భవిష్యత్తులో ఏదో చేయబోతున్నాను అని చెప్పడానికి Going to ఉపయోగిస్తారు. భవిష్యత్తు అంటే ఐదు పది నిమిషాల తర్వాత కూడా భవిష్యత్తుగానే పరిగణించాలి.
చేయబోతున్నాను, చూడబోతున్నాను, అడగబోతున్నాను, రాయబోతున్నాను, ఇలా చివర “బోతున్నాను” అని వస్తుంది.
మన Tenses లో చెప్పుకున్నట్లుగానే స్ట్రక్చర్ ఉంటుంది
| He,She,It | is | Going to | verb1 |
| I | AM | Going to | verb1 |
| We,You,They | Are | Going to | verb1 |
నెగిటివ్ సెంటెన్సెస్ రాయటానికి Is,are,am, తర్వాత not ఉంచాలి
Examples:
| 1. I am going to study tonight. | 1. నేను ఈ రాత్రి చదువుకోబోతున్నాను. |
| ఐ యామ్ గోయింగ్ టూ స్టడీ టునైట్ | |
| I am not going to study tonight.? | నేను ఈ రాత్రి చదువుకోబో వడంలేదు |
| Am I going to study tonight.? | నేను ఈ రాత్రి చదువుకోబోతున్నానా?. |
| Am I not going to study tonight.? | నేను ఈ రాత్రి చదువుకోబోవడం లేదా?. |
| 2. He is going to play football tomorrow. | 2. అతను రేపు ఫుట్‌బాల్ ఆడబోతున్నాడు. |
| హీ ఇజ్ గోయింగ్ టూ ప్లే ఫుట్‌బాల్ టుమారో | |
| 3. She is going to cook dinner. | 3. ఆమె రాత్రి భోజనం వండబోతోంది. |
| షీ ఇజ్ గోయింగ్ టూ కుక్ డిన్నర్ | |
| 4. It is going to snow next week. | 4. వచ్చే వారం మంచు కులవబోతోంది |
| ఇట్ ఇజ్ గోయింగ్ టూ స్నో నెక్ట్ వీక్ | |
| 5. We are going to watch a movie tonight. | 5. మనం ఈ రాత్రి సినిమా చూడబోతున్నాం. |
| వీ ఆర్ గోయింగ్ టూ వాచ్ ఎ మూవీ టునైట్ | |
| 6. You are going to learn English. | 6. మీరు ఇంగ్లీష్ నేర్చుకోబోతున్నారు. |
| యూ ఆర్ గోయింగ్ టూ లెర్న్ ఇంగ్లిష్ | |
| 7. They are going to visit their friend. | 7. వారు తమ స్నేహితుడిని సందర్శించబోతున్నారు. |
| దే ఆర్ గోయింగ్ టూ విజిట్ దేర్ ఫ్రెండ్ | |
| 8. I am going to buy a new bag. | 8. నేను కొత్త బ్యాగ్ కొనుక్కోబోతున్నాను. |
| ఐ అం గోయింగ్ టూ బై ఎ న్యూ బాగ్ | |
| 9. He is going to travel to Delhi next month. | 9. అతను వచ్చే నెలలో ఢిల్లీకి వెళ్లబోతున్నాడు. |
| హీ ఇజ్ గోయింగ్ టూ ట్రావెల్ టూ డెల్హీ నెక్ట్ మంత్ | |
| 10. She is going to join a yoga class. | 10. ఆమె యోగా క్లాసులో చేరబోతోంది. |
| షీ ఇజ్ గోయింగ్ టూ జాయిన్ ఎ యోగా క్లాస్ | |
| 11. It is going to be a sunny day tomorrow. | 11. రేపు ఎండ ఎక్కువగా ఉండబోతోంది |
| ఇట్ ఇజ్ గోయింగ్ టూ బీ ఎ సన్నీ డే టుమారో | |
| 12. We are going to celebrate his birthday. | 12. మనం అతని పుట్టినరోజు జరుపుకోబోతున్నాం. |
| వీ ఆర్ గోయింగ్ టూ సెలబ్రేట్ హిస్ బర్త్‌డే | |
| 13. You are going to take a test tomorrow. | 13. మీరు రేపు పరీక్ష రాయబోతున్నారు. |
| యూ ఆర్ గోయింగ్ టూ టేక్ ఎ టెస్ట్ టుమారో | |
| 14. They are going to start a new project. | 14. వారు కొత్త ప్రాజెక్ట్‌ను ప్రారంభించబోతున్నారు. |
