Simple Future-6

6. Conditional Sentences:          

If కండిషన్ తో భవిష్యత్తులో జరిగే కార్యక్రమాలను గురించి తెలియజేయడం.

Example:

 

1.”If it rains, we will stay indoors.” వర్షం పడితే ఇంట్లోనే ఉంటాం.
“If it doesn’t rain, we will not stay indoors.” “వర్షం పడకపోతే మేము ఇంట్లో ఉండము.”
“If it rains, will we stay indoors?” “వర్షం పడితే ఇంట్లోనే ఉంటామా?”
“If it doesn’t rain, will we not stay indoors?” “వర్షం పడకపోతే మనం ఇంట్లో ఉండమా?”
2. “If it rains, we will cancel the picnic.” వర్షం పడితే పిక్నిక్ రద్దు చేస్తాం.
“If it doesn’t rain, we will not cancel the picnic.” “వర్షం పడకపోతే పిక్నిక్ రద్దు చేసుకోము.”
“If it rains, will we cancel the picnic?” “వర్షం పడితే పిక్నిక్ రద్దు చేసుకుంటామా?”
“If it doesn’t rain, will we not cancel the picnic?” “వర్షం పడకపోతే పిక్నిక్ రద్దు చేసుకోమా?”
3. “If you study hard, you will pass the exam.” ” నీవు కష్టపడి చదివితే పరీక్షలో పాస్ అవుతావు.”
“If you don’t study hard, you will not pass the exam.” ” నీవు కష్టపడి చదవకపోతే పరీక్షలో పాస్ అవ్వవు.”
“If you study hard, will you pass the exam?” ” నీవు కష్టపడి చదివితే పరీక్షలో పాసవుతావా?”
“If you don’t study hard, will you not pass the exam?” “నీవు కష్టపడి చదవకపోతే పరీక్షలో  పాస్ అవ్వవా?”
4.  “If she calls, I will let you know.”   “ఆమె ఫోన్ చేస్తే, నేను మీకు తెలియజేస్తాను.”
“If she doesn’t call, I will not let you know.” “ఆమె ఫోన్ చేయకపోతే, నేను మీకు తెలియజేయను.”
“If she calls, will I let you know?” “ఆమె ఫోన్ చేస్తే, నేను మీకు తెలియజేస్తానా?”
“If she doesn’t call, will I not let you know?” “ఆమె ఫోన్ చేయకపోతే, నేను మీకు తెలియజేయనా?”
5. “If you arrive early, we will have more time to prepare.” “మీరు ముందుగానే వస్తే, మేము సిద్ధం చేయడానికి మరింత సమయం ఉంటుంది.”
“If you don’t arrive early, we will not have more time to prepare.” “మీరు త్వరగా రాకపోతే, మాకు సిద్ధం చేయడానికి ఎక్కువ సమయం ఉండదు.”
“If you arrive early, will we have more time to prepare?” “మీరు తొందరగా వస్తే, మాకు సిద్ధం చేయడానికి ఇంకా సమయం ఉంటుందా?”
“If you don’t arrive early, will we not have more time to prepare?” “మీరు త్వరగా రాకపోతే, మాకు సిద్ధం చేయడానికి ఎక్కువ సమయం ఉండదా?”
6. “If he doesn’t hurry, he will miss the bus.”   ” అతను తొందరపడనట్లు అయితే, బస్సు మిస్ చేసుకుంటాడు.”
“If he hurries, he will not miss the bus.”  “అతను తొందరపడినట్లు అయితే బస్ మిస్ చేసుకోడు.”
“If he doesn’t hurry, will he miss the bus?” ” తొందరపడకపోయినట్లు అయితే బస్సు మిస్ చేసుకుంటాడా?”
“If he hurries, will he not miss the bus?” ” అతను తొందరపడినట్లు అయితే బస్సు మిస్ చేసుకోడా?”
7. “If they offer me the job, I will accept it.” ”  వారు నాకు ఉద్యోగం ఆఫర్ చేసినట్లు అయితే, నేను అంగీకరిస్తాను.”
“If they don’t offer me the job, I will not accept it.” ” వారు నాకు ఉద్యోగం ఇవ్వకపోయినట్లు అయితే, నేను అంగీకరించను.”
“If they offer me the job, will I accept it?” ” వారు నాకు ఉద్యోగం ఇవ్వకపోయినట్లు అయితే, నేను అంగీకరిస్తానా?”
“If they don’t offer me the job, will I not accept it?” ” వారు నాకు ఉద్యోగం ఆఫర్ చేయకపోయినట్లు అయితే, నేను అంగీకరించనా?”
8.  “If we don’t leave now, we will be late.”   “మేము ఇప్పుడు బయలుదేరకు పోయినట్లు అయితే, మాకు ఆలస్యం అవుతుంది”
“If we leave now, we will not be late.” “మేము ఇప్పుడు బయలుదేరినట్లు అయితే మాకు  ఆలస్యం కాదు.”
“If we don’t leave now, will we be late?” “మేము ఇప్పుడు బయలుదేరకపోయినట్లు అయితే, మాకు ఆలస్యం అవుతుందా?”
“If we leave now, will we not be late?” ” మేము ఇప్పుడు బయలుదేరినట్లు అయితే, మాకు ఆలస్యము కాదా?”
9. “If you save money, you will be able to travel.” ‘‘నీవు డబ్బు పొదుపు చేసినట్లు అయితే, నీవు ప్రయాణం చేయగలుగుతావు.
“If you don’t save money, you will not be able to travel.” ” నీవు డబ్బు పొదుపు చేయకపోయినట్లు అయితే, నువ్వు ప్రయాణం చేయలేవు.”
“If you save money, will you be able to travel?” ” నీవు డబ్బు పొదుపు చేసినట్లు అయితే నీవు ప్రయాణం చేయగలుగుతావా?”
“If you don’t save money, will you not be able to travel?” ”  నీవు డబ్బు పొదుపు చేయకపోయినట్లు అయితే, నువ్వు ప్రయాణం చేయలేవా?”
10. “If she practices every day, she will improve her skills.” “ఆమె ప్రతిరోజు సాధన చేసినట్లు అయితే, ఆమె తన నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటుంది.”
“If she doesn’t practice every day, she will not improve her skills.” “ఆమె ప్రతిరోజూ సాధన చేయకపోతే, ఆమె తన నైపుణ్యాలను మెరుగుపరుచుకోదు.”
“If she practices every day, will she improve her skills?” “ఆమె ప్రతిరోజూ సాధన చేస్తే, ఆమె తన నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటుందా?”
“If she doesn’t practice every day, will she not improve her skills?” “ఆమె ప్రతిరోజూ సాధన చేయకపోతే, ఆమె తన నైపుణ్యాలను మెరుగుపరుచుకోలేదా?”
11. “If the weather is nice, we will go for a walk.”   “వాతావరణం బాగా ఉన్నట్లు అయితే, మేము వాకింగ్ కి వెళతాము.”
“If the weather isn’t nice, we will not go for a walk.” “వాతావరణం సరిగా లేకపోతే, మేము నడకకు వెళ్ళము.”
“If the weather is nice, will we go for a walk?” “వాతావరణం బాగా ఉన్నట్లు అయితే మేము వాకింగ్ కి వెళతామా?”
“If the weather isn’t nice, will we not go for a walk?” “వాతావరణం బాగా లేకుంటే, మేము వాకింగ్ కి వెళ్ళమా?”

