Tenses Passive voice overview

 A  నుండి H వరకు ఇవ్వబడిన వివరణలు పూర్తిగా అర్థమయ్యేంతవరకు చదవడానికి ప్రయత్నించండి

A.

Passive Voice నేర్చుకునే ముందు టెన్సెస్ గురించి తప్పకుండా నేర్చుకోవడానికి ప్రయత్నించండి.

క్రింది వాక్యాన్ని గమనించండి

Ramu sends  Ramesh (రాము రమేష్ ని పంపిస్తాడు)

Subject +verb+object (ఈ స్ట్రక్చర్ ప్రకారం ఇది యాక్టివ్ వాయిస్ లో వుంది )

మనం టెన్సెస్ గురించి నేర్చుకున్నదంతా కూడా కేవలం యాక్టివ్ వాయిస్ లోనే.Active voice లో వాక్యం సబ్జెక్టుతో ప్రారంభమై ఆబ్జెక్టుతో ముగించబడుతుంది. ప్యాసివ్ వాయిస్ లో వాక్యం ఆబ్జెక్టుతో ప్రారంభమై సబ్జెక్టుతో ముగించబడుతుంది.

క్రింది ఉన్న ప్యాసివ్ వాయిస్ structure  గమనించండి.

Subject + be +verb3 + by+ object

 

Beforms: am, is, are, was, were, be, been, being    వీటిని Beforms  అంటారు.

1.ప్రతి Passive voice సెంటెన్స్ లో ఒక Beform  మరియు verb3  కచ్చితంగా ఉంటుంది.  ఈ రెండింటిలో ఏది లేకపోయినా అది పాసివ్ వాయిస్ కాదు. 

2.Active voice  లో verb1,verb2, verb3, verb4  ఈ నాలుగు రూపాలను ఉపయోగిస్తారు. కానీ, పాసివ్ వాయిస్ లో అన్ని Tenses లలో కూడా   కేవలం verb3 మాత్రమే ఉపయోగిస్తారు..

3.Passive voice  లో Beform  ఒక్కటి మాత్రమేTense  ను బట్టి మారుతూ ఉంటుంది.

Subject + be +verb3 + by+ object  

పైన కనిపిస్తున్న స్ట్రక్చర్ లో కేవలం beform  మాత్రమే ఒక్కొక్క టెన్స్ లో singular  సబ్జెక్టుకు ఒకరకంగా plural సబ్జెక్టుకు మరొక  రకంగా మారుతూ ఉంటుంది.  మిగతా  verb3, by, object ప్రతి టెన్స్ లో కూడా మార్పు లేకుండా ఉంటాయి.

Beform ఏ విధంగా మారుతుందో పట్టిక ద్వారా గమనించండి

Tense Subject Active voice Pasive voice
Simple Present I Do am
  He/She/It Does is
  We/You/They Do are
Present Continuous I am am being
  He/She/It is is being
  We/You/They are are being
Present Perfect He/She/It Has has been
  I/We/You/They have have been
Simple Past I/He/She/It did was
  We/You/They did were
Past Continuous I/He/She/It was was being
  We/You/They were were being
Past Perfect All subjects Had had been
Simple Future All subjects will will be
Future Perfect All subjects will have will have been

 

యాక్టీవ్ వాయిస్ లో ఉన్న సబ్జెక్టు పాసివ్ వాయిస్ లో ఏ విధంగా మారుతుందో క్రింది పట్టిక ద్వారా గమనించండి.

Active voice Passive voice
I me
we us
You you
They Them
He him
She her
It it

యాక్టివ్ వాయిస్ లో సబ్జెక్టుగా ఉన్న I   పాసివ్  వాయిస్ లో me గా మారుతుంది, యాక్టివ్ వాయిస్ లో we  గా ఉన్న సబ్జెక్టు  పాసివ్  వాయిస్ లో us  గా మారుతుంది. అలాగే మిగతావి కూడా చదవండి.

ఇప్పుడు పైన ఇవ్వబడిన ఉదాహరణ ఒకసారి గుర్తు చేసుకుందాం

Ramu sends  Ramesh (రాము రమేష్ ని పంపిస్తాడు)

Subject +verb+object (ఈ స్ట్రక్చర్ ప్రకారం ఇది యాక్టివ్ వాయిస్ లో ఉంది)

దీనిని పాసివ్ వాయిస్ లోకి  మార్చడానికి ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్  Subject + be +verb3 + by+ object

Pasive voice  వాక్యం object  తో ప్రారంభమవుతుంది కాబట్టి ఈ సెంటెన్స్ ని పాసివ్ వాయిస్ లోకి మార్చినట్లయితే 

Ramesh is sent by Ramu అవుతుంది..

