1. ఇప్పుడే ఏదైనా ఒక పని చేయబోతున్నాను అని చెప్పడానికి ‘about to’ ఉపయోగిస్తారు. వెళ్లబోతున్నాను, చేయబోతున్నాను, రాబోతున్నాను, అడగబోతున్నాను ఈ విధంగా చివరిలో బోతున్నాను అని వస్తుంది.
2. ఇదే పద్ధతిలో గతంలో మనం Going to ను ఉపయోగించాము. Going to ను Present,Past,Future tense లలో ఉపయోగిస్తారు కానీ about to ని కేవలం నాలుగు లేదా ఐదు సెకండ్ల లోపు చేయబోయే పనులకి అనగా ఇప్పుడే చేయబోయే పనులకు మాత్రమే ఉపయోగిస్తారు.అందువల్ల Future Tense లో “about to” ని ఉపయోగించరు.
3. About to ని కేవలం Present మరియు Past టెన్స్ లోనే ఉపయోగిస్తారు. about to ఉపయోగించినప్పుడు ఇప్పుడే చేయబోతున్నాడు అని అర్థం వస్తుంది. అదేవిధంగా about to ని Past Tense లో ఉపయోగించినట్లయితే ఇప్పుడే నాలుగు లేదా 5 సెకండ్ల క్రితమే చేయబోయినాడు అని అర్థం వస్తుంది.
4. About to ని Be forms అయిన is,am,are,was,were లతో మాత్రమే ఉపయోగిస్తారు. నెగిటివ్ సెంటెన్స్ రాయటకు Be forms తరువాత not ఉపయోగించాలి. ప్రశ్న వాక్యాలు తయారు చేయుటకు Be forms వాక్య ప్రారంభంలో ఉంచాలి.
5. About to ఉపయోగించినప్పుడు verb ఎప్పుడు మొదటి రూపంలోనే (V1) ఉండాలి
Present Structure నిలువుగా ఉంది.
| He,She,It | I | We, You, they |
| Is | am | are |
| About to | About to | About to |
| verb1 | verb1 | verb1 |
| Objet | Objet | Objet |
Past structure.
| He,She,It, I | We,You,They |
| Was | Were |
| About to | About to |
| verb1 | verb1 |
| Objet | Objet |
Examples:
| 1. I am about to start the class. | 1. నేను తరగతి ప్రారంభించబోతున్నాను. |
| ఐ ఎమ్ అబౌట్ టు స్టార్ట్ ది క్లాస్ | |
| I am not about to start the class. | నేను తరగతి ప్రారంభించబోవడం లేదు |
| Am I about to start the class? | నేను తరగతి ప్రారంభించబోతున్నానా? |
| Am I not about to start the class? | నేను తరగతి ప్రారంభించబోవడం లేదా |
| 2. He is about to leave the office. | 2. అతను ఆఫీసు నుండి బయలుదేరబోతున్నాడు. |
| హీ ఇస్ అబౌట్ టు లీవ్ ది ఆఫీస్ | |
| 3. She is about to call her friend. | 3. ఆమె తన స్నేహితురాలికి ఫోన్ చేయబోతోంది. |
| షీ ఇస్ అబౌట్ టు కాల్ హర్ ఫ్రెండ్ | |
| 4. We are about to eat lunch. | 4. మేము భోజనం చేయబోతున్నాము. |
| వీ ఆర్ అబౌట్ టు ఈట్ లంచ్ | |
| 5. They are about to watch a movie. | 5. వారు సినిమా చూడబోతున్నారు. |
| దే ఆర్ అబౌట్ టు వాచ్ అ మూవీ | |
| 6. I am about to answer the phone. | 6. నేను ఫోన్ కి సమాధానం ఇవ్వబోతున్నాను. |
| ఐ ఎమ్ అబౌట్ టు ఆన్సర్ ది ఫోన్ | |
| 7. He is about to open the door. | 7. అతను తలుపు తెరవబోతున్నాడు. |
| హీ ఇస్ అబౌట్ టు ఓపెన్ ది డోర్ | |
| 8. She is about to finish her homework. | 8. ఆమె తన హోంవర్క్ పూర్తి చేయబోతోంది. |
| షీ ఇస్ అబౌట్ టు ఫినిష్ హర్ హోంవర్క్ | |
| 9. We are about to start the meeting. | 9. మేము సమావేశాన్ని ప్రారంభించబోతున్నాము. |
| వీ ఆర్ అబౌట్ టు స్టార్ట్ ది మీటింగ్ | |
| 10. They are about to leave for school. | 10. వారు పాఠశాలకు బయలుదేరబోతున్నారు. |
