Tenses Introduction
ఇంగ్లీష్ భాషకు Tenses పునాది లాంటివి. ఒక పని ఎప్పుడు జరుగుతుంది, పని ప్రస్తుతం కొనసాగుతూ ఉందా , పని పూర్తయిందా లేకుంటే పని భవిష్యత్తులో జరుగుతుందా లాంటి విషయాలను Tenses నేర్చుకోవడం ద్వారా మనం కరెక్ట్ గా చెప్పవచ్చు. ఇంగ్లీష్ గ్రామర్ కు టెన్సెస్ పునాది లాంటివి.
‘Tenses’ అనే పదం లాటిన్ పదమైనా ‘Tempus’ నుండి వచ్చింది. టెంపస్ అనగా కాలము అని అర్థం. కానీ భాషా శాస్త్రంలో (linguistics) Tenses అనేది పని యొక్క కాలాన్ని సూచించేదిగా ఉన్నది. కాలక్రమంలో లాటిన్ పదమైన ‘Tempus’ ఫ్రెంచ్ భాషలో ‘Tenses’ అనే ఆంగ్లపదంగా పరిణమించింది. ఒక పని వర్తమాన కాలమును సంబందించినదా, భూతకాలమునకు సంబంధించినదా లేదా భవిష్యత్తు కాలమునకు సంబంధించినద అని తెలియజేసే వాటిని Tenses అంటారు.
ఇంగ్లీష్ భాషలో 80% వరకు కేవలం టెన్స్ మీదనే మాట్లాడుతారు. ఇందులో కేవలం సింపుల్ ప్రెసెంట్ టెన్స్ మీద మాత్రమే 40% మాట్లాడతారు అంటే కేవలం simple present tense గురించి బాగా తెలుసుకుంటే 40% ఇంగ్లీష్ మీరు మాట్లాడవచ్చు, మిగిలిన Tenses అన్నీ కలిపి 40% ఉంటాయి. కాబట్టి టెన్సెస్ గురించి క్షుణ్ణంగా నేర్చుకుంటే 80% ఇంగ్లీష్ మనం నేర్చుకున్నట్లే. (spoken english to telugu)
టెన్సెస్ ని ప్రధానంగా మూడు రకాలుగా విభజిస్తారు
1.Present tense: ఇది ప్రస్తుతం జరుగుతున్న పనులు లేదా సాధారణ సత్యాలను గురించి తెలియజేస్తుంది. సాధారణ సత్యాలు అనగా నిన్న నేడు రేపు మార్పు లేకుండా మరలా మరలా రిపీటెడ్ గా. జరగడానికి అవకాశం ఉండే పనులు.
2.Past tense: గతంలో ఒక ప్రత్యేకమైన సమయంలో పూర్తి అయిన పనులను గురించి ఈ టెన్స్ తెలియజేస్తుంది.
3.Future tense:భవిష్యత్తులో జరగబోయే పనులను గురించి ఈ టెన్స్ తెలియజేస్తుంది.
మరల ప్రతి Tense ని నాలుగు రకాలుగా విభజించారు
1.Simple : ఇది కేవలం చర్య లేదా పని (Action) మీద మాత్రమే దృష్టి పెడుతుంది ఆ పని కొనసాగుతూ ఉందా లేదా పూర్తయిందా అనే విషయాలను పట్టించుకోదు.
2 .Continuous: ఒక సమయం దగ్గర ప్రారంభించబడిన పని కంటిన్యూగా ఆగకుండా జరుగుతున్నప్పుడు ఆ పని గురించి తెలియజేయడానికి ఈ Continuous Tens ఉపయోగిస్తారు.
3 .Perfect : ఒక నిర్దిష్టమైన సమయంలో పూర్తి చేయబడిన పనులను గురించి తెలియజేస్తుంది. ఆ పని ప్రస్తుతం పూర్తి చేయబడిందా, గతంలో పూర్తి చేయబడిందా, లేదా భవిష్యత్తులో పూర్తి చేయబడుతుందా అనే విషయాలను నొక్కి చెబుతుంది.
4 . Perfect Continuous : పైన మన వివరించుకున్నట్లుగా Continuous టెన్స్ అనేది ఆగకుండా కంటిన్యూగా కొనసాగుతూ ఉన్న పనులను గురించి వివరిస్తూ ఉంటే, Perfect continuous టెన్స్ అనేది కంటిన్యూగా జరుగుతున్న పనులు యొక్క స్వభావాన్ని మనకు తెలియజేస్తుంది. అనగా ఒక పని ఎప్పటి నుండి కొనసాగుతోంది, ఎప్పటినుండి ఎప్పటి వరకు కొనసాగుతూ ఉండింది, లాంటి విషయాలను మనకు తెలియజేస్తుంది.
