Simple present tense     

 సింపుల్ ప్రెసెంట్ టెన్స్ గురించి సంపూర్ణంగా తెలుసుకుంటే సగం ఇంగ్లీష్ నేర్చుకున్నట్లే. కాబట్టి సింపుల్ ప్రెసెంట్ టెన్స్ గురించి మేము ఇచ్చిన వివరణను ఓపికగా చదవండి. సింపుల్ ప్రెసెంట్ టెన్స్ గురించి మీరు ఎప్పుడూ చదవని విధంగా సింపుల్ ప్రెసెంట్ టెన్స్ ని 12 రకాలుగా ఏ విధంగా ఉపయోగిస్తారో ఇందులో వివరించాము. Verb నాలుగు రూపాలు వుంటాయని చదివాము  కదాకానీ verb మొదటి రూపాన్ని మాత్రమే  ఉపయోగించి మాట్లాడడా న్ని   సింపుల్ ప్రెసెంట్ టెన్స్ అంటారు.

1.ముఖ్యంగా ఈ Simple Present Tenseలో ప్రతిరోజూ లేదా వారానికి లేదా నెలకి లేదా సంవత్సరానికి   రిపీటెడ్ గా జరిగే అవకాశం ఉండేటువంటి వాక్యాలను ఈ టెన్స్ లో తెలియజేస్తారు. 

సునీల్ కాలేజీకి వెళ్తాడు, నేను పనికి వెళ్తాను , వారు ఇక్కడికి వస్తారు, ఆమె పాటలు పాడుతుంది, అతను వేగంగా పరిగెత్తుతాడు, సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు, అతను అమెరికాలో నివసిస్తాడు, అతను బాగా చదువుతాడు,  అమ్మ వంట చేస్తుంది , Joy స్కూల్ కి వెళ్తాడు, సుధాకర్ ఇంగ్లీష్ బోధిస్తాడు,ఆమె కూరగాయలు అమ్ముతుంది,సురేష్ మా ఇంటికి వస్తాడు.

పైన తెలిపిన ఇటువంటి వాక్యాలు అన్ని కూడా ప్రతిరోజూ లేదా వారానికి లేదా నెలకి లేదా సంవత్సరానికి   రిపీటెడ్ గా జరిగే అవకాశం ఉండే  ఇటువంటి వాక్యాలను మాత్రమే  సింపుల్ ప్రెసెంట్ టెన్స్ లో తెలియజేస్తారు. సింపుల్ ప్రెసెంట్ టెన్స్ లో ఉపయోగించే ప్రతి వాక్యము కూడా ఏదో ఒక రోజు మరల రిపీట్ అయ్యే స్వభావాన్ని కలిగి ఉంటుంది అని  మాత్రమే గుర్తుపెట్టుకోండి.రిపీట్ అయ్యే  వాక్యాలను మాత్రమే సింపుల్ ప్రెసెంట్ టెన్స్ లో తెలియజేస్తారు

 

Present, Past, Future టెన్స్ లో వాక్యాలను ప్రధానంగా మూడు రకాలుగా విభజిస్తారు 

1.Action sentences = సబ్జెక్టు చేసే  పనిని తెలియజేసే వాక్యాలు.

2.Possessive sentences = సబ్జెక్టు ఏమి కలిగి ఉన్నాడో (ఆస్తి లాంటివి ) తెలియజేసే వాక్యాలు.

3.State sentences = సబ్జెక్ట్ యొక్క స్థితిని తెలియజేసే వాక్యాలు.

 

పైన మనం తెలుసుకున్నట్లుగా  ఒకే వ్యక్తి ఉంటే  singular subjects , ఇద్దరూ లేదా అంతకన్నా ఎక్కువ ఉంటే plural subjects.  అని  తెలుసుకున్నాము కదా వీటిని బాగా గుర్తుపెట్టుకోండి.

singular subjects : I (నేను ), He (  అతడు), She ( ఆమె ), It ( ఇది ),  That ( అది )

plural subjects: We ( మేము/మనము), You (మీరు ) They ( వారు), Those ( వారు)

 

సింపుల్ ప్రెసెంట్ టెన్స్ లో మాత్రమే ఉపయోగించే సహాయక క్రియలు మొత్తం : Do, Does, Have, Has,  Am, Is, Are. 

Do,Does :సబ్జెక్ట్ చేసే పనిని తెలియజేయడానికి  (action sentences) 

Have, Has: సబ్జెక్టు ఏమి కలిగి ఉన్నాడో  తెలియజేయడానికి (Possessive sentences)

Am, Is, Are: సబ్జెక్ట్ యొక్క స్థితిని తెలియజేయడానికి (State sentences)

 

Simple present లో Singular subject కి మరియు Plural subjcect కి విడివిడిగా ఏ సహాయక క్రియలు ఉపయోగిస్తారో తెలుసుకుందాం

Subjects   Helping verbs 
He, She,It,That Does, Has, Is
We, You, They Do, Have, Are 
I Do, Have, Am

 

 

 సింపుల్ ప్రజెంట్ టెన్స్ లో వాక్యాలను నిర్మించడానికి సబ్జెక్ట్ ఏదైనా కేవలం verb1  మాత్రమే ఉపయోగిస్తారు.  ఇదే కొండగుర్తు. దీనిని బాగా గుర్తుండచుకోండి.

ఇప్పుడు ఒక్కొక్క . సహాయక క్రియను  ఏ విధంగా ఉపయోగిస్తారో తెలుసుకుందాం