క్రింది టాపిక్స్ పై క్లిక్ చేయండి
Need to be
Needed to be
Will Need to be
1.Need to be = అవసరం ఉంది
మనం ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఆ పని చేయాల్సిన “అవసరం ఉంది” అని చెప్పేటువంటి సందర్భంలో Need to ఉపయోగిస్తారు.
| can, could, may, might, shall, should, will, would, must. వీటిని మోడల్ వెర్బ్స్ అంటారు. need to, have to, ought to, used to వీటిని సెమీ మోడల్స్ అంటారు. |
- Need to ఉపయోగించినప్పుడు verb మొదటి రూపంలో ఉండాలి.
- Simple Present లో Subject సింగులర్ అయితే Needs to, Subject ప్లూరల్ అయితే Need to ఉపయోగిస్తారు
- need to, have to, ought to, used to ఈ విధంగా చివరిలో to ఉన్న పదాలను ప్యాసివ్ వాయిస్ లోకి మార్చినప్పుడు Be కలిపి. need to be , have to be, ought to be, used to be అని రాస్తారు ఈ మార్పు తప్ప ఇంకేమీ లేదు.
Active Voice:
Subject + need/needs to + V1 + Object
Passive Voice:
Object + need/needs to + be + V3 + by + Subject
మనం సింపుల్ ప్రెసెంట్ లో నేర్చుకున్న విధంగానే క్రింది పట్టిక లోని ఎగ్జాంపుల్స్ ఉంటాయి.
ఈ పట్టికలో ఉన్న ఎగ్జాంపుల్స్ అర్థం కాకపోతే సింపుల్ ప్రెసెంట్ టెన్స్ ని ఒకసారి చూడండి
కింద పట్టికలో మొదటి సెంటెన్స్ Active voice రెండు Passive voice
| 1. He needs to wash the car. | 1. అతను కారు అడగాల్సిన అవసరం ఉంది |
| హీ నీడ్స్ టు వాష్ ది కార్. | |
| The car needs to be washed by him. | కారును అతను కడగాల్సిన అవసరం ఉంది లేదా కారు అతని చేత శుభ్రం చేయబడాల్సిన అవసరం ఉంది |
| 2. She needs to clean the room. | 2. ఆమె గదిని శుభ్రం చేయాల్సిన అవసరం ఉంది |
| షీ నీడ్స్ టు క్లీన్ ది రూమ్. | |
| The room needs to be cleaned by her. | గదిని ఆమె శుభ్రం చేయాల్సిన అవసరం ఉంది లేదా గది ఆమె చేత శుభ్రం చేయబడాల్సిన అవసరం ఉంది |
| 3. I need to write the letter. | 3. నేను ఉత్తరం రాయాల్సిన అవసరం ఉంది |
| ఐ నీడ్ టు రైట్ ది లెటర్. | |
| The letter needs to be written by me. | ఉత్తరమును నేను రాయాల్సిన అవసరం ఉంది (లేదా) ఉత్తరం నా చేత రాయబడాల్సిన అవసరం ఉంది |
| 4. We need to finish the work. | 4. మనం పని పూర్తి చేయాల్సిన అవసరం ఉంది |
| వీ నీడ్ టు ఫినిష్ ది వర్క్. | |
| The work needs to be finished by us. | పనిని మనం పూర్తి చేయాల్సిన అవసరం ఉంది |
| 5. You need to open the door. | 5. మీరు తలుపు తెరవాల్సిన అవసరం ఉంది. |
| యూ నీడ్ టు ఓపెన్ ది డోర్. | |
| The door needs to be opened by you. | తలుపును మీరు తెరవాల్సిన అవసరం ఉంది |
| 6. They need to paint the wall. | 6. వారు గోడకు రంగు వేయాల్సిన అవసరం ఉంది |
| దే నీడ్ టు పెయింట్ ది వాల్. | |
| The wall needs to be painted by them. | గోడకు వారు రంగు వేయాల్సిన అవసరం ఉంది |
| 8. He needs to lock the gate. | 8. అతను గేటుకు తాళం వేయాల్సిన అవసరం ఉంది. |
| హీ నీడ్స్ టు లాక్ ది గేట్. | |
| The gate needs to be locked by him. | గేటుకు అతను తాళం వేయాల్సిన అవసరం ఉంది |
| 9. She needs to water the plants. | 9. ఆమె మొక్కలకు నీళ్ళు పోయాల్సిన అవసరం ఉంది. |
