Ragulu in Telugu, English and Benefits
రాగులను శాస్త్రీయంగా “ఏలుసైన్ కొరకాన”రాగులను ఆంగ్లంలో finger Millet అని పిలుస్తారు (Ragulu in English) రాగులు అనే పదం మన తెలుగు భాషలో సాధారణంగా ఉపయోగిస్తున్నప్పటికీ కొన్ని ప్రాంతాలలో వీటిని చోళ్ళు, తైదలు,మల్లటి అనే పేర్లతో కూడా పిలుస్తారు. ఈ రాగులలో ఎర్ర రాగులు, తెల్ల రాగులు, నల్ల రాగులు, మజ్జిగ, budama అనే రకాలు కూడా ఉన్నాయి.ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి పంటలలో రాగి పంటను ఆరవ ప్రధానమైన పంట గా గుర్తించారు. రాగులను మన దేశంలో ప్రధానంగా కర్ణాటక, తమిళనాడు మన రాష్ట్రంలోని రాయలసీమ ప్రాంతాలలో రాగులను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.Ragulu, Ragulu in Telugu,Ragulu in English, Ragulu benefits in Telugu, Ragulu in Telugu name మొదలైన విషయాల గురించి తెలుసుకుందం.
రాగులు లేదా రాగి వీటికి ఉన్నటువంటి శక్తి చాలా గొప్పది. ఆహార పరంగానే కాకుండా ఔషధాలు గా కూడా రాగులను వాడుకోవచ్చు. అనేక వ్యాధులలో అనేక రకాలుగా రాగులను ఉపయోగిస్తారు. రాగులు బలవర్ధకమైన ధాన్యం. రాగి సంగటి అనగానే మన రాష్ట్రంలో ఎక్కువగా గుర్తుకు వచ్చేది రాయలసీమ. ఆ ప్రాంత ప్రజలు రాగి సంగటి ని ఎక్కువగా ఇష్టపడతారు. రాయలసీమ జిల్లాలలో ఇప్పటికీ కూడా రాగులను రాగి సంగటి ని ఆహారంగా తీసుకుంటున్నారు. ఒకప్పుడు మన పెద్ద వారి కాలంలోరాగి పిండితో జావ తయారు చేసి మజ్జిగలో గాని, పాలల్లో గానీ కలుపుకుని తాగేవారు.
Ragulu Benefits in Telugu
- రాగులు వలన జుట్టు ఎత్తుగానూ పొడుగ్గానూ పెరిగే అవకాశం ఉన్నది.
- మధుమేహ వ్యాధితో బాధపడే వారు రాగి పిండితో తయారు చేసిన జావా, సంగటి మొదలైన ఆహార పదార్థాలు తీసుకున్నట్లయితే మంచి ఫలితం ఉంటుందని వైద్యులు కూడా తెలియజేస్తున్నారు.
- రాగులు ఇతర ధాన్యాల కంటే బలవర్ధకమైన ఆహారం. శారీరిక శ్రమ ఎక్కువగా చేసేవారు రాగుల పిండితో తయారు చేసిన పదార్ధాలను తీసుకున్నట్లయితే వారికి నూతన శక్తి లభిస్తుంది.
- రాగులలో అయోడిన్ పుష్కలంగా లభిస్తుంది ఎదిగే పిల్లలకు రాగులను వేయించి పిండి చేసి ఆ పిండిని పాలలో కలిపి పిల్లలకు ఇచ్చినట్లయితే వారి శారీరక ఎదుగుదల బాగా ఉంటుందని వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు. (Ragulu in English)
- కడుపులో మంటను తగ్గించి చలువ చేస్తుంది మరియు పైత్యాన్ని తగ్గిస్తుంది. (Ragulu benefits in Telugu name)
- వృద్దాప్యంలో వున్న వారు రాగులతో తయారు చేసిన ఆహార పదార్థాలను తీసుకున్నట్లయితే వారికి వృద్ధాప్యంలో మంచి శక్తి కలుగుతుంది.
- రాగి పిండితో తయారుచేసిన రాగి మాల్ట్ ను తీసుకున్నట్లయితే ఎముకలకు శక్తి కలుగుతుంది. రాగి మాల్ట్ ఎముకల పటుత్వానికి దాదువుల నిర్మాణానికి దోహదపడుతుంది.
- రాగి మాల్ట్ మూత్రపిండాలలో రాళ్ళు ఏర్పడకుండా చేస్తుంది. సుగంధి పాలు కలిపిన రాగి మల్ట్ ను తీసుకున్నట్లయితే రక్తపోటు అరికట్టబడుతుంది అని వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు.
- రాగులను పిండి పట్టించి అన్నంలో కలిపి రాగి ముద్ద తయారు చేసుకుని తింటే నీరసం నిస్సత్తువ లాంటివి తగ్గిపోతాయి.
- రాగులకు చలువ చేసే గుణం ఎక్కువ కాబట్టి శరీరం వేడి చేసినప్పుడు తీసుకుంటే శారీరక వేడి తగ్గే అవకాశం ఉందని నిపుణులు తెలియజేస్తున్నారు. (Ragulu benefits in Telugu name)
100 గ్రాముల రాగులను తీసుకుంటే అందులో క్రింది పోషకాలు ఉన్నాయి .
