క్రింది టాపిక్స్ పై క్లిక్ చేయండి
Could
Could be
Could have
Colud have been
Could
Could ఏ సందర్భాల్లో ఉపయోగిస్తారో తెలుసుకుందాం
1.Past Ability గతంలో చేయగలిగిన పని:
మనం ముందు నేర్చుకున్నట్లుగా Can = చేయగలను,
Can కి Past రూపంలో Could ని ఉపయోగిస్తారు అనగా గతంలో ఒక పని చేయగలిగినాను అని చెప్పడానికి.
Subject + Could + verb1
క్రింది టేబుల్ లోని మొదటి ఉదాహరణ చూడండి
I could swim fast.=నేను వేగంగా ఈత కొట్ట గలిగాను
దీనికి వ్యతిరేక వాక్యం రాయుటకు could తర్వాత Not ఉపయోగిస్తే సరిపోతుంది
I could not swim fast. = నేను వేగంగా ఈత కొట్టగలగ లేకపోయాను
పై రెండు వాక్యాలను ప్రశ్నా వాక్యాలుగా మార్చుటకు Could ని సెంటెన్స్ ప్రారంభంలో ఉంచితే సరిపోతుంది.
Could I swim fast = నేను వేగంగా ఈత కొట్టగలిగానా?
Could I not swim fast = నేను వేగంగా ఈత కొట్టగలగ లేకపోయానా ?
క్రింద ఉన్న అన్ని కేటగిరి సెంటెన్సెస్ కి ఇదే పద్ధతి ప్రకారం చేయండి.
Positive, negative, interrogative, and negative interrgative senteces రాయండి.
| 1. I could swim fast. | 1. నేను వేగంగా ఈత కొట్ట గలిగాను |
| ఐ కుడ్ స్విమ్ ఫాస్ట్ | |
| 2. She could sing well. | 2. ఆమె బాగా పాడగలిగింది |
| షీ కుడ్ సింగ్ వెల్ | |
| 3. He could run very fast. | 3. అతను చాలా వేగంగా పరిగెత్తగలిగినాడు |
| హీ కుడ్ రన్ వెరీ ఫాస్ట్ | |
| 4. We could play cricket. | 4. మనం క్రికెట్ ఆడగలిగినాము |
| వీ కుడ్ ప్లే క్రికెట్ | |
| 5. They could speak English. | 5. వారు ఇంగ్లీష్ మాట్లాడగలిగినారు |
| దే కుడ్ స్పీక్ ఇంగ్లిష్ | |
| 6. I could read books easily. | 6. నేను పుస్తకాలు సులభంగా చదవగలిగినాను |
| ఐ కుడ్ రీడ్ బుక్స్ ఈజిలీ | |
| 7. She could dance beautifully. | 7. ఆమె అందంగా నృత్యం చేయగలిగినది |
| షీ కుడ్ డాన్స్ బ్యూటిఫులీ | |
| 8. He could drive a car. | 8. అతను కారు నడపగలిగినాడు |
| హీ కుడ్ డ్రైవ్ ఎ కార్ | |
| 9. We could understand him. | 9. మేము అతనిని అర్థం చేసుకోగలిగినాము |
| వీ కుడ్ అండర్‌స్టాండ్ హిమ్ | |
| 10. I could write quickly. | 10. నేను త్వరగా వ్రాయగలిగినాను |
| ఐ కుడ్ రైట్ క్విక్లీ | |
| 11. She could cook well. | 11. ఆమె బాగా వంట చేయగలిగినది |
| షీ కుడ్ కుక్ వెల్ | |
| 12. He could climb trees. | 12. అతను చెట్లు ఎక్కగలిగినాడు |
| హీ కుడ్ క్లైమ్ ట్రీస్ | |
| 13. We could win matches. | 13. మనం మ్యాచ్‌లు గెలవగలిగినాము |
| వీ కుడ్ విన్ మ్యాచెస్ | |
| 14. I could solve problems. | 14. నేను సమస్యలను పరిష్కరించగలిగినాను |
| ఐ కుడ్ సాల్వ్ ప్రాబ్లమ్స్ | |
| 15. She could teach children. | 15. ఆమె పిల్లలకు నేర్పించగలిగినది |
| షీ కుడ్ టీచ్ చిల్డ్రెన్ | |
| 16. He could fix machines. | 16. అతను యంత్రాలను సరిచేయగలిగినాడు |
| హీ కుడ్ ఫిక్స్ మెషీన్స్ | |
| 17. We could travel alone. | 17. మనం ఒంటరిగా ప్రయాణించగలిగినాము |
| వీ కుడ్ ట్రావెల్ అలోన్ | |
| 18. I could remember everything. | 18. నేను అన్ని గుర్తు చేసుకొన గలిగినాను |
| ఐ కుడ్ రిమెంబర్ ఎవ్రితింగ్ | |
| 19. She could draw pictures. | 19. ఆమె చిత్రాలు గీయగలిగినది |
| షీ కుడ్ డ్రా పిక్చర్స్ | |
| 20. They could work hard. | 20. వారు కష్టపడి పనిచేయగలిగినారు |
| దే కుడ్ వర్క్ హార్డ్ | |
| 21. When I was young, I could run fast. | 21.నేను కుర్రవాడిగా ఉన్నప్పుడు వేగంగా పరిగెత్తగలిగినాను |
| వెన్ ఐ వాస్ యంగ్, ఐ కుడ్ రన్ ఫాస్ట్ | |
| 22. When she was a child, she could dance well. | 22. ఆమె బాల్యంలో ఉన్నప్పుడు ఆమె బాగా నృత్యం చేయగలిగినది |
| వెన్ షీ వాస్ ఎ చైల్డ్, షీ కుడ్ డాన్స్ వెల్ | |
| 23. When he was in school, he could solve math easily. | 23. అతను స్కూల్ లో ఉన్నప్పుడు అతను లెక్కలు సులభంగా చేయగలిగినాడు |
| వెన్ హీ వాస్ ఇన్ స్కూల్, హీ కుడ్ సాల్వ్ మ్యాథ్ ఈజిలీ | |
| 24. In my childhood, I could climb trees. | 24. నా బాల్యంలో నేను చెట్లు ఎక్కగలిగినాను |
| ఇన్ మై చైల్డ్‌హుడ్, ఐ కుడ్ క్లైమ్ ట్రీస్ | |
| 25. When we were kids, we could play all day. | మేము చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మేము రోజంతా ఆడుకోగలిగినాము |
| వెన్ వీ వర్ కిడ్స్, వీ కుడ్ ప్లే ఆల్ డే |
2. Polite Request మర్యాదగా అడగడం:
Can ని సాధారణంగా ఎవరినైనా రిక్వెస్ట్ గా ఏదైనా అడగటానికి ఉపయోగిస్తారు. కానీ Could ని ఇంకా చాలా చాలా గౌరవంగా అడగటానికి అనగా టీచర్స్ ని, పెద్దవారిని, అధికారులను రిక్వెస్ట్ గా ఏదైనా అడగటానికి could ఉపయోగిస్తారు.
Could + subject + verb1?
| 1. Could you help me? | 1. మీరు నాకు సహాయం చేయగలరా? |
| కుడ్ యూ హెల్ప్ మీ | |
| 2. Could you open the window? | 2. మీరు కిటికీ తెరవగలరా? |
| కుడ్ యూ ఓపెన్ ది విండో | |
| 3. Could you call him? | 3. మీరు అతన్ని పిలవగలరా? |
| కుడ్ యూ కాల్ హిమ్ | |
| 4. Could you explain this? | 4. మీరు దీనిని వివరించగలరా? |
| కుడ్ యూ ఎక్స్‌ప్లేన్ దిస్ | |
| 5. Could you wait a minute? | 5. మీరు ఒక్క నిమిషం వేచి ఉండగలరా? |
| కుడ్ యూ వెయిట్ ఎ మినిట్ | |
| 6. Could you bring water? | 6. మీరు నీళ్లు తీసుకురాగలరా? |
| కుడ్ యూ బ్రింగ్ వాటర్ | |
| 7. Could you send the file? | 7. మీరు ఫైల్ పంపగలరా? |
| కుడ్ యూ సెండ్ ది ఫైల్ | |
| 8. Could you check this? | 8. మీరు దీన్ని తనిఖీ చేయగలరా? |
| కుడ్ యూ చెక్ దిస్ | |
| 9. Could you teach me? | 9. మీరు నాకు నేర్పించగలరా? |
| కుడ్ యూ టీచ్ మీ | |
| 10. Could you close the door? | 10. మీరు తలుపు మూసివేయగలరా? |
| కుడ్ యూ క్లోజ్ ది డోర్ | |
| 11. Could you repeat that? | 11. మీరు దాన్ని పునరావృతం చేయగలరా? |
| కుడ్ యూ రిపీట్ ద్యాట్ | |
| 12. Could you write it down? | 12. మీరు దానిని వ్రాయగలరా? |
| కుడ్ యూ రైట్ ఇట్ డౌన్ | |
| 13. Could you speak slowly? | 13. మీరు నెమ్మదిగా మాట్లాడగలరా? |
| కుడ్ యూ స్పీక్ స్లోలీ | |
| 14. Could you guide me? | 14. మీరు నాకు మార్గనిర్దేశం చేయగలరా? |
| కుడ్ యూ గైడ్ మీ | |
| 15. Could you lend me a pen? | 15. మీరు నాకు పెన్ను ఇవ్వగలరా? |
| కుడ్ యూ లెండ్ మీ ఎ పెన్ | |
| 16. Could you show me? | 16. మీరు నాకు చూపించగలరా? |
| కుడ్ యూ షో మీ | |
| 17. Could you message me? | 17. మీరు నాకు సందేశం పంపగలరా? |
| కుడ్ యూ మెసేజ్ మీ | |
| 18. Could you come early? | 18. మీరు త్వరగా రాగలరా? |
| కుడ్ యూ కమ్ ఎర్లీ | |
| 19. Could you help us? | 19. మీరు మాకు సహాయం చేయగలరా? |
| కుడ్ యూ హెల్ప్ అస్ | |
| 20. Could you listen to me? | 20. మీరు నా మాట వినగలరా? |
| కుడ్ యూ లిసన్ టు మీ | |
3.permission: అనుమతి
అనుమతి తీసుకోవడం లేదా అనుమతి ఇవ్వడానికి “can” ఉపయోగిస్తారు .
