Present continuous tense passive voice
దయచేసి పాసివ్ వాయిస్ మొదటి లెస్సన్ నుంచి చదవండి
ప్రస్తుతం ఆగకుండా కంటిన్యూగా జరుగుతున్న విషయాలను గురించి వివరించడానికి Present continuous tense ఉపయోగిస్తారు.ఈ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ ని పాసివ్ వాయిస్ లో ఏ విధంగా ఉపయోగిస్తారో తెలుసుకుందాం.
Present Continuous టెన్స్ లో యాక్టివ్ వాయిస్ లో ఉండే హెల్పింగ్ వెర్బ్స్ పాసివ్ వాయిస్ లో లో ఏ విధంగా మారుతాయో క్రింది పట్టిక ద్వారా గమనించండి.
| Subject | Active voice | Passive voice |
| I | am | am being |
| He/She/It | is | is being |
| We/You/They | are | are being |
Object + beform + verb3 + by + subject
క్రింది టేబుల్ లోని ఒకటో ఉదాహరణను ఒకసారి చూడండి
Example: She is calling me.
- Object అయిన Me తో వాక్యాన్ని ప్రారంభించాలి కానీ అది ప్యాసివ్ వాయిస్ లో I గా మారుతుంది.
- I సింగులర్ కాబట్టి am being ఉపయోగిస్తాము.
- Calling బదులు మూడవ రూపం called ఉపయోగిస్తాము
- By = చేత
- Subject = she చివరిలో her గా మారుతుంది.
I am being called by her అవుతుంది.
Passive voice లో నెగిటివ్ సెంటెన్స్ రాయడం చాలా సులభం Beform తర్వాత not పెడితే సరిపోతుంది.
Interrogative sentences కి Beform వాక్య ప్రారంభంలో పెడతాము.
క్రింద మొదటి సెంటెన్స్ active voice , రెండవ సెంటెన్స్ passive voice
| She is calling me. | ఆమె నన్ను పిలుస్తూ ఉంది. |
| I am being called by her. | నన్ను ఆమె పిలుస్తూ ఉంది.(లేదా) నేను ఆమె చేత పిలవబడుతున్నాను |
| They are helping us. | వారు మాకు సహాయం చేస్తూ ఉన్నారు |
| We are being helped by them. | మాకు వారు సహాయం చేస్తూ ఉన్నారు |
| I am watching you. | నేను మిమ్మల్ని చూస్తూ ఉన్నాను |
| You are being watched by me. | మిమ్ములను నేను చూస్తూ ఉన్నాను |
| We are inviting them. | మేము వారిని ఆహ్వానిస్తూవున్నాము |
| They are being invited by us. | వారిని మేము ఆహ్వానిస్తూవున్నాము |
| She is teaching him. | ఆమె అతనికి బోధిస్తూ ఉంది |
| He is being taught by her. | అతనికి ఆమె బోధిస్తూ ఉంది |
| They are supporting her. | వాళ్ళు ఆమెకు మద్దతు ఇస్తూ ఉన్నారు |
| She is being supported by them. | ఆమెకు వాళ్ళు మద్దతు ఇస్తూ ఉన్నారు |
| He is repairing it. | అతను దాన్ని రిపేర్ చేస్తూ ఉన్నాడు |
| It is being repaired by him. | దానిని అతను రిపేర్ చేస్తూ ఉన్నాడు |
| I am informing them. | నేను వారికి తెలియజేస్తూ ఉన్నాను |
| They are being informed by me. | వారికి నేను తెలియజేస్తూ ఉన్నాను |
| We are guiding you. | మేము మీకు మార్గనిర్దేశం చేస్తున్నాము. |
| You are being guided by us. | మిమ్ములను మేము మార్గనిర్దేశం చేస్తున్నాము . |
| She is reminding me. | ఆమె నాకు గుర్తు చేస్తోంది. |
| I am being reminded by her. | నేను ఆమె ద్వారా గుర్తు చేయబడుతున్నాను. |
యాక్టీవ్ వాయిస్ లో ఆబ్జెక్ట్ noun అయితే ప్యాసివ్ వాయిస్ లో కూడా noun గానే ఉంటుంది. ఏ మార్పు ఉండదు
| He is writing an email. | అతను ఒక ఈమెయిల్ రాస్తూ ఉన్నాడు. |
| An email is being written by him. | ఈమెయిల్ ని అతను రాస్తూ ఉన్నాడు |
| She is cutting the vegetables. | ఆమె కూరగాయలు కోస్తూ ఉంది. |
| The vegetables are being cut by her. | కూరగాయాలని ఆమె కోస్తూ ఉంది. |
| I am checking the answers. | నేను సమాధానాలను తనిఖీ చేస్తూ ఉన్నాను. |
| The answers are being checked by me. | సమాధానాలను నేను తనిఖీ చేస్తూ ఉన్నాను. |
| They are fixing the problem. | వారు సమస్యను పరిష్కరిస్తూ ఉన్నారు. |
