క్రింది టాపిక్స్ పై క్లిక్ చేయండి
Must
Must be
Must have
Must have been
Must
Must . ఏ ఏ సందర్భాలలో ఉపయోగిస్తారో తెలుసుకుందాం.
కానీ May ఉపయోగించినప్పుడు మన అంచనా 50% ఉంటే, అదే Must ఉపయోగించినప్పుడు మనం అంచనా 90% అనగా దాదాపు కరెక్ట్ గా ఉంటుంది అని అర్థం
1. Necessity / Responsibility :బాధ్యత మరియు అవసరం
బాధ్యతగా అవసరాన్ని బట్టి తప్పకుండా చేయాల్సిన పనుల గురించి తెలియజేసేటప్పుడు Must ఉపయోగిస్తారు. ప్రతి సెంటెన్స్ కి కూడా చివర “ లి “ అని వస్తుంది .
All subjects + Must + verb1
క్రింది టేబుల్ లోని మొదటి ఉదాహరణ గమనించండి
I must finish my homework today. = నేను ఈరోజు నా హోంవర్క్ పూర్తి చేయాలి.
పై సెంటెన్స్ కి నెగిటివ్ సెంటెన్స్ రాయటానికి must తర్వాత not ఉపయోగిస్తే సరిపోతుంది
I must not finish my homework today. = నేను ఈరోజు నా హోంవర్క్ పూర్తి చేయకూడదు
పై రెండు సెంటెన్స్ ని ఇంటరాగేటివ్ సెంటెన్స్ గా మార్చుటకు Must ని సెంటెన్స్ ప్రారంభంలో ఉంచాలి.
Must I finish my homework today ?. = నేను ఈరోజు నా హోంవర్క్ పూర్తి చేయాలా?.
Must I not finish my homework today ?. = నేను ఈరోజు నా హోంవర్క్ పూర్తి చేయకూడదా?
| 1. I must finish my homework today. | 1. నేను ఈరోజు నా హోంవర్క్ పూర్తి చేయాలి. |
| ఐ మస్ట్ ఫినిష్ మై హోంవర్క్ టుడే | |
| 2. You must wear a helmet while riding. | 2. మీరు రైడింగ్ చేసేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి. |
| యూ మస్ట్ వెయర్ అ హెల్మెట్ వైల్ రైడింగ్ | |
| 3. He must attend the meeting. | 3. అతను సమావేశానికి హాజరు కావాలి. |
| హీ మస్ట్ అటెండ్ ద మీటింగ్ | |
| 4. She must study for the exam. | 4. ఆమె పరీక్షకు చదువుకోవాలి. |
| షీ మస్ట్ స్టడీ ఫర్ ద ఎగ్జామ్ | |
| 5. It must be done before evening. | 5. ఇది సాయంత్రం ముందు చేయాలి. |
| ఇట్ మస్ట్ బీ డన్ బిఫోర్ ఈవ్నింగ్ | |
| 6. We must follow the rules strictly. | 6. మనం నియమాలను ఖచ్చితంగా పాటించాలి. |
| వీ మస్ట్ ఫాలో ద రూల్స్ స్ట్రిక్ట్‌లీ | |
| 7. They must complete the project on time. | 7. వారు ప్రాజెక్ట్‌ను సకాలంలో పూర్తి చేయాలి. |
| దే మస్ట్ కాంప్లీట్ ద ప్రాజెక్ట్ ఆన్ టైమ్ | |
| 8. My brother must practice daily. | 8. నా సోదరుడు రోజూ సాధన చేయాలి. |
| మై బ్రదర్ మస్ట్ ప్రాక్టీస్ డైలీ | |
| 9. Your sister must take her medicine. | 9. మీ సోదరి తన మందు తీసుకోవాలి. |
| యోర్ సిస్టర్ మస్ట్ టేక్ హర్ మెడిసిన్ | |
| 10. The students must be on time. | 10. విద్యార్థులు సమయానికి హాజరు కావాలి. |
| ద స్టూడెంట్స్ మస్ట్ బీ ఆన్ టైమ్ | |
| 11. I must call my friend now. | 11. నేను ఇప్పుడు నా స్నేహితుడికి కాల్ చేయాలి. |
| ఐ మస్ట్ కాల్ మై ఫ్రెండ్ నౌ | |
| 12. You must clean your room. | 12. మీరు మీ గదిని శుభ్రం చేయాలి. |
| యూ మస్ట్ క్లీన్ యోర్ రూమ్ | |
| 13. He must respect his parents. | 13. అతను తన తల్లిదండ్రులను గౌరవించాలి. |
| హీ మస్ట్ రిస్పెక్ట్ హిజ్ పెరెంట్స్ | |
| 14. She must submit the report today. | 14. ఆమె ఈరోజే నివేదికను సమర్పించాలి. |
| షీ మస్ట్ సబ్మిట్ ద రిపోర్ట్ టుడే | |
| 15. We must save water. | 15. మనం నీటిని పొదుపు చేయాలి. |
| వీ మస్ట్ సేവ് వాటర్ | |
| 16. They must be careful while crossing the road. | 16. వారు రోడ్డు దాటేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. |
| దే మస్ట్ బీ కేర్‌ఫుల్ వైల్ క్రాసింగ్ ద రోడ్ | |
| 17. My friend must help me with this work. | 17. ఈ పనిలో నా స్నేహితుడు నాకు సహాయం చేయాలి. |
| మై ఫ్రెండ్ మస్ట్ హెల్ప్ మీ విథ్ దిస్ వర్క్ | |
| 18. Your brother must attend the class. | 18. మీ సోదరుడు తరగతికి హాజరు కావాలి. |
| యోర్ బ్రదర్ మస్ట్ అటెండ్ ద క్లాస్ | |
| 19. The teacher must explain the lesson clearly. | 19. ఉపాధ్యాయుడు పాఠాన్ని స్పష్టంగా వివరించాలి. |
| ద టీచర్ మస్ట్ ఎక్స్ప్లెయిన్ ద లెసన్ క్లియర్‌లీ | |
| 20. I must finish reading this book. | 20. నేను ఈ పుస్తకం చదవడం పూర్తి చేయాలి. |
| ఐ మస్ట్ ఫినిష్ రీడింగ్ దిస్ బుక్ | |
| 21. You must lock the door. | 21. మీరు తలుపు లాక్ చేయాలి. |
| యూ మస్ట్ లాక్ ద డోర్ | |
| 22. He must wear formal clothes for the party. | 22. అతను పార్టీకి అధికారిక దుస్తులు ధరించాలి. |
| హీ మస్ట్ వెయర్ ఫార్మల్ క్లొథ్స్ ఫర్ ద పార్టీ | |
| 23. She must practice singing every day. | 23. ఆమె ప్రతిరోజూ పాడటం సాధన చేయాలి. |
| షీ మస్ట్ ప్రాక్టీస్ సింగింగ్ ఎవ్రీ డే | |
| 24. We must be polite to everyone. | 24. మనం అందరితో మర్యాదగా ఉండాలి. |
| వీ మస్ట్ బీ పోలైట్ టు ఎవ్రీవన్ | |
| 25. They must keep the classroom clean. | 25. వారు తరగతి గదిని శుభ్రంగా ఉంచాలి. |
| దే మస్ట్ కీప్ ద క్లాస్‌రూమ్ క్లీన్ |
2. Strong Advice:బలమైన సలహా
ఎవరికైనా బలమైన సలహా ఇవ్వటానికి కూడా Must ఉపయోగిస్తారు. ఇటువంటి వాక్యాలలో కూడా చివర “లి” అని వస్తుంది.