ప్రతి సెంటెన్స్ కి చివర “చ్చా” అని వస్తుంది.
క్రింది టేబుల్ లో మొదటి సెంటెన్స్ ని గమనించండి
Could I come in? =నేను లోపలికి రావచ్చా?
ఇది ఆల్రెడీ interrogative sentence లో ఉంది
దీనికి నెగటివ్ సెంటెన్స్ రాయటకు మోడల్ వెర్బ్ అయిన Could తర్వాత not ఉపయోగిస్తే సరిపోతుంది.
Could I not come in? = నేను లోపలికి రాకూడదా?
| 1. Could I come in? | 1. నేను లోపలికి రావచ్చా? |
| కుడ్ ఐ కమ్ ఇన్ | |
| 2. Could I sit here? | 2. నేను ఇక్కడ కూర్చోవచ్చా? |
| కుడ్ ఐ సిట్ హియర్ | |
| 3. Could I use your phone? | 3. నేను మీ ఫోన్ ఉపయోగించవచ్చా? |
| కుడ్ ఐ యూజ్ యువర్ ఫోన్ | |
| 4. Could I ask a question? | 4. నేను ఒక ప్రశ్న అడగవచ్చా? |
| కుడ్ ఐ ఆ스크 ఎ క్వశ్చన్ | |
| 5. Could I take this book? | 5. నేను ఈ పుస్తకాన్ని తీసుకోవచ్చా? |
| కుడ్ ఐ టేక్ దిస్ బుక్ | |
| 6. Could I join you? | 6. నేను మీతో చేరవచ్చా? |
| కుడ్ ఐ జాయిన్ యూ | |
| 7. Could I leave early? | 7. నేను త్వరగా బయలుదేరవచ్చా? |
| కుడ్ ఐ లీవ్ ఎర్లీ | |
| 8. Could I talk to you? | 8. నేను మీతో మాట్లాడవచ్చా? |
| కుడ్ ఐ టాక్ టు యూ | |
| 9. Could I try this? | 9. నేను దీన్ని ప్రయత్నించవచ్చా? |
| కుడ్ ఐ ట్రై దిస్ | |
| 10. Could I borrow your pen? | 10. నేను మీ పెన్ను తీసుకోవచ్చా? |
| కుడ్ ఐ బారో యువర్ పెన్ | |
| 11. Could I open the door? | 11. నేను తలుపు తెరవవచ్చా? |
| కుడ్ ఐ ఓపెన్ ది డోర్ | |
| 12. Could I drink water? | 12. నేను నీళ్లు తాగవచ్చా? |
| కుడ్ ఐ డ్రింక్ వాటర్ | |
| 13. Could I call you later? | 13. నేను మీకు తర్వాత కాల్ చేయవచ్చా? |
| కుడ్ ఐ కాల్ యూ లేటర్ | |
| 14. Could I wait here? | 14. నేను ఇక్కడ వేచి ఉండవచ్చా? |
| కుడ్ ఐ వెయిట్ హియర్ | |
| 15. Could I study here? | 15. నేను ఇక్కడ చదువుకోవచ్చా? |
| కుడ్ ఐ స్టడీ హియర్ | |
| 16. Could I watch TV? | 16. నేను టీవీ చూడవచ్చా? |
| కుడ్ ఐ వాచ్ టీవీ | |
| 17. Could I go outside? | 17. నేను బయటకు వెళ్ళవచ్చా? |
| కుడ్ ఐ గో అవుట్‌సైడ్ | |
| 18. Could I take a rest? | 18. నేను విశ్రాంతి తీసుకోవచ్చా? |
| కుడ్ ఐ టేక్ రెస్ట్ | |
| 19. Could I speak now? | 19. నేను ఇప్పుడు మాట్లాడవచ్చా? |
| కుడ్ ఐ స్పీక్ నౌ | |
| 20. Could I meet him? | 20. నేను అతన్ని కలవవచ్చా? |
| కుడ్ ఐ మీట్ హిమ్ |
4.Possibility జరిగే అవకాశం:
ఏదైనా ఒక విషయం జరిగే అవకాశం ఉంది అని చెప్పాల్సిన పరిస్థితుల్లో కూడా Could ఉపయోగిస్తారు.
ఇటువంటి సెంటెన్స్ కి కూడా చివర “ చ్చు “ అని వస్తుంది.
| 1. It could rain today. | 1. ఈరోజు వర్షం పడవచ్చు. |
| ఇట్ కుడ్ రేన్ టుడే | |
| 2. He could be late. | 2. అతను ఆలస్యం కావచ్చు. |
| హీ కుడ్ బీ లేట్ | |
| 3. She could win the match. | 3. ఆమె మ్యాచ్ గెలవచ్చు |
| షీ కుడ్ విన్ ది మ్యాచ్ | |
| 4. This could work. | 4. ఇది పని చేయవచ్చు |
| దిస్ కుడ్ వర్క్ | |
| 5. They could arrive soon. | 5. వారు త్వరలో రావచ్చు. |
| దే కుడ్ అరైవ్ సూన్ | |
| 6. He could call you. | 6. అతను మీకు కాల్ చేయవచ్చు |
| హీ కుడ్ కాల్ యూ | |
| 7. We could miss the bus. | 7. మనం బస్సు మిస్ కావచ్చు. |
| వీ కుడ్ మిస్ ది బస్ | |
| 8. She could forget this. | 8. ఆమె దీన్ని మర్చిపోవచ్చు. |
| షీ కుడ్ ఫర్గెట్ దిస్ | |
| 9. It could happen again. | 9. ఇది మళ్ళీ జరగవచ్చు. |
| ఇట్ కుడ్ హ్యాపెన్ అగైన్ | |
| 10. He could be right. | 10. అతను చెప్పింది నిజమే కావచ్చు. |
| హీ కుడ్ బీ రైట్ | |
| 11. This could change everything. | 11. ఇది ప్రతిదీ మార్చవచ్చు |
| దిస్ కుడ్ చేంజ్ ఎవ్రితింగ్ | |
| 12. She could come tomorrow. | 12. ఆమె రేపు రావచ్చు. |
| షీ కుడ్ కమ్ టుమారో | |
| 13. We could fail. | 13. మనం విఫలం కావచ్చు. |
| వీ కుడ్ ఫెయిల్ | |
| 14. He could understand. | 14. అతను అర్థం చేసుకోవచ్చు |
| హీ కుడ్ అండర్‌స్టాండ్ | |
| 15. They could agree. | 15. వారు అంగీకరించవచ్చు. |
| దే కుడ్ అగ్రీ | |
| 16. It could take time. | 16. దీనికి సమయం పట్టవచ్చు. |
| ఇట్ కుడ్ టేక్ టైమ్ | |
| 17. She could be busy. | 17. ఆమె బిజీగా ఉండవచ్చు. |
| షీ కుడ్ బీ బిజీ | |
| 18. He could know the answer. | 18. అతను సమాధానం తెలుసుకోవచ్చు |
| హీ కుడ్ నో ది ఆన్సర్ | |
| 19. This could help you. | 19. ఇది మీకు సహాయం చేయవచ్చు |
| దిస్ కుడ్ హెల్ప్ యూ | |
| 20. We could succeed. | 20. మనం విజయం సాధించవచ్చు |
| వీ కుడ్ సక్సీడ్ |
5. Suggestion సలహా:
ఎవరికైనా సలహా గాని సూచనలు గాని ఇవ్వటానికి కూడా could ఉపయోగిస్తారు.
