Simple Present Passive Voice
| Subject | Active voice | Pasive voice |
| I | Do | am |
| He/She/It | Does | is |
| We/You/They | Do | are |
| Active voice | Passive voice |
| I | me |
| we | us |
| You | you |
| They | Them |
| He | him |
| She | her |
| It | It |
| Ramesh | Ramesh |
| Sunil | Sunil |
హాయ్ Passive voice నేర్చుకోవడానికి పైన కనిపిస్తున్న టేబుల్ చాలా ఇంపార్టెంట్. దానిని నేర్చుకోకుండా మీరు Passive voice నేర్చుకోలేరు.
Object + beform + verb3 + by + subject
Active voice లో ఉన్న ఆబ్జెక్ట్ ని చూడగానే అది Passve voice లో ఏ విధంగా మారుతుందో వెంటనే మీకు ఆలోచన రావాలి
ఆబ్జెక్ట్స్ singular అయితే is వస్తుంది. Plural అయితే are వస్తుంది. I అయితే am వస్తుంది.
క్రింది టేబుల్ లోని ఒకటో ఉదాహరణను ఒకసారి చూడండి
Example : I help him
- Object అయిన Him తో వాక్యాన్ని ప్రారంభించాలి కానీ అది ప్యాసివ్ వాయిస్ లో He గా మారుతుంది.
- He సింగులర్ కాబట్టి is ఉపయోగిస్తాము.
- Help మూడవ రూపం helped
- By = చేత మామూలుగా రాస్తాము
- Subject = I చివరిలో me గా మారుతుంది.
He is helped by me అవుతుంది.
Passive voice లో నెగిటివ్ సెంటెన్స్ రాయడం చాలా సులభం Beform తర్వాత not పెడితే సరిపోతుంది.
Interrogative sentences కి Be form వాక్య ప్రారంభంలో పెడతాము.
క్రింది టేబుల్ లో మొదటి సెంటెన్స్ acitve voice రెండువ సెంటెన్స్ passive voice
| 1. I help him. | 1. నేను అతనికి సహాయం చేస్తాను. |
| He is helped by me. | అతనికి నేను సహాయం చేస్తాను లేదా అతనికి నా చేత సహాయం చేయబడుతుంది |
| 2. I call her. | 2. నేను ఆమెను పిలుస్తాను. |
| She is called by me. | ఆమెను నేను పిలుస్తాను లేదా ఆమె నా చేత పిలువబడుతుంది |
| 3. I use it. | 3. నేను దానిని ఉపయోగిస్తాను. |
| It is used by me. | దానిని నేను ఉపయోగిస్తాను లేదా అది నా చేత ఉపయోగించబడుతుంది |
| 4. I invite you. | 4. నేను మిమ్మల్ని ఆహ్వానిస్తాను |
| You are invited by me. | మిమ్ములను నేను ఆహ్వానిస్తాను లేదా మీరు నా చేత ఆహ్వానించబడుతారు |
| 5. I support them. | 5. నేను వారికి మద్దతు ఇస్తాను |
| They are supported by me. | వారికి నేను మద్దతు ఇస్తాను లేదా వారు నా చేత మద్దతు ఇవ్వబడతారు |
| 6. You teach me. | 6. మీరు నాకు బోధిస్తారు |
| I am taught by you. | నాకు మీరు బోధిస్తారు లేదా నేను మీచేత బోధింపబడతాను. |
| 7. You follow him. | 7. మీరు అతన్ని అనుసరిస్తారు |
| He is followed by you. | అతనిని మీరు అనుసరిస్తారు లేదా అతను మీ చేత అనుసరింపబడతాడు |
| 8. You meet her. | 8. మీరు ఆమెను కలుస్తారు. |
| She is met by you. | ఆమెను మీరు కలుస్తారు లేదా ఆమె మీ చేత కలవపడుతుంది |
| 9. You repair it. | 9. మీరు దాన్ని రిపేర్ చేస్తారు. |
| It is repaired by you. | దానిని మీరు రిపేరు చేస్తారు లేదా అది మీ చేత రిపేరు చేయబడుతుంది |
| 10. You guide them. | 10. మీరు వారికి మార్గనిర్దేశం చేస్తారు. |
| They are guided by you. | వారికి మీరు మార్గ నిర్దేశం చేస్తారు లేదా వారు మీ చేత మార్గ నిర్దేశం చేయబడతారు |
| 11. He respects me. | 11. అతను నన్ను గౌరవిస్తాడు. |
| I am respected by him. | నన్ను అతను గౌరవిస్తాడు లేదా నేను అతని చేత గౌరవింపబడతాను |
| 12. He helps you. | 12. అతను మీకు సహాయం చేస్తాడు. |
