంలో మంచి వివేచన సుబుద్ధి కలిగి ప్రవర్తించవలెను.
  • ఎవరైతే నీతిని న్యాయాన్ని అనుసరిస్తారో వారిలోనే వివేచన జ్ఞానము ఉంటుంది.

నీతిని న్యాయాన్ని పట్టించుకోని వారిలో లౌకిక జ్ఞానం ఉంటుందే కానీ, మంచి చెడులు గుర్తించే జ్ఞానం వాడిలో ఉండదు.

 

 

   మంచి టీచర్ 

  • పీటర్ ప్రతిరోజు స్కూల్ కి వెళతాడు, అందరి చేత మంచివాడు అని పేరు తెచ్చుకున్నాడు. పెద్దలు చెప్పిన మాట శ్రద్ధగా వింటాడు.
  • తల్లిదండ్రులకు, పెద్దలకు బంధువులకు ,అందరికీ కూడా విధేయుడుగా ఉండేవాడు. కానీ పీటర్ వాళ్ళ తల్లిదండ్రులు చాలా పేదవాళ్లు.
  • స్కూల్ కి అవసరమైన బుక్స్ కూడా పీటర్ తల్లిదండ్రులు అతనికి ఇవ్వలేకపోయినారు. స్కూల్ విద్యార్థులందరిలో కూడా పీటర్ చాలా పేదవాడిగా ఉండేవాడు.
  • ఒకరోజు పీటర్ యొక్క స్కూల్లో పిల్లలకు పరుగు పందెం నిర్వహించారు. ఈ పందెంలో ఫస్ట్ ప్రైజ్ వచ్చిన వారికి పది నోట్ బుక్స్ ని బహుమతిగా ఇస్తామని ఉపాధ్యాయుడు ప్రకటించారు, సెకండ్ ప్రైజ్ వచ్చిన వారికి ఐదు నోట్ బుక్స్ , థర్డ్ ప్రైస్ వచ్చినవారికి 2 నోట్ బుక్స్ ఇస్తానని ఉపాధ్యాయుడు ప్రకటించారు.
  • అయితే పీటర్ ఈ పరుగు పందెంలో పాల్గొని నోట్ బుక్స్ ని ప్రైస్ గా పొందాలని అనుకున్నాడు.
  • పీటర్ కి నోట్ బుక్స్ లేవు గనక ఈ పందెంలో గెలిచి నోట్ బుక్స్ ని బహుమతిగా పొందాలని ఆశించాడు.
  • మరుసటి రోజు స్కూల్లో పరుగు పందెం నిర్వహించినప్పుడు పీటర్ కి ఏ ప్రైజ్ కూడా రాలేదు, పరుగుపందెంలో అతను వేగంగా పరిగెత్త లేకపోయినాడు.
  • నోట్ బుక్స్ ని బహుమతిగా పొందాలని అనుకున్న పీటర్ ఆశ నెరవేరలేదు.
  • పీటర్ చాలా పేదవాడు అతనికి సరైన ఆహారం లేదు, సరైన వస్త్రాలు లేవు మరియు నీరసంగా ఉండడం వలన పరుగు పందెంలో వేగంగా పరిగెత్త లేకపోయినాడు.
  • కాబట్టి పీటర్ చాలా నిరుత్సాహంగా దిగులుగా తన బ్యాగ్ తీసుకుని ఇంటికి బయలుదేరుతున్నాడు.
  • పీటర్ యొక్క టీచర్ పీటర్ ని జాగ్రత్తగా పరిశీలిస్తున్నాడు.పీటర్ యొక్క బీదరికాన్ని బలహీనతను  టీచర్ అర్థం చేసుకున్నాడు, ఏ విధంగానైనా  పీటర్ కు సహాయం చేయాలని తన మనస్సులో నిర్ణయించుకున్నాడు.
 పేటర్ బాదపడుట 
  •   పీటర్ ఇంటికి వెళ్లి మంచం మీద పడుకుని చాలా ఆలోచించాడు, నా తల్లిదండ్రులు బీదవాళ్లు వాళ్ళు నాకు ఏ బుక్స్ కొనివ్వలేరు అని తన మనసులో అనుకుని దిగులు చెందినాడు.
  • అప్పుడు పీటర్ ఇలా ఆలోచిస్తూ ఉండగా అతని ఇంటి తలుపులు ఎవరో తట్టారు పీటర్ పీటర్ అని ఎవరో తలుపు తట్టడం గమనించాడు.
  • పీటర్ త్వరగా వెళ్లి తలుపు తీసినప్పుడు వాళ్ళ స్కూల్ టీచర్ ఎదురుగా నిలబడి ఉన్నాడు. వెంటనే పీటర్ ఆశ్చర్యపోయి సార్ అన్నాడు.
  • అప్పుడు టీచర్ పీటర్ తో నీకు చాలా బుక్స్, బ్యాగ్, యూనిఫామ్, షూస్, పెన్స్ చాలా చాక్లెట్స్ నీ కొరకు బహుమానంగా తెచ్చాను అన్నాడు. సార్ నాకు ఏ బహుమతి కూడా రాలేదు కదా అని పీటర్ టీచర్ తో అన్నాడు.
  • అందుకు టీచర్ ఇది ప్రైజ్ కాదు నా సొంత డబ్బుతో నా పీటర్ కి నేను ఇస్తున్న బహుమానం అని చెప్పాడు.
  • పీటర్ కి చాలా సంతోషం వేసింది, అతనికి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు, వెంటనే టీచర్ని కౌగిలించుకుని ఏడ్చాడు.
  • తన అవసరాలన్నీ తెలుసుకొని చాలా బహుమానాలు తీసుకుని వచ్చినందుకు టీచర్ కి ఎంతో కృతజ్ఞత చెప్పాడు.
  • ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైస్ థర్డ్ ప్రైస్  పొందిన వారి కంటే టీచర్ యొక్క  దయ వలన  పీటర్ చాలాఎక్కువ బహుమానాలు పొందెను.అర్హత కలిగిన వాడికంటే దయ పొందినవాడు ఎక్కువ బహుమానాలు పొందును.

