ఈ క్రింది టాపిక్స్ పై క్లిక్ చేయండి
Will
Will be
Will have
Will have been
will
Will ఏ సందర్భాల్లో ఉపయోగిస్తారు తెలుసుకుందాం.
1.Future Actions: భవిష్యత్తులో జరిగే పనులు
భవిష్యత్తులో జరిగే పనులు గురించి తెలియజేయడానికి will ఉపయోగిస్తారు
- Will ను సింగులర్ సబ్జెక్ట్ మరియు ఫ్లూరల్ సబ్జెక్ట్స్ కి కామన్ గా ఉపయోగిస్తారు
- Will తరువాత verb ఎల్లప్పుడూ మొదటి రూపంలోనే ఉండాలి
- ఒక సెంటెన్స్ లో will ఉన్నప్పుడు దాని నెగిటివ్ సెంటెన్స్ గా మార్చుటకు not ఉపయోగిస్తే సరిపోతుంది
- ఒక సెంటెన్స్ లో will ఉన్నప్పుడు దాని Interrogative సెంటెన్స్ గా మార్చుటకు will సెంటెన్స్ ప్రారంభంలో ఉంచితే సరిపోతుంది.
క్రింది పట్టిక లోని మొదటి ఉదాహరణను గమనించండి
I will go tomorrow.=నేను రేపు వెళ్తాను.
దీని నెగిటివ్ సెంటెన్స్ గా మార్చుటకు will ప్రక్కన not ఉపయోగిస్తా ము
I will not go tomorrow.=నేను రేపు వెళ్ళను
పై రెండు సెంటెన్స్ ని interrogative sentence గా మార్చుటకు will ను సెంటెన్స్ ప్రారంభంలో ఉంచుతాము.
Will I go tomorrow.=నేను రేపు వెళ్తానా?.
Will I not go tomorrow.=నేను రేపు వెళ్ళనా?
| 1. I will go tomorrow. | 1. నేను రేపు వెళ్తాను. |
| ఐ విల్ గో టుమారో | |
| 2. She will come soon. | 2. ఆమె త్వరలో వస్తుంది. |
| షీ విల్ కమ్ సూన్ | |
| 3. They will start the class. | 3. వారు తరగతిని ప్రారంభిస్తారు. |
| దే విల్ స్టార్ట్ ద క్లాస్ | |
| 4. We will meet again. | 4. మనం మళ్ళీ కలుద్దాం. |
| వీ విల్ మీట్ అగేన్ | |
| 5. He will buy a car. | 5. అతను కారు కొంటాడు. |
| హీ విల్ బై అ కార్ | |
| 6. I will learn English. | 6. నేను ఇంగ్లీష్ నేర్చుకుంటాను. |
| ఐ విల్ లెర్న్ ఇంగ్లిష్ | |
| 7. She will cook dinner. | 7. ఆమె రాత్రి భోజనం వండుతుంది. |
| షీ విల్ కుక్ డిన్నర్ | |
| 8. They will play cricket. | 8. వారు క్రికెట్ ఆడతారు. |
| దే విల్ ప్లే క్రికెట్ | |
| 9. We will travel next week. | 9. మేము వచ్చే వారం ప్రయాణం చేస్తాము. |
| వీ విల్ ట్రావెల్ నెక్స్ట్ వీక్ | |
| 10. He will call me. | 10. అతను నన్ను పిలుస్తాడు. |
| హీ విల్ కాల్ మీ | |
| 11. I will finish this work. | 11. నేను ఈ పనిని పూర్తి చేస్తాను. |
| ఐ విల్ ఫినిష్ దిస్ వర్క్ | |
| 12. She will study hard. | 12. ఆమె కష్టపడి చదువుతుంది. |
| షీ విల్ స్టడీ హార్డ్ | |
| 13. They will win the game. | 13. వారు ఆట గెలుస్తారు. |
| దే విల్ విన్ ద గేమ్ | |
| 14. We will build a house. | 14. మేము ఒక ఇల్లు కట్టుకుంటాము. |
| వీ విల్ బిల్డ్ అ హౌస్ | |
| 15. He will write a letter. | 15. అతను ఒక లేఖ వ్రాస్తాడు. |
| హీ విల్ రైట్ అ లెటర్ | |
| 16. I will watch a movie. | 16. నేను సినిమా చూస్తాను. |
| ఐ విల్ వాచ్ అ మూవీ | |
| 17. She will sing a song. | 17. ఆమె ఒక పాట పాడుతుంది. |
| షీ విల్ సింగ్ అ సాంగ్ | |
| 18. They will join us. | 18. వారు మాతో చేరతారు. |
| దే విల్ జాయిన్ అస | |
| 19. We will celebrate tomorrow. | 19. మనం రేపు జరుపుకుంటాము. |
| వీ విల్ సెలబ్రేట్ టుమారో | |
| 20. He will arrive early. | 20. అతను త్వరగా వస్తాడు. |
| హీ విల్ అరైవ్ ఎర్లీ |
2.Instant Decisions :అప్పుడే తీసుకొనే నిర్ణయాలు
అప్పుడే తీసుకొనే నిర్ణయాలను తెలియజేయటానికి కూడా will ఉపయోగిస్తారు.
| 1. I will open the door. | 1. నేను తలుపు తెరుస్తాను. |
| ఐ విల్ ఓపెన్ ద డోర్ | |
| 2. I will answer the call. | 2. నేను కాల్‌కు సమాధానం ఇస్తాను. |
| ఐ విల్ ఆన్సర్ ద కాల్ | |
| 3. I will help you now. | 3. నేను ఇప్పుడు మీకు సహాయం చేస్తాను. |
| ఐ విల్ హెల్ప్ యూ నౌ | |
| 4. I will buy this. | 4. నేను దీన్ని కొంటాను. |
| ఐ విల్ బై దిస్ | |
| 5. I will try again. | 5. నేను మళ్ళీ ప్రయత్నిస్తాను. |
| ఐ విల్ ట్రై అగేన్ | |
| 6. I will sit here. | 6. నేను ఇక్కడ కూర్చుంటాను. |
| ఐ విల్ సిట్ హియర్ | |
| 7. I will call him. | 7. నేను అతన్ని పిలుస్తాను. |
| ఐ విల్ కాల్ హిమ్ | |
| 8. I will start now. | 8. నేను ఇప్పుడు ప్రారంభిస్తాను. |
| ఐ విల్ స్టార్ట్ నౌ | |
| 9. I will take tea. | 9. నేను టీ తీసుకుంటాను. |
| ఐ విల్ టేక్ టీ | |
| 10. I will check it. | 10. నేను దాన్ని తనిఖీ చేస్తాను. |
| ఐ విల్ చెక్ ఇట్ | |
| 11. I will fix this. | 11. నేను దీన్ని పరిష్కరిస్తాను. |
| ఐ విల్ ఫిక్స్ దిస్ | |
| 12. I will wait here. | 12. నేను ఇక్కడ వేచి ఉంటాను. |
| ఐ విల్ వెయిట్ హియర్ | |
| 13. I will go first. | 13. నేను ముందుగా వెళ్తాను. |
| ఐ విల్ గో ఫస్ట్ | |
| 14. I will read this. | 14. నేను దీన్ని చదువుతాను. |
| ఐ విల్ రీడ్ దిస్ | |
| 15. I will join you. | 15. నేను మీతో చేరతాను. |
| ఐ విల్ జాయిన్ యూ | |
| 16. I will speak now. | 16. నేను ఇప్పుడు మాట్లాడతాను. |