| You are helped by him. | మీకు అతను సహాయం చేస్తాడు లేదా మీరు అతని చేత సహాయం చేయబడతారు |
| 13. He calls her. | 13. అతను ఆమెను పిలుస్తాడు. |
| She is called by him. | ఆమెను అతను పిలుస్తాడు లేదా ఆమె అతను చేత పిలువబడుతుంది |
| 14. He uses it. | 14. అతను దానిని ఉపయోగిస్తాడు. |
| It is used by him. | దానిని ఆయన ఉపయోగిస్తారు.లేదా అది ఆయన చేత ఉపయోగించబడుతుంది |
| 15. He informs them. | 15. ఆయన వారికి తెలియజేస్తాడు. |
| They are informed by him. | వారికి ఆయన తెలియజేస్తాడు లేదా వారు అతని చేత తెలియజేయబడతారు |
| 16. She invites me. | 16. ఆమె నన్ను ఆహ్వానిస్తుంది. |
| I am invited by her. | నన్ను ఆమె ఆహ్వానిస్తుంది లేదా ఆమె చేత నేను ఆహ్వానించబడతాను |
| 17. She teaches you. | 17. ఆమె మీకు బోధిస్తుంది. |
| You are taught by her. | మీకు ఆమె బోధిస్తుంది లేదా మీరు ఆమె చేత బోధించబడతారు |
| 18. She likes him. | 18. ఆమె అతన్ని ఇష్టపడుతుంది. |
| He is liked by her. | అతనిని ఆమె ఇష్టపడుతుంది లేదా అతను ఆమె చేత ఇష్టపడ బడతాడు |
| 19. She cleans it. | 19. ఆమె దానిని శుభ్రం చేస్తుంది. |
| It is cleaned by her. | దానిని ఆమె శుభ్రం చేస్తుంది లేదా అది ఆమె చేత శుభ్రం చేయబడుతుంది |
| 20. She warns them. | 20. ఆమె వారిని హెచ్చరిస్తుంది. |
| They are warned by her. | వారిని ఆమె హెచ్చరిస్తుంది లేదా వారు ఆమె చేత హెచ్చరించబడతారు |
| 21. We support you. | 21. మేము మీకు మద్దతు ఇస్తాము |
| You are supported by us. | నీకు మేము మద్దతు ఇస్తాము లేదా నీవు మా చేత మద్దతు చేయబడతావు |
| 22. We help him. | 22. మేము అతనికి సహాయం చేస్తాము. |
| He is helped by us. | అతనికి మేము సహాయం చేస్తాము లేదా అతను మా చేత సహాయం చేయబడతాడు |
| 23. We guide her. | 23. మేము ఆమెకు మార్గనిర్దేశం చేస్తాము. |
| She is guided by us. | ఆమెకు మేము మార్గ నిర్దేశం చేస్తాము లేదా ఆమె మా చేత మార్గ నిర్దేశం చేయబడుతుంది |
| 24. We use it. | 24. మేము దానిని ఉపయోగిస్తాము. |
| It is used by us. | దానిని మేము ఉపయోగిస్తాము లేదా అది మా చేత ఉపయోగించబడుతుంది |
| 25. We inform them. | 25. మేము వారికి తెలియజేస్తాము. |
| They are informed by us. | వారికి మేము తెలియజేస్తాము లేదా వారు మా చేత తెలియజేయబడతారు |
| 26. They invite me. | 26. వారు నన్ను ఆహ్వానిస్తారు. |
| I am invited by them. | నన్ను వారు ఆహ్వానిస్తారు లేదా నేను వారి చేత ఆహ్వానించబడతాను |
| 27. They help you. | 27. వారు మీకు సహాయం చేస్తారు. |
| You are helped by them. | మాకు వారు సహాయం చేస్తారు లేదా మేము వారి చేత సహాయం చేయబడతాము |
| 28. They follow him. | 28. వారు ఆయనను వెంబడిస్తారు |
| He is followed by them. | ఆయనను వారు వెంబడిస్తారు లేదా ఆయన వారి చేత వెంబడించబడతాడు |
| 29. They respect her. | 29. వారు ఆమెను గౌరవిస్తారు. |
| She is respected by them. | ఆమెని వారు గౌరవిస్తారు లేదా ఆమె వారి చేత గౌరవించబడుతుంది |
| 30. They repair it. | 30. వారు దానిని రిపేరు చేస్తారు. |
| It is repaired by them. | దానిని వారు రిపేరు చేస్తారు లేదా అది వారి చేత రిపేరు చేయబడుతుంది |
ఒకవేళ Active voice లో ఆబ్జెక్ట్ స్థానంలో పేరు ఉంటే అది Passive voice లో కూడా పేరు గానే ఉంటుంది.
