9.Historical present: (చారిత్రక వర్తమానం)   

Simple present tense is used to create an immediate sense of things that have happened.

జరిగిపోయిన విషయాల యొక్క తక్షణ భావాన్ని సృష్టించడానికి సింపుల్ ప్రెసెంట్ టెన్స్ ని ఉపయోగిస్తారు. మన మాటలు వింటున్న వ్యక్తి యొక్క ధ్యాస మన వైపు తిప్పుకోవడానికి మరియు చెప్పే విషయాలను ఆకర్షణీయంగా వర్ణించి చెప్పడానికి, జరిగిపోయిన ఈ విషయాలు కళ్ళముందు  జరుగుతున్నట్లుగానే చెప్పడానికి ఈ సింపుల్ ప్రెసెంట్ టెన్స్ లో మాట్లాడతారు.  ఒక రకంగా చెప్పాలంటే ఇవన్నీ జరిగిపోయిన సంఘటనలు. సింపుల్ ప్రెసెంట్ టెన్స్ ని  చారిత్రక వర్తమానంగా (జరిగిపోయిన విషయాలను ఈరోజు తెలియజేయడం) కూడా కొన్ని సందర్భాలలో ఉపయోగిస్తారు.

మన మాటలు వింటున్న వ్యక్తికి, గతంలో జరిగిపోయిన విషయాలను ఇప్పుడే జరుగుతున్నట్లుగా, కళ్ళకు కట్టినట్లు, ఆకర్షణీయంగా నటించి చూపించడానికి సింపుల్ ప్రెసెంట్ టెన్స్ లో తెలియజేస్తారు. ఆ  జరిగిపోయిన సంఘటనలు ముఖ్యమైనవి అని అనుకున్నప్పుడు ఇలా చేస్తారు లేకుంటే జరిగిపోయిన విషయాలను పాస్ట్ టెన్స్ లోనే చెప్పవలసి ఉంటుంది.

న్యూస్ పేపర్ లో కూడా జరిగిపోయిన వార్తలను జర్నలిస్ట్  కొన్ని సందర్భాలలో సింపుల్ ప్రెసెంట్ టెన్స్ లో తెలియజేస్తారు. ఆ వార్త ముఖ్యమైనది అయినప్పుడు దాని యొక్క ప్రాముఖ్యత నొక్కి చెప్పడానికి, బలంగా చెప్పడానికి సింపుల్ ప్రెసెంట్ టెన్స్ పద్ధతిని ని ఉపయోగిస్తారు.

Example:

 

1) Mahatma Gandhi leads the Dandi March.1) మహాత్మా గాంధీ దండి మార్చ్‌కు నాయకత్వం వహించారు.
మహాత్మా గాంధీ లీడ్స్ ద డాండీ మార్చ్. 
Mahatma Gandhi does not lead the Dandi March.దండి మార్చ్‌కు మహాత్మా గాంధీ నాయకత్వం వహించలేదు.
Does Mahatma Gandhi lead the Dandi March?దండి మార్చ్‌కు మహాత్మా గాంధీ నాయకత్వం వహించారా?
Does not Mahatma Gandhi lead the Dandi March?దండి మార్చ్‌కు మహాత్మా గాంధీ నాయకత్వం వహించలేదా?
  
2) Akbar expands the Mughal Empire.2) అక్బర్ మొఘల్ సామ్రాజ్యాన్ని విస్తరించాడు.
అక్బర్ ఎక్స్‌పాండ్స్ ద ముగల్ ఎంపైర్. 
Akbar does not expand the Mughal Empire.అక్బర్ మొఘల్ సామ్రాజ్యాన్ని విస్తరించలేదు.
Does Akbar expand the Mughal Empire?అక్బర్ మొఘల్ సామ్రాజ్యాన్ని విస్తరించాడా?
Does not Akbar expand the Mughal Empire?అక్బర్ మొఘల్ సామ్రాజ్యాన్ని విస్తరించలేదా?
  
3) The British introduce new laws in India.3) బ్రిటిష్ వారు భారతదేశంలో కొత్త చట్టాలను ప్రవేశపెట్టారు.
బ్రిటిష్ ఇంట్రోడ్యూస్ న్యూ లాస్ ఇన్ ఇండియా.
 