| 1. You could try again. | 1. మీరు మళ్ళీ ప్రయత్నించవచ్చు. |
| యూ కుడ్ ట్రై అగైన్ | |
| 2. You could study more. | 2. మీరు మరింత చదువుకోవచ్చు. |
| యూ కుడ్ స్టడీ మోర్ | |
| 3. We could start now. | 3. మనం ఇప్పుడు ప్రారంభించవచ్చు. |
| వీ కుడ్ స్టార్ట్ నౌ | |
| 4. You could ask him. | 4. మీరు అతనిని అడగవచ్చు. |
| యూ కుడ్ ఆ스크 హిమ్ | |
| 5. You could rest today. | 5. మీరు ఈరోజు విశ్రాంతి తీసుకోవచ్చు. |
| యూ కుడ్ రెస్ట్ టుడే | |
| 6. We could plan better. | 6. మనం మెరుగ్గా ప్లాన్ చేసుకోవచ్చు. |
| వీ కుడ్ ప్లాన్ బెటర్ | |
| 7. You could change this. | 7. మీరు దీన్ని మార్చవచ్చు. |
| యూ కుడ్ చేంజ్ దిస్ | |
| 8. You could practice daily. | 8. మీరు రోజూ సాధన చేయవచ్చు. |
| యూ కుడ్ ప్రాక్టీస్ డైలీ | |
| 9. We could improve this. | 9. మనం దీనిని మెరుగుపరచవచ్చు. |
| వీ కుడ్ ఇంప్రూవ్ దిస్ | |
| 10. You could learn English. | 10. మీరు ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు. |
| యూ కుడ్ లెర్న్ ఇంగ్లిష్ | |
| 11. You could save money. | 11. మీరు డబ్బు ఆదా చేసుకోవచ్చు. |
| యూ కుడ్ సేవ్ మనీ | |
| 12. We could discuss later. | 12. మనం తరువాత చర్చించుకోవచ్చు. |
| వీ కుడ్ డిస్కస్ లేటర్ | |
| 13. You could call her. | 13. మీరు ఆమెకు కాల్ చేయవచ్చు. |
| యూ కుడ్ కాల్ హర్ | |
| 14. You could join us. | 14. మీరు మాతో చేరవచ్చు. |
| యూ కుడ్ జాయిన్ అస్ | |
| 15. We could try another way. | 15. మనం మరొక విధంగా ప్రయత్నించవచ్చు. |
| వీ కుడ్ ట్రై అనదర్ వే | |
| 16. You could read this book. | 16. మీరు ఈ పుస్తకాన్ని చదవవచ్చు. |
| యూ కుడ్ రీడ్ దిస్ బుక్ | |
| 17. You could sleep early. | 17. మీరు త్వరగా నిద్రపోవచ్చు. |
| యూ కుడ్ స్లీప్ ఎర్లీ | |
| 18. We could finish today. | 18. మనం ఈరోజు పూర్తి చేయవచ్చు |
| వీ కుడ్ ఫినిష్ టుడే | |
| 19. You could ask questions. | 19. మీరు ప్రశ్నలు అడగవచ్చు. |
| యూ కుడ్ ఆ스크 క్వశ్చన్స్ | |
| 20. You could improve slowly. | 20. మీరు నెమ్మదిగా మెరుగుపడవచ్చు. |
| యూ కుడ్ ఇంప్రూవ్ స్లోలీ |
6.Imaginary situation:ఊహాత్మక పరిస్థితులు
గతంలోని ఊహాత్మక పరిస్థితుల గురించి తెలియజేయడానికి. ఇవి గతంలో నిజంగా జరగలేదు కానీ జరిగి ఉండేది అని ఊహించడానికి if తో could ఉపయోగిస్తారు.
If = అయితే
| 1. If I had money, I could buy a house. | 1. నా దగ్గర డబ్బు ఉండినట్లయితే నేను ఇల్లు కొనుక్కొని ఉండేవాడిని |
| ఇఫ్ ఐ హ్యాడ్ మనీ, ఐ కుడ్ బై ఎ హౌస్ | |
| 2. If I studied hard, I could pass the exam. | 2. నేను కష్టపడి చదివినట్లు అయితే, నేను పరీక్షలో ఉత్తీర్ణుడు అయి ఉండేవాడిని. |
| ఇఫ్ ఐ స్టడీడ్ హార్డ్, ఐ కుడ్ పాస్ ది ఎగ్జామ్ | |
| 3. If she tried, she could win the match. | 3. ఆమె ప్రయత్నించినట్లు అయితే, ఆమె మ్యాచ్ గెలవ గలిగి ఉండేది |
| ఇఫ్ షీ ట్రైడ్, షీ కుడ్ విన్ ది మ్యాచ్ | |
| 4. If he worked hard, he could succeed. | 4. అతను కష్టపడి పనిచేసినట్లు అయితే, అతను విజయం సాధించగలిగి ఉండేవాడు |
| ఇఫ్ హీ వర్క్డ్ హార్డ్, హీ కుడ్ సక్సీడ్ | |
| 5. If we started early, we could finish today. | 5. మనం త్వరగా ప్రారంభించినట్లు అయితే, ఈరోజు పూర్తి చేయగలిగి ఉండే వారిని. |
| ఇఫ్ వీ స్టార్టెడ్ ఎర్లీ, వీ కుడ్ ఫినిష్ టుడే | |
| 6. If they practised daily, they could improve. | 6. వారు రోజూ సాధన చేసినట్లు అయితే, వారు మెరుగుపడ గలిగి ఉండేవారు |
| ఇఫ్ దే ప్రాక్టీస్డ్ డైలీ, దే కుడ్ ఇంప్రూవ్ | |
| 7. If I knew the answer, I could tell you. | 7. నాకు సమాధానం తెలిసినట్లు అయితే, నేను మీకు చెప్ప గలిగి ఉండేవాడిని. |
| ఇఫ్ ఐ న్యూ ది ఆన్సర్, ఐ కుడ్ టెల్ యూ | |
| 8. If she had time, she could help us. | 8. ఆమెకు సమయం ఉండినట్లు అయితే, ఆమె మాకు సహాయం చేయగలిగి ఉండేది. |
| ఇఫ్ షీ హ్యాడ్ టైమ్, షీ కుడ్ హెల్ప్ అస్ | |
| 9. If he saved money, he could buy a car. | 9. అతను డబ్బు ఆదా చేసినట్లు అయితే, అతను కారు కొనగలిగి ఉండేవాడు. |
| ఇఫ్ హీ సేవ్డ్ మనీ, హీ కుడ్ బై ఎ కార్ | |
| 10. If we had a map, we could find the place. | 10. మన దగ్గర మ్యాప్ ఉండినట్లు అయితే, మనం ఆ స్థలాన్ని కనుగొనగలిగి ఉండే వారిని. |
| ఇఫ్ వీ హ్యాడ్ ఎ మ్యాప్, వీ కుడ్ ఫైండ్ ది ప్లేస్ | |
| 11. If I woke up early, I could catch the bus. | 11. నేను త్వరగా మేల్కొన్నట్లు అయితే, బస్సు పట్టుకో గలిగి ఉండేవాడిని. |
| ఇఫ్ ఐ వోక్ అప్ ఎర్లీ, ఐ కుడ్ క్యాచ్ ది బస్ | |
| 12. If she learned English, she could get a job. | 12. ఆమె ఇంగ్లీష్ నేర్చుకున్నట్లు అయితే, ఆమెకు ఉద్యోగం పొందగలిగి ఉండేది. |
| ఇఫ్ షీ లెర్న్డ్ ఇంగ్లిష్, షీ కుడ్ గెట్ ఎ జాబ్ | |
| 13. If he listened carefully, he could understand. | 13. అతను జాగ్రత్తగా విన్నట్లు అయితే, అతను అర్థం చేసుకోగలిగి ఉండేవాడు. |
| ఇఫ్ హీ లిసండ్ కేర్‌ఫులీ, హీ కుడ్ అండర్‌స్టాండ్ | |
| 14. If we planned well, we could win. | 14. మనం బాగా ప్లాన్ చేసుకున్నట్లు అయితే, మనం గెలవ గలిగి ఉండే వాళ్ళము. |
| ఇఫ్ వీ ప్ల్యాండ్ వెల్, వీ కుడ్ విన్ | |
| 15. If I had a bike, I could travel fast. | 15. నా దగ్గర సైకిల్ ఉండినట్లు అయితే, నేను వేగంగా ప్రయాణించ గలిగి ఉండేవాడిని. |
| ఇఫ్ ఐ హ్యాడ్ ఎ బైక్, ఐ కుడ్ ట్రావెల్ ఫాస్ట్ | |
| 16. If she spoke clearly, we could understand her. | 16. ఆమె స్పష్టంగా మాట్లాడినట్లు అయితే, మనం ఆమెను అర్థం చేసుకో గలిగి ఉండేవాళ్ళము. |
| ఇఫ్ షీ స్పోక్ క్లియర్లీ, వీ కుడ్ అండర్‌స్టాండ్ హర్ | |
| 17. If he came early, he could meet the teacher. | 17. అతను త్వరగా వచ్చినట్లు అయితే, గురువుగారిని కలవగలిగి ఉండే వాళ్ళము. |
| ఇఫ్ హీ కేమ్ ఎర్లీ, హీ కుడ్ మీట్ ది టీచర్ | |
| 18. If we tried again, we could solve the problem. | 18. మనం మళ్ళీ ప్రయత్నించినట్లు అయితే, సమస్యను పరిష్కరించగలిగి ఉండే వాళ్ళము. |
| ఇఫ్ వీ ట్రైడ్ అగైన్, వీ కుడ్ సాల్వ్ ది ప్రాబ్లమ్ | |
| 19. If they believed in themselves, they could achieve success. | 19. వారు తమను తాము విశ్వసించినట్లు అయితే, వారు విజయం సాధించ గలిగి ఉండేవారు. |
| ఇఫ్ దే బిలీవ్డ్ ఇన్ దెంసెల్వ్స్, దే కుడ్ అచీవ్ సక్సెస్ | |
| 20. If I had confidence, I could speak fluently. | 20. నాకు నమ్మకం ఉండినట్లు అయితే, నేను అనర్గళంగా మాట్లాడ గలిగి ఉండేవాడిని. |
| ఇఫ్ ఐ హ్యాడ్ కాన్ఫిడెన్స్, ఐ కుడ్ స్పీక్ ఫ్లూయెంట్‌లీ |
♠♠♠♠♠♠♠♠♠ END ♠♠♠♠♠♠♠♠♠
Could be
Could be ప్రధానంగా రెండు అర్ధాలతో ఉపయోగిస్తారు
- గతంలో ఉండగలిగినారు, ఉండగలిగినది, ఉండగలిగినాడు అని అర్థంలో ఉపయోగిస్తారు
- ఏదైనా విషయాన్ని గెస్ చేసి చెప్పడానికి అనగా ఊహించి చెప్పడానికి
క్రింది టేబుల్ లోని మొదటి ఉదాహరణ చూడండి
He could be at home. = అతను ఇంటి వద్ద ఉండగలిగినాడు
He could not be at home. = అతను ఇంటి వద్ద ఉండగలగలేకపోయినాడు
Could he be at home ?. = అతను ఇంటి వద్ద ఉండగలిగినాడ?
Could he not be at home. = అతను ఇంటి వద్ద ఉండగలగలేకపోయినాడా?
