...

Simple past tense     

జరిగిపోయిన విషయాలను తెలియజేయడానికి సింపుల్ పాస్ట్ టెన్స్ ను  ఉపయోగిస్తారు.

1.సింపుల్ పాస్ట్ టెన్స్ లో Action sentences ఏ విధంగా నిర్మిస్తారో  తెలుసుకుందాం.

Subject + verb2 + object

సింగులర్ మరియు ఫ్లూరల్ అన్ని సబ్జెక్టులకు కూడా He, She, It, I, We, You, They  లకు Verb2 ఉపయోగించి వాక్య నిర్మాణం చేస్తారు.

Verb1 + Did= Verb2 అన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. Verb2 లో Did అనే సహాయక క్రియ దాగి ఉంటుంది.

Examples:

Go  + Did = Went.

Ask + Did = Asked.

Talk + Did = Talked.

ఇక్కడ Did అనేది Do యొక్క భూతకాల రూపం.

V1       V2           V3

Do      Did         Done

సింపుల్ ఫాస్ట్ టెన్స్ లో  పాజిటివ్ సెంటెన్స్ ని నెగటివ్ సెంటెన్స్ గా మార్చడానికి అన్ని సబ్జెక్టులకు కూడా  (He, She, It, I, We, You, They  లకు)  Did not ఉపయోగిస్తే సరిపోతుంది.

సాధారణంగా వ్యతిరేక వాక్యాలకు not ఉపయోగించాలి. అయితే Tenses లో వ్యతిరేక వాక్యాలు రాయుటకు ఆయా Tenses లకు కేటాయించబడిన సహాయక్రియ సపోర్ట్ తోటి మాత్రమే Not ఉపయోగించాలి. కాబట్టి సింపుల్ పాస్ట్ టెన్స్ కు కేటాయించబడిన సహాయక క్రియ అయిన Did  సపోర్ట్ తోటి Not ఉపయోగించాలి. కాబట్టి Simple past tense లో  వ్యతిరేక వ్యాఖ్యలు రాయటకు Did not ఉపయోగించాలి.

Example:

He went to office yesterday (PS)

పై సెంటెన్స్ ని నెగటివ్ సెంటెన్స్ గా మార్చడానికి సబ్జెక్టు He ప్రక్కన Did not ఉంచాలి.

He did not went to office yesterday (NS)

నెగిటివ్ సెంటెన్స్ ని పై విధంగా రాయడం కూడా తప్పు అవుతుంది. ఎందుకంటే

పై సెంటెన్స్ లో Did మరియు Went  ఈ రెండు కూడా verb2 రూపాలు. ఒక సెంటెన్స్ లో రెండు verb2 లు ఉండడం గ్రామర్ ప్రకారంగా తప్పు అవుతుంది.

Do మరియు Does లు ఉపయోగించినప్పుడు అది ప్రజెంట్ టెన్స్ అని, Did ఉపయోగించినప్పుడు పాస్ట్ టెన్స్ అని అర్థమవుతుంది. కాబట్టి Do, Does,Did లు   వాక్యంలో Tens ని (కాలాన్ని) తెలియజేస్తున్నప్పుడు ,Verb ఎల్లప్పుడూ మొదటి రూపంలోనే ఉండాలి.

కాబట్టి నెగిటివ్ సెంటెన్స్ ని క్రింది విధంగా రాస్తాము

He did not go to office yesterday (NS)(అతను నిన్న ఆఫీస్ కి వెళ్ళలేదు)

పైనున్న రెండు వాక్యాలను మరొకసారి కింద రాద్దాము

He went to office yesterday (PS)

He did not go to office yesterday (NS)

పైన ఉన్న పాజిటివ్ సెంటెన్స్ ని ఈ విధంగా కూడా రాయవచ్చు.

He did go to office yesterday

( Went = did + go కాబట్టి)

ఈ వాక్యాన్ని ప్రశ్న వాక్యంగా మార్చుటకు Did ని  He కి ముందు ఉంచితే సరిపోతుంది.

Did he go to office yesterday? (IS)

పైన ఉన్న negative సెంటెన్స్ ని negative interrogative sentence గ మార్చుటకు Did ని He కి ముందు ఉంచాలి.

Did he not go to office yesterday? (NIS)

ఇప్పుడు పై వాక్యాలనుటిని వరుసగా రాద్దాం

He went to the office yesterday (P).

He did not go to the office yesterday (N).

Did he go to the office yesterday? (I).

Did he not go to the office yesterday? (NI).

2.పాస్ట్ టెన్స్ లో  (State sentences) స్థితిని లేదా పరిస్థితిని తెలియజేసే వాక్యాల నిర్మాణం ఏ విధంగా ఉంటుందో చూద్దాం.

