ఈ క్రింది టాపిక్స్ పై క్లిక్ చేయండి
Do
Does
Do
Simple present లో Plural subjects అయిన I, We, You, They లు చేసేటువంటి పనులను తెలియజేయడానికి “ Do” మరియు verb1 ఉపయోగిస్తారు.వీటినే action sentences అని కూడా అంటారు.
I/You/We/They + do + verb1+ Object
సింపుల్ ప్రెసెంట్ లో చెప్పేటువంటి సెంటెన్సెస్ అన్నీ కూడా మరలా మరలా రిపీట్ గా జరుగుతూ ఉంటాయి అని అర్థం.రోజు జరగవచ్చు లేదా రెండు రోజులకు ఒకసారి , మూడు రోజులకు ఒకసారి, వారానికి ఒకసారి, నెలకు ఒకసారి, సంవత్సరమునకు ఒక్కసారి అయినా రిపీట్ గా మరలా మరలా జరుగుతూ ఉంటాయి అని అర్థం. క్రింద రిపీట్ గా జరిగే కొన్ని సెంటెన్స్ ఇచ్చాము గమనించండి
క్రింది సెంటెన్సెస్ లో రెడ్ మార్కులో ఉన్నవి verb1.
సింపుల్ ప్రెసెంట్ టెన్స్ లో కేవలం verb1 మాత్రమే ఉపయోగిస్తారు
| 1. They play football every evening. | వారు ప్రతి సాయంత్రం ఫుట్‌బాల్ ఆడతారు |
| దే ప్లే ఫుట్‌బాల్ ఎవ్రీ ఈవ్నింగ్. | |
| 2. We study English every day. | మేము ప్రతిరోజూ ఇంగ్లీష్ చదువుతాము |
| వీ స్టడీ ఇంగ్లిష్ ఎవ్రీ డే. | |
| 3. The boys run fast. | అబ్బాయిలు వేగంగా పరిగెత్తుతారు |
| ద బాయ్స్ రన్ ఫాస్ట్. | |
| 4. The girls sing beautifully. | అమ్మాయిలు చాలా అందంగా పాడతారు |
| ద గర్ల్స్ సింగ్ బ్యూటిఫులీ. | |
| 5. My parents wake up early. | మా తల్లిదండ్రులు ఉదయాన్నే లేస్తారు |
| మై పేరెంట్స్ వేక్ అప్ ఎర్లీ. | |
| 6. My friends help me. | నా స్నేహితులు నాకు సహాయం చేస్తారు |
| మై ఫ్రెండ్స్ హెల్ప్ మీ. | |
| 7. The students read books. | విద్యార్థులు పుస్తకాలు చదువుతారు |
| ద స్టూడెంట్స్ రీడ్ బుక్స్. | |
| 8. The teachers explain lessons clearly. | ఉపాధ్యాయులు పాఠాలను స్పష్టంగా వివరిస్తారు |
| ద టీచర్స్ ఎక్స్‌ప్లేన్ లెసన్స్ క్లియర్లీ. | |
| 9. We drink milk every morning. | మేము ప్రతి ఉదయం పాలు తాగుతాము |
| వీ డ్రింక్ మిల్క్ ఎవ్రీ మార్నింగ్. | |
| 10. They watch television at night. | వారు రాత్రిపూట టెలివిజన్ చూస్తారు |
| దే వాచ్ టెలివిజన్ అట్ నైట్. | |
| 11. The children laugh loudly. | పిల్లలు గట్టిగా నవ్వుతారు |
| ద చిల్డ్రన్ లాఫ్ లౌడ్లీ. | |
| 12. The workers build houses. | కార్మికులు ఇళ్ళు కడతారు |
| ద వర్కర్స్ బిల్డ్ హౌసెస్. | |
| 13. My cousins visit us often. | మా బంధువులు తరచుగా మమ్మల్ని సందర్శిస్తుంటారు |
| మై కజిన్స్ విజిట్ అస్ ఆఫెన్. | |
| 14. The players practice every morning. | ఆటగాళ్లు ప్రతి ఉదయం సాధన చేస్తారు |
| ద ప్లేయర్స్ ప్రాక్టీస్ ఎవ్రీ మార్నింగ్. | |
| 15. We clean our rooms. | మేము మా గదులను శుభ్రం చేస్తాము |
| వీ క్లీన్ అవర్ రూమ్స్. | |
| 16. They cook delicious food. | వారు రుచికరమైన ఆహారాన్ని వండుతారు |
| దే కుక్ డిలిషస్ ఫుడ్. | |
| 17. The birds fly high. | పక్షులు ఎత్తుగా ఎగురుతాయి |
| ద బర్డ్స్ ఫ్లై హై. | |
| 18. The dogs bark at strangers. | కుక్కలు అపరిచితులపై మొరుగుతాయి |
| ద డాగ్స్ బార్క్ అట్ స్ట్రేంజర్స్. | |
| 19. The cats catch mice. | పిల్లులు ఎలుకలను పట్టుకుంటాయి |
| ద క్యాట్స్ క్యాచ్ మైస్. | |
| 20. The farmers grow rice. | రైతులు వరి పండిస్తారు |
| ద ఫార్మర్స్ గ్రో రైస్. | |
| 21. We listen to music. | మేము సంగీతం వింటాము |
| వీ లిసన్ టు మ్యూజిక్. | |
| 22. They speak politely. | వారు మర్యాదగా మాట్లాడతారు |
| దే స్పీక్ పొలైట్‌లీ. | |
| 23. The nurses care for patients. | నర్సులు రోగులను సంరక్షిస్తారు |
| ద నర్సెస్ కేర్ ఫర్ పేషంట్స్. | |
| 24. The doctors treat sick people. | వైద్యులు అనారోగ్యంతో ఉన్నవారికి చికిత్స చేస్తారు |
| ద డాక్టర్స్ ట్రీట్ సిక్ పీపుల్. | |
| 25. My brothers ride bicycles. | నా సోదరులు సైకిళ్ళు తొక్కతారు |
| మై బ్రదర్స్ రైడ్ బైసికల్స్. | |
| 26. Our neighbors greet us warmly. | మా పొరుగువారు మమ్మల్ని ఆప్యాయంగా పలకరిస్తారు |
| అవర్ నైబర్స్ గ్రీట్ అస్ వార్మ్లీ. | |
| 27. The babies sleep well. | పిల్లలు బాగా నిద్రపోతారు |
| ద బేబీస్ స్లీప్ వెల్. | |
| 28. The animals live in forests. | జంతువులు అడవులలో నివసిస్తాయి |
| ద యానిమల్స్ లివ్ ఇన్ ఫారెస్ట్స్. | |
| 29. We enjoy our holidays. | మేము మా సెలవులను ఆనందిస్తాము |
| వీ ఎంజాయ్ అవర్ హాలిడేస్. | |
| 30. They finish their work on time. | వారు తమ పనిని సమయానికి పూర్తి చేస్తారు |
| దే ఫినిష్ దేర్ వర్క్ ఆన్ టైమ్. |
క్రింది ఉదాహరణలు కూడా గమనించండి
| 31.I send it.
