2.Parallel Actions in the Future:
ఒకే సమయంలో జరగబోయే రెండు చర్యల గురించి మాట్లాడటానికి కూడా Future continuous tense ఉపయోగించబడుతుంది. అందులో ఒకటి ప్రజెంట్ కంటిన్యూస్ లో తెలియజేస్తున్నట్టు కనబడుతున్నప్పటికీ రెండు కూడా భవిష్యత్తు కాలానికి సంబంధించినవే.
Example:
1.While you are reading this, I will be working on my project. | మీరు దీన్ని చదువుతూ ఉండగా, నేను నా ప్రాజెక్టులో పని చేస్తూ ఉంటాను |
While you are reading this, I will not be working on my project. | మీరు దీన్ని చదువుతూ ఉండగా, నేను నా ప్రాజెక్టులో పని చేస్తూ ఉండను |
Will I be working on my project while you are reading this? | మీరు దీన్ని చదువుతూ ఉండగా, నేను నా ప్రాజెక్టులో పని చేస్తూ ఉంటానా? |
Will I not be working on my project while you are reading this? | మీరు దీన్ని చదువుతూ ఉండగా, నేను నా ప్రాజెక్టులో పని చేస్తూ ఉండనా? |
2.While you are reading your book, I will be cooking dinner. | మీరు మీ పుస్తకం చదువుతూ ఉండగా, నేను రాత్రి భోజనం వండుతూ ఉంటాను |
While you are reading your book, I will not be cooking dinner. | మీరు మీ పుస్తకం చదువుతూ ఉండగా, నేను రాత్రి భోజనం వండుతూ ఉండను |
Will I be cooking dinner while you are reading your book? | మీరు మీ పుస్తకం చదువుతూ ఉండగా, నేను రాత్రి భోజనం వండుతూ ఉంటానా.? |
Will I not be cooking dinner while you are reading your book? | మీరు మీ పుస్తకం చదువుతూ ఉండగా, నేను రాత్రి భోజనం వండుతూ ఉండను.? |
3.They will be watching a movie while we are attending the concert. | మేము కచేరీకి హాజరవుతూ ఉండగా, వారు సినిమా చూస్తూ ఉంటారు |
They will not be watching a movie while we are attending the concert. | మేము కచేరీకి హాజరవుతూ ఉండగా, వారు సినిమా చూస్తూ ఉండరు |
Will they be watching a movie while we are attending the concert? | మేము కచేరీకి హాజరవుతూ ఉండగా, వారు సినిమా చూస్తూ ఉంటారా ? |
Will they not be watching a movie while we are attending the concert? | మేము కచేరీకి హాజరవుతూ ఉండగా, వారు సినిమా చూస్తూ ఉండరా ? |
4.At 5 PM, she will be practicing yoga while he is taking a nap. | సాయంత్రం 5 గంటలకు, అతను నిద్రపోతూ ఉండగా ఆమె యోగా సాధన చేస్తూ ఉంటుంది. |
At 5 PM, she will not be practicing yoga while he is taking a nap. | సాయంత్రం 5 గంటలకు, అతను నిద్రపోతూ ఉండగా ఆమె యోగా సాధన చేస్తూ ఉండదు. |
Will she be practicing yoga at 5 PM while he is taking a nap? | సాయంత్రం 5 గంటలకు, అతను నిద్రపోతూ ఉండగా ఆమె యోగా సాధన చేస్తూ ఉంటుందా..? |
Will she not be practicing yoga at 5 PM while he is taking a nap? | సాయంత్రం 5 గంటలకు, అతను నిద్రపోతూ ఉండగా ఆమె యోగా సాధన చేస్తూ ఉండదా.? |
5.While you are shopping, I will be finishing my work. | మీరు షాపింగ్ చేస్తూ ఉండగా, నేను నా పనిని పూర్తి చేస్తూ ఉంటాను. |
While you are shopping, I will not be finishing my work. | మీరు షాపింగ్ చేస్తూ ఉండగా, నేను నా పనిని పూర్తి చేస్తూ ఉండను. |
Will I be finishing my work while you are shopping? | మీరు షాపింగ్ చేస్తూ ఉండగా, నేను నా పనిని పూర్తి చేస్తూ ఉంటానా .? |
Will I not be finishing my work while you are shopping? | మీరు షాపింగ్ చేస్తూ ఉండగా, నేను నా పనిని పూర్తి చేస్తూ ఉండనా.? |
6. Tomorrow evening, we will be decorating the house while they are setting up the music system. | రేపు సాయంత్రం వాళ్ళు మ్యూజిక్ సిస్టం ఏర్పాటు చేస్తుండగా, మేము ఇంటిని అలంకరిస్తూ ఉంటాము. |
Tomorrow evening, we will not be decorating the house while they are setting up the music system. | రేపు సాయంత్రం వాళ్ళు మ్యూజిక్ సిస్టం ఏర్పాటు చేస్తుండగా, మేము ఇంటిని అలంకరిస్తూ ఉండము. |
Will we be decorating the house tomorrow evening while they are setting up the music system? | రేపు సాయంత్రం వాళ్ళు మ్యూజిక్ సిస్టం ఏర్పాటు చేస్తుండగా, మేము ఇంటిని అలంకరిస్తూ ఉంటామా. ? |
