Earn, Earned, Earned, Earning

అర్న్, అర్ణ్డ్, అర్ణ్డ్, అర్నింగ్

Earn

అర్న్

సంపాదించడం
1. He earns a good salary from his job. అతను తన ఉద్యోగం నుండి మంచి జీతం సంపాదిస్తాడు.
2. She has earned respect from her colleagues. ఆమె తన సహోద్యోగుల నుండి గౌరవం సంపాదించింది.
3. They are earning more by working overtime. వారు ఓవర్ టైం పని చేస్తూ ఎక్కువ సంపాదిస్తున్నారు.
4. He earned a promotion for his hard work. అతను తన కృషికి ప్రమోషన్ సంపాదించాడు.
Eat, Ate, Eaten, Eating

ఈట్, ఏట్, ఈటెన్, ఈటింగ్

Eat

ఈట్

తినడం
1. She eats breakfast every morning. ఆమె ప్రతి ఉదయం అల్పాహారం తింటుంది.
2. He has eaten the entire pizza. అతను మొత్తం పిజ్జా తిన్నాడు.
3. They are eating lunch together right now. వారు ప్రస్తుతం కలిసి భోజనం చేస్తున్నారు లేదా తింటున్నారు.
4. I ate too much at the party. నేను పార్టీలో చాలా తిన్నాను.
Edit, Edited, Edited, Editing

 ఎడిట్, ఎడిటెడ్, ఎడిటెడ్, ఎడిటింగ్

Edit

 ఎడిట్

సరిచేయడం లేదా సవరించడం
1. Please edit the document before submitting it.
దయచేసి సమర్పించే ముందు పత్రాన్ని సవరించండి
2. He edited the video to improve its quality.
అతను వీడియోను మెరుగుపరచడానికి సవరించాడు.
3. They edit photos using advanced software tools.
వారు ఆధునిక సాఫ్ట్‌వేర్‌తో ఫోటోలను సవరించుతారు.
4. He edited his essay after receiving feedback. అభిప్రాయాన్ని స్వీకరించిన తర్వాత అతను తన వ్యాసాన్ని సవరించాడు.
Educate, Educated, Educated, Educating

 ఎడ్యుకేట్, ఎడ్యుకేటెడ్, ఎడ్యుకేటెడ్, ఎడ్యుకేటింగ్

Educate

ఎడ్యుకేట్

విద్యాబోధ చేయడం..
1. Teachers educate students with knowledge and values.
గురువులు విద్యార్థులకు జ్ఞానం మరియు విలువలను బోధిస్తారు.
2. Parents educate children about good habits daily.
తల్లిదండ్రులు పిల్లలకు మంచి అలవాట్లను రోజూ బోధిస్తారు.
3. They are educating the public about health risks. వారు ఆరోగ్య ప్రమాదాల గురించి ప్రజలకు బొదిస్తున్నారు .
4. The professor educated his students about ancient history. ప్రొఫెసర్ తన విద్యార్థులకు ప్రాచీన చరిత్ర గురించి బొదీంచాడు .
Eject, Ejected, Ejected, Ejecting

 ఇజెక్ట్, ఇజెక్టెడ్, ఇజెక్టెడ్, ఇజెక్టింగ్

Eject

ఇజెక్ట్

 బయటికి పంపివేయడం
1. The machine will eject the card automatically.
యంత్రం కార్డును స్వయంచాలకంగా బయటకు పంపుతుంది.
2. They have ejected the intruder from the building. వారు చొరబాటుదారుని భవనం నుండి బయటకు పంపారు.
3. He is ejecting the tape from the recorder. అతను రికార్డర్ నుండి టేప్‌ను బయటకు తీస్తున్నాడు.
4. The referee ejected the player for misconduct. తప్పుగా ప్రవర్తించినందుకు రిఫరీ ఆటగాడిని బయటికి పంపాడు .
Elaborate, Elaborated, Elaborated, Elaborating

 ఎలాబొరేట్, ఎలాబొరేటెడ్, ఎలాబొరేటెడ్, ఎలాబొరేటింగ్

Elaborate

ఎలాబొరేట్

విశదీకరించడం లేదా వివరించడం
1. Please elaborate your answer with clear examples.
దయచేసి నీ సమాధానాన్ని స్పష్టమైన ఉదాహరణలతో వివరించు.
2. He elaborated the plan during the meeting.
అతను సమావేశంలో ప్రణాళికను వివరంగా చెప్పాడు.
3. He is elaborating his plans to the committee. అతను తన ప్రణాళికలను కమిటీకి వివరిస్తున్నాడు.
4. The speaker elaborated his points clearly. స్పీకర్ తన అంశాలను స్పష్టంగా వివరించాడు.
Elate, Elated, Elated, Elating

 ఎలేట్, ఎలేటెడ్, ఎలేటెడ్, ఎలేటింగ్

Elate

 ఎలేట్

ఉల్లాసపరచడం.
1. The victory elates the whole team. విజయం మొత్తం జట్టును ఉల్లాసపరుస్తుంది.
2. He has elated his parents by winning the award. అతను అవార్డును గెలుచుకోవడం ద్వారా తన తల్లిదండ్రులను ఉల్లాసపరిచాడు.
3. She is elating her friends with the good news. ఆమె తన స్నేహితులను శుభవార్తతో ఉల్లాసపరుస్తోంది.
4. The surprise party elated her. ఆశ్చర్యకరమైన పార్టీ ఆమెను ఉల్లాసపరిచింది.
Elect, Elected, Elected, Electing

ఎలక్ట్, ఎలక్టెడ్, ఎలక్టెడ్, ఎలక్టింగ్

Elect

ఎలక్ట్

ఎన్నుకోవడం
1. They elect a new leader every year. వారు ప్రతి సంవత్సరం కొత్త నాయకుడిని ఎన్నుకుంటారు.
2. She was elected as the chairperson. (passive) ఆమె చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు.
3. We are electing new representatives today. మేము ఈ రోజు కొత్త ప్రతినిధులను ఎన్నుకుంటున్నాము.
4.They elected him as the class leader yesterday.
వారు నిన్న అతన్ని తరగతి నాయకుడిగా ఎన్నుకున్నారు
Elevate, Elevated, Elevated, Elevating

ఎలివేట్, ఎలివేటెడ్, ఎలివేటెడ్, ఎలివేటింగ్

Elevate

ఎలివేట్

ఉన్నత స్థానానికి పెంచడం లేదా ఎత్తడం.
1. Good habits can elevate your standard of living.
మంచి అలవాట్లు నీ జీవన ప్రమాణాన్ని పెంచుతాయి.
2. He elevated his position through hard work.
కష్టపడి పనిచేసి అతను తన స్థాయిని పెంచుకున్నాడు.
3. He is elevating his skills by practicing daily. రోజూ సాధన చేస్తూ తన నైపుణ్యాలను పెంచుకుంటున్నాడు.
4. The platform elevates passengers to higher floors.
ఈ ప్లాట్‌ఫాం ప్రయాణికులను పై అంతస్తులకు తీసుకెళ్తుంది.
Eliminate, Eliminated, Eliminated, Eliminating

ఎలిమినేట్, ఎలిమినేటెడ్, ఎలిమినేటెడ్, ఎలిమినేటింగ్

Eliminate,

ఎలిమినేట్

తీసివేయడం లేదా తొలగించడం.
1. The coach eliminates the weakest player from the team. కోచ్ బలహీనమైన ఆటగాడిని జట్టు నుండి తొలగిస్తాడు.
2. They have eliminated all errors in the report. వారు నివేదికలోని అన్ని లోపాలను తొలగించారు.
3. She is eliminating unnecessary tasks from her schedule. ఆమె తన షెడ్యూల్ నుండి అనవసరమైన పనులను తొలగిస్తోంది.
4. He eliminated all errors before submitting the report.
నివేదికను సమర్పించే ముందు అతను అన్ని తప్పులను తొలగించాడు.
Elope, Eloped, Eloped, Eloping

