Simple Present (PV)

Subject Active voice Pasive voice
I Do me
He/She/It Does is
We/You/They Do are

 

1.పై పట్టికను గమనిస్తే  సబ్జెక్టు “ I “ కి  యాక్టివ్ వాయిస్ లో Do ఉంటే అది ప్యాసివ్ వాయిస్ లో “me” గా మారుతుంది.

2.సింగులర్ సబ్జెక్టులు అయిన  He/She/It లకు యాక్టివ్ వాయిస్ లో Does ఉంటుంది అది ప్యాసివ్ వాయిస్ లో “is”  గా మారుతుంది

3.ప్లూరల్ సబ్జెక్టులు అయిన We/You/They లకు యాక్టివ్ వాయిస్ లో Do ఉంటుంది. అది ప్యాసివ్ వాయిస్ లో are గా మారుతుంది.

 Example:1

1.I read books every day.(నేను ప్రతిరోజు పుస్తకాలు చదువుతాను)

Subject = I, Verb= read , Object= books

1.పై వాక్యం సబ్జెక్టుతో ప్రారంభమైంది కాబట్టి ఇది యాక్టివ్ వాయిస్ లో ఉంది. దీనిని ప్యాసివ్ వాయిస్ కి మార్చుటకు ఆబ్జెక్టు   అయిన Books తో వాక్యాన్ని ప్రారంభించాలి. 

2.తరువాత books  ప్లూరల్ కాబట్టి are సహాయక్రియను ఉపయోగించాలి. (ఒకవేళ object సింగులర్ అయితే is వస్తుంది)

3.Read అనే verb  యొక్క మూడో రూపం Read ఉపయోగించాలి.

read – read – read – reading

4.తర్వాత by ఉపయోగించాలి.

5.యాక్టివ్ వాయిస్ లో ఉన్న సబ్జెక్టు “ I” ఇక్కడ me గా మారుతుంది.

పైన ఉన్న ఐదు  పాయింట్స్ ప్రకారం యాక్టివ్ వాయిస్ ని పాసివ్ వాయిస్ లో క్రింది విధంగా రాయవచ్చు

 

Books are read by me every day.  (పుస్తకాలను నేను ప్రతిరోజు చదువుతాను)

ప్యాసివ్ వాయిస్ లో వ్యతిరేక వాక్యాలు రాయడం చాలా సులభం.  సహాయక్రియ are పక్కనే not  చేరిస్తే అది వ్యతిరేక వాక్యంగా మార్చబడుతుంది

Books are not read by me every day.(పుస్తకాలను నేను ప్రతిరోజు చదవను)

పై రెండు వాక్యాలను ప్రశ్న వాక్యాలు గా మార్చుటకు సహాయ క్రియ are ను object అయిన books  కి ముందు ఉంచితే సరిపోతుంది.

 

Are books read by me every day? ( పుస్తకాలను నేను ప్రతిరోజు చదువుతానా?)

Are books not read by me every day? ( పుస్తకాలను నేను ప్రతిరోజు చదవనా ?)

 

Example:2

We help our friend  at school. (మేము మా స్నేహితుడికి స్కూల్లో సహాయం చేస్తాము)

Subject = We, Verb= Help , Object= Friend

1.పై వాక్యం సబ్జెక్టుతో ప్రారంభమైంది కాబట్టి ఇది యాక్టివ్ వాయిస్ లో ఉంది. దీనిని ప్యాసివ్ వాయిస్ లో మార్చుటకు ఆబ్జెక్టు   అయిన Friend తో వాక్యాన్ని ప్రారంభించాలి

2.తరువాత friend సింగులర్  కాబట్టి is సహాయక్రియను ఉపయోగించాలి.

3.Help అనే verb  యొక్క మూడో రూపం Helped ఉపయోగించాలి.

Help – Helped – Helped – Helping

4.తర్వాత by ఉపయోగించాలి.

5.యాక్టివ్ వాయిస్ లో ఉన్న సబ్జెక్టు “ We” ఇక్కడ  us  గా మారుతుంది.

