Beform అయిన am ని కేవలం  ‘I (నేను) ‘ సబ్జెక్టు కు  మాత్రమే ఉపయోగిస్తారు. 

దీనిని ఎక్కువగా సింపుల్ ప్రెసెంట్ టెన్స్ లో ఉపయోగిస్తారు.

am= ఉన్నాను.

Am ని   ఏ ఏ సందర్భాలలో ఉపయోగిస్తారో  తెలుసుకుందాం

1. Present continuous tense

దీనిని Tenses  లో మనం నేర్చుకున్నాము.

I అనే సబ్జెక్టు ప్రస్తుతం ఏదైనా ఒక పనిని కంటిన్యూగా చేస్తూ ఉన్నప్పుడు am అనే be from మరియు verb 4 ఉపయోగించి వాక్య నిర్మాణం చేస్తారు. 

IAm Verb 4 Object 

 

Example: I am reading a book ( నేను ఒక పుస్తకం చదువుతూ  ఉన్నాను)

పై సెంటెన్స్ ని నెగటివ్ సెంటెన్స్ గా మార్చుటకు am ప్రక్కన not చేర్చాలి

I am not  reading a book

ఇప్పుడు పై రెండు  వాక్యాలను ప్రశ్నా వాక్యాలుగా మార్చుటకు am ని వాక్య ప్రారంభంలో ఉంచితే సరిపోతుంది

Am I reading a book 

Am I not  reading a book 

Examples:  క్రింది మీకు negative and interrogative sentences  ఆల్రెడీ అర్థం అయి ఉంటే వాటిని వదిలేయండి

1. I am reading a book.1. నేను ఒక పుస్తకం చదువుతూ ఉన్నాను
I am not reading a book.నేను ఒక పుస్తకం చదవడం లేదు
Am I reading a book?నేను ఒక పుస్తకం చదువుతూ ఉన్నానా?
Am I not reading a book?నేను ఒక పుస్తకం చదవడం లేదా?
  
2. I am writing a letter.2. నేను ఒక లేఖ రాస్తూ ఉన్నాను
I am not writing a letter.నేను ఒక లేఖ రాయడం లేదు
Am I writing a letter?నేను ఒక లేఖ రాస్తూ ఉన్నానా ?
Am I not writing a letter?నేను ఒక లేఖ రాయడం లేదా?
  
3. I am learning English.3. నేను ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉన్నాను
I am not learning English.నేను ఇంగ్లీష్ నేర్చుకోవడం లేదు.
Am I learning English?నేను ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉన్నానా ?
Am I not learning English?నేను ఇంగ్లీష్  నేర్చుకోవడం లేదా?
  
4. I am working now.4. నేను ఇప్పుడు పని చేస్తూ ఉన్నాను.
I am not working now.నేను ఇప్పుడు పని చేయడం లేదు.
Am I working now?నేను ఇప్పుడు పని  చేస్తూ ఉన్నానా
Am I not working now?నేను ఇప్పుడు పని చేయడం లేదా?
  
5. I am watching TV.5. నేను టీవీ చూస్తూ ఉన్నాను.
I am not watching TV.నేను టీవీ చూడటం లేదు.
Am I watching TV?నేను టీవీ చూస్తూ ఉన్నానా?
Am I not watching TV?నేను టీవీ చూడటం లేదా?
  
6. I am speaking English.6. నేను ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉన్నాను
I am not speaking English.నేను ఇంగ్లీష్ మాట్లాడటం లేదు .
Am I speaking English?నేను ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉన్నానా?
Am I not speaking English?నేను ఇంగ్లీష్ మాట్లాడటం లేదా?
  
7. I am waiting here.7. నేను ఇక్కడ వేచి ఉన్నాను.
I am not waiting here.నేను ఇక్కడ వేచిలేను.
Am I waiting here?నేను ఇక్కడ వేచి ఉన్నానా?
Am I not waiting here?నేను ఇక్కడ వేచి లేనా?
  
8. I am going home.8. నేను ఇంటికి వెళ్తూ ఉన్నాను.
I am not going home.నేను ఇంటికి వెళ్ళడం లేదు.
Am I going home?నేను ఇంటికి వెళ్తూ ఉన్నానా?
Am I not going home?నేను ఇంటికి వెళ్ళడం లేదా?
  
9. I am listening carefully.9. నేను జాగ్రత్తగా వింటూ ఉన్నాను.
I am not listening carefully.నేను జాగ్రత్తగా వినడం లేదు.
Am I listening carefully?నేను జాగ్రత్తగా  వింటూ ఉన్నానా?
Am I not listening carefully?నేను జాగ్రత్తగా వినడం లేదా?
  
10. I am preparing for exams.10. నేను పరీక్షలకు సిద్ధమవుతూ ఉన్నాను.
I am not preparing for exams.నేను పరీక్షలకు సిద్ధమవడం లేదు.
Am I preparing for exams?నేను పరీక్షలకు సిద్ధమవుతు ఉన్నానా?

 

క్రింది సెంటెన్స్ ని కూడా నెగిటివ్ సెంటెన్స్ లో మార్చుటకు am  తరువాత not ఉంచండి. 