ఎలోప్, ఎలోప్డ్, ఎలోప్డ్, ఎలోపింగ్

Elope

ఎలోప్

పెళ్లి చేసుకోవడానికి ఇంటి నుండి రహస్యంగా పారిపోవడం.
1. They decided to elope and marry secretly.
వారు రహస్యంగా పెళ్లి చేసుకోవడానికి పారిపోవాలని నిర్ణయించారు.
2. The couple eloped due to family opposition.
కుటుంబ వ్యతిరేకత కారణంగా ఆ జంట పారిపోయింది.
3. He planned to elope with his beloved girl.
అతను తన ప్రియమైన అమ్మాయితో పారిపోవాలని ప్రణాళిక చేశాడు.
4. The couple eloped without telling anyone. దంపతులు ఎవరికీ చెప్పకుండా పారిపోయారు.
Embed, Embedded, Embedded, Embedding

ఎంబెడ్, ఎంబెడ్డెడ్, ఎంబెడ్డెడ్, ఎంబెడ్డింగ్

Embed

ఎంబెడ్

లోపల అమర్చడం లేదా నాటడం..
1. They embed the information into the report. వారు సమాచారాన్ని నివేదికలో అమర్చారు .
2. Values should be embedded in children from childhood.
చిన్నప్పటి నుంచే పిల్లల్లో విలువలు నాటాలి.
3. He is embedding the software in the system. అతను సాఫ్ట్‌వేర్‌ను సిస్టమ్‌లో అమర్చుతున్నాడు.
4. The jewels were embedded in the crown. ఆభరణాలు కిరీటంలో అమర్చ బడ్డాయి.
Embroider, Embroidered, Embroidered, Embroidering

ఎంబ్రాయిడర్, ఎంబ్రాయిడెడ్, ఎంబ్రాయిడెడ్, ఎంబ్రాయిడరింగ్

Embroider

ఎంబ్రాయిడర్

బట్టలపై  కుట్టు మిషన్ తో డిసైన్ వేయడం.
1. She embroiders intricate patterns on the fabric. ఆమె బట్టపై క్లిష్టమైన నమూనాలను ఎంబ్రాయిడరీ చేస్తుంది.
2. They have embroidered the company logo on the uniforms. వారు యూనిఫామ్‌లపై కంపెనీ లోగోను ఎంబ్రాయిడరీ చేశారు.
3. He is embroidering a beautiful design on the tablecloth. అతను టేబుల్‌క్లాత్‌పై అందమైన డిజైన్‌ను ఎంబ్రాయిడరీ చేస్తున్నాడు.
4. The dress was embroidered with delicate flowers. దుస్తులు సున్నితమైన పువ్వులతో ఎంబ్రాయిడరీ చేయబడ్డాయి.

 

Emerge, Emerged, Emerged, Emerging

ఎమర్జ్, ఎమర్జ్డ్, ఎమర్జ్డ్, ఎమర్జింగ్

Emerge

ఎమర్జ్

ఉద్బవించడం
1. The sun emerges from behind the clouds. మేఘాల వెనుక నుండి సూర్యుడు ఉద్భవించాడు.
2. She has emerged as a strong leader in the company. ఆమె కంపెనీలో బలమైన నాయకురాలిగా ఎదిగింది లేదా ఉద్బవించింది.
3. The new trends are emerging in the fashion industry. ఫ్యాషన్ పరిశ్రమలో కొత్త పోకడలు పుట్టుకొస్తున్నాయి లేదా ఉద్బనిస్తున్నాయి.
4. He emerged victorious after the long battle. సుదీర్ఘ యుద్ధం తర్వాత అతను విజేతగా నిలిచాడు లేదా ఉద్బవించాడు.
Emigrate, Emigrated, Emigrated, Emigrating

ఎమిగ్రేట్, ఎమిగ్రేటెడ్, ఎమిగ్రేటెడ్, ఎమిగ్రేటింగ్

Emigrate

ఎమిగ్రేట్

వలస వెళ్ళుట.
1. They will  emigrate to Canada in search of a better life. వారు మెరుగైన జీవితాన్ని వెతుక్కుంటూ కెనడాకు వలసపోతారు.
2. She has emigrated from her home country years ago. ఆమె తన స్వదేశం నుండి సంవత్సరాల క్రితం వలస వచ్చింది.
3. Many families are emigrating due to the economic situation. ఆర్థిక పరిస్థితి కారణంగా చాలా కుటుంబాలు వలస వెళ్తున్నాయి.
4. He emigrated after receiving a job offer abroad. విదేశాల్లో ఉద్యోగం రావడంతో వలస వెళ్లాడు.
Employ, Employed, Employed, Employing

ఎంప్లాయ్, ఎంప్లాయ్డ్, ఎంప్లాయ్డ్, ఎంప్లాయింగ్

Empower, Empowered, Empowered, Empowering

ఎంపవర్, ఎంపవర్డ్, ఎంపవర్డ్, ఎంపవరింగ్

Empower

ఎంపవర్

అధికారం ఇవ్వడం.
1. The manager empowers his team to make decisions. నిర్ణయాలు తీసుకునేందుకు మేనేజర్ తన బృందానికి అధికారం ఇస్తాడు.
2. She has empowered her employees to take on new challenges. కొత్త సవాళ్లను స్వీకరించడానికి ఆమె తన ఉద్యోగులకు అధికారం ఇచ్చింది.
3. They are empowering local communities through education. వారు విద్య ద్వారా స్థానిక సంఘాలను శక్తివంతం చేస్తున్నారు లేదా అదికారం ఇస్తున్నారు.
4. He was empowered to act on behalf of the company. (passive) అతనికి  కంపెనీ తరపున పని చేయడానికి అధికారం ఇవ్వబడింది
Empty, Emptied, Emptied, Emptying

ఎంప్టీ, ఎంప్టీడ్, ఎంప్టీడ్, ఎంప్టీయింగ్

Empty

ఎంప్టీ

ఖాళీచేయడం
1. She empties the trash every morning. ఆమె ప్రతి ఉదయం చెత్తను ఖాళీ చేస్తుంది.
2. They have emptied the room before redecorating. వారు తిరిగి అలంకరించే ముందు గదిని ఖాళీ చేశారు.
3. Please empty the bag before entering the room.
గదిలోకి వెళ్లే ముందు బ్యాగ్‌ను ఖాళీ చేయండి.
4. The container was emptied before being cleaned. కంటైనర్ శుభ్రం చేయడానికి ముందు ఖాళీ చేయబడింది.
Emulate, Emulated, Emulated, Emulating

ఎమ్యులేట్, ఎమ్యులేటెడ్, ఎమ్యులేటెడ్, ఎమ్యులేటింగ్

Emulate

ఎమ్యులేట్

అనుకరించుట
1. Students try to emulate great leaders in life.
విద్యార్థులు జీవితంలో గొప్ప నాయకులను అనుసరించడానికి ప్రయత్నిస్తారు.
2. She has emulated her role model throughout her career. ఆమె తన కెరీర్ మొత్తంలో ఆమె రోల్ మోడల్‌ను అనుకరించింది.
3. They are emulating the strategies used by successful companies. విజయవంతమైన కంపెనీలు ఉపయోగించే వ్యూహాలను వారు అనుకరిస్తున్నారు.
4. Children emulate their parents in daily habits.
పిల్లలు తమ రోజువారీ అలవాట్లలో తల్లిదండ్రులను అనుకరిస్తారు.
Enable, Enabled, Enabled, Enabling