| దే ఆర్ అబౌట్ టు లీవ్ ఫర్ స్కూల్ | |
| 11. I am about to drink water. | 11. నేను నీళ్ళు తాగబోతున్నాను. |
| ఐ ఎమ్ అబౌట్ టు డ్రింక్ వాటర్ | |
| 12. He is about to write a letter. | 12. అతను ఒక లేఖ రాయబోతున్నాడు. |
| హీ ఇస్ అబౌట్ టు రైట్ అ లెటర్ | |
| 13. She is about to read a book. | 13. ఆమె ఒక పుస్తకం చదవబోతోంది. |
| షీ ఇస్ అబౌట్ టు రీడ్ అ బుక్ | |
| 14. We are about to clean the room. | 14. మేము గదిని శుభ్రం చేయబోతున్నాము. |
| వీ ఆర్ అబౌట్ టు క్లీన్ ది రూమ్ | |
| 15. They are about to start the game. | 15. వారు ఆట ప్రారంభించబోతున్నారు. |
| దే ఆర్ అబౌట్ టు స్టార్ట్ ది గేమ్ | |
| 16. I am about to fix my bike. | 16. నేను నా బైక్ రిపేర్ చేయబోతున్నాను. |
| ఐ ఎమ్ అబౌట్ టు ఫిక్స్ మై బైక్ | |
| 17. He is about to meet his teacher. | 17. అతను తన గురువును కలవబోతున్నాడు. |
| హీ ఇస్ అబౌట్ టు మీట్ హిస్ టీచర్ | |
| 18. She is about to sing a song. | 18. ఆమె ఒక పాట పాడబోతోంది. |
| షీ ఇస్ అబౌట్ టు సింగ్ అ సాంగ్ | |
| 19. We are about to leave home. | 19. మేము ఇంటి నుండి బయలుదేరబోతున్నాము. |
| వీ ఆర్ అబౌట్ టు లీవ్ హోమ్ | |
| 20. They are about to start cooking. | 20. వారు వంట ప్రారంభించబోతున్నారు. |
| దే ఆర్ అబౌట్ టు స్టార్ట్ కూకింగ్ | |
| 21. I am about to read a book. | 21. నేను ఒక పుస్తకం చదవబోతున్నాను. |
| ఐ ఎమ్ అబౌట్ టు రీడ్ అ బుక్ | |
| 22. He is about to go outside. | 22. అతను బయటికి వెళ్ళబోతున్నాడు. |
| హీ ఇస్ అబౌట్ టు గో అవుట్‌సైడ్ | |
| 23. She is about to drink coffee. | 23. ఆమె కాఫీ తాగబోతోంది. |
| షీ ఇస్ అబౌట్ టు డ్రింక్ కాఫీ | |
| 24. We are about to start the game. | 24. మేము ఆట ప్రారంభించబోతున్నాము. |
| వీ ఆర్ అబౌట్ టు స్టార్ట్ ది గేమ్ | |
| 25. They are about to sing a song. | 25. వారు ఒక పాట పాడబోతున్నారు. |
| దే ఆర్ అబౌట్ టు సింగ్ అ సాంగ్ | |
| 26. I am about to write a letter. | 26. నేను ఒక లేఖ రాయబోతున్నాను. |
| ఐ ఎమ్ అబౌట్ టు రైట్ అ లెటర్ | |
| 27. He is about to pay the money. | 27. అతను డబ్బు చెల్లించబోతున్నాడు. |
| హీ ఇస్ అబౌట్ టు పే ది మనీ | |
| 28. She is about to wear a helmet. | 28. ఆమె హెల్మెట్ ధరించబోతోంది. |
| షీ ఇస్ అబౌట్ టు వెర్ అ హెల్మెట్ | |
| 29. We are about to change the car tires. | 29. మేము కారు టైర్లను మార్చబోతున్నాము. |
| వీ ఆర్ అబౌట్ టు చేంజ్ ది కార్ టైర్స్ | |
| 30. They are about to watch TV. | 30. వారు టీవీ చూడబోతున్నారు. |
| దే ఆర్ అబౌట్ టు వాచ్ టీవీ | |
| They are not about to watch TV. | వారు టీవీ చూడబోలేదు |
| Are they about to watch TV. | వారు టీవీ చూడబోయినారా? |
| Are they not about to watch TV. | వారు టీవీ చూడబోలేదా? |
పైన 30వ సెంటెన్స్ కి నెగిటివ్, ఇంటరాగేటివ్స్ రాశాము. క్రింద గ్రీన్ కలర్ లో కనిపిస్తున్న ఎంటరాగేటివ్ సెంటెన్సెస్ ముందు wh questions అయిన when,where,how,why ఉంచితే అవి ఆటోమేటిక్‌గా wh.questions గా మారిపోతాయి.
