గతంలో జరిగిపోయిన విషయాలు గురించి తెలియజేయడానికి SIMPLE PAST ఉపయోగిస్తారు. ఇప్పుడు Simple past passive voice గురించి తెలుసుకుందాం.

Simple Past
Subject Active voice Pasive voice
I/He/She/It did was
We/You/They did were

 

1. ఒక సెంటెన్స్ లో  I/He/She/It లు  సబ్జెక్టులు గా ఉండి అందులో Did  ఉంటే అది ప్యాసివ్ వాయిస్ లో was  గా మారుతుంది. 

2.ఒక సెంటెన్స్ లో  We/You/They లు  సబ్జెక్టులు గా ఉండి అందులో Did  ఉంటే అది ప్యాసివ్ వాయిస్ లో were   గా మారుతుంది. 

క్రింద రెండు ఉదాహరణలు ఇచ్చినాము వీటిని కొంచెం జాగ్రత్తగా చదవండి

Example 1:

1.He washed the car.(అతను కారును కడిగినాడు)

Subject = He , Verb= Washed , Object= Car

1.పై వాక్యం సబ్జెక్టుతో ప్రారంభమైంది కాబట్టి ఇది యాక్టివ్ వాయిస్ లో ఉంది. దీనిని ప్యాసివ్ వాయిస్ లో మార్చుటకు ఆబ్జెక్టు   అయిన Car తో వాక్యాన్ని ప్రారంభించాలి.

Did+Verb1=Verb2

పై వాక్యంలో Did ఉన్నది ఎలాగంటే  Did + wash = washed కాబట్టి

2.తరువాత Car సింగులర్  కాబట్టి  was సహాయక్రియను ఉపయోగించాలి. (ఒకవేళ object ప్లూరల్  అయితే were  వస్తుంది)

3.Washed  అనే verb  యొక్క మూడో రూపం wahsed  ఉపయోగించాలి.

wash – washed – washed – washing

4.తర్వాత by ఉపయోగించాలి.

5.యాక్టివ్ వాయిస్ లో ఉన్న సబ్జెక్టు “He” ఇక్కడ Him గా మారుతుంది.. 

పైన ఉన్న పాయింట్స్ ప్రకారం Active voice సెంటెన్స్ ని Passive voice లోకి మారిస్తే క్రింది విధంగా వస్తుంది.

The car was washed by him (కారును అతను కడిగినాడు లేదా కారు అతని చేత కడగబడినది)

ప్యాసివ్  వాయిస్ లో నెగిటివ్ సెంటెన్సెస్ రాయడం చాలా సులభం ప్రతి Be form కి పక్కనే Not చేరిస్తే అది నెగిటివ్ సెంటెన్స్ గా మార్చబడుతుంది. 

కాబట్టి ఇప్పుడు was పక్కన not పెడతాము.

The car was not washed by him (కారును అతను కడగలేదు లేదా కారు అతని చేత కడగబడలేదు)

పై రెండు సెంటెన్సెస్ ని Interrogative sentences గా మార్చుటకు  బి ఫామ్ అయిన was ని సెంటెన్స్ మొదట ఉంచుతాము.

Was the car washed by him  (కారును అతను కడిగినాడా ? లేదా కారు అతని చేత కడగబడినదా?)

Was the car not  washed by him  (కారును అతను కడగలేదా? లేదా కారు అతని చేత కడగబడలేదా?)

 

Example 2:

We answered the questions .( మేము ప్రశ్నలకు జవాబు ఇచ్చినాము)

Subject = We , Verb= Answered, Object= Questions

1.పై వాక్యం సబ్జెక్టుతో ప్రారంభమైంది కాబట్టి ఇది యాక్టివ్ వాయిస్ లో ఉంది. దీనిని ప్యాసివ్ వాయిస్ లో మార్చుటకు ఆబ్జెక్టు   అయిన Questions తో వాక్యాన్ని ప్రారంభించాలి.

పై వాక్యంలో Did ఉన్నది ఎలాగంటే  Did + answer = answered కాబట్టి

2.తరువాత Questions ప్లూరల్  కాబట్టి  were సహాయక్రియను ఉపయోగించాలి. (ఒకవేళ object సింగులర్ అయితే was  వస్తుంది)

3.Answered అనే verb  యొక్క మూడో రూపం Answered  ఉపయోగించాలి.

Answer  – Answered – Answered – Answering 

4.తర్వాత by ఉపయోగించాలి.