ఎనేబుల్, ఎనేబుల్డ్, ఎనేబుల్డ్, ఎనేబులింగ్

Enable

ఎనేబుల్

సాద్యం చేయడం .
1. Education enables people to achieve their dreams.
విద్య ప్రజలకు తమ కలలను సాధించడానికి సాద్యం చేస్తుంది.
2. This feature enables users to access data easily.
ఈ ఫీచర్ వినియోగదారులకు డేటాను సులభంగా పొందేలా సాద్యం చేస్తుంది.
3. Hard work enables success in every field.
కష్టపడి పనిచేయడం ప్రతి రంగంలో విజయాన్ని సాధ్యం చేస్తుంది.
4. Technology enables communication across long distances.
సాంకేతికత దూర ప్రాంతాల్లో కమ్యూనికేషన్‌ను సాధ్యం చేస్తుంది.
Encage, Encaged, Encaged, Encaging

ఎన్‌కేజ్, ఎన్‌కేజ్డ్, ఎన్‌కేజ్డ్, ఎన్‌కేజింగ్

Encage

ఎన్‌కేజ్

పంజరంలో బంధించడం లేదా బంధించడం.
1. They encage the birds to keep them safe. వారు పక్షులను సురక్షితంగా ఉంచడానికి వాటిని పంజరంలో బందించారు.
2. The animals have been encaged for transport. జంతువులు రవాణా కోసం బంధించబడ్డాయి.
3. He is encaging the wild animals for research purposes. అతను పరిశోధన ప్రయోజనాల కోసం అడవి జంతువులను బందిస్తున్నాడు.
4. The zoo encaged the tigers in a secure area. జూ పులులను సురక్షిత ప్రాంతంలో బంధించింది.
Enclose, Enclosed, Enclosed, Enclosing

ఎన్‌క్లోజ్, ఎన్‌క్లోజ్డ్, ఎన్‌క్లోజ్డ్, ఎన్‌క్లోజింగ్

Enclose

ఎన్‌క్లోజ్

జతచేయడం లేదా మూసివేయడం
1. He encloses a check with the letter. అతను లేఖతో చెక్కును జతచేస్తాడు.
2. The garden has been enclosed by tall hedges. తోట పొడవాటి ముళ్లతో మూసివేయబడి  ఉంది.
3. She is enclosing important documents in the package. ఆమె ప్యాకేజీలో ముఖ్యమైన పత్రాలను జతచేస్తోంది.
4. The entire area was enclosed to prevent trespassing. అతిక్రమించకుండా నిరోధించడానికి మొత్తం ప్రాంతం మూసివేయబడింది.
Encounter, Encountered, Encountered, Encountering

ఎన్‌కౌంటర్, ఎన్‌కౌంటర్డ్, ఎన్‌కౌంటర్డ్, ఎన్‌కౌంటరింగ్

Encounter

ఎన్‌కౌంటర్

ఎదుర్కోవడం
1. We may encounter problems during the journey.
ప్రయాణంలో మనం సమస్యలను ఎదుర్కోవచ్చు.
2. He encountered many difficulties in his early life.
అతను తన ప్రారంభ జీవితంలో అనేక కష్టాలను ఎదుర్కొన్నాడు.
3. She is encountering new cultures while traveling. ప్రయాణంలో ఆమె కొత్త సంస్కృతులను ఎదుర్కొంటోంది.
4. They encountered a wild animal on their hike. వారు తమ పాదయాత్రలో ఒక అడవి జంతువును ఎదుర్కొన్నారు.
Encourage, Encouraged, Encouraged, Encouraging

ఎన్‌కరేజ్, ఎన్‌కరేజ్డ్, ఎన్‌కరేజ్డ్, ఎన్‌కరేజింగ్

Encourage

ఎన్‌కరేజ్

ప్రోత్సహించడం
1. The teacher encourages her students to pursue their dreams. ఉపాధ్యాయుడు తన విద్యార్థులను వారి కలలను కొనసాగించమని ప్రోత్సహిస్తాడు.
2. They have encouraged each other through tough times. వారు కష్ట సమయాల్లో ఒకరినొకరు ప్రోత్సహించుకున్నారు.
3. The community is encouraging new initiatives for growth. కమ్యూనిటీ వృద్ధి కోసం కొత్త కార్యక్రమాలను ప్రోత్సహిస్తోంది.
4. His positive attitude is encouraging everyone around him. అతని సానుకూల వైఖరి అతని చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరినీ ప్రోత్సహిస్తుంది.
Endanger, Endangered, Endangered, Endangering

ఎండేంజర్, ఎండేంజర్డ్, ఎండేంజర్డ్, ఎండేంజరింగ్

Endanger

ఎండేంజర్

ప్రమాదంలో పెట్టడం

1. Smoking can endanger your health in many ways.
ధూమపానం నీ ఆరోగ్యాన్ని అనేక విధాలుగా ప్రమాదంలో పెడుతుంది.
2. Pollution endangers the lives of animals and humans.
కాలుష్యం జంతువుల మరియు మనుషుల జీవితాలను ప్రమాదంలో పెడుతుంది.
3. Reckless driving may endanger others on the road.
నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం రోడ్డుపై ఇతరులను ప్రమాదంలో పడేయవచ్చు.
4. Cutting trees can endanger the balance of nature.
చెట్లు నరుకడం ప్రకృతి సమతౌల్యాన్ని ప్రమాదంలో పెడుతుంది.
Endorse, Endorsed, Endorsed, Endorsing

ఎండోర్స్, ఎండోర్స్డ్, ఎండోర్స్డ్, ఎండోర్సింగ్

Endorse

ఎండోర్స్

ఆమోదించడం
1. The celebrity endorses the new product in advertisements. సెలబ్రిటీలు ప్రకటనలలో కొత్త ఉత్పత్తిని ఆమోదించారు.
2. They have endorsed the candidate for the upcoming election. వారు రాబోయే ఎన్నికల కోసం అభ్యర్థిని ఆమోదించారు.
3. The organization is endorsing several initiatives for community development. సంఘం అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలను ఆమోదిస్తూంది .
4. He endorsed the decision taken by the committee.
కమిటీ తీసుకున్న నిర్ణయాన్ని అతను ఆమోదించాడు.

 

Enforce, Enforced, Enforced, Enforcing

ఎన్‌ఫోర్స్, ఎన్‌ఫోర్స్డ్, ఎన్‌ఫోర్స్డ్, ఎన్‌ఫోర్సింగ్

Enforce

ఎన్‌ఫోర్స్

అమలు చేయడం
1. The police enforce the traffic laws strictly. పోలీసులు ట్రాఫిక్ చట్టాలను కఠినంగా అమలు చేస్తారు.
2. They have enforced the new regulations in the workplace. వారు కార్యాలయంలో కొత్త నిబంధనలను అమలు చేశారు.
3. The government is enforcing stricter measures to protect the environment. పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వం కఠిన చర్యలను అమలు చేస్తోంది.
4. She is enforcing discipline in her classroom. ఆమె తన తరగతి గదిలో క్రమశిక్షణను అమలు చేస్తోంది.
Engage, Engaged, Engaged, Engaging

ఎన్‌గేజ్, ఎన్‌గేజ్డ్, ఎన్‌గేజ్డ్, ఎన్‌గేజింగ్

Engage

ఎన్‌గేజ్

పాల్గొనడం లేదా నిమగ్నం చేయడం.
1. Students engage in activities to learn new skills.
విద్యార్థులు కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడానికి కార్యకలాపాలలో పాల్గొంటారు.
2. They have engaged in a lively discussion about politics. వారు రాజకీయాల గురించి సజీవ చర్చలో నిమగ్నమై ఉన్నారు.
3. TThey engage in discussions to share their ideas.
వారు తమ ఆలోచనలను పంచుకోవడానికి చర్చల్లో పాల్గొంటారు.
4. She is engaging her students with interactive lessons. ఆమె తన విద్యార్థులను ఇంటరాక్టివ్ పాఠాలతో నిమగ్నం చేస్తోంది.
Enjoy, Enjoyed, Enjoyed, Enjoying

