హాయ్ ఫ్రెండ్స్ సహాయక క్రియలు (Auxiliary verbs) ప్రధానంగా మూడు రకాలు

  1. Primary auxiliary verbs
  2. Model auxiliary verbs
  3. Semi model auxiliary verbs

1.Primary auxiliary verbs : ఇవి ప్రధానంగా              మూడు రకాలు

       Be forms :  is, am, are, was, were, be,         been, being.   

       Do forms: Do, Does, Did.

       Have forms: Have, Has, Had

2.Model auxiliary verbs : Will, Would, Can, Could, Shall, Should, May, Might, Must 

3.Semi model auxiliary verbs: need to, have to, used to, ought to, dare to

 

ఇప్పుడు Modal auxiliary verbs గురించి తెలుసుకుందాం

1.Modal auxiliary verbs ని singular subjects  మరియు Plural subjects  అనే తేడా లేకుండా అన్ని సబ్జెక్టులకు కామన్ గా ఉపయోగిస్తారు. 

ఉదాహరణకు will అనే modal verb తీసుకున్నట్లయితే He, She, It, I, We, You, They సబ్జెక్టులు అన్నిటికీ కామన్ గా ఉపయోగిస్తారు.

2. Modal auxiliary verbs ఎక్కడైనా సెంటెన్స్ లో కనిపించినట్లయితే వాటి తర్వాత కచ్చితంగా verb1 (base form) మాత్రమే ఉపయోగించాలి.

3.Modal auxiliary verbs ఉన్న వాక్యాలను వ్యతిరేక వాక్యాలుగా మార్చుటకు కేవలం not చేరిస్తే సరిపోతుంది. వాటిని ప్రశ్నా వాక్యాలుగా మార్చుటకు  Modal auxiliary verbs ని వాక్య ప్రారంభంలో ఉంచితే సరిపోతుంది. 

 ఇప్పుడు ఒక్కొక్క Model verb  గురించి వివరంగా తెలుసుకుందాం

Will :

1. Will ని అన్ని సబ్జెక్టులకు కామన్ గా ఉపయోగిస్తారు.

He, She, It, I, We, You, They Will  object

2. భవిష్యత్తులో చేసే పనులను సూచించడానికి ఈ will  అనే  సహాయక్రియను ఉపయోగిస్తారు. భవిష్యత్తు అనగా ఐదు నిమిషాల తర్వాత కావచ్చు, రేపు కావచ్చు,ఒక వారం తర్వాత కావచ్చు, ఒక నెల తర్వాత కావచ్చు, లేదా సంవత్సరం తర్వాత కావచ్చు. 

౩. ఒక సెంటెన్స్ లో will తరువాత verb1 మాత్రమే ఉపయోగిస్తారు

4. Will ఒక సెంటెన్స్ లో ఉన్నప్పుడు దానిని వ్యతిరేకంగా వాక్యంగా  మార్చుటకు not చేర్చాలి. ఒకవేళ ఆ సెంటెన్స్ ని ప్రశ్న వాక్యంగా  మార్చాలి అనుకుంటే will  ని సెంటెన్స్ ప్రారంభంలో ఉంచితే సరిపోతుంది. 

Example :  I will send Ravi  = నేను రవిని పంపిస్తాను. (భవిష్యత్తులో పంపిస్తాను ఎప్పుడు పంపిస్తానో తెలియదు)

పై వాక్యాన్ని వ్యతిరేక వాక్యంగా  (Negative sentence) మార్చుటకు will తరువాత not  చేరిస్తే సరిపోతుంది.  

 I will not send Ravi = రవిని నేను పంపించను 

పై రెండు వాక్యాలను ప్రశ్నా వాక్యాలుగా మార్చుటకు will ను సెంటెన్స్ ప్రారంభంలో ఉంచితే సరిపోతుంది. 

will  I send Ravi  ? ( Interrogative sentence)

రవిని నేను పంపిస్తానా ?

will  I not send Ravi? ( Negative interrogative sentence)

రవిని నేను పంపించనా ?

 

Will ని  ఏఏ  సందర్భాల్లో ఉపయోగిస్తారో  తెలుసుకుందాం

 

1. భవిష్యత్తులో చేసే పనులను గురించి తెలియజేయడానికి .