 

Where will we go for a walk if the weather is nice? వాతావరణం బాగున్నట్లు అయితే మేము ఎక్కడికి వాకింగ్ వెళతాము?
When will we go for a walk if the weather is nice? వాతావరణం బాగున్నట్లు అయితే మేము ఎప్పుడు వాకింగ్ వెళతాము?
Why will we go for a walk if the weather is nice? వాతావరణం బాగున్నట్లు అయితే మేము ఎందుకు వాకింగ్ వెళతాము?
How will we go for a walk if the weather is nice? వాతావరణం బాగున్నట్లు అయితే మేము ఎలా వాకింగ్ వెళతాము?
Where will we not go for a walk if the weather isn’t nice? వాతావరణం బాగా లేనట్లు అయితే మేము ఎక్కడ వాకింగ్ కి వెళ్ళము? 
When will we not go for a walk if the weather isn’t nice? వాతావరణం బాగా లేనట్లు అయితే మేము ఎప్పుడు వాకింగ్ కి వెళ్ళము? 
Why will we not go for a walk if the weather isn’t nice? వాతావరణం బాగా లేనట్లు అయితే మేము ఎందుకు వాకింగ్ కి వెళ్ళము? 
How will we not go for a walk if the weather isn’t nice? వాతావరణం బాగా లేనట్లు అయితే మేము ఎలా వాకింగ్ కి వెళ్ళము?