ఎన్‌జాయ్, ఎన్‌జాయిడ్, ఎన్‌జాయిడ్, ఎన్‌జాయింగ్

Enjoy

ఎన్‌జాయ్

ఆనందంను ఆస్వాదించడం.
1. They enjoy the beauty of nature during their hike. వారు తమ పాదయాత్రలో ప్రకృతి అందాలను ఆస్వాదిస్తారు.
2. She has enjoyed the concert immensely. ఆమె కచేరీని విపరీతంగా ఆస్వాదించింది.
3. He is enjoying a relaxing day at the beach. అతను బీచ్‌లో రిలాక్సింగ్ డేని ఎంజాయ్ చేస్తున్నాడు.
4. The children enjoy playing in the park after school. పిల్లలు పాఠశాల తర్వాత పార్కులో ఆడటం ఎంజాయ్ చేస్తారు.
Enlarge, Enlarged, Enlarged, Enlarging

ఎన్‌లార్జ్, ఎన్‌లార్జ్డ్, ఎన్‌లార్జ్డ్, ఎన్‌లార్జింగ్

Enlarge

ఎన్‌లార్జ్

 పెద్దదిగా చేయడం..
1. Please enlarge the image for better visibility.
మంచి కనిపించడానికి చిత్రాన్ని పెద్దదిగా చేయండి.
2. The company has enlarged its office space recently. కంపెనీ ఇటీవల తన కార్యాలయ స్థలాన్ని విస్తరించింది.
3. They enlarged the house to add more rooms.
మరిన్ని గదులు చేర్చడానికి వారు ఇంటిని పెద్దదిగా చేశారు.
4. He is enlarging the scope of the project to include more participants. అతను ఎక్కువ మంది పాల్గొనేవారిని చేర్చడానికి ప్రాజెక్ట్ యొక్క పరిధిని విస్తరిస్తున్నాడు.
Enlighten, Enlightened, Enlightened, Enlightening

ఎన్‌లైట్‌న్, ఎన్‌లైట్‌న్డ్, ఎన్‌లైట్‌న్డ్, ఎన్‌లైట్‌నింగ్

Enlighten

ఎన్‌లైట్‌న్

అవగాహన కల్పించడం 
1. The teacher enlightens her students about history. ఉపాధ్యాయుడు తన విద్యార్థులకు చరిత్ర గురించి అవగాహన  చేస్తాడు.
2. Books enlighten people about life and values.
పుస్తకాలు జీవితం మరియు విలువల గురించి ప్రజలకు అవగాహన కలిగిస్తాయి.
3. He enlightened us about the importance of education.
అతను విద్య యొక్క ప్రాముఖ్యత గురించి మాకు అవగాహన కలిగించాడు.
Enquire, Enquired, Enquired, Enquiring

ఎన్‌క్వైర్, ఎన్‌క్వైర్డ్, ఎన్‌క్వైర్డ్, ఎన్‌క్వైరింగ్

Enquire

ఎన్‌క్వైర్

దర్యాప్తు చేయడం  లేదా ఆరా తీయడం
1. She enquires about the new policies at work. ఆమె పనిలో ఉన్న కొత్త పాలసీల గురించి ఆరా తీస్తుంది.
2. They have enquired about the status of their application. వారు తమ దరఖాస్తు స్థితి గురించి ఆరా తీశారు.
3. He is enquiring into the reasons for the delay. ఆలస్యానికి గల కారణాలపై ఆయన ఆరా తీస్తున్నారు.
4. The student is enquiring about the course requirements. విద్యార్థి కోర్సు అవసరాల గురించి ఆరా తీస్తున్నారు.
Enrage, Enraged, Enraged, Enraging

ఎన్‌రేజ్, ఎన్‌రేజ్డ్, ఎన్‌రేజ్డ్, ఎన్‌రేజింగ్

Enrage

ఎన్‌రేజ్

కోపం తెప్పించడం.
1. The news enrages the public. వార్త ప్రజలకు కోపం తెప్పిస్తుంది.
2. They have enraged the community with their decision. వారు తమ నిర్ణయంతో సంఘానికి కోపం తెప్పించారు.
3. His comments are enraging many people. అతని వ్యాఖ్యలు చాలా మందికి కోపం తెప్పిస్తున్నాయి.
4. She is enraging her coworkers with constant criticism. ఆమె తన సహోద్యోగులను నిరంతర విమర్శలతో కోపం తెప్పిస్తున్నది.
Enrich, Enriched, Enriched, Enriching

ఎన్‌రిచ్, ఎన్‌రిచ్డ్, ఎన్‌రిచ్డ్, ఎన్‌రిచింగ్

Enrich

ఎన్‌రిచ్

ఏదైనా నాణ్యతను మెరుగుపరచడం. 
1. The program enriches the students’ knowledge. కార్యక్రమం విద్యార్థుల జ్ఞానాన్ని మెరుగుపరుస్తుంది.
2. Education can enrich your knowledge and skills.
విద్య నీ జ్ఞానం మరియు నైపుణ్యాలను మెరుగుపరుస్తుంది.
3.Good habits enrich your life in many ways.
మంచి అలవాట్లు నీ జీవితాన్ని అనేక విధాలుగా మెరుగుపరుస్తాయి.
Enroll, Enrolled, Enrolled, Enrolling

ఎన్‌రోల్, ఎన్‌రోల్డ్, ఎన్‌రోల్డ్, ఎన్‌రోలింగ్

Enroll

ఎన్‌రోల్

నమోదు చేయడం లేదా  చేరడం,.
1. Students enroll in courses to gain knowledge.
విద్యార్థులు జ్ఞానం పొందడానికి కోర్సుల్లో చేరుతారు.
2. They have enrolled a record number of students this year. ఈ సంవత్సరం వారు రికార్డు స్థాయిలో విద్యార్థులను నమోదు చేసుకున్నారు.
3. He is enrolling in a language course to improve his skills. అతను తన నైపుణ్యాలను మెరుగుపరచుకోవడానికి భాషా కోర్సులో నమోదు చేసుకుంటున్నాడు.
4. He enrolled in a training program last month.
అతను గత నెలలో ఒక శిక్షణ కార్యక్రమంలో చేరాడు.
Enter, Entered, Entered, Entering

ఎంటర్, ఎంటర్డ్, ఎంటర్డ్, ఎంటరింగ్

Enter

ఎంటర్

ప్రవేశించడం
1. They enter the building through the main door. వారు ప్రధాన తలుపు ద్వారా భవనంలోకి ప్రవేశిస్తారు.
2. She has entered the competition to showcase her talent. ఆమె తన ప్రతిభను ప్రదర్శించడానికి పోటీలో ప్రవేశించింది.
3. He is entering the data into the system. అతను సిస్టమ్‌లోకి డేటాను ప్రవేశ పెడుతున్నాడు.
4. The students are entering the classroom quietly. విద్యార్థులు ప్రశాంతంగా తరగతి గదిలోకి ప్రవేశిస్తున్నారు.
Entertain, Entertained, Entertained, Entertaining

ఎన్‌టర్టైన్, ఎన్‌టర్టైన్డ్, ఎన్‌టర్టైన్డ్, ఎన్‌టర్టైనింగ్

Entertain

ఎన్‌టర్టైన్

వినోదం లేదా  అలరించుట
1. They entertain their guests with music and dance. వారు తమ అతిథులను సంగీతం మరియు నృత్యంతో అలరిస్తారు.
3. He is entertaining the notion of traveling abroad. అతను విదేశాలకు వెళ్లడం అనే భావనను అలరిస్తోంది.
4. The show is entertaining the audience with its humor. ఈ కార్యక్రమం హాస్యంతో ప్రేక్షకులను అలరిస్తోంది.