1. I will start my business next year. 1. నేను వచ్చే ఏడాది నా వ్యాపారాన్ని ప్రారంభిస్తాను.
I will not start my business next year. నేను వచ్చే ఏడాది నా వ్యాపారాన్ని ప్రారంభించను.
Will I start my business next year? నేను వచ్చే ఏడాది నా వ్యాపారాన్ని ప్రారంభిస్తానా?
Will I not start my business next year? నేను వచ్చే ఏడాది నా వ్యాపారాన్ని ప్రారంభించనా?
   
2. You will learn spoken English soon. 2. మీరు త్వరలో స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకుంటారు.
You will not learn spoken English soon. మీరు త్వరలో స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోరు.
Will you learn spoken English soon? మీరు త్వరలో స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకుంటారా?
Will you not learn spoken English soon? మీరు త్వరలో స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోరా?
   
3. He will join the company tomorrow. 3. అతను రేపు కంపెనీలో చేరతాడు.
He will not join the company tomorrow. అతను రేపు కంపెనీలో చేరడు.
Will he join the company tomorrow? అతను రేపు కంపెనీలో చేరతాడా?
Will he not join the company tomorrow? అతను రేపు కంపెనీలో చేరడా ?
   
4. She will complete the course this month. 4. ఆమె ఈ నెలలో కోర్సు పూర్తి చేస్తుంది.
She will not complete the course this month. ఆమె ఈ నెలలో కోర్సు పూర్తి చేయదు.
Will she complete the course this month? ఆమె ఈ నెలలో కోర్సు పూర్తి చేస్తుందా?
Will she not complete the course this month? ఆమె ఈ నెలలో కోర్సు పూర్తి చేయదా?
   
5. It will improve your confidence. 5. ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని మెరుగుపరుస్తుంది.
It will not improve your confidence. ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని మెరుగుపరచదు.
Will it improve your confidence? ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని మెరుగుపరుస్తుందా?
Will it not improve your confidence? అది మీ ఆత్మవిశ్వాసాన్ని మెరుగుపరచదా?
   
6. We will attend the meeting tomorrow. 6. మేము రేపు సమావేశానికి హాజరవుతాము.
We will not attend the meeting tomorrow. మేము రేపు సమావేశానికి హాజరు కాము.
Will we attend the meeting tomorrow? మేము రేపు సమావేశానికి హాజరవుతామా .?
Will we not attend the meeting tomorrow? మేము రేపు సమావేశానికి హాజరు కామా?
   
7. They will visit Hyderabad next week. 7. వారు వచ్చే వారం హైదరాబాద్ సందర్శిస్తారు.
They will not visit Hyderabad next week. వారు వచ్చే వారం హైదరాబాద్ సందర్శించరు.
Will they visit Hyderabad next week? వారు వచ్చే వారం హైదరాబాద్ సందర్శిస్తారా?
Will they not visit Hyderabad next week? వారు వచ్చే వారం హైదరాబాద్ సందర్శించరా?
   
8. My father will retire next year. 8. మా నాన్నగారు వచ్చే ఏడాది రిటైర్ అవుతారు.
My father will not retire next year. మా నాన్నగారు వచ్చే ఏడాది రిటైర్ అవ్వరు.
Will my father retire next year? మా నాన్నగారు వచ్చే ఏడాది రిటైర్ అవుతారా?
Will my father not retire next year? మా నాన్నగారు వచ్చే ఏడాది రిటైర్ అవ్వరా?
   
9. My mother will prepare lunch tomorrow. 9. నా తల్లి రేపు భోజనం సిద్ధం చేస్తుంది.
My mother will not prepare lunch tomorrow. నా తల్లి రేపు భోజనం సిద్ధం చేయదు.
Will my mother prepare lunch tomorrow? నా తల్లి రేపు భోజనం సిద్ధం చేస్తుందా ?
Will my mother not prepare lunch tomorrow? నా తల్లి రేపు భోజనం సిద్ధం చేయదా?
   
10. The teacher will explain the lesson tomorrow. 10. టీచర్ రేపు పాఠాన్ని వివరిస్తారు.
The teacher will not explain the lesson tomorrow. టీచర్ రేపు పాఠం వివరించరు.
Will the teacher explain the lesson tomorrow? టీచర్ రేపు పాఠం వివరిస్తారా?
Will the teacher not explain the lesson tomorrow? టీచర్ రేపు పాఠం వివరించరా?
   
