Simple Past passive

Simple Past passive

Active voice లో సింపుల్ పాస్ట్ సెంటెన్స్ ని  Passive voice  లోకి ఏ విధంగా మార్చాలో తెలుసుకుందాం.

Exmple: He wrote a letter (AV)

పైన ఉన్న సెంటెన్స్ లో వెర్బ్ wrote  రెండవ రూపంలో ఉంది అంటే పై వాక్యం సింపుల్ పాస్ట్ లో ఉంది అని అర్థం. సింపుల్  పాస్ట్ లో ఉన్న వాక్యాలను పాసివ్ వాయిస్ లోకి మార్చుటకు  

Singular subjects అయిన He, She, It లకు  ‘was’

Plural subjects అయిన I, We, You, They లకు were అనే be form  ఉపయోగించి వాక్య నిర్మాణం చేస్తారు. 

 

Passive voice structure     

Subject + be + verb3 + by + object

A letter was written by him (PV)

Subject = a letter (యాక్టీవ్ వాయిస్ లో ఆబ్జెక్ట్ గా ఉన్న a letter పాసివ్ వాయిస్ లో సబ్జెక్టు అయ్యింది)

 

be = was ( a letter సింగులర్ సబ్జెక్టు గనక was ఉపయోగించాము)

verb3 = written ( ప్యాసివ్ వాయిస్ లో verb 3 కామన్ గా ఉపయోగించబడుతుంది)

 

by = ( ప్యాసివ్ వాయిస్ లో కామన్ గా ఉపయోగించబడుతుంది)

object= him ( యాక్టివ్ వాయిస్ లో సబ్జెక్టుగా ఉన్న  He ప్యాసివ్ వాయిస్ లో him గా మారింది)

 

A letter was written by him (PV)

పై వాక్యమును  నెగటివ్ సెంటెన్స్ గా మార్చుటకు బీఫామ్ was  పక్కనే not ఉంచితే సరిపోతుంది.

A letter was not written by him (PVN)

 

పై రెండు వాక్యాలను ప్రశ్న వాక్యాలుగా (Interrogative sentence ) మార్చుటకు బి ఫామ్ was ని సబ్జెక్టుకు ముందు ఉంచితే సరిపోతుంది.

 

was a letter  written by him (PVI)

was a letter  not written by him (PVNI)

 

క్రింద ఉదాహరణలు గమనించండి.

క్రింది సెంటెన్సెస్ వరుసగా

Active voice

 passive voice

 passive voice negative

 passive voice interrogative

 passive voice negative interrogative 

Table 1

1. He wrote a letter.  (AV) 1. అతను ఒక లేఖ రాశాడు.
A letter was written by him. (PV) లేఖను అతను రాశాడు లేదా లేక అతని చేత రాయబడింది
A letter was not written by him. లేఖను అతను రాయలేదు. లేదా లేక అతని చేత రాయబడలేదు
Was a letter written by him? లేఖను అతను రాసినాడ? లేదా లేక అతని చేత రాయబడినదా
Was a letter not written by him? లేను అతను రాయలేదా? లేదా లేక అతని చేత రాయబడలేదా
   
2. She cleaned the room. 2. ఆమె గదిని శుభ్రం చేసింది.
The room was cleaned by her. గదిని ఆమె శుభ్రం చేసింది లేదా గది ఆమె చేత శుభ్రం చేయబడింది
The room was not cleaned by her. గదిని ఆమె శుభ్రం చేయలేదు లేదా గది ఆమె చేత శుభ్రం చేయబడలేదు
Was the room cleaned by her? గదిని ఆమె శుభ్రం చేసిందా లేదా గది ఆమె చేత శుభ్రం చేయబడిందా?
Was the room not cleaned by her? గదిని ఆమె శుభ్రం చేయలేదా లేదా గది ఆమె చేత శుభ్రం చేయబడలేదా?
   
3. The teacher explained the topic. 3. ఉపాధ్యాయుడు విషయాన్ని వివరించాడు.
The topic was explained by the teacher. విషయాన్ని ఉపాధ్యాయుడు వివరించారు.
The topic was not explained by the teacher. విషయాన్ని ఉపాధ్యాయుడు వివరించలేదు.
Was the topic explained by the teacher? విషయాన్ని ఉపాధ్యాయుడు వివరించాడా?
Was the topic not explained by the teacher? విషయాన్ని ఉపాధ్యాయుడు వివరించలేదా?
   