| ఐ విల్ స్పీక్ నౌ | |
| 17. I will pay now. | 17. నేను ఇప్పుడు చెల్లిస్తాను. |
| ఐ విల్ పే నౌ | |
| 18. I will come with you. | 18. నేను మీతో వస్తాను. |
| ఐ విల్ కమ్ విద్ యూ | |
| 19. I will stop it. | 19. నేను దానిని ఆపుతాను. |
| ఐ విల్ స్టాప్ ఇట్ | |
| 20. I will do it now. | 20. నేను ఇప్పుడు చేస్తాను. |
| ఐ విల్ డూ ఇట్ నౌ |
3.Promise: వాగ్దానం
ఇతరులకు ఏదైనా వాగ్దానం చేయడానికి కూడా will ఉపయోగిస్తారు
| 1. I will help you always. | 1. నేను మీకు ఎల్లప్పుడూ సహాయం చేస్తాను. |
| ఐ విల్ హెల్ప్ యూ ఆల్వేస్ | |
| 2. I will support you. | 2. నేను మీకు మద్దతు ఇస్తాను. |
| ఐ విల్ సపోర్ట్ యూ | |
| 3. I will come back. | 3. నేను తిరిగి వస్తాను. |
| ఐ విల్ కమ్ బ్యాక్ | |
| 4. I will never lie. | 4. నేను ఎప్పటికీ అబద్ధం చెప్పను. |
| ఐ విల్ నెవర్ లై | |
| 5. I will protect you. | 5. నేను నిన్ను రక్షిస్తాను. |
| ఐ విల్ ప్రొటెక్ట్ యూ | |
| 6. I will finish this. | 6. నేను దీన్ని పూర్తి చేస్తాను. |
| ఐ విల్ ఫినిష్ దిస్ | |
| 7. I will remember this. | 7. నేను దీన్ని గుర్తుంచుకుంటాను. |
| ఐ విల్ రిమెంబర్ దిస్ | |
| 8. I will be there. | 8. నేను అక్కడ ఉంటాను. |
| ఐ విల్ బీ దేర్ | |
| 9. I will call you daily. | 9. నేను నీకు రోజూ ఫోన్ చేస్తాను. |
| ఐ విల్ కాల్ యూ డైలీ | |
| 10. I will not leave you. | 10. నేను నిన్ను విడువను. |
| ఐ విల్ నాట్ లీవ్ యూ | |
| 11. I will keep your secret. | 11. నేను మీ రహస్యాన్ని ఉంచుతాను. |
| ఐ విల్ కీప్ యువర్ సీక్రెట్ | |
| 12. I will work hard. | 12. నేను కష్టపడి పనిచేస్తాను. |
| ఐ విల్ వర్క్ హార్డ్ | |
| 13. I will stay honest. | 13. నేను నిజాయితీగా ఉంటాను. |
| ఐ విల్ స్టే ఆనెస్ట్ | |
| 14. I will respect you. | 14. నేను నిన్ను గౌరవిస్తాను. |
| ఐ విల్ రిస్పెక్ట్ యూ | |
| 15. I will follow you. | 15. నేను నిన్ను అనుసరిస్తాను. |
| ఐ విల్ ఫాలో యూ | |
| 16. I will wait for you. | 16. నేను నీకోసం వేచి ఉంటాను. |
| ఐ విల్ వెయిట్ ఫర్ యూ | |
| 17. I will improve myself. | 17. నన్ను నేను మెరుగుపరుచుకుంటాను. |
| ఐ విల్ ఇంప్రూవ్ మైసెల్ఫ్ | |
| 18. I will try my best. | 18. నేను నా శాయశక్తులా ప్రయత్నిస్తాను. |
| ఐ విల్ ట్రై మై బెస్ట్ | |
| 19. I will listen to you. | 19. నేను నీ మాట వింటాను. |
| ఐ విల్ లిసన్ టు యూ | |
| 20. I will never forget this. | 20. నేను దీన్ని ఎప్పటికీ మర్చిపోలేను. |
| ఐ విల్ నెవర్ ఫర్గెట్ దిస్ |
4. Offer : ఇతరులకు ఏదైనా సహాయం ఆఫర్ చేయడం.
| 1. I will help you. | 1. నేను మీకు సహాయం చేస్తాను. |
| ఐ విల్ హెల్ప్ యూ | |
| 2. I will carry the bag. | 2. నేను బ్యాగ్ మోస్తాను. |
| ఐ విల్ క్యారీ ద బ్యాగ్ | |
| 3. I will open the gate. | 3. నేను గేటు తెరుస్తాను. |
| ఐ విల్ ఓపెన్ ద గేట్ | |
| 4. I will bring water. | 4. నేను నీళ్లు తెస్తాను. |
| ఐ విల్ బ్రింగ్ వాటర్ | |
| 5. I will clean the room. | 5. నేను గదిని శుభ్రం చేస్తాను. |
| ఐ విల్ క్లీన్ ద రూమ్ | |
| 6. I will write the notes. | 6. నేను నోట్స్ రాస్తాను. |
| ఐ విల్ రైట్ ద నోట్స్ | |
| 7. I will show you the way. | 7. నేను మీకు మార్గం చూపిస్తాను. |
| ఐ విల్ షో యూ ద వే | |
| 8. I will explain this. | 8. నేను దీనిని వివరిస్తాను. |
| ఐ విల్ ఎక్స్‌ప్లేన్ దిస్ | |
| 9. I will send the message. | 9. నేను సందేశం పంపుతాను. |
| ఐ విల్ సెండ్ ద మెసేజ్ | |
| 10. I will call the doctor. | 10. నేను డాక్టర్‌ని పిలుస్తాను. |
| ఐ విల్ కాల్ ద డాక్టర్ | |
| 11. I will close the window. | 11. నేను కిటికీ మూసివేస్తాను. |
| ఐ విల్ క్లోస్ ద విండో | |
| 12. I will buy the ticket. | 12. నేను టికెట్ కొంటాను. |
| ఐ విల్ బై ద టికెట్ | |
| 13. I will arrange the chairs. | 13. నేను కుర్చీలు ఏర్పాటు చేస్తాను. |
| ఐ విల్ అరేంజ్ ద చెయర్స్ | |
| 14. I will cook food. | 14. నేను ఆహారం వండుతాను. |
| ఐ విల్ కుక్ ఫుడ్ | |
| 15. I will guide you. | 15. నేను మీకు మార్గనిర్దేశం చేస్తాను. |
| ఐ విల్ గైడ్ యూ | |
| 16. I will fix the problem. | 16. నేను సమస్యను పరిష్కరిస్తాను. |
| ఐ విల్ ఫిక్స్ ద ప్రాబ్లం | |
| 17. I will teach you. | 17. నేను నీకు నేర్పుతాను. |
| ఐ విల్ టీచ్ యూ | |
| 18. I will bring the book. | 18. నేను పుస్తకం తెస్తాను. |
| ఐ విల్ బ్రింగ్ ద బుక్ | |
| 19. I will prepare tea. | 19. నేను టీ తయారు చేస్తాను. |
| ఐ విల్ ప్రిపేర్ టీ | |
| 20. I will check the work. | 20. నేను పనిని తనిఖీ చేస్తాను. |
| ఐ విల్ చెక్ ద వర్క్ |
5. Request:అభ్యర్థన
ఇతరులను ఏదైనా రిక్వెస్ట్ గా అడగటానికి కూడా will ఉపయోగిస్తారు.
