We, You, They సబ్జెక్టులకు మాత్రమే ప్రెసెంట్ టెన్స్ లో are అనే సహాయక క్రియ ఉపయోగిస్తారు
Are= ఉన్నారు, ఉన్నాము
Are ఏఏ సందర్భాల్లో ఉపయోగిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం
1. Present continuous:
| we, you, they | are | verb4 | object |
| 1.They are playing. | వాళ్ళు ఆడుకుంటూ ఉన్నారు. |
| They are not playing. | వాళ్ళు ఆడటం లేదు. |
| Are they playing? | వాళ్ళు ఆడుకుంటు ఉన్నారా? |
| Are they not playing? | వాళ్ళు ఆడుకోవడం లేదా? |
| 2.We are learning English. | మేము ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉన్నాము. |
| We are not learning English. | మేము ఇంగ్లీష్ నేర్చుకోవడం లేదు. |
| Are we learning English? | మేము ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉన్నామా? |
| Are we not learning English? | మేము ఇంగ్లీష్ నేర్చుకోవడం లేదా? |
| 3.You are working now. | మీరు ఇప్పుడు పని చేస్తూ ఉన్నారు. |
| You are not working now. | మీరు ఇప్పుడు పని చేయడం లేదు. |
| Are you working now? | మీరు ఇప్పుడు పని చేస్తూ ఉన్నారా? |
| Are you not working now? | మీరు ఇప్పుడు పని చేయడం లేదా? |
| 4.They are running fast. | వారు వేగంగా పరిగెడుతూ ఉన్నారు |
| They are not running fast. | వారు వేగంగా పరికత్తడం లేదు. |
| Are they running fast? | వారు వేగంగా పరిగెడుతూ ఉన్నారా? |
| Are they not running fast? | వారు వేగంగా పరిగెడుతూ లేరా ? |
| 5.We are waiting here. | మేము ఇక్కడ వేచి ఉన్నాము. |
| We are not waiting here. | మేము ఇక్కడ వేచి ఉండటం లేదు. |
| Are we waiting here? | మేము ఇక్కడ వేచి ఉన్నామా? |
| Are we not waiting here? | మేము ఇక్కడ వేచి ఉండలేదా? |
| 6.You are speaking clearly. | మీరు స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నారు. |
| You are not speaking clearly. | మీరు స్పష్టంగా మాట్లాడటం లేదు. |
| Are you speaking clearly? | మీరు స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నారా? |
| Are you not speaking clearly? | మీరు స్పష్టంగా మాట్లాడటం లేదా? |
| 7.They are watching TV. | వాళ్ళు టీవీ చూస్తూ ఉన్నారు |
| They are not watching TV. | వాళ్ళు టీవీ చూడటం లేదు. |
| Are they watching TV? | వాళ్ళు టీవీ చూస్తున్నారా? |
| Are they not watching TV? | వాళ్ళు టీవీ చూడటం లేదా? |
| 8.We are preparing for exams. | మేము పరీక్షలకు సిద్ధపడుతు ఉన్నాము. |
| We are not preparing for exams. | మేము పరీక్షలకు సిద్ధపడడం లేదు. |
| Are we preparing for exams? | మేము పరీక్షలకు సిద్ధపడుతూ ఉన్నామా? |
| Are we not preparing for exams? | మేము పరీక్షలకు సిద్ధపడడం లేదా? |
| 9.You are listening carefully. | మీరు జాగ్రత్తగా వింటూ ఉన్నారు. |
| You are not listening carefully. | మీరు జాగ్రత్తగా వినడం లేదు. |
| Are you listening carefully? | మీరు జాగ్రత్తగా వింటూ ఉన్నారా? |
| Are you not listening carefully? | మీరు జాగ్రత్తగా వింటూ లేరా? |
| 10. They are going home. | వాళ్ళు ఇంటికి వెళుతూ ఉన్నారు. |