wh questions:
| 1.When are they about to watch TV? | ఎప్పుడు వారు టీవీ చూడబోతున్నారు. |
| వెన్ ఆర్ దే అబౌట్ టు వాచ్ టీవీ? | |
| 3. Where are they about to watch TV? | ఎక్కడ వారు టీవీ చూడబోతున్నారు. |
| వెర్ ఆర్ దే అబౌట్ టు వాచ్ టీవీ? | |
| 4. Why are they about to watch TV? | ఎందుకు వారు టీవీ చూడబోతున్నారు. |
| వై ఆర్ దే అబౌట్ టు వాచ్ టీవీ? | |
| 5. How are they about to watch TV? | ఎలా వారు టీవీ చూడబోతున్నారు. |
| wh questions negative | |
| 1.When are they not about to watch TV? | ఎప్పుడ వారు టీవీ చూడబోలేదు |
| వెన్ ఆర్ దే నాట్ అబౌట్ టు వాచ్ టీవీ? | |
| Where are they not about to watch TV? | ఎక్కడ వారు టీవీ చూడబోలేదు |
| వెర్ ఆర్ దే నాట్ అబౌట్ టు వాచ్ టీవీ? | |
| Why are they not about to watch TV? | ఎందుకు వారు టీవీ చూడబోలేదు |
| వై ఆర్ దే నాట్ అబౌట్ టు వాచ్ టీవీ? | |
| How are they not about to watch TV? | ఎలా వారు టీవీ చూడబోలేదు |
| హౌ ఆర్ దే నాట్ అబౌట్ టు వాచ్ టీవీ? | |
Long sentences:
| 1. I am about to start preparing dinner for my entire family today. | 1. నేను ఈరోజు నా కుటుంబ సభ్యులందరికీ విందు సిద్ధం చేయుటకు ప్రారంభించబోతున్నాను |
| ఐ ఎమ్ అబౌట్ టు స్టార్ట్ ప్రిపేర్డింగ్ డిన్నర్ ఫర్ మై ఎంటైర్ ఫ్యామిలీ టుడే | |
| 2. He is about to submit his final project report to the manager. | 2. అతను తన చివరి ప్రాజెక్ట్ నివేదికను మేనేజర్‌కు సమర్పించబోతున్నాడు. |
| హీ ఇస్ అబౌట్ టు సబ్మిట్ హిస్ ఫైనల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ టు ది మేనేజర్ | |
| 3. She is about to call her best friend to share exciting news. | 3. ఉత్తేజకరమైన వార్తలను పంచుకోవడానికి ఆమె తన ప్రాణ స్నేహితురాలికి కాల్ చేయబోతోంది. |
| షీ ఇస్ అబౌట్ టు కాల్ హర్ బెస్ట్ ఫ్రెండ్ టు షేర్ ఎక్సైటింగ్ న్యూస్ | |
| 4. We are about to leave the house to catch the early train. | 4. మేము మొదటి రైలు పట్టుకోవడానికి ఇంటి నుండి బయలుదేరబోతున్నాము. |
| వీ ఆర్ అబౌట్ టు లీవ్ ది హౌస్ టు క్యాచ్ ది ఎర్లీ ట్రైన్ | |
| 5. They are about to start cleaning the entire garden after many weeks. | 5. వారు చాలా వారాల తర్వాత మొత్తం తోటను శుభ్రం చేయడం ప్రారంభించబోతున్నారు. |
| దే ఆర్ అబౌట్ టు స్టార్ట్ క్లీన్ing ది ఎంటైర్ గార్డెన్ ఆఫ్టర్ మాని వీక్స్ | |
| 6. I am about to send an important email to my client today. | 6. నేను ఈరోజు నా క్లయింట్‌కి ఒక ముఖ్యమైన ఇమెయిల్ పంపబోతున్నాను. |
| ఐ ఎమ్ అబౌట్ టు సенд అన ఇంపార్టంట్ ఈమెయిల్ టు మై క్లయింట్ టుడే | |
