1.Ability: సామర్థ్యాన్ని తెలియజేయడం .

Can = చేయగలను

Subject + can + Verb1 

వెళ్లగలను, చూడగలను, సాధించగలను,రాయగలను, పాడగలను ఈ విధంగా చివరిలో  గలను అని వస్తుంది.

క్రింది  టేబుల్ లోని మొదటి ఉదాహరణను గమనించండి

Example: I can swim. = నేను ఈత కొట్టగలను

దీనికి వ్యతిరేక వాక్యం రాయుటకు Can ప్రక్కన కేవలం Not మాత్రమే చేరిస్తే సరిపోతుంది.

I can not swim = నేను ఈత కొట్టలేను

రెండు వాక్యాలను ప్రశ్న ఆ వాక్యాలుగా మార్చుటకు Modal verb అయిన Can  ప్రారంభంలో ఉంచితే సరిపోతుంది.

Can I swim? = నేను ఈత కొట్టగలనా?

Can I not swim? = నేను ఈత కొట్టలేనా?

క్రింద అన్ని కేటగిరీలో ఉన్న సెంటెన్స్ ఈ విధంగానే అర్థం చేసుకోండి.

 

1. I can swim.1. నేను ఈదగలను
ఐ క్యాన్ స్విమ్ 
  
2. I can read English.2.  నేను ఇంగ్లీష్ చదవగలను
ఐ క్యాన్ రీడ్ ఇంగ్లిష్ 
  
3. I can write fast.3. నేను వేగంగా రాయగలను.
ఐ క్యాన్ రైట్ ఫాస్ట్ 
  
4. I can cook rice.4. నేను అన్నం వండగలను.
ఐ క్యాన్ కుక్ రైస్ 
  
5. I can drive a car.5. నేను కారు నడపగలను.
ఐ క్యాన్ డ్రైవ్ ఎ కార్ 
  
6. I can understand you.6. నేను నిన్ను అర్థం చేసుకోగలను.
ఐ క్యాన్ అండర్‌స్టాండ్ యూ 
  
7. I can solve this problem.7. నేను ఈ సమస్యను పరిష్కరించగలను.
ఐ క్యాన్ సాల్వ్ దిస్ ప్రాబ్లమ్ 
  
8. I can learn quickly.8. నేను త్వరగా నేర్చుకోగలను.
ఐ క్యాన్ లెర్న్ క్విక్లీ 
  
9. I can teach children.9. నేను పిల్లలకు నేర్పించగలను.
ఐ క్యాన్ టీచ్ చిల్డ్రన్ 
  
10. I can speak Telugu.10.  నేను తెలుగు మాట్లాడగలను
ఐ క్యాన్ స్పీక్ తెలుగు 
  
11. She can sing well.11. ఆమె బాగా పాడగలదు.
షీ క్యాన్ సింగ్ వెల్ 
  
12. She can dance nicely.12. ఆమె చక్కగా నృత్యం చేయగలదు.
షీ క్యాన్ డాన్స్ నైస్లీ 
  
13. She can draw pictures.13. ఆమె చిత్రాలు గీయగలదు.
షీ క్యాన్ డ్రా పిక్చర్స్ 
  
14. She can run fast.14. ఆమె వేగంగా పరిగెత్తగలదు.
షీ క్యాన్ రన్ ఫాస్ట్ 
  
15. She can help us.15. ఆమె మనకు సహాయం చేయగలదు.
షీ క్యాన్ హెల్ప్ అస్స్ 
  
