Introduction     

Part 1 నుండి part 3 వరకు చదవండి.

PART 1 

Tenses’  అనే పదం లాటిన్ పదమైనా ‘Tempus’ నుండి వచ్చింది. టెంపస్ అనగా కాలము అని అర్థం. కానీ భాషా శాస్త్రంలో (linguistics) Tenses అనేది పని యొక్క కాలాన్ని సూచించేదిగా ఉన్నది. కాలక్రమంలో లాటిన్ పదమైన ‘Tempus’ ఫ్రెంచ్ భాషలో ‘Tenses’ అనే ఆంగ్లపదంగా పరిణమించింది..ఒక పని వర్తమాన కాలమును సంబందించినదా, భూతకాలమునకు సంబంధించినదా లేదా భవిష్యత్తు కాలమునకు సంబంధించినద అని తెలియజేసే వాటిని Tenses అంటారు.ఇంగ్లీష్ భాషలో 80% వరకు కేవలం టెన్స్ మీదనే మాట్లాడుతారు. ఇందులో కేవలం సింపుల్ ప్రెసెంట్ టెన్స్ 40%,  మిగిలిన Tenses  అన్నీ కలిపి 40% ఉంటాయి. కాబట్టి టెన్సెస్ గురించి క్షుణ్ణంగా నేర్చుకుంటే 80% ఇంగ్లీష్  మనం నేర్చుకున్నట్లే.

Tenses రకాలు

Tenses ప్రధానంగా మూడు రకాలు అవి

1)  Present tense (వర్తమాన కాలం)

2)  Past tense  (భూతకాలం)

3)  Future tense (భవిష్యత్ కాలం)

వీటిని మరలా ఒక్కొక్క దానిని Simple, continuous, perfect, perfect continuous అని నాలుగు రకాలుగా విభజిస్తారు అప్పుడు మొత్తం టెన్సెస్ 12 అవుతాయి క్రింది చార్ట్ ని గమనించండి.

1.Simple Present

2.Present Continuous

3.Present Perfect

4.Present Perfect Continuous

5.Simple Past

6.Past Continuous

7.Past Perfect

8.Past Perfect Continuous

9.Simple Future

10.Future Continuous

11.Future Perfect

12.Future Perfect Continuous

 

ఒక వాక్యంలో  ప్రదానంగా మూడు భాగాలు ఉంటాయి అవి:

1.Subject 2.verb  3.Object

Subject: వాక్యంలో పనిచేస్తున్న వ్యక్తిని సబ్జెక్టు అని అంటారు.

verb: వాక్యంలో పనిని సూచించే (క్రియ) పదం

Object: సబ్జెక్టు యొక్క ప్రభావానికి గురి అవుతున్న దానినే  ఆబ్జెక్ట్ అంటారు.

క్రింద మూడు ఉదాహరణలు ఇచ్చినాము వీటిని కొంచెం  జాగ్రత్తగా చదవండి.

Example 1:

1.Ravi eats Mango =రవి మామిడిపండును తింటాడు

Subject ( Ravi) “రవి మామిడిపండును తింటున్నాడు అనగా ఇక్కడ రవి పని చేస్తున్నాడు కాబట్టి సబ్జెక్టు అవుతాడు”

Verb  ( Eats) “తినడం”

Object  (Mango) “మామిడిపండు రవి యొక్క ప్రభావానికి గురి అవుతూ ఉంది కాబట్టి ఇక్కడ Mango ఆబ్జెక్ట్ అవుతుంది”

Example 2:

2.The boy kicks the ball. “ పిల్లవాడు బంతిని తన్నుతాడు”

Subject  (The Boy) “పిల్ల వాడు బంతిని తన్నుతున్నాడు అనగా పిల్లవాడు పని చేస్తున్నాడు కాబట్టి ఇక్కడ సబ్జెక్టు అవుతాడు”

Verb  (Kicks) “తన్నడం”

Object  (The ball) “బాలు పిల్లవాడి యొక్క ప్రభావానికి గురి అవుతున్నది లేదా శిక్షకు గురి అవుతున్నది కాబట్టి ఇక్కడ Ball ఆబ్జెక్ట్ అవుతుంది”.

Example 3:

3. Ramana drives a car “రమణ కారు నడుపుతాడు”

Subject (Ramana) “రమణ  కారు నడుపుతున్నాడు అనగా పనిచేస్తున్నాడు కాబట్టి రమణ సబ్జెక్ట్ అవుతాడు”

Verb  (Drives) “ కారు నడపడం”

Object (The Car) “కారు సబ్జెక్టు అయిన రమణ యొక్క ప్రభావానికి గురి అవుతున్నది కాబట్టి ఇక్కడ Car ఆబ్జెక్ట్ అవుతుంది”

పై విదంగా subject + verb + object ఈ రూపంలో ఒక సెంటెన్స్ వుంటే దానిని active voice సెంటెన్స్ అంటారు. ఇప్పుడు మనం నేర్చుకొనేది అంతా active voice లోనే.ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి వివరంగా తెలుసుకుందాం. Subject, verb, object ఈ మూడింటి గురించి  వివరంగా తెలుసుకుందాం.

SUBJECT:

ఈ సబ్జెక్టులు రెండు రకాలు:

1) Singular subjects: 2) Plural subjects

 Singular subjects ని తిరిగే మూడు రకాలుగా విభజిస్తారు.

1.) First Person:  I =నేను
2)  Second Person     You =నీవు
3)  Third Person He =అతడు, She = ఆమె, It =ఇది, that =అది, 

 

Plural subjects ని తిరిగే మూడు రకాలుగా విభజిస్తారు.

1)  First Person:   We = మేము/మనము
2)  Second Person    You = మీరు
3)  Third Person     They =వారు, those =వారు,

ఇంకా మీరు సింగులర్ గా  ఉన్న ఒక Noun   ఏ విధంగా  ప్లూరల్ గా మారుతుందో తెలుసుకోవాలంటే క్రింది క్లిక్  చేయండి.  అక్కడికి వెళ్ళిన తర్వాత మరల మీ మొబైల్ బ్యాక్ బటన్ క్లిక్ చేస్తే మరలా ఇక్కడికి వస్తారు.

CLICK HERE

 

2.VERBS

Tenses  నేర్చుకోవడానికి ముందు ‘verbs’ గురించి తెలుసుకోవాలి. verb అనగా క్రియ అని అర్థం. ప్రతిరోజు మనం మాట్లాడే  ప్రతి మాటలో ఒక క్రియ కచ్చితంగా ఉంటుంది. వీటినిverbs అంటారు. వాక్య నిర్మాణంలో Verbs లేకుండా వాక్యాలను నిర్మించలేము.

ఒక సెంటెన్స్ లో ఉన్నటువంటి Subject  .ఏ పని చేస్తున్నాడు,ఏ స్థితిలో ఉన్నాడు,ఏమి కలిగి ఉన్నాడు

లాంటి విషయాలను verb మనకు వివరిస్తుంది.ఈ verbs ప్రధానంగా రెండు రకాలు.

1.Main verbs (ప్రదాన క్రియలు)

2.Helping verbs (or) auxiliary verbs ( సహాయక క్రియలు)

 

1.Verbs or Main verbs సబ్జెక్టు చేస్తున్న పనిని  తెలియజేసే వాటిని Main verbs  అంటారు. 

He runs every morning.అతను ప్రతి ఉదయం పరిగెత్తుతాడు.
She writes a letter to her friend.ఆమె తన స్నేహితురాలికి ఒక లేఖ రాస్తుంది.
They play football after school.స్కూల్ తర్వాత వాళ్ళు ఫుట్‌బాల్ ఆడతారు.
The sun shines brightly in the sky.సూర్యుడు ఆకాశంలో ప్రకాశవంతంగా ప్రకాశిస్తాడు.
I drink a glass of milk daily.నేను రోజూ ఒక గ్లాసు పాలు తాగుతాను.

పైన  రెడ్ కలర్ లో కనిపిస్తున్న పదలనే Main verbs అంటారు. Verbs అనగా క్రియలు లేదా  చేసే పనులు అంటారు.

Run = పరిగెత్తు, write = వ్రాయు, Play= ఆడుట , shine = ప్రకాశించు, Drink= త్రాగు.

Verbs లేకుండా వాక్యాలు నిర్మించలేము .క్రింద క్లిక్ చేసి Main verbs పేజీ కి వెళ్ళి చూడండి.  మీ ఫోన్ యొక్క బ్యాక్ బటన్ క్లిక్ చేయండి మరల ఇక్కడికే వస్తారు.  

 CLICK HER .

 

2.Helping verbs (or) Auxiliary verbs:

వీటిని తెలుగులో సహాయక క్రియలు అంటారు. 1.సెంటెన్సెస్ ని నిర్మించడంలో verbs కి సహాయం చేస్తూ ఉండటం వలన వీటిని హెల్పింగ్ వెర్బ్స్ అంటారు.  Tense నిర్మించడంలో క్రింది పేర్కొన్న సహాయక క్రియలను ఉపయోగిస్తారు.

DO, DOES, DID, AM, IS, ARE, WAS, WERE, HAVE, HAS, HAD,

WILL, WOULD, SHALL, SHOULD, CAN, COULD, MAY, MIGHT, MUST

ఈ Auxiliary verbs  ని  తిరిగి రెండు రకాలుగా విభజించారు

అవి: A.Primary auxiliary verbs     B. Modal verbs

A.Primary auxiliary verbs 

:DO, DOES, DID, AM, IS, ARE, WAS, WERE, HAVE, HAS, HAD, 

Primary auxiliary verbs వీటిని తిరిగి మూడు రకాలుగా విభజించారు అవి.

  1. “Do” forms : DO, DOES, DID 
  2. “Be” forms : AM, IS, ARE, WAS, WERE,
  3. “Have” forms: HAVE, HAS, HAD.

Doforms: ఒక వాక్యంలో వున్న సబ్జెక్టు ఏ పని చేస్తున్నాడు అనే దానిని వివరించడానికి ఉపయోగిస్తారు.

Beforms: సబ్జెక్టు యొక్క స్థితిని తెలియజేయడానికి ఉపయోగిస్తారు.

Havefroms:  సబ్జెక్టు ఏమి కలిగి  ఉన్నాడో తెలియజేయడానికి ఉపయోగిస్తారు.

 

B. Modal verbs

Tensesలో ఇవి మొత్తం 9: WILL, WOULD, SHALL, SHOULD, CAN, COULD, MAY, MIGHT, MUST

Model verbs: సబ్జెక్టు యొక్క అవకాశాలు, అవసరాలు మరియు సామర్థ్యాలను గురించి తెలియజేయడానికి ఉపయోగపడతాయి.

కొన్ని సందర్భాలలో verbs లేని వాక్యాలలో సహాయక క్రియలు మెయిన్ వెర్బ్ గా పని చేస్తాయి.

Examples:  

1. He is a lawyer   అతను ఒక లాయర్

2.They are students  వారు విద్యార్థులు

3. He was farmer   అతను రైతుగా ఉండెను

పై ఉదాహరణలను గమనిస్తే ఇటువంటి వాక్యాల నిర్మాణంలో verb లేకపోయినప్పటికీ సహాయక క్రియలు అయిన is, are, was  లాంటివి మెయిన్ వెర్బ్ గా పనిచేసి ఒక అర్థవంతమైనటువంటి వాక్య నిర్మాణాన్ని చేపడుతున్నాయి. వాక్య నిర్మాణంలో మెయిన్ verbs కి సహాయం చేసినప్పుడే మాత్రమే వీటిని సహాయక్రియలు అంటారు. 

పైన పేర్కొన్న సెంటెన్సెస్ అన్నిటి గురించి ఫోను ఫోను మీకు పూర్తిగా అర్థం అవుతుంది కాబట్టి కన్ఫ్యూజ్  కావాల్సిన అవసరం లేదు

3. OBJECT:

 పైన వివరించినట్లుగా సబ్జెక్టు యొక్క ప్రభావానికి గురి అయ్యే దానిని ఆబ్జెక్ట్ అంటారు. ఆబ్జెక్టుగా ఒక మనిషి ఉండవచ్చు, జంతువు ఉండవచ్చు, లేదా ఒక ప్రదేశం ఉండవచ్చు, లేదా ఒక వస్తువైనా ఉండవచ్చు.

PART 2 

Simple present tense     

 సింపుల్ ప్రెసెంట్ టెన్స్ గురించి సంపూర్ణంగా తెలుసుకుంటే సగం ఇంగ్లీష్ నేర్చుకున్నట్లే. కాబట్టి సింపుల్ ప్రెసెంట్ టెన్స్ గురించి మేము ఇచ్చిన వివరణను ఓపికగా చదవండి. సింపుల్ ప్రెసెంట్ టెన్స్ గురించి మీరు ఎప్పుడూ చదవని విధంగా సింపుల్ ప్రెసెంట్ టెన్స్ ని 12 రకాలుగా ఏ విధంగా ఉపయోగిస్తారో ఇందులో వివరించాము. Verb నాలుగు రూపాలు వుంటాయని చదివాము  కదాకానీ verb మొదటి రూపాన్ని మాత్రమే  ఉపయోగించి మాట్లాడడా న్ని   సింపుల్ ప్రెసెంట్ టెన్స్ అంటారు.

