...

Simple Present -1

1. General truths and facts.  

Always true or universally accepted statements.  సింపుల్ ప్రెసెంట్ టెన్స్ ని ఏ ఏ సందర్భాలలో ఉపయోగిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం. (spoken english telugu)

కొన్ని విషయాలు. ఎల్లప్పుడూ సత్యాలు గానే ఉంటాయి వాటిని మార్చలేము అటువంటి వాటిని ఈ Simple Present tense లో తెలియజేస్తారు. ప్రపంచంలోనే ప్రజలందరూ వాటిని నిజాలుగానే అంగీకరిస్తారు

గమనిక: పైన కనిపిస్తున్నవన్నీ నిత్య సత్యాలు అయితే వాటిని నెగిటివ్ సెంటెన్స్ లోకి మార్చినప్పుడు అబద్ధాలు అవుతాయి. అయితే మీకు అర్థం కావడం కోసం నెగిటివ్ సెంటెన్స్ ని ఇచ్చినాము.

Examples:  subject బహువచనంలో (plural)ఉంటే verbs కి  ఎటువంటి మార్పు ఉండదు subject ఏకవచనం (singular)  అయితే verbs  కి ‘s’  గాని ‘es’ గాని ‘ies’ గాని చేరుస్తారు

1.Water boils at 100 degrees Celsius.(Positive sentence) 100 డిగ్రీల సెల్సియస్ వద్ద నీరు మరుగుతుంది sunject  అయినా water singular కనుక వెర్బ్ boil కి  ‘s’ చేర్చారు 
Water does not boil at 100 degrees Celsius.     ( negative sentence) నీరు 100 డిగ్రీల సెల్సియస్ వద్ద మరగదు 
Does water boil at 100 degrees Celsius? (Interrogative sentence) 100 డిగ్రీల సెల్సియస్ వద్ద నీరు మరుగుతుందా?
Doesn’t water boil at 100 degrees Celsius? (Negative interrogative sentence)  100 డిగ్రీల సెల్సియస్ వద్ద నీరు మరగదా?
2.The sun rises in the east. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు.(spoken english telugu)
The sun does not rise in the east. సూర్యుడు తూర్పున ఉదయించడు.
Does the sun rise in the east? సూర్యుడు తూర్పున ఉదయిస్తాడా?
Doesn’t the sun rise in the east? సూర్యుడు తూర్పున ఉదయించడా?
The Earth revolves around the Sun. భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది.
The Earth does not revolve around the Sun. భూమి సూర్యుని చుట్టూ తిరగదు.
Does the Earth revolve around the Sun? భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుందా?
Doesn’t the Earth revolve around the Sun? భూమి సూర్యుని చుట్టూ తిరగదా?
3.Humans need oxygen to survive. మానవులు జీవించడానికి ఆక్సిజన్ అవసరం.Humans సబ్జెక్టు Plural లో  ఉంది కాబట్టి verb (need ) కి  ఎటువంటి మార్పు చేయాల్సిన అవసరం లేదు
Humans do not need oxygen to survive.  మానవులు జీవించడానికి ఆక్సిజన్ అవసరం లేదు.(spoken english telugu)
Do humans need oxygen to survive? మానవులు జీవించడానికి ఆక్సిజన్ అవసరమా?
Don’t humans need oxygen to survive? మనుషులు బ్రతకడానికి ఆక్సిజన్ అవసరం లేదా?
4. Ice melts at 0 degrees Celsius. 0 డిగ్రీల సెల్సియస్ వద్ద మంచు కరుగుతుంది.
Ice does not melt at 0 degrees Celsius. 0 డిగ్రీల సెల్సియస్ వద్ద మంచు కరగదు.
Does ice melt at 0 degrees Celsius? 0 డిగ్రీల సెల్సియస్ వద్ద మంచు కరుగుతుందా?
Doesn’t ice melt at 0 degrees Celsius? 0 డిగ్రీల సెల్సియస్ వద్ద మంచు కరగదా?
5.Light travels faster than sound. కాంతి, ధ్వని కంటే వేగంగా ప్రయాణిస్తుంది.
Light does not travel faster than sound. కాంతి, ధ్వని కంటే వేగంగా ప్రయాణించదు.
Does light travel faster than sound? కాంతి, ధ్వని కంటే వేగంగా ప్రయాణిస్తుందా?
Doesn’t light travel faster than sound? కాంతి, ధ్వని కంటే వేగంగా ప్రయాణించదా?
6.The Pacific Ocean is the largest ocean on Earth. పసిఫిక్ మహాసముద్రం భూమిపై అతిపెద్ద సముద్రం.(spoken english telugu)
The Pacific Ocean is not the largest ocean on Earth. పసిఫిక్ మహాసముద్రం భూమిపై అతిపెద్ద సముద్రం కాదు.
Is the Pacific Ocean the largest ocean on Earth? పసిఫిక్ మహాసముద్రం భూమిపై అతిపెద్ద సముద్రమా?
Isn’t the Pacific Ocean the largest ocean on Earth? పసిఫిక్ మహాసముద్రం భూమిపై అతిపెద్ద సముద్రం కాదా?
7.A year has 365 days. సంవత్సరానికి 365 రోజులు ఉంటాయి.