16. He can fix the bike.16. అతను సైకిల్ బాగు చేయగలడు.
హీ క్యాన్ ఫిక్స్ ద బైక్ 
  
17. He can lift heavy boxes.17. అతను బరువైన పెట్టెలను ఎత్తగలడు.
హీ క్యాన్ లిఫ్ట్ హెవీ బాక్సెస్ 
  
18. He can play cricket.18. అతను క్రికెట్ ఆడగలడు.
హీ క్యాన్ ప్లే క్రికెట్ 
  
19. He can repair computers.19. అతను కంప్యూటర్లు రిపేర్ చేయగలడు.
హీ క్యాన్ రిపేర్ కంప్యూటర్స్ 
  
20. He can speak Hindi.20. అతను హిందీ మాట్లాడగలడు
హీ క్యాన్ స్పీక్ హిందీ 
  
21. We can win this match.21. మనం ఈ మ్యాచ్ గెలవగలం.
వీ క్యాన్ విన్ దిస్ మ్యాచ్ 
  
22. We can finish the work.22. మనం పనిని పూర్తి చేయగలము.
వీ క్యాన్ ఫినిష్ ద వర్క్ 
  
23. We can learn together.23. మనం కలిసి నేర్చుకోగలము
వీ క్యాన్ లెర్న్ టుగెదర్ 
  
24. They can build a house.24. వారు ఇల్లు కట్టుకోగలరు
దే క్యాన్ బిల్డ్ ఎ హౌస్ 
  
25. They can understand English.25. వారు ఇంగ్లీష్ అర్థం చేసుకోగలరు.
దే క్యాన్ అండర్‌స్టాండ్ ఇంగ్లిష్ 
  
26. They can complete the task.26. వారు పనిని పూర్తి చేయగలరు.
దే క్యాన్ కంప్లీట్ ద టాస్క్ 
  
27. My brother can swim well.27. నా సోదరుడు బాగా ఈత కొట్టగలడు.
మై బ్రదర్ క్యాన్ స్విమ్ వెల్ 
  
28. My sister can cook tasty food.28. నా సోదరి రుచికరమైన వంట చేయగలదు.
మై సిస్టర్ క్యాన్ కుక్ టేస్టీ ఫుడ్ 
  
29. The child can walk now.29. పిల్లవాడు ఇప్పుడు నడవగలడు.
ద చైల్డ్ క్యాన్ వాక్ నౌ 
  
30. The students can answer easily.30. విద్యార్థులు సులభంగా సమాధానం చెప్పగలరు. 
ద స్టూడెంట్స్ క్యాన్ ఆన్సర్ ఈజిలీ 
  
  

 2.Permission:

ఏదైనా అనుమతి తీసుకోవడానికి గాని, ఇవ్వడానికి గాని Can ఉపయోగిస్తారు.

అనుమతి తీసుకోవడానికి ప్రశ్న అడిగినట్లుగా అడుగుతారు

Can + subject+ verb1 (అనుమతి తీసుకోవడానికి )

రావచ్చా, పోవచ్చా, చూడవచ్చా, ఉండవచ్చా, ఇలా చివర్లో “చ్చా” వస్తుంది

అనుమతి ఇవ్వడానికి కిందిస్ట్రక్చర్ ప్రకారం సెంటెన్స్ నిర్మాణం ఉంటుంది 

Subject + can + verb1 (అనుమతి ఇవ్వ డానికి )

 