1.ముఖ్యంగా ఈ Simple Present Tenseలో ప్రతిరోజూ లేదా వారానికి లేదా నెలకి లేదా సంవత్సరానికి   రిపీటెడ్ గా జరిగే అవకాశం ఉండేటువంటి వాక్యాలను ఈ టెన్స్ లో తెలియజేస్తారు. 

సునీల్ కాలేజీకి వెళ్తాడు, నేను పనికి వెళ్తాను , వారు ఇక్కడికి వస్తారు, ఆమె పాటలు పాడుతుంది, అతను వేగంగా పరిగెత్తుతాడు, సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు, అతను అమెరికాలో నివసిస్తాడు, అతను బాగా చదువుతాడు,  అమ్మ వంట చేస్తుంది , Joy స్కూల్ కి వెళ్తాడు, సుధాకర్ ఇంగ్లీష్ బోధిస్తాడు,ఆమె కూరగాయలు అమ్ముతుంది,సురేష్ మా ఇంటికి వస్తాడు.

పైన తెలిపిన ఇటువంటి వాక్యాలు అన్ని కూడా ప్రతిరోజూ లేదా వారానికి లేదా నెలకి లేదా సంవత్సరానికి   రిపీటెడ్ గా జరిగే అవకాశం ఉండే  ఇటువంటి వాక్యాలను మాత్రమే  సింపుల్ ప్రెసెంట్ టెన్స్ లో తెలియజేస్తారు. సింపుల్ ప్రెసెంట్ టెన్స్ లో ఉపయోగించే ప్రతి వాక్యము కూడా ఏదో ఒక రోజు మరల రిపీట్ అయ్యే స్వభావాన్ని కలిగి ఉంటుంది అని  మాత్రమే గుర్తుపెట్టుకోండి.రిపీట్ అయ్యే  వాక్యాలను మాత్రమే సింపుల్ ప్రెసెంట్ టెన్స్ లో తెలియజేస్తారు

 

Present, Past, Future టెన్స్ లో వాక్యాలను ప్రధానంగా మూడు రకాలుగా విభజిస్తారు 

1.Action sentences = సబ్జెక్టు చేసే  పనిని తెలియజేసే వాక్యాలు.

2.Possessive sentences = సబ్జెక్టు ఏమి కలిగి ఉన్నాడో (ఆస్తి) తెలియజేసే వాక్యాలు.

3.State sentences = సబ్జెక్ట్ యొక్క స్థితిని తెలియజేసే వాక్యాలు.

 

పైన మనం తెలుసుకున్నట్లుగా  ఒకే వ్యక్తి ఉంటే  singular subjects , ఇద్దరూ లేదా అంతకన్నా ఎక్కువ ఉంటే plural subjects.  అని  తెలుసుకున్నాము కదా వీటిని బాగా గుర్తుపెట్టుకోండి.

singular subjects : I (నేను ), He (  అతడు), She ( ఆమె ), It ( ఇది ),  That ( అది )

plural subjects: We ( మేము/మనము), You (మీరు ) They ( వారు)

 

సింపుల్ ప్రెసెంట్ టెన్స్ లో మాత్రమే ఉపయోగించే సహాయక క్రియలు మొత్తం : Do, Does, Have, Has,  Am, Is, Are. 

Do,Does :సబ్జెక్ట్ చేసే పనిని తెలియజేయడానికి  (action sentences) 

Have, Has: సబ్జెక్టు ఏమి కలిగి ఉన్నాడో  తెలియజేయడానికి (Possessive sentences)

Am, Is, Are: సబ్జెక్ట్ యొక్క స్థితిని తెలియజేయడానికి (State sentences)

 

Singular subject కి మరియు Plural subjcect కి విడివిడిగా ఏ సహాయక క్రియలు ఉపయోగిస్తారో తెలుసుకుందాం

He, She,It,That : Does, Has, Is

We, Y0u, They:  Do, Have, Are 

I: Do, Have, Am

 

 సింపుల్ ప్రజెంట్ టెన్స్ లో వాక్యాలను నిర్మించడానికి కేవలం verb  మొదటి రూపాన్ని మాత్రమే ఉపయోగిస్తారు.  ఇదే కొండగుర్తు

ఇప్పుడు ఒక్కొక్క . సహాయక క్రియను  ఏ విధంగా ఉపయోగిస్తారో తెలుసుకుందాం

Do:

Simple present tense లో Plural సబ్జెక్టులు అయిన  We, You, They లకు మరియు “I”  కి   Verb మొదటి రూపాన్ని మరియు  ‘Do’సహాయక క్రియ  ఉపయోగించి  Action sentences నిర్మాణం చేస్తారు. క్రింది పట్టికను గమనించండి.

 

1.I send it.    

(I do send it).

 నేను దీనిని పంపిస్తాను.
2.We work.  

  (We do work).

 మేము పని చేస్తాము.
3. You see.   

(You do see).

 నీవు చూస్తావు.
4. They run.  

(They do run).

 వారు పరిగెత్తుతారు.

పైన ఉన్న వాక్యాలలో Send,Work,See మరియు Run అనేవి  Verb యొక్క మొదటి రూపాలు (V1)

నేను దీనిని పంపిస్తాను, మేము పని చేస్తాము, నీవు చూస్తావు, వారు పరిగెత్తుతారు,   ఈ పనులన్నీ ఎప్పుడు జరుగుతాయి. సింపుల్ ప్రెసెంట్ టెన్స్ లో ఈ పనులు మరలా మరలా  జరుగుతాయి అని  అర్దం . 

I send it దీని అసలైన రూపం బ్రాకెట్లో ఇవ్వబడింది (I do send it) .కానీ సాధారణంగా మాట్లాడేటప్పుడు do తీసివేసి  I send it అని మాట్లాడుతారు. 

I send it అనే వాక్యానికి వ్యతిరేక వాక్యం ( Negative sentence)  రాసేటప్పుడు, సబ్జెక్టు ‘I’ కి కుడి పక్కన దాగి ఉన్న Do ని  బయటకు తీసి  Not అనే పదాన్ని చేర్చాల్సి వుంటుంది. అప్పుడు 

I do not send it అవుతుంది.

సాధారణంగా వ్యతిరేక పదం Not. కానీ Tenses లో  వ్యతిరేక వాక్యాలు రాయటానికి ఆయా Tenses కి కేటాయించబడిన సహాయక క్రియల సపోర్ట్ తోటి Not ఉపయోగించాలి.

అయితే సింపుల్ ప్రెసెంట్ టెన్స్ లో Plural సబ్జెక్ట్ అయిన we,you,they   మరియు “I” లకు  కేటాయించబడిన సహాయక క్రియ Do కాబట్టి వ్యతిరేకవాక్యంగా మార్చుటకు Do not ఉపయోగించాలి.

 

I send it (Positive sentence)

I do not send it ( Negative sentence)

పై రెండు వాక్యాలను ప్రశ్నా వాక్యాలుగా ( Interrogative sentences) మార్చటానికి

మొదటి వాక్యంలో సబ్జెక్టు I పక్కనే ఉన్న Do ని, రెండవ వాక్యంలో సబ్జెక్టు ‘I’ ప్రక్కనే ఉన్న Do ని మొదట ఉంచి, చివర క్వశ్చన్ మార్క్ (?) పెడితే సరిపోతుంది.

Do I send it? (పాజిటివ్ సెంటెన్స్ “ఇంట్రాగేటివ్ సెంటెన్స్” గా మారింది)

Do I not send it? ( నెగిటివ్ సెంటెన్స్ అయితే  “నెగిటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్” గా మారింది)

ఇప్పుడు పైన ఉన్న వాక్యాలు అన్నిటిని ఒక వరుస క్రమంలో రాసి చూద్దాం

 

I send it (Positive sentence) (P)

I do not send it ( Negative sentence) (N)

Do I send it? (Interrogative sentence) (I)

Do not I send it? (Negative interrogative sentence) (NI)

 

పాజిటివ్ సెంటెన్స్ (Positive sentence) అంటే ఏమిటి.? పాజిటివ్ సెంటెన్స్ వాస్తవాలు లేదా నిజాలను మాత్రమే తెలియజేస్తుంది. దీనిని ఆఫిర్మేటివ్ సెంటెన్స్ (Affirmative sentence) అని కూడా అంటారు. Affirmative అనగా ఇదే నిజం అని నొక్కి చెప్పడం. Positive sentence ని తెలుగులో సాధారణ వాక్యాలు అని అంటారు.

క్రింది పట్టికలో హైలెట్ చేసిన  మొదటి వాక్యం Positive, రెండవ వాక్యం  negative,  మూడవ వాక్యం  Interrogative, నాలుగవ వాక్యం  Negative Interrogative అని గుర్తుపెట్టుకోండి. ఈ పుస్తకం చివరి వరకు ఇదే  క్రమం ఉంటుంది. ఓపిక లేకపోతే హైలెట్ చేసిన పాజిటివ్ సెంటెన్స్ అన్నిటిని మొదట చదవండి.

 

1. I send it. (possitive sentence).

ఐ సెండ్ ఇట్.

 నేను దీనిని పంపుతాను.
I do not send it .(negative sentence). నేను దీనిని పంపను.
 Do I send it? (Interrogative  sentence) . నేను  దీనిని పంపుతానా?.
Do I not  send it? (negative Interrogative sentence). నేను  దీనిని పంపనా?.
2. We work.

వీ వర్క్.

 మేము పని చేస్తాము.
 We do not work.  మేము పని చేయుము.
 Do we work?  మేము పని చేస్తామా?
 Do we not work?  మేము పని చేయమా?
3. You see.

యూ సీ.

 మీరు చూస్తారు.
 You don’t see. మీరు చూడరు.
 Do you see? మీరు చూస్తారా?
 Don’t you see? మీరు  చూడరా?
4. They run .

దే రన్.

వారు పరిగెత్తుతారు.
 They don’t run. వారు  పరిగెత్తరు.
 Do they run? వారు  పరిగెత్తుతారా?
 Don’t they run? వారు   పరిగెత్తరా?

5.  I eat breakfast every morning.

ఐ ఈట్ బ్రేక్‌ఫాస్ట్ ఎవ్రీ మార్నింగ్.

  నేను ప్రతి ఉదయం అల్పాహారం తింటాను.
I do not eat breakfast every morning .  నేను ప్రతి ఉదయం అల్పాహారం తినను.
Do I eat breakfast every morning?  నేను ప్రతి ఉదయం అల్పాహారం తింటానా?
Do I not eat breakfast every morning?  నేను ప్రతి ఉదయం అల్పాహారం తిననా?
6.  We play cricket on weekends.

వీ ప్లే క్రికెట్ ఆన్ వీకెండ్స్.

  మేము వారాంతాల్లో క్రికెట్ ఆడతాము.
We do not play cricket on weekends.  మేము వారాంతాల్లో క్రికెట్ ఆడము.
Do we play cricket on weekends?  మేము వారాంతాల్లో క్రికెట్ ఆడతామా?
Do we not play cricket on weekends?  మేము వారాంతాల్లో  మేము క్రికెట్ ఆడమా?
7.You study for your exams diligently.

యూ స్టడీ ఫర్ యువర్ ఎగ్జామ్స్ డిలిజెంట్‌లీ.

  మీరు మీ పరీక్షల కోసం శ్రద్ధగా చదువుతారు.
You do not study for your exams diligently.  మీరు మీ పరీక్షల కోసం శ్రద్ధగా చదవరు.
Do you study for your exams diligently?  మీరు మీ పరీక్షలకు శ్రద్ధగా చదువుతారా?
Do you not study for your exams diligently?  మీరు మీ పరీక్షల కోసం శ్రద్ధగా చదవరా?
8.They go to the gym regularly.

దే గో టు ది జిమ్ రెగ్యులర్‌లీ.

  వారు క్రమం తప్పకుండా జిమ్ కి వెళ్తారు.
They do not go to the gym regularly.   వారు క్రమం తప్పకుండా జిమ్ కి వెళ్లరు.
Do they go to the gym regularly?    వారు క్రమం తప్పకుండా జిమ్ కి వెళ్తారా?
Do they not go to the gym regularly?    వారు క్రమం తప్పకుండా జిమ్ కి వెళ్ళరా?
9.I read books before bed.

ఐ రీడ్ బుక్స్ బిఫోర్ బెడ్.

నేను  పడుకునే ముందు పుస్తకాలు చదువుతాను.
I do not read books before bed .  నేను పడుకునే ముందు పుస్తకాలు చదవను.
Do I read books before bed?  నేను పడుకునే ముందు పుస్తకాలు చదువుతానా?
Do I not read books before bed?  నేను పడుకునే ముందు పుస్తకాలు  చదవనా?
10.We visit our grandparents often.

వీ విజిట్ అవర్ గ్రాండ్‌పేరెంట్స్ ఆఫెన్.