 

Equalize, Equalized, Equalized, Equalizing

ఈక్వలైజ్, ఈక్వలైజ్డ్, ఈక్వలైజ్డ్, ఈక్వలైజింగ్

Equalize

ఈక్వలైజ్

సమానంగా చేయడం
1. The team tried to equalize the score quickly.
జట్టు స్కోరును త్వరగా సమానంగా చేయడానికి ప్రయత్నించింది.
2. We must equalize resources among all departments.
మనం అన్ని విభాగాల మధ్య వనరులను సమానంగా చేయాలి.
3. He is equalizing the differences in the scores. అతను స్కోర్‌లలో తేడాలను సమం చేస్తున్నాడు.
4. The new policy is equalizing benefits for employees. కొత్త విధానం ఉద్యోగుల ప్రయోజనాలను సమం చేస్తోంది.
Eradicate, Eradicated, Eradicated, Eradicating

ఎరాడికేట్, ఎరాడికేటెడ్, ఎరాడికేటెడ్, ఎరాడికేటింగ్

Eradicate

ఎరాడికేట్

పూర్తిగా నిర్మూలించడం.
1. Governments aim to eradicate poverty from the country.
ప్రభుత్వాలు దేశంలో పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించడానికి లక్ష్యంగా పెట్టుకుంటాయి.
2. She has eradicated all doubts about her abilities. ఆమె తన సామర్ధ్యాల గురించి అన్ని సందేహాలను నిర్మూలించింది.
3. We must eradicate bad habits from our daily life.
మనం రోజువారీ జీవితంలో చెడు అలవాట్లను పూర్తిగా తొలగించాలి.
4. The doctors are eradicating the disease through vaccination. వైద్యులు వ్యాక్సినేషన్ ద్వారా వ్యాధిని నిర్మూలిస్తున్నారు.
Erase, Erased, Erased, Erasing

ఎరేజ్, ఎరేజ్డ్, ఎరేజ్డ్, ఎరేజింగ్

Erase

ఎరేజ్

తుడిచివేయడం.
1. They erase mistakes from the document. వారు పత్రం నుండి తప్పులను తుడిచివేస్తారు.
2. Please erase the board after finishing the class.
తరగతి పూర్తయ్యాక బోర్డును తుడిచివేయండి.
3. He is erasing the chalkboard before class. అతను క్లాస్‌కు ముందు చాక్‌బోర్డ్‌ను చెరిపివేస్తున్నాడు.
4. The software is erasing old files from the system. సాఫ్ట్‌వేర్ సిస్టమ్ నుండి పాత ఫైల్‌లను తొలగిస్తోంది.
5. He erased the wrong answer from the paper.
అతను కాగితంపై ఉన్న తప్పు సమాధానాన్ని తుడిచివేశాడు.
Err, Erred, Erred, Erring

ఎర్, ఎర్డ్, ఎర్డ్, ఎరింగ్

Err

ఎర్

తప్పు చేయడం.
1. They often err in their calculations. వారు తరచుగా వారి లెక్కలలో తప్పులు చేస్తారు.
2. Humans often err while making quick decisions.
త్వరగా నిర్ణయాలు తీసుకునే సమయంలో మనుషులు తరచుగా తప్పులు చేస్తారు.
3. He is erring by not following the instructions. అతను సూచనలను పాటించకుండా తప్పు చేస్తున్నాడు.
4. We may err if we do not think carefully.
జాగ్రత్తగా ఆలోచించకపోతే మనం తప్పు చేయవచ్చు.
Erupt, Erupted, Erupted, Erupting

ఎరప్ట్, ఎరప్టెడ్, ఎరప్టెడ్, ఎరప్టింగ్

Erupt

ఎరప్ట్

పేలిపోవడం లేదా ఒక్కసారిగా బయటపడడం..
1. The volcano may erupt without any warning signs.
అగ్నిపర్వతం ఎలాంటి హెచ్చరిక లేకుండా పేలిపోవచ్చు.
2. Anger can erupt suddenly during heated arguments.
వేడెక్కిన వాదనల్లో కోపం ఒక్కసారిగా బయటపడవచ్చు.
3. Violence may erupt if the situation worsens further.
పరిస్థితి మరింత చెడితే హింస ఒక్కసారిగా బయటపడవచ్చు.
Escape, Escaped, Escaped, Escaping

ఎస్కేప్, ఎస్కేప్డ్, ఎస్కేప్డ్, ఎస్కేపింగ్

Escape

ఎస్కేప్

తప్పించుకోవడం
1. The prisoner escapes from the jail. ఖైదీ జైలు నుండి తప్పించుకుంటాడు.
2. She has escaped danger several times. ఆమె చాలాసార్లు ప్రమాదం నుండి తప్పించుకుంది.
3. They are escaping the chaos of the city. వారు నగరం యొక్క గందరగోళం నుండి తప్పించుకుంటున్నారు.
4. He escaped from the burning building just in time. అతను సమయానికి కాలుతున్న భవనం నుండి తప్పించుకున్నాడు.
Escort, Escorted, Escorted, Escorting

ఎస్కార్ట్, ఎస్కార్టెడ్, ఎస్కార్టెడ్, ఎస్కార్టింగ్

Escort

ఎస్కార్ట్,

తోడుగా తీసుకెళ్లడం లేదా రక్షణగా తీసుకెళ్లడం.
1. olice escort the VIP to the event safely.
పోలీసులు VIPను కార్యక్రమానికి సురక్షితంగా తీసుకెళ్తారు.
2. He escorted his friend to the bus stop.
అతను తన స్నేహితుడిని బస్ స్టాప్‌కి తోడుగా తీసుకెళ్లాడు.
3. He is escorting the students on a field trip. అతను ఫీల్డ్ ట్రిప్‌లో విద్యార్థులను తోడుగా తీసుకెళుతున్నాడు 
4. She escorted the child across the busy road.
ఆమె రద్దీ రోడ్డును పిల్లవాడిని తోడుగా తీసుకెళ్లింది.
Establish, Established, Established, Establishing

ఎస్టాబ్లిష్, ఎస్టాబ్లిష్డ్, ఎస్టాబ్లిష్డ్, ఎస్టాబ్లిషింగ్

Establish

ఎస్టాబ్లిష్

ఏదైనా స్థాపించడం
1. They will  establish a new branch in the city. వారు నగరంలో కొత్త శాఖను స్థాపిస్తారు.
2. She has established a successful business. ఆమె విజయవంతమైన వ్యాపారాన్ని స్థాపించింది.
3. He is establishing rules for the game. అతను ఆట కోసం నియమాలను ఏర్పాటు చేస్తున్నాడు లేదా స్థాపిస్తున్నాడు.
4. They plan to establish a new school soon.
వారు త్వరలో ఒక కొత్త పాఠశాలను స్థాపించాలని ప్రణాళిక చేస్తున్నారు.
Evacuate, Evacuated, Evacuated, Evacuating

ఎవాక్యుయేట్, ఎవాక్యుయేటెడ్, ఎవాక్యుయేటెడ్, ఎవాక్యుయేటింగ్

Evacuate

ఎవాక్యుయేట్

ఖాళీచేయించడం
1. They evacuate the building during the fire drill. ఫైర్ డ్రిల్ సమయంలో వారు భవనాన్ని ఖాళీ చేస్తారు.
2. The authorities have evacuated residents in the flood zone. ముంపు ప్రాంతంలోని నివాసితులను అధికారులు ఖాళీ చేయించారు.
3. They are evacuating the area due to the approaching storm. తుఫాను సమీపిస్తున్నందున వారు ఆ ప్రాంతాన్ని ఖాళీ చేస్తున్నారు.
4. She evacuated her family when the emergency alarm sounded. ఎమర్జెన్సీ అలారం మోగినప్పుడు  ఆమె తన కుటుంబాన్ని ఖాళీ చేయించింది.
Evaporate, Evaporated, Evaporated, Evaporating

ఎవాపొరేట్, ఎవాపొరేటెడ్, ఎవాపొరేటెడ్, ఎవాపొరేటింగ్

Evaporate

ఎవాపొరేట్

నీటిని ఆవిరి లేదా వాయువుగా మార్చడం.
1. The sun evaporates the water from the lake. సూర్యుడు సరస్సు నుండి నీటిని ఆవిరి చేస్తాడు.
2. The liquid has evaporated completely in the heat. ద్రవం వేడిలో పూర్తిగా ఆవిరైపోయింది.
3. Water evaporates quickly under the hot sun.
ఎండలో నీరు త్వరగా ఆవిరైపోతుంది.
4. Sweat evaporates from our body during summer days.
వేసవిలో మన శరీరం నుండి చెమట ఆవిరైపోతుంది..

