Present Perfect Continuous-6

6. Unfinished  Actions:       

To discuss actions that are incomplete but have been happening over a period of time.

కొన్ని పనులను చేస్తూ ఉన్నప్పటికీ కూడా అవి పూర్తి కావు ఇంకా కొనసాగుతూనే ఉంటాయి, ఇటువంటి సందర్భాలలో కూడా ఈ Present perfect continuous tense ని ఉపయోగిస్తారు. ఈ పాయింట్ కూడా పైన చెప్పిన పాయింట్లు వలె ఉంటుంది పెద్ద తేడా ఉండదు.

Examples:

1.We have been planning our vacation for months. మేము మా సెలవులను నెలల తరబడి ప్లాన్ చేస్తూనే ఉన్నాము.
2.I have been writing my research paper, but I haven’t finished it yet. నేను నా పరిశోధనా పత్రాన్ని  రాస్తూనే ఉన్నాను, కానీ నేను ఇంకా పూర్తి చేయలేదు.
3.She has been decorating her home, and there are still some rooms left to do. ఆమె తన ఇంటిని  ఇంకా అలంకరిస్తూనే ఉంది,  మరియు ఇంకా కొన్ని గదులు మిగిలి ఉన్నాయి.
4.They have been working on their novel for years, and it’s not published yet. (passive voice) వారు వారి నవల కోసం ఇంకా సంవత్సరాలుగా పని చేస్తున్నారు మరియు ఇది ఇంకా ప్రచురించబడలేదు.
5.We have been planning the event, but we haven’t finalised all the details. మేము ఈవెంట్‌ని  ఇంకా ప్లాన్ చేస్తూనే ఉన్నాము, కానీ మేము అన్ని వివరాలను ఖరారు చేయలేదు.
6.He has been learning to play the guitar, and he still has more practice to do. అతను గిటార్ వాయించడం నేర్చుకుంటున్నాడు మరియు అతనికి ఇంకా ఎక్కువ అభ్యాసం ఉంది.
7.I have been working on the software update, but it’s not ready for release. నేను సాఫ్ట్‌వేర్ నవీకరణపై ఇంకా పని చేస్తున్నాను, కానీ అది విడుదలకు సిద్ధంగా లేదు.
8.She has been preparing for her exams, and she still has some topics to cover. ఆమె తన పరీక్షలకు సిద్ధమవుతోంది, ఇంకా ఆమె కవర్ చేయడానికి కొన్ని విషయాలు ఉన్నాయి.
9.They have been building their dream house, and it’s not completed yet. (passive voice) వారు తమ కలల ఇంటిని ఇంకా నిర్మిస్తున్నారు మరియు అది ఇంకా పూర్తి కాలేదు.
10.We have been researching the market, and we haven’t made a final decision yet. మేము మార్కెట్‌ను ఇంకా పరిశోధిస్తున్నాము మరియు మేము తుది నిర్ణయం తీసుకోలేదు.
11.He has been training for the marathon, and he’s not fully prepared yet. (passive voice) అతను మారథాన్ కోసం ఇంకా శిక్షణ పొందుతున్నాడు మరియు అతను ఇంకా పూర్తిగా సిద్ధం కాలేదు.