పైన ఉన్న ఐదు  పాయింట్స్ ప్రకారం యాక్టివ్ వాయిస్ ని పాసివ్ వాయిస్ లో క్రింది విధంగా రాయవచ్చు

Our friend is helped by us at school.  (మా స్నేహితుడికి మేము స్కూల్లో సహాయము చేస్తాము లేక స్కూల్లో మా స్నేహితుడికి మా చేత సహాయం చేయబడుతుంది)

ప్యాసివ్ వాయిస్ లో ప్రతి టెన్స్ లో కూడా వ్యతిరేక వాక్యాలు రాయడం చాలా సులభం.వాక్యంలో ఉన్న beform  పక్కనే not  చేరిస్తే అది వ్యతిరేక వాక్యంగా మార్చబడుతుంది.

సహాయక్రియ is  పక్కనే not  చేరిస్తే అది వ్యతిరేక వాక్యంగా మార్చబడుతుంది. 

Our friend is not  helped by us at school  (మా స్నేహితుడికి మేము స్కూల్లో సహాయము చేస్తాము)

పై రెండు వాక్యాలను ప్రశ్న వాక్యాలు గా మార్చుటకు సహాయ క్రియ is  ను object అయిన friend   కి ముందు ఉంచితే సరిపోతుంది.

Is our friend helped by us at school? ( మా స్నేహితుడికి మేము స్కూల్లో సహాయము చేస్తామా? )

Is our friend not helped by us at school? ( మా స్నేహితుడికి మేము స్కూల్లో సహాయము చేయమా?)

 

ఈ క్రింది టేబుల్ లో రెడ్ కలర్ లో ఉన్నదిActive voice

బ్లూ కలర్ లో ఉన్నది  passive voice ఆ తరువాత

Passive voice negative,

passive voice interrogative,

passive voice negative interrogative

ప్రతి ప్యాసివ్ వాయిస్ కి రెండు అర్థాలు ఇచ్చాము  కానీ మొదటి అర్ధాన్నిఎక్కువగా ఉపయోగిస్తారు. నిన్న, ఈరోజు, రేపు ప్రతిరోజు జరిగే చర్యలు లేదా పనులను మాత్రమే సింపుల్ ప్రెసెంట్ టెన్స్ లో తెలియజేస్తారని గతంలో మనం తెలుసుకున్నాము.  ఇప్పుడు సింపుల్ ప్రెసెంట్ టెన్స్ పాసివ్ వాయిస్ గురించి తెలుసుకుందాం.

 