(year  అనేది singular )

A year does not have 365 days. సంవత్సరానికి 365 రోజులు ఉండవు.
Does a year have 365 days? సంవత్సరానికి 365 రోజులు ఉంటాయా?
Doesn’t a year have 365 days? సంవత్సరానికి 365 రోజులు ఉండవా?
8.The Moon orbits the Earth. చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతాడు.
The Moon does not orbit the Earth. చంద్రుడు భూమి చుట్టూ తిరగడు.
Does the Moon orbit the Earth? చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతున్నాడా?
Doesn’t the Moon orbit the Earth? చంద్రుడు భూమి చుట్టూ తిరగడా?
9.Most plants require sunlight to grow. చాలా మొక్కలు పెరగడానికి సూర్యరశ్మి అవసరం.
Most plants do not require sunlight to grow. చాలా మొక్కలు పెరగడానికి సూర్యరశ్మి అవసరం లేదు.
Do most plants require sunlight to grow? చాలా మొక్కలు పెరగడానికి సూర్యరశ్మి అవసరమా?
Don’t most plants require sunlight to grow? చాలా మొక్కలు పెరగడానికి సూర్యరశ్మి అవసరం లేదా?
10.Gravity causes objects to fall towards the ground. గురుత్వాకర్షణ వల్ల వస్తువులు భూమి వైపు పడతాయి.
Gravity does not cause objects to fall towards the ground. గురుత్వాకర్షణ వల్ల వస్తువులు భూమి వైపు పడవు.
Does gravity cause objects to fall towards the ground? గురుత్వాకర్షణ వల్ల వస్తువులు భూమి వైపు పడతాయా?
Doesn’t gravity cause objects to fall towards the ground? గురుత్వాకర్షణ వల్ల వస్తువులు భూమి వైపు పడవా?(spoken english telugu)
11.The heart pumps blood throughout the body. గుండె శరీరమంతా రక్తాన్ని పంప్ చేస్తుంది.
The heart does not pump blood throughout the body. గుండె శరీరమంతా రక్తాన్ని పంప్ చేయదు.
Does the heart pump blood throughout the body? గుండె శరీరమంతా రక్తాన్ని పంపు చేస్తుందా?
Doesn’t the heart pump blood throughout the body? గుండె శరీరమంతా రక్తాన్ని పంప్ చేయదా?
12.Elephants are the largest land animals. ఏనుగులు అతిపెద్ద భూమి జంతువులు.
Elephants are not the largest land animals. ఏనుగులు అతిపెద్ద భూ జంతువులు కాదు.
Are elephants the largest land animals? ఏనుగులు అతిపెద్ద భూ జంతువులా?
Aren’t elephants the largest land animals? ఏనుగులు అతిపెద్ద భూ జంతువులు కాదా?
13.Diamonds are the hardest natural substance. వజ్రాలు అత్యంత కఠినమైన సహజ పదార్థం.
Diamonds are not the hardest natural substance. వజ్రాలు కష్టతరమైన సహజ పదార్థం కాదు.
Are diamonds the hardest natural substance? వజ్రాలు అత్యంత కఠినమైన సహజ పదార్ధమా?
Aren’t diamonds the hardest natural substance? వజ్రాలు అత్యంత కఠినమైన సహజ పదార్ధం కాదా?
14.The human body contains 206 bones. మానవ శరీరంలో 206 ఎముకలు ఉంటాయి.(spoken english telugu)
The human body does not contain 206 bones. మానవ శరీరంలో 206 ఎముకలు లేవు.
Does the human body contain 206 bones? మానవ శరీరంలో 206 ఎముకలు ఉన్నాయా?
Doesn’t the human body contain 206 bones? మనిషి శరీరంలో 206 ఎముకలు లేవా?
15.The speed of light is approximately 2,99,792 kilometers per second. కాంతి వేగం సెకనుకు దాదాపు 2,99,792 కిలోమీటర్లు.
The speed of light is not approximately 2,99,792 kilometres per second. కాంతి వేగం సెకనుకు దాదాపు 2,99,792 కిలోమీటర్లు కాదు.
Is the speed of light approximately 2,99,792 kilometres per second? కాంతి వేగం సెకనుకు దాదాపు 299,792 కిలోమీటర్లా?
Isn’t the speed of light approximately 2,99,792 kilometres per second? కాంతి వేగం సెకనుకు దాదాపు 299,792 కిలోమీటర్లు కాదా?
16.The Amazon River is the longest river in the world. అమెజాన్ నది ప్రపంచంలోనే అతి పొడవైన నది.
The Amazon River is not the longest river in the world. అమెజాన్ నది ప్రపంచంలోనే అతి పొడవైన నది కాదు.(spoken english telugu)
Is the Amazon River the longest river in the world? అమెజాన్ నది ప్రపంచంలోనే అతి పొడవైన నదా?
Isn’t the Amazon River the longest river in the world? అమెజాన్ నది ప్రపంచంలోనే అతి పొడవైన నది కాదా?
17.The Great Wall of China is visible from space. గ్రేట్ వాల్ ఆఫ్ చైనా అంతరిక్షం నుండి కనిపిస్తుంది.
The Great Wall of China is not visible from space. గ్రేట్ వాల్ ఆఫ్ చైనా అంతరిక్షం నుండి కనిపించదు.
Is the Great Wall of China visible from space? గ్రేట్ వాల్ ఆఫ్ చైనా అంతరిక్షం నుండి కనిపిస్తుందా?
Isn’t the Great Wall of China visible from space? గ్రేట్ వాల్ ఆఫ్ చైనా అంతరిక్షం నుండి కనిపించదా?
18.Spiders have eight legs. సాలెపురుగులకు ఎనిమిది కాళ్లు ఉంటాయి.
Spiders do not have eight legs. సాలెపురుగులకు ఎనిమిది కాళ్లు ఉండవు.
Do spiders have eight legs? సాలెపురుగులకు ఎనిమిది కాళ్లు ఉన్నాయా?(spoken english telugu)
Don’t spiders have eight legs? సాలెపురుగులకు ఎనిమిది కాళ్లు లేవా?
19.Sound waves travel through the air. (PS) ధ్వని తరంగాలు గాలిలో ప్రయాణిస్తాయి.
Sound waves do not travel through the air. (NS) ధ్వని తరంగాలు గాలిలో ప్రయాణించవు.
Do sound waves travel through the air? (IS) ధ్వని తరంగాలు గాలిలో ప్రయాణిస్తాయా?
Don’t sound waves travel through the air? (NIS) ధ్వని తరంగాలు గాలిలో ప్రయాణించవా?