 

    మంచి బిక్షగాడు

  • నారాయణపురం అనే గ్రామంలో పాపయ్య అనే బిక్షగాడు ప్రతిరోజు భిక్షాటన చేస్తూ చుట్టుపక్కల గ్రామాలు తిరుగుతూ ఉండేవాడు.
  • అతని బట్టలు పూర్తిగా మాసిపోయి చూడడానికి అందవిహానంగా మారిపోయాడు.
  • అతడు ఎవరి ఇంటికైనా వెళ్ళినప్పుడు అతనిని త్వరగా తమ ఇంటి నుండి పంపేసేవారు అతడు సంపాదించిన డబ్బులలో ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా వాటిని చాలా జాగ్రత్తగా దాచినాడు.
  • అయితే నారాయణపురం అనే గ్రామానికి నీటి వసతి లేదు, స్త్రీలు ఎంతో దూరం నుండి నీళ్లు తెచ్చుకునేవారు. ఆ గ్రామానికి నీటి వసతి లేకపోవడం వలన పంటలు పండలేదు అనేక కుటుంబాలు పేదరికంతో నింపబడినాయి.
  • వ్యవసాయానికి ప్రాణాధారమైనటువంటి నీరు అక్కడ లేదు.
  • కొంతకాలం తర్వాత పాపయ్య చనిపోయెను. అతడు చనిపోయినప్పుడు ఒక వీలునామారాశాడు అందులో నేను భిక్షాటన చేసి ఎంతో డబ్బు సంపాదించాను ఆ డబ్బంతా కూడా నా ఇంటి మధ్యలో ఉన్నటువంటి ఒక పెద్ద గుంటలో వాటిని దాచాను.
  • ఈ గ్రామంలోని స్త్రీలు మంచినీటి కోసం పడుతున్నటువంటి బాధలు, వ్యవసాయం లేక ఈ గ్రామాన్ని కమ్ముకున్నటువంటి పేదరికం నేను గుర్తించాను.
  • నేను సంపాదించిన ధనములో ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా దాచి పెట్టాను ఈ ధనము అంతటినీ సమీపంలో ఉన్నటువంటి నది నుండి ఇక్కడికి కాలువలు త్రవించి నీటి వసతి కలగజేయవలసినదిగా రాసెను.
  • అప్పుడు అందరూ త్వరగా ఇంటిలోనికి వెళ్లి చూసినప్పుడు ఇంటి మధ్యలో ఉన్నటువంటి గుంటలో ఎంతో డబ్బు ఉండెను. అప్పుడు గ్రామ ప్రజలందరూ కూడా ఈయన బిక్షగాడని మనమందరము అపార్థం చేసుకున్నాం.
  • సంపాదించిన డబ్బులు తన కోసం ఏమీ ఖర్చు పెట్టుకోకుండా అంతా గ్రామాభివృద్ధి కోసం దాచినాడు గనక ఈయన మనుషి రూపంలో ఉన్న దేవుడని అందరూ చెప్పుకొన్నారు.
  • అతనిని చీదరించుకున్న వారు అసహ్యించుకున్న వారు అందరూ కూడా పాపయ్య విషయమై ఎంతో బాధపడిరి.
  • వెంటనే పాపయ్య రాసిన వీలు నామా ప్రకారం సమీపంలోని నది నుండి ఆ గ్రామమునకు కాలువలు త్రవ్వించిరి.
  • గ్రామమునకు నీటి వసతి కలగడం వలన వ్యవసాయం అభివృద్ధి చెందింది.
  • మంచినీటి కొరత తీరింది. ఆ గ్రామంలోని పేదరికం ఆ గ్రామాన్ని విడిచి వెళ్లిపోయింది.
  • పాపయ్య పేదరికాన్ని భరించి ఆ గ్రామానికి ఉన్న పేదరికాన్ని తీసివేశాడు.
  • గొప్పవాళ్లు మనుషులందరూ చూసేటట్లు సహాయం చేయరు. అల్పులు మాత్రమే మనుషులకు కనబడేటట్లు ఇతరులకు సహాయం చేస్తారు.
  • మనము కూడా పాపయ్య మాదిరిగానే ఇతరులకు మేలు చేయుటకు ఇతరుల అభివృద్ధికి ఇతరులు ఆర్థికంగా బలపడడానికి మన వంతు కృషి చేద్దాము.
  • పక్కవారు పైకి వస్తుంటే ఓర్వలేని చెడు స్వభావం కలిగిన వారి వలె మనం ఉండకుండా పాపయ్యను పోలి నడుచుకుందాము  సరేనా పిల్లలు.