All subjects + Must + verb1
| 1. I must try that new restaurant. | 1. నేను ఆ కొత్త రెస్టారెంట్‌ని ప్రయత్నించాలి. |
| ఐ మస్ట్ ట్రై దాట్ న్యూ రెస్టారెంట్ | |
| 2. You must see this movie. | 2. మీరు ఈ సినిమా తప్పక చూడాలి. |
| యూ మస్ట్ సీ దిస్ మూవీ | |
| 3. He must read this book; it’s amazing. | 3. అతను ఈ పుస్తకం తప్పక చదవాలి; ఇది అద్భుతంగా ఉంది. |
| హీ మస్ట్ రీడ్ దిస్ బుక్; ఇట్’స్ అమేజింగ్ | |
| 4. She must visit the museum. | 4. ఆమె మ్యూజియం సందర్శించాలి. |
| షీ మస్ట్ విసిట్ ద మ్యూజియం | |
| 5. It must be cooked well before serving. | 5. వడ్డించే ముందు బాగా ఉడికించాలి. |
| ఇట్ మస్ట్ బీ కుక్‌డ్ వెల్ బిఫోర్ సర్వింగ్ | |
| 6. We must try the new coffee shop. | 6. మనం కొత్త కాఫీ షాప్ ని ప్రయత్నించాలి. |
| వీ మస్ట్ ట్రై ద న్యూ కాఫీ షాప్ | |
| 7. They must watch the football match. | 7. వారు తప్పనిసరిగా ఫుట్‌బాల్ మ్యాచ్ చూడాలి. |
| దే మస్ట్ వాట్చ్ ద ఫుట్‌బాల్ మ్యాచ్ | |
| 8. My friend must try yoga for health. | 8. నా స్నేహితుడు ఆరోగ్యం కోసం యోగా ప్రయత్నించాలి. |
| మై ఫ్రెండ్ మస్ట్ ట్రై యోగా ఫర్ హెల్త్ | |
| 9. Your brother must join the music class. | 9. మీ సోదరుడు సంగీత తరగతిలో చేరాలి. |
| యోర్ బ్రదర్ మస్ట్ జాయిన్ ద మ్యూజిక్ క్లాస్ | |
| 10. The students must practice speaking English daily. | 10. విద్యార్థులు ప్రతిరోజూ ఇంగ్లీష్ మాట్లాడటం సాధన చేయాలి. |
| ద స్టూడెంట్స్ మస్ట్ ప్రాక్టీస్ స్పీకింగ్ ఇంగ్లిష్ డైలీ | |
| 11. I must attend the seminar. | 11. నేను సెమినార్ కు హాజరు కావాలి. |
| ఐ మస్ట్ అటెండ్ ద సిమినార్ | |
| 12. You must taste this cake. | 12. మీరు ఈ కేక్ రుచి చూడాలి. |
| యూ మస్ట్ టేస్ట్ దిస్ కేక్ | |
| 13. He must learn basic computer skills. | 13. అతను ప్రాథమిక కంప్యూటర్ నైపుణ్యాలను నేర్చుకోవాలి. |
| హీ మస్ట్ లర్న్ బేసిక్ కంప్యూటర్ స్కిల్స్ | |
| 14. She must wear comfortable shoes. | 14. ఆమె సౌకర్యవంతమైన బూట్లు ధరించాలి. |
| షీ మస్ట్ వెయర్ కంఫర్టబుల్ షూస్ | |
| 15. We must save electricity. | 15. మనం విద్యుత్తును ఆదా చేయాలి. |
| వీ మస్ట్ సేവ് ఇలక్ట్రిసిటీ | |
| 16. They must follow healthy habits. | 16. వారు ఆరోగ్యకరమైన అలవాట్లను పాటించాలి. |
| దే మస్ట్ ఫాలో హెల్ధీ హాబిట్స్ | |
| 17. My sister must take rest. | 17. నా సోదరి విశ్రాంతి తీసుకోవాలి. |
| మై సిస్టర్ మస్ట్ టేక్ రెస్ట్ | |
| 18. Your parents must read this news. | 18. మీ తల్లిదండ్రులు ఈ వార్త తప్పక చదవాలి. |
| యోర్ పెరెంట్స్ మస్ట్ రీడ్ దిస్ న్యూస్ | |
| 19. The teacher must explain slowly for beginners. | 19. ప్రారంభకులకు ఉపాధ్యాయుడు నెమ్మదిగా వివరించాలి. |
| ద టీచర్ మస్ట్ ఎక్స్ప్లెయిన్ స్లోలీ ఫర్ బిగినర్స్ | |
| 20. I must check my emails today. | 20. నేను ఈరోజు నా ఇమెయిల్‌లను తనిఖీ చేయాలి. |
| ఐ మస్ట్ చెక్ మై ఇమెయిల్స్ టుడే | |
| 21. You must try to solve this problem. | 21. మీరు ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నించాలి. |
| యూ మస్ట్ ట్రై టు సాల్వ్ దిస్ ప్రాబ్లమ్ | |
| 22. He must improve his handwriting. | 22. అతను తన చేతివ్రాతను మెరుగుపరచుకోవాలి. |
| హీ మస్ట్ ఇంఫ్రూవ్ హిజ్ హ్యాండ్‌రైటింగ్ | |
| 23. She must attend the dance class regularly. | 23. ఆమె క్రమం తప్పకుండా డ్యాన్స్ క్లాస్ కు హాజరు కావాలి. |
| షీ మస్ట్ అటెండ్ ద డాన్స్ క్లాస్ రెగ్యులర్‌లీ | |
| 24. We must follow the traffic rules. | 24. మనం ట్రాఫిక్ నియమాలను పాటించాలి. |
| వీ మస్ట్ ఫాలో ద ట్రాఫిక్ రూల్స్ | |
| 25. They must take care of the environment. | 25. వారు పర్యావరణాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. |
| దే మస్ట్ టేక్ కేర్ ఆఫ్ ద ఎన్విరాన్‌మెంట్ |
Must be
Must be = ఉండాలి
సాధారణంగా May be, would be వీటన్నిటిని ప్రస్తుతము లేదా భవిష్యత్తు అంచనాలకు ఉపయోగిస్తారు..
కానీ Must be నీ ప్రధానంగా ప్రజెంట్ లో ఉపయోగిస్తారు అనగా “ఇప్పుడే కచ్చితంగా ఈ విధంగా ఉండాలి” అని ఒక బలమైన అంచనా కోసం దీన్ని ఉపయోగిస్తారు.
కానీ may be ఉపయోగించినప్పుడు మన అంచనా 50% ఉంటే, అదే Must be ఉపయోగించినప్పుడు మనం అంచనా 90% అనగా దాదాపు కరెక్ట్ గా ఉంటుంది అని అర్థం.
1) Must be + Adjective
ప్రస్తుతం ఒక వ్యక్తి యొక్క స్వభావం ఈ విధంగా ఉంటుందని కచ్చితంగా అంచనా వేయడం. ప్రతి సెంటెన్స్ కి కూడా చివర “లి” అని వస్తుంది.
May be, would be, వీటిని సబ్జెక్ట్ యొక్క స్థితిని అంచనా వేటకు గతంలో మనం ఉపయోగించాం. కానీ Must be ఇంకా ఎక్కువ కచ్చితంగా అంచనా వేయడానికి ఉపయోగిస్తారు
అంటే దాదాపు 90% అనగా దాదాపు కచ్చితంగా అంచనా వేస్తున్నాము అని అర్థం.