4. He repaired the bicycle. 4. అతను సైకిల్ రిపేరు చేసాడు.
The bicycle was repaired by him. సైకిల్ను అతని రిపేరు చేశాడు లేదా సైకిల్ అతని చేత రిపేరు చేయబడింది.
The bicycle was not repaired by him. సైకిల్ ని అతను రిపేరు చేయలేదు లేదా సైకిల్ అతని చేత రిపేరు చేయబడలేదు.
Was the bicycle repaired by him? సైకిల్ ని అతను రిపేరు చేశాడా లేదా సైకిల్ అతని చేత రిపేరు చేయబడిందా?
Was the bicycle not repaired by him? ? సైకిల్ ని అతను రిపేరు చేయలేదా లేదా సైకిల్ అతని చేత రిపేరు చేయబడలేదు?
   
5. She opened the window. 5. ఆమె కిటికీ తెరిచింది.
The window was opened by her. కిటికీని ఆమె తెరచింది లేదా కిటికీ ఆమె చేత తెరవబడింది.
The window was not opened by her. కిటికీని ఆమె తెరవలేదు లేదా కిటికీ ఆమె చేత తెరువబడలేదు.
Was the window opened by her? కిటికీని ఆమె తెరిచిందా లేదా కిటికీ ఆమె చేత తెరువబడిందా?
Was the window not opened by her? కిటికీని ఆమె తెరవలేదా లేదా కిటికీ ఆమె చేత తెరవబడలేదా?
   
6. They built a house. 6. వారు ఇల్లు కట్టుకున్నారు.
A house was built by them. ఇంటిని వారు కట్టినారు లేదా ఇల్లు వారి చేత కట్టబడినది.
A house was not built by them. ఇంటిని వారు కట్టలేదు లేదా ఇల్లు వారి చేత కట్టబడలేదు.
Was a house built by them? ఇంటిని వారు కట్టినారా? లేదా ఇల్లు వారి చేత కట్టబడినదా?
Was a house not built by them? ఇంటిని వారు కట్ట లేదా? ఇల్లు వారి చేత కట్టబడలేదా?
   
7. We painted the wall. 7. మేము గోడకు పెయింటింగ్ వేసాము.
The wall was painted by us. గోడకు మేము పెయింటింగ్ వేసాము లేదా గోడకు మా చేత పెయింటింగ్ వేయబడింది.
The wall was not painted by us. గోడకు మేము పెయింటింగ్ వెయ్యలేదు లేదా గోడకు మా చేత పెయింటింగ్ వెయ్యబడలేదు.
Was the wall painted by us? గోడకు మేము పెయింటింగ్ వేసామా? లేదా గోడకు మా చేత పెయింటింగ్ వేయబడిందా?
Was the wall not painted by us? గోడకు మేము పెయింటింగ్ వెయ్యలేదా లేదా గోడకు మా చేత పెయింటింగ్ వెయ్యబడలేదా?
   
8. The children broke the glass. 8. పిల్లలు  అద్దాన్ని పగలగొట్టారు.
The glass was broken by the children. అద్దాన్ని పిల్లలు పగలగొట్టారు. లేదా అద్దం పిల్లల చేత పగలగొట్టబడింది
The glass was not broken by the children. అద్దమును పిల్లలు పగలగొట్టలేదు లేదా పిల్లల చేత  అద్దం పగలగొట్టబడలేదు.
Was the glass broken by the children?   అద్దమును పిల్లలు పగలగొట్టినారా లేదా అద్దము పిల్లల చేత పగలగొట్టబడినదా?
Was the glass not broken by the children? అద్దమును పిల్లలు పగలగొట్టలేదా లేదా  అద్దము పిల్లల చేత పగలగొట్టబడలేదా?
   
