AM, IS, ARE, WAS, WERE, వీటిని Be Forms  అంటారు

వీటిలో Am, Is, Are లను Present Be forms అని

Was ,Were లను Past Beforms  అని అంటారు

Is= ఉన్నది,  ఉన్నాడు

సింగులర్ సబ్జెక్టులు  అయిన He, She, It, that లకు మాత్రమే “is” ఉపయోగిస్తారు.

Is ని   ఏఏ సందర్భాలలో ఉపయోగిస్తారో  తెలుసుకుందాం.

1.Present continuous tense

Is ని  Present continuous tense  లో ఉపయోగిస్తారు. ఇది మనం Tenses

లో తెలుసుకున్నాము. ఒక పని  ప్రస్తుతం  కంటిన్యూగా జరుగుతున్నప్పుడు  ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ ని  ఉపయోగిస్తారు. 

ఒక సెంటెన్స్ లో సబ్జెక్టులు గా  He, She, It, that  ఉన్నప్పుడు verb4 ఉపయోగించి  వాక్య నిర్మాణం చేస్తారు. 

Example: 

He is coming to hear  =  అతను ఇక్కడికి వస్తూ ఉన్నాడు

Negative Sentence  గా మార్చుటకు Is ప్రక్కన  not  చేరిస్తే సరిపోతుంది. 

He is not coming to here  = అతను ఇక్కడికి రావడం లేదు

పై రెండు వాక్యాలను ప్రశ్న వాక్యాలుగా మార్చుటకు Is  ని సెంటెన్సెస్ ప్రారంభంలో ఉంచితే సరిపోతుంది

Is he coming to hear? =  అతను  ఇక్కడికి వస్తూ ఉన్నాడా?

Is he not coming to here? = అతని ఇక్కడికి  రావడం లేదా?

1.He is reading a book.అతను ఒక పుస్తకం చదువుతూ ఉన్నాడు
He is not reading a book.అతను పుస్తకం చదవడం లేదు.
Is he reading a book?అతను పుస్తకం  చదువుతూ ఉన్నాడా?
Is he not reading a book?అతను పుస్తకం చదవడం లేదా?
  
2. She is cooking food.ఆమె వంట  చేస్తూ ఉంది
She is not cooking food.ఆమె వంట చేయడం లేదు.
Is she cooking food?ఆమె వంట  చేస్తూ ఉందా?
Is she not cooking food?ఆమె వంట చేయడం లేదా?
  
3. It is raining outside.బయట వర్షం పడుతూ ఉంది.
It is not raining outside.బయట వర్షం పడటం లేదు.
Is it raining outside?బయట వర్షం  పడుతూ ఉందా?
Is it not raining outside?బయట వర్షం పడటం లేదా?
  
4. That is working properly.అది సరిగ్గా  పనిచేస్తూ ఉంది.
That is not working properly.అది సరిగ్గా పనిచేయడం లేదు.
Is that working properly?అది సరిగ్గా  పని చేస్తూ ఉందా?
Is that not working properly?అది సరిగ్గా పనిచేయడం లేదా?
  
5. Ravi is playing cricket.రవి క్రికెట్  ఆడుతూ ఉన్నాడు.
Ravi is not playing cricket.రవి క్రికెట్ ఆడటం లేదు.
Is Ravi playing cricket?రవి క్రికెట్  ఆడుతూ ఉన్నాడా?
Is Ravi not playing cricket?రవి క్రికెట్ ఆడటం లేదా?
  
6. Sumathi is learning English.సుమతి ఇంగ్లీష్  నేర్చుకుంటూ ఉంది.
Sumathi is not learning English.సుమతి ఇంగ్లీష్ నేర్చుకోవడం లేదు.
Is Sumathi learning English?సుమతి ఇంగ్లీష్  నేర్చుకుంటూ ఉందా?
Is Sumathi not learning English?సుమతి ఇంగ్లీష్  నేర్చుకోవడం లేదా?

 

2.Emotion: ప్రస్తుత సబ్జెక్టు యొక్క స్వబావం  గురించి తెలియజేయడానికి

Subject + is+ adjective

He is happy.అతను సంతోషంగా ఉన్నాడు.
She is sad.ఆమె విచారంగా ఉంది.
The child is excited.పిల్లవాడు ఉత్సాహంగా ఉన్నాడు.
Ravi is calm.రవి ప్రశాంతంగా ఉన్నాడు.
Sumathi is angry.సుమతికి కోపం వచ్చింది.
The girl is nervous.ఆ అమ్మాయి కంగారుగా ఉంది.
He is satisfied.అతను సంతృప్తి చెందాడు.