| 1. He must be tired. | 1. అతను అలసిపోయి ఉండాలి. |
| హీ మస్ట్ బీ టైర్డ్. | |
| He must not be tired. | అతను అలసిపోయి ఉండడు. |
| Must he be tired? | అతను అలసిపోయి ఉండాలా? |
| Must he not be tired? | అతను అలసిపోయి ఉండడా? |
| 2. She must be happy. | 2. ఆమె సంతోషంగా ఉండాలి. |
| షీ మస్ట్ బీ హ్యాపీ. | |
| 3. They must be busy. | 3. వారు తప్పకుండా పనిలో నిమగ్నమై ఉండాలి. |
| దే మస్ట్ బీ బిజీ. | |
| 4. He must be angry. | 4. అతను కోపంగా ఉండాలి. |
| హీ మస్ట్ బీ ఆంగ్రీ. | |
| 5. She must be ready. | 5. ఆమె సిద్ధంగా ఉండాలి. |
| షీ మస్ట్ బీ రెడీ. | |
| 6. He must be strong. | 6. అతను బలంగా ఉండాలి. |
| హీ మస్ట్ బీ స్ట్రాంగ్. | |
| 7. She must be smart. | 7. ఆమె తెలివైనదై ఉండాలి. |
| షీ మస్ట్ బీ స్మార్ట్. | |
| 8. They must be late. | 8. వారు ఆలస్యంగా వచ్చి ఉండాలి. |
| దే మస్ట్ బీ లేట్. | |
| 9. He must be sick. | 9. అతను అనారోగ్యంతో ఉండాలి. |
| హీ మస్ట్ బీ సిక్. | |
| 10. She must be right. | 10. ఆమె చెప్పింది నిజమే అయి ఉండాలి. |
| షీ మస్ట్ బీ రైట్. | |
| 11. He must be very tired after the long journey. | 11. సుదీర్ఘ ప్రయాణం తర్వాత అతను చాలా అలసిపోయి ఉండాలి. |
| హీ మస్ట్ బీ వెరీ టైర్డ్ ఆఫ్టర్ ది లాంగ్ జర్నీ. | |
| 12. She must be very happy about her success. | 12. ఆమె తన విజయం పట్ల చాలా సంతోషంగా ఉండాలి. |
| షీ మస్ట్ బీ వెరీ హ్యాపీ అబౌట్ హెర్ సక్సెస్. | |
| 13. They must be busy with their office work now. | 13. వారు ఇప్పుడు తమ ఆఫీసు పనితో తీరిక లేకుండా ఉండాలి. |
| దే మస్ట్ బీ బిజీ విత్ దేర్ ఆఫీస్ వర్క్ నౌ. | |
| 14. He must be angry because you spoke rudely. | 14. మీరు అమర్యాదగా మాట్లాడారు కాబట్టి అతను కోపంగా ఉండాలి. |
| హీ మస్ట్ బీ ఆంగ్రీ బికాజ్ యూ స్పోక్ రూడ్లీ. | |
| 15. She must be ready for the exam now. | 15. ఆమె ఇప్పుడు పరీక్షకు సిద్ధంగా ఉండాలి. |
| షీ మస్ట్ బీ రెడీ ఫర్ ది ఎగ్జామ్ నౌ. | |
| 16. He must be strong enough to handle this problem. | 16. ఈ సమస్యను ఎదుర్కోవడానికి అతను తగినంత బలంగా ఉండాలి. |
| హీ మస్ట్ బీ స్ట్రాంగ్ ఎనఫ్ టు హ్యాండిల్ దిస్ ప్రాబ్లమ్. | |
| 17. She must be smart to solve this quickly. | 17. దీన్ని త్వరగా పరిష్కరించడానికి ఆమె తెలివైనదై ఉండాలి. |
| షీ మస్ట్ బీ స్మార్ట్ టు సాల్వ్ దిస్ క్విక్లీ. | |
| 18. They must be late because of traffic. | 18. వారు ట్రాఫిక్ కారణంగా ఆలస్యంగా వచ్చి ఉండాలి. |
| దే మస్ట్ బీ లేట్ బికాజ్ ఆఫ్ ట్రాఫిక్. | |
| 19. He must be sick as he looks weak. | 19. అతను బలహీనంగా కనిపిస్తున్నాడు కాబట్టి అతనికి జబ్బు చేసి ఉండాలి. |
| హీ మస్ట్ బీ సిక్ అస్ హీ లుక్స్ వీక్. | |
| 20. She must be right in this situation. | 20. ఈ విషయంలో ఆమె చెప్పిందే సరైనదై ఉండాలి. |
| షీ మస్ట్ బీ రైట్ ఇన్ దిస్ సిట్యుయేషన్. |
2) Must be + Noun
Noun ఉపయోగించి ప్రస్తుతం సబ్జెక్టు యొక్క స్థితిని తెలియజేయడం. భవిష్యత్తు యొక్క స్థితి కాదు. Must be ప్రధానంగా ప్రస్తుత స్థితిని తెలియజేస్తుంది
| 1. He must be a teacher. | 1. అతను ఉపాధ్యాయుడై ఉండాలి. |
| హీ మస్ట్ బీ ఎ టీచర్. | |
| He must not be a teacher. | అతను ఉపాధ్యాయుడు అయి ఉండడు. |
| Must he be a teacher? | అతను ఉపాధ్యాయుడై ఉంటాడా? |
| Must he not be a teacher? | అతని ఉపాధ్యాయుడై ఉండడా? |
| 2. She must be a doctor. | 2. ఆమె తప్పకుండా వైద్యురాలు అయి ఉండాలి. |
| షీ మస్ట్ బీ ఎ డాక్టర్. | |
| 3. This must be a mistake. | 3. ఇది తప్పకుండా పొరపాటు అయి ఉండాలి. |
| దిస్ మస్ట్ బీ ఎ మిస్టేక్. | |
| 4. He must be your brother. | 4. అతను మీ సోదరుడై ఉండాలి. |
| హీ మస్ట్ బీ యువర్ బ్రదర్. | |
| 5. She must be a student. | 5. ఆమె తప్పకుండా విద్యార్థిని అయి ఉండాలి. |
| షీ మస్ట్ బీ ఎ స్టూడెంట్. | |
| 6. This must be the answer. | 6. సమాధానం ఇదే అయి ఉండాలి. |
| దిస్ మస్ట్ బీ ది ఆన్సర్. | |
| 7. He must be a leader. | 7. అతను నాయకుడు అయి ఉండాలి. |
| హీ మస్ట్ బీ ఎ లీడర్. | |
| 8. She must be my friend. | 8. ఆమె నా స్నేహితురాలు అయి ఉండాలి. |
| షీ మస్ట్ బీ మై ఫ్రెండ్. | |
| 9. This must be the reason. | 9. ఇదే కారణమై ఉండాలి. |
| దిస్ మస్ట్ బీ ది రీజన్. | |
| 10. He must be a player. | 10. అతను తప్పకుండా ఆటగాడై ఉండాలి. |
| హీ మస్ట్ బీ ఎ ప్లేయర్. | |
| 11. He must be a teacher because he explains well. | 11. అతను బాగా వివరిస్తాడు కాబట్టి అతను ఉపాధ్యాయుడై ఉండాలి. |
| హీ మస్ట్ బీ ఎ టీచర్ బికాజ్ హీ ఎక్స్‌ప్లైన్స్ వెల్. | |
| 12. She must be a doctor as she works in a hospital. | 12. ఆమె ఆసుపత్రిలో పనిచేస్తుంది కాబట్టి, ఆమె తప్పకుండా వైద్యురాలై ఉండాలి. |
| షీ మస్ట్ బీ ఎ డాక్టర్ అస్ షీ వర్క్స్ ఇన్ ఎ హాస్పిటల్. | |
| 13. This must be a mistake in the report. | 13. ఇది నివేదికలో తప్పిదం అయి ఉండాలి. |
| దిస్ మస్ట్ బీ ఎ మిస్టేక్ ఇన్ ది రిపోర్ట్. | |
| 14. He must be your brother as you look similar. | 14. మీరు ఒకేలా కనిపిస్తున్నారు కాబట్టి అతను మీ సోదరుడై ఉండాలి. |
| హీ మస్ట్ బీ యువర్ బ్రదర్ అస్ యూ లుక్ సిమిలర్. | |
| 15. She must be a student in that college. | 15. ఆమె ఆ కళాశాలలో విద్యార్థిని అయి ఉండాలి. |
| షీ మస్ట్ బీ ఎ స్టూడెంట్ ఇన్ దాట్ కాలేజ్. | |
| 16. This must be the correct answer for the question. | 16. ఈ ప్రశ్నకు ఇదే సరైన సమాధానం అయి ఉండాలి. |
| దిస్ మస్ట్ బీ ది కరెక్ట్ ఆన్సర్ ఫర్ ది క్వశ్చన్. | |
| 17. He must be a leader in this team. | 17. అతను ఈ జట్టులో నాయకుడిగా ఉండాలి. |
| హీ మస్ట్ బీ ఎ లీడర్ ఇన్ దిస్ టీమ్. | |
| 18. She must be my old friend from school. | 18. ఆమె నా పాఠశాల నాటి పాత స్నేహితురాలు అయి ఉండాలి. |
| షీ మస్ట్ బీ మై ఓల్డ్ ఫ్రెండ్ ఫ్రం స్కూల్. | |