(I do send it). |
నేను దీనిని పంపిస్తాను. |
| 32.We work.
(We do work). |
మేము పని చేస్తాము. |
| 33. You see.
(You do see). |
నీవు చూస్తావు. |
| 34. They run.
(They do run). |
వారు పరిగెత్తుతారు. |
నేను దీనిని పంపిస్తాను, మేము పని చేస్తాము, నీవు చూస్తావు, వారు పరిగెత్తుతారు, ఈ పనులన్నీ ఎప్పుడు జరుగుతాయి. సింపుల్ ప్రెసెంట్ టెన్స్ లో ఈ పనులు మరలా మరలా జరుగుతూ వుంటాయి అని అర్దం .
I send it దీని అసలైన రూపం బ్రాకెట్లో ఇవ్వబడింది (I do send it) .కానీ సాధారణంగా మాట్లాడేటప్పుడు do తీసివేసి I send it అని మాట్లాడుతారు. కానీ మనం సబ్జెక్టు పక్కన “Do” ఉంది అని అర్థం చేసుకోవాలి
I send it అనే వాక్యానికి వ్యతిరేక వాక్యం ( Negative sentence) రాసేటప్పుడు మాత్రం “Do” ని ఖచ్చితంగా ఉపయోగించాలి. అప్పుడు I do not send it అవుతుంది.
| సాధారణంగా వ్యతిరేక పదం Not. కానీ Tenses లో వ్యతిరేక వాక్యాలు రాయటానికి ఆయా Tenses కి కేటాయించబడిన సహాయక క్రియల సపోర్ట్ తోటి Not ఉపయోగించాలి.
అయితే సింపుల్ ప్రెసెంట్ టెన్స్ లో Plural సబ్జెక్ట్ అయిన I, We, You, They కేటాయించబడిన సహాయక క్రియ “Do”. కాబట్టి వ్యతిరేకవాక్యంగా మార్చుటకు Do not ఉపయోగించాలి. |
I send it (Positive sentence)
I do not send it ( Negative sentence)
పై రెండు వాక్యాలను ప్రశ్నా వాక్యాలుగా ( Interrogative sentences) మార్చటానికి మొదటి వాక్యంలో సబ్జెక్టు I పక్కనే ఉన్న Do ని, రెండవ వాక్యంలో సబ్జెక్టు ‘I’ ప్రక్కనే ఉన్న Do ని మొదట ఉంచి, చివర క్వశ్చన్ మార్క్ (?) పెడితే సరిపోతుంది.
Do I send it? (పాజిటివ్ సెంటెన్స్ “ఇంట్రాగేటివ్ సెంటెన్స్” గా మారింది)
Do I not send it? ( నెగిటివ్ సెంటెన్స్ అయితే “నెగిటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్” గా మారింది)
ఇప్పుడు పైన ఉన్న వాక్యాలు అన్నిటిని ఒక వరుస క్రమంలో రాసి చూద్దాం
I send it (Positive sentence) (P)
I do not send it ( Negative sentence) (N)
Do I send it? (Interrogative sentence) (I)
Do not I send it? (Negative interrogative sentence) (NI)
పాజిటివ్ సెంటెన్స్ (Positive sentence) అంటే ఏమిటి.? . Positive sentence ని తెలుగులో “సాధారణ వాక్యాలు” అని అంటారు.
క్రింది పట్టికలో హైలెట్ చేసిన మొదటి వాక్యం Positive, రెండవ వాక్యం negative, మూడవ వాక్యం Interrogative, నాలుగవ వాక్యం Negative Interrogative అని గుర్తుపెట్టుకోండి. ఈ పుస్తకం చివరి వరకు ఇదే క్రమం ఉంటుంది. ఓపిక లేకపోతే హైలెట్ చేసిన పాజిటివ్ సెంటెన్స్ అన్నిటిని మొదట చదవండి.
| 1. I send it. (possitive sentence).
ఐ సెండ్ ఇట్. |
నేను దీనిని పంపుతాను. |
| I do not send it .(negative sentence). | నేను దీనిని పంపను. |
| Do I send it? (Interrogative sentence) . | నేను దీనిని పంపుతానా?. |
| Do I not send it? (negative Interrogative sentence). | నేను దీనిని పంపనా?. |
| 2. We work.
వీ వర్క్. |
మేము పని చేస్తాము. |
| We do not work. | మేము పని చేయుము. |
| Do we work? | మేము పని చేస్తామా? |
| Do we not work? | మేము పని చేయమా? |
| 3. You see.
యూ సీ. |
మీరు చూస్తారు. |
| You don’t see. | మీరు చూడరు. |
| Do you see? | మీరు చూస్తారా? |
| Don’t you see? | మీరు చూడరా? |
| 4. They run .
దే రన్. |
వారు పరిగెత్తుతారు. |
| They don’t run. | వారు పరిగెత్తరు. |
| Do they run? | వారు పరిగెత్తుతారా? |
| Don’t they run? | వారు పరిగెత్తరా? |
| 5. I eat breakfast every morning.
ఐ ఈట్ బ్రేక్‌ఫాస్ట్ ఎవ్రీ మార్నింగ్. |
నేను ప్రతి ఉదయం అల్పాహారం తింటాను. |
| I do not eat breakfast every morning . | నేను ప్రతి ఉదయం అల్పాహారం తినను. |
| Do I eat breakfast every morning? | నేను ప్రతి ఉదయం అల్పాహారం తింటానా? |
| Do I not eat breakfast every morning? | నేను ప్రతి ఉదయం అల్పాహారం తిననా? |
| 6. We play cricket on weekends.
వీ ప్లే క్రికెట్ ఆన్ వీకెండ్స్. |
మేము వారాంతాల్లో క్రికెట్ ఆడతాము. |
| We do not play cricket on weekends. | మేము వారాంతాల్లో క్రికెట్ ఆడము. |
| Do we play cricket on weekends? | మేము వారాంతాల్లో క్రికెట్ ఆడతామా? |
| Do we not play cricket on weekends? | మేము వారాంతాల్లో మేము క్రికెట్ ఆడమా? |
| 7.You study for your exams diligently.
యూ స్టడీ ఫర్ యువర్ ఎగ్జామ్స్ డిలిజెంట్‌లీ. |
మీరు మీ పరీక్షల కోసం శ్రద్ధగా చదువుతారు. |
| You do not study for your exams diligently. | మీరు మీ పరీక్షల కోసం శ్రద్ధగా చదవరు. |
| Do you study for your exams diligently? | మీరు మీ పరీక్షలకు శ్రద్ధగా చదువుతారా? |
| Do you not study for your exams diligently? | మీరు మీ పరీక్షల కోసం శ్రద్ధగా చదవరా? |
| 8.They go to the gym regularly.