The British do not introduce new laws in India.బ్రిటిష్ వారు భారతదేశంలో కొత్త చట్టాలను ప్రవేశపెట్టలేదు.
Do the British introduce new laws in India?భారతదేశంలో బ్రిటిష్ వారు కొత్త చట్టాలను ప్రవేశపెట్టారా?
Do not the British introduce new laws in India?బ్రిటిష్ వారు భారతదేశంలో కొత్త చట్టాలను ప్రవేశపెట్టలేదా?
  
4) Alexander invades India in 326 BC.4) అలెగ్జాండర్ 326 BC లో భారతదేశంపై దండెత్తాడు.
అలెక్సాండర్ ఇన్వెడ్స్  ఇండియా ఇన్ 326 బీసీ. 
Alexander does not invade India in 326 BC.అలెగ్జాండర్ 326 BC లో భారతదేశంపై 

 దండెత్తలేదు.

Does Alexander invade India in 326 BC?అలెగ్జాండర్ 326 BC లో భారతదేశంపై దండెత్తాడా?
Does not Alexander invade India in 326 BC?అలెగ్జాండర్ 326 BC లో భారతదేశంపై దండెత్తలేదా?
  
5) Ashoka follows Buddhism after the Kalinga war.5) కళింగ యుద్ధం తర్వాత అశోకుడు బౌద్ధమతాన్ని అనుసరించాడు.
అశోక ఫాలోస్ బుద్ధిజం ఆఫ్టర్ ద కలింగా వార్. 
Ashoka does not follow Buddhism after the Kalinga war.కళింగ యుద్ధం తర్వాత అశోకుడు బౌద్ధమతాన్ని అనుసరించలేదు.
Does Ashoka follow Buddhism after the Kalinga war?కళింగ యుద్ధం తర్వాత అశోకుడు బౌద్ధమతాన్ని అనుసరించాడా?
Does not Ashoka follow Buddhism after the Kalinga war?కళింగ యుద్ధం తర్వాత అశోకుడు బౌద్ధమతాన్ని అనుసరించలేదా?
  
6) Babur establishes the Mughal rule in India.6) బాబర్ భారతదేశంలో మొఘల్ పాలనను స్థాపించాడు.
బాబర్ ఎస్టాబ్లిషెస్ ద ముగల్ రూల్ ఇన్ ఇండియా.
 
Babur does not establish the Mughal rule in India.బాబర్ భారతదేశంలో మొఘల్ పాలనను స్థాపించలేదు.
Does Babur establish the Mughal rule in India?బాబర్ భారతదేశంలో మొఘల్ పాలనను స్థాపించాడా?
Does not Babur establish the Mughal rule in India?బాబర్ భారతదేశంలో మొఘల్ పాలనను స్థాపించలేదా? 
  
7) Raja Raja Chola builds the Brihadeeswara Temple.7) రాజ రాజ చోళుడు బృహదీశ్వరాలయాన్ని నిర్మించాడు.
రాజ రాజ చోళ బిల్డ్స్ ద బృహదீశ్వర టెంపుల్.
 
Raja Raja Chola does not build the Brihadeeswara Temple.రాజ రాజ చోళుడు బృహదీశ్వర ఆలయాన్ని నిర్మించలేదు.
Does Raja Raja Chola build the Brihadeeswara Temple?రాజ రాజ చోళుడు బృహదీశ్వర ఆలయాన్ని నిర్మించాడా?
Does not Raja Raja Chola build the Brihadeeswara Temple?రాజ రాజ చోళుడు బృహదీశ్వర ఆలయాన్ని నిర్మించలేదా?
  
8) The French support the American Revolution.8) ఫ్రెంచ్ వారు అమెరికన్ విప్లవానికి మద్దతు ఇచ్చారు.
ఫ్రెంచ్ సపోర్ట్ ద అమెరికన్ రివల్యూషన్.
 