Table -1

1. The dog chases the ball. (AV) 1. కుక్క బంతిని వెంటాడుతుంది.
The ball is chased by the dog. (PV) బంతిని కుక్క వెంటాడుతుంది లేదా బంతి కుక్క చేత వెంటాడబడుతుంది (మొదటి అర్థమే సహజంగా ఉపయోగిస్తారు) 
The ball is not chased by the dog. (PVN) బంతిని కుక్క వెంటాడదు లేదాబంతి కుక్క చేత వెంటాడబడదు
Is the ball chased by the dog? (PVI) బంతిని కుక్క వెంటాడుతుందా లేదా బంతి కుక్క చేత  వెంటాడబడుతుందా?
Is the ball not chased by the dog? (PVNI) బంతిని కుక్క వెంటాడదా లేదా బంతి కుక్క చేత వెంటాడా బడదా?
2. He reads a book. 2. అతను ఒక పుస్తకాన్ని చదువుతాడు.
A book is read by him. పుస్తకాన్ని అతను చదువుతాడు లేదా పుస్తకం అతని చేత చదవబడుతుంది
A book is not read by him. పుస్తకాన్ని అతను చదవడు లేదా అతని చేత పుస్తకం చదువబడదు
Is a book read by him? పుస్తకాన్ని అతను చదువుతాడా లేదా పుస్తకం అతని చేత చదవబడుతుందా?
Is a book not read by him? పుస్తకాన్ని అతను చదవడా లేదా పుస్తకం అతని చేత చదువబడదా?
3. The chef cooks chicken. 3. చెఫ్ చికెన్ వండుతారు. (chef =పెద్ద హోటళ్లలో ఉండే వంట మనిషి)
Chicken is cooked by the chef. చికెన్ ను చెఫ్ వండుతారు. లేదా  చికెన్ చెఫ్ చేత వండబడుతుంది
Pasta is not cooked by the Chicken.  చికెన్ ను చెఫ్ వండరు.లేదా  చికెన్ చెఫ్ చేత వండబడదు
Is pasta cooked by the Chicken? చికెన్ ను  పాస్తా వండుతాడా? లేదా చికెన్ పాస్తా చేత వండబడుతుందా?
Is pasta not cooked by the Chicken? చికెన్ ను పాస్తా వండడా? లేదా చికెన్ పాస్తా చేత వండబడదా
4. She opens the door. 4. ఆమె తలుపు తెరుస్తుంది.
The door is opened by her. తలుపును ఆమె తెరుస్తుంది లేదా తలుపు ఆమె  చేత తెరవబడుతుంది.
The door is not opened by her. తలుపును ఆమె తెరువుదు లేదా తలుపు ఆమె చేత తెరవబడదు.
Is the door opened by her? తలుపును ఆమె  తెరుస్తుందా లేదా తలుపు ఆమె చేత తెలవబడుతుందా
Is the door not opened by her? తలుపును ఆమె తెరువదా లేదా తలుపు ఆమె చేత తెరవబడదా?
5. They sell fresh fruits. 5. వారు తాజా పండ్లను విక్రయిస్తారు.
Fresh fruits are sold by them. తాజా పండ్లను  వారు విక్రయిస్తారు లేదా తాజా  పండ్లు వారి చేత విక్రయించబడతాయి
Fresh fruits are not sold by them. తాజా పండ్లను వారు అమ్మరు.లేదా తాజా పండ్లు వారి చేత అమ్మబడవు
Are fresh fruits sold by them? తాజా పండ్లను వారు విక్రయిస్తారా లేదా వారి చేత తాజా పండ్లు విక్రయించబడవా?
Are fresh fruits not sold by them? తాజా పండ్లను వారు విక్రయించరా లేదా తాజా  పండ్లు  వారిచేత విక్రయించబడవా?
6. The farmer plants seeds. 6. రైతు విత్తనాలు వేస్తాడు.
Seeds are planted by the farmer. విత్తనాలను రైతులు వేస్తారు లేదా విత్తనాలు రైతులు చేత వేయబడతాయి
Seeds are not planted by the farmer. విత్తనాలను రైతులు వేయరు లేదా విత్తనాలు రైతుల చేత వేయబడవు
Are seeds planted by the farmer? విత్తనాలను రైతులు వేస్తారా లేదా విత్తనాలు రైతులు చేత వేయబడవా?
Are seeds not planted by the farmer? విత్తనాలను రైతులు వేయరా లేదా విత్తనాలు రైతులు చేత వెయ్యబడవా?
7. He cleans the room. 7. అతను గదిని శుభ్రం చేస్తాడు.
The room is cleaned by him. గదిని అతను శుభ్రం చేస్తాడు లేదా గది అతను చేత శుభ్రం చేయబడుతుంది
The room is not cleaned by him.  గదిని అతను శుభ్రం చేయడు లేదా గది అతని చేత శుభ్రం చేయబడదు