1. Can I come in?1. నేను లోపలికి రావచ్చా?
క్యాన్ ఐ కమ్ ఇన్ 
  
2. Can I sit here?2. నేను ఇక్కడ కూర్చోవచ్చా?
క్యాన్ ఐ సిట్ హియర్ 
  
3. Can I ask a question?3. నేను ఒక ప్రశ్న అడగవచ్చా?
క్యాన్ ఐ ఆస్‌క్ ఎ క్వశ్చన్ 
  
4. Can I use your pen?4. నేను మీ పెన్ను ఉపయోగించవచ్చా?
క్యాన్ ఐ యూజ్ యువర్ పెన్ 
  
5. Can I open the window?5. నేను కిటికీ తెరవవచ్చా?
క్యాన్ ఐ ఓపెన్ ద విండో 
  
6. Can I call you later?6. నేను మీకు తర్వాత కాల్ చేయవచ్చా?
క్యాన్ ఐ కాల్ యూ లేటర్ 
  
7. Can I take this book?7. నేను ఈ పుస్తకాన్ని తీసుకోవచ్చా?
క్యాన్ ఐ టేక్ దిస్ బుక్ 
  
8. Can I drink water?8. నేను నీళ్లు తాగవచ్చా?
క్యాన్ ఐ డ్రింక్ వాటర్ 
  
9. Can I go outside?9. నేను బయటకు వెళ్ళవచ్చా?
క్యాన్ ఐ గో అవుట్‌సైడ్ 
  
10. Can I leave now?10. నేను ఇప్పుడు బయలుదేరవచ్చా?
క్యాన్ ఐ లీవ్ నౌ 
  
11. Can we start the class?11. మనం తరగతి ప్రారంభించవచ్చా?
క్యాన్ వీ స్టార్ట్ ద క్లాస్ 
  
12. Can we play now?12. ఇప్పుడు మనం ఆడుకోవచ్చా?
క్యాన్ వీ ప్లే నౌ 
  
13. Can we watch TV?13. మనం టీవీ చూడవచ్చా?
క్యాన్ వీ వాచ్ టీవీ 
  
14. Can we enter the room?14. మనం గదిలోకి ప్రవేశించవచ్చా?
క్యాన్ వీ ఎంటర్ ద రూమ్ 
  
15. Can we discuss this?15. మనం దీని గురించి చర్చించవచ్చా?
క్యాన్ వీ డిస్కస్ దిస్ 
  
16. You can sit here.16. మీరు ఇక్కడ కూర్చోవచ్చు.(ఇక్కడి నుండి అనుమతి ఇవ్వడం)
యూ క్యాన్ సిట్ హియర్ 
  
17. You can use my phone.17. మీరు నా ఫోన్‌ని ఉపయోగించవచ్చు.
యూ క్యాన్ యూజ్ మై ఫోన్ 
  
18. You can go home now.18. మీరు ఇప్పుడు ఇంటికి వెళ్ళవచ్చు.
యూ క్యాన్ గో హోమ్ నౌ 
  
19. You can take my bike.19. మీరు నా బైక్ తీసుకోవచ్చు.
యూ క్యాన్ టేక్ మై బైక్ 
  
20. You can ask me anytime.20. మీరు ఎప్పుడైనా నన్ను అడగవచ్చు.
యూ క్యాన్ ఆస్‌క్ మీ ఎనీటైమ్ 
  
21. Students can enter now.21. విద్యార్థులు ఇప్పుడు ప్రవేశించవచ్చు.
స్టూడెంట్స్ క్యాన్ ఎంటర్ నౌ 
  
22. Children can play here.22. పిల్లలు ఇక్కడ ఆడుకోవచ్చు.
చిల్డ్రన్ క్యాన్ ప్లే హియర్ 
  
23. You can start the work.23. మీరు పనిని ప్రారంభించవచ్చు.
యూ క్యాన్ స్టార్ట్ ద వర్క్ 
  
24. You can join us.24. మీరు మాతో చేరవచ్చు.
యూ క్యాన్ జాయిన్ అస్స్ 
  
25. He can leave early today.25. అతను ఈరోజు త్వరగా బయలుదేరవచ్చు.
హీ క్యాన్ లీవ్ ఎర్లీ టుడే 
  
26. She can take a break.26. ఆమె విరామం తీసుకోవచ్చు.
షీ క్యాన్ టేక్ ఎ బ్రేక్ 
  
27. They can use this room.27. వారు ఈ గదిని ఉపయోగించవచ్చు.
దే క్యాన్ యూజ్ దిస్ రూమ్ 
  
28. You can speak freely.28. మీరు స్వేచ్ఛగా మాట్లాడవచ్చు.
యూ క్యాన్ స్పీక్ ఫ్రీలీ 
  
29. We can continue tomorrow.29. మనం రేపు కొనసాగించవచ్చు.
వీ క్యాన్ కంటిన్యూ టుమారో 
  
30. Everyone can participate.30. అందరూ పాల్గొనవచ్చు.
ఎవ్రీవన్ క్యాన్ పార్టిసిపేట్ 

 

3.Possibility: 

భవిష్యత్తులో ఏదైనా జరిగే అవకాశం ఉన్నప్పుడు కూడా  can  ఉపయోగిస్తారు. భవిష్యత్తు అనగా ఐదు పది నిమిషాల తర్వాత కూడా భవిష్యత్తు అనవచ్చు

 Subject + can + verb1

దీనికి కూడా చివర్లో “చ్చు” అనే శబ్దం వస్తుంది.

 