| They are not going home. | వాళ్ళు ఇంటికి వెళ్ళడం లేదు. |
| Are they going home? | వాళ్ళు ఇంటికి వెళ్తున్నారా? |
| Are they not going home? | వాళ్ళు ఇంటికి వెళ్ళడం లేదా? |
| 2. Profession:ప్రస్తుతం సబ్జెక్టు యొక్క వృత్తిని గురించి తెలియజేయడానికి | |
| 1. They are teachers. | వారు ఉపాధ్యాయులు. |
| They are not teachers. | వారు ఉపాధ్యాయులు కారు. |
| Are they teachers? | వాళ్లు ఉపాధ్యాయులా ? |
| Are they not teachers? | వాళ్లు ఉపాధ్యాయులు కాదా? |
| 2. We are engineers. | మేము ఇంజనీర్లము. |
| We are not engineers. | మేము ఇంజనీర్లు కాదు. |
| Are we engineers? | మేము ఇంజనీర్లమా? |
| Are we not engineers? | మేము ఇంజనీర్లము కాదా? |
| 3. You are a doctor. | మీరు ఒక డాక్టర్ |
| You are not a doctor. | మీరు డాక్టర్ కాదు |
| Are you a doctor? | మీరు ఒక డాక్టరా? |
| Are you not a doctor? | మీరు డాక్టర్ కాదా? |
| 4. They are farmers. | వారు రైతులు. |
| They are not farmers. | వారు రైతులు కాదు. |
| Are they farmers? | వాళ్ళు రైతులా? |
| Are they not farmers? | వాళ్ళు రైతులు కాదా? |
| 5. We are workers. | మేము కార్మికులం. |
| We are not workers. | మేము కార్మికులం కాదు. |
| Are we workers? | మేము కార్మికులమా? |
| Are we not workers? | మేము కార్మికులం కాదా? |
| 6. You are a leader. | నువ్వు ఒక నాయకుడువి. |
| You are not a leader. | నువ్వు నాయకుడువి కాదు. |
| Are you a leader? | నువ్వు నాయకుడా? |
| Are you not a leader? | నువ్వు నాయకుడు కాదా? |
| 7. The boys are players. | అబ్బాయిలు ఆటగాళ్ళు. |
| The boys are not players. | అబ్బాయిలు ఆటగాళ్ళు కాదు. |
| Are the boys players? | అబ్బాయిలు ఆటగాళ్లా? |
| Are the boys not players? | అబ్బాయిలు ఆటగాళ్ళు కాదా? |
| 8. The girls are nurses. | ఆ అమ్మాయిలు నర్సులు. |
| The girls are not nurses. | ఆ అమ్మాయిలు నర్సులు కారు. |
| Are the girls nurses? | అమ్మాయిలు నర్సులా? |
| Are the girls not nurses? | అమ్మాయిలు నర్సులు కాదా? |
| 9. They are artists. | వారు కళాకారులు. |
| They are not artists. | వాళ్ళు కళాకారులు కాదు. |
| Are they artists? | వాళ్ళు కళాకారులా? |
| Are they not artists? | వాళ్ళు కళాకారులు కాదా? |
| 10. We are employees. | మేము ఉద్యోగులం. |
| We are not employees. | మేము ఉద్యోగులం కాదు. |
| Are we employees? | మేము ఉద్యోగులమా? |
| Are we not employees? | మేము ఉద్యోగులం కాదా? |
| state (are + verb3):ప్రస్తుతం సబ్జెక్టు యొక్క స్థితి ని గురించి తెలియజేయడానికి | |
| 1. They are tired. | వాళ్ళు అలసిపోయారు. |
| They are not tired. | వారు అలసిపోలేదు. |
| Are they tired? | వాళ్ళు అలసిపోయారా? |
| Are they not tired? | వాళ్ళు అలసిపోలేదా? |
| 2. We are excited. | మేము ఉత్సాహంగా ఉన్నాము. |
| We are not excited. | మేము ఉత్సాహంగా లేము. |
| Are we excited? | మేము ఉత్సాహంగా ఉన్నామా? |
| Are we not excited? | మేము ఉత్సాహంగా లేమా? |
| 3. You are busy. | మీరు బిజీగా ఉన్నారు. |