| The problem is being fixed by them. | సమస్యను వారు పరిష్కరిస్తూ ఉన్నారు. |
| We are cleaning the kitchen. | మేము వంటగది శుభ్రం చేస్తూ ఉన్నాము. |
| The kitchen is being cleaned by us. | వంటగదిని మేము శుభ్రం చేస్తూ ఉన్నాము. |
| The boy is flying the kite. | ఆ బాలుడు గాలిపటం ఎగరవేస్తూ ఉన్నాడు |
| The kite is being flown by the boy. | గాలిపటంను ఆ అబ్బాయి ఎగరవేస్తూ ఉన్నాడు |
| The girl is watering the flowers. | ఆ అమ్మాయి పూలకు నీళ్లు పోస్తూ ఉంది. |
| The flowers are being watered by the girl. | పూలకు ఆ అమ్మాయి నీళ్లు పోస్తూ ఉంది |
| He is selling the car. | అతను కారు అమ్ముతూవున్నాడు. |
| The car is being sold by him. | ఆ కారును అతను అమ్ముతూవున్నాడు. |
| She is packing the bag. | ఆమె బ్యాగ్ సర్దుకుంటూఉంది. |
| The bag is being packed by her. | బ్యాగును ఆమె సర్దుకుంటూ ఉంది |
| I am drawing a map. | నేను ఒక మ్యాప్ గీస్తూ ఉన్నాను. |
| A map is being drawn by me. | మ్యాపును నేను గీస్తూవున్నాను. |
| They are printing the papers. | వాళ్ళు పేపర్లు ప్రింట్ చేస్తూ ఉన్నారు. |
| The papers are being printed by them. | పేపర్లను వారు ప్రింట్ చేస్తూ ఉన్నారు. |
| We are repairing the road. | మేము రోడ్డు మరమ్మతులు చేస్తూ ఉన్నాము. |
| The road is being repaired by us. | రోడ్డును మరమ్మత్తులను మేము చేస్తున్నాము |
| He is cleaning the board. | అతను బోర్డు శుభ్రం చేస్తూ ఉన్నాడు |
| The board is being cleaned by him. | బోర్డును అతను శుభ్రం చేస్తూ ఉన్నాడు. |
| She is preparing the notes. | ఆమె నోట్స్ సిద్ధం చేసుకుంటోంది. |
| The notes are being prepared by her. | నోట్స్ ను ఆమె తయారు చేస్తోంది. |
| I am uploading the file. | నేను ఫైల్‌ను అప్‌లోడ్ చేస్తూ ఉన్నాను. |
| The file is being uploaded by me. | ఫైల్ ను నేను అప్లోడ్ చేస్తూ ఉన్నాను. |
| The teacher is checking the homework. | టీచర్ హోంవర్క్ తనిఖీ చేస్తూవున్నాడు. |
| The homework is being checked by the teacher. | హోంవర్క్ ను టీచర్ చేత తనిఖీ చేస్తూవున్నాడు. |
| The worker is loading the truck. | కార్మికుడు ట్రక్కులోకి సామాను ఎక్కిస్తూవున్నాడు. |
| The truck is being loaded by the worker. | ట్రక్కును కార్మికుడు ఎక్కిస్తూవున్నాడు. |
| He is painting a picture. | అతను ఒక చిత్రాన్ని గీస్తూవున్నాడు. |
| A picture is being painted by him. | ఒక చిత్రాన్ని అతను గీస్తూవున్నాడు. |
| She is ironing the clothes. | ఆమె బట్టలు ఇస్త్రీ చేస్తూవుంది. |
| The clothes are being ironed by her. | బట్టలను ఆమె ఇస్త్రీ చేస్తూవుంది. |
| We are decorating the stage. | మేము వేదికను అలంకరిస్తూవున్నాము. |
| The stage is being decorated by us. | వేదికను మేము అలంకరిస్తూవున్నాము. |
Table:1
క్రింది వాక్యాలు వరుసగా
Present continuous,
passive,
passive negative,
passive interrogative,
passive negative interrogative సెంటెన్సెస్
| 1. He is writing a letter. | 1. అతను ఒక లేఖ రాస్తూ ఉన్నాడు |
| A letter is being written by him. | ఉత్తరమును అతను రాస్తూ ఉన్నాడు లేదా ఉత్తరము అతని చేత రాయబడుతూ ఉంది |
| A letter is not being written by him. | ఉత్తరమును అతను రాస్తూ లేడు లేదా ఉత్తరము అతని చేత రాయబడుతూ లేదు |
| Is a letter being written by him? | ఉత్తరమును అతను రాస్తూ ఉన్నాడా? లేదా ఉత్తరము అతని చేత రాయబడుతూ ఉందా? |
| Is a letter not being written by him? | ఉత్తరమును అతను రాస్తూ లేడా లేదా ఉత్తరము అతని చేత రాయబడుతూ లేదా? |