1. It can rain today.1. ఈరోజు వర్షం పడవచ్చు.
ఇట్ క్యాన్ రేన్ టుడే 
  
2. This road can be dangerous.2. ఈ రోడ్డు ప్రమాదకరంగా ఉండవచ్చు.
దిస్ రోడ్ క్యాన్ బీ డేంజరస్ 
  
3. Anyone can make mistakes.3. ఎవరైనా తప్పులు చేయవచ్చు.
ఎనీవన్ క్యాన్ మేక్ మిస్టేక్స్ 
  
4. Life can change suddenly.4. జీవితం అకస్మాత్తుగా మారవచ్చు.
లైఫ్ క్యాన్ చెంజ్ సడన్‌లీ 
  
5. This plan can work.5. ఈ ప్లాన్ పనిచేయవచ్చు.
దిస్ ప్లాన్ క్యాన్ వర్క్ 
  
6. He can become famous.6. అతను ప్రసిద్ధి  చందవచ్చు.
హీ క్యాన్ బికమ్ ఫేమస్ 
  
7. She can win the competition.7. ఆమె పోటీలో  గెలవచ్చు.
షీ క్యాన్ విన్ ద కంపిటీషన్ 
  
8. The weather can change anytime.8. వాతావరణం ఎప్పుడైనా మారవచ్చు.
ద వెదర్ క్యాన్ చెంజ్ ఎనీటైమ్ 
  
9. This problem can grow bigger.9. ఈ సమస్య పెద్దదిగా పెరగవచ్చు.
దిస్ ప్రాబ్లమ్ క్యాన్ గ్రో బిగ్గర్ 
  
10. Children can learn quickly.10. పిల్లలు త్వరగా  నేర్చుకోవచ్చు.
చిల్డ్రన్ క్యాన్ లెర్న్ క్విక్లీ 
  
11. This place can get crowded.11. ఈ ప్రదేశం రద్దీగా  ఉండవచ్చు.
దిస్ ప్లేస్ క్యాన్ గెట్ క్రౌడెడ్ 
  
12. The train can be late.12. రైలు ఆలస్యం కావచ్చు.
ద ట్రైన్ క్యాన్ బీ లేట్ 
  
13. Prices can increase soon.13. ధరలు త్వరలో పెరగవచ్చు.
ప్రైసెస్ క్యాన్ ఇన్‌క్రీజ్ సూన్ 
  
14. He can forget the meeting.14. అతను సమావేశాన్ని మరచిపోవచ్చు.
హీ క్యాన్ ఫర్‌గెట్ ద మీటింగ్ 
  
15. She can arrive early.15. ఆమె త్వరగా రావచ్చు.
షీ క్యాన్ అరైవ్ ఎర్లీ 
  
16. This phone can break easily.16. ఈ ఫోన్ సులభంగా  విరిగిపోవచ్చు.
దిస్ ఫోన్ క్యాన్ బ్రేక్ ఈజిలీ 
  
17. Anyone can learn English.17. ఎవరైనా ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు.
ఎనీవన్ క్యాన్ లెర్న్ ఇంగ్లిష్ 
  
18. The baby can wake up now.18. శిశువు ఇప్పుడు మేల్కొనవచ్చు.
ద బేబీ క్యాన్ వేక్ అప్ నౌ 
  
19. Traffic can be heavy here.19. ఇక్కడ ట్రాఫిక్ భారీగా  ఉండవచ్చు.
ట్రాఫిక్ క్యాన్ బీ హెవీ హియర్ 
  
20. This idea can help us.20. ఈ ఆలోచన మనకు  సహాయపడవచ్చు.
దిస్ ఐడియా క్యాన్ హెల్ప్ అస్స్ 
  
21. He can fail without practice.21. అతను సాధన లేకుండా విఫలం కావచ్చు.
హీ క్యాన్ ఫెయిల్ విడౌట్ ప్రాక్టీస్ 
  
22. She can feel tired.22. ఆమె అలసిపోయినట్లు అనిపించవచ్చు.
షీ క్యాన్ ఫీల్ టైర్డ్ 
  
23. We can face problems.23. మనం సమస్యలను ఎదుర్కోవచ్చు.
వీ క్యాన్ ఫేస్ ప్రాబ్లమ్స్ 
  
24. They can miss the bus.24. వారు బస్సును మిస్ కావచ్చు.
దే క్యాన్ మిస్ ద బస్ 
  
25. The glass can break.25. గాజు పగిలిపోవచ్చు.
ద గ్లాస్ క్యాన్ బ్రేక్ 
  
26. This machine can stop suddenly.26. ఈ యంత్రం అకస్మాత్తుగా ఆగిపోవచ్చు.
దిస్ మెషీన్ క్యాన్ స్టాప్ సడన్‌లీ 
  
27. People can misunderstand you.27. ప్రజలు మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకోవచ్చు.
పీపుల్ క్యాన్ మిస్‌అండర్‌స్టాండ్ యూ 
  
28. The power can go off.28. కరెంటు పోవొచ్చు.
ద పవర్ క్యాన్ గో ఆఫ్ 
  
29. The match can be cancelled.29. మ్యాచ్ రద్దు చేయబడవచ్చు.
ద మ్యాచ్ క్యాన్ బీ క్యాన్సెల్డ్ 
  
30. Things can improve later.30. తర్వాత పరిస్థితులు మెరుగుపడవచ్చు.
థింగ్స్ క్యాన్ ఇంప్రూవ్ లేటర్ 
  
  

 4. Request : 

ఏదైనా సహాయం కోసం, పని కోసం, ఇతరులను రిక్వెస్ట్ గా అడగటానికి కూడా Can  ఉపయోగిస్తారు.  ఇది ప్రశ్న అడిగినట్లుగా ఉంటుంది. 