11. The student will write the exam next Monday. 11. ఆ విద్యార్థి వచ్చే సోమవారం పరీక్ష రాస్తాడు.
The student will not write the exam next Monday. ఆ విద్యార్థి వచ్చే సోమవారం పరీక్ష రాయడు.
Will the student write the exam next Monday? ఆ విద్యార్థి వచ్చే సోమవారం పరీక్ష రాస్తాడా?
Will the student not write the exam next Monday? ఆ విద్యార్థి వచ్చే సోమవారం పరీక్ష రాయడా?
   
12. Our team will play the final match. 12. మా జట్టు ఫైనల్ మ్యాచ్ ఆడుతుంది.
Our team will not play the final match. మా జట్టు ఫైనల్ మ్యాచ్ ఆడదు.
Will our team play the final match? మన జట్టు ఫైనల్ మ్యాచ్ ఆడుతుందా?
Will our team not play the final match? మన జట్టు ఫైనల్ మ్యాచ్ ఆడదా?
   
13. The company will launch a new product. 13. కంపెనీ కొత్త ఉత్పత్తిని ప్రారంభిస్తుంది.
The company will not launch a new product. కంపెనీ కొత్త ఉత్పత్తిని ప్రారంభించదు.
Will the company launch a new product? కంపెనీ కొత్త ఉత్పత్తిని ప్రారంభిస్తుందా?
Will the company not launch a new product? కంపెనీ కొత్త ఉత్పత్తిని ప్రారంభించదా?
   
14. My friend will shift to Chennai. 14. నా స్నేహితుడు చెన్నైకి మారతాడు.
My friend will not shift to Chennai. నా స్నేహితుడు చెన్నైకి మారడు.
Will my friend shift to Chennai? నా స్నేహితుడు చెన్నైకి మారుతాడా?
Will my friend not shift to Chennai? నా స్నేహితుడు చెన్నైకి మారడా?
   
15. The doctor will check the report tomorrow. 15. డాక్టర్ రేపు నివేదికను తనిఖీ చేస్తారు.
The doctor will not check the report tomorrow. డాక్టర్ రేపు నివేదికను తనిఖీ చేయడు .
Will the doctor check the report tomorrow? డాక్టర్ రేపు నివేదికను తనిఖీ చేస్తాడా ?
Will the doctor not check the report tomorrow? డాక్టర్ రేపు నివేదికను తనిఖీ చేయడా?
   
16. The driver will pick us up at 6 AM. 16.ఉదయం 6 గంటలకు డ్రైవర్ మమ్మల్ని పికప్ చేస్తాడు.
The driver will not pick us up at 6 AM. ఉదయం 6 గంటలకు డ్రైవర్ మమ్మల్ని పికప్ చేయడు.
Will the driver pick us up at 6 AM? ఉదయం 6 గంటలకు డ్రైవర్ మమ్మల్ని పికప్ చేస్తాడా?
Will the driver not pick us up at 6 AM? ఉదయం 6 గంటలకు డ్రైవర్ మమ్మల్ని పికప్ చేయడా?
   
17. Her brother will open a new shop. 17. ఆమె సోదరుడు కొత్త దుకాణం తెరుస్తాడు.
Her brother will not open a new shop. ఆమె సోదరుడు కొత్త దుకాణం తెరవడు.
Will her brother open a new shop? ఆమె సోదరుడు కొత్త దుకాణం తెరుస్తాడా?
Will her brother not open a new shop? ఆమె సోదరుడు కొత్త దుకాణం తెరవడా?
   
18. The government will announce new rules. 18. ప్రభుత్వం కొత్త నియమాలను ప్రకటిస్తుంది.
The government will not announce new rules. ప్రభుత్వం కొత్త నియమాలను ప్రకటించదు.
Will the government announce new rules? ప్రభుత్వం కొత్త నియమాలను ప్రకటిస్తుందా?
Will the government not announce new rules? ప్రభుత్వం కొత్త నియమాలను ప్రకటించదా?
   
19. This app will help beginners. 19. ఈ యాప్ ప్రారంభకులకు సహాయపడుతుంది.
This app will not help beginners. ఈ యాప్ ప్రారంభకులకు సహాయం చేయదు.
Will this app help beginners? ఈ యాప్ ప్రారంభకులకు సహాయపడుతుందా?
Will this app not help beginners? ఈ యాప్ ప్రారంభకులకు సహాయం చేయదా?
   