| దే ఆర్ గోయింగ్ టూ స్టార్ట్ ఎ న్యూ ప్రాజెక్ట్ | |
| 15. I am going to call my friend. | 15. నేను నా స్నేహితుడికి ఫోన్ చేయబోతున్నాను. |
| ఐ అం గోయింగ్ టూ కాల్ మై ఫ్రెండ్ | |
| 16. He is going to learn swimming. | 16. అతను ఈత నేర్చుకోబోతున్నాడు. |
| హీ ఇజ్ గోయింగ్ టూ లెర్న్ స్విమ్మింగ్ | |
| 17. She is going to paint her room. | 17. ఆమె తన గదికి పెయింట్ వేయబోతోంది. |
| షీ ఇజ్ గోయింగ్ టూ పెంట్ హెర్ రూమ్ | |
| 18. It is going to be very hot today. | 18. ఈరోజు చాలా వేడిగా ఉండబోతోంది |
| ఇట్ ఇజ్ గోయింగ్ టూ బీ వెరీ హాట్ టుడే | |
| 19. We are going to clean the house. | 19. మేము ఇంటిని శుభ్రం చేయబోతున్నాము. |
| వీ ఆర్ గోయింగ్ టూ క్లీన్ ది హౌస్ | |
| 20. You are going to meet your teacher tomorrow. | 20. మీరు రేపు మీ గురువుగారిని కలవబోతున్నారు. |
| యూ ఆర్ గోయింగ్ టూ మీట్ యూర్ టీచర్ టుమారో | |
2.ప్రస్తుత పరిస్థితి ఆధారంగా భవిష్యత్తులో ఏం జరగబోతుందో చెప్పడానికి | |
| 1. Look at the sky! It is going to rain. | 1. ఆకాశం వైపు చూడు! వర్షం పడబోతోంది. |
| లుక్ అట్ ది స్కై! ఇట్ ఇజ్ గోయింగ్ టూ రైన్ | |
| 2. He is sneezing a lot. He is going to get sick. | 2. అతను చాలా తుమ్ముతున్నాడు. అతను జబ్బు పడబోతున్నాడు. |
| హీ ఇజ్ స్నీజింగ్ ఎ లాట్. హీ ఇజ్ గోయింగ్ టూ గెట్ సిక్ | |
| 3. The road is wet. It is going to flood. | 3. రోడ్డు తడిగా ఉంది. వరదలు రాబోతున్నాయి. |
| ది రోడ్ ఇజ్ వెట్. ఇట్ ఇజ్ గోయింగ్ టూ ఫ్లడ్ | |
| 4. She is very tired. She is going to fall asleep. | 4. ఆమె చాలా అలసిపోయింది. ఆమె నిద్రపోబోతోంది |
| షీ ఇజ్ వెరీ టైర్డ్. షీ ఇజ్ గోయింగ్ టూ ఫాల్ అస్లీప్ | |
| 5. Look at those clouds! It is going to storm. | 5. ఆ మేఘాలను చూడు! తుఫాను రాబోతోంది. |
| లుక్ అట్ దోస్ క్లౌడ్స్! ఇట్ ఇజ్ గోయింగ్ టూ స్టోర్మ్ | |
| 6. The baby is crying. He is going to wake up soon. | 6. పాప ఏడుస్తోంది. అతను త్వరలోనే మేల్కొన బోతున్నాడు |
| ది బేబీ ఇజ్ క్రైయింగ్. హీ ఇజ్ గోయింగ్ టూ వేక్ అప్ సూన్ | |
| 7. The cup is shaking. It is going to fall. | 7. కప్పు వణుకుతోంది. అది పడిపోబోతోంది. |
| ది కప్ ఇజ్ షేకింగ్. ఇట్ ఇజ్ గోయింగ్ టూ ఫాల్ | |
| 8. He is running fast. He is going to win. | 8. అతను వేగంగా పరిగెడుతున్నాడు. అతను గెలవబోతున్నాడు. |
| హీ ఇజ్ రన్నింగ్ ఫాస్ట్. హీ ఇజ్ గోయింగ్ టూ విన్ | |
| 9. Look at the smoke! It is going to catch fire. | 9. పొగ చూడు! అది మంటల్లో కాలిపోబోతోంది. |
| లుక్ అట్ ది స్మోక్! ఇట్ ఇజ్ గోయింగ్ టూ క్యాచ్ ఫైర్ | |
| 10. The ice is melting. It is going to break. | 10. మంచు కరుగుతోంది. అది విరిగి పోబోతోంది. |
| ది ఐస్ ఇజ్ మెల్టింగ్. ఇట్ ఇజ్ గోయింగ్ టూ బ్రేక్ | |