| 2. She is cooking dinner. | 2. ఆమె రాత్రి భోజనం వండుతూ ఉంది |
| Dinner is being cooked by her. | రాత్రి భోజనమును ఆమె వండుతూ ఉంది లేదా రాత్రి భోజనం ఆమె చేత వండబడుతూ ఉంది |
| Dinner is not being cooked by her. | రాత్రి భోజనమును ఆమె వండుతూ లేదు లేదా రాత్రి భోజనం ఆమె చేత వండబడుతూ లేదు |
| Is dinner being cooked by her? | రాత్రి భోజనమును ఆమె వండుతూ ఉందా? లేదా రాత్రి భోజనం ఆమె చేత వండబడుతూ ఉంdaa? |
| Is dinner not being cooked by her? | రాత్రి భోజనమును ఆమె వండుతూ లేదా ? లేదా రాత్రి భోజనం ఆమె చేత వండబడుతూ లేదా? |
| 3. It is chasing the ball. | 3. ఇది బంతిని వెంటాడుతోంది. |
| The ball is being chased by it. | బంతిని ఇది వెంటాడుతుంది లేదా బంతి దీని చేత వెంటాడుతూ ఉంది |
| The ball is not being chased by it. | బంతిని ఇది వెంటాడుతూ లేదు లేదా బంతి దీని చేత వెంటాడుతూ లేదు |
| Is the ball being chased by it? | బంతిని ఇది వెంటాడుతుందా? లేదా బంతి దీని చేత వెంటాడుతూ ఉందా? |
| Is the ball not being chased by it? | బంతిని ఇది వెంటాడుతూ లేదా? లేదా బంతి దీని చేత వెంటాడుతూ లేదా? |
| 4. I am reading a book. | 4. నేను ఒక పుస్తకం చదువుతూ ఉన్నాను |
| A book is being read by me. | పుస్తకమును నేను చదువుతూ ఉన్నాను లేదా పుస్తకం నా చేత చదవబడుతూ ఉంది |
| A book is not being read by me. | పుస్తకమును నేను చదువుతూ లేను లేదా పుస్తకం నా చేత చదవబడుతూ లేదు |
| Is a book being read by me? | పుస్తకమును నేను చదువుతూ ఉన్నాన? లేదా పుస్తకం నా చేత చదవబడుతూ ఉందా? |
| Is a book not being read by me? | పుస్తకమును నేను చదువుతూ లేనా? లేదా పుస్తకం నా చేత చదవబడుతూ లేదా? |
| 5. We are watching a movie. | 5. మేము సినిమా చూస్తూ ఉన్నాము |
| A movie is being watched by us. | సినిమాను మేము చూస్తూ ఉన్నాము లేదా సినిమా మా చేత చూడబడుతూ ఉంది |
| A movie is not being watched by us. | సినిమాను మేము చూస్తూ లేము లేదా సినిమా మా చేత చూడబడుతూ లేదు. |
| Is a movie being watched by us? | సినిమాను మేము చూస్తూ ఉన్నామ? లేదా సినిమా మా చేత చూడబడుతూ ఉందా.? |
| Is a movie not being watched by us? | సినిమాను మేము చూస్తూ లేమా? లేదా సినిమా మా చేత చూడబడుతూ లేదా.? |
| 6. You are cleaning the table. | 6. మీరు టేబుల్‌ను శుభ్రం చేస్తున్నారు. |
| The table is being cleaned by you. | టేబుల్ ను మీరు శుభ్రం చేస్తూ ఉన్నారు లేదా టేబుల్ మీ చేత శుభ్రం చేయబడుతూ ఉంది |
| The table is not being cleaned by you. | టేబుల్ ను మీరు శుభ్రం చేయడం లేదు లేదా టేబుల్ మీ చేత శుభ్రం చేయబడడం లేదు |
| Is the table being cleaned by you? | టేబుల్ ను మీరు శుభ్రం చేస్తున్నారా? లేదా టేబుల్ మీ చేత శుభ్రం చేయబడుతుందా? |
| Is the table not being cleaned by you? | టేబుల్ ను మీరు శుభ్రం చేయడం లేదా? లేదా టేబుల్ మీ చేత శుభ్రం చేయబడడం లేదా? |
| 7. They are planting trees. | 7. వారు చెట్లను నాటుతున్నారు. |
| Trees are being planted by them. | చెట్లను వారు నాటుతున్నారు లేదా చెట్లు వారి చేత నాటబడుతున్నాయి |
| Trees are not being planted by them. | చెట్లను వారునాటడం లేదు లేదా చెట్లు వారి చేత నాటబడడం లేదు. |
| Are trees being planted by them? | చెట్లను వారు నాటుతున్నారా? లేదా చెట్లు వారి చేత నాటబడుతున్నాయా? |
| Are trees not being planted by them? | చెట్లను వారు నాటడం లేదా? లేదా చెట్లు వారి చేత నాటబడడం లేదా? |
| 8. He is repairing the car. | 8. అతను కారు రిపేరు చేస్తూ ఉన్నాడు |