| 19. This must be the main reason for the issue. | 19. ఈ సమస్యకు ఇదే ప్రధాన కారణం అయి ఉండాలి. |
| దిస్ మస్ట్ బీ ది మెయిన్ రీజన్ ఫర్ ది ఇష్యూ. | |
| 20. He must be a player in the local team. | 20. అతను స్థానిక జట్టులో ఆటగాడై ఉండాలి. |
| హీ మస్ట్ బీ ఎ ప్లేయర్ ఇన్ ది లోకల్ టీమ్. |
3) Must be + Place
సబ్జెక్టు ఏదైనా ఒక స్థలంలో తప్పకుండా ఉండాలి అని అంచనా వేసి చెప్పడానికి
| 1. He must be in the room. | 1. అతను గదిలో ఉండాలి. |
| హీ మస్ట్ బీ ఇన్ ది రూమ్. | |
| He must not be in the room. | అతను గదిలో ఉండడు. |
| Must he be in the room? | అతను గదిలో ఉండాలా? |
| Must he not be in the room? | అతను గదిలో ఉండడా? |
| 2. She must be at home. | 2. ఆమె ఇంట్లో ఉండాలి. |
| షీ మస్ట్ బీ అట్ హోమ్. | |
| 3. They must be there. | 3. వారు అక్కడ తప్పక ఉండాలి. |
| దే మస్ట్ బీ దేర్. | |
| 4. He must be in school. | 4. అతను తప్పకుండా పాఠశాలలో ఉండాలి. |
| హీ మస్ట్ బీ ఇన్ స్కూల్. | |
| 5. She must be at office. | 5. ఆమె ఆఫీసులో ఉండాలి |
| షీ మస్ట్ బీ అట్ ఆఫీస్. | |
| 6. They must be outside. | 6. వారు తప్పనిసరిగా బయట ఉండాలి. |
| దే మస్ట్ బీ అవుట్‌సైడ్. | |
| 7. He must be inside. | 7. అతను లోపల ఉండాలి. |
| హీ మస్ట్ బీ ఇన్‌సైడ్. | |
| 8. She must be near. | 8. ఆమె దగ్గరలోనే ఉండాలి. |
| షీ మస్ట్ బీ నియర్. | |
| 9. They must be here. | 9. వారు ఇక్కడ ఉండాలి. |
| దే మస్ట్ బీ హియర్. | |
| 10. He must be upstairs. | 10. అతను పై అంతస్తులో ఉండాలి. |
| హీ మస్ట్ బీ అప్‌స్టేయర్స్. | |
| 11. He must be in the room because the light is on. | 11. లైటు వెలుగుతోంది కాబట్టి అతను గదిలోనే ఉండాలి. |
| హీ మస్ట్ బీ ఇన్ ది రూమ్ బికాజ్ ది లైట్ ఈజ్ ఆన్. | |
| 12. She must be at home as she is not answering calls. | 12. ఆమె ఫోన్ కాల్స్ కి సమాధానం ఇవ్వడం లేదు కాబట్టి ఇంట్లోనే ఉండి ఉండాలి. |
| షీ మస్ట్ బీ అట్ హోమ్ అస్ షీ ఈజ్ నాట్ ఆన్సరింగ్ కాల్స్. | |
| 13. They must be there waiting for us. | 13. వారు అక్కడ మన కోసం ఎదురుచూస్తూ ఉండాలి. |
| దే మస్ట్ బీ దేర్ వెయిటింగ్ ఫర్ అస్. | |
| 14. He must be in school now. | 14. అతను ఇప్పుడు పాఠశాలలో ఉండాలి. |
| హీ మస్ట్ బీ ఇన్ స్కూల్ నౌ. | |
| 15. She must be at office attending a meeting. | 15. ఆమె ఒక సమావేశానికి హాజరవడానికి కార్యాలయంలో ఉండాలి. |
| షీ మస్ట్ బీ అట్ ఆఫీస్ అటెండింగ్ ఎ మీటింగ్. | |
| 16. They must be outside playing. | 16. వారు బయట ఆడుకుంటూ ఉండాలి. |
| దే మస్ట్ బీ అవుట్‌సైడ్ ప్లేయింగ్. | |
| 17. He must be inside the house now. | 17. అతను ఇప్పుడు ఇంటి లోపల ఉండి ఉండాలి. |
| హీ మస్ట్ బీ ఇన్‌సైడ్ ది హౌస్ నౌ. | |
| 18. She must be near the station. | 18. ఆమె స్టేషన్ దగ్గర ఉండాలి. |
| షీ మస్ట్ బీ నియర్ ది స్టేషన్. | |
| 19. They must be here by now. | 19. వారు ఇప్పటికి ఇక్కడ ఉండాలి. |
| దే మస్ట్ బీ హియర్ బై నౌ. | |
| 20. He must be upstairs in his room. | 20. అతను పై అంతస్తులో తన గదిలో ఉండాలి. |
| హీ మస్ట్ బీ అప్‌స్టేయర్స్ ఇన్ హిస్ రూమ్. |
4 ) Must be + verb4
సబ్జెక్టు ఏదైనా ఒక పని ప్రస్తుతం చేస్తూ ఉండాలి అని కచ్చితంగా అంచనా వేయడానికి
| 1. He must be sleeping. | 1. అతను నిద్రపోతూ ఉండాలి. |
| హీ మస్ట్ బీ స్లీపింగ్. | |
| He must not be sleeping. | అతను నిద్రపోతూ ఉండడు. |
| Must he be sleeping? | అతను నిద్రపోతూ ఉంటాడా? |
| Must he not be sleeping? | అతను నిద్రపోతూ ఉండడా? |
| 2. She must be studying. | 2. ఆమె చదువుతూ ఉండాలి. |
| షీ మస్ట్ బీ స్టడీయింగ్. | |
| 3. They must be playing. | 3. వారు ఆడుతూ ఉండాలి. |
| దే మస్ట్ బీ ప్లేయింగ్. | |
| 4. He must be working. | 4. అతను పని చేస్తూ ఉండాలి. |
| హీ మస్ట్ బీ వర్కింగ్. | |
| 5. She must be cooking. | 5. ఆమె వంట చేస్తూ ఉండాలి. |
| షీ మస్ట్ బీ కుకింగ్. | |
| 6. They must be running. | 6. వారు పరిగెడుతూ ఉండాలి. |
| దే మస్ట్ బీ రన్నింగ్. | |
| 7. He must be reading. | 7. అతను చదువుతూ ఉండాలి. |
| హీ మస్ట్ బీ రీడింగ్. | |
| 8. She must be writing. | 8. ఆమె రాస్తూ ఉండాలి. |
| షీ మస్ట్ బీ రైటింగ్. | |
| 9. They must be talking. | 9. వారు మాట్లాడుకుంటూ ఉండాలి. |
| దే మస్ట్ బీ టాకింగ్. | |
| 10. He must be driving. | 10. అతను డ్రైవింగ్ చేస్తూ ఉండాలి. |
| హీ మస్ట్ బీ డ్రైవింగ్. | |
| 11. He must be sleeping after a long day. | 11. రోజంతా కష్టపడిన తర్వాత అతను నిద్రపోతూ ఉండాలి. |
| హీ మస్ట్ బీ స్లీపింగ్ ఆఫ్టర్ ఎ లాంగ్ డే. | |
| 12. She must be studying for her exams. | 12. ఆమె తన పరీక్షల కోసం చదువుతూ ఉండాలి. |
| షీ మస్ట్ బీ స్టడీయింగ్ ఫర్ హెర్ ఎగ్జామ్స్. | |
| 13. They must be playing in the ground. | 13. వారు మైదానంలో ఆడుతూ ఉండాలి. |
| దే మస్ట్ బీ ప్లేయింగ్ ఇన్ ది గ్రౌండ్. | |
| 14. He must be working on his project. | 14. అతను తన ప్రాజెక్ట్‌పై పనిచేస్తూ ఉండాలి. |
| హీ మస్ట్ బీ వర్కింగ్ ఆన్ హిస్ ప్రాజెక్ట్. | |
| 15. She must be cooking in the kitchen now. | 15. ఆమె ఇప్పుడు వంటగదిలో వంట చేస్తూ ఉండాలి. |
| షీ మస్ట్ బీ కుకింగ్ ఇన్ ది కిచెన్ నౌ. | |
| 16. They must be running in the park. | 16. వారు పార్కులో పరిగెడుతూ ఉండాలి. |
| దే మస్ట్ బీ రన్నింగ్ ఇన్ ది పార్క్. | |
| 17. He must be reading an interesting book. | 17. అతను ఏదో ఆసక్తికరమైన పుస్తకం చదువుతూ ఉండాలి. |
| హీ మస్ట్ బీ రీడింగ్ ఎన ఇంటరెస్టింగ్ బుక్. | |
| 18. She must be writing her homework. | 18. ఆమె తన హోంవర్క్ రాస్తూ ఉండాలి. |
| షీ మస్ట్ బీ రైటింగ్ హెర్ హోంవర్క్. | |
| 19. They must be talking about the issue. | 19. వారు ఆ విషయం గురించే మాట్లాడుతుండాలి. |
| దే మస్ట్ బీ టాకింగ్ అబౌట్ ది ఇష్యూ. | |
| 20. He must be driving to the office now. | 20. అతను ఇప్పుడు ఆఫీసుకు కారు నడుపుకుంటూ వెళ్తూ ఉండాలి. |