  1. నేను పోయిన సంవత్సరం విద్యార్థిగా ఉండినాను (పోయిన సంవత్సరం నా పరిస్థితి అది)
  2. నిన్న అతను హైదరాబాదులో ఉండినాడు (నిన్న అతని పరిస్థితి అది)
  3. వారు ఇంతకుముందు ఉద్యోగస్తులుగా ఉండినారు (గతంలో వారి పరిస్థితి ఇది)
  4. మేము నిన్న కాలేజీలో ఉండినాము (నిన్న మా పరిస్థితి ఇది)

ఈ విధంగా గతంలో సబ్జెక్టు యొక్క స్థితి లేదా పరిస్థితిని తెలియజేయటానికి ఉండినాను, ఉండినాడు, ఉండినారు, ఉండినాము అని వచ్చినప్పుడు సింపుల్ పాస్ట్ టెన్స్ లో

I, He, She, It లకు was  మరియు We, You, They లకు were సహాయక్రియలను ఉపయోగిస్తారు. 

Sub + was/were   

am, is, are, was, were  లాంటి సహాయక్రియలు సబ్జెక్టు యొక్క స్థితిని తెలియజేస్తాయి. సబ్జెక్టు యొక్క స్థితిని తెలియజేసే వాక్యాలలో object ఉండదు. ఎందుకంటే ఇక్కడ సబ్జెక్టు యొక్క ప్రభావానికి గురి అయ్యే మరొకరు వ్యక్తి లేదావస్తువు లేదా జంతువు ఉండదు.

 

I was at the bus station yesterday(P) (నేను నిన్న బస్ స్టేషన్ వద్ద ఉండిన్నాను)

పై వాక్యమును వ్యతిరేక వాక్యంగా మార్చటకు was ప్రక్కన not ఉంచాలి. 

I was not at the bus station yesterday.(N) (నేను నిన్న బస్ స్టేషన్ వద్ద ఉండలేదు) 

పై రెండు వాక్యాలను ప్రశ్నా వాక్యాలుగా మార్చడానికి సబ్జెక్టు ‘I’ ప్రక్కన ఉన్నwas ని మొదటిలో ఉంచితే సరిపోతుంది. 

Was I at the bus station yesterday (I)

was I not at the bus station yesterday (NI) ( wasn’t I at the bus station yesterday ఈ విధంగా కూడా రాయవచ్చు)

క్రింది వాక్యాలను పై విధంగా మార్చడానికి ప్రయత్నించండి

1.She was a grade teacher

2.He was happy with the results

3.It was at the forest yesterday

4.We were at the park all yesterday 

5.They were at the concert together

6.You were at the meeting

3.సింపుల్ ప్రెసెంట్ టెన్స్ లో Possessive వాక్య నిర్మాణాన్ని ఏ విధంగా చేస్తారు  possessive అంటే కలిగి ఉండడం అని అర్థము. 

He, She, It, I, We, You, They లకు అన్నిటికీ కూడా గతంలో కలిగి ఉండిన అనే భావాన్ని తెలియజేయుటకు అన్నిటికీ Had అనే  సహాయక క్రియ ఉపయోగిస్తారు.

Sub + had + object

గతంలో ఏదైనా కలిగి ఉండేది, కలిగి ఉండేవాడు, కలిగి ఉండేవారు, అని చెప్పడానికి Had అనే సహాయక క్రియ  ఉపయోగిస్తారు.

  1. He had two cars ( అతనికి రెండు కార్లు ఉండేవి). (  అతను గతంలో రెండు కార్లను కలిగి ఉండేవాడు.  అని ఇంత పొడుగున చెప్పలేక సింపుల్ గా అతనికి రెండు కార్లు ఉండేవి అంటారు) 

పై వాక్యంలో

He= subject

Had= verb

Two cars = object. 

 

  1. They had a great time at the party last night. (గత రాత్రి వారు పార్టీలో గొప్పగా గడిపారు) (గత రాత్రి పార్టీలో వారు మంచి సమయాన్ని కలిగి ఉండినారు) 
  2. She had a headache after a long meeting. ( సుదీర్ఘ  సమావేశం తరువాత ఆమెకు తలనొప్పి వచ్చింది.) ( సుదీర్ఘ సమావేశం తర్వాత ఆమె తలనొప్పిని కలిగి ఉండింది అని చెప్పడం భాషాపరంగా కొంత ఎబ్బెట్టుగా ఉంటుంది) 
  3. She had a strange dream last night. (గత రాత్రి ఆమెకు వింత కల వచ్చింది) (గత రాత్రి ఆమె ఒక వింతైన కలను కలిగి ఉండింది)

5.They had a lot of homework to do.( చేయటానికి వారికి చాలా హోం వర్క్ ఉండింది)

ఇక్కడ  did +have = had అని మనం గుర్తుంచుకోవాలి. 