| You are not busy. | మీరు బిజీగా లేరు. |
| Are you busy? | మీరు బిజీగా ఉన్నారా? |
| Are you not busy? | మీరు బిజీగా లేరా? |
| 4. They are angry. | వాళ్ళు కోపంగా ఉన్నారు. |
| They are not angry. | వాళ్లు కోపంగా లేరు. |
| Are they angry? | వాళ్ళు కోపంగా ఉన్నారా? |
| Are they not angry? | వాళ్లు కోపంగా లేరా? |
| 5. We are worried. | మేము ఆందోళనగా ఉన్నాము |
| We are not worried. | మేము ఆందోళనగా లేము. |
| Are we worried? | మేము ఆందోళనగా ఉన్నామా? |
| Are we not worried? | మేము ఆందోళనగా లేమా? |
| 6. You are calm. | మీరు ప్రశాంతంగా ఉన్నావు. |
| You are not calm. | మీరు ప్రశాంతంగా లేరు. |
| Are you calm? | మీరు ప్రశాంతంగా ఉన్నారా? |
| Are you not calm? | మీరు ప్రశాంతంగా లేరా? |
| 7. The children are hungry. | పిల్లలు ఆకలిగా ఉన్నారు. |
| The children are not hungry. | పిల్లలు ఆకలిగా లేరు. |
| Are the children hungry? | పిల్లలు ఆకలిగా ఉన్నారా? |
| Are the children not hungry? | పిల్లలు ఆకలిగా లేరా? |
| 8. They are nervous. | వాళ్ళు కంగారుగా ఉన్నారు. |
| They are not nervous. | వాళ్లు కంగారుగా లేరు |
| Are they nervous? | వాళ్ళు కంగారుగా ఉన్నారా? |
| Are they not nervous? | వాళ్లు కంగారుగా లేరా? |
| 9. We are confident. | మేము నమ్మకంగా ఉన్నాము. |
| We are not confident. | మేము నమ్మకం గా లేము. |
| Are we confident? | మేము నమ్మకంగా ఉన్నామా? |
| Are we not confident? | మేము నమ్మకంగా లేమా? |
| 10. You are relaxed. | మీరు రిలాక్స్ గా ఉన్నారు. |
| You are not relaxed. | మీరు రిలాక్స్ గా లేరు. |
| Are you relaxed? | మీరు రిలాక్స్ గా ఉన్నారా? |
| Are you not relaxed? | మీరు రిలాక్స్ గా లేరా? |
| Location:ప్రస్తుతం సబ్జెక్టు యొక్క ప్రదేశం గురించి తెలియజేయడానికి | |
| 1. We are at home. | మేము ఇంట్లో ఉన్నాము. |
| We are not at home. | మేము ఇంట్లో లేము. |
| Are we at home? | మేము ఇంట్లో ఉన్నామా? |
| Are we not at home? | మేము ఇంట్లో లేమా? |
| 2.They are in the office. | వాళ్ళు ఆఫీసులో ఉన్నారు. |
| They are not in the office. | వాళ్ళు ఆఫీసులో లేరు. |
| Are they in the office? | వాళ్ళు ఆఫీసులో ఉన్నారా? |
| Are they not in the office? | వాళ్ళు ఆఫీసులో లేరా? |
| 3.You are here. | నువ్వు ఇక్కడ ఉన్నావు. |
| You are not here. | నువ్వు ఇక్కడ లేవు. |
| Are you here? | నువ్వు ఇక్కడ ఉన్నావా? |
| Are you not here? | నువ్వు ఇక్కడ లేవా? |
| 4.We are at school. | మేము స్కూల్లో ఉన్నాము. |
| We are not at school. | మేము స్కూల్లో లేము. |
| Are we at school? | మేము స్కూల్లో ఉన్నామా? |
| Are we not at school? | మేము స్కూల్లో లేమా? |
| 5.They are in the room. | వాళ్ళు గదిలో ఉన్నారు. |
| They are not in the room. | వాళ్ళు గదిలో లేరు. |
| Are they in the room? | వాళ్ళు గదిలో ఉన్నారా? |
| Are they not in the room? | వాళ్ళు గదిలో లేరా? |
| 6.You are at work. | మీరు పనిలో ఉన్నారు. |
| You are not at work. | మీరు పనిలో లేరు. |