1.subject + could + noun
| 1. He could be at home. | అతను ఇంటి వద్ద ఉండగలిగినాడు |
| హీ కడ్ బీ ఎట్ హోమ్. | |
| 2. She could be at school. | ఆమె స్కూల్ వద్ద ఉండగలిగినది |
| షీ కడ్ బీ ఎట్ స్కూల్. | |
| 3. They could be at the market. | వారు మార్కెట్ వద్ద ఉండగలిగినారు |
| దే కడ్ బీ ఎట్ ది మార్కెట్. | |
| 4. He could be in the office. | అతను ఆఫీస్ వద్ద ఉండగలిగినాడు |
| హీ కడ్ బీ ఇన్ ది ఆఫీస్. | |
| 5. She could be in the room. | ఆమె రూమ్ లో ఉండగలిగినది |
| షీ కడ్ బీ ఇన్ ది రూమ్. | |
| 6. They could be at the station. | వారు స్టేషన్ వద్ద ఉండగలిగినారు |
| దే కడ్ బీ ఎట్ ది స్టేషన్. | |
| 7. He could be at the hospital. | అతను హాస్పటల్ వద్ద ఉండగలిగినాడు |
| హీ కడ్ బీ ఎట్ ది హాస్పిటల్. | |
| 8. She could be at the park. | ఆమె పార్కు దగ్గర ఉండగలిగినది |
| షీ కడ్ బీ ఎట్ ది పార్క్. | |
| 9. They could be at the temple. | వారు దేవాలయం దగ్గర ఉండగలిగినారు |
| దే కడ్ బీ ఎట్ ది టెంపుల్. | |
| 10. He could be in the library. | అతను లైబ్రరీ వద్ద ఉండగలిగినాడు |
| హీ కడ్ బీ ఇన్ ది లైబ్రరీ. | |
| 11. She could be in the kitchen. | ఆమె కిచెన్ లో ఉండగలిగినది |
| షీ కడ్ బీ ఇన్ ది కిచెన్. | |
| 12. They could be at the bus stop. | వారు బస్ స్టాప్ దగ్గర ఉండగలిగినారు |
| దే కడ్ బీ ఎట్ ది బస్ స్టాప్. | |
| 13. He could be in the classroom. | అతను క్లాస్ రూమ్ లో ఉండగలిగినాడు |
| హీ కడ్ బీ ఇన్ ది క్లాస్‌రూమ్. | |
| 14. She could be at the shop. | ఆమె షాప్ వద్ద ఉండగలిగినది |
| షీ కడ్ బీ ఎట్ ది షాప్. | |
| 15. They could be in the garden. | వారు తోటలో ఉండగలిగినారు |
| దే కడ్ బీ ఇన్ ది గార్డెన్. |
2. Could be ని ఉండవచ్చు, కావచ్చు, ఈ విధంగా ఏదైనా విషయాన్ని గురించి ఊహించి చెప్పడానికి మాత్రమే దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. అంటే విషయం ఏదో మనకు పూర్తిగా తెలియదు కాబట్టి మనం గెస్ చేసి చెప్తాము.
1.Subject + could be + Noun
సబ్జెక్టు యొక్క వృత్తి లేదా మరేదైనా కావచ్చు అని ఊహించడానికి
| 1. He could be a teacher. | 1. అతను ఒక గురువు కావచ్చు. |
| హీ కుడ్ బీ ఎ టీచర్. | |
| 2. She could be a doctor. | 2. ఆమె డాక్టర్ కావచ్చు. |
| షీ కుడ్ బీ ఎ డాక్టర్. | |
| 3. He could be a driver. | 3. అతను డ్రైవర్ కావచ్చు. |
| హీ కుడ్ బీ ఎ డ్రైవర్. | |
| 4. She could be a singer. | 4. ఆమె గాయని కావచ్చు. |
| షీ కుడ్ బీ ఎ సింగర్. | |
| 5. He could be a farmer. | 5. అతను రైతు కావచ్చు. |
| హీ కుడ్ బీ ఎ ఫార్మర్. | |
| 6. She could be a student. | 6. ఆమె విద్యార్థి కావచ్చు. |
| షీ కుడ్ బీ ఎ స్టూడెంట్. | |
| 7. He could be our leader. | 7. అతను మన నాయకుడు కావచ్చు. |
| హీ కుడ్ బీ అవర్ లీడర్. | |
| 8. She could be the winner. | 8. ఆమె విజేత కావచ్చు. |
| షీ కుడ్ బీ ది విన్నర్. | |
| 9. He could be the captain. | 9. అతను కెప్టెన్ కావచ్చు. |
| హీ కుడ్ బీ ది క్యాప్టెన్. | |
| 10. She could be the manager. | 10. ఆమె మేనేజర్ కావచ్చు. |
| షీ కుడ్ బీ ది మేనేజర్. | |
| 11. He could be your brother. | 11. అతను మీ సోదరుడు కావచ్చు. |
| హీ కుడ్ బీ యువర్ బ్రదర్. | |
| 12. She could be my sister. | 12. ఆమె నా సోదరి కావచ్చు. |
| షీ కుడ్ బీ మై సిస్టర్. | |
| 13. He could be our guest. | 13. అతను మన అతిథి కావచ్చు. |
| హీ కుడ్ బీ అవర్ గెస్ట్. | |
| 14. She could be the owner. | 14. ఆమె యజమాని కావచ్చు. |
| షీ కుడ్ బీ ది ఓనర్. | |
| 15. He could be the new player. | 15. అతను కొత్త ఆటగాడు కావచ్చు. |
| హీ కుడ్ బీ ది న్యూ ప్లేయర్. | |
2.Subject + could be + location
ఏదైనా ఒక స్థలం లో ప్రస్తుతం ఉండవచ్చు అని ఊహించి చెప్పడానికి
| 1. He could be at home. | 1. అతను ఇంట్లో ఉండవచ్చు. |
| హీ కుడ్ బీ ఎట్ హోమ్. | |
| 2. She could be at school. | 2. ఆమె స్కూల్లో ఉండవచ్చు. |
| షీ కుడ్ బీ ఎట్ స్కూల్. | |
| 3. They could be at the market. | 3. వారు మార్కెట్లో ఉండవచ్చు. |
| దే కుడ్ బీ ఎట్ ది మార్కెట్. | |
| 4. He could be in the office. | 4. అతను ఆఫీసులో ఉండవచ్చు. |
| హీ కుడ్ బీ ఇన్ ది ఆఫీస్. | |
| 5. She could be in the room. | 5. ఆమె గదిలో ఉండవచ్చు. |
| షీ కుడ్ బీ ఇన్ ది రూమ్. | |
| 6. They could be at the station. | 6. వారు స్టేషన్‌లో ఉండవచ్చు. |
| దే కుడ్ బీ ఎట్ ది స్టేషన్. | |
| 7. He could be at the hospital. | 7. అతను ఆసుపత్రిలో ఉండవచ్చు. |
| హీ కుడ్ బీ ఎట్ ది హాస్పిటల్. | |
| 8. She could be at the park. | 8. ఆమె పార్కులో ఉండవచ్చు. |
| షీ కుడ్ బీ ఎట్ ది పార్క్. | |
| 9. They could be at the temple. | 9. వారు ఆలయంలో ఉండవచ్చు. |
| దే కుడ్ బీ ఎట్ ది టెంపుల్. | |
| 10. He could be in the library. | 10. అతను లైబ్రరీలో ఉండవచ్చు. |
| హీ కుడ్ బీ ఇన్ ది లైబ్రరీ. | |
| 11. She could be in the kitchen. | 11. ఆమె వంటగదిలో ఉండవచ్చు. |
| షీ కుడ్ బీ ఇన్ ది కిచెన్. | |
| 12. They could be at the bus stop. | 12. వారు బస్ స్టాప్‌లో ఉండవచ్చు. |
| దే కుడ్ బీ ఎట్ ది బస్ స్టాప్. | |
| 13. He could be in the classroom. | 13. అతను తరగతి గదిలో ఉండవచ్చు. |
| హీ కుడ్ బీ ఇన్ ది క్లాస్‌రూమ్. | |
| 14. She could be at the shop. | 14. ఆమె దుకాణంలో ఉండవచ్చు. |
| షీ కుడ్ బీ ఎట్ ది షాప్. | |
| 15. They could be in the garden. | 15. వారు తోటలో ఉండవచ్చు. |
| దే కుడ్ బీ ఇన్ ది గార్డెన్. | |
3.Subject + could be + adjective.