    కాకమ్మ పిచ్చుకమ్మ

  • ఒక దట్టమైన అరణ్యంలో కాకి పిచ్చుకలు ఇద్దరు కూడా మంచి స్నేహం గా ఉండేవి. అయితే నిజమైన స్నేహం ఏదో మంచి స్నేహం ఏదో మనం ఆపదలో ఉన్నప్పుడు మాత్రమే తెలుస్తుంది.
  • కాకి పిచ్చుక అరణ్యంలో నివాసం చేయుచుండగా ఒక దినమున ఒక పెద్ద గాలి వాన వచ్చింది. ఆ గాలివానకు పిచ్చుకమ్మ గూడు పడిపోయింది, పిల్లలు వర్షానికి తడిచారు.
  • (moral stories in Telugu)
  • తన పిల్లలు వర్షానికి తడిచి వణుకుతూ ఉంటే పిచ్చు కమ్మ గుండె తల్లడిల్లిపోయింది.
  • అప్పుడు నేను లేచి నా స్నేహితుడైన కాకమ్మ దగ్గరికి వెళతాను అతను తప్పకుండా నన్ను నా పిల్లలను చేర్చుకుంటాడు అని ఆలోచించుకుని తన పిల్లలను తీసుకుని కాకమ్మ వద్దకు వెళ్ళింది.
  • పిచ్చుకమ్మ కాకమ్మ గూటి దగ్గరికి వెళ్లి ఓ కాకమ్మ చలికి వణికి పోతున్నాను తలుపు తీయమని అడిగింది.
  • ఇప్పుడు వెంటనే కాకమ్మ తలుపు తీసి ఏమైంది అని అడిగింది. ఈ గాలివానకు నా గూడు పడిపోయింది నా బిడ్డలు చలికి వణుకుతూ ఉంటే తట్టుకోలేక నీ వద్దకు వచ్చాను.
  • ఈ రాత్రికి నన్ను నా పిల్లలను నీ ఇంటిలోకీ చేర్చుకోమని బ్రతిమాలింది.
  • అందుకు కాకమ్మ నా పిల్లలు ఇప్పుడే గూటిలో వెచ్చగా పండుకుని ఉన్నారు. వారిని నేను లేపలేను నాకు కూడా బయట చలిగా ఉంది మీకు మాకు ఈ గూడు చాలదేమో! ఇంకా ఎక్కడికైనా వెళ్లి తలదాచుకోమని కఠినంగా సలహా ఇచ్చింది కాకమ్మ.
  • పాపం పిచ్చుకమ్మ చేసేది ఏమీ లేక అక్కడినుండి మరోచోటికి వెళ్లి చలికి వణుకుతూ తన పిల్లలను తన రెక్కల కింద దాచుకొని ఆ రాత్రి గడిపింది. కాకమ్మ ఇచ్చిన సమాధానానికి లోలోపల ఎంతో కుమిలిపోయింది.
  • చివరికి ఎలాగో ఒకలాగా పిచ్చుకమ్మ తన పిల్లలను ప్రాణాలతో కాపాడుకుని తన గూడు దగ్గరకు వెళ్ళింది.
  • తర్వాత పిచ్చుకమ్మ నిదానంగా ఎంతో దృఢముగా తన గూడును పెద్దదిగా నిర్మించుకున్నది.
      పిచ్చుకమ్మ ఔదార్యం    
  • కొంత కాలమైన తర్వాత ఆ అడవిలో మరలా గాలి వాన వచ్చింది అయితే పిచ్చుకమ్మ దృఢంగా మరియు పెద్దదిగా తన గూడు నిర్మించుకోవడం వలన పిచ్చుకమ్మ గూడు గాలివానను తట్టుకుని నిలబడింది.
  • కానీ కాకమ్మ గూడు పాతదైపోవడం వలన ఒక దెబ్బకే కూలిపోయింది. అప్పుడు కాకమ్మ అయ్యో నా బిడ్డలు చలికి వణుకుతున్నారే ఈచలికి నా బిడ్డల ప్రాణం పోయేలా ఉంది.