| షీ నీడ్స్ టు వాటర్ ది ప్లాంట్స్. | |
| The plants need to be watered by her. | మొక్కలకు ఆమె నీళ్లు పోయాల్సిన అవసరం ఉంది |
| 10. We need to repair the bike. | 10. మేము బైకును రిపేరు చేయించాల్సిన అవసరం ఉంది |
| వీ నీడ్ టు రిపేర్ ది బైక్. | |
| The bike needs to be repaired by us. | బైక్‌ను మేము రిపేరు చేయించాల్సిన అవసరం ఉంది |
| ఇక్కడి నుండి Passive Negative, interrogative, and negative interrogative sentences కూడా ఇవ్వడం జరిగింది | |
| 11. He needs to fix the fan. | . అతను ఫ్యాన్‌ను బాగు చేయించాల్సిన అవసరం ఉంది. |
| హీ నీడ్స్ టు ఫిక్స్ ది ఫ్యాన్. | |
| The fan needs to be fixed by him. | ఫ్యానును అతను బాగు చేయించాల్సిన అవసరం ఉంది |
| The fan does not need to be fixed by him. | ఫ్యానును అతను బాగు చేయించాల్సిన అవసరం లేదు |
| Does the fan need to be fixed by him? | ఫ్యానును అతను బాగు చేయించాల్సిన అవసరం ఉందా ? |
| Doesn’t the fan need to be fixed by him? | ఫ్యానును అతను బాగు చేయించాల్సిన అవసరం లేదా? |
| 12 She needs to buy the book. | 12 . ఆమె ఆ పుస్తకాన్ని కొనాల్సిన అవసరం ఉంది |
| షీ నీడ్స్ టు బై ది బుక్. | |
| The book needs to be bought by her. | పుస్తకమును ఆమె కొనాల్సిన అవసరం ఉంది |
| The book does not need to be bought by her. | పుస్తకమును ఆమె కొనాల్సిన అవసరం లేదు |
| Does the book need to be bought by her? | పుస్తకమును ఆమె కొనాల్సిన అవసరం ఉందా? |
| Doesn’t the book need to be bought by her? | పుస్తకమును ఆమె కొనాల్సిన అవసరం లేదా? |
| 13 . I need to send the email. | నేను ఈ మెయిల్ ని పంపాల్సిన అవసరం ఉంది |
| ఐ నీడ్ టు సెండ్ ది ఈమెయిల్. | |
| The email needs to be sent by me. | ఈ మెయిల్ ని నేను పంపాల్సిన అవసరం ఉంది |
| The email does not need to be sent by me. | ఈ మెయిల్ ని నేను పంపాల్సిన అవసరం లేదు. |
| Does the email need to be sent by me? | ఈ మెయిల్ ని నేను పంపాల్సిన అవసరం ఉందా ? |
| Doesn’t the email need to be sent by me? | ఈ మెయిల్ ని నేను పంపాల్సిన అవసరం లేదా? |
| 15 We need to clean the floor. | మేము నేలను శుభ్రం చేయాల్సిన అవసరం ఉంది |
| వీ నీడ్ టు క్లీన్ ది ఫ్లోర్. | |
| The floor needs to be cleaned by us. | నేలను మేము శుభ్రం చేయాల్సిన అవసరం ఉంది |
| The floor does not need to be cleaned by us. | నేలను మేము శుభ్రం చేయాల్సిన అవసరం లేదు. |
| Does the floor need to be cleaned by us? | నేలను మేము శుభ్రం చేయాల్సిన అవసరం ఉందా ? |
| Doesn’t the floor need to be cleaned by us? | నేలను మేము శుభ్రం చేయాల్సిన అవసరం లేదా? |
| 15 . You need to close the window. | 25. మీరు కిటికీని మూసివేయాల్సిన అవసరం ఉంది |
| యూ నీడ్ టు క్లోజ్ ది విండో. | |
| The window needs to be closed by you. | కిటికీని మీరు మూసివేయాల్సిన అవసరం ఉంది |
| The window does not need to be closed by you. | కిటికీని మీరు మూసివేయాల్సిన అవసరం లేదు. |
| Does the window need to be closed by you? | కిటికీని మీరు మూసివేయాల్సిన అవసరం ఉందా ? |