| 7. He is about to leave for the airport to catch his flight. | 7. అతను తన విమానాన్ని పట్టుకోవడానికి విమానాశ్రయానికి బయలుదేరబోతున్నాడు. |
| హీ ఇస్ అబౌట్ టు లీవ్ ఫర్ ది ఎయిర్పోర్ట్ టు క్యాచ్ హిస్ ఫ్లైట్ | |
| 8. She is about to start practicing for the annual dance competition tomorrow. | 8. ఆమె రేపు వార్షిక నృత్య పోటీ కోసం సాధన ప్రారంభించబోతోంది. |
| షీ ఇస్ అబౌట్ టు స్టార్ట్ ప్రాక్టీస్ing ఫర్ ది ఎన్యువల్ డాన్స్ కంపిటీషన్ టుమారో | |
| 9. We are about to prepare for the important meeting at the office. | 9. మేము ఆఫీసులో ముఖ్యమైన సమావేశానికి సిద్ధం కాబోతున్నాము. |
| వీ ఆర్ అబౌట్ టు ప్రిపేర్ ఫర్ ది ఇంపార్టంట్ మీటింగ్ అట్ ది ఆఫీస్ | |
| 10. They are about to celebrate their friend’s birthday at a nearby restaurant. | 10. వారు సమీపంలోని రెస్టారెంట్లో తమ స్నేహితుడి పుట్టినరోజును జరుపుకోబోతున్నారు. |
| దే ఆర్ అబౌట్ టు సెలబ్రేట్ దేర్ ఫ్రెండ్’స్ బర్త్‌డే అట్ అ నియర్‌బై రెస్టారెంట్ |
Was, were ఉపయోగించి గతంలో చేయబోయిన పనులను గురించి తెలియజేస్తారు.
అందువల్ల చేయబోయినాను, వెళ్ళబోయినాను, చూడబోయినాను, మాట్లాడబోయినాను, అని ఇలా చివరిలో “బోయినాను” అర్థం వస్తుంది.
.
| 1. I was about to start the class. | 1. నేను తరగతి ప్రారంభించబోయినాను. |
| ఐ వాస్ అబౌట్ టు స్టార్ట్ ది క్లాస్ | |
| I was not about to start the class. | నేను తరగతి ప్రారంభించబోలేదు |
| Was I about to start the class. | నేను తరగతి ప్రారంభించ బోయినానా? |
| Was I not about to start the class. | నేను తరగతి ప్రారంభించబోలేదా? |
| 2. You were about to open the door. | 2. మీరు తలుపు తెరవబోయినారు . |
| యూ వేర్ అబౌట్ టు ఓపెన్ ది డోర్ | |
| 3. He was about to call his friend. | 3. అతను తన స్నేహితుడికి ఫోన్ చేయబోయినాడు . |
| హీ వాస్ అబౌట్ టు కాల్ హిస్ ఫ్రెండ్ | |
| 4. She was about to read a book. | 4. ఆమె ఒక పుస్తకం చదవబోయింది. |
| షీ వాస్ అబౌట్ టు రీడ్ అ బుక్ | |
| 5. It was about to rain heavily. | 5. భారీ వర్షం పడబోయింది. |
| ఇట్ వాస్ అబౌట్ టు రైన్ హెవిలీ | |
| 6. We were about to start the meeting. | 6. మేము సమావేశాన్ని ప్రారంభించబోయినాము. |
| వీ వేర్ అబౌట్ టు స్టార్ట్ ది మీటింగ్ | |
| 7. They were about to leave for school. | 7. వారు పాఠశాలకు బయలుదేరబోయినారు |
| దే వేర్ అబౌట్ టు లీవ్ ఫర్ స్కూల్ | |
| 8. I was about to drink water. | 8. నేను నీళ్ళు తాగబోయినాను |
| ఐ వాస్ అబౌట్ టు డ్రింక్ వాటర్ | |
| 9. You were about to clean the room. | 9. మీరు గదిని శుభ్రం చేయబోయినారు. |
| యూ వేర్ అబౌట్ టు క్లీన్ ది రూమ్ | |
