11. Historical present:
The simple present tense is used to create an immediate sense of things that have happened.
జరిగిపోయిన విషయాల యొక్క తక్షణ భావాన్ని సృష్టించడానికి సింపుల్ ప్రెసెంట్ టెన్స్ ని ఉపయోగిస్తారు. మన మాటలు వింటున్న వ్యక్తి యొక్క ధ్యాస మన వైపు తిప్పుకోవడానికి మరియు చెప్పే విషయాలను ఆకర్షణీయంగా వర్ణించి చెప్పడానికి, జరిగిపోయిన ఈ విషయాలు ప్రస్తుతం జరుగుతున్నట్లుగానే చెప్పడానికి ఈ సింపుల్ ప్రెసెంట్ టెన్స్ లో మాట్లాడతారు. ఒక రకంగా చెప్పాలంటే ఇవన్నీ జరిగిపోయిన సంఘటనలు. సింపుల్ ప్రెసెంట్ టెన్స్ ని చారిత్రక వర్తమానంగా (జరిగిపోయిన విషయాలను వర్తమానంలో తెలియజేయడం) కూడా కొన్ని సందర్భాలలో ఉపయోగిస్తారు. (spoken English in telugu)
మన మాటలు వింటున్న వ్యక్తికి, గతంలో జరిగిపోయిన విషయాలను ఇప్పుడే జరుగుతున్నట్లుగా, కళ్ళకు కట్టినట్లు, ఆకర్షణీయంగా నటించి చూపించడానికి సింపుల్ ప్రెసెంట్ టెన్స్ లో తెలియజేస్తారు. ఆ జరిగిపోయిన సంఘటనలు ముఖ్యమైనవి అని అనుకున్నప్పుడు ఇలా చేస్తారు లేకుంటే జరిగిపోయిన విషయాలను పాస్ట్ టెన్స్ లోనే చెప్పవలసి ఉంటుంది.
న్యూస్ పేపర్ లో కూడా జరిగిపోయిన వార్తలను జర్నలిస్ట్ కొన్ని సందర్భాలలో సింపుల్ ప్రెసెంట్ టెన్స్ లో తెలియజేస్తారు. ఆ వార్త ముఖ్యమైనది అయినప్పుడు దాని యొక్క ప్రాముఖ్యత నొక్కి చెప్పడానికి, బలంగా చెప్పడానికి సింపుల్ ప్రెసెంట్ టెన్స్ పద్ధతిని ని ఉపయోగిస్తారు.
Example:
1.So, I walk into the room and everyone turns to look at me. (PS) | కాబట్టి, నేను గదిలోకి నడిచాను మరియు అందరూ నా వైపు చూచుటకు తిరిగారు. |
So, I don’t walk into the room and everyone doesn’t turn to look at me. (NS) | కాబట్టి, నేను గదిలోకి నడవలేదు మరియు అందరూ నా వైపు చూడలేదు. |
Do I walk into the room and does everyone turn to look at me? (IS) | కాబట్టి, నేను గదిలోకి నడిచాన? మరియు అందరూ నా వైపు చూచుటకు తిరిగార?. |
Don’t I walk into the room and doesn’t everyone turn to look at me? (NIS) | కాబట్టి, నేను గదిలోకి నడవలేదా? మరియు అందరూ నా వైపు చూచుటకు తిరగ లేదా? |
2.She opens the letter and reads the surprising news. | ఆమె ఉత్తరం తెరిచి ఆశ్చర్యకరమైన వార్తలను చదివింది. |
She doesn’t open the letter and doesn’t read the surprising news. | ఆమె ఉత్తరం తెరవలేదు మరియు ఆశ్చర్యకరమైన వార్తలను చదవలేదు. |
Does she open the letter and read the surprising news? | ఆమె లేఖను తెరిచి ఆశ్చర్యకరమైన వార్తలను చదివిందా? |
Doesn’t she open the letter and read the surprising news? | ఆమె ఉత్తరం తెరవలేదా మరియు ఆశ్చర్యకరమైన వార్తను చదవలేదా? |
3.He picks up the phone and calls his best friend. | అతను ఫోన్ తీసుకొని తన ప్రాణ స్నేహితుడికి కాల్ చేశాడు.