ఒక వ్యక్తి యొక్క లేదా వస్తువు యొక్క గుణం ప్రస్తుతం ఈ విధంగా ఉండవచ్చు అని ఊహించి చెప్పడానికి
| 1. He could be happy. | 1. అతను సంతోషంగా ఉండవచ్చు. |
| హీ కుడ్ బీ హ్యాపీ. | |
| 2. She could be tired. | 2. ఆమె అలసిపోయి ఉండవచ్చు. |
| షీ కుడ్ బీ టైర్డ్. | |
| 3. He could be busy. | 3. అతను బిజీగా ఉండవచ్చు. |
| హీ కుడ్ బీ బిజీ. | |
| 4. She could be angry. | 4. ఆమె కోపంగా ఉండవచ్చు |
| షీ కుడ్ బీ యాంగ్రీ. | |
| 5. He could be sick. | 5. అతను అనారోగ్యంతో ఉండవచ్చు. |
| హీ కుడ్ బీ సిక్. | |
| 6. She could be ready. | 6. ఆమె సిద్ధంగా ఉండవచ్చు. |
| షీ కుడ్ బీ రెడీ. | |
| 7. He could be late. | 7. అతను ఆలస్యంగా ఉండవచ్చు |
| హీ కుడ్ బీ లేట్. | |
| 8. She could be right. | 8. ఆమె నిజం కావచ్చు |
| షీ కుడ్ బీ రైట్. | |
| 9. He could be wrong. | 9. అతను తప్పు కావచ్చు. |
| హీ కుడ్ బీ రాంగ్. | |
| 10. She could be afraid. | 10. ఆమె భయంగా ఉండవచ్చు |
| షీ కుడ్ బీ అఫ్రేడ్. | |
| 11. He could be hungry. | 11. అతను ఆకలితో ఉండవచ్చు. |
| హీ కుడ్ బీ హంగ్రీ. | |
| 12. She could be sad. | 12. ఆమె విచారంగా ఉండవచ్చు. |
| షీ కుడ్ బీ స్యాడ్. | |
| 13. He could be strong. | 13. అతను బలంగా ఉండవచ్చు. |
| హీ కుడ్ బీ స్ట్రాంగ్. | |
| 14. She could be nervous. | 14. ఆమె భయంగా ఉండవచ్చు |
| షీ కుడ్ బీ నర్వస్. | |
| 15. He could be lucky. | 15. అతను అదృష్టవంతుడు కావచ్చు. |
| హీ కుడ్ బీ లక్కీ. | |
4.Subject + could be + verb4
ఎవరైనా ఒక పని ప్రస్తుతం చేస్తూ ఉండవచ్చు అని ఊహించి చెప్పడానికి
| 1. He could be coming now. | 1. అతను ఇప్పుడు వస్తూ ఉండవచ్చు |
| హీ కుడ్ బీ కమింగ్ నౌ. | |
| 2. She could be waiting for you. | 2. ఆమె మీ కోసం వెయిట్ చేస్తూ ఉండవచ్చు |
| షీ కుడ్ బీ వెయిటింగ్ ఫర్ యూ. | |
| 3. They could be playing outside. | 3. వారు బయట ఆడుకుంటూ ఉండవచ్చు. |
| దే కుడ్ బీ ప్లేయింగ్ అవుట్‌సైడ్. | |
| 4. He could be studying in the room. | 4. అతను గదిలో చదువుకుంటూ ఉండవచ్చు. |
| హీ కుడ్ బీ స్టడీయింగ్ ఇన్ ది రూమ్. | |
| 5. She could be cooking in the kitchen. | 5. ఆమె వంటగదిలో వంట చేస్తుండవచ్చు. |
| షీ కుడ్ బీ కుకింగ్ ఇన్ ది కిచెన్. | |
| 6. They could be watching TV. | 6. వారు టీవీ చూస్తూ ఉండవచ్చు. |
| దే కుడ్ బీ వాచింగ్ టీవీ. | |
| 7. He could be sleeping now. | 7. అతను ఇప్పుడు నిద్రపోతూ ఉండవచ్చు. |
| హీ కుడ్ బీ స్లీపింగ్ నౌ. | |
| 8. She could be talking on the phone. | 8. ఆమె ఫోన్‌లో మాట్లాడుతుండవచ్చు. |
| షీ కుడ్ బీ టాకింగ్ ఆన్ ది ఫోన్. | |
| 9. They could be working in the office. | 9. వారు ఆఫీసులో పని చేస్తుండవచ్చు. |
| దే కుడ్ బీ వర్కింగ్ ఇన్ ది ఆఫీస్. | |
| 10. He could be reading a book. | 10. అతను ఒక పుస్తకం చదువుతూ ఉండవచ్చు. |
| హీ కుడ్ బీ రీడింగ్ ఎ బుక్. | |
| 11. She could be writing a letter. | 11. ఆమె ఒక లేఖ రాస్తూ ఉండవచ్చు. |
| షీ కుడ్ బీ రైటింగ్ ఎ లెటర్. | |
| 12. They could be walking on the road. | 12. వారు రోడ్డు మీద నడుస్తూ ఉండవచ్చు. |
| దే కుడ్ బీ వాకింగ్ ఆన్ ది రోడ్. | |
| 13. He could be learning English. | 13. అతను ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉండవచ్చు. |
| హీ కుడ్ బీ లెర్నింగ్ ఇంగ్లీష్. | |
| 14. She could be cleaning the room. | 14. ఆమె గదిని శుభ్రం చేస్తుండవచ్చు. |
| షీ కుడ్ బీ క్లీనింగ్ ది రూమ్. | |
| 15. They could be traveling today. | 15. వారు ఈరోజు ప్రయాణం చేయవచ్చు. |
| దే కుడ్ బీ ట్రావెలింగ్ టుడే. |
♠♠♠♠♠♠♠♠♠ END ♠♠♠♠♠♠♠♠♠
Could have
Could have ఏ సందర్భంలో ఉపయోగిస్తారు
1. Could have had
గతంలో ఏదైనా కలిగి ఉండగలిగినాడు అని చెప్పడానికి Could have had ఉపయోగిస్తారు
Subject +Could have had + noun
| 1. He could have had a pen. | అతను ఒక పెన్ను కలిగి ఉండగలిగినాడు |
| హీ కుడ్ హ్యావ్ హ్యాడ్ ఎ పెన్. | |
| 2. She could have had a book. | ఆమె ఒక పుస్తకాన్ని కలిగి ఉండగలిగింది |
| షీ కుడ్ హ్యావ్ హ్యాడ్ ఎ బుక్. | |
| 3. They could have had some water. | వారు కొన్ని నీళ్లను కలిగి ఉండగలిగినారు |
| దే కుడ్ హ్యావ్ హ్యాడ్ సమ్ వాటర్. | |
| 4. I could have had a chance. | నేను ఒక అవకాశాన్ని కలిగి ఉండగలిగినాను |
| ఐ కుడ్ హ్యావ్ హ్యాడ్ ఎ ఛాన్స్. | |
| 5. He could have had a bicycle. | అతను ఒక సైకిల్ ని కలిగి ఉండగలిగినాడు |
| హీ కుడ్ హ్యావ్ హ్యాడ్ ఎ బైసికిల్. | |
| 6. She could have had a mobile phone. | ఆమె ఒక మొబైల్ ని కలిగి ఉండగలిగినది |
| షీ కడ్ హ్యావ్ హ్యాడ్ ఎ మొబైల్ ఫోన్. | |
| 7. They could have had a better idea. | వారు ఒక మంచి ఐడియా ని కలిగి ఉండగలిగినారు |
| దే కుడ్ హ్యావ్ హ్యాడ్ ఎ బెటర్ ఐడియా. | |
| 8. I could have had a cup of tea. | నేను ఒక కప్పు టీ ని కలిగి ఉండగలిగినాను |
| ఐ కడ్ హ్యావ్ హ్యాడ్ ఎ కప్ ఆఫ్ టీ. | |
| 9. He could have had more money. | అతను చాలా డబ్బుని కలిగి ఉండగలిగినాడు |
| హీ కడ్ హ్యావ్ హ్యాడ్ మోర్ మనీ. | |
| 10. She could have had a car. | ఆమె ఒక కారుని కలిగి ఉండగలిగినది |
| షీ కడ్ హ్యావ్ హ్యాడ్ ఎ కార్. |
2. Could have + verb3 =చేయగలిగేది
గతంలో ఏదైనా ఒక పని చేయగలిగేది అని తెలియజేయడానికి Could have + verb3 ఉపయోగిస్తారు
క్రింది పట్టిక లోనే మొదటి ఉదాహరణ చూడండి
అతను మ్యాచ్ గెలవగలిగేవాడు.కానీ గెలవలేదు అనుకుంటే గెలవగలిగేవాడు అని చెప్పేటువంటి సందర్భం
He could have won the match.=అతను మ్యాచ్ గెలవగలిగేవాడు.
He could not have won the match.=అతను మ్యాచ్ గెలవగలిగేవాడు కాదు .
Could he have won the match?.=అతను మ్యాచ్ గెలవగలిగేవాడా?.
Could he not have won the match?.=అతను మ్యాచ్ గెలవగలిగేవాడు కాదా? .