20. The train will reach the station by night. 20. రైలు రాత్రికి స్టేషన్ చేరుకుంటుంది.
The train will not reach the station by night. రైలు రాత్రికి స్టేషన్‌కు చేరుకోదు.
Will the train reach the station by night? రైలు రాత్రికి స్టేషన్ కి చేరుకుంటుందా?
Will the train not reach the station by night? రైలు రాత్రికి స్టేషన్ కు చేరుకోదా?

మరికొన్ని ఉదాహరణలు చూడండీ. 

I will support you. నేను మీకు మద్దతు ఇస్తాను.
She will respect your decision. ఆమె మీ నిర్ణయాన్ని గౌరవిస్తుంది.
He will return the books. అతను పుస్తకాలు తిరిగి ఇస్తాడు.
We will complete the task. మేము పనిని పూర్తి చేస్తాము.
They will follow the rules. వారు నియమాలను పాటిస్తారు.
My friend will keep the secret. నా స్నేహితుడు రహస్యంగా ఉంచుతాడు.
The worker will repair the machine. కార్మికుడు యంత్రాన్ని రిపేర్ చేస్తాడు.
My sister will attend the function. నా సోదరి ఆ కార్యక్రమానికి హాజరవుతుంది.
The officer will solve the issue. ఆ అధికారి సమస్యను పరిష్కరిస్తారు.
Our leader will guide us. మన నాయకుడు మనకు మార్గనిర్దేశం చేస్తాడు.
The student will obey the teacher. విద్యార్థి గురువు మాట వింటాడు.
His father will arrange the money. అతని తండ్రి డబ్బు ఏర్పాటు చేస్తాడు.
The company will refund the amount. కంపెనీ ఆ మొత్తాన్ని తిరిగి చెల్లిస్తుంది.
Her son will visit daily. ఆమె కొడుకు రోజూ వస్తాడు.
The driver will maintain speed. డ్రైవర్ వేగాన్ని నిర్వహిస్తాడు.
My uncle will arrange tickets. మామయ్య టిక్కెట్లు ఏర్పాటు చేస్తాడు.
The nurse will monitor the patient. నర్సు రోగిని పర్యవేక్షిస్తుంది.
The guard will protect the building. గార్డు భవనాన్ని రక్షిస్తాడు.
The judge will review the case. న్యాయమూర్తి కేసును సమీక్షిస్తారు.
The shop will replace the item. దుకాణం ఆ వస్తువును భర్తీ చేస్తుంది.

 

2. Predictions: భవిష్యత్తులో  ఏమైనా జరగవచ్చునని అంచనా వేయడానికి. (ఇది కూడా మొదటి పాయింట్ లాగే వుంటుంది )

It will rain tonight. ఈ రాత్రి వర్షం పడుతుంది.
The train will arrive late. రైలు ఆలస్యంగా వస్తుంది.
She will score good marks. ఆమెకు మంచి మార్కులు వస్తాయి.
He will miss the bus. అతను బస్సు మిస్ అవుతాడు.
The match will end soon. మ్యాచ్ త్వరలో ముగుస్తుంది.
Prices will rise next month. వచ్చే నెలలో ధరలు పెరుగుతాయి.
That plan will fail. ఆ ప్రణాళిక విఫలమవుతుంది.
The child will fall asleep. పిల్లవాడు నిద్రపోతాడు.
Our village will grow fast. మా గ్రామం త్వరగా అభివృద్ధి చెందుతుంది.
The movie will attract youth. ఈ సినిమా యువతను ఆకట్టుకుంటుంది.
His business will expand. అతని వ్యాపారం విస్తరిస్తుంది.
The road will open tomorrow. ఆ రోడ్డు రేపు తెరుచుకుంటుంది.
Her health will improve. ఆమె ఆరోగ్యం మెరుగుపడుతుంది.
This phone will sell well. ఈ ఫోన్ బాగా అమ్ముడుపోతుంది.
The exam will become tough. పరీక్ష కఠినంగా మారుతుంది.
Their relationship will break. వారి సంబంధం తెగిపోతుంది.
The weather will change suddenly. వాతావరణం అకస్మాత్తుగా మారుతుంది.
His luck will improve. అతని అదృష్టం మెరుగుపడుతుంది.
The project will succeed. ఆ ప్రాజెక్టు విజయవంతమవుతుంది.
That building will collapse. ఆ భవనం కూలిపోతుంది.