| Doesn’t the window need to be closed by you? | కిటికీని మీరు మూసివేయాల్సిన అవసరం లేదా? |
| 16 . They need to carry the boxes. | 26. వారు పెట్టెలను మోయాల్సిన అవసరం ఉంది |
| దే నీడ్ టు క్యారీ ది బాక్సెస్. | |
| The boxes need to be carried by them. | పెట్టెలను వారు మోయాల్సిన అవసరం ఉంది |
| The boxes do not need to be carried by them. | పెట్టెలను వారు మోయాల్సిన అవసరం లేదు. |
| Do the boxes need to be carried by them? | పెట్టెలను వారు మోయాల్సిన అవసరం ఉందా ? |
| Don’t the boxes need to be carried by them? | పెట్టెలను వారు మోయాల్సిన అవసరం లేదా? |
| 17 . He needs to answer the call. | అతను కాల్ కి జవాబు ఇవ్వాల్సిన అవసరం ఉంది. |
| హీ నీడ్స్ టు ఆన్సర్ ది కాల్. | |
| The call needs to be answered by him. | కాల్ కి అతను జవాబు ఇవ్వాల్సిన అవసరం ఉంది |
| The call does not need to be answered by him. | కాల్ కి అతను జవాబు ఇవ్వాల్సిన అవసరం లేదు. |
| Does the call need to be answered by him? | కాల్ కి అతను జవాబు ఇవ్వాల్సిన అవసరం ఉందా? |
| Doesn’t the call need to be answered by him? | కాల్ కి అతను జవాబు ఇవ్వాల్సిన అవసరం లేదా? |
| 18 She needs to lock the door. | ఆమె తలుపుకు తాళం వేయాల్సిన అవసరం ఉంది. |
| షీ నీడ్స్ టు లాక్ ది డోర్. | |
| The door needs to be locked by her. | తలుపుకు ఆమె తాళం వేయాల్సిన అవసరం ఉంది |
| The door does not need to be locked by her. | తలుపుకు ఆమె తాళం వేయాల్సిన అవసరం లేదు. |
| Does the door need to be locked by her? | తలుపుకు ఆమె తాళం వేయాల్సిన అవసరం ఉందా ? |
| Doesn’t the door need to be locked by her? | తలుపుకు ఆమె తాళం వేయాల్సిన అవసరం లేదా? |
| 19 I need to charge the phone. | నేను ఫోన్‌ను ఛార్జ్ చేయాల్సిన అవసరం ఉంది |
| ఐ నీడ్ టు ఛార్జ్ ది ఫోన్. | |
| The phone needs to be charged by me. | ఫోన్‌ను నేను ఛార్జ్ చేయాల్సిన అవసరం ఉంది |
| The phone does not need to be charged by me. | ఫోన్‌ను నేను ఛార్జ్ చేయాల్సిన అవసరం లేదు. |
| Does the phone need to be charged by me? | ఫోన్‌ను నేను ఛార్జ్ చేయాల్సిన అవసరం ఉందా ? |
| Doesn’t the phone need to be charged by me? | ఫోన్‌ను నేను ఛార్జ్ చేయాల్సిన అవసరం లేదా? |
| 20 . We need to paint the fence. | మేము కంచెకు రంగు వేయాల్సిన అవసరం ఉంది. |
| వీ నీడ్ టు పెయింట్ ది ఫెన్స్. | |
| The fence needs to be painted by us. | కంచెకు మేము రంగు వేయాల్సిన అవసరం ఉంది. |
| The fence does not need to be painted by us. | కంచెకు మేము రంగు వేయాల్సిన అవసరం లేదు. |
| Does the fence need to be painted by us? | కంచెకు మేము రంగు వేయాల్సిన అవసరం ఉందా ? |
| Doesn’t the fence need to be painted by us? | కంచెకు మేము రంగు వేయాల్సిన అవసరం లేదా? |
| 21 . She needs to submit the report to the principal before the deadline ends. | 12. ఆమె గడువు ముగిసేలోపు ప్రిన్సిపాల్‌కు నివేదికను సమర్పించాల్సిన అవసరం ఉంది. |