Is the room cleaned by him? గదిని అతను శుభ్రం చేస్తాడా? లేదా అతని చేత గది శుభ్రం చేయబడుతుందా?
Is the room not cleaned by him? గదిని అతను శుభ్రం చేయడా? లేదా అతని చేత గది శుభ్రం చేయబడదా?
8. The boy draws a picture. 8. బాలుడు ఒక చిత్రాన్ని గీస్తాడు.
A picture is drawn by the boy. చిత్రాన్ని బాలుడు గీస్తాడు లేదా చిత్రం బాలుడు చేత గీయబడుతుంది.
A picture is not drawn by the boy. చిత్రాన్ని బాలుడు గీయడు  లేదా చిత్రం బాలుడు చేత గీయబడదు.
Is a picture drawn by the boy? చిత్రాన్ని బాలుడు గీస్తాడా? లేదా చిత్రం బాలుడు చేత గీయబడుతుదా?
Is a picture not drawn by the boy? చిత్రాన్ని బాలుడు గీయడా? లేదా చిత్రం బాలుడు చేత గీయబడదా?
9. She buys new clothes. 9. ఆమె కొత్త బట్టలు కొంటుంది.
New clothes are bought by her. కొత్త బట్టలను ఆమె కొంటుంది లేదా క్రొత్త బట్టలు ఆమె చేత కొనబడుతాయి
New clothes are not bought by her. కొత్త బట్టలను ఆమె కొనదు లేదా క్రొత్త బట్టలు ఆమె చేత కొనబడవు
Are new clothes bought by her? కొత్త బట్టలను ఆమె కొంటుందా? లేదా క్రొత్త బట్టలు ఆమె చేత కొనబడుతాయా?
Are new clothes not bought by her? కొత్త బట్టలను ఆమె కొనదా  లేదా క్రొత్త బట్టలు ఆమె చేత కొనబడవా?
10. The team wins the match. 10. జట్టు మ్యాచ్ గెలుస్తుంది.
The match is won by the team. మ్యాచ్ ని జట్టు గెలుస్తుంది లేదా మ్యాచ్ జట్టు చేత గెలవబడుతుంది
The match is not won by the team. మ్యాచ్ ని జట్టు గెలవదు లేదా మ్యాచ్ జట్టు చేత గెలవబడదు
Is the match won by the team? మ్యాచ్ ని జట్టు గెలుస్తుందా? లేదా మ్యాచ్ జట్టు చేత గెలవబడుతుందా?
Is the match not won by the team? మ్యాచ్ ని జట్టు గెలవదా  లేదా మ్యాచ్ జట్టు చేత  గెలవబడదా?
11. It lays eggs. 11. ఇది గుడ్లు పెడుతుంది.
Eggs are laid by it. గుడ్లను ఇది పెడుతుంది లేదా గుడ్లు దీని చేత పెట్టబడతాయి
Eggs are not laid by it. గుడ్లను ఇది పెట్టదు లేదా గుడ్లు దీని చేత పెట్టబడవు
Are eggs laid by it? గుడ్లను ఇది పెడుతుందా లేదా గుడ్లు దీని చేత పెట్టబడతాయా?
Are eggs not laid by it? గుడ్లను ఇది పెట్టదా లేదా గుడ్లు దీని చేత పెట్టబడవా?
12. I read novels. 12. నేను నవలలు చదువుతాను.
Novels are read by me. నవలలను నేను చదువుతాను లేదా నవలులు నా చేత చదవబడతాయి
Novels are not read by me. నవలలను నేను చదవను లేదా నవలులు నా చేత చదవబడవు
Are novels read by me? నవలలను నేను చదువుతానా? లేదా నవలులు నా చేత చదవబడతాయా?
Are novels not read by me? నవలలను నేను చదువనా లేదా నవలులు నా చేత చదవబడవా?
13. We watch movies. 13. మేము సినిమాలు చూస్తాము.
Movies are watched by us. సినిమాలను మేము చూస్తాము లేదా సినిమాలు మా చేత చూడబడతాయి.
Movies are not watched by us. సినిమాలను మేము చూడము లేదా సినిమాలు మా చేత చూడబడవు.
Are movies watched by us? సినిమాలను మేము చూస్తామా లేదా సినిమాలు మా చేత చూడబడతాయ.?
Are movies not watched by us? సినిమాలను మేము చూడమా లేదా సినిమాలు మా చేత చూడబడవా.?
14. You drive cars. 14. మీరు కార్లు నడుపుతారు. లేదా నీవు  కార్లు నడుపుతావు.
Cars are driven by you. కార్లను మీరు నడుపుతారు లేదా కార్లు మీ చేత నడపబడుతాయి
Cars are not driven by you. కార్లను మీరు నడుపరు లేదా కార్లు మీ చేత నడపబడవు
Are cars driven by you? కార్లను మీరు నడుపుతార? లేదా కార్లు మీ చేత నడపబడుతాయ?
Are cars not driven by you? కార్లను మీరు నడుపరా లేదా కార్లు మీ చేత నడపబడవా?