He is tired 

పై వాక్యాన్ని గమనించండి. 

Is = helping verb

Tired = verb3 (past participle = verb 3 అంటే పని జరిగిపోయింది)

సాధారణంగా adjective సబ్జెక్టు యొక్క గుణాన్ని వర్ణిస్తుంది. సబ్జెక్టు తెల్లగా ఉన్నాడా లేదా నల్లగా ఉన్నాడా , కోపంగా ఉన్నాడా లేదా శాంతంగా ఉన్నాడా, ఆరోగ్యం గా ఉన్నాడా లేదా అనారోగ్యంగా ఉన్నాడా  ఈ విధంగా సబ్జెక్టు యొక్క అనేక రకాలైనటువంటి గుణాలను వర్ణించేది adjective. 

ఫై సెంటెన్సులో  verb3 అయిన tired సబ్జెక్టు యొక్క గుణాన్ని లేదా స్థితిని తెలియజేస్తూ adjective  లాగా పని చేస్తుంది 

Is, am, are, was, were లాంటి బీఫార్మన్స్ తో పాటు verb3 ఉపయోగించి సబ్జెక్టు యొక్క గుణాన్ని లేదా స్థితిని కూడా తెలియజేస్తున్నారు. ఈ చిన్న విషయాన్ని గుర్తించుకోండి.

Tired = అంటే అర్థం అలసిపోవడం జరిగిపోయింది అని అర్థం.

Is = ఉన్నది లేదా ఉన్నాడు

He is tired = అతను అలసిపోయి  ఉన్నాడు. 

పై వాక్యంలో He సింగులర్ కాబట్టి is ఉపయోగించాము. plural అయితే are ఉపయోగిస్తారు. 

He is tired.అతను అలసిపోయాడు.
She is bored.ఆమె విసుగు పడి ఉంది
It is broken.ఇది విరిగిపోయి ఉంది
He is confused.అతను అయోమయంలో ఉన్నాడు.
She is excited.ఆమె ఉత్సాహంగా ఉంది.
It is closed.అది  మూసి వేయబడి ఉంది
He is surprised.అతను  ఆశ్చర్యపోయి ఉన్నాడు 
She is worried.ఆమె ఆందోళన చెంది ఉంది
It is damaged.అది  పాడైపోయి ఉంది 
He is disappointed.అతను నిరాశ చెంది ఉన్నాడు

 

It is 6 o’clock.

పై వాక్యాన్ని గమనించండి ఇక్కడ it  ఎలా వచ్చింది. సమయాన్ని గురించి, తేదీని గురించి ,వాతావరణాన్ని గురించి, కొన్ని పరిస్థితుల గురించి చెప్పేటప్పుడు it ఉపయోగిస్తారు.

సమయం సాయంత్రం ఐదు గంటలు అయింది, ఈరోజు సోమవారం, ఐదు కిలోమీటర్ల దూరం ఉంది, ఇది చాలా కష్టంగా ఉంది. ఈ విధంగా తెలుగులో చెప్పాల్సి వచ్చినప్పుడు సబ్జెక్టు అవసరం ఉండదు. కానీ ఇంగ్లీషులో తప్పనిసరిగా గ్రామర్ రూల్ ప్రకారం. ప్రతి సెంటెన్స్ లో కూడా సబ్జెక్ట్ ని ఉపయోగించాలి. సబ్జెక్టు లేని ఇటువంటి వాక్యాలు చెప్పాల్సి వచ్చినప్పుడు it ని  డమ్మీ subject  గా ఉపయోగిస్తారు. ఇటువంటి వాక్యాలలో It కి అర్థం ఉండదు.  అవసరం మాత్రమే ఉంటుంది 

It ని  ఎటువంటి వాక్యాలలో ఉపయోగిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం

A. Time (సమయం)

It is 6 o’clock.6 గంటలైంది.
It is 7 am.ఉదయం 7 గంటలైంది.
It is 10 pm.రాత్రి 10 గంటలైంది.
It is early.ఇది తొందరగా ఉంది.
It is late.ఆలస్యమైంది.
It is time for school.బడికి వెళ్ళే సమయం అయింది.
It is time to eat.తినడానికి సమయం అయింది.
It is noon now.ఇప్పుడు మధ్యాహ్నం అయింది.
It is midnight.అర్ధరాత్రి అయింది.
It is the right time.ఇది సరైన సమయం.