అందులో 344 మిల్లీగ్రాముల క్యాల్షియం ఉంటుంది.
100 గ్రాముల రాగుల లో లభించే శక్తి 328 క్యాలరీలు.
పీచు పదార్థాలు 3.6 గ్రాములు
మాంసకృత్తులు అనగా ప్రోటీన్స్ 3.7 గ్రాములు.
క్రొవ్వు పదార్థం 100 గ్రాముల రాగులలో 1. 3 గ్రాములు ఉంటుంది రాగుల్లో క్రొవ్వు పదార్థం తక్కువగానే ఉంటుంది.
ఈ రాగులలో విటమిన్ ఏ, విటమిన్ బి1, విటమిన్ బీ2,ఖనిజ లవణాలు ఇనుము, క్యాల్షియం మొదలైనవి పుష్కలంగా ఉంటాయి
కాల్షియం (Ragulu in Telugu)
అన్ని ఆహార పదార్థాలతో పోల్చినప్పుడు రాగులలో కాల్షియం ఎక్కువగా ఉండడం చెప్పుకోదగిన విషయం. పాల కంటే కూడా మూడు రెట్లు అధికంగా క్యాల్షియం రాగుల్లో ఉన్నది. క్యాల్షియం మన ఎముకల గట్టిదనానికి పటుత్వానికి ఉపయోగపడుతుంది అయితే కాల్షియం ను మన శరీరం గ్రహించాలంటే దానికి విటమిన్-డి అవసరం.విటమిన్ D మనకి సూర్యరశ్మి ద్వారానే లభిస్తుంది. రాగులు లో ఉండే కాల్షియం పిల్లల ఎదుగుదలకు ఉపయోగపడుతుంది.(Ragulu)
రాగులు లో ఉండే మిసిథిన్, లిథియోనిన్ అనే అమైనో యాసిడ్స్ కారణంగామన శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గే అవకాశం ఉన్నది.
ఐరన్
ఆహార పదార్థాల నుండి ఐరన్ ను మన శరీరం గ్రహించాలి అంటే దానికి విటమిన్ సి అవసరం. రాగులు లో విటమిన్ సి ఉంటుంది. ఐరన్ మన శరీరంలో రక్తం రక్తహీనతను తగ్గిస్తుంది మరియు ఊపిరితిత్తుల నుండి శరీరంలోని అన్ని భాగాలకు ఆక్సిజన్ సరఫరా చేస్తుంది. ( Ragulu)
విటమిన్ ఏ
రాగులలో విటమిన్ ఏ ఉంటుంది ఈ విటమిన్ మన కంటి చూపు పెరుగుదలకు దోహదపడుతుంది.
Disadvantages(Ragulu in Telugu)
రాగుల కంటే ఆకుకూరల్లో కాల్షియం ఎక్కువగా ఉంటుంది కనుక రాగుల కంటి ఆకుకూరలు బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. శారీరక శ్రమ ఎక్కువగా చేస్తున్నటువంటి వారు రాగులతో తయారు చేసిన పదార్థాలు తీసుకుంటే ప్రయోజనం ఉంటుంది, కానీ నీడలో పనిచేసే ఉద్యోగస్తులు రాగి జావ లాంటివి తీసుకుంటే ఎక్కువ కార్బోహైడ్రేట్స్ వారి శరీరంలోకి చేరడం వలన అనారోగ్యాలు బారిన పడే అవకాశం కూడా ఉన్నది. రాగులలో కొంచెం ఎక్కువగా క్యాల్షియం ,క్యాలరీస్ ఉన్నాయన్న విషయమే గాని ఇక ఇతర పోషకాలు పెద్దగా లేవు అనే వాదన కూడా ఉన్నది. రాగుల కంటే మొలకలు అన్ని పోషకాలు విషయంలో మంచి ప్రాధాన్యత కలిగి ఉన్నాయని కూడా చెబుతున్నారు. రాగులలో గైట్రొజెన్ ప్రభావం ఉంటుంది దీని వలన గాయిటర్ అనే జబ్బు వస్తుంది. గాయిటర్ అనగా గొంతు దగ్గర వాచినట్లుగా ఉండే వ్యాధి దీని వలన నిస్సత్తువ నీరసం మతిమరుపు స్థూలకాయం లాంటి పరిణామాలు. మన శరీరంలో జరగవచ్చు.(Ragulu)
ఈ సమాచారం విద్యా ప్రయోజనాలకు ఉద్దేశించినది. ఆరోగ్య ప్రయోజనాలకు మీ డాక్టర్ ను సంప్రదించకుండా ఈ సమాచారాన్ని నేరుగా ఉపయోగించకూడదు దానికి ఈ వెబ్సైట్ యాజమాన్యం ఎటువంటి బాధ్యతలు తీసుకోదు.
Pingback: Chia seeds in Telugu/Benefits/Meaning - Telugu Fish