 

Examine, Examined, Examined, Examining

ఎగ్జామిన్, ఎగ్జామిన్డ్, ఎగ్జామిన్డ్, ఎగ్జామినింగ్

Examine

ఎగ్జామిన్

పరిశీలించడం.
1. The doctor examines the patient thoroughly. వైద్యుడు రోగిని క్షుణ్ణంగా పరిశీలిస్తాడు.
2. She has examined the evidence in detail. ఆమె సాక్ష్యాధారాలను వివరంగా పరిశీలించింది.
3. They are examining the results of the experiment. వారు ప్రయోగం ఫలితాలను పరిశీలిస్తున్నారు.
4. He examined the document for any errors. అతను ఏదైనా లోపాల కోసం పత్రాన్ని పరిశీలించాడు.
Excavate, Excavated, Excavated, Excavating

ఎక్స్కవేట్, ఎక్స్కవేటెడ్, ఎక్స్కవేటెడ్, ఎక్స్కవేటింగ్

Excavate

ఎక్స్కవేట్

త్రవ్వడం
1. They excavate the site for archaeological research. వారు పురావస్తు పరిశోధన కోసం స్థలాన్ని తవ్వుతారు 
2. She has excavated a large area for the new foundation. ఆమె కొత్త పునాది కోసం పెద్ద ప్రాంతాన్ని తవ్వింది.
3. They are excavating ancient ruins in the desert. వారు ఎడారిలో పురాతన శిధిలాలను తవ్వుతున్నారు.
4. The workers excavate the ground to find buried artifacts. ఖననం చేయబడిన కళాఖండాలను కనుగొనడానికి కార్మికులు భూమిని తవ్వుతారు.
Exceed, Exceeded, Exceeded, Exceeding

ఎక్సీడ్, ఎక్సీడెడ్, ఎక్సీడెడ్, ఎక్సీడింగ్

Exceed

ఎక్సీడ్

మించిపోవడం.
1. The results exceed our expectations. ఫలితాలు మా అంచనాలను మించిపోయాయి.
2. Do not exceed the speed limit on roads.
రోడ్లపై వేగ పరిమితిని మించవద్దు.
3. They are exceeding the speed limit on the highway. వారు హైవేపై వేగ పరిమితిని మించిపోతున్నారు.
4. The cost may exceed our budget for this project.
ఈ ప్రాజెక్ట్‌కి ఖర్చు మన బడ్జెట్‌ను మించవచ్చు.
Exchange, Exchanged, Exchanged, Exchanging

ఎక్స్చేంజ్, ఎక్స్చేంజ్డ్, ఎక్స్చేంజ్డ్, ఎక్స్చేంజింగ్

Exchange

ఎక్స్చేంజ్

ఏదైనా ఇచ్చి ప్రతిఫలంగా అదే రకమైన దానిని స్వీకరించడం లేదా మార్పిడి చేయడం.
1. They exchange gifts during the holidays. వారు సెలవుల్లో బహుమతులు మార్పిడి చేసుకుంటారు.
2. She has exchanged her old car for a new one. ఆమె తన పాత కారుని కొత్తదానికి మార్చుకుంది.
3. They are exchanging ideas in the meeting. మీటింగ్ లో ఆలోచనలు ఇచ్చిపుచ్చుకుంటున్నారు.
Excite, Excited, Excited, Exciting

ఎక్సైట్, ఎక్సైటెడ్, ఎక్సైటెడ్, ఎక్సైటింగ్

Excite

ఎక్సైట్

ఉత్తేజపరచడం
1. The news excites the community. వార్త సమాజాన్ని ఉత్తేజపరుస్తుంది.
2. She has excited the audience with her performance. ఆమె తన నటనతో ప్రేక్షకులను ఉత్తేజపరచింది.
3. They are exciting the children with their stories. వారు తమ కథలతో పిల్లలను ఉత్తేజపరుస్తున్నారు.
Exclude, Excluded, Excluded, Excluding

ఎక్స్క్లూడ్, ఎక్స్క్లూడెడ్, ఎక్స్క్లూడెడ్, ఎక్స్క్లూడింగ్

Exclude

ఎక్స్క్లూడ్

మినహాయించడం అనగా కొన్ని ప్రక్కన పెట్టడం
1. They exclude those who do not meet the requirements. అవసరాలకు అనుగుణంగా లేని వారిని వారు మినహాయించారు.
2. She has excluded him from the invitation list. ఆమె అతన్ని ఆహ్వాన జాబితా నుండి మినహాయించింది.
3. They are excluding certain topics from the discussion. వారు చర్చ నుండి కొన్ని అంశాలను మినహాయిస్తున్నారు.
4. The club excludes members under the age of 18. క్లబ్ 18 ఏళ్లలోపు సభ్యులను మినహాయించింది.
Excuse, Excused, Excused, Excusing

ఎక్స్క్యూస్, ఎక్స్క్యూస్డ్, ఎక్స్క్యూస్డ్, ఎక్స్క్యూసింగ్

Excuse

ఎక్స్క్యూస్

క్షమించుట
1. Please excuse me for coming late today.
ఈ రోజు ఆలస్యంగా వచ్చినందుకు నన్ను క్షమించండి.
2. She excused her friend for the small mistake.
చిన్న తప్పుకు ఆమె తన స్నేహితుడిని క్షమించింది.
3. Excuse my behavior during the stressful situation.
ఒత్తిడి సమయంలో నా ప్రవర్తనను క్షమించండి.
Execute, Executed, Executed, Executing

ఎక్సిక్యూట్, ఎక్సిక్యూటెడ్, ఎక్సిక్యూటెడ్, ఎక్సిక్యూటింగ్

Execute

ఎక్సిక్యూట్

అమలు చేయడం.
1. They execute the plan according to the guidelines. వారు మార్గదర్శకాల ప్రకారం ప్రణాళికను అమలు చేస్తారు.
2. She has executed the contract flawlessly. ఆమె ఒప్పందాన్ని దోషరహితంగా అమలు చేసింది.
3. They are executing the new software update this weekend. వారు ఈ వారాంతంలో కొత్త సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌ని అమలు చేస్తున్నారు.
4. The team executes their strategy effectively during the game. ఆట సమయంలో జట్టు తమ వ్యూహాన్ని సమర్థవంతంగా అమలు చేస్తుంది.
Exempt, Exempted, Exempted, Exempting

ఎక్సెంప్ట్, ఎక్సెంప్టెడ్, ఎక్సెంప్టెడ్, ఎక్సెంప్టింగ్

Exempt

ఎక్సెంప్ట్

మినహాయించుట
1. Certain groups are exempt from the tax. కొన్ని సమూహాలు పన్ను నుండి మినహాయించబడ్డాయి.
2. She has exempted her students from the final exam due to their performance. వారి పనితీరు కారణంగా ఆమె తన విద్యార్థులను చివరి పరీక్ష నుండి మినహాయించింది.
3. They are exempting members from additional fees this year. వారు ఈ సంవత్సరం సభ్యులకు అదనపు రుసుము నుండి మినహాయింపు ఇస్తున్నారు.
4. The law exempts small businesses from certain regulations. చట్టం చిన్న వ్యాపారాలను కొన్ని నిబంధనల నుండి మినహాయిస్తుంది.
Exercise, Exercised, Exercised, Exercising