  మేము తరచుగా మా అవ్వతాతలను సందర్శిస్తాము.
We do not visit our grandparents often.  మేము తరచుగా మా అవ్వతాతలను సందర్శించము.
Do we visit our grandparents often?  మేము తరచుగా మా అవ్వతాతలను సందర్శిస్తామా?
Do we not visit our grandparents often?   మేము తరచుగా మా అవ్వతాతలను సందర్శించమా?
11.You cook dinner every evening.

యూ కుక్ డిన్నర్ ఎవ్రీ ఈవెనింగ్.

  మీరు ప్రతి సాయంత్రం రాత్రి భోజనం వండుతారు. (Dinner = రాత్రి భోజనం).
You do not cook dinner every evening.  మీరు ప్రతి సాయంత్రం రాత్రి భోజనం వండరు .
Do you cook dinner every evening?  మీరు ప్రతి సాయంత్రం రాత్రి భోజనం వండుతారా?
Do you not cook dinner every evening?  మీరు ప్రతి సాయంత్రం రాత్రి భోజనం  వండరా?
12.They travel to new places every year.

దే ట్రావెల్ టు న్యూ ప్లేసెస్ ఎవ్రీ ఇయర్.

  వారు ప్రతి సంవత్సరం కొత్త ప్రదేశాలకు ప్రయాణం చేస్తారు.
They do not travel to new places every year.  వారు ప్రతి సంవత్సరం కొత్త ప్రదేశాలకు ప్రయాణం చేయరు.
Do they travel to new places every year?  వారు ప్రతి సంవత్సరం కొత్త ప్రదేశాలకు ప్రయాణం చేస్తారా?
Do they not travel to new places every year?  వారు ప్రతి సంవత్సరం కొత్త ప్రదేశాలకు ప్రయాణం చేయరా?
13. I write in my journal daily.

ఐ రైట్ ఇన్ మై జర్నల్ డైలీ.

  నేను రోజూ నా పత్రికలో వ్రాస్తాను.
I do not write in my journal daily.  నేను నా పత్రికలో రోజూ వ్రాయను.
Do I write in my journal daily?  నేను రోజూ నా జర్నల్‌లో వ్రాస్తానా?
Do I not write in my journal daily?  నేను రోజూ నా జర్నల్‌లో వ్రాయనా?
14.  We enjoy watching movies together.

వీ ఎంజాయ్ వాచింగ్ మూవీస్ టుగెదర్.

  మేమిద్దరం కలిసి సినిమాలు చూసి ఆనందిస్తాం.
We do not enjoy watching movies together.  మేమిద్దరం కలిసి సినిమాలు చూసి ఆనందించం.
Do we enjoy watching movies together?  మేము కలిసి సినిమాలు చూసి ఆనందిస్తామా?
Do we not enjoy watching movies together?   మేము కలిసి సినిమాలు చూసి ఆనందించమా?

 

Have: 

సింపుల్ ప్రెసెంట్ టెన్స్ లో I, We, You, They  లకు ‘Have’ సహాయక క్రియ ఉపయోగించి . వాక్యంలో ఉన్న సబ్జెక్టు ఏమి కలిగి ఉన్నాడో  తెలియజేస్తారు  (Possessive sentences). 

Have = కలిగియుండుట

Example : You have a bike  (నీకు ఒక బైకు ఉన్నది లేదా నీవు ఒక బైక్ ని కలిగి ఉన్నావు)

 పై వాక్యాన్ని క్రింది విధంగా కూడా రాయవచ్చు. 

You do have a bike. కానీ సాధారణంగా మాట్లాడేటప్పుడు  Do ఉపయోగించరు. కానీ వ్యతిరేక వాక్యాలు, ప్రశ్నా వాక్యాలు రాసేటప్పుడు Do తప్పనిసరిగా ఉపయోగించాలి.

ఈ వాక్యాన్ని నెగిటివ్ సెంటెన్స్ గా మార్చుటకు Do ప్రక్కన not చేరిస్తే సరిపోతుంది.

You do not have a bike. (Negative sentences ) పై రెండు వాక్యాలను ప్రశ్నా వాక్యాలుగా మార్చుటకు Do ని సబ్జెక్టు You కి ముందు పెడితే  సరిపోతుంది.

Do you have a bike? ( Interrogative sentence)

Do you not have a bike? ( Negative interrogative sentence)

 

మరి కొన్ని ఉదాహరణలు.

1. I have a car. (You do have a car)నా దగ్గర కారు ఉంది. (నేను కారును కలిగి వున్నాను అను కూడా అనవచ్చు కాను వాడుకలో అలా చెప్పరు)
ఐ హ్యవ్ ఎ కార్. 
I do not have a car.నా దగ్గర కారు లేదు.
Do I have a car?నా దగ్గర కారు ఉందా?
Do I not have a car?నాకు కారు లేదా?
2.You have a new phone. నీ దగ్గర ఒక కొత్త ఫోన్ ఉన్నది.
యూ హ్యవ్ ఎ న్యూ ఫోన్. 
You do not have a new phone.నీ దగ్గర ఒక కొత్త ఫోన్ లేదు.
Do You have a new phone?నీ దగ్గర ఒక కొత్త ఫోన్  ఉందా?
Do you not have a new phone?నీ దగ్గర ఒక కొత్త ఫోన్  లేదా?
3.They have a meeting today.ఈ రోజు వారి కి సమావేశం ఉంది.
దే హ్యవ్ ఎ మీటింగ్ టుడే. 
They do not have a meeting today.వారికి ఈరోజు సమావేశం లేదు.
Do they have a meeting today?వారికి ఈరోజు మీటింగ్ ఉందా?
Do they not have a meeting today?వారికి ఈరోజు మీటింగ్ లేదా?
4.We have lunch at noon.మాకు మధ్యాహ్నం భోజనం ఉంది.
వీ హ్యవ్ లంచ్ అట్ నూన్. 
We do not have lunch at noon.మాకు మధ్యాహ్నం భోజనం లేదు.
Do we have lunch at noon?మాకు మధ్యాహ్నం భోజనం  ఉందా?
Do we not have lunch at noon?మాకు మధ్యాహ్నం భోజనం లేదా?

 

5.  I have a new pen.

ఐ హ్యవ్ ఎ న్యూ పెన్.

నా దగ్గర కొత్త పెన్ను ఉంది. (లేదా నేను ఒక కొత్త పెన్నును కలిగి ఉన్నాను)
I do not have a new pen.నా దగ్గర కొత్త పెన్ను లేదు.
Do I have a new pen?నా దగ్గర కొత్త పెన్ను ఉందా?
Do I not have a new pen?నా దగ్గర కొత్త పెన్ను లేదా?
6.We have a science project.

వీ హ్యవ్ ఎ సైన్స్ ప్రాజెక్ట్.

మాకు ఒక సైన్స్ ప్రాజెక్ట్ ఉన్నది (లేదా మేము ఒక సైన్స్ ప్రాజెక్ట్ ని కలిగి ఉన్నాము) 
We do not have a science project.మాకు ఒక సైన్స్ ప్రాజెక్ట్  లేదు.
Do we have a science project?మాకు ఒక సైన్స్ ప్రాజెక్ట్  ఉందా?
Do we not have a science project?మాకు ఒక సైన్స్ ప్రాజెక్ట్ లేదా?
7. You have a good opportunity.

యూ హ్యవ్ ఎ గుడ్ ఆపర్చ్యునిటీ.

మీకు మంచి అవకాశం ఉంది. (లేదా మీరు ఒక మంచి అవకాశాన్ని కలిగి ఉన్నారు)
You do not have a good opportunity.మీకు మంచి అవకాశం లేదు.
Do you have a good opportunity?మీకు మంచి అవకాశం ఉందా?
Do you not have a good opportunity?మీకు మంచి అవకాశం లేదా?
8. They have a large garden.

దే హ్యవ్ ఎ లార్జ్ గార్డెన్.

వారికి పెద్ద తోట ఉంది. 
They do not have a large garden.వారికి పెద్ద తోట లేదు.
Do they have a large garden?వారికి పెద్ద తోట ఉందా?
Do they not have a large garden?వాళ్ళకి పెద్ద తోట లేదా?
9. I have two sisters.

ఐ హ్యవ్ టూ సిస్టర్స్.

నాకు ఇద్దరు చెల్లెళ్ళు. (లేదా నేను ఇద్దరు చెల్లెళ్లను కలిగి ఉన్నాను)
I do not have two sisters.నాకు ఇద్దరు చెల్లెళ్ళు లేరు.
Do I have two sisters?నాకు ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారా?
Do I not have two sisters?నాకు ఇద్దరు చెల్లెళ్ళు లేరా? 
10. We have enough chairs.

వీ హ్యవ్ ఇనఫ్ చెయర్స్.

మాకు సరిపడా కుర్చీలు ఉన్నాయి. (లేదా మేము సరిపడ కుర్చీలను కలిగి ఉన్నాము)
We do not have enough chairs.మాకు సరిపడా కుర్చీలు లేవు.
Do we have enough chairs?మాకు  సరిపడా కుర్చీలు ఉన్నాయా?
Do we not have enough chairs?మాకు  సరిపడా కుర్చీలు లేవా?
11. You have a smart phone.

యూ హ్యవ్ ఎ స్మార్ట్ ఫోన్.

మీ దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంది. (లేదా మీరు ఒక స్మార్ట్ ఫోన్ను కలిగి ఉన్నారు)
You do not have a smart phone.మీ దగ్గర స్మార్ట్ ఫోన్ లేదు.
Do you have a smart phone?మీ దగ్గర స్మార్ట్ ఫోన్ ఉందా?
Do you not have a smart phone?మీ దగ్గర స్మార్ట్ ఫోన్ లేదా?
12. They have three cars.

దే హ్యవ్ త్రీ కార్స్.

వాళ్ళ దగ్గర మూడు కార్లు ఉన్నాయి.( లేదా వారు మూడు కార్లను కలిగి ఉన్నారు)
They do not have three cars.వాళ్ళ దగ్గర మూడు కార్లు లేవు.
Do they have three cars?వాళ్ళ దగ్గర మూడు కార్లు ఉన్నాయా?
Do they not have three cars?వాళ్ళ దగ్గర మూడు కార్లు లేవా?
13. I have a big dream.

ఐ హ్యవ్ ఎ బిగ్ డ్రీమ్.

నాకు ఒక పెద్ద కల ఉంది.( లేదా నేను ఒక పెద్ద కలను కలిగి ఉన్నాను)
I do not have a big dream.నాకు ఒక పెద్ద కల లేదు
Do I have a big dream?నాకు పెద్ద కల ఉందా?
Do I not have a big dream?నాకు పెద్ద కల లేదా?
14. We have a history class.

వీ హ్యవ్ ఎ హిస్టరీ క్లాస్.

మాకు చరిత్ర తరగతి ఉంది. (లేదా మేము ఒక చరిత్ర తరగతిని కలిగి ఉన్నాము)
We do not have a history class.మాకు చరిత్ర తరగతి లేదు.
Do we have a history class?మనకు చరిత్ర తరగతి ఉందా?
Do we not have a history class?మనకు చరిత్ర తరగతి లేదా?
15. You have a kind heart.

యూ హ్యవ్ ఎ కైండ్ హార్ట్.

మీకు దయగల హృదయం ఉంది. ( లేదా మీరు ఒక దయగల హృదయాన్ని కలిగి ఉన్నారు)
You do not have a kind heart.మీకు దయగల హృదయం లేదు.
Do you have a kind heart?మీకు దయగల హృదయం ఉందా?
Do you not have a kind heart?మీకు దయగల హృదయం లేదా?
16. They have a busy schedule.

దే హ్యవ్ ఎ బిజీ షెడ్యూల్.

వారికి బిజీ షెడ్యూల్ ఉంటుంది. ( లేదా వారు బిజీ షెడ్యూల్ను కలిగి ఉన్నారు)
They do not have a busy schedule.వారికి బిజీ షెడ్యూల్ లేదు.
Do they have a busy schedule?వారికి బిజీ షెడ్యూల్ ఉందా?
Do they not have a busy schedule?వారికి బిజీ షెడ్యూల్ లేదా?
17. I have a small doubt.

ఐ హ్యవ్ ఎ స్మాల్ డౌట్.

నాకు ఒక చిన్న సందేహం ఉంది. ( లేదా నేను ఒక చిన్న సందేహాన్ని కలిగి ఉన్నాను) 
I do not have a small doubt.నాకు చిన్న సందేహం లేదు.
Do I have a small doubt?నాకు ఒక చిన్న సందేహం ఉందా?
Do I not have a small doubt?నాకు ఒక చిన్న సందేహం లేదా?
18. We have a clear plan.

వీ హ్యవ్ ఎ క్లియర్ ప్లాన్.

మాకు  స్పష్టమైన ప్రణాళిక ఉంది. (లేదా మేము స్పష్టమైన ప్రణాళికను కలిగి ఉన్నాము)
We do not have a clear plan.మాకు స్పష్టమైన ప్రణాళిక లేదు.
Do we have a clear plan?మాకు  స్పష్టమైన ప్రణాళిక ఉందా?
Do we not have a clear plan?మాకు  స్పష్టమైన ప్రణాళిక లేదా?
19. You have strong skills.