ఇంటరాగేటివ్  సెంటెన్సెస్ కి  ప్రారంభంలో am  ఉంచండి

2. Profession:I అనే సబ్జెక్టు యొక్క ప్రస్తుత వృత్తిని గురించి తెలియజేయడానికి 
I am a student.నేను ఒక విద్యార్థిని.
I am a teacher.నేను ఒక ఉపాధ్యాయుడిని.
I am a doctor.నేను ఒక వైద్యుడిని.
I am an engineer.నేను ఒక ఇంజనీర్ ని.
I am a driver.నేను ఒక డ్రైవర్ ని.
I am a farmer.నేను ఒక రైతును.
I am a businessman.నేను ఒక వ్యాపారవేత్తని.
I am a worker.నేను ఒక కార్మికుడిని.
I am a manager.నేను ఒక మేనేజర్‌ని.
I am an employee.నేను ఒక ఉద్యోగిని.
3. Emotions: I అనే సబ్జెక్టు యొక్క ప్రస్తుత భావాల  గురించి తెలియజేయడానికి 
I am happy.నేను సంతోషంగా ఉన్నాను.
I am sad.నాకు బాధగా ఉంది.
I am tired.నేను అలసిపోయాను.
I am angry.నాకు కోపంగా ఉంది.
I am nervous.నాకు భయంగా ఉంది.
I am excited.నేను ఉత్సాహంగా ఉన్నాను.
I am worried.నేను ఆందోళన చెందుతున్నాను.
I am relaxed.నేను రిలాక్స్‌గా ఉన్నాను.
I am bored.నాకు బోర్ కొడుతోంది.
I am confident.నాకు నమ్మకంగా ఉంది.
4. Location: I అనే సబ్జెక్టు యొక్క ప్రస్తుత స్థలాన్ని గురించి తెలియజేయడానికి 
I am at home.నేను ఇంట్లో ఉన్నాను.
I am in the office.నేను ఆఫీసులో ఉన్నాను.
I am at school.నేను స్కూల్లో ఉన్నాను.
I am in the room.నేను గదిలో ఉన్నాను.
I am at the shop.నేను దుకాణంలో ఉన్నాను.
I am in the village.నేను గ్రామంలో ఉన్నాను.
I am at the bus stop.నేను బస్ స్టాప్ లో ఉన్నాను.
I am in the city.నేను నగరంలో ఉన్నాను.
I am at work.నేను పనిలో ఉన్నాను.
I am here now.నేను ఇప్పుడు ఇక్కడ ఉన్నాను.
5. Age / Time :I అనే సబ్జెక్టు యొక్క ప్రస్తుత వయస్సు మరయు సమయం గురించి తెలియజేయడానికి 
I am 20 years old.నా వయసు 20 సంవత్సరాలు.
I am 25 now.నా వయసు ఇప్పుడు 25.
I am late today.నేను ఈరోజు ఆలస్యంగా వచ్చాను.
I am early today.నేను ఈరోజు త్వరగా వచ్చాను.
I am on time.నేను సమయానికి వచ్చాను.
I am free now.నేను ఇప్పుడు ఖాళీగా ఉన్నాను.
I am busy today.నేను ఈ రోజు బిజీగా ఉన్నాను.
I am ready now.నేను ఇప్పుడు సిద్ధంగా ఉన్నాను.
I am safe here.నేను ఇక్కడ సురక్షితంగా ఉన్నాను.
I am in trouble.నేను ఇబ్బందుల్లో ఉన్నాను.

క్రింది  వాటిని ఒకసారి గమనించండి

am + verb3

is + verb3 

are + verb3

was + verb3

were+ verb3

will be + verb3

పైరూపాలను ఇంతకుముందు మనం పాసివ్ వాయిస్ లో ఉపయోగించి ఉన్నాము.ఈ రూపంలో ఉన్న వాక్యాలు రెండు అర్థాలతో ఉపయోగించబడతాయి

I am tired =నన్ను అలసిపోయేటట్లు చేశారు (passive voice)

నేను అలసిపోయి ఉన్నాను (state sentence  = స్థితి )

సందర్భంగా బట్టి ఆ అర్ధాన్ని మనమే తెలుసుకోవాలి

 I am tired.

నేను అలసిపోయి ఉన్నాను (state sentence) నన్ను అలసిపో చేశారు (passive)

 I am confused.

నేను అయోమయంలో ఉన్నాను. నన్ను అయోమయంలో పడవేశారు

 I am bored.

నేను విసుగు చెంది ఉన్నాను నన్ను విసిగించారు

 I am surprised.

నేను ఆశ్చర్యపోయి ఉన్నాను నన్ను ఆశ్చర్యపరిచారు

 I am worried.

నేను ఆందోళన చెంది ఉన్నాను నన్ను ఆందోళన చేశారు

 I am excited.

నేను ఉత్సాహంగా ఉన్నాను. నన్ను ఉత్సహింప చేశారు

 I am satisfied.

నేను సంతృప్తి చెంది ఉన్నాను నన్ను సంతృప్తి పరిచారు

 I am disappointed.

నేను నిరాశ చెంది ఉన్నాను నన్ను నిరాశ పరిచారు

 I am relaxed.

నేను రిలాక్స్‌గా ఉన్నాను. నన్ను రిలాక్స్ చేశారు

 I am shocked.

నేను షాక్ అయి ఉన్నాను  నన్ను షాక్కుకు గురి చేశారు

Am ని  passive  voice  లో ఏ విధంగా ఉపయోగిస్తారో టాక్సీ వాయిస్  passive  voice  తెలుసుకోండి