ఎక్సర్సైజ్, ఎక్సర్సైజ్డ్, ఎక్సర్సైజ్డ్, ఎక్సర్సైజింగ్

Exercise

ఎక్సర్సైజ్

వ్యాయామం  చేయడం
1. They exercise regularly to stay fit.వారు ఫిట్ గా ఉండేందుకు క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తుంటారు.
2. They exercised regularly to improve their stamina.
తమ శక్తిని పెంచుకోవడానికి వారు క్రమంగా వ్యాయామం చేశారు.
3. He is exercising at the gym this morning. అతను ఈ ఉదయం జిమ్‌లో వ్యాయామం చేస్తున్నాడు.
4. The coach exercises strict discipline with the team. కోచ్ జట్టుతో కఠినమైన వ్యాయామం చేపిస్తాడు.
Exit, Exited, Exited, Exiting

ఎగ్జిట్, ఎగ్జిటెడ్, ఎగ్జిటెడ్, ఎగ్జిటింగ్

Exit

ఎగ్జిట్

బయటికి వెళ్ళడం లేదా నిష్క్రమించడం
1. They exit the building after the meeting. వారు సమావేశం తర్వాత భవనం నుండి నిష్క్రమిస్తారు.
2. She has exited the car and walked into the store. ఆమె కారు నుండి బయటికివచ్చి స్టోర్‌లోకి నడిచింది.
3. They are exiting the premises as instructed. వారు సూచించిన విధంగా ప్రాంగణం నుండి నిష్క్రమిస్తున్నారు లేదా బయటికి వెళ్తున్నారు.
4. The audience begins exiting the theater after the show. ప్రదర్శన తర్వాత ప్రేక్షకులు థియేటర్ నుండి నిష్క్రమించడం ప్రారంభిస్తారు.
Expand, Expanded, Expanded, Expanding

ఎక్స్ పాండ్, ఎక్స్ పాండెడ్, ఎక్స్ పాండెడ్, ఎక్స్ పాండింగ్

Expand

ఎక్స్‌పాండ్

విస్తరించడం
1. The company plans to expand its operations overseas. కంపెనీ తన కార్యకలాపాలను విదేశాలకు విస్తరించాలని యోచిస్తోంది.
2. She has expanded her knowledge through various courses. ఆమె వివిధ కోర్సుల ద్వారా తన పరిజ్ఞానాన్ని విస్తరించుకుంది.
3. We must expand our knowledge by reading books.
పుస్తకాలు చదివి మనం మన జ్ఞానాన్ని విస్తరించాలి.
4.The city expanded rapidly with new developments.కొత్త అభివృద్ధులతో నగరం వేగంగా విస్తరించింది.
Expect, Expected, Expected, Expecting

ఎక్స్‌పెక్ట్, ఎక్స్‌పెక్టెడ్, ఎక్స్‌పెక్టెడ్, ఎక్స్‌పెక్టింగ్

Expect

ఎక్స్‌పెక్ట్

ఆశించడం లేదా ఎదురుచూడడం.

1. I expect good results from your hard work.
నీ కష్టానికి మంచి ఫలితాలు వస్తాయని నేను ఆశిస్తున్నాను.
2. She expects her friend to arrive soon.
ఆమె తన స్నేహితుడు త్వరలో వస్తాడని ఆశిస్తోంది.
3. We expect rain during the monsoon season.
మాన్సూన్ కాలంలో వర్షం పడుతుందని మేము ఆశిస్తున్నాము.

 

Experience, Experienced, Experienced, Experiencing

ఎక్స్‌పీరియన్స్, ఎక్స్‌పీరియెన్స్డ్, ఎక్స్‌పీరియెన్స్డ్, ఎక్స్‌పీరియెన్సింగ్

Experience

ఎక్స్‌పీరియన్స్

పరిస్థితిని అనుభవించడం
1. They experience challenges during the project. ప్రాజెక్ట్ సమయంలో వారు సవాళ్లను అనుభవిస్తారు.
2. She has experienced various cultures while traveling. ఆమె ప్రయాణంలో వివిధ సంస్కృతులను అనుభవించింది.
3. They are experiencing significant growth this year. వారు ఈ సంవత్సరం గణనీయమైన వృద్ధిని ఎదుర్కొంటున్నారు లేదా అనుబవిస్తున్నారు.
4. The students are experiencing new learning methods. విద్యార్థులు కొత్త అభ్యాస పద్ధతులను అనుభవిస్తున్నారు.
Expire, Expired, Expired, Expiring

ఎక్స్‌పైర్, ఎక్స్‌పైర్డ్, ఎక్స్‌పైర్డ్, ఎక్స్‌పైరింగ్

Expire

ఎక్స్‌పైర్

గడువు ముగియుట
1. The contract will expire next month. ఒప్పందం వచ్చే నెల ముగుస్తుంది.
2. The coupon has expired and cannot be used. కూపన్ గడువు ముగిసింది మరియు ఉపయోగించబడదు.
3. The medication should not be used after it expires. మందులు గడువు ముగిసిన తర్వాత వాడకూడదు.
Explain, Explained, Explained, Explaining

ఎక్స్ ప్లైన్, ఎక్స్ ప్లైన్ద్, ఎక్స్ ప్లైన్ద్, ఎక్స్ ప్లెయినింగ్

Explain

ఎక్స్‌ప్లైన్

వివరించడం
1. They explain the rules before the game starts. ఆట ప్రారంభమయ్యే ముందు వారు నియమాలను వివరిస్తారు.
2. She has explained the concept to her classmates. ఆమె తన సహవిద్యార్థులకు భావనను వివరించింది.
3. They are explaining their findings at the conference. వారు సదస్సులో తమ పరిశోధనలను వివరిస్తున్నారు.
4. The teacher is explaining the lesson to the students. ఉపాధ్యాయుడు విద్యార్థులకు పాఠాన్ని వివరిస్తున్నాడు.
Explode, Exploded, Exploded, Exploding

ఎక్స్‌ప్లోడ్, ఎక్స్‌ప్లోడెడ్, ఎక్స్‌ప్లోడెడ్, ఎక్స్‌ప్లోడింగ్

Explode

ఎక్స్‌ప్లోడ్

శబ్దంతో పగిలిపోవడం లేదా విస్పోటనం చెందడం
1. The fireworks explode in the night sky. రాత్రి ఆకాశంలో బాణసంచా పేలుతుంది.
2. The device has exploded due to a malfunction. పరికరం పనిచేయకపోవడం వల్ల పేలింది.
3. The population is exploding in urban areas. పట్టణ ప్రాంతాల్లో జనాభా విస్ఫోటనం చెందుతోంది (గొప్పగా విస్తరిస్తున్నారు).
Explore, Explored, Explored, Exploring

ఎక్స్‌ప్లోర్, ఎక్స్‌ప్లోర్డ్, ఎక్స్‌ప్లోర్డ్, ఎక్స్‌ప్లోరింగ్

Explore

ఎక్స్‌ప్లోర్

అన్వేసించుట
1. They explore the ancient ruins during their trip. వారు తమ పర్యటనలో పురాతన శిధిలాలను అన్వేషిస్తారు.
2. We explore new places during our holidays.
సెలవుల్లో మేము కొత్త ప్రదేశాలను అన్వేషిస్తాము.
3. Scientists explore space to learn new facts.
శాస్త్రవేత్తలు కొత్త విషయాలు తెలుసుకోవడానికి అంతరిక్షాన్ని అన్వేషిస్తారు.
4. The children are exploring the forest behind their house. పిల్లలు తమ ఇంటి వెనుక ఉన్న అడవిని అన్వేషిస్తున్నారు.
Export, Exported, Exported, Exporting