 

ఈ క్రింది టేబుల్ లో ‘by’ ఉపయోగించకుండా ప్యాసివ్ వాయిస్ ని ఇచ్చాము. మీరు కావాలి అనుకుంటే by అనే పదాన్ని ఉపయోగించి మీకు ఇష్టమైన సబ్జెక్టుని మనసులో అనుకోండి

 

1.General truths and facts

కొన్ని విషయాలు. ఎల్లప్పుడూ సత్యాలు గానే ఉంటాయి వాటిని మార్చలేము అటువంటి వాటిని ఈ Simple Present tense లో తెలియజేస్తారు. ప్రపంచంలోనే ప్రజలందరూ వాటిని నిజాలుగానే అంగీకరిస్తారు.వీటిని పాసి వాయిస్ లో ఏ విధంగా చెబుతారో  తెలుసుకుందాం

క్రింది సెంటెన్స్ లో  మొదటిది

1.Passive voice

2.passive voice negative

3.passive voice interrogative

4.passive voice negative interrogative

1. Water is boiled at 100 degrees Celsius. నీటిని  100 డిగ్రీల సెల్సియస్ వద్ద వేడి చేస్తారు .or నీరు 100 డిగ్రీలు సెల్సియస్ వద్ద వేడి చేయబడుతుంది
Water is not boiled at 100 degrees Celsius. నీటిని 100 డిగ్రీల సెల్సియస్ వద్ద  వేడి చేయరు or నీరు 100 డిగ్రీలు సెల్సియస్ వద్ద వేడి చేయబడదు
Is water boiled at 100 degrees Celsius? నీటిని 100 డిగ్రీల సెల్సియస్ వద్ద  వేడి చేస్తారా?  Or నీరు 100 డిగ్రీలు సెల్సియస్ వద్ద వేడి చేయబడుతుందా?
Is water not boiled at 100 degrees Celsius? నీటిని 100 డిగ్రీల సెల్సియస్ వద్ద  వేడి చేయరా? Or నీరు 100 డిగ్రీలు సెల్సియస్ వద్ద వేడి చేయరా?
2.The sun is seen during the day. సూర్యుడిని పగటిపూట చూస్తారు (or) సూర్యుడు  పగటి పూట చూడబడతాడు
The sun is not seen during the day.  సూర్యుడిని పగటిపూట చూడరు or సూర్యుడు  పగటి పూట చూడబడడు
Is the sun seen during the day?  సూర్యుడిని పగటిపూట చూస్తారా? Or సూర్యుడు  పగటి పూట చూడబడతాడా?
Is the sun not seen during the day?  సూర్యుడిని పగటిపూట చూడరా? Or సూర్యుడు  పగటి పూట చూడబడడా?
3 .Stars are observed in the night sky. నక్షత్రాలను రాత్రి ఆకాశంలో గమనిస్తారు (or ) రాత్రి ఆకాశంలో నక్షత్రాలు గమనించబడతాయి.
Stars are not observed in the night sky. నక్షత్రాలను రాత్రి ఆకాశంలో గమనించరు
Are stars observed in the night sky? నక్షత్రాలను రాత్రి ఆకాశంలో గమనిస్తారా ?
Are stars not observed in the night sky? నక్షత్రాలను రాత్రి ఆకాశంలో గమనించరా ?
4 .Plastic is recycled in many countries. ప్లాస్టిక్ ను అనేక దేశాల్లో పునర్వినియోగిస్తారు (or)అనేక దేశాల్లో ప్లాస్టిక్ పునర్వినియోగం చేయబడుతోంది.
Plastic is not recycled in many countries. ప్లాస్టిక్ ను అనేక దేశాల్లో పునర్వినియోగం చేయరు
Is plastic recycled in many countries? ప్లాస్టిక్ ను అనేక దేశాల్లో పునర్వినియోగం చేస్తారా?
Is plastic not recycled in many countries? ప్లాస్టిక్ ను అనేక దేశాల్లో  పునర్వినియోగం చేయరా?
5 .Rice is cultivated in many parts of the world. వరిని ప్రపంచంలోని అనేక ప్రాంతాలలో సాగు చేస్తున్నారు
Rice is not cultivated in many parts of the world.  వరిని ప్రపంచంలోని అనేక ప్రాంతాలలో సాగు చేయరు
Is rice cultivated in many parts of the world? వరిని ప్రపంచంలోని అనేక ప్రాంతాలలో సాగు చేస్తున్నారా?
Is rice not cultivated in many parts of the world? వరిని ప్రపంచంలోని అనేక ప్రాంతాలలో సాగు చేయరా?
6 .Electricity is generated using various methods. కరెంటును వివిధ పద్ధతులను ఉపయోగించి ఉత్పత్తి చేస్తారు
Electricity is not generated using various methods. కరెంటును వివిధ పద్ధతులను ఉపయోగించి ఉత్పత్తి చేయరు
Is electricity generated using various methods? కరెంటును వివిధ పద్ధతులను ఉపయోగించి ఉత్పత్తి చేస్తారా?
Is electricity not generated using various methods? కరెంటును వివిధ పద్ధతులను ఉపయోగించి ఉత్పత్తి చేయరా?