5.యాక్టివ్ వాయిస్ లో ఉన్న సబ్జెక్టు “We” ఇక్కడ Us గా మారుతుంది. 

పైన ఉన్న పాయింట్స్ ప్రకారం Active voice సెంటెన్స్ ని Passive voice లోకి మారిస్తే క్రింది విధంగా వస్తుంది.

The questions were answered by us  (ప్రశ్నలకు మేము జవాబు చెప్పినాము లేదా ప్రశ్నలు మా చేత జవాబు చెప్పబడినాయి)

ప్యాసివ్  వాయిస్ లో నెగిటివ్ సెంటెన్సెస్ రాయడం చాలా సులభం ప్రతి Be form కి పక్కనే Not చేరిస్తే అది నెగిటివ్ సెంటెన్స్ గా మారిపోతుంది. 

కాబట్టి ఇప్పుడు  were పక్కన not పెడతాము.

The questions were not answered by us (ప్రశ్నలకు మేము జవాబు చెప్పలేదు లేదా ప్రశ్నలు మా చేత జవాబు చెప్పబడలేదు)

పై రెండు సెంటెన్సెస్ ని Interrogative sentences గా మార్చుటకు  బి ఫామ్ అయిన were ని సెంటెన్స్ మొదట ఉంచుతాము.

Were the questions  answered by us  (ప్రశ్నలకు మేము జవాబు చెప్పినామా? లేదా ప్రశ్నలు మా చేత జవాబు చెప్పబడి నాయా?)

Were the questions not answered by us   (ప్రశ్నలకు మేము జవాబు చెప్పలేదా? లేదా ప్రశ్నలు మా చేత జవాబు చెప్పబడలేదా?) 

 

1. I bought a book. 1. నేను ఒక పుస్తకం కొన్నాను.
A book was bought by me. పుస్తకమును నేను కొన్నాను (లేదా) పుస్తకము నా చేతకొనబడింది.
A book was not bought by me. పుస్తకమును నేను పని లేదు
Was a book bought by me? పుస్తకమును నేను కొన్నానా?
Was a book not bought by me? పుస్తకమును నేను కొనలేదా?
   
2. She washed clothes. 2. ఆమె బట్టలు ఉతికింది.
Clothes were washed by her. బట్టలను ఆమె ఉతికింది
Clothes were not washed by her. బట్టలను ఆమె ఉతకలేదు
Were clothes washed by her? బట్టలను ఆమె ఉతికిందా?
Were clothes not washed by her? బట్టలను ఆమె ఉతకలేదా?
   
3. He fixed the clock. 3. అతను గడియారాన్ని సరిచేశాడు.
The clock was fixed by him. గడియారమును అతను సరి చేశాడు 
The clock was not fixed by him. గడియారమును అతను సరి  చేయలేదు 
Was the clock fixed by him? గడియారమును అతను  సరిచేశాడా?
Was the clock not fixed by him? గడియారమును అతను సరి  చేయలేదా?
   
4. They painted walls. 4. వారు గోడలకు రంగులు వేశారు.
Walls were painted by them. గోడలకు వారు రంగులు వేశారు.
Walls were not painted by them. గోడలకు వారు రంగులు వేయలేదు..
Were walls painted by them? గోడలకు వారు రంగులు. వేశారా?
Were walls not painted by them? గోడలకు వారు రంగులు వేయలేదా?
   
5. I wrote a letter. 5. నేను ఒక లేఖ రాశాను.
A letter was written by me. లేఖను నేను రాశాను. 
A letter was not written by me. లేఖను నేను రాయలేదు..
Was a letter written by me? లేఖను నేను రాశానా?
Was a letter not written by me? లేఖను నేను రాయలేదా?
   
6. She answered questions. 6. ఆమె ప్రశ్నలకు సమాధానమిచ్చింది.
Questions were answered by her. ప్రశ్నలకు ఆమె సమాధానం ఇచ్చింది
Questions were not answered by her. ప్రశ్నలకు ఆమె సమాధానం  ఇవ్వలేదు
Were questions answered by her? ప్రశ్నలకు ఆమె సమాధానం ఇచ్చిందా ?
Were questions not answered by her? ప్రశ్నలకు ఆమె సమాధానం ఇవ్వలేదా?
   
7. He broke the glass. 7. అతను గాజు పగలగొట్టాడు.
The glass was broken by him. గాజును  అతను పగలగొట్టాడు
The glass was not broken by him. గాజును  అతను పగలగొట్టలేదు.
Was the glass broken by him? గాజును  అతను పగలగొట్టాడా?
Was the glass not broken by him? గాజును  అతను పగలగొట్టలేదా?
   