దే గో టు ది జిమ్ రెగ్యులర్‌లీ. |
వారు క్రమం తప్పకుండా జిమ్ కి వెళ్తారు. |
| They do not go to the gym regularly. | వారు క్రమం తప్పకుండా జిమ్ కి వెళ్లరు. |
| Do they go to the gym regularly? | వారు క్రమం తప్పకుండా జిమ్ కి వెళ్తారా? |
| Do they not go to the gym regularly? | వారు క్రమం తప్పకుండా జిమ్ కి వెళ్ళరా? |
| 9.I read books before bed.
ఐ రీడ్ బుక్స్ బిఫోర్ బెడ్. |
నేను పడుకునే ముందు పుస్తకాలు చదువుతాను. |
| I do not read books before bed . | నేను పడుకునే ముందు పుస్తకాలు చదవను. |
| Do I read books before bed? | నేను పడుకునే ముందు పుస్తకాలు చదువుతానా? |
| Do I not read books before bed? | నేను పడుకునే ముందు పుస్తకాలు చదవనా? |
| 10.We visit our grandparents often.
వీ విజిట్ అవర్ గ్రాండ్‌పేరెంట్స్ ఆఫెన్. |
మేము తరచుగా మా అవ్వతాతలను సందర్శిస్తాము. |
| We do not visit our grandparents often. | మేము తరచుగా మా అవ్వతాతలను సందర్శించము. |
| Do we visit our grandparents often? | మేము తరచుగా మా అవ్వతాతలను సందర్శిస్తామా? |
| Do we not visit our grandparents often? | మేము తరచుగా మా అవ్వతాతలను సందర్శించమా? |
| 11.You cook dinner every evening.
యూ కుక్ డిన్నర్ ఎవ్రీ ఈవెనింగ్. |
మీరు ప్రతి సాయంత్రం రాత్రి భోజనం వండుతారు. (Dinner = రాత్రి భోజనం). |
| You do not cook dinner every evening. | మీరు ప్రతి సాయంత్రం రాత్రి భోజనం వండరు . |
| Do you cook dinner every evening? | మీరు ప్రతి సాయంత్రం రాత్రి భోజనం వండుతారా? |
| Do you not cook dinner every evening? | మీరు ప్రతి సాయంత్రం రాత్రి భోజనం వండరా? |
| 12.They travel to new places every year.
దే ట్రావెల్ టు న్యూ ప్లేసెస్ ఎవ్రీ ఇయర్. |
వారు ప్రతి సంవత్సరం కొత్త ప్రదేశాలకు ప్రయాణం చేస్తారు. |
| They do not travel to new places every year. | వారు ప్రతి సంవత్సరం కొత్త ప్రదేశాలకు ప్రయాణం చేయరు. |
| Do they travel to new places every year? | వారు ప్రతి సంవత్సరం కొత్త ప్రదేశాలకు ప్రయాణం చేస్తారా? |
| Do they not travel to new places every year? | వారు ప్రతి సంవత్సరం కొత్త ప్రదేశాలకు ప్రయాణం చేయరా? |
| 13. I write in my journal daily.
ఐ రైట్ ఇన్ మై జర్నల్ డైలీ. |
నేను రోజూ నా పత్రికలో వ్రాస్తాను. |
| I do not write in my journal daily. | నేను నా పత్రికలో రోజూ వ్రాయను. |
| Do I write in my journal daily? | నేను రోజూ నా జర్నల్‌లో వ్రాస్తానా? |
| Do I not write in my journal daily? | నేను రోజూ నా జర్నల్‌లో వ్రాయనా? |
| 14. We enjoy watching movies together.
వీ ఎంజాయ్ వాచింగ్ మూవీస్ టుగెదర్. |
మేమిద్దరం కలిసి సినిమాలు చూసి ఆనందిస్తాం. |
| We do not enjoy watching movies together. | మేమిద్దరం కలిసి సినిమాలు చూసి ఆనందించం. |
| Do we enjoy watching movies together? | మేము కలిసి సినిమాలు చూసి ఆనందిస్తామా? |
| Do we not enjoy watching movies together? | మేము కలిసి సినిమాలు చూసి ఆనందించమా? |
పైన బ్లూ, రెడ్ కలర్ లో కనిపిస్తున్న Interrogative మరియు Negative Interrogative సెంటెన్సెస్ ముందు WH పదాలు అయిన What ,When,Where,Who,Whom,Whose,Which,Why,How వీటిని అతికిస్తే అవి ఆటోమేటిక్ గా Wh questions గా మారిపోతాయి.
పైన కనిపిస్తున్న వాటిలో when, where, why, How ప్రతి వాక్యానికి ముందు కరెక్ట్ గా సరిపోతాయి. కానీ మిగతావి సందర్భాన్ని బట్టి ఉపయోగించాలి లేకపోతే సరియైన అర్ధాన్ని ఇవ్వవు. మిగతా ప్రశ్న పదాల గురించి Conversation చాప్టర్లో చూడండి
| When do we enjoy watching movies together? | మనం కలిసి సినిమాలు చూడటాన్ని ఎప్పుడు ఆస్వాదిస్తాం? |
| Where do we enjoy watching movies together? | మనం కలిసి సినిమాలు చూడటాన్ని ఎక్కడ ఆస్వాదిస్తాం? |
| Why do we enjoy watching movies together? | మనం కలిసి సినిమాలు చూడటాన్ని ఎందుకు ఆస్వాదిస్తాం? |
| How do we enjoy watching movies together? | మనం కలిసి సినిమాలు చూడటాన్ని ఎలా ఆస్వాదిస్తాం? |
| When do we not enjoy watching movies together? | మనం కలిసి సినిమాలు చూడటం ఎప్పుడు ఆనందించము? |
| Where do we not enjoy watching movies together? | మనం కలిసి సినిమాలు చూడటం ఎక్కడ ఆనందించము? |
| Why do we not enjoy watching movies together? | మనం కలిసి సినిమాలు చూడటం ఎందుకు ఆనందించము? |
| How do we not enjoy watching movies together? | మనం కలిసి సినిమాలు చూడటం ఎలా ఆనందించము? |
♠♠♠♠♠ End ♠♠♠♠♠♠
Does
Simple present లో Singular subjects అయిన He, She, It, That లు చేసేటువంటి పనులను తెలియజేయడానికి “ Does” మరియు verb1 ఉపయోగిస్తారు. కాకపోతే verb కి చివర ‘es’ లేదా ‘s’ లేదా ‘ies’ కలుపుతారు ఈ విషయాన్ని బాగా గుర్తుంచుకోండి. వీటినే action sentences అని కూడా అంటారు.