| I write a letter. | నేను ఒక ఉత్తరం రాస్తాను. |
| A letter is written by me. | ఉత్తరమును నేను రాస్తాను |
| You open the door. | నువ్వు తలుపు తెరుస్తావు |
| The door is opened by you. | తలుపును నీవు తెరుస్తావు |
| We clean the room. | మేము గది శుభ్రం చేస్తాము. |
| The room is cleaned by us. | గదిని మేము శుభ్రం చేస్తాము |
| They play the match. | వాళ్ళు మ్యాచ్ ఆడతారు. |
| The match is played by them. | మ్యాచ్ ని వాళ్లు ఆడుతారు |
| He reads a book. | అతను ఒక పుస్తకం చదువుతాడు. |
| A book is read by him. | పుస్తకమును అతను చదువుతాడు |
| She cooks food. | ఆమె వంట చేస్తుంది. |
| Food is cooked by her. | వంటని ఆమె చేస్తుంది |
| It makes noise. | అది శబ్దం చేస్తుంది. |
| Noise is made by it. | శబ్దమును అది చేస్తుంది |
| Ramesh buys a pen. | రమేష్ పెన్ను కొంటాడు. |
| A pen is bought by Ramesh. | పెన్నుని రమేష్ కొంటాడు |
| Sita sings a song. | సీత ఒక పాట పాడుతుంది. |
| A song is sung by Sita. | పాటని సీత పాడుతుంది. |
| The teacher teaches a lesson. | గురువు పాఠం బోధిస్తాడు. |
| A lesson is taught by the teacher. | పాఠంను గురువు బోధిస్తాడు. |
ఈ క్రింది టేబుల్ లో రెడ్ కలర్ లో ఉన్నదిActive voice
బ్లూ కలర్ లో ఉన్నది passive voice ఆ తరువాత
Passive voice negative,
passive voice interrogative,
passive voice negative interrogative
ప్రతి ప్యాసివ్ వాయిస్ కి రెండు అర్థాలు ఇచ్చాము కానీ మొదటి అర్ధాన్నిఎక్కువగా ఉపయోగిస్తారు.