| 11. She is shouting loudly. She is going to make everyone angry. | 11. ఆమె బిగ్గరగా అరుస్తోంది. ఆమె అందరినీ కోపదారులుగా చేయబోతోంది |
| షీ ఇజ్ షౌటింగ్ లౌడ్‌లీ. షీ ఇజ్ గోయింగ్ టూ మేక్ ఎవ్రివన్ ఆంగ్రీ | |
| 12. The teacher is coming. We are going to start the class. | 12. టీచర్ వస్తున్నారు. మనం క్లాసు మొదలు పెట్టబోతున్నాం |
| ది టీచర్ ఇజ్ కమింగ్. వీ ఆర్ గోయింగ్ టూ స్టార్ట్ ది క్లాస్ | |
| 13. The dog is barking. It is going to bite someone. | 13. కుక్క మొరుగుతోంది. అది ఎవరినో కర వబోతోంది |
| ది డాగ్ ఇజ్ బార్కింగ్. ఇట్ ఇజ్ గోయింగ్ టూ బైట్ సమ్వన్ | |
| 14. He is running toward the gate. He is going to open it. | 14. అతను గేటు వైపు పరిగెడుతున్నాడు. అతను దానిని తెరవబోతున్నాడు. |
| హీ ఇజ్ రన్నింగ్ టవార్డ్ ది గేట్. హీ ఇజ్ గోయింగ్ టూ ఓపెన్ ఇట్ | |
| 15. The tree is bending. It is going to fall. | 15. చెట్టు వంగిపోతోంది. అది పడిపోబోతోంది. |
| ది ట్రీ ఇజ్ బెండింగ్. ఇట్ ఇజ్ గోయింగ్ టూ ఫాల్ | |
| 16. She is looking at the exam paper. She is going to pass. | 16. ఆమె పరీక్ష పత్రం చూస్తోంది. ఆమె పాస్ కాబోతోంది. |
| షీ ఇజ్ లుకింగ్ అట్ ది ఎగ్జాం పేపర్. షీ ఇజ్ గోయింగ్ టూ పాస్ | |
| 17. The cup is full of water. It is going to spill. | 17. కప్పు నీళ్ళతో నిండి ఉంది. అది చిందబోతోంది. |
| ది కప్ ఇజ్ ఫుల్ ఆఫ్ వాటర్. ఇట్ ఇజ్ గోయింగ్ టూ స్పిల్ | |
| 18. He is shaking his head. He is going to refuse. | 18. అతను తల ఊపుతున్నాడు. అతను తిరస్కరించబోతున్నాడు. |
| హీ ఇజ్ షేకింగ్ హిస్ హెడ్. హీ ఇజ్ గోయింగ్ టూ రిఫ్యూస్ | |
| 19. The baby is rubbing his eyes. He is going to sleep. | 19. పాప కళ్ళు రుద్దుకుంటోంది. నిద్రపోబోతోంది. |
| ది బేబీ ఇజ్ రబ్బింగ్ హిస్ ఐస్. హీ ఇజ్ గోయింగ్ టూ స్లీప్ | |
| 20. The weather is very cloudy. It is going to rain soon. | 20. వాతావరణం చాలా మేఘావృతమై ఉంది. త్వరలో వర్షం పడబోతోంది. |
| ది వెధర్ ఇజ్ వెరీ క్లౌడీ. ఇట్ ఇజ్ గోయింగ్ టూ రైన్ సూన్ | |
3. తక్షణం కలిగే ఫలితాల గురించి తెలియజేయడానికి | |
| 1. Be careful! You are going to hurt yourself. | 1. జాగ్రత్త! మీకు మీరే హాని కలిగించుకోబోతున్నారు. |
| బీ కేర్‌ఫుల్! యూ ఆర్ గోయింగ్ టూ హర్ట్ యర్‌సెల్ఫ్ | |
| 2. Don’t touch that! It is going to burn you. | 2. దాన్ని ముట్టుకోకండి! అది నిన్ను కాల్చివేయబోతోంది |
| డోంట్ టచ్ దాట్! ఇట్ ఇజ్ గోయింగ్ టూ బర్న్ యూ | |
| 3. Watch out! The car is going to hit you. | 3. జాగ్రత్త! కారు మిమ్మల్ని ఢీకొట్టబోతోంది. |
| వాచ్ ఔట్! ది కార్ ఇజ్ గోయింగ్ టూ హిట్ యూ | |
| 4. Hold the rope tightly! You are going to fall. | 4. తాడును గట్టిగా పట్టుకో! నువ్వు పడిపోబోతున్నావు |