| హీ మస్ట్ బీ డ్రైవింగ్ టు ది ఆఫీస్ నౌ. |
Must have
1. Must మరియు Must have మధ్య తేడా ఏమిటి?
“Must” ప్రస్తుత కాలం (present) లేదా భవిష్యత్తు (future) గురించి మాట్లాడుతుంది.
“Must have” గత కాలం (past) గురించి strong guess చెప్పడానికి వాడతాం.
2. Must have తరువాత కేవలం verb3 మాత్రమే వస్తుంది
సబ్జెక్ట్ అనేవాడు గతంలో ఏదో ఒక పని తప్పకుండా చేసి ఉంటాడు లేదా ఏదో ఒకటి తప్పకుండా జరిగి ఉంటుంది అనే సందర్భంలో Must have + verb3 ఉపయోగిస్తారు
Subect + Must have + verb3
| 1. He must have finished the work. | 1. అతను పని పూర్తి చేసి ఉండాలి. |
| హీ మస్ట్ హావ్ ఫినిష్డ్ ది వర్క్ | |
| He must not have finished the work. | అతను ఆ పనిని పూర్తి చేసి ఉండడు. |
| Must he have finished the work? | అతను ఆ పనిని పూర్తి చేసి ఉంటాడా |
| Must he not have finished the work? | అతను ఆ పనిని పూర్తి చేసి ఉండడా? |
| 2. She must have left. | 2. ఆమె వెళ్లిపోయి ఉండాలి. |
| షీ మస్ట్ హావ్ లెఫ్ట్ | |
| 3. They must have arrived. | 3. వారు వచ్చి ఉండాలి. |
| దే మస్ట్ హావ్ అరైవ్డ్ | |
| 4. He must have eaten. | 4. అతను తిని ఉండాలి. |
| హీ మస్ట్ హావ్ ఈటెన్ | |
| 5. She must have called. | 5. ఆమె తప్పకుండా ఫోన్ చేసి ఉండాలి. |
| షీ మస్ట్ హావ్ కాల్డ్ | |
| 6. They must have seen it. | 6. వారు దానిని చూసి ఉండాలి. |
| దే మస్ట్ హావ్ సీన్ ఇట్ | |
| 7. He must have gone. | 7. అతను వెళ్లిపోయి ఉండాలి. |
| హీ మస్ట్ హావ్ గాన్ | |
| 8. She must have understood. | 8. ఆమె అర్థం చేసుకుని ఉండాలి. |
| షీ మస్ట్ హావ్ అండర్‌స్టుడ్ | |
| 9. They must have tried. | 9. వారు ప్రయత్నించి ఉండాలి. |
| దే మస్ట్ హావ్ ట్రైడ్ | |
| 10. He must have slept. | 10. అతను నిద్రపోయి ఉండాలి. |
| హీ మస్ట్ హావ్ స్లెప్ట్ | |
| 11. She must have won. | 11. ఆమె గెలిచి ఉండాలి. |
| షీ మస్ట్ హావ్ వన్ | |
| 12. They must have lost. | 12. వారు ఓడిపోయి ఉండాలి. |
| దే మస్ట్ హావ్ లాస్ట్ | |
| 13. He must have forgotten. | 13. అతను మర్చిపోయి ఉండాలి. |
| హీ మస్ట్ హావ్ ఫర్గాటెన్ | |
| 14. She must have waited. | 14. ఆమె వేచి ఉండి ఉండాలి. |
| షీ మస్ట్ హావ్ వెయిటెడ్ | |
| 15. They must have missed. | 15. వారు తప్పిపోయి ఉండాలి. |
| దే మస్ట్ హావ్ మిస్డ్ | |
| 16. He must have completed the project yesterday. | 16. అతను నిన్న ప్రాజెక్టును పూర్తి చేసి ఉండాలి. |
| హీ మస్ట్ హావ్ కంప్లీటెడ్ ది ప్రాజెక్ట్ యెస్టర్‌డే | |
| 17. She must have spoken to the teacher about the problem. | 17. ఆమె ఆ సమస్య గురించి ఉపాధ్యాయురాలితో మాట్లాడి ఉండాలి. |
| షీ మస్ట్ హావ్ స్పోకెన్ టు ది టీచర్ అబౌట్ ది ప్రాబ్లమ్ | |
| 18. They must have reached the station before time. | 18. వారు సమయానికి ముందే స్టేషన్‌కు చేరుకొని ఉండాలి. |
| దే మస్ట్ హావ్ రీచ్డ్ ది స్టేషన్ బిఫోర్ టైమ్ | |
| 19. He must have written the exam very well. | 19. అతను పరీక్షను చాలా బాగా రాసి ఉండాలి. |
| హీ మస్ట్ హావ్ రిట్టెన్ ది ఎగ్జామ్ వెరీ వెల్ | |
| 20. She must have prepared the food for everyone. | 20. ఆమె అందరి కోసం ఆహారం తయారు చేసి ఉండాలి. |
| షీ మస్ట్ హావ్ ప్రిపేర్డ్ ది ఫుడ్ ఫర్ ఎవ్రీవన్ | |
| 21. They must have watched the movie last night. | 21. వారు నిన్న రాత్రి సినిమా చూసి ఉండాలి. |
| దే మస్ట్ హావ్ వాచ్్డ్ ది మూవీ లాస్ట్ నైట్ | |
| 22. He must have bought a new phone recently. | 22. అతను ఇటీవల కొత్త ఫోన్ కొని ఉండాలి. |
| హీ మస్ట్ హావ్ బాట్ ఎ న్యూ ఫోన్ రీసెంట్‌లీ | |
| 23. She must have cleaned the room before we came. | 23. మనం రాకముందే ఆమె గదిని శుభ్రం చేసి ఉండాలి. |
| షీ మస్ట్ హావ్ క్లీన్‌డ్ ది రూమ్ బిఫోర్ వి కేమ్ | |
| 24. They must have discussed this issue already. | 24. వారు ఈ విషయం గురించి ఇదివరకే చర్చించి ఉండాలి. |
| దే మస్ట్ హావ్ డిస్కస్ట్డ్ దిస్ ఇష్యూ ఆల్రెడీ | |
| 25. He must have helped his friend in need. | 25. అతను అవసరంలో ఉన్న తన స్నేహితునికి సహాయం చేసి ఉండాలి. |
| హీ మస్ట్ హావ్ హెల్ప్డ్ హిస్ ఫ్రెండ్ ఇన్ నీడ్ | |
| 26. She must have finished her homework on time. | 26. ఆమె తన హోంవర్క్‌ను సమయానికి పూర్తి చేసి ఉండాలి. |
| షీ మస్ట్ హావ్ ఫినిష్డ్ హర్ హోమ్‌వర్క్ ఆన్ టైమ్ | |
| 27. They must have planned the trip carefully. | 27. వారు ప్రయాణాన్ని జాగ్రత్తగా ప్రణాళిక చేసి ఉండాలి. |
| దే మస్ట్ హావ్ ప్లాన్డ్ ది ట్రిప్ కేర్‌ఫుల్‌గా | |
| 28. He must have learned a lot from that experience. | 28. అతను ఆ అనుభవం నుంచి చాలా నేర్చుకుని ఉండాలి. |
| హీ మస్ట్ హావ్ లెర్న్డ్ ఎ లాట్ ఫ్రమ్ దట్ ఎక్స్‌పీరియన్స్ | |
| 29. She must have saved enough money for her studies. | 29. ఆమె తన చదువుల కోసం తగినంత డబ్బు పొదుపు చేసి ఉండాలి. |
| షీ మస్ట్ హావ్ సేవ్డ్ ఇనఫ్ మనీ ఫర్ హర్ స్టడీస్ | |
| 30. They must have understood the lesson clearly by now. | 30. ఇప్పటికి వారికి పాఠం స్పష్టంగా అర్థమై ఉండాలి. |
| దే మస్ట్ హావ్ అండర్‌స్టుడ్ ది లెసన్ క్లియర్‌లీ |
Must have been
1.Must be కి మరియు Must have been కి తేడా ఏమిటి?