9. They completed the assignment. 9. వారు అప్పగించిన పనిని పూర్తి చేసారు.
The assignment was completed by them. అప్పగించిన పనిని వారు పూర్తి చేశారు లేదా అప్పగించబడిన పనిని   వారి చేత పూర్తి చేయబడినది
The assignment was not completed by them. అప్పగించిన పనిని వారు పూర్తి చేయలేదు లేదా అప్పగించబడిన పని వారిచేత పూర్తి చేయబడలేదు
Was the assignment completed by them? అప్పగించిన పనిని వారు పూర్తి చేసినారా? లేదా అప్పగించబడిన పని వారి చేత పూర్తి చేయబడినదా?
Was the assignment not completed by them? అప్పగించిన పనిని వారు పూర్తి చేయలేదా లేదా అప్పగించబడిన పని  వారి చేత పూర్తి చేయబడలేదా?
   
10. We watched the movie. 10. మేము సినిమా చూశాము.
The movie was watched by us. సినిమాను మేము చూసాము లేదా సినిమా మా చేత చూడబడింది.
The movie was not watched by us. సినిమాను మేము చూడలేదు లేదా సినిమా మా చేత చూడబడలేదు
Was the movie watched by us? సినిమాను మేము చూసినామా? లేదా సినిమా మా చేత చూడబడినదా?
Was the movie not watched by us? సినిమాను మేము చూడలేదా? లేదా సినిమా మా చేత చూడబడలేదా?

 Table 2

1. He sang a song. 1. అతను ఒక పాట పాడాడు.
A song was sung by him. ఒక పాటను అతను పాడాడు లేదా ఒక పాట అతని చేత పాడబడింది.
A song was not sung by him. ఒక పాటను అతను పాడలేదు లేదా ఒక పాట అతని చేత పాడబడలేదు.
Was a song sung by him? ఒక పాటను అతను పాడినాడా?లేదా ఒక పాట అతని చేత పాడబడినదా?
Was a song not sung by him? ఒక పాటను అతను పాడలేదా? లేదా ఒక పాట అతని చేత పాడబడలేదా?
   
2. She prepared the meal. 2. ఆమె భోజనం సిద్ధం చేసింది.
The meal was prepared by her. భోజనమును ఆమె సిద్ధం చేసింది లేదా భోజనము ఆమె చేత సిద్ధం చేయబడింది.
The meal was not prepared by her. భోజనమును ఆమె సిద్ధము చేయలేదు.
Was the meal prepared by her? భోజనమును ఆమె సిద్ధము చేసినదా?
Was the meal not prepared by her? భోజనమును ఆమె సిద్ధము చేయలేదా?
   
3. The boy kicked the ball. 3. బాలుడు బంతిని తన్నాడు.
The ball was kicked by the boy. బంతిని బాలుడు తన్నాడు.
The ball was not kicked by the boy. బంతిని బాలుడు తన్నలేదు.
Was the ball kicked by the boy? బంతిని బాలుడు తన్నాడా?
Was the ball not kicked by the boy? బంతిని బాలుడు తన్న లేదా?
   
4. He drew a picture. 4. అతను ఒక చిత్రాన్ని గీసాడు.
A picture was drawn by him. చిత్రాన్ని అతను గీశాడు.
A picture was not drawn by him. చిత్రాన్ని అతను గీయలేదు.
Was a picture drawn by him? చిత్రాన్ని అతను గీసినాడా?
Was a picture not drawn by him? చిత్రాన్ని అతను గీయలేదా?
   
5. She washed the clothes. 5. ఆమె బట్టలు ఉతికింది.
The clothes were washed by her. బట్టలను ఆమె  ఉతికింది.
The clothes were not washed by her. బట్టలను ఆమె ఉతకలేదు.
Were the clothes washed by her? బట్టలను ఆమె  ఉతికిందా?
Were the clothes not washed by her? బట్టలను ఆమె ఉతకలేదా?
   
6. They played a game. 6. వారు ఒక ఆట ఆడారు.
A game was played by them. ఆటను వారు ఆడారు లేదా ఆట వారి చేత ఆడబడింది.
A game was not played by them. ఆటను వారు ఆడలేదు.
Was a game played by them? ఆటను వారు ఆడినారా?
Was a game not played by them? ఆటను వారు ఆడలేదా?
   