1. “Subject” Ramesh (యాక్టీవ్ వాయిస్ లో ఉన్న ఆబ్జెక్ట్ ఇక్కడ సబ్జెక్టుగా మారింది)

2. “ is” Beform  ( పైన ఇవ్వబడిన  ‘Ramu sends  Ramesh’   అనే వాక్యం లోని  వెర్బ్   sends  అనేది verb  మొదటి రూపంలో ఉంది. అనగా ఈ వాక్యం  సింపుల్ ప్రెసెంట్ లో ఉంది. Present tense కు  సంబంధించిన బి ఫామ్స్   am, is, are.    అయితే మన వాక్యంలో సబ్జెక్ట్ అయిన రమేష్ singular  కాబట్టి is ని ఉపయోగించడం జరిగింది)

3. “Sent”  verb3  (ప్రతి ప్యాసివ్ వాయిస్ సెంటెన్స్ లో కామన్ గా ఉపయోగించే verb3)

4. By (ప్రతి ప్యాసివ్ వాయిస్ సెంటెన్స్ లో కామన్ గా   by తప్పనిసరిగా ఉంటుంది)

5. “Object” Ramu (యాక్టివ్ వాయిస్ సెంటెన్స్ లో ఉన్న సబ్జెక్టు ఇక్కడ ఆబ్జెక్ట్ గా మారింది)

 

Ramesh is sent by Ramu ఈ వాక్యానికి ప్యాసివ్ వాయిస్ లో ఎన్ని అర్థాలు ఉంటాయో చూడండి ఈ వాక్యానికే కాదు ప్రతి ప్యాసివ్ వాయిస్  వాక్యానికి కూడా.

రమేష్ రాము చేత పంపబడతాడు

రమేష్ ని రాము పంపిస్తాడు

రమేష్ పంపబడతాడు

రమేష్ ని పంపిస్తాడు 

 

Passive voice  వాయిస్ లో వ్యతిరేక వాక్యాలను రాయడం చాలా సులభం. Passive voice  లో ప్రతి Tense లో కూడా అది  singular సబ్జెక్ట్ అయినా Plural సబ్జెక్ట్ అయినా అన్నిటికి కామన్ గా Not ఉపయోగించి వ్యతిరేక వాక్యాల రాస్తారు.

Ramesh is sent by Ramu. (PS)

ఈ వాక్యాన్ని వ్యతిరేక వాక్యం గా రాయుటకు beform పక్కనే not ఉంచితే సరిపోతుంది. 

Ramesh is not sent by Ramu (NS)

పై  రెండు వాక్యాలను ప్రశ్నా వాక్యాలుగా (interrogative sentences ) మార్చుటకు be form అయిన is ని  సబ్జెక్టుకి ముందు ఉంచితే సరిపోతుంది.

Is Ramesh sent by Ramu (IS)

Is Ramesh not sent by Ramu (NIS)

Ramesh is sent by Ramu. (PS) రమేష్ ని రాము పంపిస్తాడు
Ramesh is not sent by Ramu (NS) రమేష్ ని రాము పంపడు
Is Ramesh sent by Ramu (IS) రమేష్ ని రాము పంపిస్తాడా?
Is Ramesh not sent by Ramu (NIS) రమేష్ ని రాము పంపించడా?

 

B.

యాక్టివ్ వాయిస్ లో ఉన్నటువంటి వాక్యాన్ని పాసివ్ వాయిస్ లోకి మార్చాలి అంటే యాక్టివ్ వాయిస్ లో ఖచ్చితంగా ఆబ్జెక్ట్  ఉండాలి. లేదా ఆబ్జెక్ట్ లేనటువంటి వాక్యాలను పాసివ్ వాయిస్ లో అసలు చెప్పలేము.

ఆబ్జెక్ట్ ప్రధానంగా ఈ క్రింది లక్షణాలను కలిగి  ఉంటుంది. 

1.సబ్జెక్టు యొక్క మాట వింటాడు. 

2.సబ్జెక్టు విధించే శిక్షకు  గురి అవుతాడు

3.సబ్జెక్టు చెప్పిన పనిని ఆబ్జెక్ట్ చేస్తాడు. 

4.సబ్జెక్టు యొక్క ప్రభావానికి గురి అవుతాడు.

 

సబ్జెక్టు నిరంతరం ప్రాణం లేని ఒక వస్తువునైనను, ప్రాణం ఉన్న ఒక జీవినైనను ఏదో ఒకటి చేస్తుంది.దానినే ఆబ్జెక్ట్ (object) అంటారు..

ఈ క్రింది Active Voice  సెంటెన్సెస్ ని గమనించండి.

  1. She baked a cake. 

ఇక్కడ సబ్జెక్టు అయిన  she ప్రాణము లేనటువంటి ఒక కేక్ ని కాలుస్తుంది.కాబట్టి కేక్ ఆబ్జెక్ట్ అవుతుంది..