Must be ప్రస్తుతం మరియు భవిష్యత్తులో సబ్జెక్ట్ యొక్క స్థితిని గురించి తెలియజేస్తుంది
Must have been గతంలో సబ్జెక్ట్ యొక్క స్థితిని గురించి తెలియజేస్తుంది
ఇప్పుడు Must have been ఏ ఏ సందర్భాల్లో ఉపయోగిస్తారో తెలుసుకుందాం
1.Must have been + Adjecive
గతంలో సబ్జెక్టు యొక్క స్వభావము గురించి తెలియజేయడానికి
| 1. He must have been tired. | 1. అతను అలసిపోయి ఉండాలి. |
| హీ మస్ట్ హావ్ బీన్ టైర్డ్ | |
| He must not have been tired. | అతను అలసిపోయి ఉండకపోవచ్చు. |
| Must he have been tired? | అతను అలసిపోయి ఉంటాడా? |
| Must he not have been tired? | అతను అలసిపోయి ఉండడా? |
| 2. She must have been happy. | 2. ఆమె సంతోషంగా ఉండి ఉంటుంది. |
| షీ మస్ట్ హావ్ బీన్ హ్యాపీ | |
| 3. He must have been angry. | 3. అతడు కోపంగా ఉండి ఉంటాడు. |
| హీ మస్ట్ హావ్ బీన్ ఆంగ్రీ | |
| 4. She must have been sad. | 4. ఆమె బాధపడి ఉండాలి. |
| షీ మస్ట్ హావ్ బీన్ స్యాడ్ | |
| 5. They must have been busy. | 5. వారు చాలా బిజీగా ఉండి ఉంటారు. |
| దే మస్ట్ హావ్ బీన్ బిజీ | |
| 6. He must have been hungry. | 6. అతనికి ఆకలి వేసి ఉండాలి. |
| హీ మస్ట్ హావ్ బీన్ హంగ్రీ | |
| 7. She must have been ready. | 7. ఆమె సిద్ధంగా ఉండి ఉండాలి. |
| షీ మస్ట్ హావ్ బీన్ రెడీ | |
| 8. They must have been late. | 8. వారు ఆలస్యంగా వచ్చి ఉండాలి. |
| దే మస్ట్ హావ్ బీన్ లేట్ | |
| 9. He must have been sick. | 9. అతను అనారోగ్యంతో ఉండి ఉండాలి. |
| హీ మస్ట్ హావ్ బీన్ సిక్ | |
| 10. She must have been afraid. | 10. ఆమె భయపడి ఉండాలి. |
| షీ మస్ట్ హావ్ బీన్ అఫ్రెయిడ్ | |
| 11. He must have been very tired after working all day. | 11. రోజంతా పని చేసిన తర్వాత అతను చాలా అలసిపోయి ఉండాలి. |
| హీ మస్ట్ హావ్ బీన్ వెరీ టైర్డ్ ఆఫ్టర్ వర్కింగ్ ఆల్ డే | |
| 12. She must have been extremely happy to hear the good news. | 12. ఆ శుభవార్త విని ఆమె ఎంతో సంతోషించి ఉండాలి. |
| షీ మస్ట్ హావ్ బీన్ ఎక్స్‌ట్రీమ్‌గా హ్యాపీ టు హియర్ ది గుడ్ న్యూస్ | |
| 13. He must have been very angry when he heard that story. | 13. ఆ కథ విన్నప్పుడు అతనికి చాలా కోపం వచ్చి ఉండాలి. |
| హీ మస్ట్ హావ్ బీన్ వెరీ ఆంగ్రీ వెన్ హీ హర్డ్ దాట్ స్టోరీ | |
| 14. She must have been very sad after losing the match. | 14. మ్యాచ్ ఓడిపోయిన తర్వాత ఆమె చాలా బాధపడి ఉండాలి. |
| షీ మస్ట్ హావ్ బీన్ వెరీ స్యాడ్ ఆఫ్టర్ లూజింగ్ ది మ్యాచ్ | |
| 15. They must have been very busy during the festival time. | 15. పండుగ సమయంలో వారు చాలా బిజీగా ఉండి ఉండాలి. |
| దే మస్ట్ హావ్ బీన్ వెరీ బిజీ డ్యూరింగ్ ది ఫెస్టివల్ టైమ్ | |
| 16. He must have been very hungry after coming from the journey. | 16. ప్రయాణం నుండి వచ్చిన తర్వాత అతనికి చాలా ఆకలి వేసి ఉండాలి. |
| హీ మస్ట్ హావ్ బీన్ వెరీ హంగ్రీ ఆఫ్టర్ కమింగ్ ఫ్రమ్ ది జర్నీ | |
| 17. She must have been fully ready before the guests arrived. | 17. అతిథులు రాకముందే ఆమె పూర్తిగా సిద్ధమై ఉండాలి. |
| షీ మస్ట్ హావ్ బీన్ ఫుల్లీ రెడీ బిఫోర్ ది గెస్ట్స్ అరైవ్డ్ | |
| 18. They must have been very late because of the heavy traffic. | 18. భారీ ట్రాఫిక్ కారణంగా వారు చాలా ఆలస్యంగా వచ్చి ఉండాలి. |
| దే మస్ట్ హావ్ బీన్ వెరీ లేట్ బికాజ్ ఆఫ్ ది హెవీ ట్రాఫిక్ | |
| 19. He must have been very sick during the last week. | 19. అతను గత వారం చాలా అనారోగ్యంతో ఉండి ఉండాలి. |
| హీ మస్ట్ హావ్ బీన్ వెరీ సిక్ డ్యూరింగ్ ది లాస్ట్ వీక్ | |
| 20. She must have been very afraid when she saw the snake. | 20. ఆమె పామును చూసినప్పుడు చాలా భయపడి ఉండాలి. |
| షీ మస్ట్ హావ్ బీన్ వెరీ అఫ్రెయిడ్ వెన్ షీ సా ది స్నేక్ | |
2.Must have been + Noun
Noun (పేరు) ఉపయోగించి గతంలో సబ్జెక్టు యొక్క స్థితిని గురించి తెలియజేయడానికి
| 1. He must have been a teacher. | 1. అతను ఉపాధ్యాయుడై ఉండాలి.( గతంలో ఉపాధ్యాయుడై ఉండాలి ఇప్పుడు కాదు) |
| హీ మస్ట్ హావ్ బీన్ ఎ టీచర్ | |
| He must not have been a teacher. | అతను ఉపాధ్యాయుడు అయి ఉండడు. |
| Must he have been a teacher? | అతను ఉపాధ్యాయుడై ఉంటాడా? |
| Must he not have been a teacher? | అతను ఉపాధ్యాయుడై ఉండడా? |
| 2. She must have been a doctor. | 2. ఆమె తప్పకుండా వైద్యురాలై ఉండాలి. |
| షీ మస్ట్ హావ్ బీన్ ఎ డాక్టర్ | |
| 3. He must have been a student. | 3. అతను తప్పకుండా విద్యార్థి అయి ఉండాలి. |
| హీ మస్ట్ హావ్ బీన్ ఎ స్టూడెంట్ | |
| 4. She must have been a singer. | 4. ఆమె గాయని అయి ఉండాలి. |
| షీ మస్ట్ హావ్ బీన్ ఎ సింగర్ | |
| 5. They must have been players. | 5. వారు తప్పకుండా ఆటగాళ్లై ఉండాలి. |
| దే మస్ట్ హావ్ బీన్ ప్లేయర్స్ | |
| 6. He must have been a driver. | 6. అతను డ్రైవరు అయి ఉండాలి. |
| హీ మస్ట్ హావ్ బీన్ ఎ డ్రైవర్ | |