ముందు చెప్పుకున్నట్లుగానే రిపీట్ గా జరిగే అవకాశం ఉండేటువంటి పనులను మాత్రమే సింపుల్ ప్రెసెంట్ టెన్స్ లో తెలియజేస్తారు.సింపుల్ ప్రెసెంట్ టెన్స్ లో ఈ ఒక్క అర్థం తప్ప మరి ఏ అర్థము ఉండదు .
He/She/It/That + does + verb1 + Object
Examples:
| He goes to college. (He does go to college). | అతను కాలేజీకి వెళ్తాడు. |
| She comes to here. (She does come to here). | ఆమె ఇక్కడికి వస్తుంది. |
| Ramesh asks him. (Ramesh does ask him). | రమేష్ అతనిని అడుగుతాడు. |
పైన ఇవ్వబడిన వాక్యాల యొక్క నిజమైన రూపాలు does అను సహాయక క్రియను ఉపయోగించి బ్రాకెట్లలో ఇవ్వబడి ఉన్నాయి. బ్రాకెట్లలో ఉన్నవే నిజమైన వాక్యాలు.
కానీ సహజంగా Positive sentences మాట్లాడేటప్పుడు Does తీసివేసి verb యొక్క మొదటి రూపానికి “es” లేదా “s” లేదా “ies” కలిపి మాట్లాడతారు.
కానీ Does ఉపయోగించకుండా Negative sentences , మరియు Interrrogative sentences రాయలేము. ఎందుకంటే సహాయక క్రియలు లేకుండా వాటిని నిర్మించలేము
He goes to college.
పై వాక్యానికి వ్యతిరేక వాక్యం రాయుటకు Not తోపాటు సహాయక క్రియ కూడా అవసరం. సబ్జెక్టు అయినా He ప్రక్కనే Does అనే సహాయక క్రియ దాగి ఉంది అని మనం గుర్తించుకోవాలి
| సాధారణంగా వ్యతిరేక పదం Not. కానీ వ్యతిరేక వాక్యాలు రాయటానికి సహాయక క్రియల సపోర్ట్ తోటి Not ఉపయోగించాలి.
అయితే సింపుల్ ప్రెసెంట్ టెన్స్ లో He, She,It లకు Action sentences లో కేటాయించబడిన సహాయక క్రియ Does కాబట్టి వ్యతిరేకవాక్యంగా మార్చుటకు Does not ఉపయోగించాలి. |
అప్పుడు
He does not goes to college అవుతుంది
కానీ నెగిటివ్ సెంటెన్స్ ని ఇలా రాయడం కూడా తప్పు అవుతుంది
ఎందుకంటే, Does మరియు goes రెండింటికి చివర ‘es’ ఉంది. ఇక్కడ Does ఉపయోగించినప్పుడే ఇది సింపుల్ ప్రెసెంట్ టెన్స్ లో ఉన్న సంగతి మనకు అర్థమవుతుంది
ఇక్కడ go అనే వెర్బ్ కి ‘es’ చేర్చడం వలన ఇది కూడా సింపుల్ ప్రెసెంట్ టెన్స్ గురించి తెలియజేస్తుంది. కాబట్టి సహాయక క్రియలు కాలాన్ని తెలియజేస్తున్నప్పుడు verb కి ఆ పని అనవసరం. ఇది గ్రామర్ ప్రకారంగా తప్పు అవుతుంది. కాబట్టి ఇక్కడ ‘go’ కి ఉన్న ‘es’ ని తీసివేస్తాము.
| గ్రామర్ రూల్ ప్రకారం. Do, Does, Did లు వాక్యంలో కనిపించినప్పుడు Verb ఎల్లప్పుడూ మొదటి రూపంలోనే ఉండాలి verb కి s,es,ies, చేర్చకూడదు. అది positive, negative, interrogative and negative interrogative sentence ఏదైనా కావచ్చు. దీన్ని బాగా గుర్తుపెట్టుకోండి . |
అప్పుడు నెగిటివ్ సెంటెన్స్ ని He does not go to college అని రాయాలి.
పై రెండు వాక్యాలను మరల క్రింద రాద్దాము
He goes to college (Positive)
He does not go to college (Negative)
పై పాజిటివ్ సెంటెన్స్ ని ప్రశ్న వాక్యంగా మార్చుటకు సబ్జెక్ట్ అయినా He కి కుడి పక్కనే దాగి ఉన్న Does ని మొదటిలో ఉంచి goes లో ఉన్న es ని తీసివేస్తే సరిపోతుంది.
Does he go to college (I)
పై నెగటివ్ సెంటెన్స్ ని ప్రశ్న వాక్యంగా మార్చుటకు Does ను తీసి సబ్జెక్టు He కి ముందు ఉంచితే సరిపోతుంది
Does he not go to college (NI)
అదేవిధంగా రెండవ మరియు మూడవ వాక్యాలను రాసినట్లయితే
2.She comes to here (PS)
She does not come to here (NS)
Does she come to here ? (IS)
Does she not come to here ? (NIS)
3.Ramesh asks him (PS)
Rmesh does not ask him (NS)
Does Ramesh ask him (IS)
Does Ramesh not ask him (NIS)
Simple present tense లో He,She,It,That లు subject గా వున్నప్పుడు , verb యొక్క మొదటి రూపానికి ‘es’ లేదా ‘s’ లేదా ‘ies’ కలపాలి అని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం.
Rule no.1
Simple present tense లో He, She, It, That లతో వాక్య నిర్మాణం చేయడానికి Verb మొదటి రూపానికి ‘es’ ఎప్పుడు కలపాలి?
ఏవైనా verb లు ch, sh, s, ss, o, x, z లతో ముగించబడితే అటువంటి verbs కు es కలపాలి.
Examples:
| Ending with “ch” | sh | s |
| 1. Watch.
2.Teach. 3.Reach. |
1.Push.
2.Wash. 3.Finish.
|
1.Kiss.
2.Pass. 3.Guess.
|
| ss | o | x |
| 1.Miss.
2.Cross. 3.Toss. |
1.Go.
2.Do. 3.Echo. |
1.Fix.
2.Mix. 3.Relax. |
| z | ||
| 1.Buzz.
2.Fuzz. 3.Jazz.
|
పై పట్టికలో ఉన్న విధంగా verb లు ch, sh, s, ss, o, x, z లతో ముగించబడితే అటువంటి verb లకు అన్నింటికీ చివర es కలపాలి.ఇటువంటివి verbs ఇంకా చాలా ఉంటాయి మీకు అర్థం అవడం కోసం కొన్ని మాత్రమే ఇచ్చాము. ఇప్పుడు పై verbs అన్నిటినీ వాక్యాలలో ఉపయోగించి చూద్దాం.