  1. They read the book.

ఇక్కడ సబ్జెక్టు అయినా they ప్రాణం లేని ఒక పుస్తకాన్ని చదువుతూ ఉన్నారు.పుస్తకం సబ్జెక్టు యొక్క ప్రభావానికి గురి అవుతూ ఉంది కాబట్టి ఇక్కడ పుస్తకం ఆబ్జెక్ట్ అవుతుంది .

  1. The dog chased a ball.

ఇక్కడ సబ్జెక్టు అయిన ఒక dog ప్రాణం లేని ఒక బాల్ ని వెంబడించింది.ఇక్కడ బాల్ ఆబ్జెక్ట్ అవుతుంది

  1. She asked him.

ఇక్కడ సబ్జెక్టు అయిన she ప్రాణం ఉన్న ఒక వ్యక్తిని ఏదో అడిగింది. ఇక్కడ him ఆబ్జెక్ట్ అవుతుంది.

  1. He is sending them.

ఇక్కడ సబ్జెక్టు అయిన He ప్రాణం ఉన్న కొందరిని ఎక్కడికో పంపుతున్నాడు. ఇక్కడ them ఆబ్జెక్ట్ అవుతుంది.

 

ఫ్రెండ్స్ ఈ విధంగా ప్రతి వాక్యంలో కూడా సబ్జెక్టు ప్రాణం లేని ఒక వస్తువును గానీ, ప్రాణం ఉన్నఒక జీవిని  గాని ఏదో ఒకటి చేస్తాడు, చేసి ఉంటాడు లేదా చేస్తూ ఉంటాడు..సబ్జెక్టు ఆబ్జెక్ట్ ని ఏదైనా అడగవచ్చు లేదా కొట్టవచ్చు లేదా తిట్టవచ్చు లేదా ఎక్కడికైనా పంపవచ్చు లేదా ఆబ్జెక్ట్ వైపు చూడవచ్చులేదా  ఆబ్జెక్ట్ గురించి ఆలోచించవచ్చు. మొత్తం మీద సబ్జెక్టు యొక్క ప్రభావానికి ఆబ్జెక్ట్ గురి అవుతూ ఉంటుంది..

C.

కొన్ని వాక్యాలలో  ఆబ్జెక్ట్ ఉండదు. అయినప్పటికీ ఆ వాక్యాలు పూర్తి అర్ధాన్ని ఇస్తాయి ఉదాహరణకు కింది వాక్యాలు గమనించండి.

  1. The stars shine brightly.(నక్షత్రాలు కాంతివంతంగా ప్రకాశిస్తాయి)

ఇక్కడ stars సబ్జెక్టు, shine వెర్బ్ కానీ ఇక్కడ సబ్జెక్టు అయిన  స్టార్స్. దేనినైనను ఏమైనను చేస్తున్నట్లు కనిపించడం లేదు కాబట్టి ఈ వాక్యంలో ఆబ్జెక్ట్ (object) లేదు అని చెప్పవచ్చు.

  1. Birds sing at dawn.(తెల్లవారుజామున పక్షులు పాడతాయి)

ఫ్రెండ్స్ ఇక్కడ Birds సబ్జెక్టు, sing వెర్బ్, ఇక్కడ సబ్జెక్టు అయిన Birds దేనినైనను, ఎవరినైనను, ఏమైనా చేస్తున్నట్లు కనిపించడం లేదు కాబట్టి ఇక్కడ ఈ వాక్యంలో ఆబ్జెక్ట్ లేదు. 

  1. The river flows peacefully.(నది ప్రశాంతంగా ప్రవహిస్తుంది.)

ఇక్కడ ఈ వాక్యంలో River సబ్జెక్టు,  flows వెర్బ్  ఇక్కడ సబ్జెక్టు అయిన River దేనినైనను ఎవరినైనను ఏదైనా చేస్తున్నట్లు కనిపించడం లేదు కాబట్టి ఈ వాక్యంలో కూడా ఆబ్జెక్ట్ లేదు.

  1. Clouds gather in silence.(మేఘాలు నిశ్శబ్దంగా గుమిగూడుతాయి).

ఇక్కడ clouds సబ్జెక్టు, gather వెర్బ్. కానీ సబ్జెక్టు అయిన clouds దీని నైనను, ఎవరినైనను ఏదైనా చేస్తున్నట్లు కనిపించడం లేదు కాబట్టి ఈ వాక్యంలో కూడా ఆబ్జెక్ట్ లేదు.