| షీ నీడ్స్ టు సబ్మిట్ ది రిపోర్ట్ టు ది ప్రిన్సిపల్ బిఫోర్ ది డెడ్‌లైన్ ఎండ్స్. | |
| The report needs to be submitted to the principal by her before the deadline ends. | నివేదికను గడువు ముగిసే లోపు ఆమె ప్రిన్సిపాల్ కు సమర్పించాల్సిన అవసరం ఉంది. |
| The report does not need to be submitted to the principal by her before the deadline ends. | నివేదికను గడువు ముగిసే లోపు ఆమె ప్రిన్సిపాల్ కు సమర్పించాల్సిన అవసరం లేదు. |
| Does the report need to be submitted to the principal by her before the deadline ends? | నివేదికను గడువు ముగిసే లోపు ఆమె ప్రిన్సిపాల్ కు సమర్పించాల్సిన అవసరం ఉందా .? |
| Doesn’t the report need to be submitted to the principal by her before the deadline ends? | నివేదికను గడువు ముగిసే లోపు ఆమె ప్రిన్సిపాల్ కు సమర్పించాల్సిన అవసరం లేదా? |
| 22 . I need to send the invitation letters to all the guests this evening. | 13. నేను ఈ సాయంత్రం అతిథులందరికీ ఆహ్వాన పత్రాలను పంపాల్సిన అవసరం ఉంది |
| ఐ నీడ్ టు సెండ్ ది ఇన్విటేషన్ లెటర్స్ టు ఆల్ ది గెస్ట్స్ దిస్ ఈవెనింగ్. | |
| The invitation letters need to be sent to all the guests by me this evening. | ఆహ్వాన పత్రాలను అతిథులందరికీ ఈ సాయంత్రం నేను పంపాల్సిన అవసరం ఉంది |
| The invitation letters do not need to be sent to all the guests by me this evening. | ఆహ్వాన పత్రాలను అతిథులందరికీ ఈ సాయంత్రం నేను పంపాల్సిన అవసరం లేదు. |
| Do the invitation letters need to be sent to all the guests by me this evening? | ఆహ్వాన పత్రాలను అతిథులందరికీ ఈ సాయంత్రం నేను పంపాల్సిన అవసరం ఉందా ? |
| Don’t the invitation letters need to be sent to all the guests by me this evening? | ఆహ్వాన పత్రాలను అతిథులందరికీ ఈ సాయంత్రం నేను పంపాల్సిన అవసరం లేదా? |
| 23 . We need to organize the meeting in the conference hall next week. | మనం వచ్చే వారం సమావేశ మందిరంలో సమావేశం ఏర్పాటు చేయాలి. |
| వీ నీడ్ టు ఆర్గనైజ్ ది మీటింగ్ ఇన్ ది కాన్ఫరెన్స్ హాల్ నెక్స్ట్ వీక్. | |
| The meeting needs to be organised in the conference hall by us next week. | సమావేశమును మనం వచ్చేవారం సమావేశ మందిరంలో ఏర్పాటు చేయాలి |
| The meeting does not need to be organized in the conference hall by us next week. | సమావేశమును మనం వచ్చేవారం సమావేశ మందిరంలో ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదు. |
| Does the meeting need to be organized in the conference hall by us next week? | సమావేశమును మనం వచ్చేవారం సమావేశ మందిరంలో ఏర్పాటు చేయాలా ? |
| Doesn’t the meeting need to be organized in the conference hall by us next week? | సమావేశమును మనం వచ్చేవారం సమావేశ మందిరంలో ఏర్పాటు చేయకూడదా? |
| 24. They need to renovate the old building before the rainy season starts. | 16. వర్షాకాలం ప్రారంభమయ్యేలోపు వారు పాత భవనాన్ని పునరుద్ధరించాల్సిన అవసరం ఉంది. |