యూ హ్యవ్ స్ట్రాంగ్ స్కిల్స్.

మీకు బలమైన నైపుణ్యాలు ఉన్నాయి. ( లేదా మీరు బలమైన నైపుణ్యాలను కలిగి ఉన్నారు)
You do not have strong skills.మీకు బలమైన నైపుణ్యాలు లేవు.
Do you have strong skills?మీకు బలమైన నైపుణ్యాలు ఉన్నాయా?
Do you not have strong skills?మీకు బలమైన నైపుణ్యాలు లేవా?
20. They have a new idea.

దే హ్యవ్ ఎ న్యూ ఐడియా.

వారికి ఒక కొత్త ఆలోచన ఉంది . ( లేదా వారు ఒక కొత్త ఆలోచనను కలిగి ఉన్నారు)
They do not have a new idea.వారికి కొత్త ఆలోచన లేదు.
Do they have a new idea?వారికి కొత్త ఆలోచన ఉందా?
Do they not have a new idea?వాళ్ళకి కొత్త ఆలోచన లేదా?

 

 

Are

సింపుల్ ప్రెసెంట్ టెన్స్ లో  సబ్జెక్టు ‘I’  కి am  మరియు We, You, They  లకు ‘are’ సహాయక క్రియలు ఉపయోగించి   స్స్థితిని తెలియజేసే వాక్యాలను నిర్మిస్తారు.

స్థితి అంటే ఏమిటి?

రాము యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్ లో బెడ్ మీద ఉన్నాడు. ఇది అతని స్థితి .

మా కోడిపుంజు ఇంటి మీదకి ఎక్కి ఉన్నది. ప్రస్తుతం కోడిపుంజు స్థితి అది

మహేష్ శ్రద్ధగా చదివి లెక్చరర్ అయి ఉన్నాడు. ప్రస్తుతం  మహేష్ స్థితి ఇది

నేను బాగా పని చేసి అలసిపోయి ఉన్నాను. ప్రస్తుతం  నా  స్థితి అది.

పై విధంగా ఉన్నాడు, ఉన్నది, ఉన్నాను అని వస్తుంది. 

are= ఉన్నారు

Example:

They are soldiers  (PS) ( వారు సైనికులు లేదా  వారు  సైనికులు అయి ఉన్నారు)

పై వాక్యాన్ని వ్యతిరేక వాక్యంగా మార్చుటకు సహాయక క్రియ అయిన are పక్కన not ఉంచాలి.

They are not soldiers (NS)  (వారు సైనికులు  కాదు )

పాజిటివ్ సెంటెన్స్ ని మరియు నెగిటివ్  సెంటెన్స్ ని  రెండింటిని ప్రశ్న వాక్యాలుగా మార్చుటకు సహాయక క్రియ అయిన are ని  సబ్జెక్ట్ అయిన They కి  ముందు ఉంచితే సరిపోతుంది.

Are they soldiers? (IS) (వారు సైనికులా ? )

Are they not soldiers? (NIS) (వారు సైనికులు  కాదా ? )

వాక్యంలో am, is, are ఉన్నప్పుడు ఆ వాక్యాన్ని వ్యతిరేక వాక్యంగా మార్చుటకు వాటి పక్కన not వుంచాలి.

Esamples:

1.They are happy.వారు సంతోషంగా ఉన్నారు.
దే ఆర్ హ్యాపీ. 
They are not happy.వారు సంతోషంగా లేరు.
Are they happy?వారు సంతోషంగా ఉన్నారా?
Are they not happy?వారు సంతోషంగా లేరా?
2.You are a teacher.మీరు గురువు. (మీరు గురువై వున్నారు)
యూ ఆర్ ఎ టీచర్. 
You are not a teacher.మీరు గురువు కాదు.
Are you a teacher?మీరు ఉపాధ్యాయులా?
Are you not a teacher?మీరు గురువు కాదా?
3.We are ready.మేము సిద్ధంగా ఉన్నాము.
వీ ఆర్ రెడీ. 
We are not ready.మేము సిద్ధంగా లేము.
Are we ready?మేము సిద్ధంగా నామా?
Are we not ready? మేము సిద్ధంగా లేమా?
4.The kids are playful.పిల్లలు ఉల్లాసంగా ఉన్నారు
ద కిడ్స్ ఆర్ ప్లేఫుల్. 
The kids are not playful. పిల్లలు ఉల్లాసంగా లేరు
Are the kids playful? పిల్లలు ఉల్లాసంగా ఉన్నారా?
Are the kids not playful? పిల్లలు ఉల్లాసంగా లేరా?
5.These books are interesting.ఈ పుస్తకాలు ఆసక్తికరంగా ఉన్నాయి.
దీస్ బుక్స్ ఆర్ ఇంటరెస్టింగ్. 
These books are not interesting.ఈ పుస్తకాలు ఆసక్తికరంగా లేవు.
Are these books interesting?ఈ పుస్తకాలు ఆసక్తికరంగా ఉన్నాయా?
Are these books not interesting?ఈ పుస్తకాలు ఆసక్తికరంగా లేవా?
6.She and I are friends.ఆమె మరియు నేను స్నేహితులు.
షీ అండ్ ఐ ఆర్ ఫ్రెండ్స్. 
She and I are not friends.ఆమె మరియు నేను స్నేహితులు కాదు.
Are she and I friends?ఆమె మరియు నేను స్నేహితులా?
Are she and I not friends?ఆమె మరియు నేను స్నేహితులు కాదా?
7.The rooms are clean.గదులు శుభ్రంగా ఉన్నాయి.
ద రూమ్స్ ఆర్ క్లీన్. 
The rooms are not clean.గదులు శుభ్రంగా లేవు.
Are the rooms clean?గదులు శుభ్రంగా ఉన్నాయా?
Are the rooms not clean?గదులు శుభ్రంగా లేవా?
8.The dogs are loyal.కుక్కలు విశ్వాసపాత్రమైనవి.
ద డాగ్స్ ఆర్ లోయల్. 
The dogs are not loyal.కుక్కలు విశ్వాసపాత్రమైనవి కావు.
Are the dogs loyal?కుక్కలు విశ్వాసపాత్రంగా ఉన్నాయా?
Are the dogs not loyal?కుక్కలు విశ్వాసపాత్రులు కాదా?
9.The flowers are beautiful.పువ్వులు అందంగా ఉన్నాయి.
ద ఫ్లవర్స్ ఆర్ బ్యూటిఫుల్. 
The flowers are not beautiful.పువ్వులు అందంగా లేవు.
Are the flowers beautiful?పువ్వులు అందంగా ఉన్నాయా?
Are the flowers not beautiful?పువ్వులు అందంగా లేవా?
10.The lights are bright.లైట్లు ప్రకాశవంతంగా ఉన్నాయి.
ద  లైట్స్ ఆర్ బ్రైట్. 
The lights are not bright.లైట్లు ప్రకాశవంతంగా లేవు
Are the lights bright?లైట్లు ప్రకాశవంతంగా ఉన్నాయా?
Are the lights not bright? లైట్లు ప్రకాశవంతంగా లేవా?

Am :

Simple present tense లో సబ్జెక్టు ‘I’ యొక్క స్తితిని తెలియజేయడానికి ‘am’  అను సహాయక క్రియను  ఉపయోగించి వాక్య నిర్మాణం చేస్తారు.

i= వున్నాను 

నేను రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాను. 

నేను సంతోషంగా ఉన్నాను. 

నేను టీచర్ ని అయి ఉన్నాను

నేను అందంగా ఉన్నాను

ఇలా చివరిలో ఉన్నాను, ఉన్నాను అని వస్తుంది

Example :

I am a good player.  (నేను ఒక మంచి ఆటగాడిని   లేదా నేను ఒక మంచి ఆటగాడిని అయి ఉన్నాను)

పై వాక్యాన్ని వ్యతిరేక వాక్యం గా మార్చుటకు  am తరువాత not  చేరిస్తే సరిపోతుంది

I am not a good player. (నేను ఒక మంచి ఆటగాడిని కాదు)

పై రెండు వాక్యాలను ప్రశ్నా వాక్యాలుగా మార్చుటకు am  ని  సెంటెన్స్ మొదటి లో ఉంచితే సరిపోతుంది. 

Am I a good player.  ( నేను ఒక మంచి ఆటగాడినా ?)

Am I not a good player. (నేను ఒక మంచి ఆటగాడిని కాదా?)

1.I am happy.నేను సంతోషంగా ఉన్నాను.

ఐ యామ్ హ్యాపీ.

 
I am not happy.నేను సంతోషంగా లేను.
Am I happy?నేను సంతోషంగా ఉన్నానా?
Am I not happy?నేను సంతోషంగా లేనా?
2.I am a student.నేను విద్యార్థిని. (లేదా నేను విద్యార్థిని అయి వున్నాను )
ఐ యామ్ ఎ స్టూడెంట్. 
I am not a student.నేను విద్యార్థిని కాదు.
Am I a student?నేను విద్యార్థినా?
Am I not a student?నేను విద్యార్థిని కాదా?
3.I am ready for the exam.నేను పరీక్షకు సిద్ధంగా ఉన్నాను.
ఐ యామ్ రెడీ ఫర్ ది ఎగ్జామ్ 
I am not ready for the exam.నేను పరీక్షకు సిద్ధంగా లేను.
Am I ready for the exam?నేను పరీక్షకు సిద్ధంగా ఉన్నానా?
Am I not ready for the exam?నేను పరీక్షకు సిద్ధంగా లేనా?
4.I am confident about my decision.నా నిర్ణయంపై నేను నమ్మకంగా వున్నాను .
ఐ యామ్ కాన్ఫిడెంట్ అబౌట్ మై డెసిషన్. 
I am not confident about my decision.నా నిర్ణయంపై నాకు నమ్మకం లేదు.
Am I confident about my decision?నా నిర్ణయంపై నాకు నమ్మకం ఉందా?
Am I not confident about my decision?నా నిర్ణయంపై నాకు నమ్మకం లేదా?
5.I am in the living room.నేను హాలు లో ఉన్నాను.
ఐ యామ్ ఇన్ ది లివింగ్ రూమ్. 
I am not in the living room.నేను హాలు లో లేను.
Am I in the living room?నేను హాలు లో ఉన్నానా?
Am I not in the living room?నేను హాలు లో లేనా?

 

6.I am a teacher.నేను ఒక ఉపాధ్యాయుడిని.(లేదా నేను ఒక ఉపాధ్యాయుడిని అయి ఉన్నాను)
ఐ యామ్ ఎ టీచర్. 
I am not a teacher.నేను ఒక ఉపాధ్యాయుడిని కాదు.
Am I a teacher?నేను ఒక ఉపాధ్యాయుడినా?
Am I not a teacher?నేను ఒక ఉపాధ్యాయుడిని కాదా?
  
7. I am a student.నేను ఒక విద్యార్థిని. (లేదా నేను ఒక విద్యార్థిని అయి ఉన్నాను
ఐ యామ్ ఎ స్టూడెంట్. 
I am not a student.నేను ఒక విద్యార్థిని కాదు.
Am I a student?నేను ఒక విద్యార్థినా?
Am I not a student?నేను ఒక విద్యార్థిని కాదా?
  
8. I am very busy.నేను చాలా బిజీగా ఉన్నాను.
ఐ యామ్ వెరీ బిజీ. 
I am not very busy.నేను చాలా  బిజీగా లేను.
Am I very busy?నేను చాలా బిజీగా ఉన్నానా?
Am I not very busy?నేను చాలా బిజీగా లేనా?
  
9. I am at home now.నేను ఇప్పుడు ఇంట్లో ఉన్నాను.
ఐ యామ్ ఎట్ హోమ్ నౌ. 
I am not at home now.నేను ఇప్పుడు ఇంట్లో లేను.
Am I at home now?నేను ఇప్పుడు ఇంట్లో ఉన్నానా?
Am I not at home now?నేను ఇప్పుడు ఇంట్లో లేనా?
  
10 I am ready for the exam.నేను పరీక్షకు సిద్ధంగా ఉన్నాను.
ఐ యామ్ రెడీ ఫర్ ది ఎగ్జామ్. 
I am not ready for the exam.నేను పరీక్షకు సిద్ధంగా లేను.
Am I ready for the exam?నేను పరీక్షకు సిద్ధంగా ఉన్నానా?
Am I not ready for the exam?నేను పరీక్షకు సిద్ధంగా లేనా?
  
11. I am in the classroom.నేను తరగతి గదిలో ఉన్నాను.
ఐ యామ్ ఇన్ ది క్లాస్‌రూమ్. 
I am not in the classroom.నేను తరగతి గదిలో లేను.
Am I in the classroom?నేను తరగతి గదిలో ఉన్నానా?
Am I not in the classroom?నేను తరగతి గదిలో లేనా?
  
