ఈ క్రింది టాపిక్స్ పైన క్లిక్ చేయండి
Might
Might be
Might have
Might have been
Might
Might ఏఏ సందర్భంలో ఉపయోగిస్తారో తెలుసుకుందాం
1.Possibility: అవకాశం
Present లో గాని future లో గాని ఏదైనా జరిగే దానికి అవకాశం ఉంది అని చెప్పేటప్పుడు Might ఉపయోగిస్తారు. ఇటువంటి వాక్యాలకు May కూడా ఉపయోగిస్తారు. కానీ May కంటే ఇంకా తక్కువ అవకాశం ఉండేటువంటి వాక్యాలకు Might ఉపయోగిస్తారు. అనగా దాదాపు 50% జరగవచ్చు లేదా 50% జరగకపోవచ్చు అని చెప్పే సందర్భంలో Might ఎక్కువగా ఉపయోగిస్తారు. ప్రతి సెంటెన్స్ కి కూడా చివర “చ్చు” అని వస్తుంది
All subjects + might + verb1
క్రింది టేబుల్ లోని మొదటి ఉదాహరణ గమనించండి
I might go to the park tomorrow.= నేను రేపు పార్కుకి వెళ్ళవచ్చు.
పై సెంటెన్స్ కి నెగటివ్ సెంటెన్స్ రాయుటకు Might తర్వాత not ఉపయోగిస్తే సరిపోతుంది.
I might not go to the park tomorrow.= నేను రేపు పార్కుకి వెళ్లకపోవచ్చు.
పై రెండు సెంటెన్స్ని Interrogative సెంటెన్స్ గా మార్చడం Might ని సెంటెన్స్ ప్రారంభంలో ఉంచితే సరిపోతుంది.
Might I go to the park tomorrow.= నేను రేపు పార్కుకి వెళ్ళవచ్చా?.
Might I not go to the park tomorrow.= నేను రేపు పార్కుకి వెళ్ళకా పోవచ్చా?.
| 1. I might go to the park tomorrow. | 1. నేను రేపు పార్కుకి వెళ్ళవచ్చు. |
| ఐ మైట్ గో టు ద పార్క్ టుమారో | |
| 2. You might enjoy the movie tonight. | 2. మీరు ఈ రాత్రి సినిమా చూసి ఆనందించవచ్చు. |
| యూ మైట్ ఎంజాయ్ ద మూవీ టునైట్ | |
| 3. He might win the match. | 3. అతను మ్యాచ్ గెలవవచ్చు. |
| హీ మైట్ విన ద మ్యాచ్ | |
| 4. She might call you later. | 4. ఆమె మీకు తర్వాత కాల్ చేయవచ్చు. |
| షీ మైట్ కాల్ యూ లేటర్ | |
| 5. It might rain this evening. | 5. ఈ సాయంత్రం వర్షం పడవచ్చు. |
| ఇట్ మైట్ రేన్ దిస్ ఈవ్నింగ్ | |
| 6. We might finish the work today. | 6. మనం ఈరోజు పనిని పూర్తి చేయవచ్చు. |
| వీ మైట్ ఫినిష్ ద వర్క్ టుడే | |
| 7. They might come to the party. | 7. వారు పార్టీకి రావచ్చు. |
| దే మైట్ కమ్ టు ద పార్టీ | |
| 8. The dog might bark at night. | 8. కుక్క రాత్రిపూట మొరగవచ్చు . |
| ద డాగ్ మైట్ బార్క్ అట్ నైట్ | |
| 9. The children might play outside. | 9. పిల్లలు బయట ఆడుకోవచ్చు. |
| ద చిల్డ్రెన్ మైట్ ప్లే ఔట్సైడ్ | |
| 10. My friends might help me. | 10. నా స్నేహితులు నాకు సహాయం చేయవచ్చు. |
| మై ఫ్రెండ్స్ మైట్ హెల్ప్ మీ | |
| 11. Your brother might join the game. | 11. మీ సోదరుడు ఆటలో చేరవచ్చు. |
| యోర్ బ్రదర్ మైట్ జాయిన్ ద గేమ్ | |
| 12. The students might answer correctly. | 12. విద్యార్థులు సరిగ్గా సమాధానం చెప్పవచ్చు. |
| ద స్టూడెంట్స్ మైట్ ఆన్స్err కరెక్ట్‌లీ | |
| 13. The teacher might explain the lesson. | 13. ఉపాధ్యాయుడు పాఠాన్ని వివరించవచ్చు. |
| ద టీచర్ మైట్ ఎక్స్ప్లైన్ ద లెసన్ | |
| 14. I might buy a new phone. | 14. నేను కొత్త ఫోన్ కొనుక్కోవచ్చు. |
| ఐ మైట్ బాయి అ న్యూ ఫోన్ | |
| 15. You might see a rainbow tomorrow. | 15. మీరు రేపు ఇంద్రధనస్సును చూడవచ్చు. |
| యూ మైట్ సీ అ రైన్‌బో టుమారో | |
| 16. He might forget his keys. | 16. అతను తన కీలను మరచిపోవచ్చు. |
| హీ మైట్ ఫార్గెట్ హిజ్ కీస్ | |
| 17. She might travel next month. | 17. ఆమె వచ్చే నెలలో ప్రయాణం చేయవచ్చు. |
| షీ మైట్ ట్రావెల్ నెక్స్ట్ మన్త్ | |
| 18. It might get cold tonight. | 18. ఈ రాత్రి చల్లగా ఉండవచ్చు. |
| ఇట్ మైట్ గెట్ కోల్డ్ టునైట్ | |
| 19. We might meet at the library. | 19. మనం లైబ్రరీలో కలవచ్చు. |
| వీ మైట్ మీట్ అట్ ద లైబ్రరి | |
| 20. They might learn fast. | 20. వారు వేగంగా నేర్చుకోవచ్చు. |
| దే మైట్ లర్న్ ఫాస్ట్ | |
| 21. The cat might climb the tree. | 21. పిల్లి చెట్టు ఎక్కవచ్చు. |
| ద కాట మైట్ క్లైంబ్ ద ట్రీ | |
| 22. The boys might win the race. | 22. అబ్బాయిలు రేసు గెలవవచ్చు. |
| ద బాయ్స్ మైట్ విన ద రేస్ | |
| 23. My sister might join us. | 23. నా సోదరి మాతో చేరవచ్చు. |
| మై సిస్టర్ మైట్ జాయిన్ అస్ | |
| 24. Your parents might agree. | 24. మీ తల్లిదండ్రులు అంగీకరించవచ్చు. |
| యోర్ పెరెంట్స్ మైట్ అగ్రి | |
| 25. The team might play well tomorrow. | 25. జట్టు రేపు బాగా ఆడవచ్చు. |
| ద టীম్ మైట్ ప్లే వెల్ టుమారో |
2. Polite suggestions / వినమ్రమైన సూచనలు
గౌరవంగా ఎవరికైనా కొన్ని సూచనలు చేయడానికి కూడా Might ఉపయోగిస్తారు ఈ సెంటెన్స్ లో కూడా చివర “చ్చు” అని వస్తుంది
All subjects + might + verb1
| 1. I might suggest a different plan. | 1. నేను వేరే ప్లాన్ సూచించవచ్చు. |
| ఐ మైట్ సజెస్ట్ అ డిఫరెంట్ ప్లాన్ | |
| 2. You might try reading this book. | 2. మీరు ఈ పుస్తకాన్ని చదవడానికి ప్రయత్నించవచ్చు. |
| యూ మైట్ ట్రై రీడింగ్ దిస్ బుక్ | |
| 3. He might consider changing his job. | 3. అతను తన ఉద్యోగాన్ని మార్చుకోవడాన్ని పరిగణించవచ్చు. |
| హీ మైట్ కన్సిడర్ చెంజింగ్ హిజ్ జాబ్ | |
| 4. She might ask for help. | 4. ఆమె సహాయం కోరవచ్చు. |
| షీ మైట్ ఆ స్క్ ఫర్ హెల్ప్ | |
| 5. It might be better to wait. | 5. వేచి ఉండటం మంచిది కావచ్చు. |
| ఇట్ మైట్ బీ బెటర్ టు వెయిట్ | |
| 6. We might join the seminar. | 6. మనం సెమినార్‌లో చేరవచ్చు. |
| వీ మైట్ జాయిన్ ద సిమినార్ | |
| 7. They might call the doctor. | 7. వారు డాక్టర్‌కి ఫోన్ చేయవచ్చు. |
| దే మైట్ కాల్ ద డాక్టర్ | |
| 8. The teacher might explain it again. | 8. ఉపాధ్యాయుడు దానిని మళ్ళీ వివరించవచ్చు. |
| ద టీచర్ మైట్ ఎక్స్ప్లెయిన్ ఇట్ అగెయిన్ | |
| 9. I might suggest you take rest. | 9. మీరు విశ్రాంతి తీసుకోమని నేను సూచించవచ్చు. |
| ఐ మైట్ సజెస్ట్ యూ టేక్ రెస్ట్ | |
| 10. You might speak slowly. | 10. మీరు నెమ్మదిగా మాట్లాడవచ్చు. |
| యూ మైట్ స్పీక్ స్లోలీ | |