| The car is being repaired by him. | కారును అతను రిపేరు చేస్తున్నాడు లేదా కారు అతని చేత రిపేరు చేయబడుతూవుంది. |
| The car is not being repaired by him. | కారును అతను రిపేరు చేయడం లేదు, లేదా కారు అతని చేత రిపేరు చేయబడడం లేదు. |
| Is the car being repaired by him? | కారును అతను రిపేరు చేస్తున్నాడా? లేదా కారు అతని చేత రిపేరు చేయబడుతూవుందా.? |
| Is the car not being repaired by him? | కారును అతను రిపేరు చేయడం లేదా? లేదా కారు అతని చేత రిపేరు చేయబడడం లేదా? |
| 9. She is painting a picture. | 9. ఆమె ఒక చిత్రాన్ని పెయింటింగ్ చేస్తోంది. |
| A picture is being painted by her. | చిత్రాన్ని ఆమె పెయింటింగ్ చేస్తోంది లేదా చిత్రం ఆమె చేత పెయింటింగ్ చేయబడుతూ వుంది. |
| A picture is not being painted by her. | చిత్రాన్ని ఆమె పెయింటింగ్ వేయడం లేదు లేదా చిత్రం ఆమె చేత పెయింటింగ్ చేయబడడం లేదు. |
| Is a picture being painted by her? | చిత్రాన్ని ఆమె పెయింటింగ్ చేస్తోందా? లేదా చిత్రం ఆమె చేత పెయింటింగ్ చేయబడుతూ వుందా.? |
| Is a picture not being painted by her? | చిత్రాన్ని ఆమె పెయింటింగ్ చేయడం లేదా? లేదా చిత్రం ఆమె చేత పెయింటింగ్ చేయబడుతూ లేదా.? |
| 10. It is drinking water. | 10. ఇది నీటిని త్రాగుతూ ఉంది |
| Water is being drunk by it. | నీటిని ఇది తాగుతూ ఉంది లేదా నీరు దీని చేత త్రాగబడుతూ ఉంది. |
| Water is not being drunk by it. | నీటిని ఇది తాగుతూ లేదు, లేదా నీరు దీని చేత త్రాగబడుతూ లేదు. |
| Is water being drunk by it? | నీటిని ఇది తాగుతూ ఉందా?, లేదా నీరు దీని చేత త్రాగబడుతూ ఉందా? |
| Is water not being drunk by it? | నీటిని ఇది తాగుతూ లేదా?, లేదా నీరు దీని చేత త్రాగబడుతూ లేదా? |
By మరియు subject లేకుండా .మరియు క్రింది వాక్యాలు వరుసగా
Present continuous tense passive,
negative,
interrogative,
negative interrogative సెంటెన్సెస్
Table -2
| 1. Ramesh is being taught a new skill. | 1. రమేష్‌కి కొత్త నైపుణ్యం నేర్పుతున్నారు. Or రమేష్ కి కొత్త నైపుణ్యం నేర్పబడుతుంది.(ఎవరు నేర్పుతున్నారో వారి గురించి ఇక్కడ చెప్పాల్సిన అవసరం లేదు) |
| Ramesh is not being taught a new skill. | రమేష్‌కి కొత్త నైపుణ్యం నేర్పడం లేదు. |
| Is Ramesh being taught a new skill? | రమేష్‌కి కొత్త నైపుణ్యం నేర్పుతున్నారా? |
| Is Ramesh not being taught a new skill? | రమేష్‌కి కొత్త నైపుణ్యం నేర్పడం లేదా? |
| 2. Sudhakar is being guided through the process. | 2. సుధాకర్ కి ఒక ప్రక్రియ ద్వారా మార్గదర్శకత్వం చేస్తూ ఉన్నారు. |
| Sudhakar is not being guided through the process. | సుధాకర్ కి ఒక ప్రక్రియ ద్వారా మార్గదర్శకత్వం చేస్తూ ఉండలేదు. |
| Is Sudhakar being guided through the process? | సుధాకర్ కి ఒక ప్రక్రియ ద్వారా మార్గదర్శకత్వం చేస్తూ ఉన్నారా? |
| Is Sudhakar not being guided through the process? | సుధాకర్ కి ఒక ప్రక్రియ ద్వారా మార్గదర్శకత్వం చేస్తూ ఉండ లేదా ? |
| 3. Mahesh is being asked to join the meeting. | 3. మహేష్‌ని మీటింగ్‌లో జాయిన్ అవమని అడుగుతున్నారు. |
| Mahesh is not being asked to join the meeting. | మహేష్‌ని మీటింగ్‌లో జాయిన్ అవమని అడగడం లేదు |
| Is Mahesh being asked to join the meeting? | మహేష్‌ని మీటింగ్‌లో జాయిన్ అవమని అడుగుతున్నారా? |
| Is Mahesh not being asked to join the meeting? | మహేష్‌ని మీటింగ్‌లో జాయిన్ అవమని అడగడం లేదా? |
| 4. Sangeetha is being assigned a critical task. | 4. సంగీతా కి ఒక క్లిష్టమైన పని అప్పగిస్తూవున్నారు లేదా సంగీతకు ఒక క్లిష్టమైన పని అప్పగించబడుతూ ఉంది. |