మొత్తం టెన్సెస్ 12 రకాలు
- Present simple
- Present continuous
- Present perfect
- Present perfect continuous
- Past simple
- Past continuous
- Past perfect
- Past perfect continuous
- Future simple
- Future continuous
- Future perfect
- Future perfect continuous
Tenses నేర్చుకోవడానికి ముందు ‘verbs’ గురించి తెలుసుకోవాలి. verb అనగా పని లేదా క్రియ అని అర్థం. ప్రతిరోజు మనం మాట్లాడే ప్రతి మాటలో ఒక క్రియ కచ్చితంగా ఉంటుంది. వీటినిverbs అంటారు. వాక్య నిర్మాణంలో Verbs లేకుండా వాక్యాలను నిర్మించలేము.
ఒక సెంటెన్స్ లో ఉన్నటువంటి వ్యక్తి ఏ పని చేస్తున్నాడు, ఏ స్థితిలో ఉన్నాడు, ఏమి కలిగి ఉన్నాడు లాంటి విషయాలను verb మనకు వివరిస్తుంది.ఈ verbs ప్రధానంగా రెండు రకాలు.
1. Main verbs
2.Helping verbs (or) auxiliary verbs
1.Main verbs:
సబ్జెక్టు చేస్తున్న పనిని తెలియజేసే వాటిని Main verbs అంటారు. సెంటెన్స్ నిర్మించడానికి Main verbs వెన్నెముక లాంటివి.
2.Helping verbs (or) Auxiliary verbs (సహాయక క్రియలు) :
సెంటెన్సెస్ ని నిర్మించడంలో verbs కి సహాయం చేస్తూ ఉండటం వలన మరియు వాక్యంలో verbs లేనప్పుడు తామే మెయిన్ వెర్బ్ గా పని చేయడం వలన వీటిని సహాయక క్రియలు అన్నారు. Tense నిర్మించడంలో క్రింది పేర్కొన్న సహాయక క్రియలను ఉపయోగిస్తారు.
DO, DOES, DID, AM, IS, ARE, WAS, WERE, HAVE, HAS, HAD,
WILL, WOULD, SHALL, SHOULD, CAN, COULD, MAY, MIGHT, MUST, NEED TO, OUGHT TO, DARET TO, USED TO.
ఈ Auxiliary verbs ని తిరిగి రెండు రకాలుగా విభజించారు
అవి: 1.Primary auxiliary verbs 2. Modal verbs
Primary auxiliary verbs: DO, DOES, DID, AM, IS, ARE, WAS, WERE, HAVE, HAS, HAD, (Tenses రూపొందించడంలో ఇవి ప్రముఖ పాత్ర వహిస్తాయి.)
Modal verbs: సబ్జెక్టు యొక్క అవకాశాలు, అవసరాలు మరియు సామర్థ్యాలను గురించి తెలియజేయడానికి ఉపయోగపడతాయి. ఇవి మొత్తం 13
WILL, WOULD, SHALL, SHOULD, CAN, COULD, MAY, MIGHT, MUST, NEED TO, OUGHT TO, DARE TO, USED TO.
Primary auxiliary verbs వీటిని తిరిగి మూడు రకాలుగా విభజించారు అవి
- “Do” forms: DO, DOES, DID
- “Be” forms: AM, IS, ARE, WAS, WERE,
- “Have” forms: HAVE, HAS, HAD.
Doforms: సబ్జెక్టు ఏ పని చేస్తున్నాడు అనే దానిని వివరించడానికి ఉపయోగిస్తారు.
Beforms: సబ్జెక్టు యొక్క స్థితిని తెలియజేయడానికి ఉపయోగిస్తారు.
Havefroms: సబ్జెక్టు ఏమి కలిగి ఉన్నాడో తెలియజేయడానికి ఉపయోగిస్తారు.
Model verbs: సబ్జెక్టు యొక్క అవకాశాలు, అవసరాలు మరియు సామర్థ్యాలను గురించి తెలియజేయడానికి ఉపయోగపడతాయి.
ఇంగ్లీషులో వాక్య నిర్మాణం ప్రధానంగా రెండు పద్ధతుల లో ఉంటుంది
1.Active voice 2. Passive voice ముందుగా మనం Active voice లో వాక్య నిర్మాణం ఏ విధంగా చేస్తారో తెలుసుకుందాం.