| 11. He might try solving the problem. | 11. అతను సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నించవచ్చు. |
| హీ మైట్ ట్రై సాల్వింగ్ ద ప్రాబ్లమ్ | |
| 12. She might review the notes. | 12. ఆమె నోట్స్ సమీక్షించవచ్చు. |
| షీ మైట్ రివ్యూ ద నోట్స్ | |
| 13. It might help to discuss. | 13. చర్చించడం సహాయపడవచ్చు. |
| ఇట్ మైట్ హెల్ప్ టు డిస్కస్ | |
| 14. We might leave early tomorrow. | 14. మనం రేపు త్వరగా బయలుదేరవచ్చు. |
| వీ మైట్ లీవ్ ఎర్లీ టుమారో | |
| 15. They might clean the room. | 15. వారు గదిని శుభ్రం చేయవచ్చు. |
| దే మైట్ క్లిన్ ద రూమ్ | |
| 16. I might check the schedule. | 16. నేను షెడ్యూల్ తనిఖీ చేయవచ్చు. |
| ఐ మైట్ చెక్ ద షెడ్యూల్ | |
| 17. You might contact the manager. | 17. మీరు మేనేజర్‌ను సంప్రదించవచ్చు. |
| యూ మైట్ కాన్టాక్ట్ ద మేనేజర్ | |
| 18. He might listen carefully. | 18. అతను జాగ్రత్తగా వినవచ్చు. |
| హీ మైట్ లిసెన్ కేర్‌ఫులీ | |
| 19. She might join the club. | 19. ఆమె క్లబ్‌లో చేరవచ్చు. |
| షీ మైట్ జాయిన్ ద క్లబ్ | |
| 20. It might be wise to wait. | 20. వేచి ఉండటం తెలివైన పని కావచ్చు. |
| ఇట్ మైట్ బీ వైజ్ టు వెయిట్ | |
| 21. We might consider buying it. | 21. మనం దానిని కొనడాన్ని పరిగణించవచ్చు. |
| వీ మైట్ కన్సిడర్ బాయింగ్ ఇట్ | |
| 22. They might review the rules. | 22. వారు నియమాలను సమీక్షించవచ్చు. |
| దే మైట్ రివ్యూ ద రూల్స్ | |
| 23. I might take a break. | 23. నేను విరామం తీసుకోవచ్చు. |
| ఐ మైట్ టేక్ అ బ్రేక్ | |
| 24. You might ask politely. | 24. మీరు మర్యాదగా అడగవచ్చు. |
| యూ మైట్ ఆ స్క్ పోలైట్‌లీ | |
| 25. He might suggest a solution. | 25. అతను ఒక పరిష్కారాన్ని సూచించవచ్చు. |
| హీ మైట్ సజెస్ట్ అ సొల్యూషన్ | |
3.Formal permission:అధికారిక అనుమతి
ఎవరికైనా అనుమతి ఇవ్వడానికి కూడా might ఉపయోగిస్తారు. ఇటువంటి సెంటెన్సెస్ లో కూడా చివర “చ్చు” అని వస్తుంది
All subjects + Miaht + verb1
| 1.They might leave now. | 1. వారు ఇప్పుడు బయలుదేరవచ్చు. |
| ఐ మైట్ లీవ్ నౌ | |
| 2. You might enter the room quietly. | 2. మీరు నిశ్శబ్దంగా గదిలోకి ప్రవేశించవచ్చు. |
| యూ మైట్ ఎంటర్ ద రూమ్ క్వైట్‌లీ | |
| 3. He might take a short break. | 3. అతను చిన్న విరామం తీసుకోవచ్చు. |
| హీ మైట్ టేక్ అ షార్ట్ బ్రేక్ | |
| 4. She might speak first. | 4. ఆమె ముందుగా మాట్లాడవచ్చు. |
| షీ మైట్ స్పీక్ ఫస్ట్ | |
| 5. It might be used carefully. | 5. దీనిని జాగ్రత్తగా వాడవచ్చు. |
| ఇట్ మైట్ బీ యూజ్డ్ కేర్‌ఫులీ | |
| 6. We might join later. | 6. మనం తరువాత చేరవచ్చు. |
| వీ మైట్ జాయిన్ లేటర్ | |
| 7. They might leave early today. | 7. వారు ఈరోజు త్వరగా బయలుదేరవచ్చు. |
| దే మైట్ లీవ్ ఎర్లీ టుడే | |
| 8. The students might ask questions. | 8. విద్యార్థులు ప్రశ్నలు అడగవచ్చు. |
| ద స్టూడెంట్స్ మైట్ ఆ స్క్ క్వెశ్చన్స్ | |
| 9. My friend might borrow this book. | 9. నా స్నేహితుడు ఈ పుస్తకాన్ని అరువుగా తీసుకోవచ్చు. |
| మై ఫ్రెండ్ మైట్ బారో దిస్ బుక్ | |
| 10. Your brother might try this method. | 10. మీ సోదరుడు ఈ పద్ధతిని ప్రయత్నించవచ్చు. |
| యోర్ బ్రదర్ మైట్ ట్రై దిస్ మెథడ్ | |
| 11. I might suggest a change. | 11. నేను ఒక మార్పును సూచించవచ్చు. |
| ఐ మైట్ సజెస్ట్ అ చెంజ్ | |
| 12. You might sit here. | 12. మీరు ఇక్కడ కూర్చోవచ్చు. |
| యూ మైట్ సిట్ హియర్ | |
| 13. He might use the computer now. | 13. అతను ఇప్పుడు కంప్యూటర్ వాడవచ్చు. |
| హీ మైట్ యూజ్ ద కంప్యూటర్ నౌ | |
| 14. She might call the manager. | 14. ఆమె మేనేజర్‌కి కాల్ చేయవచ్చు. |
| షీ మైట్ కాల్ ద మేనేజర్ | |
| 15. It might be done today. | 15. ఇది ఈరోజే పూర్తి కావచ్చు. |
| ఇట్ మైట్ బీ డన్ టుడే | |
| 16. We might submit the report tomorrow. | 16. మేము రేపు నివేదికను సమర్పించవచ్చు. |
| వీ మైట్ సబ్మిట్ ద రిపోర్ట్ టుమారో | |
| 17. They might work in groups. | 17. వారు సమూహాలలో పని చేయవచ్చు. |
| దే మైట్ వర్క్ ఇన్ గ్రూప్స్ | |
| 18. The teacher might allow extra time. | 18. ఉపాధ్యాయుడు అదనపు సమయాన్ని అనుమతించవచ్చు. |
| ద టీచర్ మైట్ అలో ఉ ఎక్స్ట్రా టైం | |
| 19. My sister might take notes. | 19. నా సోదరి నోట్స్ తీసుకోవచ్చు. |
| మై సిస్టర్ మైట్ టేక్ నోట్స్ | |
| 20. Your parents might check the work. | 20. మీ తల్లిదండ్రులు పనిని తనిఖీ చేయవచ్చు. |
| యోర్ పెరెంట్స్ మైట్ చెక్ ద వర్క్ | |
| 21. I might ask a question. | 21. నేను ఒక ప్రశ్న అడగవచ్చు. |
| ఐ మైట్ ఆ స్క్ అ క్వెశ్చన్ | |
| 22. You might stay here for a while. | 22. మీరు కొంతకాలం ఇక్కడ ఉండవచ్చు. |
| యూ మైట్ స్టే హియర్ ఫర్ అ వైల్ | |
| 23. He might participate in the discussion. | 23. అతను చర్చలో పాల్గొనవచ్చు. |
| హీ మైట్ పార్టిసిపేట్ ఇన్ ద డిస్కషన్ | |
| 24. She might submit the homework. | 24. ఆమె హోంవర్క్ సమర్పించవచ్చు. |
| షీ మైట్ సబ్మిట్ ద హోంవర్క్ | |
| 25. They might leave after the meeting. | 25. వారు సమావేశం తర్వాత వెళ్లిపోవచ్చు. |
| దే మైట్ లీవ్ ఆఫ్టర్ ద మీటింగ్ | |
4. Asking a permission: ప్రశ్న అడగడం
ఎవరినైనా గౌరవప్రదంగా ఏదైనా అడగటానికి లేదా అనుమతి తీసుకోవటానికి కూడా Might ఉపయోగిస్తారు. ఇది చూడడానికి ప్రశ్న వాక్యం లాగా ఉంటుంది. ప్రతి సెంటెన్స్ కి చివర “ చ్చా” అని వస్తుంది.
Might + all subjects + verb1?
క్రింది టేబుల్లోనే మొదటి సెంటెన్స్ గమనించండి
Might I borrow your pen? = నేను మీ పెన్ను తీసుకోవచ్చా?
ఇది ఆల్రెడీ Interrogative sentence లో ఉంది కాబట్టి దీన్ని negative interrogtive sentence లోకి మార్చుటకు సబ్జెక్టు తరువాత not ఉపయోగిస్తే సరిపోతుంది.
Might I not borrow your pen? = నేను మీ పెన్ను అప్పుతీసుకోకూడదా?