| Sangeetha is not being assigned a critical task. | సంగీతకు క్లిష్టమైన పనిని అప్పగిస్తూ వుండ లేదు. |
| Is Sangeetha being assigned a critical task? | సంగీతా కి ఒక క్లిష్టమైన పని అప్పగిస్తూవున్నారా? |
| Is Sangeetha not being assigned a critical task? | సంగీతా కి ఒక క్లిష్టమైన పని అప్పగిస్తూఉండ లేదా? |
| 5. Ramesh is being invited to participate in the discussion. | 5. రమేష్‌ను చర్చలో పాల్గొనడానికి ఆహ్వానిస్తువున్నారు. |
| Ramesh is not being invited to participate in the discussion. | రమేష్‌ను చర్చలో పాల్గొనడానికి ఆహ్వానిస్తువుండలేదు. |
| Is Ramesh being invited to participate in the discussion? | రమేష్‌ను చర్చలో పాల్గొనడానికి ఆహ్వానిస్తున్నారా? |
| Is Ramesh not being invited to participate in the discussion? | రమేష్‌ను చర్చలో పాల్గొనడానికి ఆహ్వానించడం లేదా? |
| 6. Sudhakar is being evaluated for his performance. | 6. సుధాకర్ ని అతని నటనకు అంచనాలు వేస్తున్నారు. |
| Sudhakar is not being evaluated for his performance. | సుధాకర్ ని అతని నటనకు అంచనాలు వేయడంలేదు . |
| Is Sudhakar being evaluated for his performance? | సుధాకర్ ని అతని నటనకు అంచనాలు వేస్తున్నారా? |
| Is Sudhakar not being evaluated for his performance? | సుధాకర్ ని అతని నటనకు అంచనాలు వేయడంలేదా? |
| 7. Mahesh is being offered additional support. | 7. మహేష్‌కి అదనపు మద్దతు ఇస్తూవున్నారు.లేదా రమేష్ కి అదనపు మద్దతు ఇవ్వబడుతూవుంది? |
| Mahesh is not being offered additional support. | మహేష్‌కి అదనపు మద్దతు ఇస్తూవుండలేదు. |
| Is Mahesh being offered additional support? | మహేష్‌కి అదనపు మద్దతు ఇస్తూవున్నారా? |
| Is Mahesh not being offered additional support? | మహేష్‌కి అదనపు మద్దతు ఇస్తూవుండలేదా? |
| 8. Sangeetha is being trained for the new role. | 8. సంగీత కి కొత్త పాత్ర కోసం శిక్షణ ఇస్తూ ఉన్నారు లేదా సంగీత కి కొత్త పాత్ర కోసం శిక్షణ ఇవ్వబడుతూవుంది. |
| Sangeetha is not being trained for the new role. | సంగీత కి కొత్త పాత్ర కోసం శిక్షణ ఇస్తూ ఉండలేదు |
| Is Sangeetha being trained for the new role? | సంగీత కి కొత్త పాత్ర కోసం శిక్షణ ఇస్తూ ఉన్నారా? |
| Is Sangeetha not being trained for the new role? | సంగీత కి కొత్త పాత్ర కోసం శిక్షణ ఇస్తూ వుండలేదా? |
| 9. Ramesh is being questioned about the incident. | 9. రమేష్ ని సంఘటన గురించి ప్రశ్నిస్తూ ఉన్నారు |
| Ramesh is not being questioned about the incident. | రమేష్ ని సంఘటన గురించి ప్రశ్నించడం లేదు |
| Is Ramesh being questioned about the incident? | రమేష్ ని సంఘటన గురించి ప్రశ్నిస్తూ ఉన్నారా? |
| Is Ramesh not being questioned about the incident? | రమేష్ ని సంఘటన గురించి ప్రశ్నిస్తూ ఉండలేదా? |
| 10. Sudhakar is being shown the way to the office. | 10. సుధాకర్ కి ఆఫీసుకి దారి చూపిస్తున్నారు. |
| Sudhakar is not being shown the way to the office. | సుధాకర్‌కి ఆఫీసుకు వెళ్లే దారి చూపడం లేదు. |
| Is Sudhakar being shown the way to the office? | సుధాకర్‌కి ఆఫీసుకు దారి చూపిస్తున్నారా? |
| Is Sudhakar not being shown the way to the office? | సుధాకర్‌కి ఆఫీసుకు దారి చూపడం లేదా? |
Table-3
| 1. Ramesh is being given detailed instructions. | 1. రమేష్‌కి వివరణాత్మక సూచనలు ఇవ్వబడుతున్నాయి. |
| Ramesh is not being given detailed instructions. | రమేష్‌కు వివరణాత్మక సూచనలు ఇవ్వడం లేదు. |