B. Date (తేదీ / రోజు)

It is Monday.ఈ రోజు సోమవారం.
It is Sunday today.ఈరోజు ఆదివారం.
It is January 1st.ఇది జనవరి 1వ తేదీ.
It is my birthday today.ఈరోజు నా పుట్టినరోజు.
It is a holiday.ఇది సెలవుదినం.
It is New Year’s Day.ఇది నూతన సంవత్సర దినోత్సవం.
It is the first day of the month.ఇది నెలలో మొదటి రోజు.
It is the last day of the year.ఇది సంవత్సరం చివరి రోజు.
It is a working day.ఇది పని దినం.
It is a special day.ఇది ఒక ప్రత్యేకమైన రోజు.

C. Weather (వాతావరణం)

It is hot today.ఈరోజు వేడిగా ఉంది.
It is cold outside.బయట చలిగా ఉంది.
It is sunny.ఎండగా ఉంది.
It is cloudy.మబ్బుగా ఉంది.
It is cool in the morning.ఉదయం చల్లగా ఉంటుంది.
It is warm now.ఇప్పుడు వెచ్చగా ఉంది.
It is windy today.ఈరోజు గాలులు వీస్తున్నాయి.
It is dry here.ఇక్కడ ఎండగా ఉంది.
It is pleasant weather.ఇది ఆహ్లాదకరమైన వాతావరణం.
It is bad weather.వాతావరణం బాగోలేదు.

D. Distance (దూరం)

It is five kilometers from here.ఇది ఇక్కడి నుండి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది.
It is very far.ఇది చాలా దూరం.
It is very near.ఇది చాలా దగ్గరగా ఉంది.
It is two miles away.అది రెండు మైళ్ళ దూరంలో ఉంది.
It is a long distance.ఇది చాలా దూరం.
It is a short distance.ఇది కొద్ది దూరం.
It is far from my house.ఇది నా ఇంటికి చాలా దూరంలో ఉంది.
It is near the bus stop.అది బస్ స్టాప్ దగ్గర ఉంది.
It is ten minutes from here.ఇక్కడి నుండి పది నిమిషాల దూరంలో ఉంది.
It is close to the school.అది స్కూల్ కి దగ్గరగా ఉంది.

E. Situation (పరిస్థితి / స్థితి)

It is easy to learn English.ఇంగ్లీష్ నేర్చుకోవడం సులభం.
It is difficult to understand.అర్థం చేసుకోవడం కష్టం.
It is important for students.విద్యార్థులకు ఇది ముఖ్యం.
It is good for health.ఇది ఆరోగ్యానికి మంచిది.
It is bad for children.ఇది పిల్లలకు చెడ్డది.
It is possible now.అది ఇప్పుడు సాధ్యమే.
It is not possible today.ఈరోజు అది సాధ్యం కాదు.
It is my mistake.అది నా తప్పు.
It is your turn.ఇప్పుడు మీ వంతు.
It is a problem.ఇది ఒక సమస్య.

 

 

3.Physical condition : ప్రస్తుత సబ్జెక్టు యొక్క శారీరిక స్థితి గురించి తెలియజేయడానికి IS ఉపయోగిస్తారు. 

He is tired.అతను అలసిపోయి వున్నాడు .
She is weak.ఆమె బలహీనంగా ఉంది.
The boy is sick.ఆ అబ్బాయికి అనారోగ్యంగా ఉంది.
My father is strong.నాన్నబలంగా వున్నాడు .
The man is injured.ఆ వ్యక్తి గాయ పది వున్నాడు .
The child is hungry.పిల్లవాడు  ఆకలిగా వున్నాడు .
She is sleepy.ఆమె నిద్రలో వుంది .

4.Mental state:ప్రస్తుత  సబ్జెక్టు యొక్క మానసిక స్థితి గురించి తెలియజేయడానికిIS ఉపయోగిస్తారు. 

