హాయ్ ఫ్రెండ్స్ verb1 + ing = verb4 అని తెలుసుకున్నాం కదా.
ఈ verb4 ని సాదారణంగా Gerund అని పిలుస్తారు.
Examples:
See + ing = Seeing
Ask + ing = Asking
Come + Ing = Coming
Seeing, asking, coming ఇటువంటి పదాలని gerund అంటారు
ఈ gerund మనకి సెంటెన్స్ లో కనిపించిన ప్రతి చోట అది verb4 అని భ్రమ పడకూడదు.
ఈ gerund కొన్నిసార్లు verb4 గా, కొన్నిసార్లు Noun గా , మరికొన్నిసార్లు adjective గా పనిచేస్తుంది ఈ తేడాలను ఇప్పుడు చూద్దాం
1. Gerund as a Verb4 :
మనం Tenses గురించి నేర్చుకున్నాము కదా అక్కడ ఈ gerund కేవలం continuous tenses లో మాత్రమే verb4 గా కనిపిస్తుంది. ఇంకెక్కడ కనిపించదు. అనగా Present continuous, past continuous, future continuous ఇక్కడ gerund కి ముందు be forms అయిన am, is, are, was, were లను కచ్చితంగా ఉపయోగిస్తాము. ఈ విధంగా Be forms సహాయంతో ఎప్పుడైతే gerund ని ఉపయోగిస్తామో అక్కడ ఇది కచ్చితంగా verb4 గా పనిచేస్తుంది అని అర్థం.
Examples:
| 1. He is reading a book. | 1. అతను ఒక పుస్తకం చదువుతూ ఉన్నాడు. |
| 2. She was cooking food. | 2. ఆమె ఆహారం వండుతూ వండింది. |
| 3. They are playing cricket. | 3. వారు క్రికెట్ ఆడుతూ ఉన్నారు. |
| 4. I am learning English. | 4. నేను ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉన్నాను. |
| 5. We were watching a movie. | 5. మేము సినిమా చూస్తూ ఉండినాము. |
| 6. The boy is running fast. | 6. బాలుడు వేగంగా పరిగెడుతూ ఉన్నాడు. |
| 7. She is teaching students. | 7. ఆమె విద్యార్థులకు బోధిస్తూ ఉంది |
| 8. He was driving carefully. | 8. అతను జాగ్రత్తగా డ్రైవింగ్ చేస్తూ ఉండినాడు. |
| 9. They are working hard. | 9. వారు కష్టపడి పని చేస్తూ ఉన్నారు. |
| 10. I am writing a letter. | 10. నేను ఒక ఉత్తరం రాస్తూ ఉన్నాను. |
పై వాక్యాలను గమనించండి . అతను ఒక పుస్తకం చదువుతూ ఉన్నాడు.ఆమె ఆహారం వండుతూ ఉంది.వారు క్రికెట్ ఆడుతూ ఉన్నారు. సబ్జెక్టు పై వాక్యాలలో ఏదో ఒక పని చేస్తూ ఉన్నాడు. ఈ విధంగా beforms అయిన is,am are was were తరువాత gerund వస్తే ఇక్కడ gerund అనేది Verb4 గా పనిచేస్తుంది అని అర్థం.
2. Gerund as a Noun
Gerund కొన్ని సందర్భాల్లో Noun (పేరు) గా పని చేస్తుంది. కింది వాక్యాలను గమనించండి
Gerund ఎక్కడైతే Noun గా ఉపయోగించబడుతుందో అక్కడ సాధారణంగా చివరిలో “ డం “ అని కనిపిస్తుంది
| 1. Swimming is good for health. | 1. ఈత కొట్టడం ఆరోగ్యానికి మంచిది. |
| 2. Reading improves knowledge. | 2. చదవడం వల్ల జ్ఞానం పెరుగుతుంది. |
| 3. Writing takes time. | 3. రాయడం సమయం తీసుకుంటుంది |
| 4. Playing makes children happy. | 4. ఆడుకోవడం వల్ల పిల్లలు సంతోషంగా ఉంటారు. |
| 5. Cooking is her hobby. | 5. వంట చేయడం ఆమె హాబీ. |
| 6. Teaching needs patience. | 6. బోధించడం కు ఓపిక అవసరం. |
| 7. Singing relaxes the mind. | 7. పాడడం వల్ల మనసుకు విశ్రాంతి లభిస్తుంది. |
| 8. Walking helps digestion. | 8. నడవడం జీర్ణక్రియకు సహాయపడుతుంది. |
| 9. Learning never stops. | 9. నేర్చుకోవడం ఎప్పుడూ ఆగదు. |
| 10. Driving needs practice. | 10. నడపడం కు ప్రాక్టీస్ అవసరం. |
పైన “ఈత కొట్టడం ఆరోగ్యానికి మంచిది” అని ఒక విషయాన్ని తెలియజేయడానికి మాత్రమే ఇక్కడ swimming అనే పదాన్ని ఉపయోగిస్తున్నాము, కానీ అక్కడ ఎవరు ఈత కొట్టడం లేదు.