| Is Ramesh being given detailed instructions? | రమేష్‌కి వివరణాత్మక సూచనలు ఇస్తున్నారా? |
| Is Ramesh not being given detailed instructions? | రమేష్‌కి వివరణాత్మక సూచనలు ఇవ్వడంలేద? |
| 2. Sudhakar is being prepared for the presentation. | 2.సుధాకర్ ను ప్రజెంటేషన్ కొరకు సిద్ధపరుస్తూ ఉన్నారు లేదా సుధాకర్ ప్రజెంటేషన్ కొరకు సిద్ధపరచబడుతున్నాడు |
| Sudhakar is not being prepared for the presentation. | సుధాకర్ ను ప్రజెంటేషన్ కొరకు సిద్ధపరిస్తూ ఉండలేదు |
| Is Sudhakar being prepared for the presentation? | సుధాకర్ ను ప్రజెంటేషన్ కొరకు సిద్ధపరుస్తూ ఉన్నారా? |
| Is Sudhakar not being prepared for the presentation? | సుధాకర్ ను ప్రజెంటేషన్ కొరకు సిద్ధపరుస్తూ ఉండ లేదా? |
| 3. Mahesh is being briefed about the project. | 3.మహేష్ కి ప్రాజెక్టు గురించి క్లుప్తంగా వివరిస్తూ ఉన్నారు. |
| Mahesh is not being briefed about the project. | మహేష్ కి ప్రాజెక్టు గురించి క్లుప్తంగా వివరిస్తూ ఉండలేదు. |
| Is Mahesh being briefed about the project? | మహేష్ కి ప్రాజెక్టు గురించి క్లుప్తంగా వివరిస్తూ ఉన్నారా.? |
| Is Mahesh not being briefed about the project? | మహేష్ కి ప్రాజెక్టు గురించి క్లుప్తంగా వివరిస్తూ ఉండ లేదా.? |
| 4. Sangeetha is being introduced to the team. | 4. సంగీతాని బృందానికి పరిచయం చేస్తూ ఉన్నారు లేదా సంగీత బృందానికి పరిచయం చేయబడుతూ వుంది. |
| Sangeetha is not being introduced to the team. | సంగీతాని బృందానికి పరిచయం చేస్తూ లేరు |
| Is Sangeetha being introduced to the team? | సంగీతాని బృందానికి పరిచయం చేస్తూ ఉన్నారా? |
| Is Sangeetha not being introduced to the team? | సంగీతాని బృందానికి పరిచయం చేస్తూ లేరా? |
| 5. Ramesh is being informed about the changes. | 5. రమేష్ కి మార్పుల గురించి తెలియజేస్తున్నారు. మార్పుల గురించి రమేష్ కి తెలియజేయబడుతుంది |
| Ramesh is not being informed about the changes. | రమేష్ కి మార్పుల గురించి తెలియజేస్తు లేరు |
| Is Ramesh being informed about the changes? | రమేష్ కి మార్పుల గురించి తెలియజేస్తువున్నారా? |
| Is Ramesh not being informed about the changes? | రమేష్ కి మార్పుల గురించి తెలియజేస్తు లేరా? |
| 6. Sudhakar is being considered for a promotion. | 6. సుధాకర్‌ని ప్రమోషన్ కోసం పరిశీలిస్తున్నారు. లేదా సుధాకర్ ప్రమోషన్ కొరకు పరిశీలించబడుతున్నాడు |
| Sudhakar is not being considered for a promotion. | సుధాకర్‌ను ప్రమోషన్‌కు పరిగణనలోకి తీసుకోవడం లేదు. |
| Is Sudhakar being considered for a promotion? | సుధాకర్‌ను ప్రమోషన్‌కు పరిశీలిస్తున్నారా? |
| Is Sudhakar not being considered for a promotion? | సుధాకర్‌ను ప్రమోషన్‌కు పరిగణనలోకి తీసుకోవడం లేదా? |
| 7. Mahesh is being offered a chance to lead the team. | 7. టీమ్‌కి నాయకత్వం వహించే అవకాశం మహేష్‌కి అందజేస్తున్నారు. |
| Mahesh is not being offered a chance to lead the team. | టీమ్‌కి నాయకత్వం వహించే అవకాశం మహేష్‌కి రావడం లేదు. |
| Is Mahesh being offered a chance to lead the team? | టీమ్‌కి నాయకత్వం వహించే అవకాశం మహేష్‌కి ఇస్తున్నారా? |
| Is Mahesh not being offered a chance to lead the team? | టీమ్‌కి నాయకత్వం వహించే అవకాశం మహేష్‌కు ఇవ్వడం లేదా? |
| 8. Sangeetha is being included in the main project. | 8. సంగీతాని ప్రధాన ప్రాజెక్టులో చేరుస్తున్నారు లేదా సంగీత ప్రధాన ప్రాజెక్ట్‌లో చేర్చబడుతోంది. |