12. I am your friend.నేను మీ స్నేహితుడిని. (లేదా నేను మీ స్నేహితుడిని అయి ఉన్నాను)
ఐ యామ్ యువర్ ఫ్రెండ్. 
I am not your friend.నేను నీ స్నేహితుడిని కాదు.
Am I your friend?నేను మీ స్నేహితుడినా?
Am I not your friend?నేను మీ స్నేహితుడిని కాదా?

 

♠♠♠♠♠♠♠♠♠♠♠♠♠♠

ఇప్పటివరకు  సింపుల్ ప్రెసెంట్ టెన్స్ లో I,  we, You, They లకు Do, Have, Are, Am  లను ఎలాగ ఉపయోగించాలో  తెలుసుకున్నాం.

ఇప్పుడు సింపుల్ ప్రెసెంట్ టెన్స్ లో  singulars subjects అయిన He, She, It లకు Does, Has, Is,  లను ఎలాగ ఉపయోగించాలో  తెలుసుకుందాం.

PART 3  

Does: 

 Singular Subjects అయిన  He,She,It,That వాక్యాలలో సబ్జెక్ట్ గా వున్నప్పుడు   verb యొక్క మొదటి రూపానికి  ‘es’ లేదా ‘s’ లేదా ‘ies’ కలుపుతారు ఈ విషయాన్ని గుర్తుంచుకోండి.

Examples:

He goes to college.  (He does go to college).అతను కాలేజీకి వెళ్తాడు.
She comes to here. (She does come to here). ఆమె  ఇక్కడికి వస్తుంది.
Ramesh asks him. (Ramesh does ask him).  రమేష్ అతనిని అడుగుతాడు.

పైన ఇవ్వబడిన వాక్యాల యొక్క నిజమైన రూపాలు does అను సహాయక క్రియను ఉపయోగించి బ్రాకెట్లలో ఇవ్వబడి ఉన్నాయి. కానీ మాట్లాడేటప్పుడు Does తీసివేసి verb యొక్క మొదటి రూపానికి  es లేదా s లేదా ies కలిపి మాట్లాడతారు. కానీ వ్యతిరేక వాక్యాలు, మరియు ప్రశ్న వాక్యాలు  మాట్లాడేటప్పుడు Does ని తప్పనిసరిగా ఉపయోగించాల్సి ఉంటుంది.

సింపుల్ ప్రెసెంట్ టెన్స్ లో Does ని ఉపయోగించే విధానం మాత్రమే కొంచెం కష్టంగా ఉంటుంది జాగ్రత్తగా పరిశీలించండి

అతను కాలేజీకి వెళతాడు, ఆమె  ఇక్కడికి వస్తుంది, రమేష్ అతనిని అడుగుతాడు అంటే ఈ పనులు ఎప్పుడు జరుగుతాయి.Simple present tense లో గంట గంటకు, లేదా ప్రతిరోజు, లేదా వారానికి ఒకసారి, లేదా నెలకు, లేదా  సంవత్సరానికి ఒకసారి  ఎప్పుడైనా మరల మరల రిపీటెడ్ గా జరిగే అవకాశం ఉన్నది అని అర్థం.సింపుల్ ప్రెసెంట్ టెన్స్ లో ఈ ఒక్క అర్థం తప్ప మరి ఏ అర్థము ఉండదు .

ఇప్పుడు పైనున్న వాక్యాలను ఏ మార్పు చేయకుండా మరొకసారి క్రింద రాశాము గమనించండి.

1.He goes to college .

2.She comes to here.

3.Ramesh asks him.

పై వాక్యాలను గమనిస్తే సబ్జెక్టు లైన He,She,Ramesh లకు  verb మొదటి రూపాలైన go, come, ask లకు “es” లేదా ”s” కలిపినారు.

ఇప్పుడు పై వాక్యాలకు నెగిటివ్ సెంటెన్స్ రాయాలి కాబట్టి. సబ్జెక్టు లైన He,She,Ramesh, కుడి పక్కన Does అనే సహాయక క్రియ దాగి ఉన్నట్లుగా ఊహించుకోండి. ఇప్పుడు దానిని బయటకు తీసి Does పక్కనే not చేరిస్తే ఆ వాక్యం నెగటివ్ సెంటెన్స్ గా మారిపోతుంది.

సాధారణంగా వ్యతిరేక పదం Not. కానీ Tenses లో  వ్యతిరేక వాక్యాలు రాయటానికి ఆయా Tenses కి కేటాయించబడిన సహాయక క్రియల సపోర్ట్ తోటి Not ఉపయోగించాలి.

అయితే సింపుల్ ప్రెసెంట్ టెన్స్ లో He, She,It  లకు Action sentences లో కేటాయించబడిన సహాయక క్రియ Does కాబట్టి వ్యతిరేకవాక్యంగా మార్చుటకు Does not ఉపయోగించాలి.

He does not goes to college

కానీ నెగిటివ్ సెంటెన్స్ ని ఇలా రాయడం కూడా తప్పు అవుతుంది

ఎందుకంటే,  Does మరియు goes రెండింటికి చివర ‘es’ ఉంది.   ఇక్కడ Does ఉపయోగించినప్పుడే ఇది సింపుల్ ప్రెసెంట్ టెన్స్ లో ఉన్న సంగతి మనకు అర్థమవుతుంది

ఇక్కడ go అనే వెర్బ్ కి ‘es’ చేర్చడం వలన ఇది కూడా సింపుల్ ప్రెసెంట్ టెన్స్ గురించి తెలియజేస్తుంది. కాబట్టి సహాయక క్రియలు కాలాన్ని తెలియజేస్తున్నప్పుడు verb కి ఆ పని అనవసరం. ఇది గ్రామర్ ప్రకారంగా తప్పు అవుతుంది.  కాబట్టి ఇక్కడ ‘go’ కి ఉన్న ‘es’ ని తీసివేస్తాము.

Do, Does, Did లు వాక్యంలో కనిపించినప్పుడు Verb ఎల్లప్పుడూ మొదటి రూపంలోనే ఉండాలి verb కి s,es,ies, చేర్చకూడదు.  అది  positive,negative,interrogative and negative interrogative sentence  ఏదైనా కావచ్చు.  దీన్ని బాగా గుర్తుపెట్టుకోండి .  గ్రామర్ రూల్ ప్రకారం.

అప్పుడు నెగిటివ్ సెంటెన్స్ ని He does not go to college అని రాయాలి.

He goes to college (P)

He does not go to college (N)

పై  పాజిటివ్ సెంటెన్స్ ని ప్రశ్న  వాక్యంగా మార్చుటకు సబ్జెక్ట్ అయినా He కి కుడి పక్కనే దాగి ఉన్న Does ని మొదటిలో ఉంచి goes లో  ఉన్న es ని తీసివేస్తే సరిపోతుంది.

Does he go to college (I) 

పై నెగటివ్ సెంటెన్స్ ని ప్రశ్న వాక్యంగా మార్చుటకు Does  ను తీసి సబ్జెక్టు He కి ముందు ఉంచితే సరిపోతుంది

Does he not go to college (NI)

పై వాక్యాన్ని Doesn’t he go to college అని కూడా రాయవచ్చు.

అదేవిధంగా రెండవ మరియు మూడవ వాక్యాలను రాసినట్లయితే

2.She comes to here  (PS)

She does not come to here  (NS)

Does she come to here (IS)

Does she not come to here (NIS)

 

3.Ramesh asks him (PS)

Rmesh does not ask him (NS)

Does Ramesh ask him  (IS)

Does Ramesh not ask him (NIS)

 

Simple present tense లో He,She,It,That లు subject గా వున్నప్పుడు , వాక్య నిర్మాణం చేయడానికి verb యొక్క మొదటి రూపానికి ‘es’ లేదా ‘s’ లేదా ‘ies’ కలపాలి అని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం.

Rule no.1

Simple present tense లో  He, She, It, That లతో వాక్య నిర్మాణం చేయడానికి Verb మొదటి రూపానికి ‘es’ ఎప్పుడు కలపాలి?

ఏవైనా verb లు  ch, sh, s, ss, o, x, z లతో ముగించబడితే  అటువంటి verbs కు es కలపాలి.

Examples:

Ending with “ch”shs
1. Watch.

2.Teach.

3.Reach.

1.Push.

2.Wash.

3.Finish.

 

1.Kiss.

2.Pass.

3.Guess.

 

ssox
  1.Miss.

2.Cross.

3.Toss.

 1.Go.

2.Do.

3.Echo.

1.Fix.

2.Mix.

3.Relax.

z
1.Buzz.

2.Fuzz.

3.Jazz.

 

పై  పట్టికలో ఉన్న విధంగా verb లు  ch, sh, s, ss, o, x, z లతో ముగించబడితే  అటువంటి verb లకు అన్నింటికీ చివర es కలపాలి.ఇటువంటివి verbs ఇంకా చాలా ఉంటాయి మీకు అర్థం అవడం కోసం కొన్ని మాత్రమే ఇచ్చాము. ఇప్పుడు పై verbs అన్నిటినీ వాక్యాలలో ఉపయోగించి చూద్దాం.

Examples: ఓపిక వుంటే అన్నీ చదవండి లేకుంటే హైలెట్ చేసిన Positive  సెంటెన్స్ అన్నిటిని మొదట చదవండి. తర్వాత Negative, interrogative, negative interrogative లను పరీక్షించండి.

1.She watches the sunset every evening .

(She does watch the sunset every evening .)

ఆమె ప్రతి సాయంత్రం సూర్యాస్తమయాన్ని చూస్తుంది.
షీ వాచెస్ ది సన్‌సెట్ ఎవ్రీ ఈవెనింగ్. 
She does not watch the sunset every evening .ఆమె ప్రతి సాయంత్రం సూర్యాస్తమయాన్ని చూడదు.
Does she watch the sunset every evening? .ఆమె ప్రతి సాయంత్రం సూర్యాస్తమయాన్ని చూస్తుందా?
Does she not watch the sunset every evening? .ఆమె ప్రతి సాయంత్రం సూర్యాస్తమయాన్ని చూడదా?
2.He teaches math at the local school.

(He does teach math at the local school.)

