1.Future Action:
భవిష్యత్తులో చేసే పనులను తెలియజేయడానికి.వీటిని మనం ముందు నేర్చుకున్నట్లుగా Action sentences అని కూడా అంటారు.
| He, She, It, I, We, You, They | will | V1 | Object |
వ్యతిరేక వాక్యాలు మరియు ప్రశ్న వాక్యాలు గురించి ముందు టాపిక్ లో మనము ఆల్రెడీ నేర్చుకుని ఉన్నాము
| 1. I will go to school tomorrow. | నేను రేపు స్కూల్ కి వెళ్తాను. |
| I will not go to school tomorrow. | నేను రేపు స్కూల్ కి వెళ్ళను. |
| Will I go to school tomorrow? | నేను రేపు స్కూల్ కి వెళ్తానా? |
| Will I not go to school tomorrow? | నేను రేపు స్కూల్ కి వెళ్ళనా? |
| 2. She will call you later. | ఆమె తరువాత మీకు కాల్ చేస్తుంది. |
| She will not call you later. | ఆమె తరువాత మీకు కాల్ చేయదు. |
| Will she call you later? | ఆమె తర్వాత మీకు కాల్ చేస్తుందా? |
| Will she not call you later? | ఆమె తరువాత మీకు కాల్ చేయదా? |
| 3. They will complete the work soon. | వారు త్వరగా పని పూర్తి చేస్తారు. |
| They will not complete the work soon. | వాళ్ళు త్వరగా పని పూర్తి చేయరు. |
| Will they complete the work soon? | వాళ్ళు త్వరగా పని పూర్తి చేస్తారా? |
| Will they not complete the work soon? | వాళ్ళు త్వరగా పని పూర్తి చేయరా? |
| 4. We will start the class at 10. | మేము 10 గంటలకు తరగతి ప్రారంభిస్తాము. |
| We will not start the class at 10. | మేము 10 గంటలకు తరగతి ప్రారంభించము. |
| Will we start the class at 10? | మేము తరగతి 10 గంటలకు ప్రారంభిస్తామా? |
| Will we not start the class at 10? | మేము తరగతి 10 గంటలకు ప్రారంభించమా? |
| 5. He will help his friend. | అతను తన స్నేహితుడికి సహాయం చేస్తాడు. |
| He will not help his friend. | అతను తన స్నేహితుడికి సహాయం చేయడు. |
| Will he help his friend? | అతను తన స్నేహితుడికి సహాయం చేస్తాడా? |
| Will he not help his friend? | అతను తన స్నేహితుడికి సహాయం చేయడా? |
| 6. I will buy a new phone. | నేను కొత్త ఫోన్ కొంటాను. |
| I will not buy a new phone. | నేను కొత్త ఫోన్ కొనను. |
| Will I buy a new phone? | నేను కొత్త ఫోన్ కొంటానా? |
| Will I not buy a new phone? | నేను కొత్త ఫోన్ కొననా ? |
| 7. She will learn English. | ఆమె ఇంగ్లీష్ నేర్చుకుంటుంది. |
| She will not learn English. | ఆమె ఇంగ్లీష్ నేర్చుకోదు. |
| Will she learn English? | ఆమె ఇంగ్లీష్ నేర్చుకుంటుందా? |
| Will she not learn English? | ఆమె ఇంగ్లీష్ నేర్చుకోదా? |
| 8. They will visit their village. | వారు తమ గ్రామాన్ని సందర్శిస్తారు. |
| They will not visit their village. | వారు తమ గ్రామాన్ని సందర్శించరు. |
| Will they visit their village? | వారు తమ గ్రామాన్ని సందర్శిస్తారా? |
| Will they not visit their village? | వారు తమ గ్రామాన్ని సందర్శించరా? |
| 9. We will watch a movie tonight. | మనం ఈ రాత్రి సినిమా చూస్తాము. |
| We will not watch a movie tonight. | మనం ఈ రాత్రి సినిమా చూడము. |
| Will we watch a movie tonight? | మనం ఈ రాత్రి సినిమా చూస్తామా.? |
| Will we not watch a movie tonight? | మనం ఈ రాత్రి సినిమా చూడమా.? |
| 10. He will open the shop early. | అతను దుకాణం త్వరగా తెరుస్తాడు. |
| He will not open the shop early. | అతను దుకాణం త్వరగా తెరవడు. |