| Sangeetha is not being included in the main project. | సంగీత ప్రధాన ప్రాజెక్ట్‌లో చేర్చబడలేదు. |
| Is Sangeetha being included in the main project? | సంగీతాని ప్రధాన ప్రాజెక్టులో చేరుస్తున్నారా? |
| Is Sangeetha not being included in the main project? | సంగీతాని ప్రధాన ప్రాజెక్టులో చేరుస్తూ ఉండ లేదా? |
| 9. Ramesh is being trained in advanced techniques. | 9. రమేశ్‌కి అధునాతన పద్ధతుల్లో శిక్షణ ఇస్తున్నారు. లేదా రమేష్ కు అధునాతన పద్ధతుల్లో శిక్షణ ఇవ్వబడుతుంది. |
| Ramesh is not being trained in advanced techniques. | రమేశ్‌కు అధునాతన పద్ధతుల్లో శిక్షణ ఇవ్వడం లేదు. |
| Is Ramesh being trained in advanced techniques? | రమేశ్‌కు అధునాతన పద్ధతుల్లో శిక్షణ ఇస్తున్నారా? |
| Is Ramesh not being trained in advanced techniques? | రమేష్‌కి అధునాతన టెక్నిక్స్‌లో శిక్షణ ఇవ్వడం లేదా? |
| 10. Sudhakar is being provided with the required resources. | 10. సుధాకర్ కి కావాల్సిన వనరులను అందిస్తున్నారు. |
| Sudhakar is not being provided with the required resources. | సుధాకర్‌కి అవసరమైన వనరులు సమకూర్చడం లేదు. |
| Is Sudhakar being provided with the required resources? | సుధాకర్‌కి కావాల్సిన వనరులు అందజేస్తున్నారా? |
| Is Sudhakar not being provided with the required resources? | సుధాకర్‌కి అవసరమైన వనరులు సమకూర్చడం లేదా? |
Table-4
| 1. Rajesh is being evaluated by the supervisors. | 1. రాజేష్‌ను సూపర్‌వైజర్లు మూల్యాంకనం చేస్తున్నారు. |
| Rajesh is not being evaluated by the supervisors. | రాజేష్ ను పర్యవేక్షకులు మూల్యాంకనం చేయడం లేదు. |
| Is Rajesh being evaluated by the supervisors? | రాజేష్‌ను సూపర్‌వైజర్లు మూల్యాంకనం చేస్తున్నారా? |
| Is Rajesh not being evaluated by the supervisors? | రాజేష్‌ను సూపర్‌వైజర్లు మూల్యాంకనం చేయడం లేదా? |
| 2. Suman is being monitored for his progress. | 2. సుమన్ పురోగతిని పర్యవేక్షిస్తున్నారు |
| Suman is not being monitored for his progress. | సుమన్ పురోగతిని పర్యవేక్షించడం లేదు. |
| Is Suman being monitored for his progress? | సుమన్ పురోగతిని పర్యవేక్షిస్తున్నారా? |
| Is Suman not being monitored for his progress? | సుమన్ పురోగతిని పర్యవేక్షించడం లేదా? |
| 3. Mahesh is being assisted with the new software. | 3. మహేష్ కి కొత్త సాఫ్ట్వేర్ తో సహాయం చేస్తూ ఉన్నారు లేదా మహేష్ కి కొత్త సాఫ్ట్వేర్ తో సహాయం చేయబడుతుంది |
| Mahesh is not being assisted with the new software. | మహేష్ కి కొత్త సాఫ్ట్వేర్ తో సహాయం చేస్తూ ఉండలేదు |
| Is Mahesh being assisted with the new software? | మహేష్ కి కొత్త సాఫ్ట్వేర్ తో సహాయం చేస్తూ ఉన్నారా? |
| Is Mahesh not being assisted with the new software? | మహేష్ కి కొత్త సాఫ్ట్వేర్ తో సహాయం చేస్తూ లేరా? |
| 5. Ramesh is being updated about the new policies. | 5. రమేష్ ను కొత్త పాలసీల గురించి అప్డేట్ చేస్తున్నారు లేదా రమేష్ కొత్త పాలసీల గురించి అప్డేట్ చేయబడుతున్నాడు |
| Ramesh is not being updated about the new policies. | రమేష్ ను కొత్త పాలసీల గురించి అప్డేట్ చేస్తూ ఉండలేదు |
| Is Ramesh being updated about the new policies? | రమేష్ ను కొత్త పాలసీల గురించి అప్డేట్ చేస్తున్నారా? |
| Is Ramesh not being updated about the new policies? | రమేష్ ను కొత్త పాలసీల గురించి అప్డేట్ చేయడం లేదా? |
| 6. Venkatrao is being informed about the upcoming event. | 6. వెంకట్రావుకు రాబోయే ఈవెంట్ గురించి తెలియజేస్తున్నారు. |