అతను స్థానిక పాఠశాలలో గణితం బోధిస్తాడు.
హీ టీచెస్ మ్యాథ్ ఎట్ ది లోకల్ స్కూల్. 
He does not teach math at the local school.అతను స్థానిక పాఠశాలలో గణితం బోధించడు.
Does he teach math at the local school?.అతను స్థానిక పాఠశాలలో గణితాన్ని బోధిస్తాడా?
Does he not teach math at the local school?.అతను స్థానిక పాఠశాలలో గణితాన్ని బోధించడా?
3.She reaches for the top shelf.ఆమె టాప్ షెల్ఫ్‌కు చేరుకుంటుంది.
షీ రీచెస్ ఫర్ ది టాప్ షెల్ఫ్. 
She does not reach for the top shelf.ఆమె టాప్ షెల్ఫ్‌కు చేరుకోదు.
Does she reach for the top shelf?.ఆమె టాప్ షెల్ఫ్‌కు చేరుకుంటుందా?
Does she not reach for the top shelf?.ఆమె టాప్ షెల్ఫ్‌కు చేరుకోదా?
4.He pushes the door .అతను తలుపు నెడతాడు.
హీ పుషెస్ ది డోర్. 
He does not push the door .అతను తలుపు నెట్టడు.
Does he push the door?అతను తలుపు నెడతాడా?
Does he not push the door?అతను తలుపు నెట్టడా?
5.She washes the dishes after dinner.ఆమె రాత్రి భోజనం తర్వాత గిన్నెలు కడుగుతుంది.
షీ వాషెస్ ది డిషెస్ ఆఫ్టర్ డిన్నర్. 
She does not wash the dishes after dinner.ఆమె రాత్రి భోజనం తర్వాత గిన్నెలు కడగదు.
Does she wash the dishes after dinner?రాత్రి భోజనం చేసిన తర్వాత ఆమె గిన్నెలు కడుగుతుందా?
Does she not wash the dishes after dinner?రాత్రి భోజనం చేసిన తర్వాత ఆమె గిన్నెలు కడగదా?
6.He finishes his homework quickly.అతను తన ఇంటి పనిని త్వరగా పూర్తి చేస్తాడు.
హీ ఫినిషెస్ హిస్ హోంవర్క్ క్విక్‌లీ. 
He does not finish his homework quickly.అతను తన ఇంటి పనిని త్వరగా పూర్తి చేయడు.
Does he finish his homework quickly?అతను తన ఇంటి పనిని త్వరగా పూర్తి చేస్తాడా?
Does he not finish his homework quickly?అతను తన ఇంటి పనిని త్వరగా పూర్తి చేయడా?
7.She kisses her child goodnight.ఆమె తన బిడ్డకు గుడ్నైట్ ముద్దు పెట్టుకుంటుంది.
షీ కిసెస్ హర్ చైల్డ్ గుడ్‌నైట్. 
She does not kiss her child goodnight.ఆమె తన బిడ్డకు గుడ్నైట్ ముద్దు పెట్టుకోదు.
Does she kiss her child goodnight?ఆమె తన బిడ్డకు గుడ్నైట్ ముద్దులు పెడుతుందా?
Does she not kiss her child goodnight?ఆమె తన బిడ్డకు గుడ్నైట్ ముద్దు పెట్టుకోదా?
8.He passes the ball to his teammate.అతను బంతిని తన సహచరుడికి పంపుతాడు.
హీ పాసెస్ ది బాల్ టు హిస్ టీమ్‌మేట్. 
He does not pass the ball to his teammate.అతను తన సహచరుడికి బంతిని  పంపడు.
Does he pass the ball to his teammate?అతను తన సహచరుడికి బంతిని పంపుతాడా?
Does he not pass the ball to his teammate?అతను తన సహచరుడికి బంతిని  పంపడా?
9.She guesses the answer correctly.ఆమె సమాధానాన్ని సరిగ్గా ఊహిస్తుంది.
షీ గెసెస్ ది ఆన్సర్ కరెక్ట్‌లీ. 
She does not guess the answer correctly.ఆమె సమాధానం సరిగ్గా ఊహించదు.
Does she guess the answer correctly?ఆమె సమాధానం సరిగ్గా ఊహిస్తుందా?
Does she not guess the answer correctly?ఆమె సమాధానం సరిగ్గా ఊహించదా?
10.She misses her bus every morning.ఆమె ప్రతి ఉదయం తన బస్సును కోల్పోతుంది .(మిస్ చేసుకుంటుంది).
షీ మిసెస్ హర్ బస్ ఎవ్రీ మార్నింగ్. 
She does not miss her bus every morning.ఆమె ప్రతి ఉదయం తన బస్సును కోల్పోదు.
Does she miss her bus every morning?ఆమె ప్రతి ఉదయం తన బస్సును కోల్పోతుందా?
Does she not miss her bus every morning?ఆమె ప్రతి ఉదయం తన బస్సును కోల్పోదా?
11.He crosses the street carefully.అతను జాగ్రత్తగా వీధి దాటుతాడు.
హీ క్రాసెస్ ది స్ట్రీట్ కేర్‌ఫుల్‌లీ. 
He does not cross the street carefully.అతను జాగ్రత్తగా వీధి దాటడు.
Does he cross the street carefully?అతను జాగ్రత్తగా వీధి దాటుతాడా?
Does he not cross the street carefully?అతను జాగ్రత్తగా వీధి దాటడా?
12.She tosses the paper into the trash.ఆమె కాగితాన్ని చెత్తబుట్టలోకి విసురుతుంది .
షీ టాసెస్ ది పేపర్ ఇంటు ది ట్రాష్. 
She does not toss the paper into the trash.ఆమె కాగితాన్ని చెత్తబుట్టలోకి  విసరదు.
Does she toss the paper into the trash?ఆమె కాగితాన్ని చెత్తబుట్టలో పడేస్తుందా?
Does she not toss the paper into the trash?ఆమె కాగితాన్ని చెత్తబుట్టలో వేయదా?
13.He goes to work by bus.అతను బస్సులో పనికి వెళ్తాడు.
హీ గోస్ టు వర్క్ బై బస్. 
He does not go to work by bus.అతను బస్సులో పనికి వెళ్లడు.
Does he go to work by bus?అతను బస్సులో పనికి వెళ్తాడా?
Does he not go to work by bus?అతను బస్సులో పనికి వెళ్లడా?
14.She does her homework every day.ఆమె ప్రతిరోజూ తన హోంవర్క్ చేస్తుంది.
షీ డస్ హర్ హోంవర్క్ ఎవ్రీ డే. 
She does not do her homework every day.ఆమె ప్రతిరోజూ తన హోంవర్క్ చేయదు.
Does she do her homework every day?ఆమె ప్రతిరోజూ తన హోంవర్క్ చేస్తుందా?
Does she not do her homework every day?ఆమె ప్రతిరోజూ తన హోంవర్క్ చేయదా?
15.The sound echoes through the cave.గుహలో ధ్వని ప్రతిధ్వనిస్తుంది.

Through= ద్వారా, గుండా

ది సౌండ్ ఎకోస్ త్రూ ది కేవ్. 
The sound does not echo through the cave.గుహలో ధ్వని ప్రతిధ్వనించదు.
Does the sound echo through the cave?గుహ ద్వారా ధ్వని ప్రతిధ్వనిస్తుందా?
Does the sound not echo through the cave?గుహ గుండా ధ్వని ప్రతిధ్వనించదా?
16.He fixes the broken chairఅతను విరిగిన కుర్చీని సరిచేస్తాడు.
హీ ఫిక్సెస్ ది బ్రోకెన్ చెయర్. 
He does not fix the broken chair.అతను విరిగిన కుర్చీని సరిచేయడు.
Does he fix the broken chair?అతను విరిగిన కుర్చీని సరిచేస్తాడా?
Does he not fix the broken chair?అతను విరిగిన కుర్చీని సరిచేయడా?
17.She mixes the ingredients well.ఆమె పదార్థాలను బాగా కలుపుతుంది.
షీ మిక్సెస్ ది ఇంగ్రిడియెంట్స్హీ రిలాక్సెస్ ఆఫ్టర్ ఎ లాంగ్ డే. 
She does not mix the ingredients well.ఆమె పదార్థాలను బాగా కలపదు.
Does she mix the ingredients well?ఆమె పదార్థాలను బాగా కలుపుతుందా?
Does she not mix the ingredients well?ఆమె పదార్థాలను బాగా కలపదా?
18.He relaxes after a long day. అతను చాలా రోజుల తర్వాత  విశ్రాంతి తీసుకుంటాడు.
హీ రిలాక్సెస్ ఆఫ్టర్ ఎ లాంగ్ డే. 
He does not relax after a long day.చాలా రోజుల తర్వాత అతను విశ్రాంతి తీసుకోడు .
Does he relax after a long day?అతను చాలా రోజుల తర్వాత విశ్రాంతి తీసుకుంటాడా?
Does he not relax after a long day?చాలా రోజుల తర్వాత అతను విశ్రాంతి తీసుకోడా?
19.The bee buzzes around the flowers.పువ్వుల చుట్టూ తేనెటీగ సందడి చేస్తుంది.
ది బీ బజెస్ అరౌండ్ ది ఫ్లవర్స్. 
The bee does not buzz around the flowers.తేనెటీగ పువ్వుల చుట్టూ సందడి చేయదు.
Does the bee buzz around the flowers?పువ్వుల చుట్టూ తేనెటీగ సందడి చేస్తుందా?
Does the bee not buzz around the flowers?తేనెటీగ పువ్వుల చుట్టూ సందడి చేయదా?
20.He notices the fuzzes on his sweater.అతను తన స్వెటర్‌పై ఉన్న గజిబిజిని గమనిస్తాడు.
హీ నోటిసెస్ ది ఫజెస్ ఆన్ హిస్ స్వెటర్ 
He does not notice the fuzz on his sweater.అతను తన స్వెటర్‌పై ఉన్న గజిబిజిని గమనించడు.
Does he notice the fuzz on his sweater?అతను తన స్వెటర్‌పై ఉన్న గజిబిజిని గమనిస్తాడా?
Does he not notice the fuzz on his sweater?అతను తన స్వెటర్‌పై ఉన్న గజిబిజిని  గమనించడా?
21.She plays chess at the club every Friday.ఆమె ప్రతి శుక్రవారం క్లబ్‌లో చెస్ ఆడుతుంది.
షీ ప్లేస్ చెస్ ఎట్ ది క్లబ్ ఎవ్రీ ఫ్రైడే. 
She does not play chess at the club every Friday.ఆమె ప్రతి శుక్రవారం క్లబ్‌లో చెస్ ఆడదు.
Does she play chess at the club every Friday?ఆమె ప్రతి శుక్రవారం క్లబ్‌లో చెస్ ఆడుతుందా?
Does she not play chess at the club every Friday?ఆమె ప్రతి శుక్రవారం క్లబ్‌లో చెస్ ఆడదా?

 

Rule No :2

సింపుల్ ప్రెసెంట్ టెన్స్ లో He, She,It,that  సబ్జెక్ట్ గా వున్నప్పుడు  verb కి  చివర ‘s’ ఏ సందర్భంలో కలుపుతారో తెలుసుకుందాం.

ఇంగ్లీష్ అక్షరాలలో రెండు రకాలు ఉన్నాయి అవి

అచ్చులు (Vowels) : A E I O U 

హల్లులు (consonants) : B C D  F G H  J K L M N  P Q R S T  V W X Y Z

ఏ Verbs లైతే చివర ఒక vowel తోటి మరియు ‘y’ తోటి అంతమవుతాయో అటువంటి verb లకు చివర ‘s’ ని కలుపుతారు. క్రింది verb లను గమనించండి .

PlayStayEnjoyObeyConvey

ఫై verbs ని వాక్యాలలో ఉపయోగించి చూద్దాము.

Examples:

1.She plays the piano beautifully (PS)

(She does  play the piano beautifully)

ఆమె పియానోను అందంగా ప్లే చేస్తుంది
షీ ప్లేస్ ది పియానో బ్యూటిఫుల్‌లీ.
 
She does not play the piano beautifully (NS)ఆమె పియానోను అందంగా వాయించదు
Does she play the piano beautifully? (IS)ఆమె పియానోను అందంగా ప్లే చేస్తుందా?
Does she not play the piano beautifully? (NIS)ఆమె పియానోను అందంగా వాయించదా?
2.He stays at home on weekendsవారాంతాల్లో ఇంట్లోనే ఉంటాడు
హీ స్టేస్ ఎట్ హోమ్ ఆన్ వీకెండ్స్.
 
He does not stay at home on weekendsవారాంతాల్లో ఇంట్లో ఉండడు
Does he stay at home on weekends?అతను వారాంతాల్లో ఇంట్లో ఉంటాడా?
Does he not stay at home on weekends?అతను వారాంతాల్లో ఇంట్లో ఉండడా?
3.She enjoys going to the beachఆమె బీచ్‌కి వెళ్లడం ఆనందిస్తుంది
షీ ఎంజాయ్స్ గోయింగ్ టు ది బీచ్.
 
she does not enjoy going to the beachఆమె బీచ్‌కి వెళ్లడం ఆనందించదు
Does she enjoy going to the beach?ఆమె బీచ్‌కి వెళ్లడం ఆనందిస్తుందా?
Does she not enjoy going to the beach?ఆమె బీచ్‌కి వెళ్లడం  ఆనందించదా?
4.The dog obeys its owner’s commandsకుక్క తన యజమాని ఆదేశాలను పాటిస్తుంది
ది డాగ్ ఒబేస్ ఇట్స్ ఓనర్స్ కమాండ్స్.
 
The dog does not obey its owner’s commandsకుక్క తన యజమాని ఆదేశాలను పాటించదు
Does the dog obey its owner’s commands?కుక్క తన యజమాని ఆదేశాలను పాటిస్తుందా?
Does the dog not obey its owner’s commands?కుక్క తన యజమాని ఆదేశాలను పాటించదా?
5.He conveys his message clearlyఅతను తన సందేశాన్ని స్పష్టంగా తెలియజేస్తాడు
హీ కన్వేస్ హిస్ మెసేజ్ క్లియర్‌లీ.
 
He does not convey his message clearlyఅతను తన సందేశాన్ని స్పష్టంగా తెలియజేయడు
Does he convey his message clearly?అతను తన సందేశాన్ని స్పష్టంగా తెలియజేస్తాడా?
Does he not convey his message clearly?అతను తన సందేశాన్ని స్పష్టంగా తెలియజేయడా?

 

Rule No.3

సింపుల్ ప్రెసెంట్ టెన్స్ లో He, She,It,that  వాక్యంలో వచ్చినప్పుడు verb మొదటి రూపానికి   చివర ‘ies’ ఏ సందర్భంలో కలుపుతారో తెలుసుకుందాం.

ఇంగ్లీష్ అక్షరాలలో రెండు రకాలు ఉన్నాయి అవి

అచ్చులు (Vowels) : A E I O U 

హల్లులు( consonants) : B C D  F G H  J K L M N  P Q R S T  V W X Y Z

ఏ Verbs లైతే చివర ఒక consonant తోటి మరియు ‘y’ తోటి అంతమవుతాయో అటువంటి verb లకు చివర ‘ies’ ని కలుపుతారు. క్రింది verb లను గమనించండి .

StudyHurryWorryFlyTry

పై verbs ని వాక్యంలో ఉపయోగించు చూద్దాము.

Examples:

1.She studies every day (PS)

(She does study every day)

ఆమె రోజూ చదువుకుంటుంది

షీ స్టడీస్ ఎవ్రీ డే.