The French do not support the American Revolution.ఫ్రెంచ్ వారు అమెరికన్ విప్లవానికి మద్దతు ఇవ్వలేదు
Do the French support the American Revolution?ఫ్రెంచ్ వారు అమెరికన్ విప్లవానికి మద్దతు ఇచ్చారా?
Do not the French support the American Revolution?ఫ్రెంచ్ వారు అమెరికన్ విప్లవానికి మద్దతు ఇవ్వలేదా?
  
9) Columbus discovers America in 1492.9) కొలంబస్ 1492 లో అమెరికాను కనుగొన్నాడు.
కొలంబస్ డిస్కవర్స్ అమెరికా ఇన్ 1492.
 
Columbus does not discover America in 1492.కొలంబస్ 1492 లో అమెరికాను కనుగొనలేదు.
Does Columbus discover America in 1492?కొలంబస్ 1492 లో అమెరికాను కనుగొన్నాడా?
Does not Columbus discover America in 1492?కొలంబస్ 1492 లో అమెరికాను కనుగొనలేదా?
  
10) Vasco da Gama reaches India by sea route.10) వాస్కోడిగామా సముద్ర మార్గంలో భారతదేశానికి చేరుకున్నాడు
వాస్కో డా గామా రీచెస్ ఇండియా బై సీ రూట్.
 
Vasco da Gama does not reach India by sea route.వాస్కోడగామా సముద్ర మార్గంలో భారతదేశానికి చేరుకోలేదు.
Does Vasco da Gama reach India by sea route?వాస్కోడిగామా సముద్ర మార్గంలో భారతదేశానికి చేరుకున్నాడా?
Does not Vasco da Gama reach India by sea route?వాస్కోడిగామా సముద్ర మార్గంలో భారతదేశానికి చేరుకోలేదా?
  
11) The Romans build vast road networks.11) రోమన్లు విశాలమైన రోడ్ నెట్‌వర్క్‌లను నిర్మించారు.
రోమాన్స్ బిల్డ్ వ్యాస్ట్ రోడ్ నెట్‌వర్క్స్.
 
The Romans do not build vast road networks.రోమన్లు విశాలమైన రోడ్డు నెట్‌వర్క్‌లను నిర్మించలేదు.
Do the Romans build vast road networks?రోమన్లు విశాలమైన రోడ్డు నెట్‌వర్క్‌లను నిర్మించారా?
Do not the Romans build vast road networks?రోమన్లు విశాలమైన రోడ్డు నెట్‌వర్క్‌లను నిర్మించలేదా?
  
12) Napoleon rules France with strong authority.12) నెపోలియన్ బలమైన అధికారంతో ఫ్రాన్స్‌ను పాలించాడు.
నపోలియన్ రూల్స్ ఫ్రాన్స్ విత్  స్ట్రాంగ్ ఆథారిటీ.
 
Napoleon does not rule France with strong authority.నెపోలియన్ బలమైన అధికారంతో ఫ్రాన్స్‌ను పాలించలేదు.
Does Napoleon rule France with strong authority?నెపోలియన్ బలమైన అధికారంతో ఫ్రాన్స్‌ను పాలించాడా?
Does not Napoleon rule France with strong authority?నెపోలియన్ బలమైన అధికారంతో ఫ్రాన్స్‌ను పాలించలేదా?
  
13) The Mughals construct grand monuments.13) మొఘలులు గొప్ప స్మారక చిహ్నాలను నిర్మించారు.
ముగల్స్ కన్‌స్ట్రక్ట్ గ్రాండ్ మోన్యుమెంట్స్.
 
The Mughals do not construct grand monuments.మొఘలులు గొప్ప స్మారక చిహ్నాలను నిర్మించలేదు.
Do the Mughals construct grand monuments?మొఘలులు గొప్ప స్మారక చిహ్నాలను నిర్మించారా?
Do not the Mughals construct grand monuments?మొఘలులు గొప్ప స్మారక చిహ్నాలను నిర్మించలేదా?
  
14) The British collect heavy taxes from farmers.14) బ్రిటిష్ వారు రైతుల నుండి భారీ పన్నులు వసూలు చేశారు.
ద బ్రిటిష్ కలెక్ట్ హెవీ టాక్సెస్ ఫ్రం ఫార్మర్స్.
 