| Are you at work? | మీరు పనిలో ఉన్నారా? |
| Are you not at work? | మీరు పనిలో లేరా? |
| 7.The students are in class. | విద్యార్థులు తరగతిలో ఉన్నారు. |
| The students are not in class. | విద్యార్థులు తరగతిలో లేరు. |
| Are the students in class? | విద్యార్థులు తరగతిలో ఉన్నారా? |
| Are the students not in class? | విద్యార్థులు తరగతిలో లేరా? |
| 8.They are near the shop. | వాళ్ళు దుకాణం దగ్గర ఉన్నారు. |
| They are not near the shop. | వాళ్ళు దుకాణం దగ్గర లేరు. |
| Are they near the shop? | వాళ్ళు దుకాణం దగ్గర ఉన్నారా? |
| Are they not near the shop? | వాళ్ళు దుకాణం దగ్గర లేరా? |
| 9.We are in the city. | మేము నగరంలో ఉన్నాము. |
| We are not in the city. | మేము నగరంలో లేము. |
| Are we in the city? | మేము నగరంలో ఉన్నామా? |
| Are we not in the city? | మేము నగరంలో లేమా? |
| 10.You are at the bus stop. | మీరు బస్ స్టాప్ లో ఉన్నారు. |
| You are not at the bus stop. | మీరు బస్ స్టాప్ లో లేరు. |
| Are you at the bus stop? | మీరు బస్ స్టాప్ లో ఉన్నారా? |
| Are you not at the bus stop? | మీరు బస్ స్టాప్ లో లేరా? |
| Age:ప్రస్తుతం సబ్జెక్టు యొక్క వయస్సు ని గురించి తెలియజేయడానికి | |
| 1.They are 18 years old. | వారికి 18 సంవత్సరాలు ఉన్నాయి. |
| They are not 18 years old. | వారికి 18 సంవత్సరాలు లేవు. |
| Are they 18 years old? | వారికి 18 సంవత్సరాలు ఉన్నాయా? |
| Are they not 18 years old? | వారికి 18 సంవత్సరాలు లేవా? |
| 2.We are 20 years old. | మాకు 20 సంవత్సరాలు. |
| We are not 20 years old. | మాకు 20 సంవత్సరాలు లేవు |
| Are we 20 years old? | మాకు 20 సంవత్సరాలు ఉన్నాయా? |
| Are we not 20 years old? | మాకు 20 సంవత్సరాలు లేవా? |
| 3.You are 25 years old. | మీకు 25 సంవత్సరాలు. |
| You are not 25 years old. | మీకు 25 సంవత్సరాలు లేవు |
| Are you 25 years old? | మీకు 25 ఏళ్లు ఉన్నాయా? |
| Are you not 25 years old? | మీకు 25 ఏళ్లు లేవా? |
| 4.They are 30 years old. | వాళ్ళకి 30 ఏళ్లు. |
| They are not 30 years old. | వాళ్లకి 30 ఏళ్లు లేవు |
| Are they 30 years old? | వాళ్ళకి 30 ఏళ్లు ఉన్నాయా ? |
| Are they not 30 years old? | వాళ్ళకి 30 ఏళ్లు లేవా? |
| 5.We are 40 years old. | మాకు 40 ఏళ్లు. |
| We are not 40 years old. | మాకు 40 ఏళ్లు లేవు |
| Are we 40 years old? | మాకు 40 ఏళ్లు ఉన్నాయా? |
| Are we not 40 years old? | మాకు 40 ఏళ్లు లేవా? |
| 6.You are 16 years old. | మీకు 16 సంవత్సరాలు. |
| You are not 16 years old. | మీకు 16 సంవత్సరాలు లేవు. |
| Are you 16 years old? | మీకు 16 ఏళ్లు ఉన్నాయా? |
| Are you not 16 years old? | మీకు 16 సంవత్సరాలు లేవా ? |
| 7.The boys are 12 years old. | అబ్బాయిలకు 12 సంవత్సరాలు. |
| The boys are not 12 years old. | అబ్బాయిలకు 12 సంవత్సరాలు లేవు |
| Are the boys 12 years old? | అబ్బాయిలకు 12 ఏళ్లు ఉన్నాయా? |
| Are the boys not 12 years old? | అబ్బాయిలకు 12 సంవత్సరాలు లేవా? |