Can + Subject  + verb1 ? 

 దీనికి కూడా చివర్లో “చ్చా”   మరొకసారి సందర్భాన్ని బట్టి  “గలన” అనే శబ్దం వస్తుంది

1. Can I ask you something?1. నేను నిన్ను ఒకటి అడగవచ్చా? లేదా నేను నిన్ను ఒకటి అడగగలనా?
క్యాన్ ఐ ఆస్‌క్ యూ సమ్థింగ్ 
  
2. Can I join your team?2. నేను మీ బృందంలో చేరవచ్చా?
క్యాన్ ఐ జాయిన్ యువర్ టీమ్ 
  
3. Can he call me later?3. అతను నాకు తర్వాత కాల్ చేయగలడా ?
క్యాన్ హీ కాల్ మీ లేటర్ 
  
4. Can she help us?4. ఆమె మనకు సహాయం   చేయగలదా?
క్యాన్ షీ హెల్ప్ అస్స్ 
  
5. Can we start the meeting?5. మనం సమావేశాన్ని ప్రారంభించవచ్చా?
క్యాన్ వీ స్టార్ట్ ద మీటింగ్ 
  
6. Can they finish the work today?6. వారు ఈరోజు పనిని పూర్తి  చేయవచ్చా?
క్యాన్ దే ఫినిష్ ద వర్క్ టుడే 
  
7. Can Ram bring the book?7. రామ్ పుస్తకం తీసుకురావచ్చా?
క్యాన్ రామ్ బ్రింగ్ ద బుక్ 
  
8. Can Sita explain this lesson?8. సీత ఈ పాఠాన్ని  వివరించవచ్చా?
క్యాన్ సీత ఎక్స్‌ప్లైన్ దిస్ లెసన్ 
  
9. Can the teacher repeat the answer?9. ఉపాధ్యాయుడు సమాధానాన్ని పునరావృతం  చేయవచ్చా?
క్యాన్ ద టీచర్ రిపీట్ ద ఆన్సర్ 
  
10. Can the students write quietly?10. విద్యార్థులు నిశ్శబ్దంగా రాయవచ్చా?
క్యాన్ ద స్టూడెంట్స్ రైట్ క్వైట్లీ 
  
11. Can my brother pick me up?11. నా సోదరుడు నన్ను పికప్  చేయవచ్చా?
క్యాన్ మై బ్రదర్ పిక్ మీ అప్ 
  
12. Can your sister help her?12. మీ సోదరి ఆమెకు సహాయం  చేయవచ్చా?
క్యాన్ యువర్ సిస్టర్ హెల్ప్ హర్ 
  
13. Can Father check this bill?13. నాన్న ఈ బిల్లు  చూడవచ్చా?
క్యాన్ ఫాదర్ చెక్ దిస్ బిల్ 
  
14. Can mother cook dinner early?14. అమ్మ రాత్రి భోజనం త్వరగా వండగలదా?
క్యాన్ మదర్ కుక్ డిన్నర్ ఎర్లీ 
  
15. Can the manager approve this?15. మేనేజర్ దీనిని ఆమోదించగలరా?
క్యాన్ ద మేనేజర్ అప్రూవ్ దిస్ 
  
16. Can the doctor see me now?16. డాక్టర్ ఇప్పుడు నన్ను చూడగలరా?
