Present continuous tense 

The present continuous tense is used in several cases: 

Main Meaing: ఒక పని ఎప్పుడు ప్రారంభమైందో మనకి అనవసరం ఎప్పుడు ముగుస్తుందో మనకు అనవసరం కానీ ప్రస్తుతానికి కంటిన్యూషన్ గా ఆగకుండా,మనం చూస్తువున్నప్పుడు  జరుగుతూ ఉంటే దాన్ని ఈ Present continuous tense లో తెలియజేస్తారు.

ప్రదానమైన అర్దం ఇదే అని గుర్తు పెట్టుకోండి  కానీ present continuous tense వివిద సందర్బాలలో ఎలా ఉపయోగిస్తారో క్రింద వివరించాము

 

Present continous tense లోఅన్ని సింగులర్ సబ్జెక్టులకు మరియు ఫ్లూరల్ సబ్జెక్టులకు v4  (ing) కామన్ గా ఉపయోగిస్తారు

v1 + ing = v4 అని కూడా అంటారు.

Examples:

go+ing= going

Come+ing= Coming

Run+ing= Running

 

ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ లో సబ్జెక్ట్  “I” ఉన్నప్పుడు am అనే  సహాయక క్రియను ఉపయోగించి v4 తో సెంటెన్స్ నిర్మాణం  చేస్తారు

I + am + v4  + object.

ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ లో సబ్జెక్ట్  “ He, She It , That ” ఉన్నప్పుడు “is”  అనే  సహాయక క్రియను ఉపయోగించి v4 తో సెంటెన్స్ నిర్మాణం  చేస్తారు

He, She, It   + is + v4+ Object

ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ లో సబ్జెక్ట్  “ we, you , they ” ఉన్నప్పుడు “are”  అనే  సహాయక క్రియను ఉపయోగించి v4 తో సెంటెన్స్ నిర్మాణం  చేస్తారు

We, You, They  + are + v4 + Object

ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ లో వాక్యాలను వ్యతిరేక వాక్యాలుగా మార్చడానికి am, is,are  పక్కన Not  చేర్చాలి.

Example:

She is reading a book right now. (PS) (ఆమె ప్రస్తుతం పుస్తకం చదువుతూ ఉంది  )

పై వాక్యమును నెగిటివ్ సెంటెన్స్ గా మార్చుటకు is ప్రక్కన Not చేర్చాలి.

She is not reading a book right now (NS)

పాజిటివ్ సెంటెన్స్ మరియు నెగటివ్ సెంటెన్స్ రెండింటినీ ప్రశ్న వాక్యాలుగా మార్చుటకు సహాయక క్రియ అయిన is ని సబ్జెక్ట్ అయిన she కి ముందు ఉంచాలి.

Is she reading a book right now. (IS)

Is she not reading a book right now (NIS) is not = isn’t   (Isn’t she reading a book right now అని కూడా చదవవచ్చు.)