ఇది ప్రశ్న అడిగినట్లుగా ఉంటుంది
| 1. Will you help me? | 1. మీరు నాకు సహాయం చేస్తారా? |
| విల్ యూ హెల్ప్ మీ | |
| 2. Will you open the door? | 2. మీరు తలుపు తెరుస్తారా? |
| విల్ యూ ఓపెన్ ద డోర్ | |
| 3. Will you come with me? | 3. మీరు నాతో వస్తారా? |
| విల్ యూ కమ్ విద్ మీ | |
| 4. Will you call him? | 4. మీరు అతన్ని పిలుస్తారా? |
| విల్ యూ కాల్ హిమ్ | |
| 5. Will you wait here? | 5. మీరు ఇక్కడ వేచి ఉంటారా? |
| విల్ యూ వెయిట్ హియర్ | |
| 6. Will you send the message? | 6. మీరు సందేశం పంపుతారా? |
| విల్ యూ సెండ్ ద మెసేజ్ | |
| 7. Will you close the window? | 7. మీరు కిటికీ మూసివేస్తారా? |
| విల్ యూ క్లోస్ ద విండో | |
| 8. Will you bring water? | 8. మీరు నీళ్లు తెస్తారా? |
| విల్ యూ బ్రింగ్ వాటర్ | |
| 9. Will you check this? | 9. మీరు దీన్ని తనిఖీ చేస్తారా? |
| విల్ యూ చెక్ దిస్ | |
| 10. Will you write the answer? | 10. మీరు సమాధానం వ్రాస్తారా? |
| విల్ యూ రైట్ ద ఆన్సర్ | |
| 11. Will you explain this? | 11. మీరు దీనిని వివరిస్తారా? |
| విల్ యూ ఎక్స్‌ప్లేన్ దిస్ | |
| 12. Will you tell the truth? | 12. నువ్వు నిజం చెబుతావా? |
| విల్ యూ టెల్ ద ట్రూత్ | |
| 13. Will you buy this? | 13. మీరు దీన్ని కొంటారా? |
| విల్ యూ బై దిస్ | |
| 14. Will you join us? | 14. మీరు మాతో చేరతారా? |
| విల్ యూ జాయిన్ అస | |
| 15. Will you drive the car? | 15. మీరు కారు నడుపుతారా? |
| విల్ యూ డ్రైవ్ ద కార్ | |
| 16. Will you read this? | 16. మీరు దీన్ని చదువుతారా? |
| విల్ యూ రీడ్ దిస్ | |
| 17. Will you start the class? | 17. మీరు తరగతి ప్రారంభిస్తారా? |
| విల్ యూ స్టార్ట్ ద క్లాస్ | |
| 18. Will you listen to me? | 18. మీరు నా మాట వింటారా? |
| విల్ యూ లిసన్ టు మీ | |
| 19. Will you meet me? | 19. మీరు నన్ను కలుస్తారా? |
| విల్ యూ మీట్ మీ | |
| 20. Will you help them? | 20. మీరు వారికి సహాయం చేస్తారా? |
| విల్ యూ హెల్ప్ దెమ్ |
6. Prediction అంచనా / ఊహ
భవిష్యత్తులో ఏదైనా జరుగుతుందని ఒక అంచనా లేదా ఊహ చేయడానికి కూడా will ఉపయోగిస్తారు
| 1. It will rain today. | 1. ఈరోజు వర్షం పడుతుంది. |
| ఇట్ విల్ రేన్ టుడే | |
| 2. He will win the race. | 2. అతను రేసును గెలుస్తాడు. |
| హీ విల్ విన్ ద రేస్ | |
| 3. She will become famous. | 3. ఆమె ప్రసిద్ధి చెందుతుంది. |
| షీ విల్ బికమ్ ఫేమస్ | |
| 4. They will succeed. | 4. వారు విజయం సాధిస్తారు. |
| దే విల్ సక్సీడ్ | |
| 5. The team will win. | 5. జట్టు గెలుస్తుంది. |
| ద టీమ్ విల్ విన్ | |
| 6. You will understand later. | 6. మీరు తరువాత అర్థం చేసుకుంటారు. |
| యూ విల్ అండర్‌స్టాండ్ లేటర్ | |
| 7. This plan will work. | 7. ఈ ప్లాన్ పనిచేస్తుంది. |
| దిస్ ప్లాన్ విల్ వర్క్ | |
| 8. He will become rich. | 8. అతను ధనవంతుడు అవుతాడు. |
| హీ విల్ బికమ్ రిచ్ | |
| 9. She will pass the exam. | 9. ఆమె పరీక్షలో ఉత్తీర్ణత సాధిస్తుంది. |
| షీ విల్ పాస్ ద ఎగ్జామ్ | |
| 10. They will arrive soon. | 10. వారు త్వరలో వస్తారు. |
| దే విల్ అరైవ్ సూన్ | |
| 11. The sun will rise soon. | 11. సూర్యుడు త్వరలో ఉదయిస్తాడు. |
| ద సన్ విల్ రైజ్ సూన్ | |
| 12. He will learn English. | 12. అతను ఇంగ్లీష్ నేర్చుకుంటాడు. |
| హీ విల్ లెర్న్ ఇంగ్లిష్ | |
| 13. The baby will cry. | 13. బిడ్డ ఏడుస్తుంది. |
| ద బేబీ విల్ క్రై | |
| 14. This road will be busy. | 14. ఈ రోడ్డు రద్దీగా ఉంటుంది. |
| దిస్ రోడ్ విల్ బీ బిజీ | |
| 15. He will forget this. | 15. అతను దీనిని మరచిపోతాడు. |
| హీ విల్ ఫర్గెట్ దిస్ | |
| 16. She will call you. | 16. ఆమె మిమ్మల్ని పిలుస్తుంది. |
| షీ విల్ కాల్ యూ | |
| 17. The price will increase. | 17. ధర పెరుగుతుంది. |
| ద ప్రైస్ విల్ ఇన్‌క్రీజ్ | |
| 18. This machine will stop. | 18. ఈ యంత్రం ఆగిపోతుంది. |
| దిస్ మెషీన్ విల్ స్టాప్ | |
| 19. He will understand. | 19. అతను అర్థం చేసుకుంటాడు. |
| హీ విల్ అండర్‌స్టాండ్ | |
| 20. They will return soon. | 20. వారు త్వరలో తిరిగి వస్తారు. |
| దే విల్ రిటర్న్ సూన్ |
Will be
Wil be = ఉంటుంది, ఉంటాడు, ఉంటారు
భవిష్యత్తులో ఉంటుంది, ఉంటాడు అని చెప్పడానికి will be ఉపయోగిస్తారు
Will be ఏ ఏ సందర్భాలలో ఉపయోగిస్తారో తెలుసుకుందాము.