| 7. She must have been a leader. | 7. ఆమె ఒక నాయకురాలు అయి ఉండాలి. |
| షీ మస్ట్ హావ్ బీన్ ఎ లీడర్ | |
| 8. He must have been a farmer. | 8. అతను తప్పకుండా రైతు అయి ఉండాలి. |
| హీ మస్ట్ హావ్ బీన్ ఎ ఫార్మర్ | |
| 9. She must have been a dancer. | 9. ఆమె తప్పకుండా నర్తకి అయి ఉండాలి. |
| షీ మస్ట్ హావ్ బీన్ ఎ డాన్సర్ | |
| 10. They must have been workers. | 10. వారు కార్మికులై ఉండాలి. |
| దే మస్ట్ హావ్ బీన్ వర్కర్స్ | |
| 11. He must have been a good teacher in his school days. | 11. అతను తన పాఠశాల రోజుల్లో మంచి ఉపాధ్యాయుడై ఉండాలి. |
| హీ మస్ట్ హావ్ బీన్ ఎ గుడ్ టీచర్ ఇన్ హిస్ స్కూల్ డేస్ | |
| 12. She must have been a famous doctor in that city. | 12. ఆమె ఆ నగరంలో ప్రసిద్ధ వైద్యురాలు అయి ఉండాలి. |
| షీ మస్ట్ హావ్ బీన్ ఎ ఫేమస్ డాక్టర్ ఇన్ దాట్ సిటీ | |
| 13. He must have been a bright student in his college. | 13. అతను తన కళాశాలలో మంచి విద్యార్థి అయి ఉండాలి. |
| హీ మస్ట్ హావ్ బీన్ ఎ బ్రైట్ స్టూడెంట్ ఇన్ హిస్ కాలేజ్ | |
| 14. She must have been a popular singer in those days. | 14. ఆమె ఆ రోజుల్లో ప్రముఖ గాయని అయి ఉండాలి. |
| షీ మస్ట్ హావ్ బీన్ ఎ పాపులర్ సింగర్ ఇన్ దోస్ డేస్ | |
| 15. They must have been excellent players in their team. | 15. వారు తమ జట్టులో అద్భుతమైన ఆటగాళ్ళుగా ఉండి ఉండాలి. |
| దే మస్ట్ హావ్ బీన్ ఎక్సలెంట్ ప్లేయర్స్ ఇన్ దేర్ టీమ్ | |
| 16. He must have been a careful driver on that busy road. | 16. ఆ రద్దీ రహదారిపై అతను జాగ్రత్తగా బండి నడిపి ఉండాలి. |
| హీ మస్ట్ హావ్ బీన్ ఎ కేర్‌ఫుల్ డ్రైవర్ ఆన్ దాట్ బిజీ రోడ్ | |
| 17. She must have been a strong leader during that time. | 17. ఆమె ఆ కాలంలో బలమైన నాయకురాలిగా ఉండి ఉండాలి. |
| షీ మస్ట్ హావ్ బీన్ ఎ స్ట్రాంగ్ లీడర్ డ్యూరింగ్ దాట్ టైమ్ | |
| 18. He must have been a hardworking farmer in his village. | 18. అతను తన గ్రామంలో కష్టపడి పనిచేసే రైతు అయి ఉండాలి. |
| హీ మస్ట్ హావ్ బీన్ ఎ హార్డ్‌వర్కింగ్ ఫార్మర్ ఇన్ హిస్ విలేజ్ | |
| 19. She must have been a talented dancer in her childhood. | 19. ఆమె చిన్నతనంలో ప్రతిభావంతురాలైన నర్తకి అయి ఉండాలి. |
| షీ మస్ట్ హావ్ బీన్ ఎ టాలెంటెడ్ డాన్సర్ ఇన్ హర్ చైల్డ్‌హుడ్ | |
| 20. They must have been dedicated workers in that company. | 20. వారు ఆ కంపెనీలో అంకితభావంతో పనిచేసే ఉద్యోగులై ఉండాలి. |
| దే మస్ట్ హావ్ బీన్ డెడికేటెడ్ వర్కర్స్ ఇన్ దాట్ కంపెనీ | |
3.Must have been + Place
ఒక ప్రదేశముnu ఉపయోగించి గతంలో సబ్జెక్టు యొక్క స్థితిని గురించి తెలియజేయడానికి
| 1. He must have been at home. | 1. అతను ఇంట్లో ఉండి ఉండాలి. |
| హీ మస్ట్ హావ్ బీన్ అట్ హోమ్ | |
| He must not have been at home. | అతను ఇంట్లో ఉండి ఉండడు. |
| Must he have been at home? | అతను ఇంట్లో ఉండి ఉండాలా? |
| Must he not have been at home? | అతను ఇంట్లో ఉండి ఉండడా? |
| 2. She must have been at school. | 2. ఆమె పాఠశాలలో ఉండి ఉండాలి. |
| షీ మస్ట్ హావ్ బీన్ అట్ స్కూల్ | |
| 3. He must have been in the room. | 3. అతను గదిలో ఉండి ఉండాలి. |
| హీ మస్ట్ హావ్ బీన్ ఇన్ ది రూమ్ | |
| 4. They must have been at the station. | 4. వారు స్టేషన్‌లో ఉండి ఉండాలి. |
| దే మస్ట్ హావ్ బీన్ అట్ ది స్టేషన్ | |
| 5. She must have been in the office. | 5. ఆమె ఆఫీసులో ఉండి ఉండాలి. |
| షీ మస్ట్ హావ్ బీన్ ఇన్ ది ఆఫీస్ | |
| 6. He must have been at the park. | 6. అతను పార్కులో ఉండి ఉండాలి. |
| హీ మస్ట్ హావ్ బీన్ అట్ ది పార్క్ | |
| 7. They must have been in the class. | 7. వారు తరగతిలో ఉండి ఉండాలి. |
| దే మస్ట్ హావ్ బీన్ ఇన్ ది క్లాస్ | |
| 8. She must have been at the hospital. | 8. ఆమె ఆసుపత్రిలో ఉండి ఉండాలి. |
| షీ మస్ట్ హావ్ బీన్ అట్ ది హాస్పిటల్ | |
| 9. He must have been in the kitchen. | 9. అతను వంటగదిలో ఉండి ఉండాలి. |
| హీ మస్ట్ హావ్ బీన్ ఇన్ ది కిచెన్ | |
| 10. They must have been at the shop. | 10. వారు తప్పకుండా దుకాణంలో ఉండి ఉండాలి. |
| దే మస్ట్ హావ్ బీన్ అట్ ది షాప్ | |
| 11. He must have been at home when you called him. | 11. మీరు అతనికి ఫోన్ చేసినప్పుడు అతను ఇంట్లో ఉండి ఉండాలి. |
| హీ మస్ట్ హావ్ బీన్ అట్ హోమ్ వెన్ యు కాల్డ్ హిమ్ | |
| 12. She must have been at school during the morning time. | 12. ఆమె ఉదయం పూట పాఠశాలలో ఉండి ఉండాలి. |
| షీ మస్ట్ హావ్ బీన్ అట్ స్కూల్ డ్యూరింగ్ ది మార్నింగ్ టైమ్ | |
| 13. He must have been in the room when the teacher came. | 13. ఉపాధ్యాయుడు వచ్చినప్పుడు అతను గదిలో ఉండి ఉండాలి. |
| హీ మస్ట్ హావ్ బీన్ ఇన్ ది రూమ్ వెన్ ది టీచర్ కేమ్ | |
| 14. They must have been at the station before the train arrived. | 14. రైలు రాకముందే వారు స్టేషన్‌లో ఉండి ఉండాలి. |