యాక్టీవ్ వాయిస్ గురించి తెలుసుకోవటానికి ముందుగా verb గురించి తెలుసుకోవాలి. వెర్బ్ అనగా క్రియ లేదా పని అంటారు. పని అంటే ఏమిటి మన దైనందిని జీవితంలో మనం మాట్లాడే ప్రతి వాక్యంలో కూడా ఒక పని కచ్చితంగా ఉంటుంది. మాట్లాడడం ఒక పని. చూడడం ఒక పని., ఆలోచించడం ఒక పని, నవ్వడం ఒక పని, ఏడవడం ఒక పని, వెళ్లడం ఒక పని, రావడం ఒక పని,verb లేని వాక్యం అనేది ఉండదు. (మేము ఇచ్చిన verbs ని చదవండి)
క్రింది ఉదాహరణను గమనించండి.
Ramesh sends Ramu to Hyderabad (రమేష్ రాముని హైదరాబాద్ కి పంపిస్తాడు)
Subject + verb+ Object
Subject: ఒక వాక్యంలో పని ఎవరైతే చేస్తున్నారో అతన్ని సబ్జెక్ట్ అంటారు. పై వాక్యంలో రమేష్ పని చేస్తున్నాడు ఏం పని చేస్తున్నాడు రాముని హైదరాబాద్ కి పంపిస్తున్నాడు.
Verb: పై వాక్యంలో “send= పంపడం” అనేది వెర్బ్
Object : ఎవరైతే సబ్జెక్టు యొక్క మాట వింటారో లేదా సబ్జెక్టు యొక్క ప్రభావానికి గురి అవుతారో వారిని ఆబ్జెక్ట్ అంటారు. ఈ వాక్యం లో ఆబ్జెక్టు Ramu.
ఎవరైతే వాక్యంలో పనిచేస్తున్నట్లు కనబడుతున్నారో అతనిని subject (కర్త) అంటారు. Active voice లో వాక్యాన్ని నిర్మించేటప్పుడు సబ్జెక్టుకు అధిక ప్రాధాన్యత ఇచ్చి వాక్య ప్రారంభంలో సబ్జెక్టు యొక్క పేరుని ఉచ్చరించడం జరుగుతుంది. Passive voice లో object తో వాక్యాన్ని ప్రారంభిస్తారు. అలా ఎందుకు చేస్తారు అక్కడికి వెళ్ళినప్పుడు మీకు అర్థమవుతుంది. ప్రస్తుతానికి Active voice గురించి తెలుసుకుందాం.
సబ్జెక్టు (subject = కర్త) అనగా ఏమిటి? సెంటెన్స్ లో పనిచేస్తున్నట్లు కనబడుతున్న వ్యక్తిని ,జంతువుని లేదా వస్తువుని లేదా ఒక సంస్థ లేదా వ్యవస్థని సబ్జెక్టు అంటారు. సబ్జెక్టు యొక్క మాట ఎవరైతే వింటున్నారో ఎవరైతే సబ్జెక్టుకు లోబడుతున్నారో లేదా సబ్జెక్టు యొక్క ప్రభావానికి ఎవరైతే గురి అవుతున్నారో వారిని ఆబ్జెక్ట్ (object =కర్మ) అంటారు.
Examples :
The cat chases the mouse around the house. | పిల్లి ఇంటి చుట్టూ ఎలుకను తరుముతుంది. |
She waters the plants every morning. | ఆమె ప్రతిరోజూ ఉదయం మొక్కలకు నీరు పోస్తుంది. |
Ramesh sends Ramu to the town. | రమేష్ రాముని పట్టణానికి పంపిస్తాడు. |
A tiger is chasing a deer. | ఒక పులి జింకను తరుముతూ ఉంది. |
The police beat the thief. | పోలీసులు దొంగను కొట్టారు. |
పైన రెడ్ కలర్ లో కనిపిస్తున్న పదాలు సబ్జెక్టు అయితే బ్లూ కలర్ లో కనిపిస్తున్న పదాలు ఆబ్జెక్ట్. పైన చూపిన విధంగా ఒక సెంటెన్స్ లో subject పని చేస్తూ ఉంటాడు. Object ఆ ఫలితాన్ని అనుభవిస్తూ ఉంటాడు.
ఈ సబ్జెక్టులు రెండు రకాలు:1) Singular subjects (ఒకరు) 2) Plural subjects ( ఇద్దరూ లేదా ఆపైన)
ఈ Singular subjects ని తిరిగే మూడు రకాలుగా విభజిస్తారు.