| 1. Might I borrow your pen? | 1. నేను మీ పెన్ను అప్పు తీసుకోవచ్చా? |
| మైట్ ఐ బారో యోర్ పెన్ | |
| 2. Might I leave the room now? | 2. నేను ఇప్పుడు గది నుండి బయటకు వెళ్లవచ్చా? |
| మైట్ ఐ లీవ్ ద రూమ్ నౌ | |
| 3. Might I open the window? | 3. నేను కిటికీ తెరవవచ్చా? |
| మైట్ ఐ ఓపెన్ ద విండో | |
| 4. Might I take a seat? | 4. నేను కూర్చోవచ్చా? |
| మైట్ ఐ టేక్ అ సీట్ | |
| 5. Might I use your computer for a while? | 5. నేను మీ కంప్యూటర్‌ను కొంతకాలం ఉపయోగించవచ్చా? |
| మైట్ ఐ యూజ్ యోర్ కంప్యూటర్ ఫర్ అ వైల్ | |
| 6. Might I ask you a question? | 6. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగవచ్చా? |
| మైట్ ఐ ఆ స్క్ యూ అ క్వెష్చన్ | |
| 7. Might I borrow some sugar? | 7. నేను కొంచెం చక్కెర తీసుకోవచ్చా? |
| మైట్ ఐ బారో సమ్ షుగర్ | |
| 8. Might I check the notice board? | 8. నేను నోటీసు బోర్డుని తనిఖీ చేయవచ్చా? |
| మైట్ ఐ చెక్ ద నోటిస్ బోర్డ్ | |
| 9. Might I take your advice? | 9. నేను మీ సలహా తీసుకోవచ్చా? |
| మైట్ ఐ టేక్ యోర్ అడ్వైస్ | |
| 10. Might I leave early today? | 10. నేను ఈరోజు త్వరగా బయలుదేరవచ్చా? |
| మైట్ ఐ లీవ్ ఎర్లీ టుడే | |
| 11. Might you help me with this work? | 11. ఈ పనిలో మీరు నాకు సహాయం చేయవచ్చా? |
| మైట్ యూ హెల్ప్ మీ విథ్ దిస్ వర్క్ | |
| 12. Might he borrow your book? | 12. అతను మీ పుస్తకాన్ని తీసుకోవచ్చా? |
| మైట్ హీ బారో యోర్ బుక్ | |
| 13. Might she use the pen for a moment? | 13. ఆమె ఒక్క క్షణం పెన్ను ఉపయోగించవచ్చా? |
| మైట్ షీ యూజ్ ద పెన్ ఫర్ అ మొమెంట్ | |
| 14. Might it stay here for a while? | 14. అది కొంతకాలం ఇక్కడే ఉండవచ్చా? |
| మైట్ ఇట్ స్టే హియర్ ఫర్ అ వైల్ | |
| 15. Might we enter the library now? | 15. మనం ఇప్పుడు లైబ్రరీలోకి వెళ్ళవచ్చా? |
| మైట్ వీ ఎంటర్ ద లైబ్రరి నౌ | |
| 16. Might they sit here quietly? | 16. వారు ఇక్కడ నిశ్శబ్దంగా కూర్చోవచ్చా? |
| మైట్ దే సిట్ హియర్ క్వైట్‌లీ | |
| 17. Might my friend borrow some notes? | 17. నా స్నేహితుడు కొన్ని నోట్లు తీసుకోవచ్చా? |
| మైట్ మై ఫ్రెండ్ బారో సమ్ నోట్స్ | |
| 18. Might your brother check this file? | 18. మీ సోదరుడు ఈ ఫైల్‌ను తనిఖీ చేయవచ్చా? |
| మైట్ యోర్ బ్రదర్ చెక్ దిస్ ఫైల్ | |
| 19. Might our teacher explain this again? | 19. మన టీచర్ దీన్ని మళ్ళీ వివరించ వచ్చా? |
| మైట్ అవర్ టీచర్ ఎక్స్ప్లెయిన్ దిస్ అగెయిన్ | |
| 20. Might my sister use your phone? | 20. నా చెల్లి మీ ఫోన్ వాడవచ్చా? |
| మైట్ మై సిస్టర్ యూజ్ యోర్ ఫోన్ | |
| 21. Might your parents allow me to go out? | 21. మీ తల్లిదండ్రులు నన్ను బయటకు వెళ్ళడానికి అనుమతించవచ్చా? |
| మైట్ యోర్ పెరెంట్స్ అలో మీ టు గో ఔట్ | |
| 22. Might the children play here? | 22. పిల్లలు ఇక్కడ ఆడుకోవచ్చా? |
| మైట్ ద చిల్డ్రెన్ ప్లే హియర్ | |
| 23. Might the boys take a break now? | 23. అబ్బాయిలు ఇప్పుడు విశ్రాంతి తీసుకోవచ్చా? |
| మైట్ ద బాయ్స్ టేక్ అ బ్రేక్ నౌ | |
| 24. Might the team use this hall for practice? | 24. బృందం ప్రాక్టీస్ కోసం ఈ హాలును ఉపయోగించవచ్చా? |
| మైట్ ద టీమ్ యూజ్ దిస్ హాల్ ఫర్ ప్రాక్టీస్ | |
| 25. Might the students borrow the books from the library? | 25. విద్యార్థులు లైబ్రరీ నుండి పుస్తకాలు తీసుకోవచ్చా? |
| మైట్ ద స్టూడెంట్స్ బారో ద బుక్స్ ఫ్రం ద లైబ్రరి |
5. Expressing doubt: సందేహం వ్యక్తపరచడం
ఏదైనా విషయాన్ని గురించి సందేహాన్ని వ్యక్తపరచడానికి కూడా Might ఉపయోగిస్తారు. ఇటువంటి సెంటెన్సెస్ లో కూడా చివర “చ్చు” అని వస్తుంది.
All subjects + might + verb1
| 1. That might be true. | 1. అది నిజమే కావచ్చు. |
| దట్ మైట్ బీ ట్రూ | |
| 2. I might be wrong. | 2. నేను తప్పు కావచ్చు. |
| ఐ మైట్ బీ రాంగ్ | |
| 3. You might not understand. | 3. మీకు అర్థం కాకపోవచ్చు. |
| యూ మైట్ నాట్ అండర్‌స్టాండ్ | |
| 4. He might know the answer. | 4. అతనికి సమాధానం తెలిసి ఉండవచ్చు. |
| హీ మైట్ నో ద ఆన్స్err | |
| 5. She might be late. | 5. ఆమె ఆలస్యం కావచ్చు. |
| షీ మైట్ బీ లేట్ | |
| 6. It might take time. | 6. దీనికి సమయం పట్టవచ్చు. |
| ఇట్ మైట్ టేక్ టైమ్ | |
| 7. We might be mistaken. | 7. మనం తప్పుగా భావించి ఉండవచ్చు. |
| వీ మైట్ బీ మిస్టే కన్ | |
| 8. They might not agree. | 8. వారు అంగీకరించకపోవచ్చు. |
| దే మైట్ నాట్ అగ్రి | |
| 9. The dog might be hungry. | 9. కుక్క ఆకలితో ఉండవచ్చు. |
| ద డాగ్ మైట్ బీ హంగ్రీ | |
| 10. The children might be tired. | 10. పిల్లలు అలసిపోయి ఉండవచ్చు. |
| ద చిల్డ్రెన్ మైట్ బీ టాయర్డ్ | |
| 11. My friend might forget. | 11. నా స్నేహితుడు మర్చిపోవచ్చు. |
| మై ఫ్రెండ్ మైట్ ఫార్గెట్ | |
| 12. Your brother might need help. | 12. మీ సోదరుడికి సహాయం అవసరం కావచ్చు. |
| యోర్ బ్రదర్ మైట్ నीड్ హెల్ప్ | |
| 13. The teacher might change the schedule. | 13. ఉపాధ్యాయుడు షెడ్యూల్ మార్చవచ్చు. |
| ద టీచర్ మైట్ చెంజ్ ద షెడ్యూల్ | |
| 14. I might miss the bus. | 14. నేను బస్సు మిస్ కావచ్చు. |
| ఐ మైట్ మిస్ ద బస్ | |
| 15. You might find it difficult. | 15. మీకు కష్టంగా అనిపించవచ్చు. |
| యూ మైట్ ఫైండ్ ఇట్ డిఫికల్ట్ | |
| 16. He might forget his promise. | 16. అతను తన వాగ్దానాన్ని మరచిపోవచ్చు. |
| హీ మైట్ ఫార్గెట్ హిజ్ ప్రామిస్ | |
| 17. She might leave soon. | 17. ఆమె త్వరలో వెళ్లిపోవచ్చు. |
| షీ మైట్ లీవ్ సూన్ | |
| 18. It might not work properly. | 18. ఇది సరిగ్గా పని చేయకపోవచ్చు. |
| ఇట్ మైట్ నాట్ వర్క్ ప్రాపర్‌లీ | |
| 19. We might lose the match. | 19. మనం మ్యాచ్ ఓడిపోవచ్చు. |
| వీ మైట్ లూస్ ద మ్యాచ్ | |
| 20. They might arrive late. | 20. వారు ఆలస్యంగా రావచ్చు. |
| దే మైట్ అరైవ్ లేట్ | |
| 21. The cat might hide somewhere. | 21. పిల్లి ఎక్కడో దాక్కోవచ్చు. |
| ద కాట మైట్ హైడ్ సమ్‌వేర్ | |
| 22. The boys might be tired. | 22. అబ్బాయిలు అలసిపోయి ఉండవచ్చు. |
| ద బాయ్స్ మైట్ బీ టాయర్డ్ | |
| 23. My sister might not like it. | 23. నా సోదరికి అది నచ్చకపోవచ్చు. |
| మై సిస్టర్ మైట్ నాట్ లైక్ ఇట్ | |
| 24. Your parents might agree later. | 24. మీ తల్లిదండ్రులు తరువాత అంగీకరించవచ్చు. |
| యోర్ పెరెంట్స్ మైట్ అగ్రి లేటర్ | |
| 25. The team might fail in the test. | 25. జట్టు పరీక్షలో విఫలమై ఉండవచ్చు. |
| ద టీమ్ మైట్ ఫెయిల్ ఇన్ ద టెస్ట్ |
Might be
Might be ఏ సందర్భంలో ఉపయోగిస్తారో తెలుసుకుందాం
ఒక వ్యక్తి లేదా వస్తువు యొక్క స్థితి Present లో కానీ , future లో కానీ ఇలా ఉండొచ్చు, లేదా అతను ఒక ప్రదేశంలో ఉండొచ్చు అనే సందేహంగా చెప్పే వాక్యాలకు Might be ఉపయోగిస్తారు. ఇలాంటి వాక్యాలకు May be కూడా ఉపయోగిస్తారు. కానీ may be కంటే ఇంకా ఎక్కువ సందేహం (డౌట్) ఉన్న వాక్యాలను చెప్పడానికి Might be ఉపయోగిస్తారు.