He is confident.అతను నమ్మకంగా ఉన్నాడు.
She is confused.ఆమె అయోమయంలో ఉంది.
Ravi is relaxed.రవి ప్రశాంతంగా ఉన్నాడు.
Sumathi is worried.సుమతి ఆందోళగా వుంది .
The student is focused.విద్యార్థి ఏకాగ్రతతో ఉన్నాడు.
He is careless.అతను నిర్లక్ష్యంగా ఉన్నాడు.
She is alert.ఆమె అప్రమత్తంగా ఉంది.

 

5.Identity:ప్రస్తుత  సబ్జెక్టు యొక్క గుర్తింపుని లేదా సంబందాన్ని  తెలియజేయడానికి IS ఉపయోగిస్తారు. 

Ravi is my friend.రవి నా స్నేహితుడు.
She is my sister.ఆమె నా చెల్లి.
He is the leader.ఆయన ఒక నాయకుడు.
The boy is a hero.ఆ అబ్బాయి ఒక హీరో.
Sumathi is my neighbor.సుమతి నా పొరుగుది .
This man is a stranger.ఈ మనిషి ఒక అపరిచితుడు.
She is the winner.ఆమె విజేతగా వుంది.

 

6.Profession: ప్రస్తుత  సబ్జెక్టు యొక్క వృత్తిని గురించి తెలియజేయడానికి IS ఉపయోగిస్తారు. 

He is a teacher.అతను ఒక ఉపాధ్యాయుడు.
She is a doctor.ఆమె ఒక వైద్యురాలు.
Ravi is a driver.రవి ఒక డ్రైవర్.
Sumathi is a nurse.సుమతి ఒక నర్సు.
My father is a farmer.నాన్న ఒక రైతు.
He is an engineer.అతను ఒక ఇంజనీర్.
She is a tailor.ఆమె ఒక దర్జీ.

 

7.Age: ప్రస్తుత  సబ్జెక్టు యొక్క వయస్సు గురించి తెలియజేయడానికి IS ఉపయోగిస్తారు. 

 

He is ten years old.అతనికి పదేళ్ళు.
She is eight years old.ఆమెకు ఎనిమిది సంవత్సరాలు.
The boy is five.ఆ అబ్బాయికి ఐదు సంవత్సరాలు.
The girl is twelve.ఆ అమ్మాయికి పన్నెండు సంవత్సరాలు.
Ravi is thirty.రవి వయసు ముప్పై.
Sumathi is twenty.సుమతి వయసు ఇరవై.
My sister is sixteen.నా చెల్లికి పదహారేళ్లు.

8.Location:ప్రస్తుతం సబ్జెక్టు యొక్క స్థలాన్ని గురించి తెలియజేయడానికి IS ఉపయోగిస్తారు. 

He is at home.అతను ఇంట్లో ఉన్నాడు.
She is in the room.ఆమె గదిలో ఉంది.
The book is on the table.పుస్తకం టేబుల్ మీద ఉంది.
Ravi is at school.రవి స్కూల్లో ఉన్నాడు.
Sumathi is in the office.సుమతి ఆఫీసులో ఉంది.
The cat is under the chair.పిల్లి కుర్చీ కింద ఉంది.
My father is outside.నాన్న బయట ఉన్నారు.

 

 9.Time: ప్రస్తుత సమయాన్ని గురించి తెలియజేయడానికి IS ఉపయోగిస్తారు. 

Today is Monday.ఈరోజు సోమవారం.
Tomorrow is a holiday.రేపు సెలవు.
It is six o’clock.ఆరు గంటలైంది.
Now is the right time.ఇదే సరైన సమయం.
Yesterday is history.నిన్నటిది చరిత్ర.
This is the first day.ఇది మొదటి రోజు.
It is morning now.ఇప్పుడు ఉదయం అయింది.

 

10. Cost: ధర గురించి తెలియజేయడానికి IS ఉపయోగిస్తారు. 

This pen is ten rupees.ఈ పెన్ను పది రూపాయలు.
The book is cheap.ఆ పుస్తకం చౌక.
The phone is costly.ఆ ఫోన్ ఖరీదైనది.
That bag is expensive.ఆ బ్యాగ్ ఖరీదైనది.
This watch is valuable.ఈ గడియారం విలువైనది.
The shirt is affordable.ఆ చొక్కా ధర సరసమైనది.
The item is free.ఈ వస్తువు ఉచితం.