Table -1
| 1. The dog chases the ball. (AV) | 1. కుక్క బంతిని వెంటాడుతుంది. |
| The ball is chased by the dog. (PV) | బంతిని కుక్క వెంటాడుతుంది లేదా బంతి కుక్క చేత వెంటాడబడుతుంది |
| The ball is not chased by the dog. (PVN) | బంతిని కుక్క వెంటాడదు లేదాబంతి కుక్క చేత వెంటాడబడదు |
| Is the ball chased by the dog? (PVI) | బంతిని కుక్క వెంటాడుతుందా లేదా బంతి కుక్క చేత వెంటాడబడుతుందా? |
| Is the ball not chased by the dog? (PVNI) | బంతిని కుక్క వెంటాడదా లేదా బంతి కుక్క చేత వెంటాడా బడదా? |
| 2. He reads a book. | 2. అతను ఒక పుస్తకాన్ని చదువుతాడు. |
| A book is read by him. | పుస్తకాన్ని అతను చదువుతాడు లేదా పుస్తకం అతని చేత చదవబడుతుంది |
| A book is not read by him. | పుస్తకాన్ని అతను చదవడు లేదా అతని చేత పుస్తకం చదువబడదు |
| Is a book read by him? | పుస్తకాన్ని అతను చదువుతాడా లేదా పుస్తకం అతని చేత చదవబడుతుందా? |
| Is a book not read by him? | పుస్తకాన్ని అతను చదవడా లేదా పుస్తకం అతని చేత చదువబడదా? |
| 3. The chef cooks chicken. | 3. చెఫ్ చికెన్ వండుతారు. (chef =పెద్ద హోటళ్లలో ఉండే వంట మనిషి) |
| Chicken is cooked by the chef. | చికెన్ ను చెఫ్ వండుతారు. లేదా చికెన్ చెఫ్ చేత వండబడుతుంది |
| Pasta is not cooked by the Chicken. | చికెన్ ను చెఫ్ వండరు.లేదా చికెన్ చెఫ్ చేత వండబడదు |
| Is pasta cooked by the Chicken? | చికెన్ ను పాస్తా వండుతాడా? లేదా చికెన్ పాస్తా చేత వండబడుతుందా? |
| Is pasta not cooked by the Chicken? | చికెన్ ను పాస్తా వండడా? లేదా చికెన్ పాస్తా చేత వండబడదా |
| 4. She opens the door. | 4. ఆమె తలుపు తెరుస్తుంది. |
| The door is opened by her. | తలుపును ఆమె తెరుస్తుంది లేదా తలుపు ఆమె చేత తెరవబడుతుంది. |
| The door is not opened by her. | తలుపును ఆమె తెరువుదు లేదా తలుపు ఆమె చేత తెరవబడదు. |
| Is the door opened by her? | తలుపును ఆమె తెరుస్తుందా లేదా తలుపు ఆమె చేత తెలవబడుతుందా |
| Is the door not opened by her? | తలుపును ఆమె తెరువదా లేదా తలుపు ఆమె చేత తెరవబడదా? |
| 5. They sell fresh fruits. | 5. వారు తాజా పండ్లను విక్రయిస్తారు. |
| Fresh fruits are sold by them. | తాజా పండ్లను వారు విక్రయిస్తారు లేదా తాజా పండ్లు వారి చేత విక్రయించబడతాయి |
| Fresh fruits are not sold by them. | తాజా పండ్లను వారు అమ్మరు.లేదా తాజా పండ్లు వారి చేత అమ్మబడవు |
| Are fresh fruits sold by them? | తాజా పండ్లను వారు విక్రయిస్తారా లేదా వారి చేత తాజా పండ్లు విక్రయించబడవా? |
| Are fresh fruits not sold by them? | తాజా పండ్లను వారు విక్రయించరా లేదా తాజా పండ్లు వారిచేత విక్రయించబడవా? |
| 6. The farmer plants seeds. | 6. రైతు విత్తనాలు వేస్తాడు. |
| Seeds are planted by the farmer. | విత్తనాలను రైతులు వేస్తారు లేదా విత్తనాలు రైతులు చేత వేయబడతాయి |
| Seeds are not planted by the farmer. | విత్తనాలను రైతులు వేయరు లేదా విత్తనాలు రైతుల చేత వేయబడవు |
| Are seeds planted by the farmer? | విత్తనాలను రైతులు వేస్తారా లేదా విత్తనాలు రైతులు చేత వేయబడవా? |
| Are seeds not planted by the farmer? | విత్తనాలను రైతులు వేయరా లేదా విత్తనాలు రైతులు చేత వెయ్యబడవా? |