1.Might be + Noun
క్రింది టేబుల్ లోని మొదటి ఉదాహరణ చూడండి. అతను ఉపాధ్యాయుడిగా ఉండొచ్చు. ప్రస్తుతం గాని భవిష్యత్తులో గాని అతను ఉపాధ్యాయుడిగా ఉండొచ్చు. అంటే అతను ఉపాధ్యాయుడిగా ఉండొచ్చు ఉండకపోవచ్చు ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఉంటాయి.
| 1. He might be a teacher. | 1. అతను ఉపాధ్యాయుడిగా ఉండొచ్చు |
| హీ మైట్ బీ ఎ టీచర్ | అతను ఉపాధ్యాయుడిగా ఉండకపోవచ్చు |
| He might not be a teacher. | అతను ఉపాధ్యాయుడిగా ఉండొచ్చా? |
| Might he be a teacher? | అతను ఉపాధ్యాయుడిగా ఉండకపోవచ్చా? |
| Might he not be a teacher? | |
| 2. She might be a doctor. | 2. ఆమె ఒక వైద్యురాలిగా ఉండొచ్చు |
| షీ మైట్ బీ ఎ డాక్టర్ | |
| 3. He might be a driver. | 3. అతను డ్రైవర్ గా ఉండొచ్చు |
| హీ మైట్ బీ ఎ డ్రైవర్ | |
| 4. She might be a student. | 4. ఆమె ఒక విద్యార్థి గా ఉండొచ్చు. |
| షీ మైట్ బీ ఎ స్టూడెంట్ | |
| 5. He might be a singer. | 5. అతను గాయకుడు గా ఉండొచ్చు. |
| హీ మైట్ బీ ఎ సింగర్ | |
| 6. He might be a teacher in that school. | 6. అతను ఆ పాఠశాలలో ఉపాధ్యాయుడు గా ఉండొచ్చు. |
| హీ మైట్ బీ ఎ టీచర్ ఇన్ దట్ స్కూల్ | |
| 7. She might be a doctor in the city hospital. | 7. ఆమె నగర ఆసుపత్రిలో వైద్యురాలు గా ఉండొచ్చు. |
| షీ మైట్ బీ ఎ డాక్టర్ ఇన్ ది సిటీ హాస్పిటల్ | |
| 8. He might be a driver of that company. | 8. అతను ఆ కంపెనీలో డ్రైవర్ గా ఉండొచ్చు. |
| హీ మైట్ బీ ఎ డ్రైవర్ ఆఫ్ దట్ కంపెనీ | |
| 9. She might be a student at that college. | 9. ఆమె ఆ కళాశాలలో విద్యార్థిని అయి ఉండవచ్చు. |
| షీ మైట్ బీ ఎ స్టూడెంట్ ఇన్ దట్ కాలేజ్ | |
| 10. He might be a singer in that program. | 10. అతను ఆ కార్యక్రమంలో గాయకుడిగా ఉండవచ్చు. |
| హీ మైట్ బీ ఎ సింగర్ ఇన్ దట్ ప్రోగ్రామ్ | |
2.Might be + adjective
ఒక వ్యక్తి యొక్క లేదా వస్తువు యొక్క గుణము Present లో గాని Future లో గాని సందేహంగా ఈ విధంగా ఉండొచ్చు అని చెప్పడానికి
| 1. He might be tired. | 1. అతను అలసిపోయి ఉండవచ్చు. |
| హీ మైట్ బీ టైర్డ్ | |
| 2. She might be happy. | 2. ఆమె సంతోషంగా ఉండవచ్చు. |
| షీ మైట్ బీ హ్యాపీ | |
| 3. He might be sad. | 3. అతను విచారంగా ఉండవచ్చు. |
| హీ మైట్ బీ సాడ్ | |
| 4. She might be angry. | 4. ఆమెకు కోపంగా ఉండవచ్చు. |
| షీ మైట్ బీ యాంగ్రీ | |
| 5. He might be busy. | 5. అతను తీరిక లేకుండా ఉండవచ్చు. |
| హీ మైట్ బీ బిజీ | |
| 6. He might be tired after the long journey. | 6. సుదీర్ఘ ప్రయాణం తర్వాత అతను అలసిపోయి ఉండవచ్చు. |
| హీ మైట్ బీ టైర్డ్ ఆఫ్టర్ ది లాంగ్ జర్నీ | |
| 7. She might be happy with her result. | 7. ఆమె తన ఫలితంతో సంతోషంగా ఉండవచ్చు. |
| షీ మైట్ బీ హ్యాపీ విత్ హర్ రిజల్ట్ | |
| 8. He might be sad because of that news. | 8. ఆ వార్త వల్ల అతను బాధగా ఉండవచ్చు. |
| హీ మైట్ బీ సాడ్ బికాజ్ ఆఫ్ దట్ న్యూస్ | |
| 9. She might be angry with you for that mistake. | 9. ఆ తప్పు చేసినందుకు ఆమె మీ మీద కోపంగా ఉండవచ్చు. |
| షీ మైట్ బీ యాంగ్రీ విత్ యూ ఫర్ దట్ మిస్టేక్ | |
| 10. He might be busy with his office work now. | 10. అతను ఇప్పుడు తన ఆఫీసు పనితో బిజీగా ఉండవచ్చు. |
| హీ మైట్ బీ బిజీ విత్ హిస్ ఆఫీస్ వర్క్ నౌ | |
3.Might be + Location
ప్రజెంట్ లో గాని ఫ్యూచర్లో గాని ఒక వ్యక్తి ఉన్న ప్రదేశం గురించి సందేహంగా తెలియజేయడానికి
ఏదైనా ఒక ప్రదేశంలో ఉండవచ్చు అని చెప్పడానికి
| 1. He might be at home. | 1. అతను ఇంట్లో ఉండవచ్చు. |
| హీ మైట్ బీ అట్ హోమ్ | |
| He might not be at home. | అతని ఇంట్లో ఉండకపోవచ్చు |
| Might he be at home? | అతని ఇంట్లో ఉండవచ్చా? |
| Might he not be at home? | అతని ఇంట్లో ఉండకపోవచ్చా? |
| 2. She might be at school. | 2. ఆమె పాఠశాలలో ఉండవచ్చు. |
| షీ మైట్ బీ అట్ స్కూల్ | |
| 3. He might be in the room. | 3. అతను గదిలో ఉండవచ్చు. |
| హీ మైట్ బీ ఇన్ ది రూమ్ | |
| 4. She might be at the office. | 4. ఆమె ఆఫీసులో ఉండవచ్చు. |
| షీ మైట్ బీ అట్ ఆఫీస్ | |
| 5. He might be in the park. | 5. అతను పార్కులో ఉండవచ్చు. |
| హీ మైట్ బీ ఇన్ ది పార్క్ | |
| 6. He might be at home with his family now. | 6. అతను ఇప్పుడు తన కుటుంబంతో ఇంట్లో ఉండవచ్చు. |
| హీ మైట్ బీ అట్ హోమ్ విత్ హిస్ ఫ్యామిలీ నౌ | |
| 7. She might be at school with her friends. | 7. ఆమె తన స్నేహితులతో కలిసి పాఠశాలలో ఉండవచ్చు. |
| షీ మైట్ బీ అట్ స్కూల్ విత్ హర్ ఫ్రెండ్స్ | |
| 8. He might be in the room doing his work. | 8. అతను గదిలో తన పని చేసుకుంటూ ఉండవచ్చు. |
| హీ మైట్ బీ ఇన్ ది రూమ్ డూయింగ్ హిస్ వర్క్ | |
| 9. She might be at the office attending a meeting. | 9. ఆమె ఒక సమావేశానికి హాజరవడానికి కార్యాలయంలో ఉండవచ్చు. |
| షీ మైట్ బీ అట్ ఆఫీస్ అటెండింగ్ ఎ మీటింగ్ | |
| 10. He might be in the park with his children. | 10. అతను తన పిల్లలతో పార్కులో ఉండవచ్చు. |
| హీ మైట్ బీ ఇన్ ది పార్క్ విత్ హిస్ చిల్డ్రెన్ |
4.Might be + Time
ప్రస్తుతం టైం ఎంత అయి ఉండవచ్చు అని సందేహంగా ఊహాజనితంగా చెప్పడానికి
ఇంగ్లీషులో ప్రతి వాక్యంలో సబ్జెక్టు కచ్చితంగా ఉండాలి కానీ సమయం చెప్పడానికి ప్రత్యేకమైన సబ్జెక్టు ఉండదు కాబట్టి It ఉపయోగిస్తారు.