 

 

2.Habitual actions.

క్రమం తప్పకుండా లేదా పదే పదే అలవాటుగాజరిగే కార్యకలాపాలు లేదా చర్యలు. వీటిని ప్యాసివ్ వాయిస్ లో ఏ విధంగా చెబుతారో గమనించండి.

1.Breakfast is served at 7 a.m. every day. అల్పాహారమును ప్రతిరోజు ఉదయం ఏడు గంటలకు వడ్డిస్తారు.
Breakfast is not served at 7 a.m. every day. అల్పాహారమును ప్రతిరోజు ఉదయం ఏడు గంటలకు వడ్డించరు
Is breakfast served at 7 a.m. every day? అల్పాహారమును ప్రతిరోజు ఉదయం ఏడు గంటలకు వడ్డిస్తారా?
Is breakfast not served at 7 a.m. every day? అల్పాహారమును ప్రతిరోజు ఉదయం ఏడు గంటలకు  వడ్డించరా?
2 .Letters are delivered to the office daily. ఉత్తరాలను ప్రతిరోజు కార్యాలయానికి డెలివరీ చేస్తారు
Letters are not delivered to the office daily. ఉత్తరాలను ప్రతిరోజు కార్యాలయానికి డెలివరీ చేయరు
Are letters delivered to the office daily? ఉత్తరాలను ప్రతిరోజు కార్యాలయానికి డెలివరీ  చేస్తారా?
Are letters not delivered to the office daily? ఉత్తరాలను ప్రతిరోజు కార్యాలయానికి డెలివరీ  చేయరా?
3 .The garden is watered every evening. తోటను ప్రతి సాయంత్రం నీటితో తడుపుతారు
The garden is not watered every evening. తోటను ప్రతి సాయంత్రం నీటితో తడపరు
Is the garden watered every evening? తోటను ప్రతి సాయంత్రం నీటితో తడుపుతారా?
Is the garden not watered every evening?  తోటను ప్రతి సాయంత్రం నీటితో తడపరా?
4 .The trash is taken out every night. చెత్తను ప్రతి రాత్రి బయటకు తీస్తారు
The trash is not taken out every night. చెత్తను ప్రతి రాత్రి బయటకు తీయరు.
Is the trash taken out every night? చెత్తను ప్రతి రాత్రి బయటకు తీస్తారా?
Is the trash not taken out every night? చెత్తను ప్రతి రాత్రి బయటకు తీయరా?
5 .Newspapers are distributed early in the morning. వార్తాపత్రికలను ఉదయాన్నే పంపిణీ చేస్తారు.
Newspapers are not distributed early in the morning. వార్తాపత్రికలను ఉదయాన్నే పంపిణీ చేయరు.
Are newspapers distributed early in the morning? వార్తాపత్రికలను ఉదయాన్నే పంపిణీ  చేస్తారా.?
Are newspapers not distributed early in the morning? వార్తాపత్రికలను ఉదయాన్నే పంపిణీ చేయరా.?
6 .Meals are cooked three times a day in most homes. భోజనమును చాలా ఇళ్లలో రోజుకు మూడుసార్లు వండుతారు
Meals are not cooked three times a day in most homes. భోజనమును చాలా ఇళ్లలో రోజుకు మూడుసార్లు వండరు
Are meals cooked three times a day in most homes? భోజనమును చాలా ఇళ్లలో రోజుకు మూడుసార్లు వండుతారా?
Are meals not cooked three times a day in most homes? భోజనమును చాలా ఇళ్లలో రోజుకు మూడుసార్లు వండరా?
7 .Attendance is marked at the start of every class. హాజరును ప్రతి తరగతి ప్రారంభంలో గుర్తిస్తారు
Attendance is not marked at the start of every class. హాజరును ప్రతి తరగతి ప్రారంభంలో గుర్తించరు
Is attendance marked at the start of every class? హాజరును ప్రతి తరగతి ప్రారంభంలో  గుర్తిస్తారా?
Is attendance not marked at the start of every class? హాజరును ప్రతి తరగతి ప్రారంభంలో  గుర్తించరా?
8.The gates are locked at 10 p.m. every night. గేట్లను ప్రతి రాత్రి 10 గంటలకు లాక్ చేస్తారు
The gates are not locked at 10 p.m. every night. గేట్లను ప్రతి రాత్రి 10 గంటలకు లాక్ చేయరు
Are the gates locked at 10 p.m. every night? గేట్లను ప్రతి రాత్రి 10 గంటలకు లాక్  చేస్తారా?
Are the gates not locked at 10 p.m. every night? గేట్లను ప్రతి రాత్రి 10 గంటలకు లాక్ చేయరా?