  • ఇప్పుడు నేను ఏమి చేయాలి అనుకుని నేను లేచి పిచుకమ్మ దగ్గరికి వెళతాను పిచ్చుకమ్మ తన ఇంటిని బాగా నిర్మించుకొని ఉన్నది నన్ను తప్పకుండా ఇంటిలో చేర్చుకుంటుంది అని తన పిల్లలని తీసుకుని ఆ గాలి వానలో పిచ్చుకమ్మ గూడు దగ్గరికి వెళ్ళింది.
  • కాకమ్మ పిచ్చకమ్మ గూడు దగ్గర నిలబడి ఓ పిచ్చకమ్మా తలుపుతీ చలికి వణికి పోతున్నాను అని అడిగింది. పిచ్చుకమ్మ బయటికి వచ్చి ఏమైంది అని అడిగింది అందుకు కాకమ్మ ఈ గాలివానకు నా గూడు పడిపోయింది.
  • నా పిల్లలు చలికి వణికి పోతున్నారు ఈ రాత్రికి నన్ను నా పిల్లలను నీ ఇంటిలో చేర్చుకొమ్మని పిచ్చుకమ్మను బ్రతిమాలింది.
  • అయితే పిచ్చకమ్మకు గతంలో కాకమ్మ తనతో అనిన మాటలను జ్ఞాపకం చేసుకున్నది.
  • కానీ దానిని గురించి అడగకుండానే కాకమ్మ పిల్లలను తన ఇంటిలోకి చేర్చుకొని కాకమ్మ పిల్లలను తన రెక్కల కింద పెట్టుకొని వాటికి వచ్చుదనం కలిగించ సాగింది.
  • (moral stories in Telugu)
  • అప్పుడు కాకమ్మ గతంలో పిచ్చుకమ్మను తను అనిన మాటలను జ్ఞాపకం చేసుకున్నది.
  • పిచ్చుకమ్మ చూపించిన ఆదరణకు తనలో తానే నలిగిపోయింది తన మనస్సాక్షి గద్దించ సాగింది.
  • తన ప్రవర్తన ఇంత హీనంగా ఉందా అని గుర్తించ సాగింది. చివరికి పిచ్చుకమ్మ దగ్గరికి వచ్చి తన తప్పును క్షమించమని అడిగింది.
  • నీ వలే మంచి బుద్ధిని నేను చూపించలేకపోయాను అని పిచ్చుకమ్మను బ్రతిమాలింది.
  • అందుకు పిచ్చుకమ్మ సరేలే నేను ఒకప్పుడు నీ గూటి దగ్గరికి వచ్చినప్పుడు నా మనసు ఎంత బాధపడిందో నాకు తెలుసు కాబట్టి,
  • నివాసం లేకుండా సహాయం కోసం వచ్చే వారి మనసు ఏ విధంగా ఉంటుందో నేను తెలుసుకున్నాను కాబట్టి, నిన్ను ఏమీ అనకుండా నా ఇంటిలోకి చేర్చుకున్నాను.
  • అని అన్నది అప్పటినుండి కాకమ్మ కూడా కఠినంగా ఉండడం మానుకొని ఆపదలో ఉన్న వారికి సహాయం చేయడం మొదలుపెట్టింది.
  • అపకారం చేసిన వారికి కూడా ఉపకారం చేయడం ద్వారా వారి ప్రవర్తనను మనం మార్చవచ్చు.
  • వారిని మంచి వారీగ మనం చేయవచ్చు. కాబట్టి కీడు చేసిన వారికి తిరిగి కీడు చేయకుండా మనము మేలే చేద్దాము సరేనా పిల్లలు