| Venkatrao is not being informed about the upcoming event. | వెంకట్రావుకు రాబోయే ఈవెంట్ గురించి తెలియజేయడం లేదు. |
| Is Venkatrao being informed about the upcoming event? | వెంకట్రావుకు రాబోయే ఈవెంట్ గురించి తెలియజేస్తున్నారా.? |
| Is Venkatrao not being informed about the upcoming event? | వెంకట్రావుకు రాబోయే ఈవెంట్ గురించి తెలియజేస్తున్నారా.? |
| 8. Angel is being encouraged to take the lead. | 8. ఏంజెల్ ను నాయకత్వం వహించమని ప్రోత్సహిస్తూ ఉన్నారు. నాయకత్వం వహించమని ఏంజెల్ ప్రోత్సహించబడుతుంది |
| Angel is not being encouraged to take the lead. | ఏంజెల్ ను నాయకత్వం వహించమని ప్రోత్సహిస్తూ ఉండలేదు |
| Is Angel being encouraged to take the lead? | ఏంజెల్ ను నాయకత్వం వహించమని ప్రోత్సహిస్తూ ఉన్నారా? |
| Is Angel not being encouraged to take the lead? | ఏంజెల్ ను నాయకత్వం వహించమని ప్రోత్సహిస్తూ ఉండ లేదా? |
| 9. Jagan is being prepared for the client meeting. | 9. జగన్ ను ఖాతాదారుల సమావేశానికి సిద్ధపరుస్తూ ఉన్నారు. లేదా జగన్ ఖాతాదారుల సమావేశానికి సిద్ధపరచబడుతున్నాదు |
| Jagan is not being prepared for the client meeting. | జగన్ ను ఖాతాదారుల సమావేశానికి సిద్ధపరుస్తూ ఉండలేదు |
| Is Jagan being prepared for the client meeting? | జగన్ ను ఖాతాదారుల సమావేశానికి సిద్ధపరుస్తూ ఉన్నారా? |
| Is Jagan not being prepared for the client meeting? | జగన్ ను ఖాతాదారుల సమావేశానికి సిద్ధపరుస్తూ ఉండ లేదా? |
| 10. Sudhakar is being briefed on the safety protocols. | సుధాకర్‌కి సేఫ్టీ ప్రోటోకాల్స్‌పై అవగాహన కల్పిస్తున్నారు. |
| Sudhakar is not being briefed on the safety protocols. | సుధాకర్‌కి సేఫ్టీ ప్రోటోకాల్స్ గురించి వివరించడం లేదు. |
| Is Sudhakar being briefed on the safety protocols? | సుధాకర్‌కి సేఫ్టీ ప్రోటోకాల్స్ గురించి వివరిస్తున్నారా? |
| Is Sudhakar not being briefed on the safety protocols | సుధాకర్‌కి సేఫ్టీ ప్రోటోకాల్స్ గురించి వివరించడం లేదా? |
పైన కనిపిస్తున్న Interrogative, and negative interrogative Sentences ముందు ఏ మార్పు చేయకుండా క్రింద కనిపిస్తున్న ప్రశ్న పదాలను ఉంచినట్లయితే అవి ఆటోమేటిక్గా wh questions మరియు wh negatives గా మారిపోతాయి.
why,where,when,how లతో ప్రశ్న వాక్యాలు
| why is Sudhakar being briefed on the safety protocols? | ఎందుకు సుధాకర్‌కి సేఫ్టీ ప్రోటోకాల్స్ గురించి వివరిస్తున్నారు ? |
| where is Sudhakar being briefed on the safety protocols? | ఎక్కడ సుధాకర్‌కి సేఫ్టీ ప్రోటోకాల్స్ గురించి వివరిస్తున్నారు ? |
| when is Sudhakar being briefed on the safety protocols? | ఎప్పుడ సుధాకర్‌కి సేఫ్టీ ప్రోటోకాల్స్ గురించి వివరిస్తున్నారు ? |
| How is Sudhakar being briefed on the safety protocols? | ఎలా సుధాకర్‌కి సేఫ్టీ ప్రోటోకాల్స్ గురించి వివరిస్తున్నారు ? |
| Wh questions Negative | |
| why is Sudhakar not being briefed on the safety protocols | ఎందుకు సుధాకర్‌కి సేఫ్టీ ప్రోటోకాల్స్ గురించి వివరించడం లేదు ? |
| where is Sudhakar not being briefed on the safety protocols | ఎక్కడ సుధాకర్‌కి సేఫ్టీ ప్రోటోకాల్స్ గురించి వివరించడం లేదు ? |
| when is Sudhakar not being briefed on the safety protocols | ఎప్పుడు సుధాకర్‌కి సేఫ్టీ ప్రోటోకాల్స్ గురించి వివరించడం లేదు ? |
| how isSudhakar not being briefed on the safety protocols | ఎలా సుధాకర్‌కి సేఫ్టీ ప్రోటోకాల్స్ గురించి వివరించడం లేదు ? |