 

 

 

3.Scheduled actions

టైం టేబుల్ ప్రకారంగా గాని లేదా షెడ్యూల్ ప్రకారం గా సెట్ చేయబడిన కొన్ని ప్రోగ్రాములు, మరి ముఖ్యంగా ప్రయాణాలు సంబంధించిన విషయాలను చెప్పడానికి ఈ సింపుల్ ప్రెసెంట్ టెన్స్ ను ఉపయోగిస్తారు. ఒకవేళ ఈ కార్యక్రమాలు భవిష్యత్తులో జరుగుతున్నప్పటికీ అవి ముందుగానే సెట్ చేయబడినవి గనుక వాటిని ఈ సింపుల్ ప్రెసెంట్ టెన్స్ లో చెబుతారు.భవిష్యత్తులో జరుగుతున్నాయి గనుక వాటిని ఫ్యూచర్ టెన్స్ లో చెప్పాల్సిన అవసరం లేదు.ఇటువంటి విషయాలను ప్యాసివ్ వాయిస్ లో ఏ విధంగా తెలియజేస్తారో గమనించండి

1.The train is scheduled for departure tomorrow. రైలు రేపు బయలుదేరడానికి షెడ్యూల్ చేయబడుతుంది
The train is not scheduled for departure tomorrow. రైలు రేపు బయలుదేరడానికి షెడ్యూల్ చేయబడదు
Is the train scheduled for departure tomorrow? రైలు రేపు బయలుదేరడానికి షెడ్యూల్ చేయబడుతుందా?
Is the train not scheduled for departure tomorrow? రైలు రేపు బయలుదేరడానికి షెడ్యూల్ చేయబడదా?
2.Tickets are issued at the counter daily. ప్రతిరోజూ కౌంటర్లో టిక్కెట్లు జారీ చేయబడతాయి.
Tickets are not issued at the counter daily. కౌంటర్లో రోజూ టిక్కెట్లు జారీ చేయబడవు.
Are tickets issued at the counter daily? కౌంటర్లో రోజూ టిక్కెట్లు జారీ చేస్తున్నారా?
Are tickets not issued at the counter daily? ప్రతిరోజు కౌంటర్లో టికెట్లు జారీ చేయబడడం లేదా?
3.The event is planned for next week. ఈవెంట్ వచ్చే వారం ప్లాన్ చేయబడుతుంది.
The event is not planned for next week. ఈవెంట్ వచ్చే వారం ప్లాన్  చేయబడదు.
Is the event planned for next week? ఈవెంట్ వచ్చే వారం ప్లాన్  చేయబడుతుందా?
Is the event not planned for next week? ఈవెంట్ వచ్చే వారం ప్లాన్  చేయబడదా?
4.The exam is conducted every six months. ప్రతి ఆరు నెలలకోసారి పరీక్ష నిర్వహించబడుతుంది.
The exam is not conducted every six months. పరీక్ష ఆరు నెలలకోసారి నిర్వహించబడదు.
Is the exam conducted every six months? ప్రతి ఆరు నెలలకోసారి పరీక్ష నిర్వహిస్తారా?
Is the exam not conducted every six months? ప్రతి ఆరు నెలలకోసారి పరీక్ష  నిర్వహించబడదా?
5.Buses are operated hourly from the station. స్టేషన్ నుండి గంట గంటకు బస్సులు నడుస్తాయి.
Buses are not operated hourly from the station. స్టేషన్ నుండి గంట గంటకు బస్సులు నడపబడవు.