ఎక్స్‌పోర్ట్, ఎక్స్‌పోర్టెడ్, ఎక్స్‌పోర్టెడ్, ఎక్స్‌పోర్టింగ్

Export

ఎక్స్‌పోర్ట్

వస్తువులు లేదా సేవలను మరొక దేశానికి అమ్మకానికి పంపడం. లేదా ఎగుమతి చేయడం
1. The country exports a large amount of machinery. దేశం పెద్ద మొత్తంలో యంత్రాలను ఎగుమతి చేస్తుంది.
2. She has exported products to international markets. ఆమె అంతర్జాతీయ మార్కెట్లకు ఉత్పత్తులను ఎగుమతి చేసింది.
3. They are exporting their technology to developing nations. వారు తమ సాంకేతికతను అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఎగుమతి చేస్తున్నారు.
4. The company is exporting its goods abroad. కంపెనీ తన వస్తువులను విదేశాలకు ఎగుమతి చేస్తోంది.
Expose, Exposed, Exposed, Exposing

ఎక్స్‌పోజ్, ఎక్స్‌పోజ్డ్, ఎక్స్‌పోజ్డ్, ఎక్స్‌పోజింగ్

Expose

ఎక్స్‌పోజ్

ఏదైనా విషయాన్ని కనిపించే విదంగా బయట పెట్టడం
1. They expose the flaws in the argument during the debate. చర్చ సందర్భంగా వాదనలోని లోపాలను బయటపెడతారు.
2. She has exposed the truth behind the scandal. కుంభకోణం వెనుక ఉన్న నిజాన్ని ఆమె బయటపెట్టింది.
3. They are exposing their artwork in the gallery. గ్యాలరీలో తమ ఆర్ట్‌వర్క్‌ని ఎక్స్‌పోజ్ చేస్తున్నారు లేదా బయటపెడుతున్నారు.
4. The investigation is exposing corruption in the system. దర్యాప్తు వ్యవస్థలోని అవినీతిని బట్టబయలు చేస్తోంది.
Expound, Expounded, Expounded, Expounding

ఎక్స్‌పౌండ్, ఎక్స్‌పౌండెడ్, ఎక్స్‌పౌండెడ్, ఎక్స్‌పౌండింగ్

Expound

ఎక్స్‌పౌండ్

వివరంగా వివరించడం.
1. The speaker expounds on the importance of education. విద్య యొక్క ప్రాముఖ్యతను స్పీకర్ వివరిస్తారు.
2. She has expounded her views in the article. ఆమె తన అభిప్రాయాలను వ్యాసంలో వివరించింది.
3. They are expounding the theory during the conference. సదస్సు సందర్భంగా వారు సిద్ధాంతాన్ని వివరిస్తున్నారు.
4. The teacher is expounding on the historical context of the lesson. ఉపాధ్యాయుడు పాఠం యొక్క చారిత్రక సందర్భాన్ని వివరిస్తున్నాడు.
Express, Expressed, Expressed, Expressing

ఎక్స్‌ప్రెస్, ఎక్స్‌ప్రెస్డ్, ఎక్స్‌ప్రెస్డ్, ఎక్స్‌ప్రెస్సింగ్

Express

ఎక్స్‌ప్రెస్

ఆలోచనలు లేదా భావాలను తెలియజేయడం.
1. They express their gratitude for the support. వారు మద్దతు కోసం వారి కృతజ్ఞతలు తెలియజేస్తారు.
2. She has expressed her concerns about the project. ఆమె ప్రాజెక్ట్ గురించి తన ఆందోళనలను తెలియ చేసింది.
3. They are expressing their ideas during the meeting. సమావేశంలో వారు తమ ఆలోచనలను తెలియ చేస్తున్నారు.
4. The artist is expressing emotions through her painting. కళాకారిణి తన పెయింటింగ్ ద్వారా భావోద్వేగాలను తెలియపరుస్తుంది.
Extend, Extended, Extended, Extending

ఎక్స్‌టెండ్, ఎక్స్‌టెండెడ్, ఎక్స్‌టెండెడ్, ఎక్స్‌టెండింగ్

Extend

ఎక్స్‌టెండ్

పొడిగించడం లేదా విస్తరించడం
1. They extend the deadline for the submission. వారు సమర్పణ కోసం గడువును పొడిగిస్తారు.
2. She has extended her visit to the city. ఆమె తన పర్యటనను నగరానికి పొడిగించింది.
3. They are extending their services to new clients. వారు తమ సేవలను కొత్త ఖాతాదారులకు విస్తరింపజేస్తున్నారు.
4. The company is extending an invitation to all employees. కంపెనీ ఉద్యోగులందరికీ ఆహ్వానాన్ని విస్తరిస్తోంది.
Exterminate, Exterminated, Exterminated, Exterminating

ఎక్స్ టర్మినేట్,  ఎక్స్ టర్మినేటెడ్,  ఎక్స్ టర్మినేటెడ్,  ఎక్స్ టర్మినేటింగ్

Exterminate

ఎక్స్ టర్మినేట్

పూర్తిగా నాశనం చేయడం లేదా నిర్మూలించడం
1. They exterminate pests in their home. వారు తమ ఇంటిలోని తెగుళ్లను నిర్మూలిస్తారు.
2. The company has exterminated the infestation. కంపెనీ ముట్టడిని నిర్మూలించింది.
3. They are exterminating outdated practices in the organization. వారు సంస్థలో పాత పద్ధతులను నిర్మూలిస్తున్నారు.
4. The team is exterminating errors in the software. బృందం సాఫ్ట్‌వేర్‌లో లోపాలను నిర్మూలిస్తోంది.
Extinguish, Extinguished, Extinguished, Extinguishing

ఎక్స్ టింగ్విష్,  ఎక్స్ టింగ్విష్డ్,  ఎక్స్ టింగ్విష్డ్,  ఎక్స్ టింగ్విషింగ్

Extinguish

ఎక్స్ టింగ్విష్

అగ్నిని ఆర్పడం
1. Firefighters extinguish the flames quickly. అగ్నిమాపక సిబ్బంది మంటలను త్వరగా ఆర్పివేస్తారు.
2. She has extinguished her cigarette before entering. ఆమె లోపలికి ప్రవేశించే ముందు తన సిగరెట్‌ను ఆర్పీ వేసింది.
3. They are extinguishing the candles at the end of the ceremony. వారు వేడుక ముగింపులో కొవ్వొత్తులను ఆర్పివేస్తున్నారు.
4. The organization is extinguishing outdated policies. సంస్థ కాలం చెల్లిన విధానాలను చల్లార్చుతోంది లేదా ఆర్పివేస్తుది.
Extract, Extracted, Extracted, Extracting

ఎక్స్‌ట్రాక్ట్, ఎక్స్‌ట్రాక్టెడ్, ఎక్స్‌ట్రాక్టెడ్, ఎక్స్‌ట్రాక్టింగ్

Extract

ఎక్స్‌ట్రాక్ట్

సంగ్రహించడం లేదా వెలుపలికి తీయడం
1. Workers extract oil from deep underground sources.

కార్మికులు భూమి లోతుల్లోనుండి నూనెను తీస్తారు.
2. She has extracted the relevant data for the report. ఆమె నివేదిక కోసం సంబంధిత డేటాను వెలుపలికి తీశారు.
3. They are extracting honey from the beehive. వారు తేనెటీగల నుండి తేనె తీస్తున్నారు.
4. The dentist is extracting the damaged tooth. దంతవైద్యుడు దెబ్బతిన్న పంటిని వెలికితీస్తున్నాడు.