Present (V1) past (V2) past participle (V3)
has/have  had had

2వ  వాక్యాన్ని నెగటివ్ సెంటెన్స్ గా మార్చడానికి ప్రయత్నిద్దాం 

They had a great time at the party last night. (They did have a great time at the party last night.(P)   (గత రాత్రి వారు పార్టీలో గొప్పగా గడిపారు లేదా గత రాత్రి వారు పార్టీలో గొప్ప సమయాన్ని కలిగి ఉండినారు) 

సింపుల్ పాస్ట్ టెన్స్ లో పై వాక్యానికి వ్యతిరేక వాక్యం రాయాలంటే,  గత రాత్రి వారు పార్టీలో గొప్పగా గడప లేదు అని రాయాలి.

Simple past లో ‘లేదు’  అంటే ‘Did not’ అని అర్ధం. ఇప్పుడు పై వాక్యానికి వ్యతిరేక వాక్యం రాద్దాము

They did not had a great time at the party last night.

ఈ  విధంగా రాయడం కూడా తప్పు అవుతుంది ఎందుకంటే  Did మరియు had లు రెండు రెండు కూడా పాస్ట్ టెన్స్ లో ఉన్నాయి సహాయక క్రియ మరియు verb రెండు కూడా ఒకే కాలాన్ని సూచించేదిగా ఉండకూడదు. సహాయక క్రియలు కాలాన్ని తెలియజేస్తున్నప్పుడు verb ఎప్పుడూ మొదటి రూపంలోనే ఉండాలి. ఇది గ్రామర్  రూల్. కాబట్టి Had కి బదులుగా దాని మొదటి రూపమైన Have ని ఉపయోగిస్తారు.

పై వాక్యంలో Had మెయిన్ వెర్బ్ గా వ్యవహరిస్తూ ఒక సంపూర్ణ వాక్యాన్ని నిర్మిస్తుంది. Had సాధారణంగా సహాయక్రియ అయినప్పటికీ ఈ వాక్యంలో verb స్థానంలో తానే  verb గా వ్యవహరిస్తుంది.

Do, Does, Did  లు  వాక్యంలో ఉన్నప్పుడు, verb ఎప్పుడు మొదటి రూపంలోనే ఉండాలి.

 

కాబట్టి, పై వాక్యాన్నిThey did not have a great time at the party last night (N).అని రాస్తాము. 

పై వాక్యాలను రెండిటిని ప్రశ్నా వాక్యాలుగా మారుద్దాం.

1.They had a great time at the party last night.(P) 

పై వాక్యాన్ని have + did = had కాబట్టి క్రింది విధంగా కూడా రాయవచ్చు

They did have a great time at the party last night.(P)  

2.They did not have a great time at the party last night (N)

పై రెండు వాక్యాలను Interrogative sentence గా మార్చుటకు they ప్రక్కన ఉన్న Did ని  ముందు ఉంచితే సరిపోతుంది.

  1. Did They have a great time at the party last night? (I)  
  2. Did They not have a great time at the party last night? (NI)

(or)

     Didn’t They have a great time at the party last night అని కూడా రాయవచ్చు

1,3,4,5, వాక్యాలను ఇదేవిధంగా  Negative, interrogative, negative interrogative లలో రాయడానికి ప్రయత్నించండి.

 

సింపుల్ పాస్ట్ టెన్స్ ని ఏ ఏ సందర్భాలలో ఉపయోగిస్తారో  ఇప్పుడు తెలుసుకుందాం

1 Completed Actions in the Past:           

గతంలో పూర్తి చేయబడినటువంటి పనులను గురించి తెలియజేయడానికి Simple past tense ని ఉపయోగిస్తారు

Example: 

1.I visited Paris last summer. నేను గత వేసవిలో పారిస్ సందర్శించాను.
I didn’t visit Paris last summer. నేను గత వేసవిలో పారిస్‌ని సందర్శించలేదు.
Did I visit Paris last summer?. నేను గత వేసవిలో పారిస్‌ని సందర్శించానా?.
Didn’t I visit Paris last summer?. నేను గత వేసవిలో పారిస్‌ని సందర్శించలేదా?.

(Did not = Didn’t)