1.Subject + will be + Noun
| 1. He will be a doctor. | 1. అతను డాక్టర్ గా ఉంటాడు (లేదా ) అతను డాక్టర్ అవుతాడు. ( ఈ విధంగా రెండు అర్థాలతో చెప్పవచ్చు) |
| హీ విల్ బీ ఎ డాక్టర్ | |
| He will not be a doctor. | అతను డాక్టర్ అవ్వడు |
| Will he be a doctor? | అతను డాక్టర్ అవుతాడా? |
| Will he not be a doctor? | అతను డాక్టర్ అవ్వడా? |
| 2. She will be a teacher. | 2. ఆమె ఉపాధ్యాయురాలుగా ఉంటుంది.(లేదా ) ఆమె ఉపాధ్యాయురాలు అవుతుంది. |
| షీ విల్ బీ ఎ టీచర్ | |
| 3. I will be a businessman. | 3. నేను వ్యాపారవేత్త అవుతాను. |
| ఐ విల్ బీ ఎ బిజినెస్‌మాన్ | |
| 4. He will be the winner. | 4. అతను విజేత అవుతాడు. |
| హీ విల్ బీ ది విన్నర్ | |
| 5. She will be my friend. | 5. ఆమె నా స్నేహితురాలు అవుతుంది. |
| షీ విల్ బీ మై ఫ్రెండ్ | |
| 6. They will be our guests. | 6. వారు మన అతిథులుగా ఉంటారు. |
| దే విల్ బీ అవర్ గెస్ట్స్ | |
| 7. He will be the leader. | 7. అతడు నాయకుడిగా ఉంటాడు. |
| హీ విల్ బీ ది లీడర్ | |
| 8. She will be a singer. | 8. ఆమె గాయని అవుతుంది. |
| షీ విల్ బీ ఎ సింగర్ | |
| 9. I will be a good person. | 9. నేను మంచి వ్యక్తిగా ఉంటాను. |
| ఐ విల్ బీ ఎ గుడ్ పర్సన్ | |
| 10. He will be the captain. | 10. అతడు కెప్టెన్‌గా ఉంటాడు. |
| హీ విల్ బీ ది క్యాప్టన్ | |
| 11. He will be a successful businessman in the future. | 11. అతను భవిష్యత్తులో విజయవంతమైన వ్యాపారవేత్త అవుతాడు. |
| హీ విల్ బీ ఎ సక్సెస్‌ఫుల్ బిజినెస్‌మాన్ ఇన్ ది ఫ్యూచర్ | |
| 12. She will be a great teacher for many students. | 12. ఆమె చాలా మంది విద్యార్థులకు గొప్ప ఉపాధ్యాయురాలు అవుతుంది. |
| షీ విల్ బీ ఎ గ్రేట్ టీచర్ ఫర్ మేని స్టూడెంట్స్ | |
| 13. I will be a responsible person in my family. | 13. నేను నా కుటుంబంలో బాధ్యత గల వ్యక్తిగా ఉంటాను. |
| ఐ విల్ బీ ఎ రెస్పాన్సిబుల్ పర్సన్ ఇన్ మై ఫ్యామిలీ | |
| 14. He will be the best player in the team. | 14. అతను జట్టులో ఉత్తమ ఆటగాడు అవుతాడు. |
| హీ విల్ బీ ది బెస్ట్ ప్లేయర్ ఇన్ ది టీమ్ | |
| 15. She will be a famous singer in the coming years. | 15. ఆమె రాబోయే సంవత్సరాల్లో ప్రసిద్ధ గాయని అవుతుంది. |
| షీ విల్ బీ ఎ ఫేమస్ సింగర్ ఇన్ ది కమింగ్ ఇయర్స్ | |
| 16. They will be good partners in this business. | 16. వారు ఈ వ్యాపారంలో మంచి భాగస్వాములు అవుతారు. |
| దే విల్ బీ గుడ్ పార్ట్నర్స్ ఇన్ దిస్ బిజినెస్ | |
| 17. He will be a strong leader for our country. | 17. ఆయన మన దేశానికి బలమైన నాయకుడిగా ఉంటారు. |
| హీ విల్ బీ ఎ స్ట్రాంగ్ లీడర్ ఫర్ అవర్ కంట్రీ | |
| 18. I will be a successful person after hard work. | 18. కష్టపడితే నేను విజయం సాధిస్తాను. |
| ఐ విల్ బీ ఎ సక్సెస్‌ఫుల్ పర్సన్ ఆఫ్టర్ హార్డ్ వర్క్ | |
| 19. She will be a helpful member in our team. | 19. ఆమె మన జట్టులో సహాయక సభ్యురాలిగా ఉంటుంది. |
| షీ విల్ బీ ఎ హెల్ప్‌ఫుల్ మెంబర్ ఇన్ అవర్ టీమ్ | |
| 20. He will be a good example for others in society. | 20. అతను సమాజంలోని ఇతరులకు మంచి ఆదర్శంగా ఉంటాడు. |
| హీ విల్ బీ ఎ గుడ్ ఎగ్జాంపుల్ ఫర్ అదర్స్ ఇన్ సొసైటీ |
2.Subject +will be + adjective
భవిష్యత్తులో సబ్జెక్టు యొక్క స్థితిని మరియు స్వభావమును వివరించడానికి
| 1. He will be happy. | 1. అతను సంతోషంగా ఉంటాడు. |
| హీ విల్ బీ హ్యాపీ | |
| He will not be happy. | అతను సంతోషంగా ఉండడు. |
| Will he be happy? | అతను సంతోషంగా ఉంటాడా? |
| Will he not be happy? | అతను సంతోషంగా ఉండడా? |
| 2. She will be busy. | 2. ఆమె తీరిక లేకుండా ఉంటుంది. |
| షీ విల్ బీ బిజీ | |
| 3. I will be ready. | 3. నేను సిద్ధంగా ఉంటాను. |
| ఐ విల్ బీ రెడీ | |
| 4. He will be strong. | 4. అతను బలంగా ఉంటాడు. |
| హీ విల్ బీ స్ట్రాంగ్ | |
| 5. She will be kind. | 5. ఆమె దయగా ఉంటుంది. |
| షీ విల్ బీ కైండ్ | |
| 6. They will be late. | 6. వారు ఆలస్యంగా వస్తారు. |
| దే విల్ బీ లేట్ | |
| 7. He will be angry. | 7. అతడు కోపంగా ఉంటాడు. |
| హీ విల్ బీ యాంగ్రీ | |
| 8. I will be free. | 8. నేను స్వేచ్ఛగా ఉంటాను. |
| ఐ విల్ బీ ఫ్రీ | |
| 9. She will be tired. | 9. ఆమె అలసిపోతుంది. |
| షీ విల్ బీ టైర్డ్ | |
| 10. He will be careful. | 10. అతను జాగ్రత్తగా ఉంటాడు. |
| హీ విల్ బీ కేర్‌ఫుల్ | |
| 11. He will be very happy after hearing this news. | 11. ఈ వార్త విన్న తర్వాత అతను చాలా సంతోషంగా ఉంటాడు. |
| హీ విల్ బీ వెరీ హ్యాపీ ఆఫ్టర్ హియరింగ్ దిస్ న్యూస్ | |
| 12. She will be busy with her work tomorrow. | 12. ఆమె రేపు తన పనితో తీరిక లేకుండా ఉంటుంది. |
| షీ విల్ బీ బిజీ విత్ హర్ వర్క్ టుమారో | |