3.Orders / Instructions: ఏదైనా చేయమని ఇతరులకు ఆజ్ఞాపించడానికి will ఉపయోగిస్తారు.

ఇది చేయాలి, అది చేయాలి  అలా ప్రతి వాక్యానికి చివరిలో “ లి “ వస్తుంది

1.You will finish the work today. మీరు ఈరోజు పని పూర్తి చేయాలి
2.Students will follow instructions. విద్యార్థులు సూచనలను పాటించాలి
3.Employees will wear ID cards. ఉద్యోగులు గుర్తింపు కార్డులు ధరించాలి.
4.Drivers will obey signals. డ్రైవర్లు సిగ్నల్స్ పాటించాలి
5.Children will respect elders. పిల్లలు పెద్దలను గౌరవించాలి
6.Staff will report on time. సిబ్బంది సమయానికి నివేదించాలి
7.Workers will clean the area. కార్మికులు ఆ ప్రాంతాన్ని శుభ్రం చేయాలి.
8.Visitors will maintain silence. సందర్శకులు నిశ్శబ్దం  పాటించాలి.
9.Candidates will submit forms. అభ్యర్థులు ఫారాలను  సమర్పించాలి.
10.Players will attend practice. ఆటగాళ్ళు ప్రాక్టీస్‌కు  హాజరవ్వాలి.
11.Passengers will stand in line. ప్రయాణీకులు వరుసలో నిలబడాలి.
12.Teachers will evaluate papers. ఉపాధ్యాయులు పత్రాలను మూల్యాంకనం  చేయాలి.
13.Officers will inspect files. అధికారులు ఫైళ్లను తనిఖీ చేయాలి.
14.Members will attend meetings. సభ్యులు సమావేశాలకు హాజరవ్వాలి.
15.Soldiers will guard borders. సైనికులు సరిహద్దులను కాపాడాలి.
16.Volunteers will assist people. స్వచ్ఛంద సేవకులు ప్రజలకు సహాయం  చేయాలి.
17.Managers will review reports. నిర్వాహకులు నివేదికలను  సమీక్షించాలి 
18.Residents will lock doors. నివాసితులు తలుపులు తాళం వేసుకోవాలి
19.Customers will keep receipts. వినియోగదారులు రశీదులను  ఉంచుకోవాలి.
20.Vendors will display prices. విక్రేతలు ధరలను  ప్రదర్శించాలి.
21. Students will wear uniforms. విద్యార్థులు యూనిఫాంలు ధరించాలి 
22. Employees will attend meetings. ఉద్యోగులు సమావేశాలకు హాజరవ్వాలి.
23. Drivers will park properly. డ్రైవర్లు సరిగ్గా పార్కింగ్  చేయాలి.
24. Visitors will carry ID cards. సందర్శకులు ఐడి కార్డులు తీసుకెళ్లాలి.
25. Workers will follow safety rules. కార్మికులు భద్రతా నియమాలను  పాటించాలి.
26. Children will finish homework. పిల్లలు హోంవర్క్ పూర్తి  చేయాలి.
27. Staff will close doors. సిబ్బంది తలుపులు .
28. Customers will keep receipts. వినియోగదారులు రశీదులు  ఉంచుకోవాలి.
29. Passengers will board quietly. ప్రయాణీకులు నిశ్శబ్దంగా  ఎక్కాలి.
30. Members will pay fees. సభ్యులు ఫీజులు  చెల్లించాలి.
31. Teachers will submit reports. ఉపాధ్యాయులు నివేదికలు  సమర్పించాలి.
32. Officers will inspect rooms. అధికారులు గదులను తనిఖీ  చేయాలి.
33. Players will warm up. ఆటగాళ్ళు  వేడెక్కాలి.
34. Residents will save water. నివాసితులు నీటిని ఆదా  చేయాలి.
35. Volunteers will help elders. స్వచ్ఛంద సేవకులు పెద్దలకు సహాయం చేయాలి.
36. Candidates will sign forms. అభ్యర్థులు ఫారమ్‌లపై సంతకం  చేయాలి.
37. Shopkeepers will display prices. దుకాణదారులు ధరలను  ప్రదర్శించాలి.
38. Security will check bags. భద్రతా సిబ్బంది బ్యాగులను తనిఖీ  చేయాలి.
39. Employees will log out systems. ఉద్యోగులు వ్యవస్థలను లాగ్ అవుట్ చేయాలి.
40. Students will maintain discipline. విద్యార్థులు క్రమశిక్షణను  పాటించాలి.