| 7. He cleans the room. | 7. అతను గదిని శుభ్రం చేస్తాడు. |
| The room is cleaned by him. | గదిని అతను శుభ్రం చేస్తాడు లేదా గది అతను చేత శుభ్రం చేయబడుతుంది |
| The room is not cleaned by him. | గదిని అతను శుభ్రం చేయడు లేదా గది అతని చేత శుభ్రం చేయబడదు |
| Is the room cleaned by him? | గదిని అతను శుభ్రం చేస్తాడా? లేదా అతని చేత గది శుభ్రం చేయబడుతుందా? |
| Is the room not cleaned by him? | గదిని అతను శుభ్రం చేయడా? లేదా అతని చేత గది శుభ్రం చేయబడదా? |
| 8. The boy draws a picture. | 8. బాలుడు ఒక చిత్రాన్ని గీస్తాడు. |
| A picture is drawn by the boy. | చిత్రాన్ని బాలుడు గీస్తాడు లేదా చిత్రం బాలుడు చేత గీయబడుతుంది. |
| A picture is not drawn by the boy. | చిత్రాన్ని బాలుడు గీయడు లేదా చిత్రం బాలుడు చేత గీయబడదు. |
| Is a picture drawn by the boy? | చిత్రాన్ని బాలుడు గీస్తాడా? లేదా చిత్రం బాలుడు చేత గీయబడుతుదా? |
| Is a picture not drawn by the boy? | చిత్రాన్ని బాలుడు గీయడా? లేదా చిత్రం బాలుడు చేత గీయబడదా? |
| 9. She buys new clothes. | 9. ఆమె కొత్త బట్టలు కొంటుంది. |
| New clothes are bought by her. | కొత్త బట్టలను ఆమె కొంటుంది లేదా క్రొత్త బట్టలు ఆమె చేత కొనబడుతాయి |
| New clothes are not bought by her. | కొత్త బట్టలను ఆమె కొనదు లేదా క్రొత్త బట్టలు ఆమె చేత కొనబడవు |
| Are new clothes bought by her? | కొత్త బట్టలను ఆమె కొంటుందా? లేదా క్రొత్త బట్టలు ఆమె చేత కొనబడుతాయా? |
| Are new clothes not bought by her? | కొత్త బట్టలను ఆమె కొనదా లేదా క్రొత్త బట్టలు ఆమె చేత కొనబడవా? |
| 10. The team wins the match. | 10. జట్టు మ్యాచ్ గెలుస్తుంది. |
| The match is won by the team. | మ్యాచ్ ని జట్టు గెలుస్తుంది లేదా మ్యాచ్ జట్టు చేత గెలవబడుతుంది |
| The match is not won by the team. | మ్యాచ్ ని జట్టు గెలవదు లేదా మ్యాచ్ జట్టు చేత గెలవబడదు |
| Is the match won by the team? | మ్యాచ్ ని జట్టు గెలుస్తుందా? లేదా మ్యాచ్ జట్టు చేత గెలవబడుతుందా? |
| Is the match not won by the team? | మ్యాచ్ ని జట్టు గెలవదా లేదా మ్యాచ్ జట్టు చేత గెలవబడదా? |
| 11. It lays eggs. | 11. ఇది గుడ్లు పెడుతుంది. |
| Eggs are laid by it. | గుడ్లను ఇది పెడుతుంది లేదా గుడ్లు దీని చేత పెట్టబడతాయి |
| Eggs are not laid by it. | గుడ్లను ఇది పెట్టదు లేదా గుడ్లు దీని చేత పెట్టబడవు |
| Are eggs laid by it? | గుడ్లను ఇది పెడుతుందా లేదా గుడ్లు దీని చేత పెట్టబడతాయా? |
| Are eggs not laid by it? | గుడ్లను ఇది పెట్టదా లేదా గుడ్లు దీని చేత పెట్టబడవా? |
| 12. I read novels. | 12. నేను నవలలు చదువుతాను. |
| Novels are read by me. | నవలలను నేను చదువుతాను లేదా నవలులు నా చేత చదవబడతాయి |
| Novels are not read by me. | నవలలను నేను చదవను లేదా నవలులు నా చేత చదవబడవు |
| Are novels read by me? | నవలలను నేను చదువుతానా? లేదా నవలులు నా చేత చదవబడతాయా? |
| Are novels not read by me? | నవలలను నేను చదువనా లేదా నవలులు నా చేత చదవబడవా? |
| 13. We watch movies. | 13. మేము సినిమాలు చూస్తాము. |
| Movies are watched by us. | సినిమాలను మేము చూస్తాము లేదా సినిమాలు మా చేత చూడబడతాయి. |