| 13. I will be ready for the exam by evening. | 13. నేను సాయంత్రానికల్లా పరీక్షకు సిద్ధంగా ఉంటాను. |
| ఐ విల్ బీ రెడీ ఫర్ ది ఎగ్జామ్ బై ఈవెనింగ్ | |
| 14. He will be strong after regular exercise. | 14. క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే అతను బలంగా ఉంటాడు. |
| హీ విల్ బీ స్ట్రాంగ్ ఆఫ్టర్ రెగ్యులర్ ఎక్సర్‌సైజ్ | |
| 15. She will be kind to everyone in the office. | 15. ఆమె ఆఫీసులో అందరితో దయగా ఉంటుంది. |
| షీ విల్ బీ కైండ్ టు ఎవ్రీవన్ ఇన్ ది ఆఫీస్ | |
| 16. They will be late because of heavy traffic. | 16. భారీ ట్రాఫిక్ కారణంగా వారు ఆలస్యంగా వస్తారు. |
| దే విల్ బీ లేట్ బికాజ్ ఆఫ్ హెవీ ట్రాఫిక్ | |
| 17. He will be angry if you repeat this mistake. | 17. మీరు ఈ తప్పును పునరావృతం చేస్తే అతను కోపపడతాడు. |
| హీ విల్ బీ యాంగ్రీ ఇఫ్ యు రిపీట్ దిస్ మిస్టేక్ | |
| 18. I will be free after completing my work. | 18. నా పని పూర్తి చేశాక నాకు తీరిక లభిస్తుంది. |
| ఐ విల్ బీ ఫ్రీ ఆఫ్టర్ కంప్లీటింగ్ మై వర్క్ | |
| 19. She will be tired after the long journey. | 19. సుదీర్ఘ ప్రయాణం తర్వాత ఆమె అలసిపోతుంది. |
| షీ విల్ బీ టైర్డ్ ఆఫ్టర్ ది లాంగ్ జర్నీ | |
| 20. He will be careful while driving on the highway. | 20. అతను హైవేపై వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉంటాడు. |
| హీ విల్ బీ కేర్‌ఫుల్ వైల్ డ్రైవింగ్ ఆన్ ది హైవే |
3.Subject + will be + Place
సబ్జెక్టు ఏదైనా ఒక స్థలంలో భవిష్యత్తులో ఉంటాడు అని చెప్పడానికి
| 1. I will be at home. | 1. నేను ఇంట్లో ఉంటాను. |
| ఐ విల్ బీ ఎట్ హోమ్ | |
| I will not be at home. | నేను ఇంట్లో ఉండను. |
| Will I be at home? | నేను ఇంట్లో ఉంటానా? |
| Will I not be at home? | నేను ఇంట్లో ఉండనా? |
| 2. He will be in the room. | 2. అతను గదిలో ఉంటాడు. |
| హీ విల్ బీ ఇన్ ది రూమ్ | |
| 3. She will be at school. | 3. ఆమె పాఠశాలలో ఉంటుంది. |
| షీ విల్ బీ ఎట్ స్కూల్ | |
| 4. They will be in the office. | 4. వారు కార్యాలయంలో ఉంటారు. |
| దే విల్ బీ ఇన్ ది ఆఫీస్ | |
| 5. We will be at the park. | 5. మేము పార్కులో ఉంటాము. |
| వీ విల్ బీ ఎట్ ది పార్క్ | |
| 6. He will be at the station. | 6. అతను స్టేషన్‌లో ఉంటాడు. |
| హీ విల్ బీ ఎట్ ది స్టేషన్ | |
| 7. She will be in the class. | 7. ఆమె తరగతిలో ఉంటుంది. |
| షీ విల్ బీ ఇన్ ది క్లాస్ | |
| 8. I will be at the shop. | 8. నేను దుకాణంలో ఉంటాను. |
| ఐ విల్ బీ ఎట్ ది షాప్ | |
| 9. They will be in the city. | 9. వారు నగరంలో ఉంటారు. |
| దే విల్ బీ ఇన్ ది సిటీ | |
| 10. He will be at the bus stop. | 10. అతను బస్ స్టాప్ వద్ద ఉంటాడు. |
| హీ విల్ బీ ఎట్ ది బస్ స్టాప్ | |
| 11. I will be at home in the evening after work. | 11. నేను పని తర్వాత సాయంత్రం ఇంట్లో ఉంటాను. |
| ఐ విల్ బీ ఎట్ హోమ్ ఇన్ ది ఈవెనింగ్ ఆఫ్టర్ వర్క్ | |
| 12. He will be in the room during the meeting time. | 12. అతను సమావేశ సమయంలో గదిలో ఉంటాడు. |
| హీ విల్ బీ ఇన్ ది రూమ్ డ్యూరింగ్ ది మీటింగ్ టైమ్ | |
| 13. She will be at school for the special program. | 13. ఆమె ప్రత్యేక కార్యక్రమం కోసం పాఠశాలలో ఉంటుంది. |
| షీ విల్ బీ ఎట్ స్కూల్ ఫర్ ది స్పెషల్ ప్రోగ్రామ్ | |
| 14. They will be in the office till late night. | 14. వారు రాత్రి పొద్దుపోయే వరకు ఆఫీసులో ఉంటారు. |
| దే విల్ బీ ఇన్ ది ఆఫీస్ టిల్ లేట్ నైట్ | |
| 15. We will be at the park for the evening walk. | 15. మేము సాయంత్రపు నడక కోసం పార్కులో ఉంటాము. |
| వీ విల్ బీ ఎట్ ది పార్క్ ఫర్ ది ఈవెనింగ్ వాక్ | |
| 16. He will be at the station to receive his friend. | 16. అతను తన స్నేహితుడిని తీసుకురావడానికి స్టేషన్‌లో ఉంటాడు. |
| హీ విల్ బీ ఎట్ ది స్టేషన్ టు రిసీవ్ హిస్ ఫ్రెండ్ | |
| 17. She will be in the class for the exam tomorrow. | 17. ఆమె రేపు పరీక్ష కోసం తరగతిలో ఉంటుంది. |
| షీ విల్ బీ ఇన్ ది క్లాస్ ఫర్ ది ఎగ్జామ్ టుమారో | |
| 18. I will be at the shop to buy some groceries. | 18. నేను కొన్ని కిరాణా సామాన్లు కొనడానికి దుకాణానికి వెళ్తాను. |
| ఐ విల్ బీ ఎట్ ది షాప్ టు బై సమ్ గ్రోసరీస్ | |
| 19. They will be in the city for a business meeting. | 19. వారు ఒక వ్యాపార సమావేశం నిమిత్తం నగరంలో ఉంటారు. |
| దే విల్ బీ ఇన్ ది సిటీ ఫర్ ఎ బిజినెస్ మీటింగ్ | |
| 20. He will be at the bus stop waiting for the bus. | 20. అతను బస్ స్టాప్‌లో బస్సు కోసం ఎదురుచూస్తూ ఉంటాడు. |
| హీ విల్ బీ ఎట్ ది బస్ స్టాప్ వెయిటింగ్ ఫర్ ది బస్ |
4.Subject + Will be + verb4
భవిష్యత్తులో సబ్జెక్టు ఏదైనా ఒక పని చేస్తూ ఉంటాడు అని చెప్పడానికి Will be + verb4ఉపయోగిస్తారు . దీనినే Future Continuous tense అని అంటారు.