Examples: ఓపిక వుంటే అన్నీ చదవండి లేకుంటే హైలెట్ చేసిన Positive సెంటెన్స్ అన్నిటిని మొదట చదవండి. తర్వాత Negative, interrogative, negative interrogative లను పరీక్షించండి.
| 1.She watches the sunset every evening .
(She does watch the sunset every evening .) |
ఆమె ప్రతి సాయంత్రం సూర్యాస్తమయాన్ని చూస్తుంది. |
| షీ వాచెస్ ది సన్‌సెట్ ఎవ్రీ ఈవెనింగ్. | |
| She does not watch the sunset every evening . | ఆమె ప్రతి సాయంత్రం సూర్యాస్తమయాన్ని చూడదు. |
| Does she watch the sunset every evening? . | ఆమె ప్రతి సాయంత్రం సూర్యాస్తమయాన్ని చూస్తుందా? |
| Does she not watch the sunset every evening? . | ఆమె ప్రతి సాయంత్రం సూర్యాస్తమయాన్ని చూడదా? |
| 2.He teaches math at the local school.
(He does teach math at the local school.) |
అతను స్థానిక పాఠశాలలో గణితం బోధిస్తాడు. |
| హీ టీచెస్ మ్యాథ్ ఎట్ ది లోకల్ స్కూల్. | |
| He does not teach math at the local school. | అతను స్థానిక పాఠశాలలో గణితం బోధించడు. |
| Does he teach math at the local school?. | అతను స్థానిక పాఠశాలలో గణితాన్ని బోధిస్తాడా? |
| Does he not teach math at the local school?. | అతను స్థానిక పాఠశాలలో గణితాన్ని బోధించడా? |
| 3.She reaches for the top shelf. | ఆమె టాప్ షెల్ఫ్‌కు చేరుకుంటుంది. |
| షీ రీచెస్ ఫర్ ది టాప్ షెల్ఫ్. | |
| She does not reach for the top shelf. | ఆమె టాప్ షెల్ఫ్‌కు చేరుకోదు. |
| Does she reach for the top shelf?. | ఆమె టాప్ షెల్ఫ్‌కు చేరుకుంటుందా? |
| Does she not reach for the top shelf?. | ఆమె టాప్ షెల్ఫ్‌కు చేరుకోదా? |
| 4.He pushes the door . | అతను తలుపు నెడతాడు. |
| హీ పుషెస్ ది డోర్. | |
| He does not push the door . | అతను తలుపు నెట్టడు. |
| Does he push the door? | అతను తలుపు నెడతాడా? |
| Does he not push the door? | అతను తలుపు నెట్టడా? |
| 5.She washes the dishes after dinner. | ఆమె రాత్రి భోజనం తర్వాత గిన్నెలు కడుగుతుంది. |
| షీ వాషెస్ ది డిషెస్ ఆఫ్టర్ డిన్నర్. | |
| She does not wash the dishes after dinner. | ఆమె రాత్రి భోజనం తర్వాత గిన్నెలు కడగదు. |
| Does she wash the dishes after dinner? | రాత్రి భోజనం చేసిన తర్వాత ఆమె గిన్నెలు కడుగుతుందా? |
| Does she not wash the dishes after dinner? | రాత్రి భోజనం చేసిన తర్వాత ఆమె గిన్నెలు కడగదా? |
| 6.He finishes his homework quickly. | అతను తన ఇంటి పనిని త్వరగా పూర్తి చేస్తాడు. |
| హీ ఫినిషెస్ హిస్ హోంవర్క్ క్విక్‌లీ. | |
| He does not finish his homework quickly. | అతను తన ఇంటి పనిని త్వరగా పూర్తి చేయడు. |
| Does he finish his homework quickly? | అతను తన ఇంటి పనిని త్వరగా పూర్తి చేస్తాడా? |
| Does he not finish his homework quickly? | అతను తన ఇంటి పనిని త్వరగా పూర్తి చేయడా? |
| 7.She kisses her child goodnight. | ఆమె తన బిడ్డకు గుడ్నైట్ ముద్దు పెట్టుకుంటుంది. |
| షీ కిసెస్ హర్ చైల్డ్ గుడ్‌నైట్. | |
| She does not kiss her child goodnight. | ఆమె తన బిడ్డకు గుడ్నైట్ ముద్దు పెట్టుకోదు. |
| Does she kiss her child goodnight? | ఆమె తన బిడ్డకు గుడ్నైట్ ముద్దులు పెడుతుందా? |
| Does she not kiss her child goodnight? | ఆమె తన బిడ్డకు గుడ్నైట్ ముద్దు పెట్టుకోదా? |
| 8.He passes the ball to his teammate. | అతను బంతిని తన సహచరుడికి పంపుతాడు. |
| హీ పాసెస్ ది బాల్ టు హిస్ టీమ్‌మేట్. | |
| He does not pass the ball to his teammate. | అతను తన సహచరుడికి బంతిని పంపడు. |
| Does he pass the ball to his teammate? | అతను తన సహచరుడికి బంతిని పంపుతాడా? |
| Does he not pass the ball to his teammate? | అతను తన సహచరుడికి బంతిని పంపడా? |
| 9.She guesses the answer correctly. | ఆమె సమాధానాన్ని సరిగ్గా ఊహిస్తుంది. |
| షీ గెసెస్ ది ఆన్సర్ కరెక్ట్‌లీ. | |
| She does not guess the answer correctly. | ఆమె సమాధానం సరిగ్గా ఊహించదు. |
| Does she guess the answer correctly? | ఆమె సమాధానం సరిగ్గా ఊహిస్తుందా? |
| Does she not guess the answer correctly? | ఆమె సమాధానం సరిగ్గా ఊహించదా? |
| 10.She misses her bus every morning. | ఆమె ప్రతి ఉదయం తన బస్సును కోల్పోతుంది .(మిస్ చేసుకుంటుంది). |
| షీ మిసెస్ హర్ బస్ ఎవ్రీ మార్నింగ్. | |
| She does not miss her bus every morning. | ఆమె ప్రతి ఉదయం తన బస్సును కోల్పోదు. |
| Does she miss her bus every morning? | ఆమె ప్రతి ఉదయం తన బస్సును కోల్పోతుందా? |
| Does she not miss her bus every morning? | ఆమె ప్రతి ఉదయం తన బస్సును కోల్పోదా? |
| 11.He crosses the street carefully. | అతను జాగ్రత్తగా వీధి దాటుతాడు. |
| హీ క్రాసెస్ ది స్ట్రీట్ కేర్‌ఫుల్‌లీ. | |
| He does not cross the street carefully. | అతను జాగ్రత్తగా వీధి దాటడు. |
| Does he cross the street carefully? | అతను జాగ్రత్తగా వీధి దాటుతాడా? |
| Does he not cross the street carefully? | అతను జాగ్రత్తగా వీధి దాటడా? |
| 12.She tosses the paper into the trash. | ఆమె కాగితాన్ని చెత్తబుట్టలోకి విసురుతుంది . |
| షీ టాసెస్ ది పేపర్ ఇంటు ది ట్రాష్. | |
| She does not toss the paper into the trash. | ఆమె కాగితాన్ని చెత్తబుట్టలోకి విసరదు. |
| Does she toss the paper into the trash? | ఆమె కాగితాన్ని చెత్తబుట్టలో పడేస్తుందా? |
| Does she not toss the paper into the trash? | ఆమె కాగితాన్ని చెత్తబుట్టలో వేయదా? |
| 13.He goes to work by bus. | అతను బస్సులో పనికి వెళ్తాడు. |
| హీ గోస్ టు వర్క్ బై బస్. | |
| He does not go to work by bus. | అతను బస్సులో పనికి వెళ్లడు. |
| Does he go to work by bus? | అతను బస్సులో పనికి వెళ్తాడా? |
| Does he not go to work by bus? | అతను బస్సులో పనికి వెళ్లడా? |
| 14.She does her homework every day. | ఆమె ప్రతిరోజూ తన హోంవర్క్ చేస్తుంది. |
| షీ డస్ హర్ హోంవర్క్ ఎవ్రీ డే. | |
| She does not do her homework every day. | ఆమె ప్రతిరోజూ తన హోంవర్క్ చేయదు. |
| Does she do her homework every day? | ఆమె ప్రతిరోజూ తన హోంవర్క్ చేస్తుందా? |
| Does she not do her homework every day? | ఆమె ప్రతిరోజూ తన హోంవర్క్ చేయదా? |
| 15.The sound echoes through the cave. | గుహలో ధ్వని ప్రతిధ్వనిస్తుంది.