| 1. It might be late. | 1. ఆలస్యం కావచ్చు. |
| ఇట్ మైట్ బీ లేట్ | |
| 2. It might be early. | 2. ఇంకా తొందర కావచ్చు. |
| ఇట్ మైట్ బీ ఎర్లీ | |
| 3. It might be night. | 3. రాత్రి అయి ఉండవచ్చు. |
| ఇట్ మైట్ బీ నైట్ | |
| 4. It might be morning. | 4. బహుశా ఉదయం అయి ఉండవచ్చు. |
| ఇట్ మైట్ బీ మార్నింగ్ | |
| 5. It might be evening. | 5. ఇది సాయంత్రం కావచ్చు. |
| ఇట్ మైట్ బీ ఈవెనింగ్ | |
| 6. It might be late now because it is dark. | 6. ఇప్పుడు చీకటిగా ఉంది కాబట్టి ఆలస్యం అయి ఉండవచ్చు. |
| ఇట్ మైట్ బీ లేట్ నౌ బికాజ్ ఇట్ ఇస్ డార్క్ | |
| 7. It might be early, as the sun just rose. | 7. సూర్యుడు ఇప్పుడే ఉదయించాడు కాబట్టి ఇంకా పొద్దున్నే అయి ఉండవచ్చు. |
| ఇట్ మైట్ బీ ఎర్లీ అస్ ది సన్ జస్ట్ రోజ్ | |
| 8. It might be night as the lights are on. | 8. లైట్లు వెలిగి ఉన్నాయి కాబట్టి రాత్రి అయి ఉండవచ్చు. |
| ఇట్ మైట్ బీ నైట్ అస్ ది లైట్స్ ఆర్ ఆన్ | |
| 9. It might be morning because people are walking. | 9. ప్రజలు నడుస్తున్నారు కాబట్టి అది ఉదయం అయి ఉండవచ్చు. |
| ఇట్ మైట్ బీ మార్నింగ్ బికాజ్ పీపుల్ ఆర్ వాకింగ్ | |
| 10. It might be evening as the sky is changing. | 10. ఆకాశం రంగు మారుతుండటంతో సాయంత్రం అయి ఉండవచ్చు. |
| ఇట్ మైట్ బీ ఈవెనింగ్ అస్ ది స్కై ఇస్ చేంజింగ్ |
5.Might be + verb4 (onging actions)
ప్రస్తుతం కొనసాగుతున్న చర్యల గురించి సందేహాత్మకంగా వివరించడానికి
| 1. He might be sleeping. | 1. అతను నిద్రపోతూ ఉండవచ్చు. |
| హీ మైట్ బీ స్లీపింగ్ | |
| He might not be sleeping. | అతను నిద్రపోతూ ఉండకపోవచ్చు |
| Might he be sleeping ?. | అతని నిద్రపోతూ ఉండవచ్చా? |
| Might he not be sleeping ?. | అతను నిద్రపోతూ ఉండకపోవచ్చా? |
| 2. She might be studying. | 2. ఆమె చదువుకుంటుండవచ్చు. |
| షీ మైట్ బీ స్టడీయింగ్ | |
| 3. He might be eating. | 3. అతను తింటూ ఉండవచ్చు. |
| హీ మైట్ బీ ఈటింగ్ | |
| 4. She might be reading. | 4. ఆమె చదువుతూ ఉండవచ్చు. |
| షీ మైట్ బీ రీడింగ్ | |
| 5. He might be playing. | 5. అతను ఆడుతూ ఉండవచ్చు. |
| హీ మైట్ బీ ప్లేయింగ్ | |
| 6. He might be sleeping in his room now. | 6. అతను ఇప్పుడు తన గదిలో నిద్రపోతూ ఉండవచ్చు. |
| హీ మైట్ బీ స్లీపింగ్ ఇన్ హిస్ రూమ్ నౌ | |
| 7. She might be studying for her exams. | 7. ఆమె తన పరీక్షల కోసం చదువుతూ ఉండవచ్చు. |
| షీ మైట్ బీ స్టడీయింగ్ ఫర్ హర్ ఎగ్జామ్స్ | |
| 8. He might be eating his lunch at home. | 8. అతను ఇంట్లో మధ్యాహ్న భోజనం చేస్తూ ఉండవచ్చు. |
| హీ మైట్ బీ ఈటింగ్ హిస్ లంచ్ అట్ హోమ్ | |
| 9. She might be reading a book in the library. | 9. ఆమె గ్రంథాలయంలో పుస్తకం చదువుతూ ఉండవచ్చు. |
| షీ మైట్ బీ రీడింగ్ ఎ బుక్ ఇన్ ది లైబ్రరీ | |
| 10. He might be playing with his friends outside. | 10. అతను బయట తన స్నేహితులతో ఆడుకుంటూ ఉండవచ్చు. |
| హీ మైట్ బీ ప్లేయింగ్ విత్ హిస్ ఫ్రెండ్స్ అవుట్‌సైడ్ |
Might have
Might have ఏ సందర్భాలలో ఉపయోగిస్తారో తెలుసుకుందాం
Might have తో ఎక్కువగా verb3 మాత్రమే ఉపయోగిస్తారు. ఇది గతంలోని ఏదైనా పని జరిగి ఉండొచ్చు అని గెస్ చేయడానికి ఉపయోగిస్తారు
1.Past possibility
గతంలో ఏదైనా ఒక పని జరిగి ఉండొచ్చు అని అంచనా వేయడానికి
Might have + verb3
| 1. He might have gone. | 1. అతను వెళ్లి ఉండవచ్చు. |
| హీ మైట్ హావ్ గోన్ | |
| He might not have gone. | అతను వెళ్లకపోయి ఉండవచ్చు. |
| Might he have gone? | అతను వెళ్లి ఉండవచ్చా? |
| Might he not have gone? | అతను వెళ్లకపోయి ఉండకపోవచ్చా? |
| 2. She might have slept. | 2. ఆమె నిద్రపోయి ఉండవచ్చు. |
| షీ మైట్ హావ్ స్లెప్ట్ | |
| 3. They might have left. | 3. వారు వెళ్లిపోయి ఉండవచ్చు. |
| దే మైట్ హావ్ లెఫ్ట్ | |
| 4. He might have eaten. | 4. అతను తిని ఉండవచ్చు. |
| హీ మైట్ హావ్ ఈటన్ | |
| 5. She might have called. | 5. ఆమె ఫోన్ చేసి ఉండవచ్చు. |
| షీ మైట్ హావ్ కాల్డ్ | |
| 6. I might have missed it. | 6. నేను దాన్ని గమనించి ఉండకపోవచ్చు. |
| ఐ మైట్ హావ్ మిస్డ్ ఇట్ | |
| 7. We might have lost. | 7. మనం ఓడిపోయి ఉండవచ్చు. |
| వీ మైట్ హావ్ లాస్ట్ | |
| 8. He might have tried. | 8. అతను ప్రయత్నించి ఉండవచ్చు. |
| హీ మైట్ హావ్ ట్రైడ్ | |
| 9. She might have waited. | 9. ఆమె వేచి ఉండి ఉండవచ్చు. |
| షీ మైట్ హావ్ వెయిటెడ్ | |
| 10. They might have won. | 10. వారు గెలిచి ఉండవచ్చు. |
| దే మైట్ హావ్ వన్ | |
| 11. He might have gone to the market early in the morning. | 11. అతను పొద్దున్నే సంతకు వెళ్లి ఉండవచ్చు. |
| హీ మైట్ హావ్ గోన్ టు ది మార్కెట్ ఎర్లీ ఇన్ ది మార్నింగ్ | |
| 12. She might have slept after finishing her work at home. | 12. ఆమె ఇంట్లో పని ముగించుకుని నిద్రపోయి ఉండవచ్చు. |
| షీ మైట్ హావ్ స్లెప్ట్ ఆఫ్టర్ ఫినిషింగ్ హర్ వర్క్ ఎట్ హోమ్ | |
| 13. They might have left before we reached the station. | 13. మనం స్టేషన్‌కు చేరుకునేలోపే వారు వెళ్లిపోయి ఉండవచ్చు. |
| దే మైట్ హావ్ లెఫ్ట్ బిఫోర్ వీ రీచ్ ది స్టేషన్ | |
| 14. He might have eaten the food kept on the table. | 14. అతను బల్ల మీద ఉంచిన ఆహారాన్ని తిని ఉండవచ్చు. |
| హీ మైట్ హావ్ ఈటన్ ది ఫుడ్ కెప్ట్ ఆన్ ది టేబుల్ | |
| 15. She might have called you when you were busy. | 15. మీరు పనిలో నిమగ్నమై ఉన్నప్పుడు ఆమె మీకు ఫోన్ చేసి ఉండవచ్చు. |
| షీ మైట్ హావ్ కాల్డ్ యూ వెన్ యూ వర్ బిజీ | |
| 16. I might have missed the chance because I was late. | 16. నేను ఆలస్యంగా రావడం వల్ల ఆ అవకాశాన్ని కోల్పోయి ఉండవచ్చు. |
| ఐ మైట్ హావ్ మిస్డ్ ది ఛాన్స్ బికాజ్ ఐ వాస్ లేట్ | |
| 17. We might have lost the match due to poor performance. | 17. పేలవమైన ప్రదర్శన కారణంగా మనం మ్యాచ్ ఓడిపోయి ఉండవచ్చు. |
| వీ మైట్ హావ్ లాస్ట్ ది మ్యాచ్ డ్యూ టు పూర్ పెర్ఫార్మెన్స్ | |
| 18. He might have tried his best to complete the work. | 18. అతను ఆ పనిని పూర్తి చేయడానికి తన వంతు ప్రయత్నం చేసి ఉండవచ్చు. |
| హీ మైట్ హావ్ ట్రైడ్ హిస్ బెస్ట్ టు కంప్లీట్ ది వర్క్ | |
| 19. She might have waited for you for a long time. | 19. ఆమె మీ కోసం చాలా కాలం వేచి ఉండి ఉండవచ్చు. |
| షీ మైట్ హావ్ వెయిటెడ్ ఫర్ యూ ఫర్ ఎ లాంగ్ టైమ్ | |
| 20. They might have won the game if they had practised well. | 20. వారు బాగా సాధన చేసి ఉంటే ఆట గెలిచి ఉండవచ్చు. |
| దే మైట్ హావ్ వన్ ది గేమ్ ఇఫ్ దే హ్యాడ్ ప్రాక్టీస్్డ్ వెల్ |
2.Giving reason
ప్రస్తుతం జరిగిన దానికి గతంలోని కారణాన్ని ఊహించడం లేదా గెస్ చేయడం
Might have + verb3
క్రింది టేబుల్ లోని మొదటి సెంటెన్స్ చూడండి
He is late = అతను ఆలస్యమైనాడు. ఈ సెంటెన్స్ సింపుల్ ప్రెసెంట్ టెన్స్ లో ఉండి ప్రస్తుత స్థితిని తెలియజేస్తున్నది.
ప్రస్తుత స్థితికి కారణమైన దానిని రెండవ సెంటెన్స్ తెలియజేస్తున్నది
He might have missed the bus. అతను బస్సుని మిస్ అయి ఉండవచ్చు.