| దే మస్ట్ హావ్ బీన్ అట్ ది స్టేషన్ బిఫోర్ ది ట్రైన్ అరైవ్డ్ | |
| 15. She must have been in the office during the meeting. | 15. సమావేశం జరిగినప్పుడు ఆమె ఆఫీసులోనే ఉండి ఉండాలి. |
| షీ మస్ట్ హావ్ బీన్ ఇన్ ది ఆఫీస్ డ్యూరింగ్ ది మీటింగ్ | |
| 16. He must have been at the park in the evening time. | 16. అతను సాయంత్రం వేళలో పార్కులో ఉండి ఉండాలి. |
| హీ మస్ట్ హావ్ బీన్ అట్ ది పార్క్ ఇన్ ది ఈవెనింగ్ టైమ్ | |
| 17. They must have been in the class when the bell rang. | 17. గంట మోగినప్పుడు వారు తరగతిలో ఉండి ఉండాలి. |
| దే మస్ట్ హావ్ బీన్ ఇన్ ది క్లాస్ వెన్ ది బెల్ ర్యాంగ్ | |
| 18. She must have been at the hospital to see her friend. | 18. ఆమె తన స్నేహితురాలిని చూడటానికి ఆసుపత్రికి వెళ్లి ఉండాలి. |
| షీ మస్ట్ హావ్ బీన్ అట్ ది హాస్పిటల్ టు సీ హర్ ఫ్రెండ్ | |
| 19. He must have been in the kitchen preparing food. | 19. అతను వంటగదిలో ఆహారం తయారు చేస్తూ ఉండి ఉండాలి. |
| హీ మస్ట్ హావ్ బీన్ ఇన్ ది కిచెన్ ప్రిపేరింగ్ ఫుడ్ | |
| 20. They must have been at the shop buying some things. | 20. వారు దుకాణంలో కొన్ని వస్తువులు కొంటూ ఉండి ఉండాలి. |
| దే మస్ట్ హావ్ బీన్ అట్ ది షాప్ బాయింగ్ సమ్ థింగ్స్ | |
4. Must have been + verb4
గతంలో సబ్జెక్టు ఏదైనా ఒక పని చేస్తూ ఉండి ఉండాలి అని చెప్పడానికి ఇప్పుడు ఆ పని చేయడం లేదు అని అర్థం
| 1. He must have been working. | 1. అతను పని చేస్తూ ఉండి ఉండాలి. |
| హీ మస్ట్ హావ్ బీన్ వర్కింగ్ | |
| He must not have been working. | అతను పని చేస్తూ ఉండి ఉండడు. |
| Must he have been working? | అతను పని చేస్తూ ఉండి ఉండాలా? |
| Must he not have been working? | అతను పని చేస్తూ ఉండి ఉండడా? |
| 2. She must have been sleeping. | 2. ఆమె నిద్రపోతూ ఉండి ఉండాలి. |
| షీ మస్ట్ హావ్ బీన్ స్లీపింగ్ | |
| 3. They must have been playing. | 3. వారు ఆడుతూ ఉండి ఉండాలి. |
| దే మస్ట్ హావ్ బీన్ ప్లేయింగ్ | |
| 4. He must have been studying. | 4. అతను చదువుకుంటుండాలి. |
| హీ మస్ట్ హావ్ బీన్ స్టడీయింగ్ | |
| 5. She must have been cooking. | 5. ఆమె వంట చేస్తూ ఉండి ఉండాలి. |
| షీ మస్ట్ హావ్ బీన్ కుకింగ్ | |
| 6. They must have been running. | 6. వారు పరుగెత్తుతూ ఉండి ఉండాలి. |
| దే మస్ట్ హావ్ బీన్ రన్నింగ్ | |
| 7. He must have been reading. | 7. అతను చదువుతూ ఉండి ఉండాలి. |
| హీ మస్ట్ హావ్ బీన్ రీడింగ్ | |
| 8. She must have been writing. | 8. ఆమె రాస్తూ ఉండి ఉండాలి. |
| షీ మస్ట్ హావ్ బీన్ రైటింగ్ | |
| 9. They must have been talking. | 9. వారు మాట్లాడుకుంటూ ఉండి ఉండాలి. |
| దే మస్ట్ హావ్ బీన్ టాకింగ్ | |
| 10. He must have been driving. | 10. అతను డ్రైవింగ్ చేస్తూ ఉండి ఉండాలి. |
| హీ మస్ట్ హావ్ బీన్ డ్రైవింగ్ | |
| 11. He must have been working all night on the project. | 11. అతను ఆ ప్రాజెక్ట్ మీద రాత్రంతా పనిచేసి ఉండాలి. |
| హీ మస్ట్ హావ్ బీన్ వర్కింగ్ ఆల్ నైట్ ఆన్ ది ప్రాజెక్ట్ | |
| 12. She must have been sleeping when you called her. | 12. మీరు ఫోన్ చేసినప్పుడు ఆమె నిద్రపోతూ ఉండి ఉండాలి. |
| షీ మస్ట్ హావ్ బీన్ స్లీపింగ్ వెన్ యు కాల్డ్ హర్ | |
| 13. They must have been playing cricket in the ground. | 13. వారు మైదానంలో క్రికెట్ ఆడుతూ ఉండి ఉండాలి. |
| దే మస్ట్ హావ్ బీన్ ప్లేయింగ్ క్రికెట్ ఇన్ ది గ్రౌండ్ | |
| 14. He must have been studying for the exam yesterday. | 14. అతను నిన్న పరీక్ష కోసం చదువుతూ ఉండి ఉండాలి. |
| హీ మస్ట్ హావ్ బీన్ స్టడీయింగ్ ఫర్ ది ఎగ్జామ్ యెస్టర్‌డే | |
| 15. She must have been cooking food for the family. | 15. ఆమె కుటుంబం కోసం వంట చేస్తూ ఉండి ఉండాలి. |
| షీ మస్ట్ హావ్ బీన్ కుకింగ్ ఫుడ్ ఫర్ ది ఫ్యామిలీ | |
| 16. They must have been running in the park in the morning. | 16. వారు ఉదయం పార్కులో పరుగెత్తుతూ ఉండి ఉండాలి. |
| దే మస్ట్ హావ్ బీన్ రన్నింగ్ ఇన్ ది పార్క్ ఇన్ ది మార్నింగ్ | |
| 17. He must have been reading a book in the library. | 17. అతను గ్రంథాలయంలో ఒక పుస్తకం చదువుతూ ఉండి ఉండాలి. |
| హీ మస్ట్ హావ్ బీన్ రీడింగ్ ఎ బుక్ ఇన్ ది లైబ్రరీ | |
| 18. She must have been writing a letter to her friend. | 18. ఆమె తన స్నేహితురాలికి ఉత్తరం రాస్తూ ఉండి ఉండాలి. |
| షీ మస్ట్ హావ్ బీన్ రైటింగ్ ఎ లెటర్ టు హర్ ఫ్రెండ్ | |
| 19. They must have been talking about that issue yesterday. | 19. వారు నిన్న ఆ విషయం గురించే మాట్లాడుకుంటూ వుండి ఉండాలి. |
| దే మస్ట్ హావ్ బీన్ టాకింగ్ అబౌట్ దాట్ ఇష్యూ యెస్టర్‌డే | |
| 20. He must have been driving the car very carefully. | 20. అతను కారును చాలా జాగ్రత్తగా నడుపుతూ ఉండాలి. |
| హీ మస్ట్ హావ్ బీన్ డ్రైవింగ్ ది కార్ వెరీ కేర్‌ఫుల్‌గా |