| 10. He was about to fix his bike. | 10. అతను తన బైక్ రిపేర్ చేయబోయినారు . |
| హీ వాస్ అబౌట్ టు ఫిక్స్ హిస్ బైక్ | |
| 11. She was about to cook dinner. | 11. ఆమె రాత్రి భోజనం వండబోయింది. |
| షీ వాస్ అబౌట్ టు కుక్ డిన్నర్ | |
| 12. It was about to snow outside. | 12. బయట మంచు కురువబోయింది. |
| ఇట్ వాస్ అబౌట్ టు స్నో అవుట్‌సైడ్ | |
| 13. We were about to watch a movie. | 13. మేము సినిమా చూడబోయినాము |
| వీ వేర్ అబౌట్ టు వాచ్ అ మూవీ | |
| 14. They were about to start a new project. | 14. వారు కొత్త ప్రాజెక్ట్‌ను ప్రారంభించబోయినారు |
| దే వేర్ అబౌట్ టు స్టార్ట్ అ న్యూ ప్రాజెక్ట్ | |
| 15. I was about to write a letter. | 15. నేను ఒక లేఖ రాయబోయినాను. |
| ఐ వాస్ అబౌట్ టు రైట్ అ లెటర్ | |
| 16. You were about to answer the phone. | 16. మీరు ఫోన్‌కు సమాధానం ఇవ్వబోయినారు. |
| యూ వేర్ అబౌట్ టు ఆన్సర్ ది ఫోన్ | |
| 17. He was about to meet his teacher. | 17. అతను తన గురువును కలవబోయినాడు . |
| హీ వాస్ అబౌట్ టు మీట్ హిస్ టీచర్ | |
| 18. She was about to go shopping. | 18. ఆమె షాపింగ్ కి వెళ్ళపోయింది. |
| షీ వాస్ అబౌట్ టు గో షాపింగ్ | |
| 19. It was about to fall from the tree. | 19. అది చెట్టు మీద నుండి పడబోయింది . |
| ఇట్ వాస్ అబౌట్ టు ఫాల్ ఫ్రమ్ ది ట్రీ | |
| 20. We were about to start playing football. | 20. మేము ఫుట్‌బాల్ ఆడటం ప్రారంభించబోయినాము. |
| వీ వేర్ అబౌట్ టు స్టార్ట్ ప్లేయింగ్ ఫుట్‌బాల్ | |
| 21. They were about to eat lunch. | 21. వారు భోజనం చేయబోయినారు. |
| దే వేర్ అబౌట్ టు ఈట్ లంచ్ | |
| 22. I was about to brush my teeth. | 22. నేను పళ్ళు తోముకోబోయినాను. |
| ఐ వాస్ అబౌట్ టు బ్రష్ మై టీత్ | |
| 23. You were about to take a photo. | 23. మీరు ఫోటో తీయబోయినారు. |
| యూ వేర్ అబౌట్ టు టేక్ అ ఫోటో | |
| 24. He was about to close the shop. | 24. అతను దుకాణం మూసివేయబోయినాడు. |
| హీ వాస్ అబౌట్ టు క్లోస్ ది షాప్ | |
| 25. She was about to start painting the wall. | 25. ఆమె గోడకు పెయింటింగ్ వేయబోయింది |
| షీ వాస్ అబౌట్ టు స్టార్ట్ పెయింటింగ్ ది వాల్ | |
| 26. It was about to move quickly. | 26. అది త్వరగా కదలబోయింది. |
| ఇట్ వాస్ అబౌట్ టు మూవ్ క్విక్లీ | |
| 27. We were about to water the plants. | 27. మేము మొక్కలకు నీళ్ళు పోయ బోయినాము. |
| వీ వేర్ అబౌట్ టు వాటర్ ది ప్లాంట్స్ | |
| 28. They were about to clean the garden. | 28. వారు తోటను శుభ్రం చేయబోయినారు. |
| దే వేర్ అబౌట్ టు క్లీన్ ది గార్డెన్ | |