7. We solved the problem. 7. మేము సమస్యను పరిష్కరించాము.
The problem was solved by us. సమస్యను మేము పరిష్కరించాము.
The problem was not solved by us. సమస్యను మేము పరిష్కరించలేదు.
Was the problem solved by us? సమస్యను మేము పరిష్కరించినామా?
Was the problem not solved by us? సమస్యను  మేము పరిష్కరించలేదా?
   
8. The children planted flowers. 8. పిల్లలు పూలు నాటారు.
Flowers were planted by the children. పూలను పిల్లలు నాటారు లేదా పూలు పిల్లల చేత నాటబడినాయి.
Flowers were not planted by the children. పూలను పిల్లలు నాటలేదు లేదా పూలు పిల్లల చేత నాటబడలేదు.
Were flowers planted by the children? పూలను పిల్లలు నాటినారా? లేదా పూలు పిల్లల చేత నాటబడినాయా?
Were flowers not planted by the children? పూలను పిల్లలు  మాట లేదా? లేదా పూలు పిల్లల చేత నాటబడలేదా?
   
9. They fixed the roof. 9. వారు పైకప్పును అమర్చినారు.
The roof was fixed by them. పై కప్పును వారు అమర్చినారు.
The roof was not fixed by them. పైకప్పును వారు అమర్చలేదు.
Was the roof fixed by them? పైకప్పును వారు అమర్చినారా?
Was the roof not fixed by them? పైకప్పును వారు అమర్చలేదా?
   
10. We visited the park. 10. మేము పార్కును సందర్శించాము.
The park was visited by us. పార్కును మేము సందర్శించాము.
The park was not visited by us. పార్కును మేము సందర్శించలేదు.
Was the park visited by us? పార్కును మేము సందర్శించినామా?
Was the park not visited by us? పార్కును మేము సందర్శించలేదా?

by ని ఉపయోగించకుండా కొన్ని సెంటెన్స్ ఇచ్చినాము.  మీకు ఇష్టమైతే by ఉపయోగించి  ఆబ్జెక్టుగా ఎవరి పేరునైనా అనుకోండి.

 

Table 3

క్రింద ఉన్న సెంటెన్స్ వరుసగా.

passive voice

 passive voice negative

 passive voice interrogative

 passive voice negative interrogative  

1.     John was informed about the delay. 1.      జాన్ కి ఆలస్యం గురించి సమాచారం ఇచ్చినారు లేదా  జాన్ కి ఆలస్యం గురించి సమాచారం ఇవ్వబడింది
John was not informed about the delay.  జాన్ కి ఆలస్యం గురించి సమాచారం ఇవ్వలేదు.
Was John informed about the delay?  జాన్ కి ఆలస్యం గురించి సమాచారం ఇచ్చినారా?
Was John not informed about the delay?  జాన్ కి ఆలస్యం గురించి సమాచారం  ఇవ్వలేదా?
   
2.     Mary was congratulated for her achievement. 2.     మేరీ సాధించిన విజయానికి అభినందనలు తెలిపారు.
Mary was not congratulated for her achievement. మేరీ సాధించిన విజయానికి అభినందనలు తెలుపలేదు.
Was Mary congratulated for her achievement? మేరీ సాధించిన విజయానికి అభినందనలు తెలిపారా ?
Was Mary not congratulated for her achievement? మేరీ సాధించిన విజయానికి అభినందనలు తెలుపలేదా?
   
3.     Peter was promoted to a higher position.  3.     పీటర్ కు ఉన్నత స్థానానికి పదోన్నతి కల్పించారు.
Peter was not promoted to a higher position.  పీటర్కు ఉన్నత స్థానానికి పదోన్నతి కల్పించలేదు.
Was Peter promoted to a higher position?  పీటర్కు ఉన్నత స్థానానికి పదోన్నతి కల్పించినారా?
Was Peter not promoted to a higher position?  పీటర్ కు ఉన్నత స్థానానికి పదోన్నతి కల్పించలేదా?
   
4.     Sarah was invited to the annual function. 4.      సారాను వార్షిక కార్యక్రమానికి ఆహ్వానించినారు.
Sarah was not invited to the annual function.  సారాను వార్షిక కార్యక్రమానికి  ఆహ్వానించలేదు.
Was Sarah invited to the annual function?  సారాను వార్షిక కార్యక్రమానికి ఆహ్వానించినారా?
Was Sarah not invited to the annual function?  సారాను వార్షిక కార్యక్రమానికి ఆహ్వానించలేదా?
   