4. Requests :ఇతరులను మర్యాదగా ఏదైనా అడగటానికి will you .. ? స్ట్రక్చర్ ఉపయోగిస్తారు. 

ఇది ఇతరులను ఆజ్ఞాపించడం కాదు వారిని మర్యాదపూర్వకంగా సాఫ్ట్ గా ఏదైనా అడిగే విధానం

will తో వాక్యాన్ని ప్రారంభిస్తారు చూడడానికి ప్రశ్నా వాక్యం లాగా ఉంటుంది. 

Example: will you close the door (నువ్వు తలుపు మూస్తావా?)

వ్యతిరేక వాక్యం రాయుటకు will  ప్రక్కన not  పెడితే సరిపోతుంది

will not you close the door (నువ్వు తలుపు మూయవా ?)

1. Will you close the door? నువ్వు తలుపు మూస్తావా?
2.Will she inform the boss? ఆమె బాస్ కి తెలియజేస్తుందా?
3.Will he submit the file? అతను ఫైల్ సమర్పిస్తాడా?
4.Will they join the meeting? వారు సమావేశంలో పాల్గొంటారా?
5.Will we discuss this later? దీని గురించి మనం తరువాత చర్చిద్దాం?
6.Will your brother pick me up? మీ అన్నయ్య నన్ను తీసుకెళ్తాడా?
7.Will her sister help us? ఆమె సోదరి మనకు సహాయం చేస్తుందా?
8.Will the staff clean the hall? సిబ్బంది హాలు శుభ్రం చేస్తారా?
9.Will the driver slow down? డ్రైవర్ వేగాన్ని తగ్గిస్తాడా?
10.Will the teacher repeat the point? టీచర్ ఆ పాయింట్ ని మళ్ళీ చెబుతారా?
11.Will your friend lend money? మీ స్నేహితుడు అప్పు ఇస్తారా?
12.Will the shop open early? దుకాణం త్వరగా తెరుచుకుంటుందా?
13.Will the manager review this? మేనేజర్ దీనిని సమీక్షిస్తారా?
14.Will the officer verify details? అధికారి వివరాలను ధృవీకరిస్తారా?
15.Will the child drink milk? బిడ్డ పాలు తాగుతుందా?
16.Will the team practice today? ఈరోజు జట్టు ప్రాక్టీస్ చేస్తుందా?
17.Will the guard allow entry? గార్డు లోపలికి అనుమతిస్తాడా?
18.Will the doctor check now? ఇప్పుడు డాక్టర్ చెక్ చేస్తారా?
19.Will your parents agree? మీ తల్లిదండ్రులు అంగీకరిస్తారా?
20.Will the company accept this? కంపెనీ దీన్ని అంగీకరిస్తుందా?
21. Will you wait here? ఇక్కడే వేచి ఉంటావా?
22. Will she call me back? ఆమె నాకు తిరిగి ఫోన్ చేస్తుందా?
23. Will he explain this point? అతను ఈ విషయాన్ని వివరిస్తాడా?
24. Will they help us today? వారు ఈ రోజు మాకు సహాయం చేస్తారా?
25. Will we start now? మనం ఇప్పుడే ప్రారంభిస్తామా?
26. Will your friend join us? మీ స్నేహితుడు మాతో చేరతాడా?
27. Will her brother drive the car? ఆమె సోదరుడు కారు నడుపుతాడా?
28. Will the teacher check notebooks? టీచర్ నోట్‌బుక్‌లు తనిఖీ చేస్తాడా?
29. Will the doctor see me now? డాక్టర్ ఇప్పుడు నన్ను చూస్తాడా?
30. Will the driver stop here? డ్రైవర్ ఇక్కడ ఆగుతాడా?
31. Will your parents agree? మీ తల్లిదండ్రులు అంగీకరిస్తారా?
32. Will the shop open early? దుకాణం త్వరగా తెరుచుకుంటుందా?
33. Will the manager approve this? మేనేజర్ దీనికి ఆమోదిస్తారా?
34. Will the staff clean the room? సిబ్బంది గదిని శుభ్రం చేస్తారా?
35. Will the guard open the gate? గార్డు గేటు తెరుస్తాడా?
36. Will the child finish homework? పిల్లవాడు హోంవర్క్ పూర్తి చేస్తాడా?
37. Will the team practice today? ఈరోజు బృందం ప్రాక్టీస్ చేస్తుందా?
38. Will the officer verify details? అధికారి వివరాలను ధృవీకరిస్తారా?
39. Will the company reduce prices? కంపెనీ ధరలు తగ్గిస్తారా?
40. Will the train arrive on time? రైలు సమయానికి వస్తుందా?