“చదవడం వల్ల జ్ఞానం పెరుగుతుంది” అని ఒక విషయాన్ని తెలియజేయడానికి మాత్రమే ఇక్కడ reading ఉపయోగించాము కానీ అక్కడ ఎవరూ చదవడం లేదు.అలాగే మిగతా వాటిని గమనించండి. ఈ విధంగా ఒక విషయాన్ని తెలియజేయడానికి gerund ని noun గా ఉపయోగిస్తారు.
3) Gerund as an Adjective
Adjective ఎప్పుడు Noun (పేరు) ని వర్ణించడమే దాని పని. Noun ఒక మనిషి పేరు అనుకుంటే ఆ మనిషి తెల్లగా ఉన్నాడా, నల్లగా ఉన్నాడా, ఎత్తుగా వున్నాడా, పొట్టిగా ఉన్నాడా, తెలివిగా ఉన్నాడా, అమాయకుడుగా ఉన్నాడా ఈ విధంగా మనిషి యొక్క గుణాన్ని, స్వభావాన్ని adjective ఎప్పుడు వర్ణిస్తూ ఉంటుంది.
Gerund కొన్ని సందర్భాల్లో noun ని వర్ణించేదిగా ఉంటుంది. క్రింది ఉదాహరణలు గమనించండి
| 1. This is a swimming pool. | ఇది ఒక స్విమ్మింగ్ పూల్ |
| 2. I bought a reading table. | నేను రీడింగ్ టేబుల్ కొన్నాను |
| 3. He wears running shoes. | అతను రన్నింగ్ షూస్ ధరిస్తాడు |
| 4. It is a waiting room. | ఇది ఒక వేచి ఉండే గది |
| 5. She has a writing desk. | ఆమెకి ఒక రైటింగ్ డెస్క్ ఉంది |
| 6. This is a working day. | ఇది పనిచేసే రోజు |
| 7. I saw a sleeping baby. | నేను నిద్రపోతున్న బేబీని చూశాను |
| 8. He entered the meeting hall. | అతను మీటింగ్ హాల్లోకి ప్రవేశించాడు |
| 9. We visited a training center. | మేము ట్రైనింగ్ సెంటర్ ని దర్శించాము |
| 10. That is a shopping mall. | అది ఒక షాపింగ్ మాల్ |
మొదటి ఉదాహరణను గమనించండి. ఇది ఒక స్విమ్మింగ్ పూల్. pool అంటే కొలను అది ఏమి కొలను. “ఈత కొట్టే కొలను” అని ఆ కొలనును వర్ణిస్తుంది. This is a swimming pool.
నేను రీడింగ్ టేబుల్ కొన్నాను. ఇక్కడ టేబుల్ అంటే బల్ల, ఆ బల్ల ఏమి బల్లో ఇక్కడ gerund వివరిస్తుంది. అది “చదువుకునే బల్ల”. I bought a reading table.
అతను షూస్ ధరించాడు ఆ షూస్ ఏమి షూసొ ఇక్కడ Gerund వర్ణిస్తుంది. అవి “రన్నింగ్ షూస్”. He wears running shoes.
Gerund ఈ విధంగా Tenses లలో verb4 గా, మరికొన్ని చోట్ల Noun గా, మరికొన్ని చోట్ల Adjective గా క్రియ చేస్తుంది. ఎక్కడ ఏ విధంగా క్రియ చేస్తుందో మనమే సందర్భాన్ని బట్టి అర్థం చేసుకోవాలి.
క్రింది ఇవ్వబడిన ఒక చిన్న స్టోరీలో ఈ తేడాను స్పష్టంగా గమనించండి
| In a small town, Joy was reading (verb4) a book under a tree. | ఒక చిన్న పట్టణంలో, జాయ్ ఒక చెట్టు కింద పుస్తకం చదువుతూ వుండేవాడు. |
| He loved reading (noun) because it made her curious. | అతనికి చదవడం అంటే చాలా ఇష్టం ఎందుకంటే అది అతనికి ఆసక్తిని కలిగించింది. |
| While He was watching (verb4) the birds, he noticed a lost puppy. | అతను పక్షులను చూస్తుండగా, తప్పిపోయిన కుక్కపిల్లని గమనించాడు . |
| The barking puppy (adjective) looked scared and hungry. | మొరిగే కుక్కపిల్ల భయంగా మరియు ఆకలిగా కనిపించింది. |
| Joy started feeding (verb4) it gently. | జాయ్ దానికి మెల్లగా తినిపించడం ప్రారంభించాడు . |
| He was planning (verb4) to take it home. | అతను దానిని ఇంటికి తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తూ ఉండినాడు. |
| His caring attitude (adjective) impressed the villagers. | అతని శ్రద్ధగల వైఖరి గ్రామస్తులను ఆకట్టుకుంది. |
| Helping others and sharing (noun) happiness became her habit. | ఇతరులకు సహాయం చేయడం మరియు ఆనందాన్ని పంచుకోవడం అతనికి అలవాటుగా మారింది. |