| 1. He is late. He might have missed the bus. | 1. అతను ఆలస్యంగా వచ్చాడు. బహుశా బస్సును కోల్పోయి ఉండవచ్చు. |
| హీ ఇస్ లేట్. హీ మైట్ హావ్ మిస్డ్ ది బస్ | |
| He might not have missed the bus. | అతను బస్సును తప్పి ఉండకపోవచ్చు. |
| Might he have missed the bus? | అతను బస్సును కోల్పోయి ఉంటాడా? |
| Might he not have missed the bus? | అతను బస్సును తప్పిపోయి ఉండవచ్చా? |
| 2. She is tired. She might have worked. | 2. ఆమె అలసిపోయింది. ఆమె పని చేసి ఉండవచ్చు. |
| షీ ఇస్ టైర్డ్. షీ మైట్ హావ్ వర్క్డ్ | |
| 3. He is sad. He might have failed. | 3. అతను విచారంగా ఉన్నాడు. అతను ఫెయిల్ అయ్యి ఉండవచ్చు. |
| హీ ఇస్ సాడ్. హీ మైట్ హావ్ ఫెయిల్డ్ | |
| 4. They are happy. They might have won. | 4. వారు సంతోషంగా ఉన్నారు. వారు గెలిచి ఉండవచ్చు. |
| దే ఆర్ హ్యాపీ. దే మైట్ హావ్ వన్ | |
| 5. She is quiet. She might have cried. | 5. ఆమె నిశ్శబ్దంగా ఉంది. ఆమె ఏడ్చి ఉండవచ్చు. |
| షీ ఇస్ క్వయెట్. షీ మైట్ హావ్ క్రైడ్ | |
| 6. He is angry. He might have lost. | 6. అతను కోపంగా ఉన్నాడు. అతను ఓడిపోయి ఉండవచ్చు. |
| హీ ఇస్ యాంగ్రీ. హీ మైట్ హావ్ లాస్ట్ | |
| 7. They are late. They might have slept. | 7. వారు ఆలస్యంగా వచ్చారు. బహుశా నిద్రపోయి ఉండవచ్చు. |
| దే ఆర్ లేట్. దే మైట్ హావ్ స్లెప్ట్ | |
| 8. She is worried. She might have forgotten. | 8. ఆమె ఆందోళన చెందుతోంది. ఆమె మర్చిపోయి ఉండవచ్చు. |
| షీ ఇస్ వరీడ్. షీ మైట్ హావ్ ఫర్గాటెన్ | |
| 9. He is weak. He might have fallen. | 9. అతను బలహీనంగా ఉన్నాడు. అతను పడిపోయి ఉండవచ్చు. |
| హీ ఇస్ వీక్. హీ మైట్ హావ్ ఫాలెన్ | |
| 10. She is smiling. She might have heard good news. | 10. ఆమె నవ్వుతోంది. ఆమెకు శుభవార్త విని ఉండవచ్చు. |
| షీ ఇస్ స్మైలింగ్. షీ మైట్ హావ్ హెర్డ్ గుడ్ న్యూస్ | |
| 11. He is late today. He might have missed the train in the morning. | 11. అతను ఈరోజు ఆలస్యంగా వచ్చాడు. బహుశా ఉదయం రైలును తప్పిపోయి ఉండవచ్చు. |
| హీ ఇస్ లేట్ టుడే. హీ మైట్ హావ్ మిస్డ్ ది ట్రైన్ ఇన్ ది మార్నింగ్ | |
| 12. She looks tired. She might have worked all night at home. | 12. ఆమె అలసిపోయినట్లు కనిపిస్తోంది. ఆమె ఇంట్లో రాత్రంతా పనిచేసి ఉండవచ్చు. |
| షీ లుక్స్ టైర్డ్. షీ మైట్ హావ్ వర్క్డ్ ఆల్ నైట్ ఎట్ హోమ్ | |
| 13. He seems sad. He might have failed in the exam yesterday. | 13. అతను విచారంగా కనిపిస్తున్నాడు. అతను నిన్న పరీక్షలో ఫెయిల్ అయి ఉండవచ్చు. |
| హీ సీమ్స్ సాడ్. హీ మైట్ హావ్ ఫెయిల్డ్ ఇన్ ది ఎగ్జామ్ యెస్టర్డే | |
| 14. They are very happy. They might have won the competition. | 14. వారు చాలా సంతోషంగా ఉన్నారు. వారు పోటీలో గెలిచి ఉండవచ్చు. |
| దే ఆర్ వెరీ హ్యాపీ. దే మైట్ హావ్ వన్ ది కాంపిటిషన్ | |
| 15. She is very quiet today. She might have cried before coming here. | 15. ఆమె ఈరోజు చాలా నిశ్శబ్దంగా ఉంది. ఇక్కడికి రాకముందు ఆమె ఏడ్చి ఉండవచ్చు. |
| షీ ఇస్ వెరీ క్వయెట్ టుడే. షీ మైట్ హావ్ క్రైడ్ బిఫోర్ కమింగ్ హియర్ | |
| 16. He is angry now. He might have lost something important. | 16. అతను ఇప్పుడు కోపంగా ఉన్నాడు. అతను ఏదైనా ముఖ్యమైనది పోగొట్టుకొని ఉండవచ్చు. |
| హీ ఇస్ యాంగ్రీ నౌ. హీ మైట్ హావ్ లాస్ట్ సమ్తింగ్ ఇంపార్టెంట్ | |
| 17. They are late again. They might have slept for a long time. | 17. వారు మళ్ళీ ఆలస్యంగా వచ్చారు. వారు చాలా సేపు నిద్రపోయి ఉండవచ్చు. |
| దే ఆర్ లేట్ అగైన్. దే మైట్ హావ్ స్లెప్ట్ ఫర్ ఎ లాంగ్ టైమ్ | |
| 18. She is worried today. She might have forgotten her work. | 18. ఆమె ఈరోజు ఆందోళనగా ఉంది. ఆమె తన పనిని మర్చిపోయి ఉండవచ్చు. |
| షీ ఇస్ వరీడ్ టుడే. షీ మైట్ హావ్ ఫర్గాటెన్ హర్ వర్క్ | |
| 19. He looks weak. He might have fallen on the road. | 19. అతను బలహీనంగా కనిపిస్తున్నాడు. అతను రోడ్డు మీద పడిపోయి ఉండవచ్చు. |
| హీ లుక్స్ వీక్. హీ మైట్ హావ్ ఫాలెన్ ఆన్ ది రోడ్ | |
| 20. She is smiling now. She might have heard good news from her friend. | 20. ఆమె ఇప్పుడు నవ్వుతోంది. ఆమె తన స్నేహితురాలి నుండి శుభవార్త విని ఉండవచ్చు. |
| షీ ఇస్ స్మైలింగ్ నౌ. షీ మైట్ హావ్ హెర్డ్ గుడ్ న్యూస్ ఫ్రం హర్ ఫ్రెండ్ |
3.అవకాశం ఉంది కానీ కానీ చేయలేదు (Unrealised Possibility in the Past)
గతంలో ఒక పని చేయడానికి అవకాశం ఉంది కానీ చేయలేదు అని చెప్పేటువంటి సందర్భంలో కూడా might have + verb 3 ఉపయోగిస్తారు.
| 1. I might have gone, but I stayed. | 1. నేను వెళ్ళి ఉండవచ్చు, కానీ ఉండిపోయాను. |
| ఐ మైట్ హావ్ గోన్, బట్ ఐ స్టేడ్ | |
| 2. He might have helped, but he didn’t. | 2. అతను సహాయం చేసి ఉండవచ్చు, కానీ చేయలేదు. |
| హీ మైట్ హావ్ హెల్ప్డ్, బట్ హీ డిడ్న్ట్ | |
| 3. She might have come, but she didn’t. | 3. ఆమె వచ్చి ఉండొచ్చు, కానీ రాలేదు. |
| షీ మైట్ హావ్ కమ్, బట్ షీ డిడ్న్ట్ | |
| 4. They might have called, but they didn’t. | 4. వారు ఫోన్ చేసి ఉండవచ్చు, కానీ చేయలేదు. |
| దే మైట్ హావ్ కాల్డ్, బట్ దే డిడ్న్ట్ | |
| 5. We might have won, but we lost. | 5. మనం గెలిచి ఉండొచ్చు, కానీ ఓడిపోయాము. |
| వీ మైట్ హావ్ వన్, బట్ వీ లాస్ట్ | |
| 6. He might have finished, but he stopped. | 6. అతను పూర్తి చేసి ఉండవచ్చు, కానీ ఆగిపోయాడు. |
| హీ మైట్ హావ్ ఫినిష్డ్, బట్ హీ స్టాప్డ్ | |
| 7. She might have tried, but she quit. | 7. ఆమె ప్రయత్నించి ఉండవచ్చు, కానీ విరమించుకుంది. |
| షీ మైట్ హావ్ ట్రైడ్, బట్ షీ క్విట్ | |
| 8. They might have stayed, but they left. | 8. వారు ఉండి ఉండవచ్చు, కానీ వెళ్ళిపోయారు. |
| దే మైట్ హావ్ స్టేడ్, బట్ దే లెఫ్ట్ | |
| 9. I might have spoken, but I kept quiet. | 9. నేను మాట్లాడి ఉండవచ్చు, కానీ మౌనంగా ఉండిపోయాను. |
| ఐ మైట్ హావ్ స్పోకెన్, బట్ ఐ కెప్ట్ క్వయెట్ | |
| 10. He might have joined, but he refused. | 10. అతను చేరి ఉండవచ్చు, కానీ నిరాకరించాడు. |
| హీ మైట్ హావ్ జాయిన్్డ్, బట్ హీ రిఫ్యూస్్డ్ | |
| 11. I might have gone to the party, but I decided to stay at home. | 11. నేను పార్టీకి వెళ్ళి ఉండవచ్చు, కానీ ఇంట్లోనే ఉండాలని నిర్ణయించుకున్నాను. |
| ఐ మైట్ హావ్ గోన్ టు ది పార్టీ, బట్ ఐ డిసైడెడ్ టు స్టే ఎట్ హోమ్ | |
| 12. He might have helped you, but he did not know about your problem. | 12. అతను మీకు సహాయం చేసి ఉండవచ్చు, కానీ మీ సమస్య గురించి అతనికి తెలియదు. |
| హీ మైట్ హావ్ హెల్ప్డ్ యూ, బట్ హీ డిడ్ నాట్ నో అబౌట్ యువర్ ప్రాబ్లమ్ | |
| 13. She might have come to the meeting, but she was busy. | 13. ఆమె సమావేశానికి వచ్చి ఉండవచ్చు, కానీ తీరిక లేకుండా ఉంది. |
| షీ మైట్ హావ్ కమ్ టు ది మీటింగ్, బట్ షీ వాస్ బిజీ | |
| 14. They might have called you, but they forgot your number. | 14. వారు మీకు ఫోన్ చేసి ఉండవచ్చు, కానీ మీ నంబర్‌ను మర్చిపోయి ఉండవచ్చు. |
| దే మైట్ హావ్ కాల్డ్ యూ, బట్ దే ఫర్గాట్ యువర్ నంబర్ | |
| 15. We might have won the match, but we made many mistakes. | 15. మేము మ్యాచ్ గెలిచి ఉండవచ్చు, కానీ మేము చాలా తప్పులు చేశాము. |
| వీ మైట్ హావ్ వన్ ది మ్యాచ్, బట్ వీ మేడ్ మేని మిస్టేక్స్ | |
| 16. He might have finished the work, but he stopped halfway. | 16. అతను పని పూర్తి చేసి ఉండవచ్చు, కానీ మధ్యలోనే ఆపేశాడు. |
| హీ మైట్ హావ్ ఫినిష్డ్ ది వర్క్, బట్ హీ స్టాప్డ్ హాఫ్ వే | |
| 17. She might have tried again, but she lost interest. | 17. ఆమె మళ్ళీ ప్రయత్నించి ఉండవచ్చు, కానీ ఆమెకు ఆసక్తి పోయింది. |
| షీ మైట్ హావ్ ట్రైడ్ అగైన్, బట్ షీ లాస్ట్ ఇంటరెస్ట్ | |
| 18. They might have stayed longer, but they had another plan. | 18. వారు ఇంకా ఎక్కువసేపు ఉండి ఉండవచ్చు, కానీ వారికి మరో ప్రణాళిక ఉంది. |
| దే మైట్ హావ్ స్టేడ్ లాంగర్, బట్ దే హ్యాడ్ అనదర్ ప్లాన్ | |
| 19. I might have spoken to him, but I did not get time. | 19. నేను అతనితో మాట్లాడి ఉండవచ్చు, కానీ నాకు సమయం దొరకలేదు. |
| ఐ మైట్ హావ్ స్పోకెన్ టు హిమ్, బట్ ఐ డిడ్ నాట్ గెట్ టైమ్ | |
| 20. He might have joined the company, but he refused the offer. | 20. అతను కంపెనీలో చేరి ఉండవచ్చు, కానీ ఆ ప్రతిపాదనను తిరస్కరించాడు. |
| హీ మైట్ హావ్ జాయిన్్డ్ ది కంపెనీ, బట్ హీ రిఫ్యూస్్డ్ ది ఆఫర్ |
Might have been
Might be మరియు might have been కి మధ్య ఉన్న తేడా ఏమిటి?