Picks up =పైకి లేపు. |
He doesn’t pick up the phone and doesn’t call his best friend. | అతను ఫోన్ ఎత్తలేదు మరియు అతని బెస్ట్ ఫ్రెండ్‌కి కాల్ చేయలేదు. |
Does he pick up the phone and call his best friend? | అతను ఫోన్ తీసుకొని తన బెస్ట్ ఫ్రెండ్‌కి కాల్ చేశాడా? |
Doesn’t he pick up the phone and call his best friend? | అతను ఫోన్ తీసుకొని లేదా మరియు తన బెస్ట్ ఫ్రెండ్ కి కాల్ చేయలేదా? |
4.The dog barks loudly as the stranger approaches. | అపరిచితుడు దగ్గరకు వచ్చినప్పుడు కుక్క బిగ్గరగా హరిచింది. |
The dog doesn’t bark loudly as the stranger approache. | అపరిచితుడు దగ్గరకు రాగా కుక్క పెద్దగా మొరగ లేదు. |
Does the dog bark loudly as the stranger approaches? | అపరిచితుడు దగ్గరకు వచ్చినప్పుడు కుక్క బిగ్గరగా మరిగిందా? |
Doesn’t the dog bark loudly as the stranger approache? | అపరిచితుడు దగ్గరకు వచ్చినప్పుడు కుక్క బిగ్గరగా మొరగలేదా? |
5.She smiles and says, “Welcome to our home.” | ఆమె నవ్వుతూ, “మా ఇంటికి స్వాగతం” అని చెప్పింది. |
She doesn’t smile and doesn’t say, “Welcome to our home.” | ఆమె నవ్వలేదు మరియు “మా ఇంటికి స్వాగతం” అని చెప్పలేదు. |
Does she smile and say, “Welcome to our home”? | ఆమె నవ్వుతూ, “మా ఇంటికి స్వాగతం” అని చెప్పిందా? |
Doesn’t she smile and say, “Welcome to our home”? | ఆమె నవ్వుతూ “మా ఇంటికి స్వాగతం” అని అనలేదా? |
6.He sits down at the table and starts to write. | అతను టేబుల్ వద్ద కూర్చుని రాయడం ప్రారంభించాడు. |
He doesn’t sit down at the table and doesn’t start to write. | అతను టేబుల్ వద్ద కూర్చుని మరియు వ్రాయడం ప్రారంభించలేదు. |
Does he sit down at the table and start to write? | అతను టేబుల్ వద్ద కూర్చుని రాయడం ప్రారంభించాడా? |
Doesn’t he sit down at the table and start to write? | అతను టేబుల్ వద్ద కూర్చుని రాయడం ప్రారంభించలేదా? |
7.The cat jumps onto the counter and knocks over a glass. | పిల్లి కౌంటర్‌పైకి దూకి ఒక గ్లాసు మీద కొట్టింది. |
The cat doesn’t jump onto the counter and doesn’t knock over a glass. | పిల్లి కౌంటర్‌పైకి దూకలేదు మరియు గ్లాసు మీద కొట్టలేదు. |
Does the cat jump onto the counter and knock over a glass? | పిల్లి కౌంటర్‌పైకి దూకి గాజును కొట్టిందా? |
Doesn’t the cat jump onto the counter and knock over a glass? | పిల్లి కౌంటర్‌పైకి దూకలేదా మరియు గ్లాస్‌ని కొట్ట లేదా? |
8.She looks out the window and sees the rain pouring down. | ఆమె కిటికీలోంచి చూసి వర్షం పడడం చూసింది. |
She doesn’t look out the window and doesn’t see the rain pouring down. | ఆమె కిటికీలోంచి చూడలేదు మరియు వర్షం పడడం చూడలేదు. |
Does she look out the window and see the rain pouring down? | ఆమె కిటికీలోంచి బయటకు చూసి వర్షం కురిసేది చూసిందా? |
Doesn’t she look out the window and see the rain pouring down? | ఆమె కిటికీలోంచి బయటకు చూడలేదా మరియు వర్షం కురిసేది చూడలేదా? |
9.He enters the shop and greets the owner. | అతను దుకాణంలోకి ప్రవేశించి యజమానిని పలకరించాడు. |
He doesn’t enter the shop and doesn’t greet the owner. | అతను దుకాణంలోకి ప్రవేశించలేదు మరియు యజమానిని పలకరించలేదు. |
Does he enter the shop and greet the owner? | అతను దుకాణంలోకి ప్రవేశించి యజమానిని పలకరించాడా? |
Doesn’t he enter the shop and greet the owner? | అతను దుకాణంలోకి ప్రవేశించలేదా మరియు యజమానిని పలకరించలేదా? |
10.The baby giggles as the mother tickles her. | తల్లి చక్కిలిగింతలు పెట్టగా పాప ముసిముసిగా నవ్వింది. |
The baby doesn’t giggle as the mother tickles her. | తల్లి చక్కిలిగింతలు పెట్టగా పాప ముసిముసిగా నవ్వలేదు. |
Does the baby giggle as the mother tickles her? | తల్లి చక్కిలిగింతలు పెట్టగా పాప ముసిముసిగా నవ్విందా.? |
Doesn’t the baby giggle as the mother tickles her? | తల్లి చక్కిలిగింతలు పెట్టగా పాప ముసిముసిగా నవ్వ లేదా.? |
11.She takes a deep breath and steps onto the stage. | ఆమె బలమైన శ్వాస తీసుకుని వేదిక పైకి అడుగుపెట్టింది.