  1. Flowers bloom every spring..(ప్రతి వసంతకాలంలో పువ్వులు వికసిస్తాయి.)

ఇక్కడ flowers సబ్జెక్టు, bloom వెర్బ్. కానీ సబ్జెక్ట్ అయిన ఫ్లవర్స్ ఎవరినైనను దేనినైనను ఏదైనను చేస్తున్నట్లు కనిపించడం లేదు కనుక ఈ వాక్యంలో కూడా ఆబ్జెక్ట్ లేదు. 

object ఉన్న వాక్యాలను మాత్రమే పాసివ్ వాయిస్ లోనికి మార్చడానికి వీలవుతుంది. ఆబ్జెక్ట్ లేని వాక్యాలను పాసివ్ వాయిస్ లో చెప్పలేము.

 

D.

ప్రతి వాక్యంలో కూడా సబ్జెక్టు తప్పనిసరిగా ఉంటుంది. కానీ ఆబ్జెక్ట్ కొన్ని వాక్యాలలో ఉండొచ్చు కొన్ని వాక్యాలలో ఉండకపోవచ్చు ఎటువంటి వాక్యాలలో ఆబ్జెక్ట్ ఉంటుంది ఎటువంటి వాక్యాలలో ఆబ్జెక్ట్  ఉండదు అనే విషయాలను గురించి తెలుసుకుందాం.

 Transistive verbs ఉండే వాక్యాలకు మాత్రమే object ఉంటుంది.  Transistive verbs ప్రశ్నించే స్వభావాన్ని కలిగి ఉంటాయి క్రిందిఉదాహరణలు గమనించండి.

 

Eat: She ate (V) an apple  (O) for breakfast. ఆమె అల్పాహారం కోసం ఒక ఆపిల్ తిన్నది.
Buy: I bought (V) a new phone (O) yesterday. నేను నిన్న కొత్త ఫోన్ కొన్నాను.
Make: They made (V)  a delicious cake(O)  for the party. వారు పార్టీ కోసం రుచికరమైన కేక్ తయారు చేశారు
Send: He sent (V)  a letter (O) to his friend. అతను తన స్నేహితుడికి ఒక లేఖ పంపాడు.
Teach: The teacher teaches (V)  the students grammar. ఉపాధ్యాయుడు విద్యార్థులకు వ్యాకరణాన్ని బోధిస్తాడు
Love: She loves  (V) her family (O) deeply. ఆమె తన కుటుంబాన్ని గాఢంగా ప్రేమిస్తుంది.
Read: He reads (V)  the newspaper(O)  every morning. అతను ప్రతి ఉదయం వార్తాపత్రిక చదువుతాడు.
Write: She writes  (V) a letter (O) to her grandmother every month. ఆమె ప్రతి నెలా తన అమ్మమ్మకి ఉత్తరం రాస్తుంది
Find: I found  (V) my keys (O) on the kitchen counter. నేను వంటగది కౌంటర్‌లో నా కీలను కనుగొన్నాను
Help: They helped  (V) their neighbor (O) move into the new house. వారు తమ పొరుగువారికి కొత్త ఇంట్లోకి వెళ్లడానికి సహాయం చేసారు

 

పైన కనిపిస్తున్న ఇటువంటి verbs నే transistive verbs  అని అంటారు.. ఉదాహరణకు Eat అనే verb  ని తీసుకుంటే దేనిని తిన్నాడో చెప్పకపోతే ఆ వాక్యం పూర్తికాదు.. దేనిని తిన్నాడో అదే ఆబ్జెక్ట్ అవుతుంది. 

రెండవ వాక్యాన్ని గమనిస్తే నేను నిన్న కొన్నాను.. దేనిని కొన్నాడో ఆ object ని రాయకపోతే ఆ వాక్యం పూర్తి కాదు.

మిగతా వ్యాఖ్యలను కూడా గమనించండి.ఈ విధంగా Transistive verbs ఉండే వాక్యాలకు తప్పనిసరిగా ఆబ్జెక్ట్ ఉంటుంది object లేకపోతే ఆ వాక్యం పూర్తి కాదు. Transistive verbs ఇంకా చాలా ఉంటాయి మీకు అర్థం కావడం కోసం కొన్ని మాత్రమే ఇచ్చాము.

ఇక్కడ క్లిక్ చేసి Verbs రకాల గురించి తెలుసుకోండి   CLICK HERE

 

E.

అసలు యాక్టివ్ వాయిస్ ఉండగా పాసివ్ వాయిస్ ఎందుకు?. ఉద్దేశపూర్వకముగా సబ్జెక్టుకున్న ప్రాధాన్యతను తగ్గించడమే ప్యాసివ్ వాయిస్ యొక్క ప్రధాన లక్ష్యం. ఉదాహరణకు

Ramu murdered Sujata.

రాము సుజాతని హత్య చేసినాడు

పై వాక్యంలో

Ramu (subject) murdered (verb) Sujata (object)

పని చేసిన వాడు సబ్జెక్ట్ అయితే, ఫలితాన్ని పొందినవాడు ఆబ్జెక్ట్.