| హోల్డ్ ది రోప్ టైట్లీ! యూ ఆర్ గోయింగ్ టూ ఫాల్ | |
| 5. Stop running! You are going to slip. | 5. పరుగెత్తడం ఆపు! నువ్వు జారి పోబో తున్నావు |
| స్టాప్ రన్నింగ్! యూ ఆర్ గోయింగ్ టూ స్లిప్ | |
| 6. Don’t pour water on the fire! It is going to explode. | 6. నిప్పు మీద నీళ్లు పోయకండి! అది పేలిపో బోతుంది. |
| డోంట్ పోర్ వాటర్ ఆన్ ది ఫైర్! ఇట్ ఇజ్ గోయింగ్ టూ ఎక్స్‌ప్లోడ్ | |
| 7. Move back! You are going to get hurt. | 7. వెనక్కి తగ్గు! నీకు గాయం అవబోతుంది. |
| మూవ్ బ్యాక్! యూ ఆర్ గోయింగ్ టూ గెట్ హర్ట్ | |
| 8. Hold the glass carefully! It is going to break. | 8. గాజును జాగ్రత్తగా పట్టుకో! అది పగిలిపో బోతుంది |
| హోల్డ్ ది గ్లాస్ కేర్‌ఫుల్‌లీ! ఇట్ ఇజ్ గోయింగ్ టూ బ్రేక్ | |
| 9. Watch the floor! You are going to trip. | 9. నేల చూసుకో! నువ్వు జారిపోబోతున్నావు |
| వాచ్ ది ఫ్లోర్! యూ ఆర్ గోయింగ్ టూ ట్రిప్ | |
| 10. Don’t touch that wire! You are going to get shocked. | 10. ఆ వైర్ ని ముట్టుకోకండి! మీకు షాక్ కొట్టబోతోంది |
| డోంట్ టచ్ దాట్ వైర్! యూ ఆర్ గోయింగ్ టూ గెట్ షాక్‌డ్ | |
| 11. Be careful with that knife! You are going to cut yourself. | 11. ఆ కత్తితో జాగ్రత్తగా ఉండు! నిన్ను నువ్వే కోసుకోబోతున్నావు |
| బీ కేర్‌ఫుల్ విత్ దాట్ నైఫ్! యూ ఆర్ గోయింగ్ టూ కట్ యర్‌సెల్ఫ్ | |
| 12. Don’t lean on the wall! It is going to fall. | 12. గోడ మీద ఆనుకోకండి! అది పడిపోబోతోంది |
| డోంట్ లీన్ ఆన్ ది వాల్! ఇట్ ఇజ్ గోయింగ్ టూ ఫాల్ | |
| 14. Step back! You are going to hit the table. | 14. వెనక్కి తగ్గు! నువ్వు టేబుల్ గుద్ధ పోతున్నావు |
| స్టెప్ బ్యాక్! యూ ఆర్ గోయింగ్ టూ హిట్ ది టేబుల్ | |
| 15. Don’t run near the pool! You are going to fall in. | 15. కొలను దగ్గరకు పరిగెత్తకండి! మీరు నీటిలో పడిపోబోతున్నారు |
| డోంట్ రన్ నీర్ ది పూల్! యూ ఆర్ గోయింగ్ టూ ఫాల్ ఇన్ | |
| 16. Watch your step! You are going to trip on the stone. | 16. జాగ్రత్తగా ఉండు! నువ్వు ఆ రాయి మీద జారి పడబోతున్నావు. |
| వాచ్ యూర్ స్టెప్! యూ ఆర్ గోయింగ్ టూ ట్రిప్ ఆన్ ది స్టోన్ | |
| 17. Don’t touch the dog! It is going to bite. | 17. కుక్కను ముట్టుకోవద్దు! అది కరవబోతోంది. |
| డోంట్ టచ్ ది డాగ్! ఇట్ ఇజ్ గోయింగ్ టూ బైట్ | |
| 19. Hold the baby carefully! You are going to drop him. | 19. బిడ్డను జాగ్రత్తగా పట్టుకో! నువ్వు అతన్ని వదిలేయబోతున్నావు |
| హోల్డ్ ది బేబీ కేర్‌ఫుల్‌లీ! యూ ఆర్ గోయింగ్ టూ డ్రాప్ హిమ్ | |
| 20. Don’t touch the electric wire! You are going to get shocked. | 20. విద్యుత్ తీగను ముట్టుకోకండి! మీకు షాక్ కొట్టబోతోంది |
| డోంట్ టచ్ ది ఎలక్ట్రిక్ వైర్! యూ ఆర్ గోయింగ్ టూ గెట్ షాక్‌డ్ | |