Will we not be decorating the house tomorrow evening while they are setting up the music system? | రేపు సాయంత్రం వాళ్ళు మ్యూజిక్ సిస్టం ఏర్పాటు చేస్తుండగా, మేము ఇంటిని అలంకరిస్తూ ఉండమా.? |
7.While the kids are playing in the yard, we will be preparing dinner . | పిల్లలు పెరట్లో ఆడుకుంటూ ఉండగా, మేము రాత్రి భోజనం సిద్ధం చేస్తూ ఉంటాము. |
While the kids are playing in the yard, we will not be preparing dinner . | పిల్లలు పెరట్లో ఆడుకుంటూ ఉండగా, మేము రాత్రి భోజనం సిద్ధం చేస్తూ ఉండము |
Will we be preparing dinner while the kids are playing in the yard? | పిల్లలు పెరట్లో ఆడుకుంటూ ఉండగా, మేము రాత్రి భోజనం సిద్ధం చేస్తూ ఉంటామ.? |
Will we not be preparing dinner while the kids are playing in the yard? | పిల్లలు పెరట్లో ఆడుకుంటూ ఉండగా, మేము రాత్రి భోజనం సిద్ధం చేస్తూ ఉండమా.? |
8. At 8 PM, he will be studying for his exam while she is preparing for her presentation. | రాత్రి 8 గంటలకు, ఆమె తన ప్రజెంటేషన్‌కు సిద్ధపడుతూ ఉండగా అతను తన పరీక్ష కోసం చదువుతూ ఉంటాడు. |
At 8 PM, he will not be studying for his exam while she is preparing for her presentation. | రాత్రి 8 గంటలకు, ఆమె తన ప్రజెంటేషన్‌కు సిద్ధపడుతూ ఉండగా అతను తన పరీక్ష కోసం చదువుతూ ఉండడు. |
Will he be studying for his exam at 8 PM while she is preparing for her presentation? | రాత్రి 8 గంటలకు, ఆమె తన ప్రజెంటేషన్‌కు సిద్ధపడుతూ ఉండగా అతను తన పరీక్ష కోసం చదువుతూ ఉంటాడ.? |
Will he not be studying for his exam at 8 PM while she is preparing for her presentation? | రాత్రి 8 గంటలకు, ఆమె తన ప్రజెంటేషన్‌కు సిద్ధపడుతూ ఉండగా అతను తన పరీక్ష కోసం చదువుతూ ఉండడా.? |
9.While you are exercising at the gym, I will be running in the partk. | మీరు జిమ్‌లో వ్యాయామం చేస్తున్నప్పుడు, నేను పార్కులో పరిగెడుతూ ఉంటాను. |
While you are exercising at the gym, I will not be running in the partk. | మీరు జిమ్‌లో వ్యాయామం చేస్తున్నప్పుడు, నేను పార్కులో పరిగెడుతూ ఉండను. |
Will I be running in the partk. while you are exercising at the gym? | మీరు జిమ్‌లో వ్యాయామం చేస్తున్నప్పుడు, నేను పార్కులో పరిగెడుతూ ఉంటాన.? |
Will I not be running in the partk. while you are exercising at the gym? | మీరు జిమ్‌లో వ్యాయామం చేస్తున్నప్పుడు, నేను పార్కులో పరిగెడుతూ ఉండనా.? |
10.They will be driving to the beach while we are packing for the trip. | మేము ట్రిప్ కోసం ప్యాకింగ్ చేస్తూ ఉండగా వారు బీచ్‌కి డ్రైవింగ్ చేస్తూ ఉంటారు. |
They will not be driving to the beach while we are packing for the trip. | మేము ట్రిప్ కోసం ప్యాకింగ్ చేస్తూ ఉండగా వారు బీచ్‌కి డ్రైవింగ్ చేస్తూ ఉండరు. |
Will they be driving to the beach while we are packing for the trip? | మేము ట్రిప్ కోసం ప్యాకింగ్ చేస్తూ ఉండగా వారు బీచ్‌కి డ్రైవింగ్ చేస్తూ ఉంటారా.? |
Will they not be driving to the beach while we are packing for the trip? | మేము ట్రిప్ కోసం ప్యాకింగ్ చేస్తూ ఉండగా వారు బీచ్‌కి డ్రైవింగ్ చేస్తూ ఉండరా.? |
11.While you are attending the meeting, I will be drafting the report. | మీరు సమావేశానికి హాజరవుతూ ఉండగా, నేను నివేదికను రూపొందిస్తూ ఉంటాను. |
While you are attending the meeting, I will not be drafting the report. | మీరు సమావేశానికి హాజరవుతూ ఉండగా, నేను నివేదికను రూపొందిస్తూ ఉండను. |
Will I be drafting the report while you are attending the meeting? | మీరు సమావేశానికి హాజరవుతూ ఉండగా, నేను నివేదికను రూపొందిస్తూ ఉంటాన.? |
Will I not be drafting the report while you are attending the meeting? | మీరు సమావేశానికి హాజరవుతూ ఉండగా, నేను నివేదికను రూపొందిస్తూ ఉండనా.? |