| 1. I will be working. | 1. నేను పని చేస్తూ ఉంటాను. |
| ఐ విల్ బీ వర్కింగ్ | |
| I will not be working. | నేను పని చేస్తూ ఉండను. |
| Will I be working? | నేను పని చేస్తూ ఉంటానా? |
| Will I not be working? | నేను పని చేస్తూ ఉండనా? |
| 2. He will be studying. | 2. అతను చదువుకుంటూ ఉంటాడు. |
| హీ విల్ బీ స్టడీయింగ్ | |
| 3. She will be cooking. | 3. ఆమె వంట చేస్తూ ఉంటుంది. |
| షీ విల్ బీ కుకింగ్ | |
| 4. They will be playing. | 4. వారు ఆడుతూ ఉంటారు. |
| దే విల్ బీ ప్లేయింగ్ | |
| 5. We will be travelling. | 5. మేము ప్రయాణం చేస్తూ ఉంటాము. |
| వీ విల్ బీ ట్రావెలింగ్ | |
| 6. He will be sleeping. | 6. అతను నిద్రపోతూ ఉంటాడు. |
| హీ విల్ బీ స్లీపింగ్ | |
| 7. She will be reading. | 7. ఆమె చదువుతూ ఉంటుంది. |
| షీ విల్ బీ రీడింగ్ | |
| 8. I will be writing. | 8. నేను రాస్తూ ఉంటాను. |
| ఐ విల్ బీ రైటింగ్ | |
| 9. They will be watching. | 9. వారు చూస్తూ ఉంటారు. |
| దే విల్ బీ వాచింగ్ | |
| 10. He will be running. | 10. అతను పరుగెత్తుతూ ఉంటాడు. |
| హీ విల్ బీ రన్నింగ్ | |
| 11. I will be working in the office tomorrow morning. | 11. నేను రేపు ఉదయం ఆఫీసులో పని చేస్తూ ఉంటాను. |
| ఐ విల్ బీ వర్కింగ్ ఇన్ ది ఆఫీస్ టుమారో మార్నింగ్ | |
| 12. He will be studying for the exam at night. | 12. అతను రాత్రిపూట పరీక్ష కోసం చదువుకుంటూ ఉంటాడు. |
| హీ విల్ బీ స్టడీయింగ్ ఫర్ ది ఎగ్జామ్ ఎట్ నైట్ | |
| 13. She will be cooking food for the family. | 13. ఆమె కుటుంబం కోసం వంట చేస్తూ ఉంటుంది. |
| షీ విల్ బీ కుకింగ్ ఫుడ్ ఫర్ ది ఫ్యామిలీ | |
| 14. They will be playing cricket in the ground. | 14. వారు మైదానంలో క్రికెట్ ఆడుతూ ఉంటారు. |
| దే విల్ బీ ప్లేయింగ్ క్రికెట్ ఇన్ ది గ్రౌండ్ | |
| 15. We will be travelling to Hyderabad next week. | 15. మేము వచ్చే వారం హైదరాబాద్ వెళుతూ ఉంటాము. |
| వీ విల్ బీ ట్రావెలింగ్ టు హైదరాబాద్ నెక్స్ట్ వీక్ | |
| 16. He will be sleeping when you call him. | 16. మీరు అతనికి ఫోన్ చేసినప్పుడు అతను నిద్రపోతూ ఉంటాడు. |
| హీ విల్ బీ స్లీపింగ్ వెన్ యు కాల్ హిమ్ | |
| 17. She will be reading a book in the evening. | 17. ఆమె సాయంత్రం ఒక పుస్తకం చదువుతూ ఉంటుంది. |
| షీ విల్ బీ రీడింగ్ ఎ బుక్ ఇన్ ది ఈవెనింగ్ | |
| 18. I will be writing the exam at that time. | 18. నేను ఆ సమయంలో పరీక్ష రాస్తూ ఉంటాను. |
| ఐ విల్ బీ రైటింగ్ ది ఎగ్జామ్ ఎట్ దాట్ టైమ్ | |
| 19. They will be watching a movie tonight. | 19. వారు ఈ రాత్రి సినిమా చూస్తూ ఉంటారు. |
| దే విల్ బీ వాచింగ్ ఎ మూవీ టునైట్ | |
| 20. He will be running in the park early morning. | 20. అతను తెల్లవారుజామున పార్కులో పరిగెత్తుతూ ఉంటాడు. |
| హీ విల్ బీ రన్నింగ్ ఇన్ ది పార్క్ ఎర్లీ మార్నింగ్ |
Will have
Will have ఏ ఏ సందర్భాలలో ఉపయోగిస్తారో తెలుసుకుందాం
1.Subject+ Will have + Noun
భవిష్యత్తులో ఎవరైనా ఏదైనా కలిగి ఉంటారు అని చెప్పడానికి Will have + Noun ఉపయోగిస్తారు
| 1. I will have a car. | 1. నాకు ఒక కారు ఉంటుంది.( లేదా నేను ఒక ఒక కారును కలిగి ఉంటాను) |
| ఐ విల్ హావ్ ఎ కార్ | |
| I will not have a car. | నాకు కారు ఉండదు. |
| Will I have a car? | నాకు కారు ఉంటుందా? |
| Will I not have a car? | నాకు కారు ఉండదా? |
| 2. He will have a job. | 2. అతనికి ఉద్యోగం ఉంటుంది. (అతను ఒక ఉద్యోగాన్ని కలిగి ఉంటాడు) |
| హీ విల్ హావ్ ఎ జాబ్ | |
| 3. She will have a house. | 3. ఆమెకు ఒక ఇల్లు ఉంటుంది. |
| షీ విల్ హావ్ ఎ హౌస్ | |
| 4. They will have money. | 4. వారి దగ్గర డబ్బు ఉంటుంది. |
| దే విల్ హావ్ మనీ | |
| 5. We will have time. | 5. మనకు సమయం ఉంటుంది. |
| వీ విల్ హావ్ టైమ్ | |
| 6. He will have a bike. | 6. అతనికి ఒక బైక్ ఉంటుంది. |
| హీ విల్ హావ్ ఎ బైక్ | |
| 7. She will have a phone. | 7. ఆమె దగ్గర ఫోన్ ఉంటుంది. |
| షీ విల్ హావ్ ఎ ఫోన్ | |
| 8. I will have a plan. | 8. నా దగ్గర ఒక ప్రణాళిక ఉంటుంది. |
| ఐ విల్ హావ్ ఎ ప్లాన్ | |
| 9. They will have a chance. | 9. వారికి అవకాశం ఉంటుంది. |
| దే విల్ హావ్ ఎ ఛాన్స్ | |
| 10. He will have a problem. | 10. అతనికి ఒక సమస్య ఉంటుంది. |
| హీ విల్ హావ్ ఎ ప్రాబ్లమ్ | |
| 11. I will have a new car next year. | 11. వచ్చే ఏడాది నేను కొత్త కారు కలిగి ఉంటాను. |
| ఐ విల్ హావ్ ఎ న్యూ కార్ నెక్స్ట్ ఇయర్ | |
| 12. He will have a good job after completing his studies. | 12. అతను చదువు పూర్తి చేశాక మంచి ఉద్యోగం పొందుతాడు (లేదా కలిగి ఉంటాడు). |
| హీ విల్ హావ్ ఎ గుడ్ జాబ్ ఆఫ్టర్ కంప్లీటింగ్ హిస్ స్టడీస్ | |
| 13. She will have a beautiful house in the city. | 13. ఆమెకు నగరంలో ఒక అందమైన ఇల్లు ఉంటుంది. |
| షీ విల్ హావ్ ఎ బ్యూటిఫుల్ హౌస్ ఇన్ ది సిటీ | |
| 14. They will have enough money for their business. | 14. వారి వ్యాపారానికి వారికి తగినంత డబ్బు ఉంటుంది. |
| దే విల్ హావ్ ఎనఫ్ మనీ ఫర్ దేర్ బిజినెస్ | |
| 15. We will have enough time to finish the work. | 15. పని పూర్తి చేయడానికి మనకు తగినంత సమయం ఉంటుంది. |
| వీ విల్ హావ్ ఎనఫ్ టైమ్ టు ఫినిష్ ది వర్క్ | |
| 16. He will have a new bike after his birthday. | 16. అతని పుట్టినరోజు తర్వాత అతనికి కొత్త బైక్ ఉంటుంది. |
| హీ విల్ హావ్ ఎ న్యూ బైక్ ఆఫ్టర్ హిస్ బర్త్‌డే | |
| 17. She will have a smartphone with new features. | 17. ఆమెకు కొత్త ఫీచర్లున్న స్మార్ట్ ఫోన్ ఉంటుంది. |
| షీ విల్ హావ్ ఎ స్మార్ట్ ఫోన్ విత్ న్యూ ఫీచర్స్ | |
| 18. I will have a clear plan for my future. | 18. నా భవిష్యత్తు కోసం నాకు స్పష్టమైన ప్రణాళిక ఉంటుంది. |
| ఐ విల్ హావ్ ఎ క్లియర్ ప్లాన్ ఫర్ మై ఫ్యూచర్ | |
| 19. They will have a great chance to win the match. | 19. వారికి మ్యాచ్ గెలవడానికి గొప్ప అవకాశం ఉంటుంది. |
| దే విల్ హావ్ ఎ గ్రేట్ ఛాన్స్ టు విన్ ది మ్యాచ్ | |
| 20. He will have a serious problem if he ignores this issue. | 20. అతను ఈ విషయాన్ని నిర్లక్ష్యం చేస్తే తీవ్రమైన సమస్య ఉంటుంది |
| హీ విల్ హావ్ ఎ సీరియస్ ప్రాబ్లమ్ ఇఫ్ హీ ఇగ్నోర్స్ దిస్ ఇష్యూ | |
2.Subject + will have + verb3
భవిష్యత్తులో ఎవరైనా ఏదైనా ఒక పనిని పూర్తి చేసి ఉంటారు అని చెప్పడానికి will have + verb3 ఉపయోగిస్తారు. దీనిని Future perfect Tense అని కూడా అంటారు.