Are buses operated hourly from the station? స్టేషన్ నుండి గంట గంటకు బస్సులు నడపబడుతున్నాయా?
Are buses not operated hourly from the station? స్టేషన్ నుండి గంటకోసారి బస్సులు నడపబడడం లేదా?
6.Appointments are scheduled by the receptionist daily. అపాయింట్‌మెంట్‌లు ప్రతిరోజూ రిసెప్షనిస్ట్ ద్వారా షెడ్యూల్ చేయబడతాయి.
Appointments are not scheduled by the receptionist daily. అపాయింట్‌మెంట్‌లు ప్రతిరోజూ రిసెప్షనిస్ట్ ద్వారా షెడ్యూల్ చేయబడవు.
Are appointments scheduled by the receptionist daily? రిసెప్షనిస్ట్ ద్వారా అపాయింట్‌మెంట్‌లు ప్రతిరోజూ షెడ్యూల్ చేయబడుతున్నాయా?
Are appointments not scheduled by the receptionist daily? రిసెప్షనిస్ట్ ద్వారా అపాయింట్‌మెంట్‌లు ప్రతిరోజూ షెడ్యూల్ చేయబడడం లేదా?
7.The play is performed every Saturday evening. ప్రతి శనివారం సాయంత్రం ఈ నాటకాన్ని ప్రదర్శిస్తారు.
The play is not performed every Saturday evening. ప్రతి శనివారం సాయంత్రం నాటకం ప్రదర్శించబడదు.
Is the play performed every Saturday evening? ప్రతి శనివారం సాయంత్రం నాటకం ప్రదర్శించబడుతుందా?
Is the play not performed every Saturday evening? ప్రతి శనివారం సాయంత్రం నాటకం ప్రదర్శించబడడంలేదా?
8.The parcel is delivered within three days. పార్శిల్ మూడు రోజుల్లో పంపిణీ చేయబడుతుంది.
The parcel is not delivered within three days. మూడు రోజుల్లో పార్శిల్ డెలివరీ చేయబడదు.
Is the parcel delivered within three days? మూడు రోజుల్లో పార్శిల్ డెలివరీచేయబడుతుందా?
Is the parcel not delivered within three days? మూడు రోజుల్లో పార్శిల్ డెలివరీ  చేయబడదా?
9.Lectures are held on Monday and Wednesday. సోమ, బుధవారాల్లో ఉపన్యాసాలు నిర్వహిస్తారు.
Lectures are not held on Monday and Wednesday. సోమ, బుధవారాల్లో ఉపన్యాసాలు  నిర్వహించరు.
Are lectures held on Monday and Wednesday? సోమ, బుధవారాల్లో ఉపన్యాసాలు నిర్వహిస్తారా?
Are lectures not held on Monday and Wednesday? సోమ, బుధవారాల్లో ఉపన్యాసాలు  నిర్వహించబడడం లేదా?
10.The meeting is set for 3 p.m. మధ్యాహ్నం 3 గంటలకు సమావేశం ఏర్పాటు చేశారు.
The meeting is not set for 3 p.m. సమావేశం మధ్యాహ్నం 3 గంటలకు సెట్ కాలేదు.
Is the meeting set for 3 p.m.? సమావేశం మధ్యాహ్నం 3 గంటలకు సెట్ చేయబడిందా?
Is the meeting not set for 3 p.m.? సమావేశం మధ్యాహ్నం 3 గంటలకు సెట్ చేయబడలేదా?