- Might be ని present మరియు future లో జరిగే విషయాలను అంచనా వేయడానికి (Guess) ఉపయోగిస్తారు.
- Might have been ని గతంలో జరిగిన విషయాలను అంచనా వేయడానికి ఉపయోగిస్తారు.
ఉదాహరణకు
He might be in the office yesterday = అతను నిన్న ఆఫీసులో ఉండి ఉండవచ్చు అని అనకూడదు (wrong )
He might have been in the office yesterday = అతను నిన్న ఆఫీసులో ఉండి ఉండవచ్చు అని అనాలి (Right)
Might have been ఏ ఏ సందర్భాల్లో ఉపయోగిస్తారో తెలుసుకుందాం
1.Might have been + Noun
Noun (పేరు ) ఉపయోగించి గతంలో సబ్జెక్ట్ యొక్క స్థితిని తెలియజేయడానికి
| 1. He might have been a teacher. | 1. అతను ఉపాధ్యాయుడై ఉండవచ్చు. |
| హీ మైట్ హావ్ బీన్ ఎ టీచర్ | |
| He might not have been a teacher. | అతను ఉపాధ్యాయుడు అయి ఉండకపోవచ్చు. |
| Might he have been a teacher? | అతను ఉపాధ్యాయుడు అయి ఉండవచ్చా? |
| Might he not have been a teacher? | అతను ఉపాధ్యాయుడు అయి ఉండకపోవచ్చా? |
| 2. She might have been a doctor. | 2. ఆమె ఒక వైద్యురాలు అయి ఉండవచ్చు. |
| షీ మైట్ హావ్ బీన్ ఎ డాక్టర్ | |
| 3. They might have been friends. | 3. వారు స్నేహితులై ఉండవచ్చు. |
| దే మైట్ హావ్ బీన్ ఫ్రెండ్స్ | |
| 4. It might have been a problem. | 4. అది ఒక సమస్య అయి ఉండవచ్చు. |
| ఇట్ మైట్ హావ్ బీన్ ఎ ప్రాబ్లమ్ | |
| 5. He might have been a driver. | 5. అతను డ్రైవర్ అయి ఉండవచ్చు. |
| హీ మైట్ హావ్ బీన్ ఎ డ్రైవర్ | |
| 6. He might have been a great leader in his village. | 6. అతను తన గ్రామంలో గొప్ప నాయకుడై ఉండవచ్చు. |
| హీ మైట్ హావ్ బీన్ ఎ గ్రేట్ లీడర్ ఇన్ హిస్ విలేజ్ | |
| 7. She might have been a famous singer in those days. | 7. ఆమె ఆ రోజుల్లో ప్రసిద్ధ గాయని అయి ఉండవచ్చు. |
| షీ మైట్ హావ్ బీన్ ఎ ఫేమస్ సింగర్ ఇన్ దోస్ డేస్ | |
| 8. They might have been good partners in that business. | 8. వారు ఆ వ్యాపారంలో మంచి భాగస్వాములు అయి ఉండవచ్చు. |
| దే మైట్ హావ్ బీన్ గుడ్ పార్ట్నర్స్ ఇన్ దట్ బిజినెస్ | |
| 9. It might have been a serious issue at that time. | 9. ఆ సమయంలో అది ఒక తీవ్రమైన సమస్య అయి ఉండవచ్చు. |
| ఇట్ మైట్ హావ్ బీన్ ఎ సీరియస్ ఇష్యూ ఎట్ దట్ టైమ్ | |
| 10. He might have been a member of that team earlier. | 10. అతను ఇంతకుముందు ఆ జట్టులో సభ్యుడిగా ఉండి ఉండవచ్చు. |
| హీ మైట్ హావ్ బీన్ ఎ మెంబర్ ఆఫ్ దట్ టీమ్ ఎర్లియర్ |
2.Might have been + Adjective
Adjective (గుణం) ఉపయోగించి గతంలో సబ్జెక్టు యొక్క స్థితిని తెలియజేయడానికి
| 1. He might have been tired. | 1. అతను అలసిపోయి ఉండవచ్చు. |
| హీ మైట్ హావ్ బీన్ టైర్డ్ | |
| He might not have been tired. | అతను అలసిపోయి ఉండకపోవచ్చు. |
| Might he have been tired? | అతను అలసిపోయి ఉండవచ్చా? |
| Might he not have been tired? | అతను అలసిపోయి ఉండకపోవచ్చా? |
| 2. She might have been happy. | 2. ఆమె సంతోషంగా ఉండి ఉండవచ్చు. |
| షీ మైట్ హావ్ బీన్ హ్యాపీ | |
| 3. They might have been busy. | 3. వారు బహుశా తీరిక లేకుండా ఉండి ఉండవచ్చు. |
| దే మైట్ హావ్ బీన్ బిజీ | |
| 4. It might have been difficult. | 4. అది కష్టమై ఉండవచ్చు. |
| ఇట్ మైట్ హావ్ బీన్ డిఫికల్ట్ | |
| 5. He might have been angry. | 5. అతను కోపంగా ఉండి ఉండవచ్చు. |
| హీ మైట్ హావ్ బీన్ యాంగ్రీ | |
| 6. He might have been very tired after the long journey. | 6. సుదీర్ఘ ప్రయాణం తర్వాత అతను చాలా అలసిపోయి ఉండవచ్చు. |
| హీ మైట్ హావ్ బీన్ వెరీ టైర్డ్ ఆఫ్టర్ ది లాంగ్ జర్నీ | |
| 7. She might have been happy to see her old friends there. | 7. అక్కడ తన పాత స్నేహితులను చూసి ఆమె సంతోషించి ఉండవచ్చు. |
| షీ మైట్ హావ్ బీన్ హ్యాపీ టు సీ హర్ ఓల్డ్ ఫ్రెండ్స్ దేర్ | |
| 8. They might have been busy with their work at that time. | 8. వారు ఆ సమయంలో తమ పనిలో నిమగ్నమై ఉండి ఉండవచ్చు. |
| దే మైట్ హావ్ బీన్ బిజీ విత్ దేర్ వర్క్ ఎట్ దట్ టైమ్ | |
| 9. It might have been difficult for him to understand that lesson. | 9. అతనికి ఆ పాఠాన్ని అర్థం చేసుకోవడం కష్టమై ఉండవచ్చు. |
| ఇట్ మైట్ హావ్ బీన్ డిఫికల్ట్ ఫర్ హిమ్ టు అండర్‌స్టాండ్ దట్ లెసన్ | |
| 10. He might have been angry because nobody supported him. | 10. ఎవరూ తనకు మద్దతు ఇవ్వనందున అతను కోపంగా ఉండి ఉండవచ్చు. |
| హీ మైట్ హావ్ బీన్ యాంగ్రీ బికాజ్ నోబడి సపోర్టెడ్ హిమ్ |
3.Might have been + Location
Location (ప్రదేశం) ఉపయోగించి గతంలో సబ్జెక్టు యొక్క స్థితిని తెలియజేయడానికి
| 1. He might have been at home. | 1. అతను ఇంట్లో ఉండవచ్చు. |
| హీ మైట్ హావ్ బీన్ ఎట్ హోమ్ | |
| He might not have been at home. | అతను ఇంట్లో ఉండకపోవచ్చు. |
| Might he have been at home? | అతను ఇంట్లో ఉండవచ్చా? |
| Might he not have been at home? | అతను ఇంట్లో ఉండకపోవచ్చా? |
| 2. She might have been in the office. | 2. ఆమె ఆఫీసులో ఉండి ఉండవచ్చు. |
| షీ మైట్ హావ్ బీన్ ఇన్ ది ఆఫీస్ | |
| 3. They might have been at school. | 3. వారు బహుశా పాఠశాలలో ఉండి ఉండవచ్చు. |
| దే మైట్ హావ్ బీన్ ఎట్ స్కూల్ | |
| 4. He might have been in the room. | 4. అతను గదిలో ఉండి ఉండవచ్చు. |
| హీ మైట్ హావ్ బీన్ ఇన్ ది రూమ్ | |
| 5. She might have been at the station. | 5. ఆమె స్టేషన్‌లో ఉండి ఉండవచ్చు. |
| షీ మైట్ హావ్ బీన్ ఎట్ ది స్టేషన్ | |
| 6. He might have been at home when you called him yesterday. | 6. మీరు నిన్న అతనికి ఫోన్ చేసినప్పుడు అతను ఇంట్లో ఉండి ఉండవచ్చు. |
| హీ మైట్ హావ్ బీన్ ఎట్ హోమ్ వెన్ యూ కాల్డ్ హిమ్ యెస్టర్‌డే | |
| 7. She might have been in the office during the meeting time. | 7. సమావేశం జరిగిన సమయంలో ఆమె కార్యాలయంలో ఉండి ఉండవచ్చు. |
| షీ మైట్ హావ్ బీన్ ఇన్ ది ఆఫీస్ డ్యూరింగ్ ది మీటింగ్ టైమ్ | |
| 8. They might have been at school when the event started. | 8. ఆ కార్యక్రమం మొదలైనప్పుడు వారు పాఠశాలలో ఉండి ఉండవచ్చు. |
| దే మైట్ హావ్ బీన్ ఎట్ స్కూల్ వెన్ ది ఈవెంట్ స్టార్టెడ్ | |