| 8.The girls are 15 years old. | ఆ అమ్మాయిల వయసు 15 సంవత్సరాలు. |
| The girls are not 15 years old. | అమ్మాయిలకు 15 ఏళ్లు లేవు. |
| Are the girls 15 years old? | అమ్మాయిలకు 15 ఏళ్లు ఉన్నాయా? |
| Are the girls not 15 years old? | అమ్మాయిలకు 15 ఏళ్లు లేవా? |
| 9.My friends are 22 years old. | నా స్నేహితులకు 22 సంవత్సరాలు. |
| My friends are not 22 years old. | నా స్నేహితులకు 22 ఏళ్లు లేవు. |
| Are my friends 22 years old? | నా స్నేహితులకు 22 ఏళ్లు ఉన్నాయా? |
| Are my friends not 22 years old? | నా స్నేహితులకు 22 ఏళ్లు లేవా? |
| 10.The twins are 10 years old. | కవలలకు 10 సంవత్సరాలు. |
| The twins are not 10 years old. | కవలలకు 10 సంవత్సరాలు లేవు. |
| Are the twins 10 years old? | కవలలకు 10 సంవత్సరాల ఉన్నాయా? |
| Are the twins not 10 years old? | కవలలకు 10 సంవత్సరాలు లేవా? |
| Time expressions:ప్రస్తుతం సబ్జెక్టు యొక్క సమయం గురించి తెలియజేయడానికి | |
| 1.We are late now. | మేము ఇప్పుడు ఆలస్యం అయ్యాము. |
| We are not late now. | మేము ఇప్పుడు ఆలస్యం కాలేదు. |
| Are we late now? | మేము ఇప్పుడు ఆలస్యం అయ్యామా .? |
| Are we not late now? | మేము ఇప్పుడు ఆలస్యం కాలేదా.? |
| 2.They are early today. | వారు ఈరోజు త్వరగా వచ్చారు. |
| They are not early today. | వారు ఈరోజు త్వరగా రాలేదు. |
| Are they early today? | వారు ఈరోజు త్వరగా వచ్చారా? |
| Are they not early today? | వారు ఈరోజు తొందరగా రాలేదా? |
| 3.You are on time. | మీరు సమయానికి వచ్చారు. |
| You are not on time. | మీరు సమయానికి రాలేదు. |
| Are you on time? | మీరు సమయానికి వచ్చారా? |
| Are you not on time? | మీరు సమయానికి రాలేదా? |
| 4.We are ready now. | మేము ఇప్పుడు సిద్ధంగా ఉన్నాము. |
| We are not ready now. | మేము ఇప్పుడు సిద్ధంగా లేము. |
| Are we ready now? | మేము ఇప్పుడు సిద్ధంగా ఉన్నామా? |
| Are we not ready now? | మేము ఇప్పుడు సిద్ధంగా లేమా? |
| 5.They are busy at this time. | వారు ఈ సమయంలో బిజీగా ఉన్నారు. |
| They are not busy at this time. | వారు ఈ సమయంలో బిజీగా లేరు. |
| Are they busy at this time? | వారు ఈ సమయంలో బిజీగా ఉన్నారా? |
| Are they not busy at this time? | వారు ఈ సమయంలో బిజీగా లేరా? |
| 6.We are free this evening. | మేము ఈ సాయంత్రం ఖాళీగా ఉన్నాము. |
| We are not free this evening. | మేము ఈ సాయంత్రం ఖాళీగా లేము. |
| Are we free this evening? | మేము ఈ సాయంత్రం ఖాళీగా ఉన్నామా? |
| Are we not free this evening? | మేము ఈ సాయంత్రం ఖాళీగా లేమా? |
| 7.You are late today. | మీరు ఈరోజు ఆలస్యంగా వచ్చారు. |
| You are not late today. | మీరు ఈరోజు ఆలస్యంగా రాలేదు |
| Are you late today? | మీరు ఈరోజు ఆలస్యంగా వచ్చారా ? |
| Are you not late today? | మీరు ఈరోజు ఆలస్యంగా రాలేదా? |
| 8.They are ready at present. | వారు ప్రస్తుతం సిద్ధంగా ఉన్నారు. |
| They are not ready at present. | వారు ప్రస్తుతం సిద్ధంగా లేరు. |
| Are they ready at present? | వారు ప్రస్తుతం సిద్ధంగా ఉన్నారా? |