 
She does not study every day (NS)ఆమె రోజూ చదువుకోదు
Does she study every day? (IS)ఆమె రోజూ చదువుతుందా?
Does she not study every day?(NIS)ఆమె రోజూ చదువుకోదా?
2.He hurries to catch the busఅతను బస్సును పట్టుకోవడానికి తొందరపడతాడు
హీ హరీస్ టు క్యాచ్ ది బస్. 
He does not hurry to catch the busఅతను బస్సును పట్టుకోవడానికి తొందరపడడు
Does he hurry to catch the bus?అతను బస్సును పట్టుకోవడానికి తొందర పడతాడా?
Does he not hurry to catch the bus?అతను బస్సును పట్టుకోవడానికి  తొందరపడడా?
3.He worries about the examఅతను పరీక్ష గురించి చింతిస్తాడు.
హీ వరీస్ అబౌట్ ది ఎగ్జామ్. 
He does not worry about the examఅతను పరీక్ష గురించి చింతించడు
Does he worry about the exam?అతను పరీక్ష గురించి చింతిస్తాడా?
Does he not worry about the exam?అతను పరీక్ష గురించి  చింతించడా?
4.It flies high in the skyఇది ఆకాశంలో ఎత్తుగా ఎగురుతుంది
ఇట్ ఫ్లైస్ హై ఇన్ ది స్కై 
It does not fly high in the skyఇది ఆకాశంలో ఎత్తుగా ఎగరదు
Does it fly high in the sky?ఇది ఆకాశంలో ఎత్తుగా ఎగురుతుందా?
Does it not fly high in the sky?ఇది ఆకాశంలో ఎత్తుగా ఎగరదా?
5.She tries her best in every competitionప్రతి పోటీలో ఆమె తన వంతు (సాధ్యమైనంతగా) ప్రయత్నం చేస్తుంది
షీ ట్రైస్ హర్ బెస్ట్ ఇన్ ఎవ్రీ కాంపిటిషన్. 
She does not try her best in every competitionప్రతి పోటీలో ఆమె తన వంతు ప్రయత్నం చేయదు
Does she try her best in every competition?ప్రతి పోటీలో ఆమె తన వంతు ప్రయత్నిస్తుందా?
Does she not try her best in every competition?ప్రతి పోటీలో ఆమె తన వంతు ప్రయత్నం చేయదా?

Rule No.4:

 సింపుల్ ప్రెసెంట్ టెన్స్ లో He,She,It,That

లతో వాక్య నిర్మాణం చేసేటప్పుడు Verb మొదటి రూపానికి చివర sh, ch, ss, s, o, x, z. y

అక్షరాలలో ఏది  లేకపోయినట్లు అయితే ఆ వెర్బ్ కి ‘s’ చేరిస్తే సరిపోతుంది.క్రింది పదాలను చూడండి.

Examples:

EatVisitTravelActAllow
ReadCookWriteAgreeFail

పైన ఉన్న verbs అన్నింటినీ కూడా వాక్యాలలో ఉపయోగించి చూద్దాము

Examples:

1.He eats breakfast every morning.

(He does eat breakfast every morning.)

అతను రోజూ ఉదయం అల్పాహారం తింటాడు.
హీ ఈట్స్ బ్రేక్‌ఫాస్ట్ ఎవ్రీ మార్నింగ్. 
He does not eat breakfast every morning.అతను ప్రతిరోజూ ఉదయం అల్పాహారం  తినడు.
Does he eat breakfast every morning?అతను ప్రతి ఉదయం అల్పాహారం తింటాడా?
Does he not eat breakfast every morning?అతను ప్రతి ఉదయం అల్పాహారం తినడా?
2.She reads novels in her free time.ఖాళీ సమయాల్లో ఆమె నవలలు చదువుతుంది.
షీ రీడ్స్ నవెల్స్ ఇన్ హర్ ఫ్రీ టైమ్. 
She does not read novels in her free time.ఖాళీ సమయాల్లో ఆమె నవలలు చదవదు.
Does she read novels in her free time?ఆమె ఖాళీ సమయంలో నవలలు చదువుతుందా?
Does she not read novels in her free time?ఆమె ఖాళీ సమయంలో నవలలు చదవదా?
3.Ramesh visits the garden often.రమేష్ తరచూ తోటను సందర్శిస్తాడు.
రమేష్ విజిట్స్ ది గార్డెన్ ఆఫెన్. 
Ramesh does not visit the garden often.రమేష్ తరచూ తోటను  సందర్శించడు
Does Ramesh visit the garden often?రమేష్ తరచూ తోటను   సందర్శిస్తాడా.?
Does Ramesh not visit the garden often?రమేష్ తరచూ తోటను  సందర్శించడా.?
4.That cooks faster than expected.ఇది ఊహించిన దాని కంటే వేగంగా ఉడికిస్తుంది.
దట్ కుక్స్ ఫాస్టర్ దాన్ ఎక్స్‌పెక్టెడ్. 
That does not cook faster than expected.ఇది ఊహించిన దాని కంటే వేగంగా ఉడికించదు.
Does that cook faster than expected?ఇది ఊహించిన దాని కంటే వేగంగా  ఉడికిస్తుందా?.
Does that not cook faster than expected?ఇది ఊహించిన దాని కంటే వేగంగా ఉడికించదా.?
5.He travels to work by bus.అతను బస్సులో పనికి వెళ్తాడు.(అతను పనికి బస్సులో ప్రయాణిస్తాడు)
హీ ట్రావెల్స్ టు వర్క్ బై బస్. 
He does not travel to work by bus.అతను బస్సులో పనికి వెళ్లడు.
Does he travel to work by bus?అతను బస్సులో పనికి వెళ్తాడా?
Does he not travel to work by bus?అతను బస్సులో పనికి వెళ్లడా?
6.She writes articles for a magazine.ఆమె ఒక మ్యాగజైన్ కోసం వ్యాసాలు రాస్తుంది
షీ రైట్స్ ఆర్టికల్స్ ఫర్ ఎ మాగజైన్. 
She does not write articles for a magazine.ఆమె ఒక మ్యాగజైన్ కోసం వ్యాసాలు రాయదు.
Does she write articles for a magazine?ఆమె ఒక మ్యాగజైన్ కోసం వ్యాసాలు రాస్తుందా?
Does she not write articles for a magazine?ఆమె ఒక మ్యాగజైన్ కోసం వ్యాసాలు రాయదా?
7.It acts quickly in emergencies.ఇది అత్యవసర పరిస్థితుల్లో త్వరగా పనిచేస్తుంది.
ఇట్ యాక్ట్స్ క్విక్‌లీ ఇన్ ఎమర్జెన్సీస్.
 
It does not act quickly in emergencies.ఇది అత్యవసర పరిస్థితుల్లో త్వరగా పని చేయదు.
Does it act quickly in emergencies?అత్యవసర పరిస్థితుల్లో ఇది త్వరగా పనిచేస్తుందా?
Does it not act quickly in emergencies?అత్యవసర పరిస్థితుల్లో ఇది త్వరగా పని చేయదా?
8.That agrees with the proposal.అది ప్రతిపాదనతో ఏకీభవిస్తుంది.
దట్ అగ్రీజ్ విత్ ది ప్రపోజల్. 
That does not agree with the proposal.అది ప్రతిపాదనతో ఏకీభవించదు.
Does that agree with the proposal?అది ప్రతిపాదనతో ఏకీభవిస్తుందా.?
Does that not agree with the proposal?అది ప్రతిపాదనతో ఏకీభవించదా.?
9.He allows extra time for assignments.అతను అసైన్‌మెంట్‌ల కోసం అదనపు సమయాన్ని అనుమతిస్తాడు.
హీ అలౌస్ ఎక్స్‌ట్రా టైమ్ ఫర్ అసైన్‌మెంట్స్. 
He does not allow extra time for assignments.అతను అసైన్‌మెంట్‌ల కోసం అదనపు సమయాన్ని అనుమతించడు.
Does he allow extra time for assignments?అతను అసైన్‌మెంట్‌ల కోసం అదనపు సమయాన్ని అనుమతిస్తాడా?
Does he not allow extra time for assignments?అతను అసైన్‌మెంట్‌ల కోసం అదనపు సమయాన్ని అనుమతించడా?
10.Usha fails to understand the concept.ఉష భావనను అర్థం చేసుకోవడంలో విఫలమైంది.
ఉషా ఫెయిల్స్ టు అండర్‌స్టాండ్ ది కాన్సెప్ట్. 
Usha does not fail to understand the concept.ఉష కాన్సెప్ట్‌ని అర్థం చేసుకోవడంలో విఫలం కాలేదు.
Does Usha fail to understand the concept?ఉష భావనను అర్థం చేసుకోవడంలో విఫలమైందా?
Does Usha not fail to understand the concept?ఉష భావనను అర్థం చేసుకోవడంలో విఫలం కాలేదా?

Has:   

సింపుల్ ప్రెసెంట్ టెన్స్ లో He, She, It   సబ్జెక్ట్ గా వున్నప్పుడు. Has  ఎవిదంగా ఉపయోగిస్తారో  తెలుసు కుందాం : (Possessive sentences)

has=కలిగివుండు 

Possessive  అనగా కలిగి ఉండు అని అర్థం. Ownership అని కూడా అనవచ్చు.

అతనికి రెండు ఇల్లు ఉన్నాయి.  (అతను రెండు ఇళ్ళను కలిగి ఉన్నాడు)

అతనికి ఇద్దరు భార్యలు ఉన్నారు. (అతను  ఇద్దరు భార్యలను కలిగి ఉన్నాడు)

అతనికి ఈ రోజు మీటింగ్ ఉన్నది.  (అతను ఈరోజు మీటింగ్ ని కలిగి  ఉన్నాడు)

ఈ విధంగా సింపుల్ ప్రెసెంట్ టెన్స్ లోHe, SHe, It లకు కలిగి వుండు  అనే  అర్ధాన్ని తెలియజేయడానికి .‘Has’ అనే  సహాయక క్రియ ఉపయోగిస్తారు.

He, She, It   + Has + Object

క్రింది  పట్టిక లోని ఉదాహరణలు గమనించండి.

She has a car. (She does have a car). ఆమెకి ఒక కారు ఉన్నది. (Has= కలిగి ఉండుట)  ఆమెకి ఒక కారు ఉన్నది. అంటే  ఆమె ఒక కారు కలిగి ఉన్నది అని అర్థం.

 

Usha has two houses. (Usha does have two houses). ఉషాకి రెండు ఇళ్ళు ఉన్నాయి.

ఆమెకు కారు ఉన్నది, ఉషాకి రెండు ఇల్లు ఉన్నాయి అంటే అర్థం ఏమిటి నిన్న, నేడు, రేపు కూడా ఉన్నాయి అని అర్థం.

She has a car. ఈ వాక్యాన్ని She does have a car అని కూడా రాయవచ్చు ఎందుకని?

సాధారణంగా సింపుల్ ప్రెసెంట్ టెన్స్ లో He, she It లకు ‘Does’  అనే  సహాయక క్రియ ఉపయోగిస్తామని తెలుసుకున్నాము.పై వాక్యంలో Verb లేకపోయినప్పటికీ Has మెయిన్ వెర్బ్ గా వ్యవహరిస్తూ ఒక సంపూర్ణ వాక్యాన్ని నిర్మించింది. ఇక్కడ Has మెయిన్ వెర్బ్ స్థానంలోకి వెళ్లిపోయింది. గనుక ఈ సెంటెన్స్ లో సహాయక క్రియ లేదు. గ్రామర్ రూల్ ప్రకారం సింపుల్ ప్రెసెంట్ టెన్స్ లో He, She, It లు  సబ్జెక్టులు గా ఉన్నప్పుడు ఆ వాక్యం లో సహాయక క్రియ లేకపోతే  Does ఉపయోగించుకోవాలి. అప్పుడు She does has a car అని  రాయాలి.  కానీ ఈ విదంగా రాయడం కూడా తప్పు అవుతుంది.ఎందుకని?

Do,Does,Did  సహాయక్రియలు వాక్యంలో ఉన్నప్పుడు Verbs  మొదటి రూపంలోనే ఉండాలి.

Does  అనే  సహాయక క్రియ వచ్చినప్పుడు Has  దాని మొదటి రూపమైన  ‘have’  లోకి వెళ్ళిపోవాలి ?

అప్పుడు She has a car  ని She does have a car  (P) అని రాయాలి. నెగిటివ్ సెంటెన్స్ రాయటానికి ‘Does’ పక్కన not చేర్చాలి

She does not have a car (N) అవుతుంది.

ఈ రెండు వాక్యాలను ప్రశ్నా వాక్యాలుగా మార్చడానికి  Does ని  సబ్జెక్టు అయిన ‘She’  కి ముందు ఉంచాలి.

Does she have a car (I)

Does she not have a car (NI)

Sha has a car అను వాక్యానికి వ్యతిరేక వాక్యాన్ని She has no car అని కూడా  చెప్పవచ్చు కానీ ఈ పద్ధతిని ఎక్కువగా అనుసరించడం లేదు

క్రింది  టేబుల్ లో ఉన్న  ఉదాహరణలు కూడా గమనించండి

1.She has a new car.

(She does have a new car.)