| 9. He might have been in the room while we were discussing this matter. | 9. మనం ఈ విషయం గురించి చర్చిస్తున్నప్పుడు అతను గదిలో ఉండి ఉండవచ్చు. |
| హీ మైట్ హావ్ బీన్ ఇన్ ది రూమ్ వైల్ వి వర్ డిస్కస్సింగ్ దిస్ మ్యాటర్ | |
| 10. She might have been at the station when the train arrived. | 10. రైలు వచ్చినప్పుడు ఆమె స్టేషన్‌లో ఉండి ఉండవచ్చు. |
| షీ మైట్ హావ్ బీన్ ఎట్ ది స్టేషన్ వెన్ ది ట్రైన్ అరైవ్డ్ |
4.Might have been + Time
సమయమును ఉపయోగించి గతంలో సబ్జెక్టు యొక్క స్థితిని తెలియజేయడానికి
| 1. He might have been late. | 1. అతను ఆలస్యంగా వచ్చి ఉండవచ్చు. |
| హీ మైట్ హావ్ బీన్ లేట్ | |
| He might not have been late. | అతను ఆలస్యంగా వచ్చి ఉండకపోవచ్చు. |
| Might he have been late? | అతను ఆలస్యంగా వచ్చి ఉండొచ్చా? |
| Might he not have been late? | అతను ఆలస్యంగా వచ్చి ఉండకపోవచ్చా? |
| 2. She might have been early. | 2. ఆమె ముందుగానే వచ్చి ఉండవచ్చు. |
| షీ మైట్ హావ్ బీన్ ఎర్లీ | |
| 3. They might have been on time. | 3. వారు సమయానికి వచ్చి ఉండవచ్చు. |
| దే మైట్ హావ్ బీన్ ఆన్ టైమ్ | |
| 4. He might have been late yesterday. | 4. అతను నిన్న ఆలస్యంగా వచ్చి ఉండవచ్చు. |
| హీ మైట్ హావ్ బీన్ లేట్ యెస్టర్‌డే | |
| 5. She might have been early today. | 5. ఆమె ఈరోజు ముందుగానే వచ్చి ఉండవచ్చు. |
| షీ మైట్ హావ్ బీన్ ఎర్లీ టుడే | |
| 6. He might have been late for the meeting yesterday. | 6. అతను నిన్న సమావేశానికి ఆలస్యంగా వచ్చి ఉండవచ్చు. |
| హీ మైట్ హావ్ బీన్ లేట్ ఫర్ ది మీటింగ్ యెస్టర్‌డే | |
| 7. She might have been early to the function last night. | 7. ఆమె నిన్న రాత్రి కార్యక్రమానికి ముందుగానే వచ్చి ఉండవచ్చు. |
| షీ మైట్ హావ్ బీన్ ఎర్లీ టు ది ఫంక్షన్ లాస్ట్ నైట్ | |
| 8. They might have been on time for the exam in the morning. | 8. వారు ఉదయం పరీక్షకు సమయానికి వచ్చి ఉండవచ్చు. |
| దే మైట్ హావ్ బీన్ ఆన్ టైమ్ ఫర్ ది ఎగ్జామ్ ఇన్ ది మార్నింగ్ | |
| 9. He might have been late because of heavy traffic in the city. | 9. నగరంలో భారీ ట్రాఫిక్ కారణంగా అతను ఆలస్యంగా వచ్చి ఉండవచ్చు. |
| హీ మైట్ హావ్ బీన్ లేట్ బికాజ్ ఆఫ్ హెవీ ట్రాఫిక్ ఇన్ ది సిటీ | |
| 10. She might have been early, as she always plans everything properly. | 10. ఆమె ఎప్పుడూ ప్రతీదీ సరిగ్గా ప్లాన్ చేసుకుంటుంది కాబట్టి, బహుశా ముందుగానే వచ్చి ఉండవచ్చు. |
| షీ మైట్ హావ్ బీన్ ఎర్లీ యాజ్ షీ ఆల్వేస్ ప్లాన్స్ ఎవ్రీథింగ్ ప్రాపర్లీ | |
5.Might have been + verb4
గతంలో ఏదైనా ఒక పని జరుగుతూ ఉండొచ్చు అని చెప్పడానికి verb4 ఉపయోగించి చెబుతాము.
| 1. He might have been sleeping. | 1. అతను నిద్రపోతూ ఉండి ఉండవచ్చు. |
| హీ మైట్ హావ్ బీన్ స్లీపింగ్ | |
| He might not have been sleeping. | అతను నిద్రపోతూ ఉండకపోవచ్చు. |
| Might he have been sleeping? | అతను నిద్రపోతూ ఉండి ఉండవచ్చా? |
| Might he not have been sleeping? | అతను నిద్రపోతూ ఉండకపోవచ్చా? |
| 2. She might have been working. | 2. ఆమె పని చేస్తూ ఉండి ఉండవచ్చు. |
| షీ మైట్ హావ్ బీన్ వర్కింగ్ | |
| 3. They might have been playing. | 3. వారు ఆడుతూ ఉండి ఉండవచ్చు. |
| దే మైట్ హావ్ బీన్ ప్లేయింగ్ | |
| 4. He might have been reading. | 4. అతను చదువుతూ ఉండి ఉండవచ్చు. |
| హీ మైట్ హావ్ బీన్ రీడింగ్ | |
| 5. She might have been cooking. | 5. ఆమె వంట చేస్తూ ఉండి ఉండవచ్చు. |
| షీ మైట్ హావ్ బీన్ కుకింగ్ | |
| 6. He might have been sleeping when you called him yesterday. | 6. నిన్న మీరు అతనికి ఫోన్ చేసినప్పుడు అతను నిద్రపోతూ ఉండి ఉండవచ్చు. |
| హీ మైట్ హావ్ బీన్ స్లీపింగ్ వెన్ యూ కాల్డ్ హిమ్ యెస్టర్‌డే | |
| 7. She might have been working in the office during that time. | 7. ఆమె ఆ సమయంలో ఆఫీసులో పనిచేస్తూ ఉండి ఉండవచ్చు. |
| షీ మైట్ హావ్ బీన్ వర్కింగ్ ఇన్ ది ఆఫీస్ డ్యూరింగ్ దట్ టైమ్ | |
| 8. They might have been playing cricket when the rain started suddenly. | 8. వర్షం ఆకస్మాత్తుగా ప్రారంభమైనప్పుడు వారు క్రికెట్ ఆడుతూ ఉండి ఉండవచ్చు |
| దే మైట్ హావ్ బీన్ ప్లేయింగ్ క్రికెట్ వెన్ ది రేన్ స్టార్టెడ్ సడన్‌లీ | |
| 9. He might have been reading a book while others were talking loudly. | 9. ఇతరులు గట్టిగా మాట్లాడుతుండగా అతను పుస్తకం చదువుతూ ఉండి ఉండవచ్చు. |
| హీ మైట్ హావ్ బీన్ రీడింగ్ ఎ బుక్ వైల్ అదర్స్ వర్ టాకింగ్ లౌడ్‌లీ | |
| 10. She might have been cooking dinner when the guests arrived at her house. | 10. అతిథులు ఆమె ఇంటికి వచ్చినప్పుడు ఆమె రాత్రి భోజనం వండుతూ ఉండి ఉండవచ్చు. |
| షీ మైట్ హావ్ బీన్ కుకింగ్ డిన్నర్ వెన్ ది గెస్ట్స్ అరైవ్డ్ ఎట్ హర్ హౌస్ | |
| 11. He might have been waiting for you at the bus stop for a long time. | 11. అతను చాలా సేపటి నుండి బస్ స్టాప్‌లో మీ కోసం ఎదురుచూస్తూ ఉండవచ్చు. |
| హీ మైట్ హావ్ బీన్ వెయిటింగ్ ఫర్ యూ ఎట్ ది బస్ స్టాప్ ఫర్ ఎ లాంగ్ టైమ్ | |
| 12. She might have been talking to her friend when you tried to call her. | 12. మీరు ఆమెకు ఫోన్ చేయడానికి ప్రయత్నించినప్పుడు ఆమె తన స్నేహితురాలితో మాట్లాడుతూ ఉండవచ్చు. |
| షీ మైట్ హావ్ బీన్ టాకింగ్ టు హర్ ఫ్రెండ్ వెన్ యూ ట్రైడ్ టు కాల్ హర్ | |
| 13. They might have been watching a movie when the power went off suddenly. | 13. కరెంటు అకస్మాత్తుగా పోయినప్పుడు వారు సినిమా చూస్తూ ఉండి ఉండవచ్చు |
| దే మైట్ హావ్ బీన్ వాచింగ్ ఎ మూవీ వెన్ ది పవర్ వెంట్ ఆఫ్ సడన్‌లీ | |
| 14. He might have been driving the car when the accident happened on the road. | 14. రోడ్డుపై ప్రమాదం జరిగినప్పుడు అతను కారు నడుపుతూ ఉండవచ్చు. |
| హీ మైట్ హావ్ బీన్ డ్రైవింగ్ ది కార్ వెన్ ది యాక్సిడెంట్ హ్యాపెన్డ్ ఆన్ ది రోడ్ | |
| 15. She might have been studying for the exam while others were wasting their time. | 15. ఇతరులు సమయం వృధా చేస్తుండగా, ఆమె పరీక్ష కోసం చదువుకుంటూ ఉండవచ్చు |
| షీ మైట్ హావ్ బీన్ స్టడీయింగ్ ఫర్ ది ఎగ్జామ్ వైల్ అదర్స్ వర్ వేస్టింగ్ దేర్ టైమ్ |