| Are they not ready at present? | వారు ప్రస్తుతం సిద్ధంగా లేరా? |
| 9.We are busy in the morning. | మేము ఉదయం బిజీగా ఉన్నాము. |
| We are not busy in the morning. | మేము ఉదయం బిజీగా లేము. |
| Are we busy in the morning? | మనం ఉదయం బిజీగా ఉన్నామా? |
| Are we not busy in the morning? | మనం ఉదయం బిజీగా లేమా? |
| 10.You are available now. | మీరు ఇప్పుడు అందుబాటులో ఉన్నారు. |
| You are not available now. | మీరు ఇప్పుడు అందుబాటులో లేరు. |
| Are you available now? | మీరు ఇప్పుడు అందుబాటులో ఉన్నారా? |
| Are you not available now? | మీరు ఇప్పుడు అందుబాటులో లేరా? |
| state (are+ adjective):
ప్రస్తుతం సబ్జెక్టు యొక్క స్థితి ని గురించి తెలియజేయడానికి |
|
| 1.We are happy. | మేము సంతోషంగా ఉన్నాము. |
| We are not happy. | మేము సంతోషంగా లేము. |
| Are we happy? | మేము సంతోషంగా ఉన్నామా? |
| Are we not happy? | మేము సంతోషంగా లేమా? |
| 2.You are busy. | మీరు బిజీగా ఉన్నారు. |
| You are not busy. | మీరు బిజీగా లేరు. |
| Are you busy? | మీరు బిజీగా ఉన్నారా? |
| Are you not busy? | మీరు బిజీగా లేరా? |
| 3.They are ready. | వారు సిద్ధంగా ఉన్నారు. |
| They are not ready. | వారు సిద్ధంగా లేరు. |
| Are they ready? | వారు సిద్ధంగా ఉన్నారా? |
| Are they not ready? | వారు సిద్ధంగా లేరా? |
| 4.We are calm. | మేము ప్రశాంతంగా ఉన్నాము. |
| We are not calm. | మేము ప్రశాంతంగా లేము. |
| Are we calm? | మేము ప్రశాంతంగా ఉన్నామా? |
| Are we not calm? | మేము ప్రశాంతంగా లేమా? |
| 5.You are confident. | మీరు నమ్మకంగా ఉన్నారు. |
| You are not confident. | మీరు నమ్మకంగా లేరు. |
| Are you confident? | మీరు నమ్మకంగా ఉన్నారా? |
| Are you not confident? | మీరు నమ్మకంగా లేరా? |
| 6.They are honest. | వారు నిజాయితీపరులు. |
| They are not honest. | వారు నిజాయితీపరులు కాదు. |
| Are they honest? | వారు నిజాయితీపరులా? |
| Are they not honest? | వారు నిజాయితీపరులు కాదా? |
| 7.We are safe. | మేము సురక్షితంగా ఉన్నాము. |
| We are not safe. | మేము సురక్షితంగా లేము. |
| Are we safe? | మేము సురక్షితంగా ఉన్నామా? |
| Are we not safe? | మేము సురక్షితంగా లేమా? |
| 8.You are careful. | మీరు జాగ్రత్తగా ఉన్నారు. |
| You are not careful. | మీరు జాగ్రత్తగా లేరు. |
| Are you careful? | మీరు జాగ్రత్తగా ఉన్నారా? |
| Are you not careful? | మీరు జాగ్రత్తగా లేరా? |
| 9.They are friendly. | వారు స్నేహపూర్వకంగా ఉన్నారు. |
| They are not friendly. | వారు స్నేహపూర్వకంగా లేరు. |
| Are they friendly? | వారు స్నేహపూర్వకంగా ఉన్నారా? |
| Are they not friendly? | వారు స్నేహపూర్వకంగా లేరా? |
| 10.We are comfortable. | మేము సుఖంగా ఉన్నాము. |
| We are not comfortable. | మేము సుఖంగా లేము. |
| Are we comfortable? | మేము సుఖంగా ఉన్నామా? |
| Are we not comfortable? | మేము సుఖంగా లేమా? |
Passive Voice లో కూడా are ని ఉపయోగిస్తారు Passive Voice చదవండి. passive voice లో are being ఉపయోగిస్తారు.