| 1. He could have won the match. | 1. అతను మ్యాచ్ గెలవగలిగేవాడు. |
| హీ కుడ్ హ్యావ్ వాన్ ది మ్యాచ్. | |
| 2. She could have passed the exam. | 2. ఆమె పరీక్షలో పాస్ అయి ఉండగలిగేది |
| షీ కుడ్ హ్యావ్ పాస్డ్ ది ఎగ్జామ్. | |
| 3. They could have reached the station. | 3. వారు స్టేషన్ చేరుకుని ఉండగలిగే వారు. |
| దే కుడ్ హ్యావ్ రీచ్‌డ్ ది స్టేషన్. | |
| 4. I could have bought that car. | 4. నేను ఆ కారు కొనగలిగే వాడిని. |
| ఐ కుడ్ హ్యావ్ బాట్ ట్దాట్ కార్. | |
| 5. He could have scored more points. | 5. అతను మరిన్ని పాయింట్లు సాధించగలిగేవాడు. |
| హీ కుడ్ హ్యావ్ స్కోర్డ్ మోర్ పాయింట్స్. | |
| 6. She could have arrived earlier. | 6. ఆమె ముందుగా వచ్చి ఉండగలిగేది. |
| షీ కుడ్ హ్యావ్ అరైవ్డ్ ఎర్లియర్. | |
| 7. They could have helped us. | 7. వారు మాకు సహాయం చేసి ఉండగలిగే వారు. |
| దే కుడ్ హ్యావ్ హెల్ప్డ్ అస్. | |
| 8. I could have completed the project. | 8. నేను ప్రాజెక్ట్ పూర్తి కలిగే వాడిని. |
| ఐ కుడ్ హ్యావ్ కంప్లీటిడ్ ది ప్రాజెక్ట్. | |
| 9. He could have avoided the accident. | 9. అతను ప్రమాదాన్ని తప్పించుకోగలిగేవాడు. |
| హీ కుడ్ హ్యావ్ అవాయిడెడ్ ది అకసిడెంట్. | |
| 10. She could have answered all the questions. | 10. ఆమె అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పగలిగి ఉండేది. |
| షీ కుడ్ హ్యావ్ ఆంసర్డ్ ఆల్ క్వెస్టియన్స్. | |
| 11. They could have finished the work. | 11. వారు పనిని పూర్తి చేసి ఉండగలిగే వారు. |
| దే కుడ్ హ్యావ్ ఫినిష్డ్ ది వర్క్. | |
| 12. I could have reached home earlier. | 12. నేను ఇంటికి ముందే చేరుకునేవాడిని. |
| ఐ కుడ్ హ్యావ్ రీచ్‌డ్ హోమ్ ఎర్లియర్. | |
| 13. He could have solved the problem. | 13. అతను సమస్యను పరిష్కరించగలిగేవాడు. |
| హీ కుడ్ హ్యావ్ సాల్వ్డ్ ది ప్రాబ్లమ్. | |
| 14. She could have taken the bus. | 14. ఆమె బస్సు ఎక్కి ఉండగలిగేది. |
| షీ కుడ్ హ్యావ్ టేకెన్ ది బస్. | |
| 15. They could have joined the meeting. | 15. వారు సమావేశంలో జాయిన్ అవ్వగలిగేవారు. |
| దే కుడ్ హ్యావ్ జాయిన్డ్ ది మీటింగ్. |
| 1. He could have solved the puzzle easily. | 1. అతను ఆ పజిల్‌ను సులభంగా పరిష్కరించగలిగేవాడు. |
| హీ కుడ్ హ్యావ్ సాల్వ్డ్ ది పజిల్ ఈజిలీ. | |
| 2. She could have played the piano well. | 2. ఆమె పియానో బాగా వాయించగలిగేది. |
| షీ కుడ్ హ్యావ్ ప్లేడ ది పియానో వెల్. | |
| 3. I could have run faster than him. | 3. నేను అతని కంటే వేగంగా పరిగెత్తగలిగేవాడిని. |
| ఐ కుడ్ హ్యావ్ రన్ ఫాస్టర్ దాన్ హిమ్. | |
| 4. They could have lifted the heavy box. | 4. వారు బరువైన పెట్టెను గలిగే వారు. |
| దే కుడ్ హ్యావ్ లిఫ్టెడ్ ది హెవి బాక్స్. | |
| 5. He could have cooked a delicious meal. | 5. అతను రుచికరమైన భోజనం వండగలిగేవాడు. |
| హీ కుడ్ హ్యావ్ కుక్‌డ్ ఎ డెలిషస్ మీల్. | |
| 6. She could have painted the wall beautifully. | 6. ఆమె గోడకు అందంగా పెయింట్ చేసి ఉండగలిగేది. |
| షీ కుడ్ హ్యావ్ పెయింటెడ్ ది వాల్ బ్యూటిఫులీ. | |
| 7. I could have completed the task quickly. | 7. నేను ఆ పనిని త్వరగా పూర్తి చేయగలిగేవాడిని. |
| ఐ కుడ్ హ్యావ్ కంప్లీటిడ్ ది టాస్క్ క్విక్‌లీ. | |
| 8. They could have fixed the car engine. | 8. వాళ్ళు కారు ఇంజిన్ ని బాగు చేసి ఉండగలిగే వారు. |
| దే కుడ్ హ్యావ్ ఫిక్స్‌డ్ ది కార్ ఎంజిన్. | |
| 9. He could have learned English faster. | 9. అతను ఇంగ్లీష్ వేగంగా నేర్చుకోగలిగేవాడు. |
| హీ కుడ్ హ్యావ్ లెర్న్డ్ ఇంగ్లీష్ ఫాస్టర్. | |
| 10. She could have helped the children. | 10. ఆమె పిల్లలకు సహాయం చేయగలిగి ఉండేది. |
| షీ కుడ్ హ్యావ్ హెల్ప్డ్ ది చిల్డ్రెన్. | |
| 11. I could have solved this problem alone. | 11. నేను ఈ సమస్యను ఒంటరిగా పరిష్కరించగలిగే వాడిని. |
| ఐ కుడ్ హ్యావ్ సాల్వ్డ్ ది ప్రాబ్లమ్ అలోన్. | |
| 12. They could have completed the assignment yesterday. | 12. వారు నిన్ననే అసైన్‌మెంట్ పూర్తి చేసి ఉండగలిగే వారు. |
| దే కుడ్ హ్యావ్ కంప్లీటిడ్ ది అసైన్‌మెంట్ యెస్టర్డే. | |
| 13. He could have run the marathon easily. | 13. అతను మారథాన్‌ను సులభంగా పరుగెత్తగలిగేవాడు. |
| హీ కుడ్ హ్యావ్ రన్ ది మారథాన్ ఈజిలీ. | |
| 14. She could have sung the song perfectly. | 14. ఆమె పాటను పరిపూర్ణంగా పాడగలిగి ఉండేది. |
| షీ కుడ్ హ్యావ్ సాంగ్ ది సాంగ్ పర్ఫెక్ట్లీ. | |
| 15. They could have repaired the house quickly. | 15. వాళ్ళు ఇంటిని త్వరగా బాగు చేయించి ఉండగలిగే వారు. |
| దే కుడ్ హ్యావ్ రిపేర్‌డ్ ది హౌస్ క్విక్‌లీ. | |
3. Past speculation
జరిగిపోయిన వాటి గురించి ఊహలు చేయడం ప్రతి సెంటెన్స్ కి చివర “చ్చు” అని వస్తుంది
| 1. He could have missed the train. | 1. అతను రైలును కోల్పోయి ఉండవచ్చు. |
| హీ కుడ్ హ్యావ్ మిస్డ్ ది ట్రైన్. | |
| 2. She could have forgotten about the meeting. | 2. ఆమె సమావేశం గురించి మర్చిపోయి ఉండవచ్చు. |
| షీ కుడ్ హ్యావ్ ఫర్గాటెన్ అబౌట్ ది మీటింగ్. | |
| 3. They could have gone to the market. | 3. వారు మార్కెట్‌కి వెళ్లి ఉండవచ్చు. |
| దే కుడ్ హ్యావ్ గోన్ టు ది మార్కెట్. | |
| 4. I could have left my bag at home. | 4. నేను నా బ్యాగ్ ని ఇంట్లోనే వదిలేసి ఉండవచ్చు. |
| ఐ కుడ్ హ్యావ్ లెఫ్ట్ మై బ్యాగ్ ఎట్ హోమ్. | |
| 5. He could have lost his wallet yesterday. | 5. అతను నిన్న తన పర్సు పోగొట్టుకుని ఉండవచ్చు. |
| హీ కుడ్ హ్యావ్ లోస్ట్ హిస్ వాట్లెట్ యెస్టర్డే. | |
| 6. She could have met him at the park. | 6. ఆమె అతన్ని పార్కులో కలుసుకుని ఉండవచ్చు. |
| షీ కుడ్ హ్యావ్ మెట్ హిమ్ అట్ ది పార్క్. | |
| 7. They could have eaten before arriving here. | 7. వారు ఇక్కడికి రాకముందే తిని ఉండవచ్చు. |
| దే కుడ్ హ్యావ్ ఈటెన్ బిఫోర్ అరైవింగ్ హియర్. | |
| 8. I could have seen her at the library. | 8. నేను ఆమెను లైబ్రరీలో చూసి ఉండవచ్చు. |
| ఐ కుడ్ హ్యావ్ సీన్ హర్ అట్ ది లైబ్రరీ. | |
| 9. He could have bought a gift for her. | 9. అతను ఆమె కోసం ఒక బహుమతి కొని ఉండవచ్చు. |
| హీ కుడ్ హ్యావ్ బాట్ ఎ గిఫ్ట్ ఫర్ హర్. | |
| 10. She could have heard the news already. | 10. ఆమె ఇప్పటికే ఆ వార్త విని ఉండవచ్చు. |
| షీ కుడ్ హ్యావ్ హర్డ్ ది న్యూస్ ఆల్రెడీ. | |
| 11. They could have missed the bus this morning. | 11. వారు ఈ ఉదయం బస్సును కోల్పోయి ఉండవచ్చు. |
| దే కుడ్ హ్యావ్ మిస్డ్ ది బస్ దిస్ మోర్నింగ్. | |
| 12. I could have taken the wrong route. | 12. నేను తప్పు మార్గాన్ని తీసుకొని ఉండవచ్చు. |
| ఐ కుడ్ హ్యావ్ టేకెన్ ది రాంగ్ రూట్. | |
| 13. He could have been tired yesterday evening. | 13. అతను నిన్న సాయంత్రం అలసిపోయి ఉండవచ్చు. |
| హీ కుడ్ హ్యావ్ బీన్ టైర్డ్ యెస్టర్డే ఇవినింగ్. | |
| 14. She could have forgotten her keys at home. | 14. ఆమె ఇంట్లో తన కీలను మరచిపోయి ఉండవచ్చు. |
| షీ కుడ్ హ్యావ్ ఫర్గాటెన్ హర్ కీస్ ఎట్ హోమ్. | |
| 15. They could have gone on a trip last week. | 15. వారు గత వారం యాత్రకు వెళ్లి ఉండవచ్చు. |
| దే కుడ్ హ్యావ్ గోన్ ఆన్ ఎ ట్రిప్ లాస్ట్ వీక్. |
♠♠♠♠♠♠♠♠♠ END ♠♠♠♠♠♠♠♠♠
Could have been
Could have been ఏఏ సందర్భాల్లో ఉపయోగిస్తారో తెలుసుకుందాం
1.Guess Reason:
గతంలో ఏదైనా ఒక కారణాన్ని ఈరోజు అంచనా వేయటానికి could have been ఉపయోగిస్తారు.