deep =లోతైన |
She doesn’t take a deep breath and doesn’t step onto the stage. | ఆమె లోతైన శ్వాస తీసుకోలేదు మరియు వేదికపైకి అడుగు పెట్టలేదు |
Does she take a deep breath and step onto the stage? | ఆమె లోతైన శ్వాస తీసుకొని వేదికపైకి అడుగు పెట్టిందా?(spoken English in telugu) |
Doesn’t she take a deep breath and step onto the stage? | ఆమె లోతైన శ్వాస తీసుకోలేదు మరియు వేదికపైకి అడుగు పెట్టలేదు? |
12.He grabs his coat and heads out the door. | అతను తన కోటు పట్టుకుని తలుపు నుండి బయటకు వెళ్ళాడు. |
He doesn’t grab his coat and doesn’t head out the door. | అతను తన కోటు పట్టుకోలేదు మరియు తలుపు నుండి బయటకు వెళ్లలేదు. |
Does he grab his coat and head out the door? | అతను తన కోటు పట్టుకుని తలుపునుండి బయటికి వెళ్లాడా? |
Doesn’t he grab his coat and head out the door? | అతను తన కోటు పట్టుకోలేదా మరియు తలుపు నుండి బయటకు వెళ్లలేదా? |
13.The teacher claps her hands to get the students’ attention. | విద్యార్థుల దృష్టిని ఆకర్షించడానికి ఉపాధ్యాయురాలు ఆమె చేతులతో చప్పట్లు కొట్టింది. |
The teacher doesn’t clap her hands to get the students’ attention. | విద్యార్థుల దృష్టిని ఆకర్షించడానికి ఉపాధ్యాయురాలు చప్పట్లు కొట్టలేదు. |
Does the teacher clap her hands to get the students’ attention? | విద్యార్థుల దృష్టిని ఆకర్షించడానికి ఉపాధ్యాయురాలు చప్పట్లు కొట్టిందా? |
Doesn’t the teacher clap her hands to get the students’ attention? | విద్యార్థుల దృష్టిని ఆకర్షించడానికి ఉపాధ్యాయురాలు చప్పట్లు కొట్ట లేదా? |
14.She closes the book and places it on the shelf. | ఆమె పుస్తకాన్ని మూసివేసి షెల్ఫ్‌లో ఉంచింది. |
She doesn’t close the book and doesn’t place it on the shelf. | ఆమె పుస్తకాన్ని మూసి వేయలేదు మరియు షెల్ఫ్‌లో ఉంచలేదు. |
Does she close the book and place it on the shelf? | ఆమె పుస్తకాన్ని మూసివేసి షెల్ఫ్‌లో ఉంచిందా? |
Doesn’t she close the book and place it on the shelf? | ఆమె పుస్తకాన్ని మోయలేదా మరియు పుస్తకాన్ని షెల్ఫ్‌లో పెట్టలేదా? |
15.He reaches into his pocket and pulls out a key. | అతను తన జేబులోకి చేరుకుని, ఒక కీని తీసినాడు. |
He doesn’t reach into his pocket and doesn’t pull out a key. | అతను తన జేబులోకి చేరుకోలేదు మరియు కీని బయటకు తీయలేదు. |
Does he reach into his pocket and pull out a key? | అతను తన జేబులోకి చేరి, తాళం తీశాడా? |
Doesn’t he reach into his pocket and pull out a key? | అతను తన జేబులోకి చేరుకోలేదా మరియు తాళమును బయటకు తీయలేదా? |
16.The crowd cheers as the team scores a goal. | జట్టు గోల్ చేయడంతో ప్రేక్షకులు హర్షం వ్యక్తం చేసినారు. |
The crowd doesn’t cheer as the team scores a goal. | జట్టు గోల్ చేయడంతో ప్రేక్షకులు హర్షం వ్యక్తం చేయలేదు. |
Does the crowd cheer as the team scores a goal? | జట్టు గోల్ చేయడంతో ప్రేక్షకులు హర్షం వ్యక్తం చేసినారా.? |
Doesn’t the crowd cheer as the team scores a goal? | జట్టు గోల్ చేయడంతో ప్రేక్షకులు హర్షం వ్యక్తం చేయలేదా.? |
17.She lights the candle and makes a wish. | కొవ్వొత్తి వెలిగించి విష్ చేసింది. |
She doesn’t light the candle and doesn’t make a wish. | ఆమె కొవ్వొత్తి వెలిగించలేదు మరియు విష్ చేయలేదు. |
Does she light the candle and make a wish? | ఆమె కొవ్వొత్తి వెలిగించి విష్ చేసిందా? |
Doesn’t she light the candle and make a wish? | ఆమె కొవ్వొత్తి వెలిగించలేదా మరియు విష్ చేయలేదు? |
18.He opens the gift and finds a beautiful watch inside. | అతను బహుమతిని తెరిచి, లోపల ఒక అందమైన గడియారాన్ని కనుగొన్నాడు. |