8. We planted trees. 8. మేము చెట్లు నాటాము.
Trees were planted by us. చెట్లను మేము  నాటాము.
Trees were not planted by us. చెట్లను మేము నాటలేదు.
Were trees planted by us? చెట్లను మేము నాటినామా?
Were trees not planted by us? చెట్లను మేము నాటలేదా?
   
9. She cooked a meal. 9. ఆమె భోజనం వండింది.
A meal was cooked by her. భోజనంను ఆమె  వండింది.
A meal was not cooked by her. భోజనంను ఆమె వండలేదు.
Was a meal cooked by her? భోజనంను ఆమె  వండిందా?.
Was a meal not cooked by her? భోజనంను ఆమె  వండలేదా?
   
10. They sold fruits. 10. వారు పండ్లు అమ్మారు.
Fruits were sold by them. పండ్లను వారు అమ్మినారు.
Fruits were not sold by them. పండ్లను వారు  అమ్మ లేదు.
Were fruits sold by them? పండ్లను వారు అమ్మినారా ?
Were fruits not sold by them? పండ్లను వారు అమ్మలేదా?
   
12. He cleaned rooms. 12. అతను గదులు శుభ్రం చేశాడు.
Rooms were cleaned by him. గదులను అతను శుభ్రం చేశాడు
Rooms were not cleaned by him. గదులను అతను శుభ్రం చేయలేదు.
Were rooms cleaned by him? గదులను అతను శుభ్రం చేశాడా?
Were rooms not cleaned by him? గదులను అతను శుభ్రం చేయలేదా?
   
13. She drew a picture. 13. ఆమె ఒక చిత్రాన్ని గీసింది.
A picture was drawn by her. చిత్రాన్ని ఆమె గీసింది.
A picture was not drawn by her. చిత్రాన్ని ఆమె  గీయలేదు.
Was a picture drawn by her? చిత్రాన్ని ఆమె గీసిందా .?
Was a picture not drawn by her? చిత్రాన్ని ఆమె గీయలేదా.?
   
14. We watched movies. 14. మేము సినిమాలు చూశాము.
Movies were watched by us. సినిమాలను మేము చూశాము.
Movies were not watched by us. సినిమాలను మేము చూడలేదు
Were movies watched by us? సినిమాలను మేము చూశామా?
Were movies not watched by us? సినిమాలను మేము చూడలేదా?
   
15. The boy kicked the ball. 15. బాలుడు బంతిని తన్నాడు.
The ball was kicked by the boy. బంతిని ఆ బాలుడు తన్నాడు.
The ball was not kicked by the boy. బంతిని ఆ బాలుడు తన్నలేదు.
Was the ball kicked by the boy? బంతిని ఆ బాలుడు  తన్నాడా?
Was the ball not kicked by the boy? బంతిని ఆ బాలుడు తన్నలేదా?
   
16. The teacher checked papers. 16. టీచర్ పేపర్లు తనిఖీ చేసింది.
Papers were checked by the teacher. పేపర్లను టీచర్ తనిఖీ చేసింది
Papers were not checked by the teacher. పేపర్లను టీచర్ తనిఖీ చేయలేదు
Were papers checked by the teacher? పేపర్లను టీచర్ తనిఖీ చేసిందా ?
Were papers not checked by the teacher? పేపర్లను టీచర్ తనిఖీ చేయలేదా?
   
17. She opened the window. 17. ఆమె కిటికీ తెరిచింది.
The window was opened by her. కిటికీని ఆమె తెరిచింది
The window was not opened by her. కిటికీని ఆమె తెరవలేదు
Was the window opened by her? కిటికీని ఆమె తెరిచిందా?
Was the window not opened by her? కిటికీని ఆమె  తెరవలేదా?
   
18. They repaired machines. 18. వారు యంత్రాలను మరమ్మతులు చేశారు.
Machines were repaired by them. యంత్రాలను వారు మరమ్మతులు చేసేవారు.
Machines were not repaired by them. యంత్రాలను వారు మరమ్మతులు చేయలేదు
Were machines repaired by them? యంత్రాలను వారు మరమ్మత్తులు చేశారా?
Were machines not repaired by them? యంత్రాలను వారు మరమ్మత్తులు చేయలేదా?
   