| 1. I will have finished the work. | 1. నేను పని పూర్తి చేసి ఉంటాను. |
| ఐ విల్ హావ్ ఫినిష్డ్ ది వర్క్ | |
| I will not have finished the work. | నేను ఆ పనిని పూర్తి చేసి ఉండను. |
| Will I have finished the work? | నేను పని పూర్తి చేసి ఉంటానా? |
| Will I not have finished the work? | నేను పని పూర్తి చేసి ఉండనా |
| 2. He will have completed the task. | 2. అతను ఆ పనిని పూర్తి చేసి ఉంటాడు. |
| హీ విల్ హావ్ కంప్లీటెడ్ ది టాస్క్ | |
| 3. She will have written the letter. | 3. ఆమె ఆ లేఖను రాసి ఉంటుంది. |
| షీ విల్ హావ్ రిట్టెన్ ది లెటర్ | |
| 4. They will have done the work. | 4. వారు ఆ పని చేసి ఉంటారు. |
| దే విల్ హావ్ డన్ ది వర్క్ | |
| 5. We will have finished the project. | 5. మేము ప్రాజెక్ట్‌ను పూర్తి చేసి ఉంటాము. |
| వీ విల్ హావ్ ఫినిష్డ్ ది ప్రాజెక్ట్ | |
| 6. He will have eaten the food. | 6. అతడు ఆహారం తిని ఉంటాడు. |
| హీ విల్ హావ్ ఈటెన్ ది ఫుడ్ | |
| 7. She will have cleaned the room. | 7. ఆమె గదిని శుభ్రం చేసి ఉంటుంది. |
| షీ విల్ హావ్ క్లీన్‌డ్ ది రూమ్ | |
| 8. I will have learned English. | 8. నేను ఇంగ్లీష్ నేర్చుకుని ఉంటాను. |
| ఐ విల్ హావ్ లెర్న్డ్ ఇంగ్లీష్ | |
| 9. They will have built the house. | 9. వారు ఇల్లు కట్టి ఉంటారు. |
| దే విల్ హావ్ బిల్ట్ ది హౌస్ | |
| 10. He will have read the book. | 10. అతను ఆ పుస్తకాన్ని చదివి ఉంటాడు. |
| హీ విల్ హావ్ రెడ్ ది బుక్ | |
| 11. I will have finished the work by evening. | 11. నేను సాయంత్రానికల్లా పని పూర్తి చేసి ఉంటాను. |
| ఐ విల్ హావ్ ఫినిష్డ్ ది వర్క్ బై ఈవెనింగ్ | |
| 12. He will have completed the task before the deadline. | 12. అతను గడువులోగా పనిని పూర్తి చేసి ఉంటాడు. |
| హీ విల్ హావ్ కంప్లీటెడ్ ది టాస్క్ బిఫోర్ ది డెడ్‌లైన్ | |
| 13. She will have written the exam by that time. | 13. అప్పటికి ఆమె పరీక్ష రాసి ఉంటుంది. |
| షీ విల్ హావ్ రిట్టెన్ ది ఎగ్జామ్ బై దాట్ టైమ్ | |
| 14. They will have done the work before the manager arrives. | 14. మేనేజర్ వచ్చేలోపే వారు ఆ పని పూర్తి చేసి ఉంటారు. |
| దే విల్ హావ్ డన్ ది వర్క్ బిఫోర్ ది మేనేజర్ అరైవ్స్ | |
| 15. We will have finished the project by next week. | 15. వచ్చే వారానికల్లా మేము ప్రాజెక్ట్‌ను పూర్తి చేస్తాము. |
| వీ విల్ హావ్ ఫినిష్డ్ ది ప్రాజెక్ట్ బై నెక్స్ట్ వీక్ | |
| 16. He will have eaten the food before you come. | 16. మీరు వచ్చేలోపే అతను ఆహారం తిని ఉంటాడు. |
| హీ విల్ హావ్ ఈటెన్ ది ఫుడ్ బిఫోర్ యు కమ్ | |
| 17. She will have cleaned the room before the guests arrive. | 17. అతిథులు రాకముందే ఆమె గదిని శుభ్రం చేసి ఉంటుంది. |
| షీ విల్ హావ్ క్లీన్‌డ్ ది రూమ్ బిఫోర్ ది గెస్ట్స్ అరైవ్ | |
| 18. I will have learned English after practising daily. | 18. ప్రతిరోజూ సాధన చేయడం వల్ల నేను ఇంగ్లీష్ నేర్చుకుని ఉంటాను. |
| ఐ విల్ హావ్ లెర్న్డ్ ఇంగ్లీష్ ఆఫ్టర్ ప్రాక్టిసింగ్ డైలీ | |
| 19. They will have built the house by next year. | 19. వారు వచ్చే సంవత్సరంకల్లా ఇల్లు కట్టి ఉంటారు. |
| దే విల్ హావ్ బిల్ట్ ది హౌస్ బై నెక్స్ట్ ఇయర్ | |
| 20. He will have read the book before the exam starts. | 20. పరీక్ష ప్రారంభమయ్యేలోపు అతను ఆ పుస్తకాన్ని చదివి ఉంటాడు. |
| హీ విల్ హావ్ రెడ్ ది బుక్ బిఫోర్ ది ఎగ్జామ్ స్టార్ట్స్ |
Will have been
Will be మరియు will have been ఈ రెంటి మధ్య తేడా ఏమిటి?