పేద విధవరాలు

  • మేరీ ఒక బీద విధవరాలు, ఆమెకు ఇద్దరు చిన్నపిల్లలు. ఆమెను ఆదరించడానికి ఆమె బంధువులు, మిత్రులు ఎవరూ లేరు.
  • మేరీ ఇంటి ప్రక్కనే ఉన్నటువంటి వారు చాలా బలవంతులు, వారు దుర్మార్గముగా మేరి యొక్క ఇంటి స్థలములో కొంత భాగమును ఆక్రమించిరి.
  • ఆమె ఆ గ్రామ  అధికారివద్దకు వెళ్ళింది, కానీ ఆ అధికారి చాలా దుర్మార్గుడు, ఎవరిని కూడా లెక్కచేయడు, గౌరవించడు, ప్రతి ఒక్కరిని కూడా దురుసుగా మాట్లాడుతాడు.
  • అయితే మేరీకి ఎవరూ బంధువులు లేనందువలన ఆమె యొక్క విన్నపమును అతడు ఎంత మాత్రమే పట్టించుకోలేదు. కానీ మేరీ తనకు న్యాయం చేయమని మరియు నా స్థలమును  నాకు ఇప్పించమని ప్రతిరోజు అడిగింది మరియు ఆ గ్రామాధికారిని విసిగించింది.
  • కానీ ఆ గ్రామ అధికారి ఎంత మాత్రమూ పట్టించుకోలేదు. కానీ ఒక దినమున ఆ గ్రామ అధికారి ఈ విధవరాలు ప్రతిరోజు నా ఇంటికి వచ్చి నన్ను విసిగించకుండా ఈమెకి న్యాయం చేసి  పంపి వేయాలని తన మనసులో అనుకొనెను.
  • అప్పుడు మేరీ ఇంటి పక్కన ఉన్న కుటుంబం వారిని పిలిపించి, వారిని హెచ్చరించి మేరీ స్థలమును తిరిగి మీరే కి ఇప్పించెను.
  • కాబట్టి ఒక సమస్య యొక్క పరిష్కారం కోసం మనం ప్రతిరోజు ప్రయత్నించినట్లు అయితే ఏదో ఒక రోజు మనకి విజయం వస్తుంది.

కుందేలు సింహం 

 