19. I sent a message. 19. నేను ఒక సందేశం పంపాను.
A message was sent by me. సందేశమును నేను పంపాను.
A message was not sent by me. సందేశమును నేను  పంపలేదు..
Was a message sent by me? సందేశమును నేను  పంపానా?
Was a message not sent by me? సందేశమును నేను పంపలేదా?
   
20. We collected coins. 20. మేము నాణేలు సేకరించాము.
Coins were collected by us. నాణేలను  మేము సేకరించాము.
Coins were not collected by us. నాణేలను  మేము  సేకరించలేదు.
Were coins collected by us? నాణేలను  మేము  సేకరించామా?
Were coins not collected by us? నాణేలను  మేము  సేకరించలేదా?
   
By ఉపయోగించకుండా 
   
1. I wrote a letter. 1. నేను ఒక లేఖ రాశాను.
A letter was written. లేఖను రాశారు లేదా ఒక లేఖ రాయబడింది.
A letter was not written. లేఖను రాయలేదు.
Was a letter written? లేఖను రాశారా
Was a letter not written? లేఖను రాయలేదా?
   
2. She cleaned the house. 2. ఆమె ఇంటిని శుభ్రం చేసింది.
The house was cleaned. ఇల్లును శుభ్రం చేశారు లేదా ఇల్లు శుభ్రం చేయబడింది
The house was not cleaned.   ఇల్లును శుభ్రం చేయలేదు.
Was the house cleaned? ఇల్లును శుభ్రం చేశారా?
Was the house not cleaned? ఇల్లును  శుభ్రం చేయలేదా?
   
3. He broke the glass. 3. అతను గాజు పగలగొట్టాడు.
The glass was broken. గాజును  పగలగొట్టారు లేదా గాజు పగలగొట్టబడింది.
The glass was not broken. గాజును  పగలగొట్టలేదు
Was the glass broken? గాజును పగలగొట్టినారా?
Was the glass not broken? గాజును  పగలగొట్టలేదా?
   
4. They watched a movie. 4. వారు సినిమా చూశారు.
A movie was watched. సినిమాను చూశారు.
A movie was not watched. సినిమాను చూడలేదు.
Was a movie watched? సినిమాను  చూశారా?
Was a movie not watched? సినిమాను  చూడలేదా?
   
5. We planted trees. 5. మేము చెట్లు నాటాము.
Trees were planted. చెట్లను నాటారు
Trees were not planted. చెట్లను నాటలేదు
Were trees planted? చెట్లును  నాటారా?
Were trees not planted? చెట్లును  నాటలేదా?
   
6. She cooked the food. 6. ఆమె ఆహారం వండింది.
The food was cooked. ఆహారంను  వండారు.
The food was not cooked. ఆహారంను  వండలేదు.
Was the food cooked? ఆహారంను  వండినారా?
Was the food not cooked? ఆహారంను  వండలేదా?
   
7. I bought a phone. 7. నేను ఒక ఫోన్ కొన్నాను.
A phone was bought. ఫోన్ ను కొన్నారు
A phone was not bought. ఫోన్ ను కొనలేదు.
Was a phone bought? ఫోన్ ను కొన్నారా? 
Was a phone not bought? ఫోన్ ను కొనలేదా?
   
8. He repaired the bike. 8. అతను బైక్ రిపేర్ చేసాడు.
The bike was repaired. బైక్ ను రిపేరు చేశారు లేదా బైక్ రిపేర్ చేయబడింది. 
The bike was not repaired. బైకును రిపేరు చేయలేదు
Was the bike repaired? బైక్ ను రిపేరు చేసినారా?
Was the bike not repaired? బైకును రిపేరు చేయలేదా?
   
9. They collected coins. 9. వారు నాణేలు సేకరించారు.
Coins were collected. నాణేలును  సేకరించారు.
Coins were not collected. నాణేలును  సేకరించలేదు.
Were coins collected? నాణేలును సేకరించినారా?
Were coins not collected? నాణేలును  సేకరించలేదా?
   
10. She answered the question. 10. ఆమె ప్రశ్నకు సమాధానమిచ్చింది.
The question was answered. ప్రశ్నకు సమాధానం ఇచ్చినారు.
The question was not answered. ప్రశ్నకు సమాధానం  ఇవ్వలేదు..
Was the question answered? ప్రశ్నకు సమాధానం ఇచ్చినారా .?
Was the question not answered? ప్రశ్నకు సమాధానం ఇవ్వలేదా.?