 

who, what, where, when, why, and how మొదలైన వాటితో తయారు చేసే ప్రశ్నా వాక్యాలను Wh  questions అంటారు.

ప్రశ్నా పదాలు అయిన  who, what, where, when, why, and how లలో వీలైన ప్రశ్న  పదాలతో కొన్ని ప్రశ్న వాక్యాలను తయారు చేసాము.

పైన ఉన్న పాజిటివ్ మరియు నెగిటివ్ సెంటెన్స్ లను కూడా ‘wh’ ప్రశ్న వాక్యాలుగా మార్చాలి అనుకుంటే, వాటిని ముందు ప్రశ్నా వాక్యాలుగా మార్చాలి. కానీ క్రింద ఆల్రెడీ ప్రశ్న వాక్యాలు గా మార్చి ఉన్నాయి. కాబట్టి పాజిటివ్ మరియు నెగటివ్ సెంటెన్స్ ని ‘Wh’ ప్రశ్న వాక్యాలుగా మార్చవలసిన అవసరం లేదు.

 

పైన  ఉన్న Interrogative,  negative interrogative sentences ముందు ‘Wh’ పదాలను ఉంచితే సరిపోతుంది 

ప్రతి పట్టికలోనూ చివరి రెండు వచనాలను WH Questioins గా మార్చినాము. అన్నిటిని మార్చాలనుకుంటే ఈ బుక్ చాలా పెద్దది అయిపోతుంది. కాబట్టి మిగతా వాటిని మీరు మార్చటానికి ప్రయత్నించండి.

Who, What లతో ఇక్కడ ప్రశ్నా వాక్యాన్ని సృష్టించలేము 

1 Where do sound waves travel through the air? ధ్వని తరంగాలు గాలిలో ఎక్కడికి ప్రయాణిస్తాయి?
2 When do sound waves travel through the air? ధ్వని తరంగాలు గాలిలో ఎప్పుడు ప్రయాణిస్తాయి?
3 Why do sound waves travel through the air? ధ్వని తరంగాలు గాలిలో ఎందుకు ప్రయాణిస్తాయి?
4 How do sound waves travel through the air? ధ్వని తరంగాలు గాలిలో ఎలా ప్రయాణిస్తాయి?
1 Where don’t sound waves travel through the air? ధ్వని తరంగాలు గాలిలో ఎక్కడికి ప్రయాణించవు?
2 When don’t sound waves travel through the air? ధ్వని తరంగాలు ఎప్పుడు గాలిలో ప్రయాణించవు?
3 Why don’t sound waves travel through the air? ధ్వని తరంగాలు గాలిలో ఎందుకు ప్రయాణించవు?(spoken english telugu)
4 How don’t sound waves travel through the air? ధ్వని తరంగాలు గాలిలో ఎలా ప్రయాణించవు?

 

 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!
Scroll to Top
Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.