| Movies are not watched by us. | సినిమాలను మేము చూడము లేదా సినిమాలు మా చేత చూడబడవు. |
| Are movies watched by us? | సినిమాలను మేము చూస్తామా లేదా సినిమాలు మా చేత చూడబడతాయ.? |
| Are movies not watched by us? | సినిమాలను మేము చూడమా లేదా సినిమాలు మా చేత చూడబడవా.? |
| 14. You drive cars. | 14. మీరు కార్లు నడుపుతారు. లేదా నీవు కార్లు నడుపుతావు. |
| Cars are driven by you. | కార్లను మీరు నడుపుతారు లేదా కార్లు మీ చేత నడపబడుతాయి |
| Cars are not driven by you. | కార్లను మీరు నడుపరు లేదా కార్లు మీ చేత నడపబడవు |
| Are cars driven by you? | కార్లను మీరు నడుపుతార? లేదా కార్లు మీ చేత నడపబడుతాయ? |
| Are cars not driven by you? | కార్లను మీరు నడుపరా లేదా కార్లు మీ చేత నడపబడవా? |
| ఈ క్రింది టేబుల్ లో ‘by’ ఉపయోగించకుండా ప్యాసివ్ వాయిస్ ని ఇచ్చాము. |
1.General truths and facts
కొన్ని విషయాలు. ఎల్లప్పుడూ సత్యాలు గానే ఉంటాయి వాటిని మార్చలేము అటువంటి వాటిని ఈ Simple Present tense లో తెలియజేస్తారు. ప్రపంచంలోనే ప్రజలందరూ వాటిని నిజాలుగానే అంగీకరిస్తారు.వీటిని పాసి వాయిస్ లో ఏ విధంగా చెబుతారో తెలుసుకుందాం
క్రింది సెంటెన్స్ లో మొదటిది
1.Passive voice
2.passive voice negative
3.passive voice interrogative
4.passive voice negative interrogative
| 1. Water is boiled at 100 degrees Celsius. | నీటిని 100 డిగ్రీల సెల్సియస్ వద్ద వేడి చేస్తారు .or నీరు 100 డిగ్రీలు సెల్సియస్ వద్ద వేడి చేయబడుతుంది |
| Water is not boiled at 100 degrees Celsius. | నీటిని 100 డిగ్రీల సెల్సియస్ వద్ద వేడి చేయరు or నీరు 100 డిగ్రీలు సెల్సియస్ వద్ద వేడి చేయబడదు |
| Is water boiled at 100 degrees Celsius? | నీటిని 100 డిగ్రీల సెల్సియస్ వద్ద వేడి చేస్తారా? Or నీరు 100 డిగ్రీలు సెల్సియస్ వద్ద వేడి చేయబడుతుందా? |
| Is water not boiled at 100 degrees Celsius? | నీటిని 100 డిగ్రీల సెల్సియస్ వద్ద వేడి చేయరా? Or నీరు 100 డిగ్రీలు సెల్సియస్ వద్ద వేడి చేయరా? |
| 2.The sun is seen during the day. | సూర్యుడిని పగటిపూట చూస్తారు (or) సూర్యుడు పగటి పూట చూడబడతాడు |
| The sun is not seen during the day. | సూర్యుడిని పగటిపూట చూడరు or సూర్యుడు పగటి పూట చూడబడడు |
| Is the sun seen during the day? | సూర్యుడిని పగటిపూట చూస్తారా? Or సూర్యుడు పగటి పూట చూడబడతాడా? |
| Is the sun not seen during the day? | సూర్యుడిని పగటిపూట చూడరా? Or సూర్యుడు పగటి పూట చూడబడడా? |
| 3 .Stars are observed in the night sky. | నక్షత్రాలను రాత్రి ఆకాశంలో గమనిస్తారు (or ) రాత్రి ఆకాశంలో నక్షత్రాలు గమనించబడతాయి. |
| Stars are not observed in the night sky. | నక్షత్రాలను రాత్రి ఆకాశంలో గమనించరు |
| Are stars observed in the night sky? | నక్షత్రాలను రాత్రి ఆకాశంలో గమనిస్తారా ? |
| Are stars not observed in the night sky? | నక్షత్రాలను రాత్రి ఆకాశంలో గమనించరా ? |
| 4 .Plastic is recycled in many countries. | ప్లాస్టిక్ ను అనేక దేశాల్లో పునర్వినియోగిస్తారు (or)అనేక దేశాల్లో ప్లాస్టిక్ పునర్వినియోగం చేయబడుతోంది. |