 

It + will ఏ ఏ సందర్బాలలో ఉపయోగిస్తారో తెలుసుకుందాం 

1. weather (వాతావరణం)

ఇంగ్లీష్ లో ప్రతి సెంటెన్స్ లో కూడా తప్పనిసరిగా పనిచేసే సబ్జెక్టు ఉండాలి. కానీ వాతావరణం లాంటి చలి, వేడి, వర్షం, గాలి లాంటి వాతావరణం మార్పులు చెప్పేటప్పుడు సబ్జెక్టు ఉండదు. అందుకని ‘It ‘ అనే డమ్మీ సబ్జెక్టు ఉపయోగిస్తారు.

1. It will rain today. 1. ఈరోజు వర్షం పడుతుంది.
It will not rain today. ఈరోజు వర్షం పడదు.
Will it rain today? ఈరోజు వర్షం పడుతుందా?
Will it not rain today? ఈ రోజు వర్షం పడదా?
   
2. It will snow tonight. 2. ఈ రాత్రి మంచు కురుస్తుంది.
It will not snow tonight. ఈ రాత్రి మంచు కురవదు.
Will it snow tonight? ఈ రాత్రి మంచు కురుస్తుందా?
Will it not snow tonight? ఈ రాత్రి మంచు కురవదా?
   
3. It will be sunny tomorrow. 3. రేపు ఎండగా ఉంటుంది.
It will not be sunny tomorrow. రేపు ఎండ ఉండదు.
Will it be sunny tomorrow? రేపు ఎండ ఉంటుందా?
Will it not be sunny tomorrow? రేపు ఎండ ఉండదా?
   
4. It will get cold soon. 4. త్వరలో చల్లగా ఉంటుంది.
It will not get cold soon. ఇది త్వరలో చల్లబడదు.
Will it get cold soon? త్వరలో చల్లబడుతుందా?
Will it not get cold soon? త్వరగా చల్లబడదా?
   
5. It will be hot outside. 5. బయట వేడిగా ఉంటుంది.
It will not be hot outside. బయట వేడిగా ఉండదు.
Will it be hot outside? బయట వేడిగా ఉంటుందా?
Will it not be hot outside? బయట వేడిగా ఉండదా?
   
6. It will drizzle in the evening. 6. సాయంత్రం చినుకులు పడతాయి.
It will not drizzle in the evening. సాయంత్రం చినుకులు పడవు.
Will it drizzle in the evening? సాయంత్రం చినుకులు పడతాయా?
Will it not drizzle in the evening? సాయంత్రం చినుకులు పడదా?
   
7. It will storm tonight. 7. ఈ రాత్రి తుఫాను వస్తుంది.
It will not storm tonight. ఈ రాత్రి తుఫాను రాదు.
Will it storm tonight? ఈ రాత్రికి తుఫాను వస్తుందా?
Will it not storm tonight? ఈ రాత్రి తుఫాను రాదా?
   
8. It will be cloudy today. 8. ఈరోజు మేఘావృతమై ఉంటుంది.
It will not be cloudy today. ఈరోజు ఆకాశం మేఘావృతంగా ఉండదు.
Will it be cloudy today? ఈరోజు ఆకాశం మబ్బుగా ఉంటుందా?
Will it not be cloudy today? ఈ రోజు ఆకాశం మబ్బుగా ఉండదా?
   
9. It will freeze at night. 9. రాత్రిపూట అది ఘనీభవిస్తుంది.
It will not freeze at night. ఇది రాత్రిపూట గడ్డకట్టదు.
Will it freeze at night? రాత్రిపూట అది గడ్డకడుతుందా?
Will it not freeze at night? రాత్రిపూట అది గడ్డకట్టదా?
   
10. It will be windy tomorrow. 10. రేపు గాలులు వీస్తాయి.
It will not be windy tomorrow. రేపు గాలులు వీయవు.
Will it be windy tomorrow? రేపు గాలులు వీస్తాయా?
Will it not be windy tomorrow? రేపు గాలి వీయదా?