| దే నీడ్ టు రెనోవేట్ ది ఓల్డ్ బిల్డింగ్ బిఫోర్ ది రైనీ సీజన్ స్టార్ట్స్. | |
| The old building needs to be renovated by them before the rainy season starts. | పాత భవనమును వర్షాకాలం ప్రారంభమయ్యే లోపు వారు పునరుద్ధరించాల్సిన అవసరం ఉంది |
| The old building does not need to be renovated by them before the rainy season starts. | పాత భవనమును వర్షాకాలం ప్రారంభమయ్యే లోపు వారు పునరుద్ధరించాల్సిన అవసరం లేదు. |
| Does the old building need to be renovated by them before the rainy season starts? | పాత భవనమును వర్షాకాలం ప్రారంభమయ్యే లోపు వారు పునరుద్ధరించాల్సిన అవసరం ఉందా? |
| Doesn’t the old building need to be renovated by them before the rainy season starts? | పాత భవనమును వర్షాకాలం ప్రారంభమయ్యే లోపు వారు పునరుద్ధరించాల్సిన అవసరం లేదా? |
| 25 . He needs to deliver the materials to the construction site before noon. | 18. అతను మధ్యాహ్నానికి ముందే నిర్మాణ స్థలానికి సామాగ్రిని అందజేయాల్సిన అవసరం ఉంది. |
| హీ నీడ్స్ టు డెలివర్ ది మెటీరియల్స్ టు ది కన్స్ట్రక్షన్ సైట్ బిఫోర్ నూన్. | |
| The materials need to be delivered to the construction site by him before noon. | సామాగ్రిని నిర్మాణ స్థలానికి మధ్యాహ్నం ముందే అతను అందజేయాల్సిన అవసరం ఉంది |
| The materials do not need to be delivered to the construction site by him before noon. | సామాగ్రిని నిర్మాణ స్థలానికి మధ్యాహ్నం ముందే అతను అందజేయాల్సిన అవసరం లేదు. |
| Do the materials need to be delivered to the construction site by him before noon? | సామాగ్రిని నిర్మాణ స్థలానికి మధ్యాహ్నం ముందే అతను అందజేయాల్సిన అవసరం ఉందా ? |
| Don’t the materials need to be delivered to the construction site by him before noon? | సామాగ్రిని నిర్మాణ స్థలానికి మధ్యాహ్నం ముందే అతను అందజేయాల్సిన అవసరం లేదా ? |
2.Needed to be = చేయాల్సిన అవసరం వచ్చింది.
గతంలో ఏవైనా పనులు చేయాల్సిన అవసరం ఏర్పడింది, చేయాల్సిన అవసరం వచ్చింది, చేయాల్సి వచ్చింది. అని చెప్పేటువంటి సందర్భంలో Needed to ఉపయోగిస్తారు.
Needed to ఆల్రెడీ పాస్ట్ టెన్స్ లో ఉంది గనుక దీన్ని ఉపయోగించి సెంటెన్స్ చెప్పేటప్పుడు verb ఎప్పుడు మొదటి రూపంలోనే ఉంచాలి. Verb2 ఉపయోగించకూడదు ఎందుకంటే గ్రామర్ ప్రకారం ఒకే సెంటెన్స్ లో రెండు పాస్ట్ టెన్స్ గురించి తెలియజేసే verbs ఉండకూడదు.
Needed to అన్ని singular మరియు Plural అన్నీ సబ్జెక్టులకు కామన్ గా ఉపయోగిస్తారు
Active Voice:
Subject + needed to + V1 + Object
Passive Voice:
Object + needed to + be + V3 + by + Subject
Simple past లో మనం ఏ విధంగా సెంటెన్స్ నిర్మించామో ఇక్కడ కూడా అదే విధంగా ఉంటుంది అర్థం కాకపోతే ఒకసారి Simple past tense చూడండి
ఈ క్రింది సెంటెన్స్ లో by మరియు subject తీసివేసి సెంటెన్స్ నిర్మించాము మీకు అవసరమైతే పెట్టుకోండి. సాధారణంగా ప్యాసివ్ వాయిస్ లో అవసరమైతే తప్ప by ఉపయోగించి సబ్జెక్టు పేరు చెప్పరు. Subject పేరు చెప్పకపోయినా ఆ పని చేసింది ఎవరో అవతలి వాళ్ళకి ఆటోమేటిగ్గా అర్థం అయిపోతుంది.