ఉదాహరణకు నేను నా స్నేహితుడు రమేష్ తో ఈరోజు మాట్లాడుతున్నాను. “రవి గతంలో టీచర్ అయి ఉండవచ్చు “
Subject + could have been + reason
| 1. He could have been busy. | 1. అతను తీరిక లేకుండా ఉండి ఉండవచ్చు.(గతంలో ) |
| హీ కుడ్ హావ్ బీన్ బిజీ | |
| He could not have been busy. | అతను తీరిక లేకుండా ఉండకపోవచ్చు |
| Could he have been busy. | అతను తీరికగా ఉండి ఉండవచ్చా? |
| Could he not have been busy. | అతను తీరికగా ఉండకపోవచ్చా? |
| 2. She could have been tired. | 2. ఆమె అలసిపోయి ఉండవచ్చు. |
| షీ కుడ్ హావ్ బీన్ టైర్డ్ | |
| 3. They could have been late. | 3. వారు ఆలస్యంగా వచ్చి ఉండవచ్చు. |
| దే కుడ్ హావ్ బీన్ లేట్ | |
| 4. He could have been angry. | 4. అతడు కోపంగా ఉండి ఉండవచ్చు. |
| హీ కుడ్ హావ్ బీన్ యాంగ్రీ | |
| 5. She could have been sick. | 5. ఆమె అనారోగ్యంతో ఉండి ఉండవచ్చు. |
| షీ కుడ్ హావ్ బీన్ సిక్ | |
| 6. They could have been happy. | 6. వారు సంతోషంగా ఉండి ఉండవచ్చు |
| దే కుడ్ హావ్ బీన్ హ్యాపీ | |
| 7. He could have been a teacher. | 7. అతను ఉపాధ్యాయుడు అయి ఉండవచ్చు |
| హీ కుడ్ హావ్ బీన్ ఎ టీచర్ | |
| 8. She could have been a student. | 8. ఆమె ఒక విద్యార్థిని అయి ఉండవచ్చు |
| షీ కుడ్ హావ్ బీన్ ఎ స్టూడెంట్ | |
| 9. They could have been friends. | 9. వారు స్నేహితులు అయి ఉండవచ్చు. |
| దే కుడ్ హావ్ బీన్ ఫ్రెండ్స్ | |
| 10. He could have been sleeping. | 10. అతను నిద్రపోతూ ఉండి ఉండవచ్చు. |
| హీ కుడ్ హావ్ బీన్ స్లీపింగ్ | |
| 11. She could have been working. | 11. ఆమె పని చేస్తూ ఉండి ఉండవచ్చు. |
| షీ కుడ్ హావ్ బీన్ వర్కింగ్ | |
| 12. They could have been talking. | 12. వారు మాట్లాడుకుంటూ ఉండి ఉండవచ్చు. |
| దే కుడ్ హావ్ బీన్ టాకింగ్ | |
| 13. He could have been waiting outside. | 13. అతను బయట వేచి ఉండి ఉండవచ్చు. |
| హీ కుడ్ హావ్ బీన్ వెయిటింగ్ అవుట్‌సైడ్ | |
| 14. She could have been in a meeting. | 14. ఆమె ఒక సమావేశంలో ఉండి ఉండవచ్చు. |
| షీ కుడ్ హావ్ బీన్ ఇన్ ఎ మీటింగ్ | |
| 15. They could have been in the office. | 15. వారు కార్యాలయంలో ఉండి ఉండవచ్చు. |
| దే కుడ్ హావ్ బీన్ ఇన్ ది ఆఫీస్ | |
2. Past Possibility (state/place)
గతంలో ఏదైనా ఒక ప్రదేశంలో గానీ లేదా ఒక స్థితిలో ఉండి ఉండవచ్చు అని చెప్పడానికి
| 1. He could have been at home. | 1. అతను ఇంట్లో ఉండి ఉండవచ్చు. |
| హీ కుడ్ హావ్ బీన్ ఎట్ హోమ్ | |
| 2. She could have been at school. | 2. ఆమె పాఠశాలలో ఉండి ఉండవచ్చు. |
| షీ కుడ్ హావ్ బీన్ ఎట్ స్కూల్ | |
| 3. They could have been in the park. | 3. వారు పార్కులో ఉండి ఉండవచ్చు. |
| దే కుడ్ హావ్ బీన్ ఇన్ ది పార్క్ | |
| 4. He could have been in the office. | 4. అతను కార్యాలయంలో ఉండి ఉండవచ్చు. |
| హీ కుడ్ హావ్ బీన్ ఇన్ ది ఆఫీస్ | |
| 5. She could have been at the station. | 5. ఆమె స్టేషన్‌లో ఉండి ఉండవచ్చు. |
| షీ కుడ్ హావ్ బీన్ ఎట్ ది స్టేషన్ | |
| 6. They could have been at the shop. | 6. వారు దుకాణంలో ఉండి ఉండవచ్చు. |
| దే కుడ్ హావ్ బీన్ ఎట్ ది షాప్ | |
| 7. He could have been at the hospital. | 7. అతను ఆసుపత్రిలో ఉండి ఉండవచ్చు. |
| హీ కుడ్ హావ్ బీన్ ఎట్ ది హాస్పిటల్ | |
| 8. She could have been at the party. | 8. ఆమె పార్టీలో ఉండి ఉండవచ్చు. |
| షీ కుడ్ హావ్ బీన్ ఎట్ ది పార్టీ | |
| 9. They could have been in the room. | 9. వారు గదిలో ఉండి ఉండవచ్చు. |
| దే కుడ్ హావ్ బీన్ ఇన్ ది రూమ్ | |
| 10. He could have been at the bus stop. | 10. అతను బస్ స్టాప్ వద్ద ఉండి ఉండవచ్చు. |
| హీ కుడ్ హావ్ బీన్ ఎట్ ది బస్ స్టాప్ | |
| 11. She could have been in the kitchen. | 11. ఆమె వంటగదిలో ఉండి ఉండవచ్చు. |
| షీ కుడ్ హావ్ బీన్ ఇన్ ది కిచెన్ | |
| 12. They could have been in the classroom. | 12. వారు తరగతి గదిలో ఉండి ఉండవచ్చు. |
| దే కుడ్ హావ్ బీన్ ఇన్ ది క్లాస్‌రూమ్ | |
| 13. He could have been at the temple. | 13. అతను గుడిలో ఉండి ఉండవచ్చు. |
| హీ కుడ్ హావ్ బీన్ ఎట్ ది టెంపుల్ | |
| 14. She could have been in the garden. | 14. ఆమె తోటలో ఉండి ఉండవచ్చు. |
| షీ కుడ్ హావ్ బీన్ ఇన్ ది గార్డెన్ | |
| 15. They could have been on the road. | 15. వారు రోడ్డు మీద ఉండి ఉండవచ్చు. |
| దే కుడ్ హావ్ బీన్ ఆన్ ది రోడ్ | |
3. Missed Opportunity:
గతంలో కోల్పోయిన అవకాశని గురించి పశ్చాత్తాప పడినట్లుగా లేదా బాధపడినట్లుగా మాట్లాడుకోవడం
ఉదాహరణకు నేను నా స్నేహితుడితో ఈరోజు మాట్లాడుతున్నాను. రవి ఇంజనీర్ అయ్యుండేవాడు కానీ కాలేదు. ఇటువంటి అర్థంతో కూడా could have been ఉపయోగిస్తారు.
| 1. He could have been a doctor. | 1. అతను డాక్టరు అయ్యుండేవాడు.( కానీ డాక్టర్ కాలేదు) |
| హీ కుడ్ హావ్ బీన్ ఎ డాక్టర్ | |
| 2. She could have been a teacher. | 2. ఆమె ఉపాధ్యాయురాలు అయ్యుండేది. |
| షీ కుడ్ హావ్ బీన్ ఎ టీచర్ | |
| 3. They could have been successful. | 3. వారు విజయం సాధించి ఉండేవారు. |
| దే కుడ్ హావ్ బీన్ సక్సెస్‌ఫుల్ | |
| 4. He could have been rich. | 4. అతను ధనవంతుడు అయ్యుండేవాడు |
| హీ కుడ్ హావ్ బీన్ రిచ్ | |
| 5. She could have been famous. | 5. ఆమె ప్రసిద్ధి చెంది ఉండేది. |
| షీ కుడ్ హావ్ బీన్ ఫేమస్ | |
| 6. They could have been happy. | 6. వారు సంతోషంగా ఉండగలిగి ఉండేవారు. |
| దే కుడ్ హావ్ బీన్ హ్యాపీ | |
| 7. He could have been a leader. | 7. అతను నాయకుడు కాగలిగేవాడు. |
| హీ కుడ్ హావ్ బీన్ ఎ లీడర్ | |
| 8. She could have been an engineer. | 8. ఆమె ఇంజనీర్ అయ్యుండేది. |
| షీ కుడ్ హావ్ బీన్ ఎన ఇంజనీర్ | |
| 9. They could have been winners. | 9. వారు విజేతలు అయ్యుండేవారు. |
| దే కుడ్ హావ్ బీన్ విన్నర్స్ | |
| 10. He could have been a great player. | 10. అతను గొప్ప ఆటగాడు అయ్యేవాడు. |
| హీ కుడ్ హావ్ బీన్ ఎ గ్రేట్ ప్లేయర్ | |
| 11. She could have been a singer. | 11. ఆమె గాయని అయ్యుండేది. |
| షీ కుడ్ హావ్ బీన్ ఎ సింగర్ | |
| 12. They could have been stars. | 12. వారు తారలు అయ్యేవారు. |
| దే కుడ్ హావ్ బీన్ స్టార్స్ | |
| 13. He could have been a manager. | 13. అతను మేనేజర్ అయ్యేవాడు. |
| హీ కుడ్ హావ్ బీన్ ఎ మేనేజర్ | |
| 14. She could have been a dancer. | 14. ఆమె నర్తకి అయ్యుండేది. |
| షీ కుడ్ హావ్ బీన్ ఎ డాన్సర్ | |
| 15. They could have been champions. | 15. వారు ఛాంపియన్లు అయ్యుండేవారు. |
| దే కుడ్ హావ్ బీన్ చాంపియన్స్ |
4.Could have been + verb4 (past continuous)
గతంలో ఏదైనా ఒక పని జరుగుతూ ఉండి ఉండవచ్చు అని అంచనా వేయటానికి Could have been + verb4 ఉపయోగిస్తారు .