Subject + verb +object ఏదైనా వాక్యం ఈ రూపంలో ఉంటే దానిని యాక్టివ్ వాయిస్ అంటారు అని మనం ముందు తెలుసుకున్నాం. 

Active voice పనిచేసిన వాడి పేరు మొదట చెప్పి ఆ ఫలితాన్ని పొందిన వాడి పేరు చివరలో చెబుతుంది.

అయితే  సెంటెన్స్ లో ఎవరి పేరు మొదటిగా చెప్పబడుతుందో ఆ వ్యక్తికి ప్రాధాన్యత ఇచ్చినట్టు అర్దం . యాక్టీవ్ వాయిస్ పనిచేసిన వాడికి మొదటి ప్రాధాన్యత ఇస్తుంది వాడినే subject అంటారు..

అయితే కొన్ని సందర్భాల్లో సబ్జెక్టుకి ఉద్దేశపూర్వకంగా ప్రాధాన్యతను తగ్గించడమే పాసివ్ వాయిస్ యొక్క ముఖ్య లక్ష్యం. అందుకని సెంటెన్స్ ప్రారంభంలో సబ్జెక్టు పేరు మొదట ఉచ్చరించకుండా ఆబ్జెక్ట్ యొక్క పేరు మొదట ఉచ్చరించబడుతుంది.ఆబ్జెక్టుతో వాక్యాన్ని ప్రారంభించాలి అనుకుంటే కచ్చితంగా ప్యాసివ్ వాయిస్ ని ఉపయోగించాలి.

ఇక్కడ రాము సుజాతని హత్య చేసినాడు. వాడు చేసినది చెడ్డ పని. రాము పేరుని మొదట ఉచ్చరించి వాడికి ప్రాధాన్యత ఇవ్వకూడదు అనేది పాసివ్ వాయిస్ ప్రధాన ఉద్దేశం. ఇక్కడ సబ్జెక్టు పేరుని మొదట ఉచ్చరించకుండా ఆబ్జెక్ట్ పేరుని మొదట ఉచ్చరించాలి. కాబట్టి పై ఉన్న వాక్యాన్ని పాసివ్ వాయిస్ లో కింది విధంగా చెప్పవచ్చు.

Sujatha was murdered by Ramu. (PV)  

Subject + be + verb3 + by + object

1.Subject (sujatha)  పైన యాక్టివ్ వాయిస్ లో ఆబ్జెక్ట్ గా ఉన్న సుజాత ఇక్కడ సబ్జెక్టుగా మారింది.

  1. Was (be form) పైన యాక్టివ్ వాయిస్ లో ఉన్నRamu murdered Sujata.అనే వాక్యం verb ను బట్టి సింపుల్ ఫాస్ట్  లో ఉంది అని అర్థమవుతుంది.  కాబట్టి పాస్ట్ టెన్స్  కి సంబంధించిన be forms  was, were. మనం రాసిన ప్యాసివ్ వాయిస్ సెంటెన్స్ లో సుజాత అనే సబ్జెక్టు సింగులర్ కాబట్టి was అనే be form  ఉపయోగించాము 
  2. Verb3 ప్రతి ప్యాసివ్ వాయిస్ సెంటెన్స్ లో కామన్ గా ఉపయోగించబడుతుంది

      4.By  ప్రతి ప్యాసివ్  వాయిస్ సెంటెన్స్ లో కామన్ గా ఉపయోగించబడుతుంది

  1. Object (Ramu) Active voice లో సబ్జెక్టుగా ఉన్న రాము Passive voice  లో ఆబ్జెక్టుగా మారింది.                                               

 

F.

కొన్ని సందర్భాలలో సబ్జెక్టు కంటే ఆబ్జెక్టుకి ప్రాధాన్యత ఇచ్చి చెప్పాల్సి ఉంటుంది. 

ఉదాహరణకు   సబ్జెక్టు కంటే ఆబ్జెక్ట్ పేరుగాంచిన వ్యక్తి, ప్రధానమైన వ్యక్తి, ముఖ్యమైన వ్యక్తి అయినప్పుడు

 

1.The security personnel brought the Prime Minister safely. (AV)

 భద్రతా సిబ్బంది ప్రధానిని సురక్షితంగా తీసుకొచ్చారు.ఇది ఒక యాక్టివ్ వాయిస్ సెంటెన్స్. 