The British do not collect heavy taxes from farmers.బ్రిటిష్ వారు రైతుల నుండి భారీ పన్నులు వసూలు చేయలేదు.
Do the British collect heavy taxes from farmers?బ్రిటిష్ వారు రైతుల నుండి భారీ పన్నులు వసూలు చేశారా?
Do not the British collect heavy taxes from farmers?బ్రిటిష్ వారు రైతుల నుండి భారీ పన్నులు వసూలు చేయలేదా?
  
15) Subhash Chandra Bose forms the Indian National Army.15) సుభాష్ చంద్రబోస్ భారత జాతీయ సైన్యాన్ని స్థాపించారు.
సుభాష్ చంద్ర బోస్ ఫార్మ్స్ ద ఇండియన్ నేషనల్ ఆర్మీ.
 
Subhash Chandra Bose does not form the Indian National Army.సుభాష్ చంద్రబోస్ భారత జాతీయ సైన్యాన్ని స్థాపించలేదు
Does Subhash Chandra Bose form the Indian National Army?సుభాష్ చంద్రబోస్ భారత జాతీయ సైన్యాన్ని  స్థాపించారా?
Does not Subhash Chandra Bose form the Indian National Army?సుభాష్ చంద్రబోస్ భారత జాతీయ సైన్యాన్ని  స్థాపించలేదా?
  
16) The freedom movement inspires the people.16) స్వాతంత్ర్య ఉద్యమం ప్రజలకు  స్ఫూర్తినిచ్చింది.
ఫ్రీడమ్ మోవ్‌మెంట్ ఇన్స్పైర్స్ ద పీపుల్.
 
The freedom movement does not inspire the people.స్వాతంత్ర్య ఉద్యమం ప్రజలకు  స్ఫూర్తిని ఇవ్వలేదు.
Does the freedom movement inspire the people?స్వాతంత్ర్య ఉద్యమం ప్రజలకు  స్ఫూర్తిని ఇచ్చిందా?
Does not the freedom movement inspire the people?స్వాతంత్ర్య ఉద్యమం ప్రజలకు  స్ఫూర్తిని ఇవ్వలేదా?
  
17) The Industrial Revolution changes society.17) పారిశ్రామిక విప్లవం సమాజాన్ని  మార్చింది.
ఇండస్ట్రియల్ రివల్యూషన్ చెంజెస్ సొసైటీ.
 
The Industrial Revolution does not change society.పారిశ్రామిక విప్లవం సమాజాన్ని మార్చలేదు.
Does the Industrial Revolution change society?పారిశ్రామిక విప్లవం సమాజాన్ని  మార్చిందా?
Does not the Industrial Revolution change society?పారిశ్రామిక విప్లవం సమాజాన్ని మార్చలేదా?
  
18) World War II begins in 1939.18) రెండవ ప్రపంచ యుద్ధం 1939 లో  ప్రారంభమయ్యింది
వరల్డ్ వార్ II బిగిన్స్ ఇన్ 1939.
 
World War II does not begin in 1939.రెండవ ప్రపంచ యుద్ధం 1939 లో  ప్రారంభం కాలేదు.
Does World War II begin in 1939?రెండవ ప్రపంచ యుద్ధం 1939 లో  ప్రారంభం అయ్యిందా?
Does not World War II begin in 1939?రెండవ ప్రపంచ యుద్ధం 1939 లో  ప్రారంభం కాలేదా?
  
19) India gains independence in 1947.19) భారతదేశం 1947 లో స్వాతంత్ర్యం పొందింది.
ఇండియా గెయిన్స్ ఇండిపెండెన్స్ ఇన్ 1947.
 
India does not gain independence in 1947.భారతదేశం 1947 లో స్వాతంత్ర్యం పొందలేదు
Does India gain independence in 1947?భారతదేశం 1947 లో స్వాతంత్ర్యం పొందిందా.?
Does not India gain independence in 1947?భారతదేశానికి 1947 లో స్వాతంత్ర్యం ? పొందలేదా?
  
20) The Constitution of India comes into force in 1950.20) భారత రాజ్యాంగం 1950 లో అమల్లోకి వచ్చింది.
కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా కమ్స్ ఇంటు ఫోర్స్ ఇన్ 1950.
 