ఉదాహరణకు నేను నా స్నేహితుడితో ఈరోజు మాట్లాడుతున్నాను. “రమేష్ గతంలో నిద్రపోతూ ఉండి ఉండవచ్చు
| 1. He could have been sleeping. | 1. అతను నిద్రపోతూ ఉండి ఉండవచ్చు. |
| హీ కుడ్ హావ్ బీన్ స్లీపింగ్ | |
| 2. She could have been cooking. | 2. ఆమె వంట చేస్తూ ఉండి ఉండవచ్చు. |
| షీ కుడ్ హావ్ బీన్ కుకింగ్ | |
| 3. They could have been playing. | 3. వారు ఆడుతూ ఉండొచ్చు. |
| దే కుడ్ హావ్ బీన్ ప్లేయింగ్ | |
| 4. I could have been studying. | 4. నేను చదువుకుంటూ ఉండి ఉండవచ్చు. |
| ఐ కుడ్ హావ్ బీన్ స్టడీయింగ్ | |
| 5. He could have been driving. | 5. అతను డ్రైవింగ్ చేస్తూ ఉండి ఉండవచ్చు. |
| హీ కుడ్ హావ్ బీన్ డ్రైవింగ్ | |
| 6. She could have been reading. | 6. ఆమె చదువుతూ ఉండి ఉండవచ్చు. |
| షీ కుడ్ హావ్ బీన్ రీడింగ్ | |
| 7. They could have been watching TV. | 7. వారు టీవీ చూస్తూ ఉండి ఉండవచ్చు. |
| దే కుడ్ హావ్ బీన్ వాచింగ్ టీవీ | |
| 8. He could have been working. | 8. అతను పని చేస్తూ ఉండి ఉండవచ్చు. |
| హీ కుడ్ హావ్ బీన్ వర్కింగ్ | |
| 9. She could have been talking. | 9. ఆమె మాట్లాడుతూ ఉండి ఉండవచ్చు. |
| షీ కుడ్ హావ్ బీన్ టాకింగ్ | |
| 10. They could have been waiting. | 10. వారు వేచి ఉండి ఉండవచ్చు. |
| దే కుడ్ హావ్ బీన్ వెయిటింగ్ | |
| 11. He could have been eating. | 11. అతను భోజనం చేస్తూ ఉండి ఉండవచ్చు. |
| హీ కుడ్ హావ్ బీన్ ఈటింగ్ | |
| 12. She could have been cleaning. | 12. ఆమె శుభ్రం చేస్తూ ఉండి ఉండవచ్చు. |
| షీ కుడ్ హావ్ బీన్ క్లీనింగ్ | |
| 13. They could have been running. | 13. వారు పరిగెడుతూ ఉండి ఉండవచ్చు. |
| దే కుడ్ హావ్ బీన్ రన్నింగ్ | |
| 14. He could have been walking. | 14. అతను నడుస్తూ ఉండి ఉండవచ్చు. |
| హీ కుడ్ హావ్ బీన్ వాకింగ్ | |
| 15. She could have been learning English. | 15. ఆమె ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉండి ఉండవచ్చు. |
| షీ కుడ్ హావ్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ | |
క్రింది పట్టికలోని మొదటి సెంటెన్స్ చూడండి
అతను అలసిపోయినట్లు ఈరోజు మనకు కనిపిస్తున్నాడు. ఎందుకంటే గతంలో అతను రోజంతా పనిచేసే ఉండవచ్చు.
ఇందులో మొదటి సెంటెన్స్ సింపుల్ ప్రెసెంట్ లో ఉంటుంది.
| 1. He looks tired. He could have been working all day. | 1. అతను అలసిపోయినట్లు కనిపిస్తున్నాడు. అతను రోజంతా పనిచేసి ఉండవచ్చు. |
| హీ లుక్స్ టైర్డ్. హీ కుడ్ హావ్ బీన్ వర్కింగ్ ఆల్ డే | |
| 2. She looks sleepy. She could have been studying all night. | 2. ఆమె నిద్రమత్తుగా కనిపిస్తోంది. ఆమె రాత్రంతా చదువుకుని ఉండవచ్చు. |
| షీ లుక్స్ స్లీపీ. షీ కుడ్ హావ్ బీన్ స్టడీయింగ్ ఆల్ నైట్ | |
| 3. They look wet. They could have been walking in the rain. | 3. వారు తడిగా కనిపిస్తున్నారు. వారు వర్షంలో నడుస్తూ ఉండి ఉండవచ్చు. |
| దే లుక్ వెట్. దే కుడ్ హావ్ బీన్ వాకింగ్ ఇన్ ది రేన్ | |
| 4. He looks upset. He could have been arguing with someone. | 4. అతను కలత చెందినట్లు కనిపిస్తున్నాడు. అతను ఎవరితోనైనా వాదిస్తూ ఉండి ఉండవచ్చు. |
| హీ లుక్స్ అప్‌సెట్. హీ కుడ్ హావ్ బీన్ ఆర్గ్యూయింగ్ విత్ సమ్‌వన్ | |
| 5. She looks happy. She could have been talking to her friend. | 5. ఆమె సంతోషంగా కనిపిస్తోంది. ఆమె తన స్నేహితురాలితో మాట్లాడుతుండవచ్చు. |
| షీ లుక్స్ హ్యాపీ. షీ కుడ్ హావ్ బీన్ టాకింగ్ టు హర్ ఫ్రెండ్ | |
| 6. They look busy. They could have been preparing for the meeting. | 6. వారు చాలా హడావిడిగా కనిపిస్తున్నారు. బహుశా వారు సమావేశానికి సిద్ధమవుతూ ఉండి ఉండవచ్చు. |
| దే లుక్ బిజీ. దే కుడ్ హావ్ బీన్ ప్రిపేరింగ్ ఫర్ ది మీటింగ్ | |
| 7. He looks tired. He could have been running. | 7. అతను అలసిపోయినట్లు కనిపిస్తున్నాడు. అతను పరుగెత్తి ఉండవచ్చు. |
| హీ లుక్స్ టైర్డ్. హీ కుడ్ హావ్ బీన్ రన్నింగ్ | |
| 8. She looks worried. She could have been thinking about something. | 8. ఆమె ఆందోళనగా కనిపిస్తోంది. ఆమె దేని గురించో ఆలోచిస్తూ ఉండి ఉండవచ్చు. |
| షీ లుక్స్ వర్రీడ్. షీ కుడ్ హావ్ బీన్ థింకింగ్ అబౌట్ సమ్తింగ్ | |
| 9. They look excited. They could have been planning a trip. | 9. వారు ఉత్సాహంగా కనిపిస్తున్నారు. బహుశా వారు ఒక యాత్రకు ప్రణాళిక వేస్తూ ఉండి ఉండవచ్చు. |
| దే లుక్ ఎక్సైటెడ్. దే కుడ్ హావ్ బీన్ ప్లానింగ్ ఎ ట్రిప్ | |
| 10. He looks dirty. He could have been playing outside. | 10. అతను మురికిగా కనిపిస్తున్నాడు. అతను బయట ఆడుకుంటూ ఉండి ఉండవచ్చు. |
| హీ లుక్స్ డర్టీ. హీ కుడ్ హావ్ బీన్ ప్లేయింగ్ అవుట్‌సైడ్ | |
| 11. She looks tired. She could have been cleaning the house. | 11. ఆమె అలసిపోయినట్లు కనిపిస్తోంది. బహుశా ఆమె ఇల్లు శుభ్రం చేస్తూ ఉండి ఉండవచ్చు. |
| షీ లుక్స్ టైర్డ్. షీ కుడ్ హావ్ బీన్ క్లీనింగ్ ది హౌస్ | |
| 12. They look late. They could have been waiting for a bus. | 12. వాళ్ళు ఆలస్యంగా వచ్చినట్టు కనిపిస్తున్నారు. బహుశా వాళ్ళు బస్సు కోసం ఎదురు చూస్తూ ఉండి ఉంటారు. |
| దే లుక్ లేట్. దే కుడ్ హావ్ బీన్ వెయిటింగ్ ఫర్ ఎ బస్ | |
| 13. He looks busy. He could have been working on a project. | 13. అతను చాలా బిజీగా ఉన్నట్లు కనిపిస్తున్నాడు. బహుశా అతను ఏదైనా ప్రాజెక్ట్‌పై పనిచేస్తూ ఉండి ఉండవచ్చు. |
| హీ లుక్స్ బిజీ. హీ కుడ్ హావ్ బీన్ వర్కింగ్ ఆన్ ఎ ప్రాజెక్ట్ | |
| 14. She looks tired. She could have been cooking for a long time. | 14. ఆమె అలసిపోయినట్లు కనిపిస్తోంది. ఆమె చాలా సేపటి నుండి వంట చేస్తూ ఉండి ఉండవచ్చు. |
| షీ లుక్స్ టైర్డ్. షీ కుడ్ హావ్ బీన్ కుకింగ్ ఫర్ ఎ లాంగ్ టైమ్ | |
| 15. They look silent. They could have been discussing something serious. | 15. వారు మౌనంగా కనిపిస్తున్నారు. బహుశా వారు ఏదైనా తీవ్రమైన విషయం గురించి చర్చిస్తూ ఉండి ఉండవచ్చు. |
| దే లుక్ సైలెంట్. దే కుడ్ హావ్ బీన్ డిస్కస్సింగ్ సమ్తింగ్ సీరియస్ |