2.I visited New York City last year. నేను గత సంవత్సరం న్యూయార్క్ నగరాన్ని సందర్శించాను.
I didn’t visit New York City last year. నేను గత సంవత్సరం న్యూయార్క్ నగరాన్ని సందర్శించలేదు.
Did I visit New York City last year?. నేను గత సంవత్సరం న్యూయార్క్ నగరాన్ని సందర్శించానా?.
Didn’t I visit New York City last year?. నేను గత సంవత్సరం న్యూయార్క్ నగరాన్ని సందర్శించలేదా?.
3.She finished her novel yesterday. ఆమె నిన్న తన నవల పూర్తి చేసింది.
She didn’t finish her novel yesterday. ఆమె నిన్న తన నవల పూర్తి చేయలేదు.
Did she finish her novel yesterday?. ఆమె నిన్న తన నవల పూర్తి చేసిందా?.
Didn’t she finish her novel yesterday?. ఆమె నిన్న తన నవల పూర్తి చేయలేదా?.
4.They watched a movie on Friday night. వారు శుక్రవారం రాత్రి ఓ సినిమా చూశారు.
They didn’t watch a movie on Friday night. శుక్రవారం రాత్రి వారు సినిమా చూడలేదు.
Did they watch a movie on Friday night?. వారు శుక్రవారం రాత్రి సినిమా చూశారా?.
Didn’t they watch a movie on Friday night?. శుక్రవారం రాత్రి వాళ్ళు సినిమా చూడలేదా?.
5.He graduated from college in 2010. అతను 2010 లో కళాశాల నుండి పట్టభద్రుడయ్యాడు.
He didn’t graduate from college in 2010. అతను 2010లో కళాశాల నుండి పట్టభద్రుడు కాలేదు.
Did he graduate from college in 2010?. అతను 2010లో కళాశాల నుండి పట్టభద్రుడయ్యాడా?.
Didn’t he graduate from college in 2010?. అతను 2010లో కళాశాల నుండి పట్టభద్రుడు కాలేదా?.
6.We had dinner at a new restaurant last weekend. మేము గత వారాంతంలో కొత్త రెస్టారెంట్‌లో డిన్నర్ చేసాము.(డిన్నర్ కలిగి ఉండినాము)
We didn’t have dinner at a new restaurant last weekend. మేము గత వారాంతంలో కొత్త రెస్టారెంట్‌లో డిన్నర్ చేయలేదు.
Did we have dinner at a new restaurant last weekend?. మేము గత వారాంతంలో కొత్త రెస్టారెంట్‌లో డిన్నర్ చేశామా?.
Didn’t we have dinner at a new restaurant last weekend?. గత వారాంతంలో మేము కొత్త రెస్టారెంట్‌లో డిన్నర్ చేయలేదా?.
7.I completed the project two days ago. రెండు రోజుల క్రితమే ప్రాజెక్ట్ పూర్తి చేశాను.
I didn’t complete the project two days ago. నేను రెండు రోజుల క్రితం ప్రాజెక్ట్ పూర్తి చేయలేదు.
Did I complete the project two days ago?. నేను రెండు రోజుల క్రితం ప్రాజెక్ట్ పూర్తి చేసానా?.
Didn’t I complete the project two days ago?. నేను రెండు రోజుల క్రితం ప్రాజెక్ట్ పూర్తి చేయలేదా?.
8.She travelled to Japan last summer. గత వేసవిలో ఆమె జపాన్‌కు వెళ్లింది.
She didn’t travel to Japan last summer. గత వేసవిలో ఆమె జపాన్‌కు వెళ్లలేదు.
Did she travel to Japan last summer?. గత వేసవిలో ఆమె జపాన్‌కు వెళ్లిందా?.
Didn’t she travel to Japan last summer?. గత వేసవిలో ఆమె జపాన్‌కు వెళ్లలేదా?.
9.They bought a new car last month. గత నెలలో వారు కొత్త కారు కొన్నారు.
They didn’t buy a new car last month. గత నెలలో వారు కొత్త కారు కొనుగోలు చేయలేదు.
Did they buy a new car last month?. వారు గత నెలలో కొత్త కారు కొన్నారా?.
Didn’t they buy a new car last month?. గత నెలలో వారు కొత్త కారు కొనుగోలు చేయలేదా?. 
10.He repaired the computer last night. అతను నిన్న రాత్రి కంప్యూటర్ రిపేర్ చేశాడు.
He didn’t repair the computer last night. అతను నిన్న రాత్రి కంప్యూటర్ రిపేరు చేయలేదు.
Did he repair the computer last night?. అతను నిన్న రాత్రి కంప్యూటర్ రిపేర్ చేసాడా?.
Didn’t he repair the computer last night?. అతను నిన్న రాత్రి కంప్యూటర్ రిపేర్ చేయలేదా?.
11.We attended a concert last Saturday. మేము గత శనివారం ఒక సంగీత కచేరీకి హాజరయ్యాము.
We didn’t attend a concert last Saturday. మేము గత శనివారం ఒక సంగీత కచేరీకి హాజరు కాలేదు.
Did we attend a concert last Saturday?. గత శనివారం మేము ఒక సంగీత  కచేరీకి హాజరయ్యామా?.
Didn’t we attend a concert last Saturday?. గత శనివారం మేము ఒక సంగీత కచేరీకి హాజరు కాలేదా?

 

Where did we attend the concert last Saturday?. గత శనివారం మేము కచేరీకి ఎక్కడ హాజరయ్యాము?.
When did we attend the concertlast Saturday?. గత శనివారం మేము కచేరీకి ఎప్పుడు హాజరయ్యాము?.
Why did we attend the concert last Saturday?. గత శనివారం మేము కచేరీకి ఎందుకు హాజరయ్యాము?.
How did we attend the concert last Saturday?. గత శనివారం మేము కచేరీకి ఎలా హాజరయ్యాము?.
Where didn’t we attend the concert last Saturday?. గత శనివారం మేము కచేరీకి ఎక్కడ హాజరు కాలేదు?.
When didn’t we attend the concert last saturday?. గత శనివారం మేము కచేరీకి ఎప్పుడు హాజరు కాలేదు?.
Why didn’t we attend the concert last Saturday?. గత శనివారం మేము కచేరీకి ఎందుకు హాజరు కాలేదు?.
How didn’t we attend the concert last Saturday?. గత శనివారం మేము కచేరీకి ఎలా హాజరుకాలేదు?.