The Constitution of India does not come into force in 1950.భారత రాజ్యాంగం 1950 లో అమలులోకి రాలేదు.
Does the Constitution of India come into force in 1950?భారత రాజ్యాంగం 1950 లో అమల్లోకి వచ్చిందా?
Does not the Constitution of India come into force in 1950?భారత రాజ్యాంగం 1950 లో అమల్లోకి రాలేదా?

వార్తాపత్రికలలో కూడా కొన్ని సందర్భాల్లో, కొన్ని వార్తలు తక్షణ భావాన్ని కలుగజేయడానికి మరియు ఆ వార్తలు యొక్క ప్రాధాన్యతను బలముగా నొక్కి చెప్పడానికి కూడా జరిగిపోయిన వార్తలను సింపుల్ ప్రెసెంట్ టెన్స్ లో తెలియజేస్తారు.  క్రింది పట్టికలోని కొన్ని ఉదాహరణలు గమనించండి.ఈ పనులు సింపుల్ ప్రెసెంట్ టెన్స్ లో తెలియజేస్తున్నప్పటికీ వాటి అర్థం జరిగిపోయినట్లుగానే మనం అనుకోవాలి.

 

The Prime minister signs a new trade agreement with Japan.ప్రధాన మంత్రి జపాన్‌తో కొత్త వాణిజ్య ఒప్పందంపై సంతకాలు చేశాడు
ప్రైమ్ మినిస్టర్ సైన్స్  న్యూ ట్రేడ్ అగ్రిమెంట్ విత్ జపాన్. 
Fire destroys historic buildings in the Hyderabad Charminar area.హైదరాబాద్ చార్మినార్ ప్రాంతంలోని చారిత్రక కట్టడాలను అగ్ని నాశనం చేసింది.
ఫైర్ డిస్ట్రాయ్స్ హిస్టారిక్ బిల్డింగ్స్ ఇన్ హైద్రాబాద్ చార్మినార్ ఏరియా.
 
Police arrest suspect in bank robbery.బ్యాంకు చోరీకి పాల్పడిన నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
పోలీస్ అరెస్ట్ సస్పెక్ట్ ఇన్ బ్యాంక్ రాబరీ.
 
Airline cancels flights due to severe weather conditions.తీవ్రమైన వాతావరణ పరిస్థితుల కారణంగా విమానయాన సంస్థ విమానాలను రద్దు చేసింది.
ఎయిర్‌లైన్ క్యాన్సెల్స్ ఫ్లైట్స్ డ్యూ టు సీవియర్ వెదర్ కండిషన్స్. 
Chief Minister declares state of emergency after severe flooding.భారీ వరదల నేపథ్యంలో ముఖ్యమంత్రి అత్యవసర పరిస్థితిని ప్రకటించారు.
చీఫ్ మినిస్టర్ డిక్లేర్స్ స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీ ఆఫ్టర్ సీవియర్ ఫ్లడింగ్. 
Actor wins award for outstanding performance.అత్యద్భుతమైన నటనకు గాను నటుడు అవార్డు గెలుచుకున్నాడు.
యాక్టర్ విన్స్  అవార్డ్ ఫర్ ఔట్‌స్టాండింగ్ పర్‌ఫార్మెన్స్. 
Government imposes new restrictions to combat rising inflation.ప్రభుత్వం పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కోవడానికి కొత్త పరిమితులను విధించింది.
గవర్నమెంట్ ఇంపోసెస్ న్యూ రిస్ట్రిక్షన్స్ టు కాంబాట్ రైజింగ్ ఇన్ఫ్లేషన్. 
Scientists discover new species in the Amazon rainforest.అమెజాన్ రెయిన్‌ఫారెస్ట్‌లో శాస్త్రవేత్తలు కొత్త జాతులను కనుగొన్నారు.
సైంటిస్ట్స్ డిస్కవర్ న్యూ స్పీసిస్ ఇన్ అమెజాన్ రేన్‌ఫారెస్ట్. 
University introduces a new scholarship program for underprivileged students.విశ్వవిద్యాలయం నిరుపేద విద్యార్థుల కోసం కొత్త స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్‌ను పరిచయం చేసింది.
యూనివర్సిటీ ఇంట్రొడ్యూసెస్ ఎ న్యూ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్ ఫర్ అండర్ప్రివిలేజ్డ్ స్టూడెంట్స్. 
The local team wins the Championship in the final match.ఫైనల్ మ్యాచ్‌లో స్థానిక జట్టు ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకుంది.
లోకల్ టీమ్ విన్స్ ద  చాంపియన్‌షిప్ ఇన్ ద ఫైనల్ మ్యాచ్. 