కింద పట్టికలో మొదటి సెంటెన్స్ Active voice రెండు Passive voice
| 1. We needed to clean the room. | 1. మేము గదిని శుభ్రం చేయవలసి వచ్చింది.లేదా మేము గదిని శుభ్రం చేయవలసిన అవసరం వచ్చింది |
| వీ నీడెడ్ టు క్లీన్ ది రూమ్. | |
| The room needed to be cleaned. | గదిని శుభ్రం చేయవలసిన అవసరం వచ్చింది |
| 2. They needed to paint the wall. | 2. వారు గోడకు రంగు వేయవలసి వచ్చింది. |
| దే నీడెడ్ టు పెయింట్ ది వాల్. | |
| The wall needed to be painted. | గోడకు రంగు వేయవలసి వచ్చింది |
| 3. You needed to wash the car. | 3. మీరు కారు కడగవలసి వచ్చింది. |
| యూ నీడెడ్ టు వాష్ ది కార్. | |
| The car needed to be washed. | కారును కడగవలసి వచ్చింది. |
| 4. I needed to answer the question. | 4. నేను ఆ ప్రశ్నకు సమాధానం ఇవ్వవలసి వచ్చింది. |
| ఐ నీడెడ్ టు ఆన్సర్ ది క్వశ్చన్. | |
| The question needed to be answered. | ఆ ప్రశ్నకు సమాధానం చెప్పాల్సి వచ్చింది. |
| 5. She needed to open the door. | 5. ఆమె తలుపు తెరవాల్సి వచ్చింది. |
| షీ నీడెడ్ టు ఓపెన్ ది డోర్. | |
| The door needed to be opened. | తలుపును తెరవవలసి వచ్చింది. |
| ఇక్కడి నుండి Negative, interrogative, and negative interrogative sentences కూడా ఇవ్వడం జరిగింది | |
| 6. He needed to fix the bike. | 6. అతను బైక్‌ను బాగు చేయించాల్సి వచ్చింది. |
| హీ నీడెడ్ టు ఫిక్స్ ది బైక్. | |
| The bike needed to be fixed. | బైక్‌కును బాగు చేయించాల్సి వచ్చింది |
| The bike did not need to be fixed. | బైక్ ను బాగు చేయించాల్సి రాలేదు |
| Did the bike need to be fixed? | బైక్ ను బాగు చేయించాల్సి వచ్చిందా? |
| Didn’t the bike need to be fixed? | బైక్ను బాగు చేయించాల్సి రాలేదా? |
| 7. We needed to check the list. | 7. మేము జాబితాను తనిఖీ చేయవలసి వచ్చింది. |
| వీ నీడెడ్ టు చెక్ ది లిస్ట్. | |
| The list needed to be checked. | జాబితాను తనిఖీ చేయవలసి వచ్చింది. |
| The list did not need to be checked. | జాబితాను తనిఖీ చేయవలసి రాలేదు |
| Did the list need to be checked? | జాబితాను తనిఖీ చేయవలసి వచ్చిందా? |
| Didn’t the list need to be checked? | జాబితాను తనిఖీ చేయాల్సిన అవసరం రా లేదా? |
| 8. They needed to repair the gate. | 8. వారు గేటుకు మరమ్మత్తు చేయించాల్సి వచ్చింది. |
| దే నీడెడ్ టు రిపేర్ ది గేట్. | |
| The gate needed to be repaired. | గేటుకు మరమ్మత్తు చేయించాల్సి వచ్చింది. |
| The gate did not need to be repaired. | గేటుకు మరమ్మత్తు చేయించాల్సి రాలేదు |
| Did the gate need to be repaired? | గేటుకు మరమ్మత్తు చేయించాల్సి వచ్చిందా? |
| Didn’t the gate need to be repaired? | గేటుకు మరమ్మత్తు చేయించాల్సి రాలేదా? |
| 9. You needed to submit the form. | 9. మీరు ఫారం సమర్పించాల్సి వచ్చింది. |
| యూ నీడెడ్ టు సబ్మిట్ ది ఫామ్. | |
| The form needed to be submitted. | ఫారం సమర్పించాల్సి వచ్చింది. |