Will be భవిష్యత్తులో ఒక పని జరుగుతూ ఉంటుంది అని తెలియజేస్తుంది
Will have been కూడా భవిష్యత్తులో ఒక పని జరుగుతూ ఉంటుంది అని తెలియజేస్తుంది. కానీ ఆ పని ఎప్పుడు ప్రారంభమైందో ఆ విషయాన్ని కూడా లెక్కలోకి తీసుకుంటుంది
ఇప్పుడు will have been ఎవరు ఉపయోగించడం లేదు. దాని బదులు will be ఎక్కువగా ఉపయోగిస్తున్నారు
సెంటెన్స్ లో ఎక్కడైనా గంటలపాటు, వారాలపాటు, నెలలపాటు అని వచ్చినప్పుడు for ఉపయోగిస్తారు
పని ప్రారంభమైన సమయాన్ని ప్రత్యేకంగా చెప్పినప్పుడు since ( నుండి) ఉపయోగిస్తారు
1.subject + will have been + verb4
| 1. I will have been working for two hours. | 1. నేను రెండు గంటల పాటు పని చేస్తూ ఉంటాను |
| ఐ విల్ హావ్ బీన్ వర్కింగ్ ఫర్ టూ అవర్స్ | |
| I will not have been working for two hours. | నేను రెండు గంటల పాటు పనిచేస్తూ ఉండను. |
| Will I have been working for two hours? | నేను రెండు గంటల పాటు పని చేస్తూ ఉంటానా? |
| Will I not have been working for two hours? | నేను రెండు గంటల పాటు పని చేస్తూ ఉండనా? |
| 2. He will have been studying for three hours. | 2. అతను మూడు గంటల పాటు చదువుతూ ఉంటాడు. |
| హీ విల్ హావ్ బీన్ స్టడీయింగ్ ఫర్ త్రీ అవర్స్ | |
| 3. She will have been waiting for a long time. | 3. ఆమె చాలా సమయం పాటు ఎదురుచూస్తూ ఉంటుంది. |
| షీ విల్ హావ్ బీన్ వెయిటింగ్ ఫర్ ఎ లాంగ్ టైమ్ | |
| 4. They will have been playing for an hour. | 4. వారు ఒక గంట పాటు ఆడుతూ ఉంటారు. |
| దే విల్ హావ్ బీన్ ప్లేయింగ్ ఫర్ ఎన అవర్ | |
| 5. We will have been travelling for two days. | 5. మేము రెండు రోజులపాటు ప్రయాణిస్తూ ఉంటాము. |
| వీ విల్ హావ్ బీన్ ట్రావెలింగ్ ఫర్ టూ డేస్ | |
| 6. I will have been working since morning. | 6. నేను ఉదయం నుండి పని చేస్తూ ఉంటాను. |
| ఐ విల్ హావ్ బీన్ వర్కింగ్ సిన్స్ మార్నింగ్ | |
| 7. He will have been studying since 6 PM. | 7. అతను సాయంత్రం 6 గంటల నుండి చదువుతూ ఉంటాడు. |
| హీ విల్ హావ్ బీన్ స్టడీయింగ్ సిన్స్ 6 పిఎం | |
| 8. She will have been waiting since noon. | 8. ఆమె మధ్యాహ్నం నుండి ఎదురుచూస్తూ ఉంటుంది. |
| షీ విల్ హావ్ బీన్ వెయిటింగ్ సిన్స్ నూన్ | |
| 9. They will have been playing since evening. | 9. వారు సాయంత్రం నుండి ఆడుతూ ఉంటారు. |
| దే విల్ హావ్ బీన్ ప్లేయింగ్ సిన్స్ ఈవెనింగ్ | |
| 10. We will have been travelling since yesterday. | 10. మేము నిన్నటి నుండి ప్రయాణిస్తూనే ఉంటాము. |
| వీ విల్ హావ్ బీన్ ట్రావెలింగ్ సిన్స్ యెస్టర్‌డే | |
| 11. I will have been working in the office for five hours by evening. | 11. సాయంత్రానికల్లా నేను ఆఫీసులో ఐదు గంటల పాటు పనిచేస్తూ ఉంటాను. |
| ఐ విల్ హావ్ బీన్ వర్కింగ్ ఇన్ ది ఆఫీస్ ఫర్ ఫైవ్ అవర్స్ బై ఈవెనింగ్ | |
| 12. He will have been studying for the exam for three hours by that time. | 12. అప్పటికి అతను పరీక్ష కోసం మూడు గంటల పాటు చదువుతూ ఉంటాడు. |
| హీ విల్ హావ్ బీన్ స్టడీయింగ్ ఫర్ ది ఎగ్జామ్ ఫర్ త్రీ అవర్స్ బై దాట్ టైమ్ | |
| 13. She will have been waiting for you for a long time before you arrive. | 13. మీరు వచ్చేలోపు ఆమె మీ కోసం చాలా సమయం పాటు ఎదురుచూస్తూ ఉంటుంది. |
| షీ విల్ హావ్ బీన్ వెయిటింగ్ ఫర్ యు ఫర్ ఎ లాంగ్ టైమ్ బిఫోర్ యు అరైవ్ | |
| 14. They will have been playing cricket for two hours by the time it rains. | 14. వర్షం పడే సమయానికి వారు రెండు గంటల పాటు క్రికెట్ ఆడుతూ ఉంటారు. |
| దే విల్ హావ్ బీన్ ప్లేయింగ్ క్రికెట్ ఫర్ టూ అవర్స్ బై ది టైమ్ ఇట్ రేన్స్ | |
| 15. We will have been travelling for two days before we reach Hyderabad. | 15. మేము హైదరాబాద్ చేరేలోపు రెండు గంటలపాటు ప్రయాణం చేస్తూ ఉంటాము. |
| వీ విల్ హావ్ బీన్ ట్రావెలింగ్ ఫర్ టూ డేస్ బిఫోర్ వి రీచ్ హైదరాబాద్ | |
| 16. I will have been working here since morning by the time you come. | 16. మీరు వచ్చేసరికి నేను ఉదయం నుండి ఇక్కడ పనిచేస్తూ ఉంటాను. |
| ఐ విల్ హావ్ బీన్ వర్కింగ్ హియర్ సిన్స్ మార్నింగ్ బై ది టైమ్ యు కమ్ | |
| 17. He will have been studying since last night before the exam starts. | 17. పరీక్ష మొదలయ్యే ముందు రోజు రాత్రి నుండి అతను చదువుతూ ఉంటాడు. |
| హీ విల్ హావ్ బీన్ స్టడీయింగ్ సిన్స్ లాస్ట్ నైట్ బిఫోర్ ది ఎగ్జామ్ స్టార్ట్స్ | |
| 18. She will have been waiting since morning when you finally arrive. | 18. మీరు చివరికి వచ్చేసరికి, ఆమె ఉదయం నుండి ఎదురుచూస్తూ ఉంటుంది. |
| షీ విల్ హావ్ బీన్ వెయిటింగ్ సిన్స్ మార్నింగ్ వెన్ యు ఫైనల్లీ అరైవ్ | |
| 19. They will have been playing since afternoon by the time it gets dark. | 19. చీకటి పడేసరికి వారు మధ్యాహ్నం నుండి ఆడుతూనే ఉంటారు. |
| దే విల్ హావ్ బీన్ ప్లేయింగ్ సిన్స్ ఆఫ్టర్నూన్ బై ది టైమ్ ఇట్ గెట్స్ డార్క్ | |
| 20. We will have been living here since 2020 by next year. | 20. వచ్చే సంవత్సరం నాటికి మేము 2020 నుండి ఇక్కడ నివసిస్తూ ఉంటాము. |
| వీ విల్ హావ్ బీన్ లివింగ్ హియర్ సిన్స్ 2020 బై నెక్స్ట్ ఇయర్ |