క్యాన్ ద డాక్టర్ సీ మీ నౌ 
  
17. Can the driver wait here?17. డ్రైవర్ ఇక్కడ వేచి ఉండవచ్చా?
క్యాన్ ద డ్రైవర్ వెయిట్ హియర్ 
  
18. Can the child answer this?18. పిల్లవాడు దీనికి సమాధానం చెప్పగలడా?
క్యాన్ ద చైల్డ్ ఆన్సర్ దిస్ 
  
19. Can our team win today?19. ఈరోజు మన జట్టు గెలవగలదా?
క్యాన్ అవర్ టీమ్ విన్ టుడే 
  
20. Can your friends come tomorrow?20. మీ స్నేహితులు రేపు రాగలరా?
క్యాన్ యువర్ ఫ్రెండ్స్ కమ్ టుమారో 
  
21. Can the boys clean the ground?21. అబ్బాయిలు నేలను శుభ్రం చేయగలరా?
క్యాన్ ద బాయ్స్ క్లీన్ ద గ్రౌండ్ 
  
22. Can the girls sing a song?22. అమ్మాయిలు పాట పాడగలరా?
క్యాన్ ద గర్ల్స్ సింగ్ ఎ సాంగ్ 
  
23. Can the staff arrange chairs?23. సిబ్బంది కుర్చీలు ఏర్పాటు చేయగలరా?
క్యాన్ ద స్టాఫ్ అరేంజ్ చెయర్స్ 
  
24. Can the police help us?24. పోలీసులు మనకు సహాయం చేయగలరా?
క్యాన్ ద పోలీస్ హెల్ప్ అస్స్ 
  
25. Can the team leader guide us?25. జట్టు నాయకుడు మనకు మార్గనిర్దేశం చేయగలరా?
క్యాన్ ద టీమ్ లీడర్ గైడ్ అస్స్ 
  
26. Can my friend send the notes?26. నా స్నేహితుడు నోట్స్ పంపగలరా?
క్యాన్ మై ఫ్రెండ్ సెండ్ ద నోట్స్ 
  
27. Can your uncle drive us home?27. మీ మామయ్య మమ్మల్ని ఇంటికి తీసుకెళ్లగలరా?
క్యాన్ యువర్ అంకుల్ డ్రైవ్ అస్స్ హోమ్ 
  
28. Can the shopkeeper give change?28. దుకాణదారుడు చిల్లర ఇవ్వగలడా ?
క్యాన్ ద షాప్‌కీపర్ గివ్ చేంజ్ 
  
29. Can the audience stay silent?29. ప్రేక్షకులు మౌనంగా ఉండగలరా?
క్యాన్ ద ఆడియన్స్ స్టే సైలెంట్ 
  
30. Can everyone listen carefully?30. అందరూ శ్రద్ధగా వినగలరా?
క్యాన్ ఎవ్రీవన్ లిసన్ కేర్‌ఫులీ 
  
  
  

 

 5.Offer: 

ఇతరులకు ఏదైనా సహాయం చేయడానికి ఆఫర్ చేయడం

దీనికి కూడా ప్రతి వాక్యం చివరిలో “గలను” అని శబ్దం వస్తుంది

Subject + can + verb1

 