  • అడవికి రాజు అయిన సింహం దయ లేకుండా అడవిలోని జంతువులను వేటాడి చంపి తినసాగింది.
  • అందువలన అడవిలోని జంతువులన్నీ త్వరగా అంతరించిపోయే ప్రమాదం ఏర్పడింది.
  • (moral stories in Telugu)
  • అప్పుడు అడవిలోని జంతువులన్నీ ఒక చోట సమావేశం ఏర్పరిచి అడవికి రాజు అయిన సింహం యొక్క దుర్మార్గమైన చర్యలను గురించి చర్చించుకున్నవి.
  • చివరికి జంతువులన్ని ఒక ఏకాభిప్రాయానికి వచ్చినాయి, అది ఏమిటంటే అడవికి రాజు అయిన  సింహం విచ్చలవిడిగా జంతువులను చంపకుండ మనమే ప్రతిరోజు రోజుకు ఒకరి చొప్పున అతనికి ఆహారంగా వెళదాము అని తీర్మానించినాయి.
  • చివరికి అడవికి రాజు అయిన సింహం దగ్గరికి వెళ్లి తమ అభిప్రాయాన్ని  సింహానికి చెప్పినాయి దానికి సింహం సంతోషంగా అంగీకరించింది.
  • ఆ రోజు నుండి ప్రతిరోజు ఒక జంతువు చొప్పున సింహనానికి ఆహారంగా వెళుతున్నాయి.
  • ఒకరోజు కుందేలు యొక్క వంతు వచ్చింది కుందేలుకి బ్రతకాలి అనే ఆశ కలిగింది కానీ ప్రాణాలు  కాపాడుకోవడం ఎలా అని ఆలోచించింది చివరికి ఒక ఉపాయాన్ని కనిపెట్టింది, కుందేలు వంతు వచ్చినప్పుడు కుందేలు ఉద్దేశపూర్వకంగా సింహం వద్దకు ఆలస్యంగా వెళ్ళింది.
  • అప్పుడు సింహం చాలా కోపగించుకుని ఎందుకు ఇంత ఆలస్యంగా వచ్చావు నాకు ఆకలి వేస్తుంది కదా అనే కుందేలును అరిచింది.
  • అందుకు కుందేలు క్షమించండి రాజా నేను మీ వద్దకి వస్తూ ఉండగానీలాంటి ఒక సింహం  నేనే ఈ అడవికి రాజును నాకు నీవు ఆహారంగా రావాలని ఒక సింహం నన్ను బెదిరించింది అని చెప్పింది.
  • అప్పుడు అడవికి రాజు అయినటువంటి సింహం అది ఎక్కడ  ఉన్నది అని గర్వంగా కుందేలును అని అడిగింది.
  • దానికి కుందేలు ఆ సింహం ఒక పాత బావిలో దాగుకొని ఉన్నది అని చెప్పింది. అప్పుడు సింహం మరియు కుందేలు బయలుదేరి ఆ బావి వద్దకు వచ్చి చూసినప్పుడు సింహం యొక్క ప్రతిబింబం నీటిలో కనబడింది.
  • అప్పుడు సింహం నీటిలో తన ప్రతిబింబాన్ని చూసి అది కూడా ఒక సింహమే అని భ్రమ పడింది.
  • సింహం గర్జించినప్పుడు నీటిలో సింహం యొక్క ప్రతిబింబం కూడా గర్జించసాగింది,చివరికి నీటిలో మరియొక సింహం ఉన్నది అనుకుని దానిని చంపుటకు బావిలోకి దూకి చనిపోయింది.
  • ఈ విషయం తెలుసుకున్న అడవి జంతువులన్నీ ఆరోజు పండుగ చేసుకున్నాయి.
  • మరియు అడవి జంతువులన్నీ కుందేలు దగ్గరకు వచ్చి నీవు మా ప్రాణాలు కాపాడినావు  కాబట్టి ఇప్పటినుండి నీవే మాకు రాజుగా ఉండాలని చెప్పినాయి.
  • బలము కంటే జ్ఞానం గొప్పది
  • (moral stories in Telugu)

మూడు పంది పిల్లలు(moral stories in Telugu)

  • అడవిలో నివసించే ఒక అడవి పంది మూడు పిల్లలకు జన్మనిచ్చింది.అది తన పిల్లలకు పాలిచ్చి పెంచి పెద్దవాటిగా చేసింది., తరువాత ఆ పంది  సొంతగా జీవించుటకు నేర్చుకోవాలని తన పిల్లలను దూరంగా పంపింది.
  • ముందుగా ఆ మూడు పందిపిల్లలు మనము నివసించుటకు సొంత ఇల్లు కట్టుకుందాము రండి అని నిర్ణయించుకున్నాయి.
  • మొదటి పంది పిల్ల చాలా బద్ధకస్తురాలు అది మెత్తని గడ్డిని తీసుకుని వచ్చి సులభంగా తన ఇల్లును నిర్మించుకున్నది.
  • రెండవ పందిపిల్ల మొదటి పంది పిల్ల అంత  బద్ధకస్తురాలు కాదు కానీ దానిలో కూడా కొంచెం బద్ధకం ఉన్నది.
  • (moral stories in Telugu)
  • అది కొంచెం కష్టపడి కర్రలు తీసుకుని వచ్చి వాటితో తన ఇల్లును నిర్మించుకున్నది.
  • మూడవ పందిపిల్ల చాలా కష్టపడే స్వభావం కలది అది ఇటుకలు సిమెంటుతో తన ఇల్లును నిర్మించుకున్నది.
  • ఆ పంది పిల్లకు సిమెంటుతో ఇటుకలతో ఇల్లు నిర్మించుకొనుటకు కొంచెం ఎక్కువ సమయం తీసుకున్నది అయినా ఓపికగా ఇల్లును నిర్మించినది.  