 

2  Series of Completed Actions:          

జరిగిపోయిన కాలంలో ఏవైనా కొన్ని పనులు ఒక క్రమంలోఒక పని తర్వాత మరొక పని  జరిగినప్పుడు, వాటిని వివరించి చెప్పడానికి కూడా ఈ Simple past tense ని ఉపయోగిస్తారు. 

Examples:

1.She finished her homework, went to bed, and turned off the lights. ఆమె తన హోంవర్క్ పూర్తి చేసి, పడుకుని, లైట్లు ఆఫ్ చేసింది.
She did not finish her homework, did not go to bed, and did not turn off the lights. ఆమె తన హోంవర్క్ పూర్తి చేయలేదు, పడుకోలేదు మరియు లైట్లు ఆఫ్ చేయలేదు.
Did she finish her homework, go to bed, and turn off the lights?. ఆమె తన హోంవర్క్ పూర్తి చేసి, పడుకుని, లైట్లు ఆఫ్ చేసిందా?.
Did she not finish her homework, go to bed, and turn off the lights? ఆమె తన హోంవర్క్ పూర్తి చేసి, పడుకుని, లైట్లు ఆపివేయలేదా?
2.She woke up, made breakfast, and left for work. ఆమె నిద్ర లేచి, అల్పాహారం చేసి, పనికి బయలుదేరింది.
She did not wake up, did not make breakfast, and did not leave for work. ఆమె నిద్ర లేవలేదు, అల్పాహారం చేయలేదు మరియు పని కోసం బయలుదేరలేదు.
Did she wake up, make breakfast, and leave for work?. ఆమె నిద్రలేచి, అల్పాహారం చేసి, పనికి బయలుదేరిందా?.
Did she not wake up, make breakfast, and leave for work?. ఆమె నిద్రలేచి, అల్పాహారం చేసి, పనికి వెళ్లలేదా?.
3.I finished my homework, cleaned my room, and then went to bed. నేను నా హోంవర్క్ పూర్తి చేసాను, నా గదిని శుభ్రం చేసాను, ఆపై పడుకున్నాను.
I did not finish my homework, did not clean my room, and did not go to bed. నేను నా హోంవర్క్ పూర్తి చేయలేదు, నా గదిని శుభ్రం చేయలేదు మరియు పడుకోలేదు.
Did I finish my homework, clean my room, and go to bed?. నేను నా హోంవర్క్ పూర్తి చేసి, నా గదిని శుభ్రం చేసి, పడుకున్నానా?.
Did I not finish my homework, clean my room, and go to bed?. నేను నా హోంవర్క్ పూర్తి చేసి, నా గదిని శుభ్రం చేసి, పడుకోలేదా?.
4.They visited the museum, had lunch, and took a walk in the park. వారు మ్యూజియాన్ని సందర్శించి, భోజనం చేసి, పార్కులో విహరించారు.
They did not visit the museum, did not have lunch, and did not take a walk in the park. వారు మ్యూజియాన్ని సందర్శించలేదు, భోజనం చేయలేదు మరియు పార్కులో నడవలేదు.
Did they visit the museum, have lunch, and take a walk in the park?. వారు మ్యూజియాన్ని సందర్శించారా, భోజనం చేసి, పార్కులో నడఛారా?
Did they not visit the museum, have lunch, and take a walk in the park?. వారు మ్యూజియాన్ని సందర్శించలేదా, భోజనం చేసి, పార్కులో నడవలేదా?.
5.He wrote the report, sent the email, and attended the meeting. అతను నివేదికను వ్రాసాడు, ఇమెయిల్ పంపాడు మరియు సమావేశానికి హాజరయ్యాడు.
He did not write the report, did not send the email, and did not attend the meeting. అతను నివేదిక రాయలేదు, ఇమెయిల్ పంపలేదు మరియు సమావేశానికి హాజరు కాలేదు.
Did he write the report, send the email, and attend the meeting?. అతను నివేదిక వ్రాసి, ఇమెయిల్ పంపి, సమావేశానికి హాజరయ్యాడా?.
Did he not write the report, send the email, and attend the meeting?. అతను నివేదిక వ్రాసి, ఇమెయిల్ పంపి, సమావేశానికి హాజరు కాలేదా?.
6.We traveled to Nellore, explored the city, and returned home. మేము నెల్లూరు కు వెళ్లాము, నగరాన్ని అన్వేషించాము మరియు ఇంటికి తిరిగి వచ్చాము.
We did not travel to Nellore, did not explore the city, and did not return home. మేము నెల్లూరు వెళ్లలేదు, నగరాన్ని అన్వేషించలేదు మరియు ఇంటికి తిరిగి రాలేదు.