Subject: The security personnel

Verb: brought

Object: The Prime Minister

ఈ వాక్యంలో సెక్యూరిటీ సిబ్బంది యొక్క పేరును మొదటిగా చెప్పడం వలన సెక్యూరిటీ సిబ్బందికి ఎక్కువగా ప్రాధాన్యతనిచ్చినట్టు కనబడుతుంది. యాక్టీవ్ వాయిస్ ఎప్పుడూ కూడా గొప్పవాడు తక్కువ వాడు అనే భేదం లేకుండా పని చేసిన వాడికి మొదటి ప్రాధాన్యతనిచ్చి సబ్జెక్టుతోనే వాక్యాన్ని ప్రారంభిస్తుంది.

కానీ ప్రధానమంత్రి సెక్యూరిటీ సిబ్బంది కంటే గొప్పవాడు కాబట్టి,  ఆబ్జెక్టుగా ఉన్న ప్రధానమంత్రి పేరుతో వాక్యాన్ని ప్రారంభించాలి. ఆబ్జెక్ట్ తో వాక్యాన్ని ప్రారంభించాలి అంటే తప్పనిసరిగా ప్యాసివ్ వాయిస్ ని ఉపయోగించాల్సిందే. 

The Prime Minister was brought safely by the security personnel. (PV)

(Subject + be + verb3 + by + object )

పాసివ్ వాయిస్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం సబ్జెక్టుకు ప్రాధాన్యత లేకుండా చేయడమే. అలాంటప్పుడు      ‘ by ‘ ఉపయోగించి మరల పనిచేసిన వ్యక్తి పేరును  (subject) సూచించడం వలన ఆబ్జెక్టుకి ప్రాధాన్యత తగ్గిపోతుంది.  కాబట్టి ఇంగ్లీషులో by  ఉపయోగించి పనిచేసిన వ్యక్తి పేరును అవసరమైతేనే చెబుతారు లేకుంటే చెప్పరు. passive voice లో  మాట్లాడేటప్పుడు 70 శాతం by  ఉపయోగించకుండానే మాట్లాడతారు. 

 

2. Books are sold here (ఇక్కడ పుస్తకాలు అమ్మబడును)

ఇది ఒక ప్యాసివ్ వాయిస్ సెంటెన్స్. పుస్తకాలు అమ్మే ఒక షాపు యజమాని తన షాపు  ముందు ‘Books are sold here’  అని బోర్డు పెట్టాడు. 

పై వాక్యాన్ని Acitve voice  సెంటెన్స్ లో రాస్తే 

‘I sell books here’ ( నేను ఇక్కడ పుస్తకాలు అమ్ముతాను) 

(subject +verb +object)

సెంటెన్స్ ప్రారంభంలో నేను అని సంబోధించడం వలన షాపు యజమానికి ఎక్కువ ప్రాధాన్యత ఏర్పడుతుంది. అతని గురించి అందరికీ తెలియకపోవచ్చు గాని పుస్తకాలు మాత్రం అందరికీ తెలుసు కాబట్టి అతనికి అంటే  పుస్తకాలకు సమాజంలో ఎక్కువ పేరు ఉంది. ఇక్కడ సబ్జెక్టు కంటే ఆబ్జెక్ట్ గొప్పగా కనబడుతుంది. కాబట్టి ఆబ్జెక్టుతోనే వాక్యాన్ని ప్రారంభించాలి. ఆబ్జెక్టుతో వాక్యాన్ని ప్రారంభించాలి అంటే కచ్చితంగా Passive voice  ని ఉపయోగించాలి. పై వాక్యాన్ని పాసివ్ వాయిస్ లో రాస్తే

Books are sold here by me. ( ఇక్కడ పుస్తకాలు నా చేత అమ్మబడును)

ఫ్రెండ్స్ ఇక్కడ ‘by me’  ఉపయోగించడం వలన మరల ప్రాధాన్యత సబ్జెక్టుకి వెళ్లిపోతుంది. ప్యాసివ్ వాయిస్ యొక్క ప్రధాన ఉద్దేశం ఆబ్జెక్టుకు ప్రాధాన్యత కలిగించడమే.  ఇంగ్లీషులో అవసరమైతేనే తప్ప ‘by’ ఉపయోగించి సబ్జెక్టు యొక్క పేరు చెప్పరు. కాబట్టి పై వాక్యాన్ని సింపుల్ గా క్రింది విధంగా  రాస్తే సరిపోతుంది.

Books are sold here.

పై రెండు ఉదాహరణలను బట్టి సబ్జెక్టు కంటే ఆబ్జెక్ట్   ప్రధానమైనది లేదా ముఖ్యమైనది అయినప్పుడు ఆబ్జెక్టుతో వాక్యాన్ని ప్రారంభించాలి. ఆబ్జెక్ట్ తో వాక్యాన్ని ప్రారంభించాలి అంటే కచ్చితంగా ప్యాసివ్ వాయిస్ ని ఉపయోగించాలి అని మనకి అర్థం అవుతుంది.

G.