| The form did not need to be submitted. | ఫారం సమర్పించాల్సిన అవసరం రా లేదు. |
| Did the form need to be submitted? | ఫారం సమర్పించాల్సి వచ్చిందా? |
| Didn’t the form need to be submitted? | ఫారం సమర్పించాల్సిన అవసరం రా లేదా? |
| 10. I needed to charge the phone. | 10. నేను ఫోన్‌ను ఛార్జ్ చేయాల్సి వచ్చింది. |
| ఐ నీడెడ్ టు చార్జ్ ది ఫోన్. | |
| The phone needed to be charged. | ఫోన్‌ను ఛార్జ్ చేయాల్సి వచ్చింది. |
| The phone did not need to be charged. | ఫోన్‌ను ఛార్జ్ చేయాల్సిన అవసరం రా లేదు. |
| Did the phone need to be charged? | ఫోన్‌ను ఛార్జ్ చేయాల్సి వచ్చిందా? |
| Didn’t the phone need to be charged? | ఫోన్‌ను ఛార్జ్ చేయాల్సిన అవసరం రా లేదా? |
3.Will Need to be = చేయాల్సిన అవసరం వస్తుంది
భవిష్యత్తులో ఏవైనా పనులు చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది, చేయాల్సిన అవసరం వస్తుంది, చేయాల్సి వస్తుంది. అని చెప్పేటువంటి సందర్భంలో will need to ఉపయోగిస్తారు.
will need to ఆల్రెడీ simple future లో ఉంది గనుక దీన్ని ఉపయోగించి సెంటెన్స్ చెప్పేటప్పుడు verb ఎప్పుడు మొదటి రూపంలోనే ఉంచాలి.
will need to అన్ని singular మరియు Plural సబ్జెక్టులకు కామన్ గా ఉపయోగిస్తారు
Active Voice:
Subject + will need to + V1 + Object
Passive Voice:
Object + will need to + be + V3 + by + Subject
Simple Future లో మనం ఏ విధంగా సెంటెన్స్ నిర్మించామో ఇక్కడ కూడా అదే విధంగా ఉంటుంది అర్థం కాకపోతే ఒకసారి Simple Future tense చూడండి
ఈ క్రింది సెంటెన్స్ లో కూడా by మరియు subject తీసివేసి సెంటెన్స్ నిర్మించాము మీకు అవసరమైతే పెట్టుకోండి. సాధారణంగా ప్యాసివ్ వాయిస్ లో అవసరమైతే తప్ప by ఉపయోగించి సబ్జెక్టు పేరు చెప్పరు. Subject పేరు చెప్పకపోయినా ఆ పని చేసింది ఎవరో అవతలి వాళ్ళకి ఆటోమేటిగ్గా అర్థం అయిపోతుంది
కింద పట్టికలో మొదటి సెంటెన్స్ Active voice రెండు Passive voice
| 1. We will need to clean the room. | 1. మనం గదిని శుభ్రం చేయవలసిన అవసరం ఉంటుంది |
| వీ విల్ నీడ్ టు క్లీన్ ది రూమ్. | |
| The room will need to be cleaned. | గదిని శుభ్రం చేయవలసిన అవసరం ఉంటుంది |
| 2. They will need to paint the wall. | 2. వారు గోడకు రంగు వేయవలసి అవసరం ఉంటుంది |
| దే విల్ నీడ్ టు పెయింట్ ది వాల్. | |
| The wall will need to be painted. | గోడకు రంగు వేయవలసిన అవసరం ఉంటుంది |
| 3. You will need to wash the car. | 3. మీరు కారును కడగవలసిన అవసరం ఉంటుంది |
| యూ విల్ నీడ్ టు వాష్ ది కార్. | |
| The car will need to be washed. | కారును కడవలసిన అవసరం ఉంటుంది |
| 4. I will need to answer the question. | 4. నేను ప్రశ్నకు సమాధానం ఇవ్వవలసిన అవసరం ఉంటుంది |
| ఐ విల్ నీడ్ టు ఆన్సర్ ది క్వశ్చన్. | |
| The question will need to be answered. | ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వవలసిన అవసరం ఉంటుంది. |