Did we travel to Nellore, explore the city, and return home?. మేము నెల్లూరుకు ప్రయాణించి, నగరాన్ని అన్వేషించి, ఇంటికి తిరిగి వచ్చామా?.
Did we not travel to Nellore, explore the city, and return home? మనం నెల్లూరుకు ప్రయాణించి, నగరాన్ని అన్వేషించి, ఇంటికి తిరిగి వెళ్లలేదా?
7.She read the book, wrote a review, and shared it on social media. ఆమె పుస్తకాన్ని చదివి, సమీక్ష రాసి, సోషల్ మీడియాలో షేర్ చేసింది.
She did not read the book, did not write a review, and did not share it on social media. ఆమె పుస్తకాన్ని చదవలేదు, సమీక్ష రాయలేదు మరియు సోషల్ మీడియాలో షేర్ చేయలేదు.
Did she read the book, write a review, and share it on social media?. ఆమె పుస్తకాన్ని చదివి, సమీక్ష వ్రాసి, సోషల్ మీడియాలో షేర్ చేసిందా?.
Did she not read the book, write a review, and share it on social media?. ఆమె పుస్తకాన్ని చదవలేదా, సమీక్ష వ్రాసి, సోషల్ మీడియాలో షేర్ చేయలేదా?.
8.They cooked dinner, set the table, and invited their friends over. వారు రాత్రి భోజనం వండారు, టేబుల్ సెట్ చేసారు మరియు వారి స్నేహితులను ఆహ్వానించారు.
They did not cook dinner, did not set the table, and did not invite their friends over. వారు రాత్రి భోజనం వండలేదు, టేబుల్ సెట్ చేయలేదు మరియు వారి స్నేహితులను ఆహ్వానించలేదు.
Did they cook dinner, set the table, and invite their friends over?. వారు రాత్రి భోజనం వండారా, టేబుల్ సెట్ చేసారా మరియు వారి స్నేహితులను ఆహ్వానించారా?.
Did they not cook dinner, set the table, and invite their friends over?. వారు రాత్రి భోజనం వండలేదా, టేబుల్ సెట్ చేసి, వారి స్నేహితులను ఆహ్వానించలేదా?.
9.I bought groceries, prepared dinner, and read a bible. నేను కిరాణా సామాను కొనుక్కుని, రాత్రి భోజనం సిద్ధం చేసి, బైబిల్ చదివాను.
I did not buy groceries, did not prepare dinner, and did not read a bible. నేను కిరాణా సామాను కొనుక్కోలేదు, రాత్రి భోజనం సిద్ధం చేయలేదు, బైబిల్ చదవలేదు.
Did I buy groceries, prepare dinner, and read a bible?. నేను కిరాణా సామాను కొనుక్కున్నానా, డిన్నర్ సిద్ధం చేశానా, మరియు బైబిల్ చదివానా?.
Did I not buy groceries, prepare dinner, and read a bible?. నేను కిరాణా సామాను కొనుక్కోలేదా, రాత్రి భోజనం సిద్ధం చేసి, బైబిల్ చదవలేదా?.
10.He cleaned the garage, organized the tools, and painted the walls. అతను గ్యారేజీని శుభ్రం చేశాడు, పనిముట్లను నిర్వహించాడు ( వస్తువులను పనిచేయడానికి సిద్ధం చేసుకోవడం) మరియు గోడలకు పెయింట్ చేశాడు.
He did not clean the garage, did not organize the tools, and did not paint the walls. అతను గ్యారేజీని శుభ్రం చేయలేదు, ఉపకరణాలను నిర్వహించలేదు మరియు గోడలను పెయింట్ చేయలేదు.
Did he clean the garage, organize the tools, and paint the walls?. అతను గ్యారేజీని శుభ్రం చేశాడా, పనిముట్లను నిర్వహించాడా మరియు గోడలకు పెయింట్ చేసాడా?.
Did he not clean the garage, organize the tools, and paint the walls?. అతను గ్యారేజీని శుభ్రం చేయలేదా, పనిముట్లను నిర్వహించలేదా మరియు గోడలకు పెయింట్ చేయలేదా?.
11.We arrived at the hotel, checked in, and went for a swim. మేము హోటల్‌కు చేరుకున్నాము, చెక్ ఇన్ చేసి, ఈత కొట్టడానికి వెళ్ళాము.
We did not arrive at the hotel, did not check in, and did not go for a swim. మేము హోటల్‌కు చేరుకోలేదు, చెక్ ఇన్ చేయలేదు మరియు ఈతకు వెళ్ళలేదు.
Did we arrive at the hotel, check in, and go for a swim?. మేము హోటల్‌కు చేరుకుని, చెక్ ఇన్ చేసి, ఈత కొట్టడానికి వెళ్లామా?.
Did we not arrive at the hotel, check in, and go for a swim?. మేము హోటల్‌కు చేరుకుని, చెక్ ఇన్ చేసి, ఈత కొట్టడానికి వెళ్లలేదా?.

