Beform అయిన am ని కేవలం ‘I (నేను) ‘ సబ్జెక్టు కు మాత్రమే ఉపయోగిస్తారు.
దీనిని ఎక్కువగా సింపుల్ ప్రెసెంట్ టెన్స్ లో ఉపయోగిస్తారు.
am= ఉన్నాను.
Am ని ఏ ఏ సందర్భాలలో ఉపయోగిస్తారో తెలుసుకుందాం
1. Present continuous tense
దీనిని Tenses లో మనం నేర్చుకున్నాము.
I అనే సబ్జెక్టు ప్రస్తుతం ఏదైనా ఒక పనిని కంటిన్యూగా చేస్తూ ఉన్నప్పుడు am అనే be from మరియు verb 4 ఉపయోగించి వాక్య నిర్మాణం చేస్తారు.
| I | Am | Verb 4 | Object |
Example: I am reading a book ( నేను ఒక పుస్తకం చదువుతూ ఉన్నాను)
పై సెంటెన్స్ ని నెగటివ్ సెంటెన్స్ గా మార్చుటకు am ప్రక్కన not చేర్చాలి
I am not reading a book
ఇప్పుడు పై రెండు వాక్యాలను ప్రశ్నా వాక్యాలుగా మార్చుటకు am ని వాక్య ప్రారంభంలో ఉంచితే సరిపోతుంది
Am I reading a book
Am I not reading a book
Examples: క్రింది మీకు negative and interrogative sentences ఆల్రెడీ అర్థం అయి ఉంటే వాటిని వదిలేయండి
| 1. I am reading a book. | 1. నేను ఒక పుస్తకం చదువుతూ ఉన్నాను |
| I am not reading a book. | నేను ఒక పుస్తకం చదవడం లేదు |
| Am I reading a book? | నేను ఒక పుస్తకం చదువుతూ ఉన్నానా? |
| Am I not reading a book? | నేను ఒక పుస్తకం చదవడం లేదా? |
| 2. I am writing a letter. | 2. నేను ఒక లేఖ రాస్తూ ఉన్నాను |
| I am not writing a letter. | నేను ఒక లేఖ రాయడం లేదు |
| Am I writing a letter? | నేను ఒక లేఖ రాస్తూ ఉన్నానా ? |
| Am I not writing a letter? | నేను ఒక లేఖ రాయడం లేదా? |
| 3. I am learning English. | 3. నేను ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉన్నాను |
| I am not learning English. | నేను ఇంగ్లీష్ నేర్చుకోవడం లేదు. |
| Am I learning English? | నేను ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉన్నానా ? |
| Am I not learning English? | నేను ఇంగ్లీష్ నేర్చుకోవడం లేదా? |
| 4. I am working now. | 4. నేను ఇప్పుడు పని చేస్తూ ఉన్నాను. |
| I am not working now. | నేను ఇప్పుడు పని చేయడం లేదు. |
| Am I working now? | నేను ఇప్పుడు పని చేస్తూ ఉన్నానా |
| Am I not working now? | నేను ఇప్పుడు పని చేయడం లేదా? |
| 5. I am watching TV. | 5. నేను టీవీ చూస్తూ ఉన్నాను. |
| I am not watching TV. | నేను టీవీ చూడటం లేదు. |
| Am I watching TV? | నేను టీవీ చూస్తూ ఉన్నానా? |
| Am I not watching TV? | నేను టీవీ చూడటం లేదా? |
| 6. I am speaking English. | 6. నేను ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉన్నాను |
| I am not speaking English. | నేను ఇంగ్లీష్ మాట్లాడటం లేదు . |
| Am I speaking English? | నేను ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉన్నానా? |
| Am I not speaking English? | నేను ఇంగ్లీష్ మాట్లాడటం లేదా? |
| 7. I am waiting here. | 7. నేను ఇక్కడ వేచి ఉన్నాను. |
| I am not waiting here. | నేను ఇక్కడ వేచిలేను. |
| Am I waiting here? | నేను ఇక్కడ వేచి ఉన్నానా? |
| Am I not waiting here? | నేను ఇక్కడ వేచి లేనా? |
| 8. I am going home. | 8. నేను ఇంటికి వెళ్తూ ఉన్నాను. |
| I am not going home. | నేను ఇంటికి వెళ్ళడం లేదు. |
| Am I going home? | నేను ఇంటికి వెళ్తూ ఉన్నానా? |
| Am I not going home? | నేను ఇంటికి వెళ్ళడం లేదా? |
| 9. I am listening carefully. | 9. నేను జాగ్రత్తగా వింటూ ఉన్నాను. |
| I am not listening carefully. | నేను జాగ్రత్తగా వినడం లేదు. |
| Am I listening carefully? | నేను జాగ్రత్తగా వింటూ ఉన్నానా? |
| Am I not listening carefully? | నేను జాగ్రత్తగా వినడం లేదా? |
| 10. I am preparing for exams. | 10. నేను పరీక్షలకు సిద్ధమవుతూ ఉన్నాను. |
| I am not preparing for exams. | నేను పరీక్షలకు సిద్ధమవడం లేదు. |
| Am I preparing for exams? | నేను పరీక్షలకు సిద్ధమవుతు ఉన్నానా? |
క్రింది సెంటెన్స్ ని కూడా నెగిటివ్ సెంటెన్స్ లో మార్చుటకు am తరువాత not ఉంచండి.
ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ కి ప్రారంభంలో am ఉంచండి
| 2. Profession:I అనే సబ్జెక్టు యొక్క ప్రస్తుత వృత్తిని గురించి తెలియజేయడానికి | |
| I am a student. | నేను ఒక విద్యార్థిని. |
| I am a teacher. | నేను ఒక ఉపాధ్యాయుడిని. |
| I am a doctor. | నేను ఒక వైద్యుడిని. |
| I am an engineer. | నేను ఒక ఇంజనీర్ ని. |
| I am a driver. | నేను ఒక డ్రైవర్ ని. |
| I am a farmer. | నేను ఒక రైతును. |
| I am a businessman. | నేను ఒక వ్యాపారవేత్తని. |
| I am a worker. | నేను ఒక కార్మికుడిని. |
| I am a manager. | నేను ఒక మేనేజర్‌ని. |
| I am an employee. | నేను ఒక ఉద్యోగిని. |
| 3. Emotions: I అనే సబ్జెక్టు యొక్క ప్రస్తుత భావాల గురించి తెలియజేయడానికి | |
| I am happy. | నేను సంతోషంగా ఉన్నాను. |
| I am sad. | నాకు బాధగా ఉంది. |
| I am tired. | నేను అలసిపోయాను. |
| I am angry. | నాకు కోపంగా ఉంది. |
| I am nervous. | నాకు భయంగా ఉంది. |
| I am excited. | నేను ఉత్సాహంగా ఉన్నాను. |
| I am worried. | నేను ఆందోళన చెందుతున్నాను. |
| I am relaxed. | నేను రిలాక్స్‌గా ఉన్నాను. |
| I am bored. | నాకు బోర్ కొడుతోంది. |
| I am confident. | నాకు నమ్మకంగా ఉంది. |
| 4. Location: I అనే సబ్జెక్టు యొక్క ప్రస్తుత స్థలాన్ని గురించి తెలియజేయడానికి | |
| I am at home. | నేను ఇంట్లో ఉన్నాను. |
| I am in the office. | నేను ఆఫీసులో ఉన్నాను. |
| I am at school. | నేను స్కూల్లో ఉన్నాను. |
| I am in the room. | నేను గదిలో ఉన్నాను. |
| I am at the shop. | నేను దుకాణంలో ఉన్నాను. |
| I am in the village. | నేను గ్రామంలో ఉన్నాను. |
| I am at the bus stop. | నేను బస్ స్టాప్ లో ఉన్నాను. |
| I am in the city. | నేను నగరంలో ఉన్నాను. |
| I am at work. | నేను పనిలో ఉన్నాను. |
| I am here now. | నేను ఇప్పుడు ఇక్కడ ఉన్నాను. |
| 5. Age / Time :I అనే సబ్జెక్టు యొక్క ప్రస్తుత వయస్సు మరయు సమయం గురించి తెలియజేయడానికి | |
| I am 20 years old. | నా వయసు 20 సంవత్సరాలు. |
| I am 25 now. | నా వయసు ఇప్పుడు 25. |
| I am late today. | నేను ఈరోజు ఆలస్యంగా వచ్చాను. |
| I am early today. | నేను ఈరోజు త్వరగా వచ్చాను. |
| I am on time. | నేను సమయానికి వచ్చాను. |
| I am free now. | నేను ఇప్పుడు ఖాళీగా ఉన్నాను. |
| I am busy today. | నేను ఈ రోజు బిజీగా ఉన్నాను. |
| I am ready now. | నేను ఇప్పుడు సిద్ధంగా ఉన్నాను. |
| I am safe here. | నేను ఇక్కడ సురక్షితంగా ఉన్నాను. |
| I am in trouble. | నేను ఇబ్బందుల్లో ఉన్నాను. |
క్రింది వాటిని ఒకసారి గమనించండి
am + verb3
is + verb3
are + verb3
was + verb3
were+ verb3
will be + verb3
పైరూపాలను ఇంతకుముందు మనం పాసివ్ వాయిస్ లో ఉపయోగించి ఉన్నాము.ఈ రూపంలో ఉన్న వాక్యాలు రెండు అర్థాలతో ఉపయోగించబడతాయి
I am tired =నన్ను అలసిపోయేటట్లు చేశారు (passive voice)
నేను అలసిపోయి ఉన్నాను (state sentence = స్థితి )
సందర్భంగా బట్టి ఆ అర్ధాన్ని మనమే తెలుసుకోవాలి
|
I am tired. |
|
| నేను అలసిపోయి ఉన్నాను (state sentence) | నన్ను అలసిపో చేశారు (passive) |
|
I am confused. |
|
| నేను అయోమయంలో ఉన్నాను. | నన్ను అయోమయంలో పడవేశారు |
|
I am bored. |
|
| నేను విసుగు చెంది ఉన్నాను | నన్ను విసిగించారు |
|
I am surprised. |
|
| నేను ఆశ్చర్యపోయి ఉన్నాను | నన్ను ఆశ్చర్యపరిచారు |
|
I am worried. |
|
| నేను ఆందోళన చెంది ఉన్నాను | నన్ను ఆందోళన చేశారు |
|
I am excited. |
|
| నేను ఉత్సాహంగా ఉన్నాను. | నన్ను ఉత్సహింప చేశారు |
|
I am satisfied. |
|
| నేను సంతృప్తి చెంది ఉన్నాను | నన్ను సంతృప్తి పరిచారు |
|
I am disappointed. |
|
| నేను నిరాశ చెంది ఉన్నాను | నన్ను నిరాశ పరిచారు |
|
I am relaxed. |
|
| నేను రిలాక్స్‌గా ఉన్నాను. | నన్ను రిలాక్స్ చేశారు |
|
I am shocked. |
|
| నేను షాక్ అయి ఉన్నాను | నన్ను షాక్కుకు గురి చేశారు |
Am ని passive voice లో ఏ విధంగా ఉపయోగిస్తారో టాక్సీ వాయిస్ passive voice తెలుసుకోండి