 

11.Quality : గుణాన్ని గురించి తెలియజేయడానికి IS ఉపయోగిస్తారు. 

The dress is beautiful.ఆ డ్రెస్ చాలా అందంగా ఉంది.
The road is narrow.రోడ్డు ఇరుకుగా ఉంది.
The answer is correct.సమాధానం సరైనది.
The idea is good.ఆలోచన బాగుంది.
The work is perfect.పని పరిపూర్ణంగా ఉంది.
The plan is simple.ప్రణాళిక సులభం.
The story is interesting.కథ ఆసక్తికరంగా ఉంది.

12.Size:పరిమాణం గురించి తెలియజేయడానికి IS ఉపయోగిస్తారు. 

The room is big.ఆ గది పెద్దది.
The box is small.ఆ పెట్టె చిన్నది.
The house is large.ఆ ఇల్లు చాలా పెద్దది.
The bag is heavy.ఆ సంచి బరువుగా ఉంది.
The bottle is light.బాటిల్ తేలికగా ఉంది.
The tree is tall.ఆ చెట్టు పొడవుగా ఉంది.
The table is short.టేబుల్ చిన్నగా ఉంది.

13. Color: ప్రస్తుత సబ్జెక్టు యొక్క రంగు గురించి తెలియజేయడానికి IS ఉపయోగిస్తారు. 

The flower is red.పువ్వు ఎరుపు రంగులో ఉంటుంది.
The sky is blue.ఆకాశం నీలంగా ఉంది.
The dress is white.ఆ డ్రెస్ తెల్లగా ఉంది.
The car is black.కారు నల్లగా ఉంది.
The leaf is green.ఆకు ఆకుపచ్చగా ఉంటుంది.
The flag is colorful.జెండా రంగురంగులది.
The wall is yellow.గోడ పసుపు రంగులో ఉంది.

14.Number (singular sense): సబ్జెక్టు యొక్క నంబర్ స్థితి తెలియజేయడానికి IS ఉపయోగిస్తారు. 

The answer is one.సమాధానం ఒకటి.
The boy is alone.ఆ అబ్బాయి ఒంటరిగా ఉన్నాడు.
The room is single.ఆ గది సింగిల్.
The item is unique.ఆ వస్తువు ప్రత్యేకమైనది.
The student is first.విద్యార్థి మొదటివాడు.
The prize is one.బహుమతి ఒకటి.
The ticket is single.టికెట్టు సింగిల్.
The bus is late.బస్సు ఆలస్యమైంది.

 

15.Situation :సబ్జెక్టు యొక్క స్థితిని గురించి తెలియజేయడానికి IS ఉపయోగిస్తారు. 

The shop is open.దుకాణం తెరిచి ఉంది.
The door is closed.తలుపు మూసి ఉంది.
The road is busy.రోడ్డు రద్దీగా ఉంది.
The class is silent.తరగతి నిశ్శబ్దంగా ఉంది.
The bus is late.బస్సు ఆలస్యమైంది.
The area is safe.ఆ ప్రాంతం సురక్షితంగా ఉంది.
The office is crowded.ఆఫీసు రద్దీగా ఉంది.

 

16.Possession:సబ్జెక్టు ప్రస్తుతం ఏమి కలిగి ఉన్నాడో తెలియజేయడానికి IS ఉపయోగిస్తారు. .

This book is mine.ఈ పుస్తకం నాది.
That house is his.ఆ ఇల్లు అతనిది.
The bag is hers.ఆ బ్యాగ్ ఆమెదే.
The land is Ravi’s.ఆ భూమి రవిది.
The phone is Sumathi’s.ఆ ఫోన్ సుమతిది.
This pen is yours.ఈ పెన్ను మీదే.
The responsibility is mine.బాధ్యత నాది.

ఇవి మాత్రమే కాకుండా

ఒక సెంటెన్స్ సింపుల్ ప్రెసెంట్ టెన్స్ లో మరియు  ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ లో ఉన్న ఒక  సెంటెన్స్ ని ప్యాసివ్ వాయిస్ లోకి మార్చినప్పుడు కూడా is వస్తుంది. 

CLICK HERE