 

మనం చూసి వచ్చిన ఒక సినిమాని ఇతరులకు వివరించి చెప్పడానికి కూడా సింపుల్ ప్రెసెంట్ టెన్స్ ను ఉపయోగిస్తారు. ఈ సినిమాని ఆల్రెడీ చూసాము. సన్నివేశం జరిగిపోయింది. అయినా దానిని సింపుల్ ప్రెసెంట్ టెన్స్ లో వివరిస్తారు. ఫాస్ట్ టెన్స్ చెప్పాల్సిన అవసరం లేదు.  అంటే ఇక్కడ . సినిమాని కళ్ళకు కట్టినట్లుగా  తక్షణ భావం కలగజేయడానికి  ఒక కథ చెప్పినట్లుగా మనం చెబుతున్నాం.

Heroine supports hero in every situation.హీరోయిన్ ప్రతి పరిస్థితిలోనూ హీరోకి మద్దతు ఇస్తుంది.
హీరోయిన్ సపోర్ట్స్ హీరో ఇన్ ఎవ్రీ సిచ్యువేషన్.
Hero fights against injustice.హీరో అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడుతాడు.
హీరో ఫైట్స్ అగైన్‌స్ట్ ఇన్జస్టిస్.
Story takes an emotional turn.కథ భావోద్వేగ మలుపు తీసుకుంటుంది.
స్టోరి టేక్స్ అ ఎమోషనల్ టర్న్.
Hero learns an important lesson.హీరో ఒక ముఖ్యమైన పాఠం నేర్చుకుంటాడు.
హీరో లర్న్స్ అన ఇంపార్టెంట్ లెసన్.
Villain plans a big attack.విలన్ పెద్ద దాడిని ప్లాన్ చేస్తాడు.
విల్లన్ ప్లాన్స్ ఎ బిగ్ అటాక్.
Hero saves innocent people.హీరో అమాయక ప్రజలను రక్షిస్తాడు.
హీరో సేవ్స్ ఇనోసెంట్ పీపుల్.
Police search for a criminal.పోలీసులు నేరస్థుడి కోసం వెతుకుతారు.
పోలీస్ సర్చ్ ఫర్ ఎ క్రిమినల్.
Hero defeats villain bravely.హీరో ధైర్యంగా విలన్‌ను ఓడించాడు.
హీరో డిఫీట్స్ విల్లన్ బ్రేవ్లీ.
Peace returns to village.గ్రామానికి శాంతి తిరిగి వస్తుంది.
పీస్ రిటర్న్స్ టు విలేజ్.
Family reunites happily.కుటుంబం సంతోషంగా తిరిగి కలుస్తుంది.
ఫ్యామిలీ రీయూనిట్స్ హ్యాపిలీ.
Story shows value of love.కథ ప్రేమ విలువను చూపిస్తుంది.

స్టోరి షోస్ వ్యాల్యూ ఆఫ్ లవ్.

Movie highlights social issues.సినిమా సామాజిక సమస్యలను హైలైట్ చేస్తుంది.
మూవీ హైలైట్స్ సోషియల్ ఇష్యూస్.
Climax gives a strong message.క్లైమాక్స్ బలమైన సందేశాన్ని ఇస్తుంది.
క్లైమాక్స్ గివ్స్ ఎ స్ట్రాంగ్ మెసేజ్
Audience enjoys movie.ప్రేక్షకులు సినిమాను ఆస్వాదించారు.
ఆడియెన్స్ ఎంజాయ్‌స మూవీ.
Film ends on a happy note.సినిమా సంతోషంగా ముగుస్తుంది.
ఫిల్మ్ ఎండ్స్ ఆన్ ఎ హ్యాపీ నోట్.