 

3  Habitual Actions in the Past:          

గతంలో పదే పదే జరిగిన సాధారణ లేదా అలవాటు చర్యలను వివరించడానికి ఈ Simple past tense ని ఉపయోగిస్తారు.

Example: 

గతంలో అలవాటుగా చేసే పనులకు ‘Used to’అనే పదాన్ని ఉపయోగించి తెలియజేస్తారు

when I was a child, I used to play cricket నేను చిన్నగా ఉన్నప్పుడు క్రికెట్ ఆడేవాడిని
She used to read a book before bed every night ప్రతిరోజు పడుకోవడానికి ముందు ఆమె ఒక పుస్తకం  చదివేది
They used to visit their grandparents every weekend వారు ప్రతి వారాంతంలో తమ అవ్వ తాతలను సందర్శించేవారు
He used to collect stamps when he was younger అతను  చిన్నప్పుడు స్టాంపులను సేకరించేవాడు

 

1.When I was a child, I walked to school every day. నేను చిన్నవాడిగా ఉన్నప్పుడు, నేను ప్రతిరోజూ పాఠశాలకు వెళ్లాను.
When I was a child, I did not walk to school every day. నేను చిన్నగా ఉన్నప్పుడు ప్రతిరోజు స్కూల్ కి నడిచి వెళ్లలేదు.
Did I walk to school every day when I was a child?. నేను చిన్నగా ఉన్నప్పుడు ప్రతిరోజు స్కూల్ కి నడిచి వెళ్లి నానా?.
Did I not walk to school every day when I was a child?. నేను చిన్నగా ఉన్నప్పుడు ప్రతిరోజు స్కూల్ కి నడిచి వెళ్లలేదా?.
2.She visited her grandparents every summer. ఆమె ప్రతి వేసవిలో తన అవ్వ తాతలను సందర్శించేది.
She did not visit her grandparents every summer. ఆమె ప్రతి వేసవిలో తన అవ్వ తాతలను సందర్శించేది కాదు.
Did she visit her grandparents every summer?.  ఆమె ప్రతి వేసవిలో తన అవ్వ తాతలను సందర్శించిందా?.
Did she not visit her grandparents every summer?. ఆమె ప్రతి వేసవిలో తన అవ్వ తాతలను సందర్శించలేదా?.
3.They used to play soccer in the park after school. స్కూల్ అయిపోయిన తర్వాత వారు పార్కులో సాకర్ ఆడేవారు.
They did not use to play soccer in the park after school. వారు పాఠశాల ముగించిన తర్వాత పార్కులో సాకర్ ఆడేవారు కాదు.
Did they use to play soccer in the park after school? వారు పాఠశాల ముగించిన తర్వాత పార్కులో  సాకర్ ఆడేవారా?
Did they not use to play soccer in the park after school? వారు పాఠశాల ముగించిన తర్వాత పార్కులో సాకర్ ఆడేవారు కాదా?
4.He often went fishing on weekends. అతను వారాంతాల్లో తరచుగా చేపల వేటకు వెళ్లేవాడు.
He did not often go fishing on weekends. వారాంతాల్లో అతను తరచుగా చేపల వేటకు వెళ్లేవాడు కాదు.
Did he often go fishing on weekends?. అతను తరచుగా వారాంతాల్లో చేపలు పట్టడానికి వెళ్లాడా?.
Did he not often go fishing on weekends?. అతను తరచుగా వారాంతాల్లో చేపలు పట్టడానికి వెళ్లలేదా?.
5.We had family dinners together every Sunday. మేము ప్రతి ఆదివారం కుటుంబ సభ్యులతో కలిసి విందులు చేసాము.
We did not have family dinners together every Sunday. మేము ప్రతి ఆదివారం కుటుంబ సభ్యులతో కలిసి విందులు చేసుకోలేదు.
Did we have family dinners together every Sunday? ప్రతి ఆదివారం కుటుంబ సభ్యులతో కలిసి విందులు చేశామా?
Did we not have family dinners together every Sunday? ప్రతి ఆదివారం కుటుంబ సభ్యులతో కలిసి విందులు చేసుకోలేదా?
6.I regularly went to the library to study. నేను క్రమం తప్పకుండా చదువుకోవడానికి లైబ్రరీకి వెళ్లాను.
I did not regularly go to the library to study. నేను క్రమం తప్పకుండా చదువుకోడానికి లైబ్రరీకి వెళ్లలేదు.
Did I regularly go to the library to study?. నేను చదువుకోవడానికి క్రమం తప్పకుండా లైబ్రరీకి వెళ్లానా?.
Did I not regularly go to the library to study?. నేను చదువుకోవడానికి క్రమం తప్పకుండా లైబ్రరీకి వెళ్లలేదా?.
7.She always took her dog for a walk in the morning.  ఆమె ఎప్పుడూ ఉదయం తన కుక్కను వాకింగ్‌కి తీసుకెళ్లేది.
She did not always take her dog for a walk in the morning. ఆమె ఎప్పుడూ తన కుక్కను ఉదయం నడకకు తీసుకెళ్లేది కాదు  
Did she always take her dog for a walk in the morning? ఆమె ఎప్పుడూ తన కుక్కను ఉదయం నడకకు తీసుకు వెళ్లిందా?
Did she not always take her dog for a walk in the morning? ఆమె ఎప్పుడూ తన కుక్కను ఉదయం నడకకు తీసుకెళ్లలేదా?
8.They frequently traveled to the beach during holidays. వారు సెలవుల్లో తరచూ బీచ్‌కి వెళ్లేవారు.
They did not frequently travel to the beach during holidays. సెలవుల్లో వారు తరచుగా బీచ్‌కి వెళ్లేవారు కాదు.
Did they frequently travel to the beach during holidays? వారు సెలవుల్లో తరచుగా బీచ్‌కి వెళ్లారా?
Did they not frequently travel to the beach during holidays? సెలవుల్లో వారు తరచుగా బీచ్‌కి వెళ్లలేదా?
9.He usually drank coffee in the morning before work. అతను సాధారణంగా పనికి ముందు ఉదయం కాఫీ తాగేవాడు.
He did not usually drink coffee in the morning before work. అతను సాధారణంగా పనికి ముందు ఉదయం కాఫీ తాగలేదు.
Did he usually drink coffee in the morning before work?. అతను సాధారణంగా పనికి ముందు ఉదయం కాఫీ తాగుతాడా?.
Did he not usually drink coffee in the morning before work?. అతను సాధారణంగా పనికి ముందు ఉదయం కాఫీ తాగలేదా?. 
10.We used to have picnics in the park every summer. మేము ప్రతి వేసవిలో పార్కులో పిక్నిక్లు చేసేవాళ్ళం.
We did not use to have picnics in the park every summer. మేము ప్రతి వేసవిలో పార్క్‌లో పిక్నిక్‌లు చేసేవారు కాదు.
Did we use to have picnics in the park every summer? మేము ప్రతి వేసవిలో పార్క్‌లో పిక్నిక్‌లు చేసేవారమా?
Did we not use to have picnics in the park every summer? మేము ప్రతి వేసవిలో పార్క్‌లో పిక్నిక్‌లు చేయలేదా?