  1. పనిచేసిన సబ్జెక్టు ఎవరో తెలియనప్పుడు ఆబ్జెక్ట్ కు ప్రాధాన్యత ఇచ్చి మాట్లాడతారు

పనిచేసిన వ్యక్తి ఎవరో తెలియనప్పుడు చేసిన పనిని గురించి మాత్రమే చెప్పాల్సి ఉంటుంది ఇటువంటి సందర్భాల్లో కచ్చితంగా పాసివ్ వాయిస్ ఉపయోగించాలి ఉదాహరణకు:

The book was left on the table by me. నాచేత పుస్తకం టేబుల్ పై ఉంచబడింది.

ఎవరి చేత పుస్తకం టేబుల్ పై ఉంచబడిందో తెలియకపోతే అనగా పనిచేసిన వ్యక్తి తెలియకపోతే “ by me”వాడవలసిన అవసరం లేదు. క్రింది ఉదాహరణలు గమనించండి.

1. The book was left on the table. 1. పుస్తకం టేబుల్‌పై ఉంచబడింది.లేక పుస్తకమును టేబుల్ పై ఉంచారు
2. The car was stolen last night. 2. నిన్న రాత్రి కారు దొంగిలించబడింది. లేక కారుని నిన్న రాత్రి దొంగిలించారు
3. A new mall was built in the city. 3. నగరంలో కొత్త మాల్ నిర్మించబడింది. లేక  క్రొత్త మాల్ ను నగరంలో నిర్మించారు
4. The lights were turned off during the meeting. 4. మీటింగ్ సమయంలో లైట్లు ఆఫ్ చేయబడ్డాయి. లేక లైట్లను మీటింగ్ సమయంలో ఆపివేశారు
5. The results were announced yesterday. 5. ఫలితాలు నిన్న ప్రకటించబడ్డాయి. లేక ఫలితాలను నిన్న ప్రకటించారు
6. A phone was found in the park. 6. పార్కులో ఫోన్ దొరికింది. లేక ఫోను పార్కులో దొరికింది
7. The road was repaired last week. 7. రోడ్డు గత వారం మరమ్మత్తు చేయబడింది. లేక  రోడ్డును గత వారంమరమ్మత్తు చేశారు
8. Some papers were dropped in the hallway.  8. కొన్ని కాగితాలు హాలులో పడిపోయాయి. లేక కొన్ని కాగితాలను హాలులో పడవేశారు
9. The dishes were washed after dinner. 9. రాత్రి భోజనం తర్వాత పాత్రలు కడుగుతారు. లేక పాత్రలను  రాత్రి భోజనం తర్వాత కడుగుతారు 
10. A chair was placed near the door. 10. తలుపు దగ్గర ఒక కుర్చీ ఉంచబడింది. లేక కుర్చీని తలుపు దగ్గర ఉంచినారు

 

2. సబ్జెక్టు ఒక పొరపాటు చేస్తాడు అయితే ఆ పొరపాటు చేసినది ఎవరో తెలియకుండా, విషయాన్ని మాత్రమే తెలియజేయడానికి కూడా ప్యాసివ్ వాయిస్ ని ఉపయోగిస్తారు.ఇక్కడ by  ఉపయోగించి  సబ్జెక్టు యొక్క పేరు చెప్పకుండా దాచిపడతారు. 

 

2. The documents were misplaced in the office. 2. కార్యాలయంలో పత్రాలు తప్పుగా ఉన్నాయి.
3. The deadlines were not met. 3. గడువులు నెరవేరలేదు.
4. The wrong email was sent to the client. 4. క్లయింట్‌కు తప్పు ఇమెయిల్ పంపబడింది.
6. The budget was overspent this quarter. 6. ఈ త్రైమాసికంలో బడ్జెట్ అధికంగా ఖర్చు చేయబడింది.
7. The project was delayed unexpectedly. 7. ప్రాజెక్ట్ అనుకోకుండా ఆలస్యమైంది.
8. Important details were overlooked. 8. ముఖ్యమైన వివరాలు విస్మరించబడ్డాయి.
9. A decision was made without proper consultation. 9. సరైన సంప్రదింపులు లేకుండా నిర్ణయం తీసుకోబడింది.
10. Complaints were filed about the service. 10. సేవ గురించి ఫిర్యాదులు దాఖలు చేయబడ్డాయి.