ఆమెకు కొత్త కారు ఉంది. (ఆమె ఒక కొత్త కారును కలిగి ఉంది)
షీ హ్యాస్ ఎ న్యూ కార్. 
She does not have a new car.ఆమెకు కొత్త కారు లేదు.
Does she have a new car?ఆమెకు కొత్త కారు ఉందా?
Does she not have a new car?ఆమెకు కొత్త కారు లేదా?
2.He has a meeting at 10 AM.ఆయనకు ఉదయం 10 గంటలకు మీటింగ్ ఉంది.(ఆయన ఉదయం 10 గంటలకు మీటింగ్ కలిగి వున్నాడు)
హీ హ్యాస్ ఎ మీటింగ్ ఎట్ 10 ఏఎమ్. 
He does not have a meeting at 10 AM.ఆయనకు ఉదయం 10 గంటలకు మీటింగ్ లేదు.
Does he have a meeting at 10 AM?అతనికి ఉదయం 10 గంటలకు మీటింగ్ ఉందా?
Does he not have a meeting at 10 AM?అతనికి ఉదయం 10 గంటలకు మీటింగ్ లేదా?
3.The house has a big garden.ఇంట్లో పెద్ద తోట ఉంది. (ఆ ఇల్లు ఒక పెద్ద తోట కలిగి ఉన్నది)
ది హౌస్ హ్యాస్ ఎ బిగ్ గార్డెన్. 
The house does not have a big garden.ఇంట్లో పెద్ద గార్డెన్ లేదు.
Does the house have a big garden?ఇంట్లో పెద్ద తోట ఉందా?
Does the house not have a big garden?ఇంట్లో పెద్ద తోట లేదా?
4.My friend has a dog.నా స్నేహితుడికి ఒక కుక్క ఉంది.(నా స్నేహితుదు  ఒక కుక్కను  కలిగి వున్నాడు)
మై ఫ్రెండ్ హ్యాస్ ఎ డాగ్. 
My friend does not have a dog.నా స్నేహితుడికి కుక్క లేదు.
Does my friend have a dog?నా స్నేహితుడికి కుక్క ఉందా?
Does my friend not have a dog?నా స్నేహితుడికి కుక్క లేదా?
5.The book has a blue cover.పుస్తకానికి నీలం రంగు కవర్ ఉంది.(పుస్తకం  నీలం రంగు కవర్ కలిగి ఉంది)
ది బుక్ హ్యాస్ ఎ బ్లూ కవర్. 
The book does not have a blue cover.పుస్తకానికి నీలి రంగు కవర్ లేదు.
Does the book have a blue cover?పుస్తకానికి నీలి రంగు కవర్ ఉందా?
Does the book not have a blue cover?పుస్తకానికి నీలి రంగు కవర్ లేదా?
6. He has a bike. అతనికి ఒక బైకు ఉంది ( లేదా  అతను ఒక బైక్ ని కలిగి ఉన్నాడు)
హీ హ్యాస్ ఎ బైక్. 
He does not have a bike.అతనికి బైక్ లేదు.
Does he have a bike?అతనికి బైక్ ఉందా?
Does he not have a bike?అతనికి  బైక్ లేదా?
  
7. He has a small family. అతనికి చిన్న కుటుంబం ఉంది.( లేదా అతను ఒక చిన్న కుటుంబాన్ని కలిగి ఉన్నాడు )
హీ హ్యాస్ ఎ స్మాల్ ఫ్యామిలీ. 
He does not have a small family.అతనికి చిన్న కుటుంబం లేదు.
Does he have a small family?అతనికి చిన్న కుటుంబం ఉందా?
Does he not have a small family?అతనికి చిన్న కుటుంబం లేదా?
  
8. He has a good job. అతనికి మంచి ఉద్యోగం ఉంది.(లేదా అతను ఒక మంచి ఉద్యోగాన్ని కలిగి ఉన్నాడు)
హీ హ్యాస్ ఎ గుడ్ జాబ్. 
He does not have a good job.అతనికి మంచి ఉద్యోగం లేదు.
Does he have a good job?అతనికి మంచి ఉద్యోగం ఉందా?
Does he not have a good job?అతనికి మంచి ఉద్యోగం లేదా?
  
9. She has a blue bag. ఆమె దగ్గర నీలిరంగు బ్యాగ్ ఉంది. (ఆమె ఒక నీలి రంగు బ్యాగును కలిగి ఉంది)
షీ హ్యాస్ ఎ బ్లూ బ్యాగ్. 
She does not have a blue bag.ఆమె దగ్గర నీలిరంగు బ్యాగ్ లేదు.
Does she have a blue bag?ఆమె దగ్గర నీలిరంగు బ్యాగ్ ఉందా?
Does she not have a blue bag?ఆమె దగ్గర నీలిరంగు బ్యాగ్ లేదా?
  
10. She has a kind heart. ఆమెకు దయగల హృదయం ఉంది. (ఆమె ఒక దయగల హృదయాన్ని కలిగి ఉంది)
షీ హ్యాస్ ఎ కైండ్ హార్ట్. 
She does not have a kind heart.ఆమెకు దయగల హృదయం లేదు.
Does she have a kind heart?ఆమెకు దయగల హృదయం ఉందా?
Does she not have a kind heart?ఆమెకు దయగల హృదయం లేదా?
  
11. She has a new phone. ఆమెకు కొత్త ఫోన్ ఉంది. ( ఆమె ఒక కొత్త ఫోన్ కలిగి ఉంది)
షీ హ్యాస్ ఎ న్యూ ఫోన్. 
She does not have a new phone.ఆమె దగ్గర కొత్త ఫోన్ లేదు.
Does she have a new phone?ఆమె దగ్గర కొత్త ఫోన్ ఉందా?
Does she not have a new phone?ఆమె దగ్గర కొత్త ఫోన్ లేదా?
  
12. It has four legs. దీనికి నాలుగు కాళ్ళు ఉన్నాయి.( ఇది నాలుగు కాళ్ళను కలిగి ఉంది)
ఇట్ హ్యాస్ ఫోర్ లెగ్స్. 
It does not have four legs.దానికి నాలుగు కాళ్ళు లేవు.
Does it have four legs?దానికి నాలుగు కాళ్ళు ఉన్నాయా?
Does it not have four legs?దానికి నాలుగు కాళ్ళు లేవా?
  
13. It has a long tail. దీనికి పొడవాటి తోక ఉంటుంది.( ఇది ఒక పొడవాటి తోకను కలిగి ఉంది)
ఇట్ హ్యాస్ ఎ లాంగ్ టెయిల్. 
It does not have a long tail.దానికి పొడవైన తోక లేదు.
Does it have a long tail?దానికి పొడవైన తోక ఉందా?
Does it not have a long tail?దానికి పొడవైన తోక లేదా?
  
14. It has a red color.దీనికి ఎరుపు రంగు ఉంటుంది. (ఇది ఒక ఎరుపు రంగును కలిగి ఉంది)
ఇట్ హ్యాస్ ఎ రెడ్ కలర్. 
It does not have a red color.దీనికి ఎరుపు రంగు ఉండదు.
Does it have a red color?దానికి ఎరుపు రంగు ఉందా?
Does it not have a red color?దానికి ఎరుపు రంగు లేదా?
  
15. It has a small window. దీనికి ఒక చిన్న కిటికీ ఉంది.( ఇది ఒక చిన్న కిటికీ ని కలిగి ఉంది)
ఇట్ హ్యాస్ ఎ స్మాల్ విండో. 
It does not have a small window.దానికి చిన్న కిటికీ లేదు.
Does it have a small window?దానికి చిన్న కిటికీ ఉందా?
Does it not have a small window?దానికి చిన్న కిటికీ లేదా?

 

Is:

సింపుల్ ప్రెసెంట్ టెన్స్ లో He, She,It లకు  ‘ is’  అనే సహాయక క్రియను  ఉపయోగించి state sentences ని నిర్మించడం.

state = స్థితి 

Is= వున్నాడు, వున్నది. 

స్థితి  అంటే ఏమిటి?

రాము ఒక విద్యార్దిగా ఉన్నాడు   .(ప్రస్తుతం ఇది అతని స్థితి) .

రాజు దనవంతుడిగా ఉన్నాడు. ( ప్రస్తుతం అతని స్థితి అది)

మహేష్ శ్రద్ధగా చదివి లెక్చరర్ అయి ఉన్నాడు. (ప్రస్తుతం  మహేష్ స్థితి ఇది)

ఆమె సంతోషంగా ఉన్నది 

Simple present tense లో Third person singulars అయిన He, She, It, That లు ప్రస్తుతం ఏ స్థితిలో ఉన్నాయో తెలియజేయుటకు ‘is’ అనే సహాయక క్రియను ఉపయోగించి వాక్య నిర్మాణం చేస్తాము.

Example:   He is a lawyer (P)

Negative sentence గా చేయుటకు is  ప్రక్కన not వుంచాలి

He is not a lawyer (N)

పై రెండు వాక్యాలను ప్రశ్నా వాక్యాలుగా మార్చుటకు is ని సబ్జెక్టు అయిన He కి ముందు ఉంచితే సరిపోతుంది

Is he a lawyer (I)

Is he not a lawyer (NI)

క్రింది పట్టిక లోని ఉదాహరణలను కూడా చదవండి.

1.She is a doctor. (PS)ఆమె ఒక వైద్యురాలు. (ఆమె ఒక వైద్యురాలు అయి వున్నది )
షీ ఈస్ ఎ డాక్టర్. 
She is not a doctor. (NS)ఆమె వైద్యురాలు కాదు.
Is she a doctor? (IS)ఆమె వైద్యురాలా ?
Is she not a doctor? (NIS)ఆమె డాక్టర్ కాదా?
2.The sky is blue.ఆకాశం నీలంగా వున్నది .
ది స్కై ఈస్ బ్లూ. 
The sky is not blue.ఆకాశం నీలంగా లేదు.
Is the sky blue?ఆకాశం నీలంగా ఉందా?
Is the sky not blue?ఆకాశం నీలంగా లేదా?
3.He is very kind.అతను చాలా దయగలవాడు.(అతను చాలా దయగలవాడుగా వున్నాడు )
హీ ఈస్ వెరీ కైండ్. 
He is not very kind.అతను చాలా దయగలవాడు కాదు.
Is he very kind?అతను చాలా దయగలవాడా?
Is he not very kind?అతను చాలా దయగలవాడు కాదా?
4.The cake is delicious.కేక్ రుచికరముగా వున్నది .
ది కేక్ ఈస్ డిలీషస్. 
The cake is not delicious.కేక్ రుచికరముగా లేదు .
Is the cake delicious?కేక్ రుచికరముగా వుందా ?
Is the cake not delicious?కేక్  రుచికరముగా లేదా?
5.It is a sunny day.ఇది ఎండ రోజుగా వున్నది  .
ఇట్ ఈస్ ఎ సన్నీ డే. 
It is not a sunny day.ఇది ఎండ రోజు కాదు.
Is it a sunny day?ఇది ఎండ రోజునా?
Is it not a sunny day?ఇది ఎండ రోజు కాదా?
6.The room is spacious.గది విశాలంగా ఉన్నది .
ది రూమ్ ఈస్ స్పేషస్. 
The room is not spacious.గది విశాలంగా లేదు.
Is the room spacious?గది విశాలంగా ఉందా?
Is the room not spacious?గది విశాలంగా లేదా?
7.The car is new.కారు కొత్తది గా వున్నది .
ది కార్ ఈస్ న్యూ. 
The car is not new.కారు కొత్తది కాదు.
Is the car new?కారు కొత్తదా?
Is the car not new?కారు కొత్తది కాదా?
8.This book is fascinating.ఈ పుస్తకం మనోహరమైనది గా వున్నది .
దిస్ బుక్ ఈస్ ఫాసినేటింగ్. 
This book is not fascinating.ఈ పుస్తకం మనోహరమైనది కాదు.
Is this book fascinating?ఈ పుస్తకం మనోహరంగా ఉందా?
Is this book not fascinating?ఈ పుస్తకం మనోహరమైనది కాదా?
9.The water is cold.నీరు చల్లగా ఉన్నది .
ది వాటర్ ఈస్ కోల్డ్. 
The water is not cold.నీరు చల్లగా లేదు.
Is the water cold?నీరు చల్లగా ఉందా?
Is the water not cold?నీరు చల్లగా లేదా?
10.The cat is asleep.పిల్లి నిద్రలో ఉన్నది 
ది క్యాట్ ఈస్ అస్లీప్. 
The cat is not asleep. పిల్లి నిద్రలో లేదు
Is the cat asleep? పిల్లి నిద్రలో ఉందా?
Is the cat not asleep? పిల్లి నిద్రలో లేదా?

ఇంతవరకు మీరు సింపుల్ ప్రెసెంట్ టెన్స్ ను He, She, It, I, We, You, They సబ్జెక్టులకు సహాయక క్రియాలను వుపయోగించి Action sentences, Possessive sentences and  State sentences రూపొందించడం తెలుసుకున్నారు. 

ఇకనుండి సింపుల్ ప్రెసెంట్ టెన్స్ ని ఏ ఏ సందర్భాలలో ఉపయోగిస్తారో  సంపూర్ణంగా తెలుసుకుందాము.