| 29. I was about to read the newspaper. | 29. నేను వార్తాపత్రిక చదవబోయినాను. |
| ఐ వాస్ అబౌట్ టు రీడ్ ది న్యూస్‌పేపర్ | |
| 30. You were about to start your homework. | 30. మీరు మీ హోంవర్క్ ప్రారంభించబోయినా రు. |
| యూ వేర్ అబౌట్ టు స్టార్ట్ యూర్ హోంవర్క్ | |
| Long sentences: | |
| 1. I was about to lock the gate when it started raining. | 1. వర్షం పడటం మొదలుపెట్టినప్పుడు నేను గేటు లాక్ చేయబోయాను. |
| ఐ వాస్ అబౌట్ టు లాక్ ది గేట్ వhen ఇట్ స్టార్టెడ్ రైనింగ్ | |
| 2. He was about to reply to the email but lost internet connection. | 2. అతను ఇమెయిల్‌కి ప్రత్యుత్తరం ఇవ్వబోయాడు కానీ ఇంటర్నెట్ కనెక్షన్‌ను కోల్పోయాడు. |
| హీ వాస్ అబౌట్ టు రిప్లై టు ది ఈమెయిల్ బట్ లాస్ట్ ఇంటర్నెట్ కనెక్షన్ | |
| 3. She was about to water the plants when the phone rang. | 3. ఆమె మొక్కలకు నీళ్లు పోయబోతుండగా ఫోన్ మోగింది. |
| షీ వాస్ అబౌట్ టు వాటర్ ది ప్లాంట్స్ వhen ది ఫోన్ రాంగ్ | |
| 4. We were about to board the bus when it left early. | 4. మేము బస్సు ఎక్కబోయినప్పుడు అది త్వరగా బయలుదేరింది. |
| వీ వేర్ అబౌట్ టు బోర్డ్ ది బస్ వhen ఇట్ లెఫ్ట్ ఎర్లీ | |
| 5. They were about to start painting the wall when it began raining. | 5. వారు గోడకు పెయింట్ వేయడం ప్రారంభించబోతుండగా వర్షం పడటం ప్రారంభమైంది. |
| దే వేర్ అబౌట్ టు స్టార్ట్ పెయింటింగ్ ది వాల్ వhen ఇట్ బిగాన్ రైనింగ్ | |
| 6. I was about to call my mother but she called first. | 6. నేను నా తల్లికి ఫోన్ చేయబోయిన్నాను కానీ ఆమె మొదట ఫోన్ చేసింది. |
| ఐ వాస్ అబౌట్ టు కాల్ మై మదర్ బట్ షీ కాల్డ్ ఫర్స్ట్ | |
| 7. He was about to submit the report when the computer crashed. | 7. అతను నివేదికను సమర్పించబోతుండగా కంప్యూటర్ క్రాష్ అయింది. |
| హీ వాస్ అబౌట్ టు సబ్మిట్ ది రిపోర్ట్ వhen ది కంప్యూటర్ క్రాష్డ్ | |
| 8. She was about to start jogging when it got dark outside. | 8. బయట చీకటి పడే సమయానికి ఆమె జాగింగ్ ప్రారంభించబోయింది |
| షీ వాస్ అబౌట్ టు స్టార్ట్ జాగ్గింగ్ వhen ఇట్ గాట్ డార్క్ అవుట్‌సైడ్ | |
| 9. We were about to enjoy the picnic when it started raining heavily. | 9. మేము పిక్నిక్ని ఆస్వాదించబోతుండగా భారీ వర్షం మొదలైంది. |
| వీ వేర్ అబౌట్ టు ఎంజాయ్ ది పిక్నిక్ వhen ఇట్ స్టార్టెడ్ రైనింగ్ హెవిలీ | |
| 10. They were about to open the shop but the key was missing. | 10. వారు దుకాణం తెరవబోయినారు కానీ తాళం చెవి లేదు. |
| దే వేర్ అబౌట్ టు ఓపెన్ ది షాప్ బట్ ది కీ వాస్ మిస్సింగ్ | |