| Plastic is not recycled in many countries. | ప్లాస్టిక్ ను అనేక దేశాల్లో పునర్వినియోగం చేయరు |
| Is plastic recycled in many countries? | ప్లాస్టిక్ ను అనేక దేశాల్లో పునర్వినియోగం చేస్తారా? |
| Is plastic not recycled in many countries? | ప్లాస్టిక్ ను అనేక దేశాల్లో పునర్వినియోగం చేయరా? |
| 5 .Rice is cultivated in many parts of the world. | వరిని ప్రపంచంలోని అనేక ప్రాంతాలలో సాగు చేస్తున్నారు |
| Rice is not cultivated in many parts of the world. | వరిని ప్రపంచంలోని అనేక ప్రాంతాలలో సాగు చేయరు |
| Is rice cultivated in many parts of the world? | వరిని ప్రపంచంలోని అనేక ప్రాంతాలలో సాగు చేస్తున్నారా? |
| Is rice not cultivated in many parts of the world? | వరిని ప్రపంచంలోని అనేక ప్రాంతాలలో సాగు చేయరా? |
| 6 .Electricity is generated using various methods. | కరెంటును వివిధ పద్ధతులను ఉపయోగించి ఉత్పత్తి చేస్తారు |
| Electricity is not generated using various methods. | కరెంటును వివిధ పద్ధతులను ఉపయోగించి ఉత్పత్తి చేయరు |
| Is electricity generated using various methods? | కరెంటును వివిధ పద్ధతులను ఉపయోగించి ఉత్పత్తి చేస్తారా? |
| Is electricity not generated using various methods? | కరెంటును వివిధ పద్ధతులను ఉపయోగించి ఉత్పత్తి చేయరా? |
2.Habitual actions.
క్రమం తప్పకుండా లేదా పదే పదే అలవాటుగాజరిగే కార్యకలాపాలు లేదా చర్యలు. వీటిని ప్యాసివ్ వాయిస్ లో ఏ విధంగా చెబుతారో గమనించండి.
| 1.Breakfast is served at 7 a.m. every day. | అల్పాహారమును ప్రతిరోజు ఉదయం ఏడు గంటలకు వడ్డిస్తారు. |
| Breakfast is not served at 7 a.m. every day. | అల్పాహారమును ప్రతిరోజు ఉదయం ఏడు గంటలకు వడ్డించరు |
| Is breakfast served at 7 a.m. every day? | అల్పాహారమును ప్రతిరోజు ఉదయం ఏడు గంటలకు వడ్డిస్తారా? |
| Is breakfast not served at 7 a.m. every day? | అల్పాహారమును ప్రతిరోజు ఉదయం ఏడు గంటలకు వడ్డించరా? |
| 2 .Letters are delivered to the office daily. | ఉత్తరాలను ప్రతిరోజు కార్యాలయానికి డెలివరీ చేస్తారు |
| Letters are not delivered to the office daily. | ఉత్తరాలను ప్రతిరోజు కార్యాలయానికి డెలివరీ చేయరు |
| Are letters delivered to the office daily? | ఉత్తరాలను ప్రతిరోజు కార్యాలయానికి డెలివరీ చేస్తారా? |
| Are letters not delivered to the office daily? | ఉత్తరాలను ప్రతిరోజు కార్యాలయానికి డెలివరీ చేయరా? |
| 3 .The garden is watered every evening. | తోటను ప్రతి సాయంత్రం నీటితో తడుపుతారు |
| The garden is not watered every evening. | తోటను ప్రతి సాయంత్రం నీటితో తడపరు |
| Is the garden watered every evening? | తోటను ప్రతి సాయంత్రం నీటితో తడుపుతారా? |
| Is the garden not watered every evening? | తోటను ప్రతి సాయంత్రం నీటితో తడపరా? |
| 4 .The trash is taken out every night. | చెత్తను ప్రతి రాత్రి బయటకు తీస్తారు |
| The trash is not taken out every night. | చెత్తను ప్రతి రాత్రి బయటకు తీయరు. |
| Is the trash taken out every night? | చెత్తను ప్రతి రాత్రి బయటకు తీస్తారా? |
| Is the trash not taken out every night? | చెత్తను ప్రతి రాత్రి బయటకు తీయరా? |