3.కొన్ని సూచనలు లేదా మార్గదర్శకాలు తెలియజేయాల్సి వచ్చినప్పుడు కూడా ప్యాసివ్ వాయిస్ ని ఉపయోగిస్తారు 

1. The machine should be turned off after use. 1. ఉపయోగించిన తర్వాత యంత్రాన్ని ఆఫ్ చేయాలి.
2. The ingredients should be mixed thoroughly. 2. పదార్థాలు పూర్తిగా కలపాలి.
3. The form must be signed by a parent or guardian. 3. ఫారమ్‌పై తల్లిదండ్రులు లేదా సంరక్షకులు తప్పనిసరిగా సంతకం చేయాలి.
4. The password can be reset using the settings menu. 4. సెట్టింగ్‌ల మెనుని ఉపయోగించి పాస్‌వర్డ్ రీసెట్ చేయవచ్చు.
5. The application must be submitted before the deadline. 5. దరఖాస్తు గడువుకు ముందే సమర్పించాలి.
6. The document should be saved in PDF format. 6. పత్రం PDF ఫార్మాట్‌లో సేవ్ చేయబడాలి.
7. The floor should be cleaned before the event. 7. ఈవెంట్‌కు ముందు నేలను శుభ్రం చేయాలి.
8. The equipment must be checked regularly. 8. పరికరాలను క్రమం తప్పకుండా తనిఖీ చేయాలి.
9. The report should be emailed to the manager. 9. నివేదికను మేనేజర్‌కి ఇమెయిల్ చేయాలి.
10. The packaging should be disposed of responsibly. 10. ప్యాకేజింగ్‌ను బాధ్యతాయుతంగా పారవేయాలి.

4.చర్య యొక్క రిసీవర్ (object)ను  నొక్కి చెప్పడానికి. పని చేసిన వాడికంటే ఫలితాన్ని పొందిన ఆబ్జెక్ట్ ని ప్రధానంగా హైలైట్ చేయాలని ఉద్దేశం.

Example: “The cake was eaten by the children.” కేకు పిల్లల చేత తినబడింది. ఇక్కడ ఫోకస్ అంతా కూడా కేక్ మీద ఉన్నది. గాని పిల్లల మీద లేదు. కాబట్టి ఆబ్జెక్ట్ మీద ఫోకస్ చేసి మాట్లాడాలి అనుకున్నప్పుడు పాసివ్ వాయిస్ ని ఉపయోగిస్తారు.by ఉపయోగించి మీకు ఇష్టమైన సబ్జెక్ట్ ని చేర్చండి. 

2. The Eiffel Tower is visited by millions of tourists every year. 2. ఈఫిల్ టవర్‌ను ప్రతి సంవత్సరం మిలియన్ల మంది పర్యాటకులు సందర్శిస్తారు.
3. The novel was written in just three months. 3. నవల కేవలం మూడు నెలల్లో వ్రాయబడింది.
4. The thief was caught by the police. 4. దొంగ పోలీసులకు పట్టుబడ్డాడు.
5. The proposal was rejected by the committee. 5. ప్రతిపాదనను కమిటీ తిరస్కరించింది.
6. The patient was treated by the best doctors. 6. రోగికి ఉత్తమ వైద్యులు చికిత్స చేశారు.
7. The house was decorated beautifully. 7. ఇల్లు అందంగా అలంకరించబడింది.
8. The homework was submitted on time. 8. హోంవర్క్ సమయానికి సమర్పించబడింది.

 

H

అతనిని, ఆమెని, వారిని, నిన్ను,దానిని, మిమ్ముని, నన్ను  సబ్జెక్ట్ అనేవాడు ఏదో ఒకటి చేస్తాడు దీనినే ప్యాసివ్ వాయిస్ అంటారు.. ఇక్కడ చివరిలో ప్రతి సబ్జెక్టుకి “ని” “ న”  “ను”  వచ్చింది. Passive voice  లో ప్రధానంగా ఈ కొండ గుర్తును గుర్తు పెట్టుకోండి.

అతనిని కొడుతున్నారు.

ఆమెని అడుగుతున్నారు.

న్ను పంపారు.

అతనిని ఫెయిల్  చేశారు.

వారిని పొగుడుతున్నారు.

దానిని చూస్తున్నారు.

మిమ్ముని పిలుస్తున్నారు. 

 

The ball is chased by the dog. (PV) బంతిని కుక్క వెంటాడుతుంది లేదా బంతి కుక్క చేత వెంటాడబడుతుంది (మొదటి అర్థమే సహజంగా ఉపయోగిస్తారు) 

 

Fresh fruits are sold by them. తాజా పండ్లను  వారు విక్రయిస్తారు లేదా తాజా  పండ్లు వారి చేత విక్రయించబడతాయి

 

1. Water is boiled at 100 degrees Celsius. నీటిని  100 డిగ్రీల సెల్సియస్ వద్ద వేడి చేస్తారు .or నీరు 100 డిగ్రీలు సెల్సియస్ వద్ద వేడి చేయబడుతుంది

 

7. The cake is baked perfectly. 7. కేక్ ని సంపూర్ణంగా కాలుస్తారు లేదా కేక్ సంపూర్ణంగా కాల్చబడుతుంది.