Where, When, Why, How లను  Interrogative, negative interrogative sentence,

ల ముందు అతికిస్తే  సరిపోతుంది. Who, What లతో ఎక్కువ సందర్భాలలో ప్రశ్న వాక్యాలు సృష్టించడానికి సాధ్యపడదు.  కానీ Who, What లతో సొంతగా ప్రశ్న వ్యాఖ్యలు సృష్టించినాము.

Who used to have picnics in the park every summer? ప్రతి వేసవిలో పార్కులో ఎవరు అలవాటుగా పిక్నిక్‌లు చేసేవారు?
What did we use to do in the park every summer? మేము ప్రతి వేసవిలో పార్కులో అలవాటుగా ఏమి చేసాము?
Where did we use to have picnics every summer? ప్రతి వేసవిలో మేము  ఎక్కడ అలవాటుగా పిక్నిక్‌లు చేసేవాళ్ళం?
When did we use to have picnics in the park? మేము పార్క్‌లో ఎప్పుడు అలవాటుగా పిక్నిక్‌లు చేసాము?
Why did we use to have picnics in the park every summer? మేము ప్రతి వేసవిలో పార్కులో పిక్నిక్‌లు అలవాటుగా ఎందుకు చేసాము?
How did we use to have picnics in the park every summer? మేము ప్రతి వేసవిలో పార్కులో అలవాటుగా పిక్నిక్‌లను ఎలా చేసాము??
Who didn’t use to have picnics in the park every summer? ప్రతి వేసవిలో పార్కులో పిక్నిక్‌లను ఎవరు అలవాటుగా చేయలేదు?
What didn’t we use to do in the park every summer? మేము ప్రతి వేసవిలో పార్కులో ఏమి అలవాటుగా చేయలేదు?
Where didn’t we use to have picnics every summer? మేము ప్రతి వేసవిలో పిక్నిక్‌లను ఎక్కడ అలవాటుగా చేయలేదు?
When didn’t we use to have picnics in the park? మేము పార్కులో పిక్నిక్‌లు అలవాటుగా ఎప్పుడు చేయలేదు ?
Why didn’t we use to have picnics in the park every summer? మేము ప్రతి వేసవిలో పార్కులో పిక్నిక్‌లను ఎందుకు అలవాటుగా చేయలేదు ?
How didn’t we use to have picnics in the park every summer? మేము ప్రతి వేసవిలో పార్కులో పిక్నిక్‌లను ఎలా అలవాటుగా చేయలేదు?

 

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!
Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.