He doesn’t open the gift and doesn’t find a beautiful watch inside. | అతను బహుమతిని తెరవలేదు, లోపల ఒక అందమైన గడియారాన్ని కనుగొనలేదు. |
Does he open the gift and find a beautiful watch inside? | అతను బహుమతిని తెరిచి లోపల అందమైన గడియారాన్ని కనుగొన్నాడా? |
Doesn’t he open the gift and find a beautiful watch inside? | అతను బహుమతిని తెరవలేదా మరియు లోపల అందమైన గడియారాన్ని కనుగొనలేదా? |
19.The wind blows through the trees, rustling the leaves. | గాలి చెట్ల గుండా వీచింది, ఆకులను గలగల అనిపించింది. |
The wind doesn’t blow through the trees, rustling the leaves. | గాలి చెట్ల గుండా వీచలేదు, ఆకులను గలగల మనిపించలేదు. |
Does the wind blow through the trees, rustling the leaves? | గాలి చెట్ల గుండా వేచిందా, ఆకులను గలగల మనిపించిందా.? |
Doesn’t the wind blow through the trees, rustling the leaves? | గాలి చెట్ల గుండా లేచ లేదా, ఆకులను గలగల అనిపించలేదా.? |
20.She takes a sip of her coffee and smiles contentedly. | ఆమె కాఫీ సిప్ తీసుకొని తృప్తిగా నవ్వింది |
She doesn’t take a sip of her coffee and doesn’t smile contentedly. | ఆమె కాఫీ సిప్ తీసుకోలేదు మరియు తృప్తిగా నవ్వలేదు. |
Does she take a sip of her coffee and smile contentedly? | ఆమె కాఫీ సిప్ తీసుకొని తృప్తిగా నవ్విందా? |
Doesn’t she take a sip of her coffee and smile contentedly? | ఆమె కాఫీ సిప్ తీసుకోలేదా మరియు తృప్తిగా నవ్వలేదా? |
వార్తాపత్రికలలో కూడా కొన్ని సందర్భాల్లో, కొన్ని వార్తలు తక్షణ భావాన్ని కలుగజేయడానికి మరియు ఆ వార్తలు యొక్క ప్రాధాన్యతను బలముగా నొక్కి చెప్పడానికి కూడా జరిగిపోయిన వార్తలను సింపుల్ ప్రెసెంట్ టెన్స్ లో తెలియజేస్తారు. క్రింది పట్టికలోని కొన్ని ఉదాహరణలు గమనించండి.ఈ పనులు సింపుల్ ప్రెసెంట్ టెన్స్ లో తెలియజేస్తున్నప్పటికీ వాటి అర్థం జరిగిపోయినట్లుగానే మనం అనుకోవాలి.
The Prime minister signs a new trade agreement with Japan. | ప్రధాన మంత్రి జపాన్‌తో కొత్త వాణిజ్య ఒప్పందంపై సంతకాలు చేశాడు |
Fire destroys historic buildings in the Hyderabad Charminar area. | హైదరాబాద్ చార్మినార్ ప్రాంతంలోని చారిత్రక కట్టడాలను అగ్ని నాశనం చేసింది. |
Police arrest suspect in bank robbery. | బ్యాంకు చోరీకి పాల్పడిన నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. |
Airline cancels flights due to severe weather conditions. | తీవ్రమైన వాతావరణ పరిస్థితుల కారణంగా విమానయాన సంస్థ విమానాలను రద్దు చేసింది. |
Chief Minister declares state of emergency after severe flooding. | భారీ వరదల నేపథ్యంలో ముఖ్యమంత్రి అత్యవసర పరిస్థితిని ప్రకటించారు.(spoken English in telugu) |
Actor wins award for outstanding performance. | అత్యద్భుతమైన నటనకు గాను నటుడు అవార్డు గెలుచుకున్నాడు. |
The government imposes new restrictions to combat rising inflation. | ప్రభుత్వం పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కోవడానికి కొత్త పరిమితులను విధించింది. |
Scientists discover new species in the Amazon rainforest. | అమెజాన్ రెయిన్‌ఫారెస్ట్‌లో శాస్త్రవేత్తలు కొత్త జాతులను కనుగొన్నారు. |
University introduces a new scholarship program for underprivileged students. | విశ్వవిద్యాలయం నిరుపేద విద్యార్థుల కోసం కొత్త స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్‌ను పరిచయం చేసింది. |
The local team wins the Championship in the final match. | ఫైనల్ మ్యాచ్‌లో స్థానిక జట్టు ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకుంది. |