Through= ద్వారా, గుండా |
| ది సౌండ్ ఎకోస్ త్రూ ది కేవ్. | |
| The sound does not echo through the cave. | గుహలో ధ్వని ప్రతిధ్వనించదు. |
| Does the sound echo through the cave? | గుహ ద్వారా ధ్వని ప్రతిధ్వనిస్తుందా? |
| Does the sound not echo through the cave? | గుహ గుండా ధ్వని ప్రతిధ్వనించదా? |
| 16.He fixes the broken chair | అతను విరిగిన కుర్చీని సరిచేస్తాడు. |
| హీ ఫిక్సెస్ ది బ్రోకెన్ చెయర్. | |
| He does not fix the broken chair. | అతను విరిగిన కుర్చీని సరిచేయడు. |
| Does he fix the broken chair? | అతను విరిగిన కుర్చీని సరిచేస్తాడా? |
| Does he not fix the broken chair? | అతను విరిగిన కుర్చీని సరిచేయడా? |
| 17.She mixes the ingredients well. | ఆమె పదార్థాలను బాగా కలుపుతుంది. |
| షీ మిక్సెస్ ది ఇంగ్రిడియెంట్స్హీ రిలాక్సెస్ ఆఫ్టర్ ఎ లాంగ్ డే. | |
| She does not mix the ingredients well. | ఆమె పదార్థాలను బాగా కలపదు. |
| Does she mix the ingredients well? | ఆమె పదార్థాలను బాగా కలుపుతుందా? |
| Does she not mix the ingredients well? | ఆమె పదార్థాలను బాగా కలపదా? |
| 18.He relaxes after a long day. | అతను చాలా రోజుల తర్వాత విశ్రాంతి తీసుకుంటాడు. |
| హీ రిలాక్సెస్ ఆఫ్టర్ ఎ లాంగ్ డే. | |
| He does not relax after a long day. | చాలా రోజుల తర్వాత అతను విశ్రాంతి తీసుకోడు . |
| Does he relax after a long day? | అతను చాలా రోజుల తర్వాత విశ్రాంతి తీసుకుంటాడా? |
| Does he not relax after a long day? | చాలా రోజుల తర్వాత అతను విశ్రాంతి తీసుకోడా? |
| 19.The bee buzzes around the flowers. | పువ్వుల చుట్టూ తేనెటీగ సందడి చేస్తుంది. |
| ది బీ బజెస్ అరౌండ్ ది ఫ్లవర్స్. | |
| The bee does not buzz around the flowers. | తేనెటీగ పువ్వుల చుట్టూ సందడి చేయదు. |
| Does the bee buzz around the flowers? | పువ్వుల చుట్టూ తేనెటీగ సందడి చేస్తుందా? |
| Does the bee not buzz around the flowers? | తేనెటీగ పువ్వుల చుట్టూ సందడి చేయదా? |
| 20.He notices the fuzzes on his sweater. | అతను తన స్వెటర్‌పై ఉన్న గజిబిజిని గమనిస్తాడు. |
| హీ నోటిసెస్ ది ఫజెస్ ఆన్ హిస్ స్వెటర్ | |
| He does not notice the fuzz on his sweater. | అతను తన స్వెటర్‌పై ఉన్న గజిబిజిని గమనించడు. |
| Does he notice the fuzz on his sweater? | అతను తన స్వెటర్‌పై ఉన్న గజిబిజిని గమనిస్తాడా? |
| Does he not notice the fuzz on his sweater? | అతను తన స్వెటర్‌పై ఉన్న గజిబిజిని గమనించడా? |
| 21.She plays chess at the club every Friday. | ఆమె ప్రతి శుక్రవారం క్లబ్‌లో చెస్ ఆడుతుంది. |
| షీ ప్లేస్ చెస్ ఎట్ ది క్లబ్ ఎవ్రీ ఫ్రైడే. | |
| She does not play chess at the club every Friday. | ఆమె ప్రతి శుక్రవారం క్లబ్‌లో చెస్ ఆడదు. |
| Does she play chess at the club every Friday? | ఆమె ప్రతి శుక్రవారం క్లబ్‌లో చెస్ ఆడుతుందా? |
| Does she not play chess at the club every Friday? | ఆమె ప్రతి శుక్రవారం క్లబ్‌లో చెస్ ఆడదా? |
Rule No :2
సింపుల్ ప్రెసెంట్ టెన్స్ లో He, She,It,that సబ్జెక్ట్ గా వున్నప్పుడు verb కి చివర ‘s’ ఏ సందర్భంలో కలుపుతారో తెలుసుకుందాం.
ఇంగ్లీష్ అక్షరాలలో రెండు రకాలు ఉన్నాయి అవి
అచ్చులు (Vowels) : A E I O U
హల్లులు (consonants) : B C D F G H J K L M N P Q R S T V W X Y Z
ఏ Verbs లైతే చివర ఒక vowel తోటి మరియు ‘y’ తోటి అంతమవుతాయో అటువంటి verb లకు చివర ‘s’ ని కలుపుతారు. క్రింది verb లను గమనించండి .
| Play | Stay | Enjoy | Obey | Convey |
ఫై verbs ని వాక్యాలలో ఉపయోగించి చూద్దాము.