5.     Lucy was praised for her dedication. 5.     లూసీ అంకితభావానికి ప్రశంసలు అందుకుంది.
Lucy was not praised for her dedication. లూసీ తన అంకితభావానికి ప్రశంసించబడలేదు.
Was Lucy praised for her dedication? లూసీ తన అంకితభావానికి ప్రశంసించబడిందా?
Was Lucy not praised for her dedication? లూసీ తన అంకితభావానికి ప్రశంసించబడలేదా?
   
6.     David was warned about the rules. 6.     డేవిడ్ ని నిబంధనల గురించి హెచ్చరించారు లేదా డేవిడ్ నిబంధనల గురించి హెచ్చరించబడినాడు.
David was not warned about the rules. డేవిడ్ ని నిబంధనల గురించి హెచ్చరించలేదు.
Was David warned about the rules? డేవిడ్ ని నిబంధనల గురించి హెచ్చరించారా?
Was David not warned about the rules? డేవిడ్ ని నిబంధనల గురించి హెచ్చరించలేదా?
   
7.     Emma was selected for the competition. 7.     ఎమ్మా ని పోటీకి ఎంపిక చేసినారు లేదా ఎమ్మా పోటీకి ఎంపిక చేయబడింది.
Emma was not selected for the competition. ఎమ్మా ని పోటీకి ఎంపిక  చేయలేదు.
Was Emma selected for the competition? ఎమ్మా ని పోటీకి ఎంపిక చేసినారా?
Was Emma not selected for the competition? ఎమ్మా ని పోటీకి ఎంపిక చేయలేదా?
   
8.     Jake was transferred to another department. 8.     జేక్‌ను మరో విభాగానికి బదిలీ చేశారు.
Jake was not transferred to another department. జేక్‌ను వేరే విభాగానికి బదిలీ చేయలేదు.
Was Jake transferred to another department? జేక్‌ని వేరే విభాగానికి బదిలీ చేశారా?
Was Jake not transferred to another department? జేక్‌ను వేరే విభాగానికి బదిలీ చేయలేదా?
   
9.     Alice was awarded a certificate of excellence. 9.     ఆలిస్‌కు ఎక్సలెన్స్ సర్టిఫికెట్ లభించింది.
Alice was not awarded a certificate of excellence. ఆలిస్‌కు ఎక్సలెన్స్ సర్టిఫికెట్ ఇవ్వలేదు.
Was Alice awarded a certificate of excellence? ఆలిస్‌కు ఎక్సలెన్స్ సర్టిఫికెట్ లభించిందా?
Was Alice not awarded a certificate of excellence? ఆలిస్‌కు ఎక్సలెన్స్ సర్టిఫికేట్ ఇవ్వలేదా?
   
10.  Tom was appointed as the team leader. 10.  టామ్‌ను టీమ్ లీడర్‌గా నియమించారు.
Tom was not appointed as the team leader. టామ్‌ను టీమ్ లీడర్‌గా నియమించలేదు.
Was Tom appointed as the team leader? టామ్‌ను టీమ్ లీడర్‌గా నియమించారా?
Was Tom not appointed as the team leader? టామ్‌ను టీమ్ లీడర్‌గా నియమించలేదా?

 

Table 4

   
1. John was honoured with an award for his service. 1. జాన్ ను తన సేవకు గాను అవార్డుతో సత్కరించినారు.
John was not honoured with an award for his service. జాన్ ను తన సేవకు గాను అవార్డుతో సత్కరించలేదు.
Was John honoured with an award for his service? జాన్ ను తన సేవకు గాను అవార్డుతో సత్కరించినారా.?
Was John not honoured with an award for his service? జాన్ ను తన సేవకు గాను అవార్డుతో సత్కరించిలేదా.?
   