 

  • కొంతకాలం అయిన తర్వాత ఒక తోడేలు ఆ మూడు  పంది పిల్లలను తినటానికి వాటి వద్దకు వచ్చింది.
  • (moral stories in Telugu)
  • మొదటి పందిపిల్ల తను గడ్డితో చేసిన ఇంటిలో దాగుకున్నది అయితే ఆ తోడేలు తన నోటితో ఆ ఇంటి మీద గాలిని ఊదగా ఆ ఇల్లు ఒక దెబ్బకి కూలిపోయింది.
  • ఆ పంది పిల్లను తోడేలు చంపి తినివేసింది. ఆ తోడేలు రెండవ పంది పిల్ల వద్దకు వచ్చి దానిని కూడా తినేయాలి అనుకున్నది అయితే ఆ రెండో పందిపిల్ల తన కర్రలతో నిర్మించిన ఇంటిలో దాగుకొన్నది అయితే తోడేలు తన కాలితో తన్నగా  ఆఇల్లు కూలిపోయింది
  • కాబట్టి ఆ పంది పిల్లను కూడా  తోడేలు చంపి తినేసింది. ఆ తోడేలు మూడవ పంది పిల్లను కూడా తినాలి అనుకుని దాని ఇంటి వద్దకు వచ్చింది
  • అయితే అది సిమెంటుతోను  రాళ్లతోనూ కట్టబడిన ఇల్లు కనుక అది ఏమీ చేయలేక నిస్సహాయంగా వెళ్ళిపోయింది కాబట్టి మూడో పందిపిల్ల తన ప్రాణాలు కాపాడుకున్నది
  • సోమరితనంగా ఉండడం మంచిది కాదు శ్రద్ధగా పని చేయువారు సురక్షితంగా జీవిస్తారు. 

మిదాస్

  • గ్రీకు దేశాన్ని midas అనే ఒక రాజు పరిపాలించేవాడు. అతను చాలా ధనాన్ని సంపాదించాడు కానీ అతనికి తృప్తి కలగలేదు. అతడు సంపాదించడానికి చాలా మార్గాలు వెతికాడు.
  • (moral stories in Telugu)
  • తన ప్రజల యొక్క సమస్యలను కూడా పరిష్కరించకుండా ధనం గురించి మాత్రమే ఆలోచించేవాడు. అతనికి ఒకే ఒక కుమార్తె తప్ప మరి ఏ సంతానము లేదు.
  • అతడు తన సంపద అభివృద్ధి కోసం ప్రతి దినము  దేవుని ప్రార్థించాడు. ఒకరోజు దేవుడు అతనికి ప్రత్యక్షమై నీకు ఏమి కావాలో కోరుకోమని చెప్పాడు.
  • అప్పుడు midas నేను దేనిని తాకిన అది బంగారంగా మారిపోయే వరం ఇవ్వమని కోరుకున్నాడు.
  • అందుకు దేవుడు నీవు కోరిన వరం మంచిది కాదు అని చెప్పాడు. అయినా కూడా దేవుని మాటలు midas పట్టించుకోలేదు.
  • చివరకు midas అడిగినట్లుగా దేవుడు వరాన్ని అతనికి ఇచ్చాడు.
  • అప్పుడు వెంటనే midas తన భవనాలను తాకగానే అవి బంగారంగా మారిపోయినాయి దానికి midas చాలా సంతోషించాడు.
  • తరువాత midas అతని యొక్క సింహాసనమును, మంచములను, వస్తువులను అన్నిటినీ తన చేతితో తాకగానే వెంటనే అవి అన్ని బంగారంగా మారిపోయినాయి
  • అప్పుడు అతను చాలా సంతోషించాడు. అతని తోటలోని వృక్షములను గడ్డిని అన్నిటిని తాకినప్పుడు అవి బంగారంగా మారిపోయినాయి.
  •   అతడు తన అంతపురం లోనికి వచ్చి భోజనము చేయుచుండగా భోజనమును తన చేతులతో తాకగానే అది బంగారంగా మారిపోయింది దానికి రాజు ఎంతో బాధపడినాడు, రాజు భోజనం చేయుటకు ఏమి చేయాలో అతనికి అర్థం కాలేదు.
  • రాజు యొక్క పరిస్థితిని చూసి అతని కుటుంబ సభ్యులు అతని సేవకులు చాలా బాధపడినారు.
  • చివరికి రాజు యొక్క ప్రియమైన కుమార్తె తన తండ్రి పరిస్థితిని చూసి ఏడుస్తూ పరిగెత్తుకొని వచ్చి అతనిని కౌగిలించుకున్నప్పుడు ఆమె కూడా బంగారంగా మారిపోయినది.
  • తన కుమార్తె కూడా బంగారంగా మారిపోగానే రాజు పెద్దగా ఏడ్చినాడు, మనుషులు, వృక్షములు మట్టి అన్ని బంగారం కంటే గొప్పవి అని తెలుసుకున్నాడు.
  • (moral stories in Telugu)
  • చివరికి మరలా దేవుని ప్రార్థించి నా తప్పును క్షమించమని వేడుకున్నాడు. దేవుడు అతనికి ప్రత్యక్షమై అతని యొక్క పూర్వపు స్థితిని అతనికి మరలా కలుగజేశాడు.
  • దురాశ ఎప్పటికైనా దుఃఖానికి కారణం అవుతుంది.