Examples:
| 1.She plays the piano beautifully (PS)
(She does play the piano beautifully) |
ఆమె పియానోను అందంగా ప్లే చేస్తుంది |
| షీ ప్లేస్ ది పియానో బ్యూటిఫుల్‌లీ. |
|
| She does not play the piano beautifully (NS) | ఆమె పియానోను అందంగా వాయించదు |
| Does she play the piano beautifully? (IS) | ఆమె పియానోను అందంగా ప్లే చేస్తుందా? |
| Does she not play the piano beautifully? (NIS) | ఆమె పియానోను అందంగా వాయించదా? |
| 2.He stays at home on weekends | వారాంతాల్లో ఇంట్లోనే ఉంటాడు |
| హీ స్టేస్ ఎట్ హోమ్ ఆన్ వీకెండ్స్. |
|
| He does not stay at home on weekends | వారాంతాల్లో ఇంట్లో ఉండడు |
| Does he stay at home on weekends? | అతను వారాంతాల్లో ఇంట్లో ఉంటాడా? |
| Does he not stay at home on weekends? | అతను వారాంతాల్లో ఇంట్లో ఉండడా? |
| 3.She enjoys going to the beach | ఆమె బీచ్‌కి వెళ్లడం ఆనందిస్తుంది |
| షీ ఎంజాయ్స్ గోయింగ్ టు ది బీచ్. |
|
| she does not enjoy going to the beach | ఆమె బీచ్‌కి వెళ్లడం ఆనందించదు |
| Does she enjoy going to the beach? | ఆమె బీచ్‌కి వెళ్లడం ఆనందిస్తుందా? |
| Does she not enjoy going to the beach? | ఆమె బీచ్‌కి వెళ్లడం ఆనందించదా? |
| 4.The dog obeys its owner’s commands | కుక్క తన యజమాని ఆదేశాలను పాటిస్తుంది |
| ది డాగ్ ఒబేస్ ఇట్స్ ఓనర్స్ కమాండ్స్. |
|
| The dog does not obey its owner’s commands | కుక్క తన యజమాని ఆదేశాలను పాటించదు |
| Does the dog obey its owner’s commands? | కుక్క తన యజమాని ఆదేశాలను పాటిస్తుందా? |
| Does the dog not obey its owner’s commands? | కుక్క తన యజమాని ఆదేశాలను పాటించదా? |
| 5.He conveys his message clearly | అతను తన సందేశాన్ని స్పష్టంగా తెలియజేస్తాడు |
| హీ కన్వేస్ హిస్ మెసేజ్ క్లియర్‌లీ. |
|
| He does not convey his message clearly | అతను తన సందేశాన్ని స్పష్టంగా తెలియజేయడు |
| Does he convey his message clearly? | అతను తన సందేశాన్ని స్పష్టంగా తెలియజేస్తాడా? |
| Does he not convey his message clearly? | అతను తన సందేశాన్ని స్పష్టంగా తెలియజేయడా? |
Rule No.3
సింపుల్ ప్రెసెంట్ టెన్స్ లో He, She,It,that సబ్జెక్ట్స్ గా వున్నప్పుడు verb మొదటి రూపానికి చివర ‘ies’ ఏ సందర్భంలో కలుపుతారో తెలుసుకుందాం.
ఇంగ్లీష్ అక్షరాలలో రెండు రకాలు ఉన్నాయి అవి
అచ్చులు (Vowels) : A E I O U
హల్లులు( consonants) : B C D F G H J K L M N P Q R S T V W X Y Z
ఏ Verbs అయితే చివర ఒక consonant తోటి మరియు ‘y’ తోటి అంతమవుతాయో అటువంటి verb లకు చివర ‘ies’ ని కలుపుతారు. క్రింది verb లను గమనించండి .
| Study | Hurry | Worry | Fly | Try |
పై verbs ని వాక్యంలో ఉపయోగించు చూద్దాము.
Examples:
| 1.She studies every day (PS)
(She does study every day) |
ఆమె రోజూ చదువుకుంటుంది |
|
|
|
| She does not study every day (NS) | ఆమె రోజూ చదువుకోదు |
| Does she study every day? (IS) | ఆమె రోజూ చదువుతుందా? |
| Does she not study every day?(NIS) | ఆమె రోజూ చదువుకోదా? |
| 2.He hurries to catch the bus | అతను బస్సును పట్టుకోవడానికి తొందరపడతాడు |
| హీ హరీస్ టు క్యాచ్ ది బస్. | |
| He does not hurry to catch the bus | అతను బస్సును పట్టుకోవడానికి తొందరపడడు |
| Does he hurry to catch the bus? | అతను బస్సును పట్టుకోవడానికి తొందర పడతాడా? |
| Does he not hurry to catch the bus? | అతను బస్సును పట్టుకోవడానికి తొందరపడడా? |
| 3.He worries about the exam | అతను పరీక్ష గురించి చింతిస్తాడు. |
| హీ వరీస్ అబౌట్ ది ఎగ్జామ్. | |
| He does not worry about the exam | అతను పరీక్ష గురించి చింతించడు |
| Does he worry about the exam? | అతను పరీక్ష గురించి చింతిస్తాడా? |
| Does he not worry about the exam? | అతను పరీక్ష గురించి చింతించడా? |
| 4.It flies high in the sky | ఇది ఆకాశంలో ఎత్తుగా ఎగురుతుంది |
| ఇట్ ఫ్లైస్ హై ఇన్ ది స్కై | |
| It does not fly high in the sky | ఇది ఆకాశంలో ఎత్తుగా ఎగరదు |
| Does it fly high in the sky? | ఇది ఆకాశంలో ఎత్తుగా ఎగురుతుందా? |
| Does it not fly high in the sky? | ఇది ఆకాశంలో ఎత్తుగా ఎగరదా? |
| 5.She tries her best in every competition | ప్రతి పోటీలో ఆమె తన వంతు (సాధ్యమైనంతగా) ప్రయత్నం చేస్తుంది |
| షీ ట్రైస్ హర్ బెస్ట్ ఇన్ ఎవ్రీ కాంపిటిషన్. | |
| She does not try her best in every competition | ప్రతి పోటీలో ఆమె తన వంతు ప్రయత్నం చేయదు |
| Does she try her best in every competition? | ప్రతి పోటీలో ఆమె తన వంతు ప్రయత్నిస్తుందా? |
| Does she not try her best in every competition? | ప్రతి పోటీలో ఆమె తన వంతు ప్రయత్నం చేయదా? |
Rule No.4:
సింపుల్ ప్రెసెంట్ టెన్స్ లో He,She,It,That
లు సబ్జెక్ట్స్ గా వున్నప్పుడు Verb మొదటి రూపానికి చివర sh, ch, ss, s, o, x, z. y
అక్షరాలలో ఏది లేకపోయినట్లు అయితే ఆ వెర్బ్ కి ‘s’ చేరిస్తే సరిపోతుంది.క్రింది పదాలను చూడండి.