2. Mary was declared the winner of the contest.  2. మేరీని పోటీలో  విజేతగా  ప్రకటించినారు   లేదా మేరీ పోటీలో విజేతగా ప్రకటించబడింది 
Mary was not declared the winner of the contest. మేరీని పోటీలో  విజేతగా  ప్రకటించలేదు.
Was Mary declared the winner of the contest? మేరీని పోటీలో  విజేతగా  ప్రకటించినారా?
Was Mary not declared the winner of the contest? మేరీని పోటీలో  విజేతగా  ప్రకటించలేదా?
   
3. Peter was entrusted with a critical task. 3. పీటర్‌కు క్లిష్టమైన పని అప్పగించబడింది.
Peter was not entrusted with a critical task. పీటర్‌కు క్లిష్టమైన పని అప్పగించబడలేదు.
Was Peter entrusted with a critical task? పీటర్‌కు క్లిష్టమైన పని అప్పగించబడినదా?
Was Peter not entrusted with a critical task? పీటర్‌కు క్లిష్టమైన పని అప్పగించబడలేదా?
   
4. Sarah was appointed as the new secretary. 4.  సారాని కొత్త కార్యదర్శిగా నియమించారు లేదా సారా కొత్త కార్యదర్శిగా నియమించబడింది.
Sarah was not appointed as the new secretary. సారాని కొత్త కార్యదర్శిగా  నియమించలేదు.
Was Sarah appointed as the new secretary? సారాని కొత్త కార్యదర్శిగా నియమించారా?
Was Sarah not appointed as the new secretary? సారాని కొత్త కార్యదర్శిగా నియమించలేదా?
   
5. Lucy was invited to speak at the conference. 5. లూసీని సమావేశంలో మాట్లాడడానికి ఆహ్వానించారు
Lucy was not invited to speak at the conference. లూసీని సమావేశంలో మాట్లాడడానికి  ఆహ్వానించలేదు.
Was Lucy invited to speak at the conference? లూసీని సమావేశంలో మాట్లాడడానికి ఆహ్వానించారా?
Was Lucy not invited to speak at the conference? లూసీని సమావేశంలో మాట్లాడడానికి ఆహ్వానించ లేదా?
   
6. David was notified about the policy changes. 6. డేవిడ్ కు పాలసీల మార్పు గురించి తెలియజేసినారు లేదా డేవిడ్ కు పాలసీలు మార్పు గురించి తెలియజేయబడింది.
David was not notified about the policy changes. డేవిడ్ కు పాలసీల మార్పు గురించి  తెలియజేయలేదు .
Was David notified about the policy changes? డేవిడ్ కు పాలసీల మార్పు గురించి తెలియజేసినారా ?
Was David not notified about the policy changes? డేవిడ్ కు పాలసీల మార్పు గురించి తెలియజేయలేదా ?
   
8. Jake was provided with accommodation by the company. 8. జేక్‌కు కంపెనీ వసతి కల్పించింది.
Jake was not provided with accommodation by the company. జేక్‌కు కంపెనీ వసతి కల్పించలేదు.
Was Jake provided with accommodation by the company? జేక్‌కు కంపెనీ వసతి కల్పించిందా?
Was Jake not provided with accommodation by the company? జేక్‌కు కంపెనీ వసతి కల్పించలేదా?
   
9. Alice was consulted for the project’s design. 9.  అలైజ్ ను ప్రాజెక్ట్ రూపకల్పన కోసం సంప్రదించారు.
Alice was not consulted for the project’s design.  అలైజ్ ను ప్రాజెక్ట్ రూపకల్పన కోసం

సంప్రదించలేదు.

Was Alice consulted for the project’s design?  అలైజ్ ను ప్రాజెక్ట్ రూపకల్పన కోసం సంప్రదించారా.?
Was Alice not consulted for the project’s design?  అలైజ్ ను ప్రాజెక్ట్ రూపకల్పన కోసం సంప్రదించలేదా.?
   
10. Tom was introduced to the board members. 10.  టామ్ ను బోర్డు సభ్యులకు పరిచయం చేసినారు.
Tom was not introduced to the board members. టామ్‌ను బోర్డు సభ్యులకు పరిచయం చేయలేదు.
Was Tom introduced to the board members? టామ్ ను బోర్డు సభ్యులకు పరిచయం చేసినారా.?
Was Tom not introduced to the board members? టామ్ ను బోర్డు సభ్యులకు పరిచయం చేయలేదా.?