| Will he open the shop early? | అతను దుకాణం త్వరగా తెరుస్తాడా? |
| Will he not open the shop early? | అతను దుకాణం త్వరగా తెరవడా? |
| 11. I will meet my teacher. | నేను నా గురువుగారిని కలుస్తాను. |
| I will not meet my teacher. | నేను నా గురువుగారిని కలవను. |
| Will I meet my teacher? | నేను నా గురువుగారిని కలుస్తానా? |
| Will I not meet my teacher? | నేను నా గురువుగారిని కలవనా? |
| 12. She will prepare for the exam. | ఆమె పరీక్షకు సిద్ధమవుతుంది. |
| She will not prepare for the exam. | ఆమె పరీక్షకు సిద్ధం కాదు. |
| Will she prepare for the exam? | ఆమె పరీక్షకు సిద్ధమవుతుందా? |
| Will she not prepare for the exam? | ఆమె పరీక్షకు సిద్ధం కాదా? |
| 13. They will play cricket tomorrow. | వాళ్ళు రేపు క్రికెట్ ఆడతారు. |
| They will not play cricket tomorrow. | వాళ్ళు రేపు క్రికెట్ ఆడరు. |
| Will they play cricket tomorrow? | వాళ్ళు రేపు క్రికెట్ ఆడతారా? |
| Will they not play cricket tomorrow? | వాళ్ళు రేపు క్రికెట్ ఆడరా? |
| 14. We will finish the project today. | మనం ఈరోజు ప్రాజెక్ట్ పూర్తి చేస్తాము. |
| We will not finish the project today. | మనం ఈరోజు ప్రాజెక్టును పూర్తి చేయము. |
| Will we finish the project today? | మనం ఈ రోజు ప్రాజెక్ట్ పూర్తి చేస్తామా? |
| Will we not finish the project today? | మనం ఈరోజు ప్రాజెక్ట్ పూర్తి చేయమా? |
| 15. He will travel by train. | అతను రైలులో ప్రయాణం చేస్తాడు. |
| He will not travel by train. | అతను రైలులో ప్రయాణించడు. |
| Will he travel by train? | అతను రైలులో ప్రయాణిస్తాడా? |
| Will he not travel by train? | అతను రైలులో ప్రయాణించడా? |
| 16. I will send the message now. | నేను ఇప్పుడు సందేశం పంపుతాను. |
| I will not send the message now. | నేను ఇప్పుడు సందేశం పంపను. |
| Will I send the message now? | నేను ఇప్పుడు సందేశం పంపుతానా? |
| Will I not send the message now? | నేను ఇప్పుడు సందేశం పంపనా? |
| 17. She will join the course next month. | ఆమె వచ్చే నెలలో కోర్సులో చేరుతుంది. |
| She will not join the course next month. | ఆమె వచ్చే నెలలో కోర్సులో చేరదు. |
| Will she join the course next month? | ఆమె వచ్చే నెలలో కోర్సులో చేరుతుందా? |
| Will she not join the course next month? | ఆమె వచ్చే నెలలో కోర్సులో చేరదా? |
| 18. They will attend the meeting. | వారు సమావేశానికి హాజరవుతారు. |
| They will not attend the meeting. | వారు సమావేశానికి హాజరు కారు. |
| Will they attend the meeting? | వారు సమావేశానికి హాజరవుతారా? |
| Will they not attend the meeting? | వారు సమావేశానికి హాజరు కారా? |
| 19. We will clean the house. | మేము ఇల్లు శుభ్రం చేస్తాము. |
| We will not clean the house. | మేము ఇంటిని శుభ్రం చేయము. |
| Will we clean the house? | మేము ఇల్లు శుభ్రం చేస్తామా? |
| Will we not clean the house? | మేము ఇల్లు శుభ్రం చేయమా? |
| 20. He will start a new business. | అతను కొత్త వ్యాపారం ప్రారంభిస్తాడు. |
| He will not start a new business. | అతను కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడు. |
| Will he start a new business? | అతను కొత్త వ్యాపారం ప్రారంభిస్తాడా? |
| Will he not start a new business? | అతను కొత్త వ్యాపారం ప్రారంభించడా? |