1. I can help you.1. నేను మీకు సహాయం చేయగలను.
ఐ క్యాన్ హెల్ప్ యూ 
  
2. I can carry your bag.2. నేను మీ బ్యాగ్ మోయగలను.
ఐ క్యాన్ క్యారీ యువర్ బ్యాగ్ 
  
3. I can explain this lesson.3. నేను ఈ పాఠాన్ని వివరించగలను.
ఐ క్యాన్ ఎక్స్‌ప్లైన్ దిస్ లెసన్ 
  
4. I can teach you English.4. నేను మీకు ఇంగ్లీష్ నేర్పించగలను.
ఐ క్యాన్ టీచ్ యూ ఇంగ్లిష్ 
  
5. I can call the doctor.5. నేను డాక్టర్‌కి ఫోన్ చేయగలను.
ఐ క్యాన్ కాల్ ద డాక్టర్ 
  
6. We can support you.6. మేము మీకు మద్దతు ఇవ్వగలము.
వీ క్యాన్ సపోర్ట్ యూ 
  
7. We can finish this work.7. మనం ఈ పనిని పూర్తి చేయగలము.
వీ క్యాన్ ఫినిష్ దిస్ వర్క్ 
  
8. We can arrange everything.8. మనం అన్నీ ఏర్పాటు చేసుకోగలము.
వీ క్యాన్ అరేంజ్ ఎవ్రీథింగ్ 
  
9. We can help the team.9. మేము జట్టుకు సహాయం చేయగలము.
వీ క్యాన్ హెల్ప్ ద టీమ్ 
  
10. We can solve this problem.10. మనం ఈ సమస్యను పరిష్కరించగలం.
వీ క్యాన్ సాల్వ్ దిస్ ప్రాబ్లమ్ 
  
11. He can fix your phone.11. అతను మీ ఫోన్ రిపేర్ చేయగలడు.
హీ క్యాన్ ఫిక్స్ యువర్ ఫోన్ 
  
12. He can drive you home.12. అతను మిమ్మల్ని ఇంటికి తీసుకువెళ్ళగలడు.
హీ క్యాన్ డ్రైవ్ యూ హోమ్ 
  
13. He can repair the bike.13. అతను బైక్ రిపేర్ చేయగలడు.
హీ క్యాన్ రిపేర్ ద బైక్ 
  
14. She can guide you.14. ఆమె మీకు మార్గనిర్దేశం చేయగలదు.
షీ క్యాన్ గైడ్ యూ 
  
15. She can cook dinner.15. ఆమె రాత్రి భోజనం వండగలదు.
షీ క్యాన్ కుక్ డిన్నర్ 
  
16. She can help the children.16. ఆమె పిల్లలకు సహాయం చేయగలదు.
షీ క్యాన్ హెల్ప్ ద చిల్డ్రన్ 
  
17. They can assist us.17. వారు మనకు సహాయం చేయగలరు.
దే క్యాన్ అసిస్ట్ అస్స్ 
  
18. They can organize the event.18. వారు ఈవెంట్‌ను నిర్వహించగలరు.
దే క్యాన్ ఆర్గనైజ్ ద ఈవెంట్ 
  
19. They can clean the room.19. వారు గదిని శుభ్రం చేయగలరు.
దే క్యాన్ క్లీన్ ద రూమ్ 
  
20. Ram can bring the books.20. రామ్ పుస్తకాలు తీసుకురాగలడు.
రామ్ క్యాన్ బ్రింగ్ ద బుక్స్ 
  
21. Sita can teach maths.21. సీత గణితం నేర్పించగలదు.
సీత క్యాన్ టీచ్ మ్యాథ్స్ 
  
22. My brother can pick you up.22. నా సోదరుడు నిన్ను పికప్ చేయగలడు.
మై బ్రదర్ క్యాన్ పిక్ యూ అప్ 
  
23. My sister can help her.23. నా సోదరి ఆమెకు సహాయం చేయగలదు.
మై సిస్టర్ క్యాన్ హెల్ప్ హర్ 
  
24. The teacher can explain again.24. గురువు మళ్ళీ వివరించగలరు.
ద టీచర్ క్యాన్ ఎక్స్‌ప్లైన్ అగేన్ 
  
25. The manager can approve it.25. మేనేజర్ దానిని ఆమోదించగలరు.
ద మేనేజర్ క్యాన్ అప్రూవ్ ఇట్ 
  
26. Our team can handle this work.26. మా బృందం ఈ పనిని నిర్వహించగలదు.
అవర్ టీమ్ క్యాన్ హ్యాండిల్ దిస్ వర్క్ 
  
27. The staff can arrange chairs.27. సిబ్బంది కుర్చీలు ఏర్పాటు చేసుకోగలదు.
ద స్టాఫ్ క్యాన్ అరేంజ్ చెయర్స్ 
  
28. The doctor can see you now.28. డాక్టర్ ఇప్పుడు మిమ్మల్ని చూడగలరు.
ద డాక్టర్ క్యాన్ సీ యూ నౌ 
  
29. The driver can drop you.29. డ్రైవర్ మిమ్మల్ని డ్రాప్ చేయగలడు.
ద డ్రైవర్ క్యాన్ డ్రాప్ యూ 
  
30. Everyone can help together.30. అందరూ కలిసి సహాయం  చేయగలరు.
ఎవ్రీవన్ క్యాన్ హెల్ప్ టుగెదర్ 
  
  

 

6.Suggestion:

ఎవరికైనా ఒక సూచన గాని ఒక ఐడియా గాని చెప్పేటప్పుడు can  ఉపయోగిస్తారు.