| 5 .Newspapers are distributed early in the morning. | వార్తాపత్రికలను ఉదయాన్నే పంపిణీ చేస్తారు. |
| Newspapers are not distributed early in the morning. | వార్తాపత్రికలను ఉదయాన్నే పంపిణీ చేయరు. |
| Are newspapers distributed early in the morning? | వార్తాపత్రికలను ఉదయాన్నే పంపిణీ చేస్తారా.? |
| Are newspapers not distributed early in the morning? | వార్తాపత్రికలను ఉదయాన్నే పంపిణీ చేయరా.? |
| 6 .Meals are cooked three times a day in most homes. | భోజనమును చాలా ఇళ్లలో రోజుకు మూడుసార్లు వండుతారు |
| Meals are not cooked three times a day in most homes. | భోజనమును చాలా ఇళ్లలో రోజుకు మూడుసార్లు వండరు |
| Are meals cooked three times a day in most homes? | భోజనమును చాలా ఇళ్లలో రోజుకు మూడుసార్లు వండుతారా? |
| Are meals not cooked three times a day in most homes? | భోజనమును చాలా ఇళ్లలో రోజుకు మూడుసార్లు వండరా? |
| 7 .Attendance is marked at the start of every class. | హాజరును ప్రతి తరగతి ప్రారంభంలో గుర్తిస్తారు |
| Attendance is not marked at the start of every class. | హాజరును ప్రతి తరగతి ప్రారంభంలో గుర్తించరు |
| Is attendance marked at the start of every class? | హాజరును ప్రతి తరగతి ప్రారంభంలో గుర్తిస్తారా? |
| Is attendance not marked at the start of every class? | హాజరును ప్రతి తరగతి ప్రారంభంలో గుర్తించరా? |
| 8.The gates are locked at 10 p.m. every night. | గేట్లను ప్రతి రాత్రి 10 గంటలకు లాక్ చేస్తారు |
| The gates are not locked at 10 p.m. every night. | గేట్లను ప్రతి రాత్రి 10 గంటలకు లాక్ చేయరు |
| Are the gates locked at 10 p.m. every night? | గేట్లను ప్రతి రాత్రి 10 గంటలకు లాక్ చేస్తారా? |
| Are the gates not locked at 10 p.m. every night? | గేట్లను ప్రతి రాత్రి 10 గంటలకు లాక్ చేయరా? |
పైన కనిపిస్తున్న Interrogative, and negative interrogative Sentences ముందు క్రింద కనిపిస్తున్న ప్రశ్న పదాలను ఉంచినట్లయితే అవి ఆటోమేటిక్గా wh questions మరియు wh negatives గా మారిపోతాయి
why,where,when,how లతో ప్రశ్న వాక్యాలు
| why are the gates locked at 10 p.m. every night? | ఎందుకు గేట్లను ప్రతి రాత్రి 10 గంటలకు లాక్ చేస్తారు ? |
| where are the gates locked at 10 p.m. every night? | ఎక్కడ గేట్లను ప్రతి రాత్రి 10 గంటలకు లాక్ చేస్తారు ? |
| when are the gates locked at 10 p.m. every night? | ఎప్పుడు గేట్లను ప్రతి రాత్రి 10 గంటలకు లాక్ చేస్తారు ? |
| how are the gates locked at 10 p.m. every night? | ఎలా గేట్లను ప్రతి రాత్రి 10 గంటలకు లాక్ చేస్తారు ? |
| Wh questions Negative | |
| why are the gates not locked at 10 p.m. every night? | ఎందుకు గేట్లను ప్రతి రాత్రి 10 గంటలకు లాక్ చేయరు ? |
| where are the gates not locked at 10 p.m. every night? | ఎక్కడ గేట్లను ప్రతి రాత్రి 10 గంటలకు లాక్ చేయరు ? |
| when are the gates not locked at 10 p.m. every night? | ఎప్పుడు గేట్లను ప్రతి రాత్రి 10 గంటలకు లాక్ చేయరు ? |
| How are the gates not locked at 10 p.m. every night? | ఎలా గేట్లను ప్రతి రాత్రి 10 గంటలకు లాక్ చేయరు ? |