కోతి ముసలి 

  • ఒక అడవిలో నది ఒడ్డున నేరేడు పండ్ల చెట్టు ఉన్నది. ప్రతిరోజు ఆ పండ్లను ఒక కోతి తింటూ ఉన్నది. నదిలో ఉన్న మొసలి నాకు కూడా కొన్ని పండ్లు ఇవ్వగలవా అని అడిగింది.
  • (moral stories in Telugu)
  • కోతి కొన్ని పండ్లు ఇచ్చింది మొసలి తిన్న తర్వాత కొన్ని పండ్లను తన భార్యకు తీసుకుని వెళ్ళింది.
  • దాని భార్య ఆ పండ్లను తిని ఈ పండ్లు చాలా రుచిగా ఉన్నాయి అని చెప్పింది.
  • ఈ పండ్లను ప్రతిరోజు తినే ఆ కోతి గుండె ఇంకా  చాలా రుచిగా ఉంటుంది, దాని గుండెకాయ నాకు తెచ్చి ఇవ్వగలవా అని తన భర్తని అడిగింది.
  • ఆరోజు నుండి మొసలి కోతితో మోసపూరితమైన స్నేహం చేసింది.
  • ఒకరోజు మొసలి కోతితో నిన్ను భోజనానికి తీసుకుని రమ్మని నా భార్య చెప్పింది కాదనకుండా రావాలని విజ్ఞప్తి చేసింది.
  • దానికి కోతి సరేనని ముసలి వీపు మీద ఎక్కి మొసలి ఇంటికి బయలుదేరింది.
  • (moral stories in Telugu)
  • నది మధ్యలో ఉన్నప్పుడు మొసలి నీ గుండెకాయ ని తినాలని నా భార్య ఆశించినది.
  • అందుకే నిన్ను నా ఇంటికి తీసుకుని వెళుతున్నాను అని చెప్పింది. వెంటనే కోతికి ఏమీ అర్థం కాలేదు ఈ ప్రమాదం నుండి తప్పించుకోవాలని ఒక ఉపాయాన్ని కనిపెట్టింది.
  • ఓ మొసలి నా గుండెను చెట్టు కొమ్మకు తగిలించి వచ్చాను. అప్పుడే చెప్పినట్లయితే నేను దాన్ని తీసుకుని వచ్చేది కదా అని చెప్పింది.
  • వెంటనే అమాయకపు ముసలి మరలా నది ఒడ్డునకు కోతిని తీసుకొని వచ్చింది.
  • కోతి ఎగిరి చెట్టు కొమ్మలను పట్టుకుని, ఓ మొసలి ఎవరైనా గుండెను చెట్టుకు తగిలిస్తారా అని చెప్పి,
  • దేవుడే ఈ రోజు నా ప్రాణాలు కాపాడినాడు అని చెప్పి. మొసలిని ఎప్పుడు ఇటువైపు రావద్దని చెప్పినది . (moral stories in Telugu)

 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!
Scroll to Top
Scroll to Top