Examples:
| Eat | Visit | Travel | Act | Allow |
| Read | Cook | Write | Agree | Fail |
పైన ఉన్న verbs అన్నింటినీ కూడా వాక్యాలలో ఉపయోగించి చూద్దాము
Examples:
| 1.He eats breakfast every morning.
(He does eat breakfast every morning.) |
అతను రోజూ ఉదయం అల్పాహారం తింటాడు. |
| హీ ఈట్స్ బ్రేక్‌ఫాస్ట్ ఎవ్రీ మార్నింగ్. | |
| He does not eat breakfast every morning. | అతను ప్రతిరోజూ ఉదయం అల్పాహారం తినడు. |
| Does he eat breakfast every morning? | అతను ప్రతి ఉదయం అల్పాహారం తింటాడా? |
| Does he not eat breakfast every morning? | అతను ప్రతి ఉదయం అల్పాహారం తినడా? |
| 2.She reads novels in her free time. | ఖాళీ సమయాల్లో ఆమె నవలలు చదువుతుంది. |
| షీ రీడ్స్ నవెల్స్ ఇన్ హర్ ఫ్రీ టైమ్. | |
| She does not read novels in her free time. | ఖాళీ సమయాల్లో ఆమె నవలలు చదవదు. |
| Does she read novels in her free time? | ఆమె ఖాళీ సమయంలో నవలలు చదువుతుందా? |
| Does she not read novels in her free time? | ఆమె ఖాళీ సమయంలో నవలలు చదవదా? |
| 3.Ramesh visits the garden often. | రమేష్ తరచూ తోటను సందర్శిస్తాడు. |
| రమేష్ విజిట్స్ ది గార్డెన్ ఆఫెన్. | |
| Ramesh does not visit the garden often. | రమేష్ తరచూ తోటను సందర్శించడు |
| Does Ramesh visit the garden often? | రమేష్ తరచూ తోటను సందర్శిస్తాడా.? |
| Does Ramesh not visit the garden often? | రమేష్ తరచూ తోటను సందర్శించడా.? |
| 4.That cooks faster than expected. | ఇది ఊహించిన దాని కంటే వేగంగా ఉడికిస్తుంది. |
| దట్ కుక్స్ ఫాస్టర్ దాన్ ఎక్స్‌పెక్టెడ్. | |
| That does not cook faster than expected. | ఇది ఊహించిన దాని కంటే వేగంగా ఉడికించదు. |
| Does that cook faster than expected? | ఇది ఊహించిన దాని కంటే వేగంగా ఉడికిస్తుందా?. |
| Does that not cook faster than expected? | ఇది ఊహించిన దాని కంటే వేగంగా ఉడికించదా.? |
| 5.He travels to work by bus. | అతను బస్సులో పనికి వెళ్తాడు.(అతను పనికి బస్సులో ప్రయాణిస్తాడు) |
| హీ ట్రావెల్స్ టు వర్క్ బై బస్. | |
| He does not travel to work by bus. | అతను బస్సులో పనికి వెళ్లడు. |
| Does he travel to work by bus? | అతను బస్సులో పనికి వెళ్తాడా? |
| Does he not travel to work by bus? | అతను బస్సులో పనికి వెళ్లడా? |
| 6.She writes articles for a magazine. | ఆమె ఒక మ్యాగజైన్ కోసం వ్యాసాలు రాస్తుంది |
| షీ రైట్స్ ఆర్టికల్స్ ఫర్ ఎ మాగజైన్. | |
| She does not write articles for a magazine. | ఆమె ఒక మ్యాగజైన్ కోసం వ్యాసాలు రాయదు. |
| Does she write articles for a magazine? | ఆమె ఒక మ్యాగజైన్ కోసం వ్యాసాలు రాస్తుందా? |
| Does she not write articles for a magazine? | ఆమె ఒక మ్యాగజైన్ కోసం వ్యాసాలు రాయదా? |
| 7.It acts quickly in emergencies. | ఇది అత్యవసర పరిస్థితుల్లో త్వరగా పనిచేస్తుంది. |
| ఇట్ యాక్ట్స్ క్విక్‌లీ ఇన్ ఎమర్జెన్సీస్. |
|
| It does not act quickly in emergencies. | ఇది అత్యవసర పరిస్థితుల్లో త్వరగా పని చేయదు. |
| Does it act quickly in emergencies? | అత్యవసర పరిస్థితుల్లో ఇది త్వరగా పనిచేస్తుందా? |
| Does it not act quickly in emergencies? | అత్యవసర పరిస్థితుల్లో ఇది త్వరగా పని చేయదా? |
| 8.That agrees with the proposal. | అది ప్రతిపాదనతో ఏకీభవిస్తుంది. |
| దట్ అగ్రీజ్ విత్ ది ప్రపోజల్. | |
| That does not agree with the proposal. | అది ప్రతిపాదనతో ఏకీభవించదు. |
| Does that agree with the proposal? | అది ప్రతిపాదనతో ఏకీభవిస్తుందా.? |
| Does that not agree with the proposal? | అది ప్రతిపాదనతో ఏకీభవించదా.? |
| 9.He allows extra time for assignments. | అతను అసైన్‌మెంట్‌ల కోసం అదనపు సమయాన్ని అనుమతిస్తాడు. |
| హీ అలౌస్ ఎక్స్‌ట్రా టైమ్ ఫర్ అసైన్‌మెంట్స్. | |
| He does not allow extra time for assignments. | అతను అసైన్‌మెంట్‌ల కోసం అదనపు సమయాన్ని అనుమతించడు. |
| Does he allow extra time for assignments? | అతను అసైన్‌మెంట్‌ల కోసం అదనపు సమయాన్ని అనుమతిస్తాడా? |
| Does he not allow extra time for assignments? | అతను అసైన్‌మెంట్‌ల కోసం అదనపు సమయాన్ని అనుమతించడా? |
| 10.Usha fails to understand the concept. | ఉష భావనను అర్థం చేసుకోవడంలో విఫలమైంది. |
| ఉషా ఫెయిల్స్ టు అండర్‌స్టాండ్ ది కాన్సెప్ట్. | |
| Usha does not fail to understand the concept. | ఉష కాన్సెప్ట్‌ని అర్థం చేసుకోవడంలో విఫలం కాలేదు. |
| Does Usha fail to understand the concept? | ఉష భావనను అర్థం చేసుకోవడంలో విఫలమైందా? |
| Does Usha not fail to understand the concept? | ఉష భావనను అర్థం చేసుకోవడంలో విఫలం కాలేదా? |