| 11. I was about to join the meeting when my phone rang. | 11. నేను మీటింగ్‌లో చేరబోతుండగా నా ఫోన్ మోగింది. |
| ఐ వాస్ అబౌట్ టు జాయిన్ ది మీటింగ్ వhen మై ఫోన్ రాంగ్ | |
| 12. He was about to fix the computer when the power went off. | 12. అతను కంప్యూటర్ రిపేర్ చేయబోతుండగా కరెంటు పోయింది. |
| హీ వాస్ అబౌట్ టు ఫిక్స్ ది కంప్యూటర్ వhen ది పవర్ వెంట్ ఆఫ్ | |
| 13. She was about to make tea when the milk boiled over. | 13. ఆమె టీ తయారు చేయబోతుండగా పాలు మరిగాయి. |
| షీ వాస్ అబౌట్ టు మేక్ టీ వhen ది మిల్క్ బాయిల్డ్ ఓవర్ | |
| 14. We were about to leave the park when it got too crowded. | 14. మేము పార్క్ నుండి బయలుదేరబోతున్నప్పుడు అది చాలా రద్దీగా మారింది. |
| వీ వేర్ అబౌట్ టు లీవ్ ది పార్క్ వhen ఇట్ గాట్ టూ క్రౌడెడ్ | |
| 15. They were about to start the project when the manager arrived. | 15. మేనేజర్ వచ్చేసరికి వారు ప్రాజెక్ట్ ప్రారంభించబోతున్నారు. |
| దే వేర్ అబౌట్ టు స్టార్ట్ ది ప్రాజెక్ట్ వhen ది మేనేజర్ అరివ్డ్ | |
| 16. I was about to write a letter when the pen stopped working. | 16. నేను ఒక లేఖ రాయబోతుండగా పెన్ను పనిచేయడం ఆగిపోయింది. |
| ఐ వాస్ అబౌట్ టు రైట్ అ లెటర్ వhen ది పెన్ స్టాప్డ్ వర్కింగ్ | |
| 17. He was about to buy a gift when he realized he forgot his wallet. | 17. అతను బహుమతి కొనబోతున్నప్పుడు తన పర్సు మర్చిపోయాడని గ్రహించాడు. |
| హీ వాస్ అబౌట్ టు బై అ గిఫ్ట్ వhen హీ రీయలైజ్డ్ హీ ఫార్గాట్ హిస్ వాలెట్ | |
| 18.Sunil was about to start his homework when his mother called him. | 18. సునీల్ తన హోంవర్క్ ప్రారంభించబోతుండగా అతని తల్లి అతనికి ఫోన్ చేసింది. |
| సునీల్ వాస్ అబౌట్ టు స్టార్ట్ హిస్ హోంవర్క్ వhen హిస్ మదర్ కాల్డ్ హిమ్ | |
| 19.Ravi was about to leave the house when it started raining. | 19. రవి ఇంటి నుండి బయటకు వెళ్ళబోతుండగా వర్షం మొదలైంది. |
| రవి వాస్ అబౌట్ టు లీవ్ ది హౌస్ వhen ఇట్ స్టార్టెడ్ రైనింగ్ | |
| 20.Ramesh was about to open the shop when the key was missing. | 20. రమేష్ దుకాణం తెరవబోతుండగా తాళం కనిపించలేదు. |
| రమేష్ వాస్ అబౌట్ టు ఓపెన్ ది షాప్ వhen ది కీ వాస్ మిస్సింగ్ | |
| 21.Sangeetha was about to call her friend when the phone rang. | 21. సంగీత తన స్నేహితురాలికి ఫోన్ చేయబోతుండగా ఫోన్ మోగింది. |
| సంగీత వాస్ అబౌట్ టు కాల్ హర్ ఫ్రెండ్ వhen ది ఫోన్ రాంగ్ | |
| 22.Sunil was about to eat lunch when the guests arrived. | 22. అతిథులు వచ్చేసరికి సునీల్ భోజనం చేయబోయాడు. |
| సునీల్ వాస్ అబౌట్ టు ఈట్ లంచ్ వెన్ ది గెస్ట్స్ అరివ్డ్ | |