  Subject + can + verb1

దీనికి కూడా చివర్లో “చ్చు” అనే శబ్దం వస్తుంది

1. We can go tomorrow.1. మనం రేపు వెళ్ళవచ్చు.
వీ క్యాన్ గో టుమారో 
  
2. We can start early.2. మనం ముందుగానే ప్రారంభించవచ్చు.
వీ క్యాన్ స్టార్ట్ ఎర్లీ 
  
3. We can try another method.3. మనం మరొక పద్ధతిని ప్రయత్నించవచ్చు.
వీ క్యాన్ ట్రై అనదర్ మెథడ్ 
  
4. We can discuss this later.4. మనం దీనిని తరువాత చర్చించవచ్చు.
వీ క్యాన్ డిస్కస్ దిస్ లేటర్ 
  
5. We can meet in the evening.5. మనం సాయంత్రం కలవచ్చు.
వీ క్యాన్ మీట్ ఇన్ ది ఈవెనింగ్ 
  
6. I can talk to him.6. నేను అతనితో  మాట్లాడవచ్చు.
ఐ క్యాన్ టాక్ టు హిమ్ 
  
7. I can ask the teacher.7. నేను గురువుగారిని  అడగొచ్చు.
ఐ క్యాన్ ఆస్‌క్ ద టీచర్ 
  
8. I can check the details.8. నేను వివరాలను తనిఖీ  చేయవచ్చు.
ఐ క్యాన్ చెక్ ద డీటైల్స్ 
  
9. I can help you study.9. నేను నీకు చదువులో సహాయం చేయగలను.
ఐ క్యాన్ హెల్ప్ యూ స్టడీ 
  
10. I can explain it again.10. నేను దానిని మళ్ళీ వివరించగలను.
ఐ క్యాన్ ఎక్స్‌ప్లైన్ ఇట్ అగేన్ 
  
11. He can try again.11. అతను మళ్ళీ ప్రయత్నించవచ్చు.
హీ క్యాన్ ట్రై అగేన్ 
  
12. He can speak to the manager.12. అతను మేనేజర్‌తో మాట్లాడవచ్చు.
హీ క్యాన్ స్పీక్ టు ద మేనేజర్ 
  
13. He can take rest today.13. అతను ఈరోజు విశ్రాంతి తీసుకోవచ్చు.
హీ క్యాన్ టేక్ రెస్ట్ టుడే 
  
14. She can join our group.14. ఆమె మా గుంపులో చేరవచ్చు.
షీ క్యాన్ జాయిన్ అవర్ గ్రూప్ 
  
15. She can practice daily.15. ఆమె రోజూ సాధన చేయవచ్చు.
షీ క్యాన్ ప్రాక్టీస్ డైలీ 
  
16. She can learn online.16. ఆమె ఆన్‌లైన్‌లో నేర్చుకోవచ్చు.
షీ క్యాన్ లెర్న్ ఆన్‌లైన్ 
  
17. They can change the plan.17. వారు ప్రణాళికను మార్చవచ్చు.
దే క్యాన్ చెంజ్ ద ప్లాన్ 
  
18. They can start the project now.18. వారు ఇప్పుడు ప్రాజెక్ట్‌ను ప్రారంభించవచ్చు.
దే క్యాన్ స్టార్ట్ ద ప్రాజెక్ట్ నౌ 
  
19. They can discuss together.19. వారు కలిసి చర్చించుకోవచ్చు.
దే క్యాన్ డిస్కస్ టుగెదర్ 
  
20. Ram can lead the team.20. రామ్ జట్టును నడిపించవచ్చు.
రామ్ క్యాన్ లీడ్ ద టీమ్ 
  
21. Sita can explain the answer.21. సీత సమాధానాన్ని  వివరించవచ్చు.
సీత క్యాన్ ఎక్స్‌ప్లైన్ ద ఆన్సర్ 
  
22. The teacher can guide us.22. గురువు మనకు మార్గనిర్దేశం  చేయవచ్చు.
ద టీచర్ క్యాన్ గైడ్ అస్స్ 
  
23. The students can work in groups.23. విద్యార్థులు సమూహాలలో పని చేయవచ్చు.
ద స్టూడెంట్స్ క్యాన్ వర్క్ ఇన్ గ్రూప్స్ 
  
24. Our team can try a new idea.24. మా బృందం కొత్త ఆలోచనను ప్రయత్నించవచ్చు.
అవర్ టీమ్ క్యాన్ ట్రై ఎ న్యూ ఐడియా 
  
25. The doctor can check again.25. డాక్టర్ మళ్ళీ తనిఖీ చేయవచ్చు.
ద డాక్టర్ క్యాన్ చెక్ అగేన్ 
  
26. My brother can help you study.26. నా సోదరుడు నీకు చదువులో సహాయం  చేయవచ్చు.
మై బ్రదర్ క్యాన్ హెల్ప్ యూ స్టడీ 
  
27. My friend can solve this doubt.27. నా స్నేహితుడు ఈ సందేహాన్ని  తీర్చవచ్చు.
మై ఫ్రెండ్ క్యాన్ సాల్వ్ దిస్ డౌట్ 
  
28. The manager can review the work.28. మేనేజర్ పనిని సమీక్షించవచ్చు.
ద మేనేజర్ క్యాన్ రివ్యూ ద వర్క్ 
  
29. Everyone can share ideas.29. ప్రతి ఒక్కరూ ఆలోచనలను పంచుకోవచ్చు.
ఎవ్రీవన్ క్యాన్ షేర్ ఐడియాస్ 
  
30. We can find another solution.30. మనం మరొక పరిష్కారాన్ని కనుగొనవచ్చు.
వీ క్యాన్ ఫైండ్ అనదర్ సొల్యూషన్