| 5. She will need to open the door. | 5. ఆమె తలుపు తెరవాల్సిన అవసరం ఉంటుంది. |
| షీ విల్ నీడ్ టు ఓపెన్ ది డోర్. | |
| The door will need to be opened. | తలుపును తెరవాల్సిన అవసరం ఉంటుంది. |
| ఇక్కడి నుండి Negative, interrogative, and negative interrogative sentences కూడా ఇవ్వడం జరిగింది | |
| 6. He will need to fix the bike. | 6. అతను బైక్‌ను బాగు చేయించాల్సిన అవసరం ఉంటుంది. |
| హీ విల్ నీడ్ టు ఫిక్స్ ది బైక్. | |
| The bike will need to be fixed. | బైకును బాగు చేయించాల్సిన అవసరం ఉంటుంది |
| The bike will not need to be fixed. | బైక్‌ను బాగు చేయించాల్సిన అవసరం ఉండదు. |
| Will the bike need to be fixed? | బైకును బాగు చేయించాల్సిన అవసరం ఉంటుందా ? |
| Won’t the bike need to be fixed? | బైకును బాగు చేయించాల్సిన అవసరం ఉండదా? |
| 7. We will need to check the list. | 7. మనం జాబితాను తనిఖీ చేయవలసిన అవసరం ఉంటుంది. |
| వీ విల్ నీడ్ టు చెక్ ది లిస్ట్. | |
| The list will need to be checked. | జాబితాను తనిఖీ చేయవలసిన అవసరం ఉంటుంది. |
| The list will not need to be checked. | జాబితాను తనిఖీ చేయవలసిన అవసరం ఉండదు. |
| Will the list need to be checked? | జాబితాను తనిఖీ చేయవలసిన అవసరం ఉంటుందా? |
| Won’t the list need to be checked? | జాబితాను తనిఖీ చేయవలసిన అవసరం ఉండదా.? |
| 8. They will need to repair the gate. | 8. వారు గేటుకు మరమ్మత్తు చేయవలసిన అవసరం ఉంటుంది. |
| దే విల్ నీడ్ టు రిపేర్ ది గేట్. | |
| The gate will need to be repaired. | గేటుకు మరమ్మత్తు చేయించాల్సిన ఉంటుంది. |
| The gate will not need to be repaired. | గేటుకు మరమ్మత్తు చేయవలసిన అవసరం ఉండదు. |
| Will the gate need to be repaired? | గేటుకు మరమ్మత్తు చేయించాల్సిన ఉంటుందా .? |
| Won’t the gate need to be repaired? | గేటుకు మరమ్మత్తు చేయించాల్సిన ఉండదా.? |
| 9. You will need to submit the form. | 9. మీరు ఫారం సమర్పించవలసిన అవసరం ఉంటుంది. |
| యూ విల్ నీడ్ టు సబ్మిట్ ది ఫామ్. | |
| The form will need to be submitted. | ఫారం సమర్పించవలసిన అవసరం ఉంటుంది |
| The form will not need to be submitted. | ఫారం సమర్పించవలసిన అవసరం ఉండదు |
| Will the form need to be submitted? | ఫారం సమర్పించవలసిన అవసరం ఉంటుందా ? |
| Won’t the form need to be submitted? | ఫారం సమర్పించవలసిన అవసరం ఉండదా? |
| 10. I will need to charge the phone. | 10. నేను ఫోన్‌ను ఛార్జ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. |
| ఐ విల్ నీడ్ టు చార్జ్ ది ఫోన్. | |
| The phone will need to be charged. | ఫోన్‌ను ఛార్జ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. |
| The phone will not need to be charged. | ఫోన్‌ను ఛార్జ్ చేయవలసిన అవసరం ఉండదు. |
| Will the phone need to be charged? | ఫోన్‌ను ఛార్జ్ చేయాల్సిన అవసరం ఉంటుందా? |
| Won’t the phone need to be charged? | ఫోన్‌ను ఛార్జ్ చేయాల్సిన అవసరం ఉండదా? |