1) First Person: I (నేను)
2) Second Person: You (నీవు) (సింగిల్ వ్యక్తి)
3) Third Person: He (అతడు), She ( ఆమె), It ( ఇది) that (అది) (నాకు దూరంగా ఉన్న వ్యక్తి లేదా జంతువు లేదా వస్తువు)
ఈ Plural subjects ని తిరిగే మూడు రకాలుగా విభజిస్తారు.
1) First Person: We (మేము/మనము)
2) Second Person: You (మీరు) (ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ)
3) Third Person: They, (వారు) those (వారు) ( మనకు దూరంగా ఉన్న మరికొందరు)
ప్రతి టెన్స్ దగ్గరికి మీరు వెళ్ళినప్పుడు సబ్జెక్టు వైస్ గా ఏ బీఫామ్ వాడతారు స్ట్రక్చర్ ఇచ్చి ఉంది. కాబట్టి కింద టేబుల్ ని చూసి కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు అన్ని టెన్స్ లకు కలిపి కంబైన్డ్ గా ఈ పట్టిక ఇవ్వడం జరిగింది.
Singular subjects లో ఏ సబ్జెక్టుకి ఏ Helping verb వాడుతారో కింది పట్టికలో చూడండి.
I | Do, Am, Have, Was. |
You (నీవు) | Do, Are, Have, Were. |
He, She, It | Does, Is, Was, Has. |
Plural subjects లో ఏ సబ్జెక్టుకి ఏ Helping verb వాడుతారో కింది పట్టికలో చూడండి
We | Do, Have, Are, Were. |
You ( మీరు) | Do, Are, Have, Were ( You కి సింగులర్ అయిన ప్లూరల్ అయినా ఒకే విధమైన Helping verbs వాడుతున్నారు గమనించండి). |
They | Do, Have, Are, Were. |
DID, HAD WILL, WOULD, SHALL, SHOULD, CAN, COULD, MAY, MIGHT, MUST, NEED TO, OUGHT TO, DARE TO, USED TO.
ఈ Model verbs అన్నిటినీ, Singular subject ఆని Plural subjects అని తేడా లేకుండా అన్ని సబ్జెక్టులకు ఉపయోగిస్తారు. Modal verbs ఉపయోగించేటప్పుడు verb ఎల్లప్పుడూ మొదటి రూపంలోనే ఉండాలి.
క్రింది పట్టిక లో ఉన్న సెంటెన్స్ ఏ టెన్స్ లో ఉన్నాయి అనేది పోయే కొద్ది మీకు అర్థం అవుతుంది.
English sentences | Telugu Meaning |
---|---|
Joy do write articles. | జాయ్ వ్యాసాలు రాస్తాడు. |
Usha is teaching English. | ఉష ఇంగ్లీషు నేర్పుతూ ఉంది. |
He was playing football yesterday. | అతను నిన్న ఫుట్బాల్ ఆడుతూ ఉండినాడు. |
they are studying together. | వారు కలిసి చదువుకుంటూ ఉన్నారు. |
Sudhakar, Abraham and Jhon live in Paris. | సుధాకర్, అబ్రహం మరియు జాన్ పారిస్లో నివసిస్తున్నారు. |
---|---|
I am reading books. | నేను పుస్తకాలు చదువుతూ ఉన్నాను. |
Sangeetha speaks fluent Spanish. | సంగీత స్పానిష్ అనర్గళంగా మాట్లాడుతుంది. |
Ravi sent ramesh to Hyderabad. | రవి రమేష్ ని హైదరాబాదుకు పంపించాడు. |
Suresh, Mahesh and I travel every summer. | సురేష్, మహేష్ మరియు నేను ప్రతి వేసవిలో ప్రయాణిస్తాం. |
The lion has eaten deer. | సింహము దుప్పిని తిన్నది. |
పైన రెడ్ కలర్ లో ఉన్నవి subjects,
గ్రీన్ కలర్ లో ఉన్నవి verbs (Main verbs)
పింక్ కలర్ లో ఉన్నవి సహాయక క్రియలు (Helping verbs )
పై వాక్యాలు గమనించినట్లు అయితే సహాయక క్రియలు అర్థవంతమైన వాక్యాన్ని నిర్మించడానికి verbs కి సహాయం చేస్తున్నాయి కనుక వీటిని సహాయక క్రియలు అన్నారు.
కొన్ని సందర్భాలలో verbs లేని వాక్యాలలో సహాయక క్రియలు మెయిన్ వెర్బ్ గా పని చేస్తాయి.
Examples:
1. He is a lawyer అతను ఒక లాయర్
2.They are students వారు విద్యార్థులు
3.He was farmer అతను రైతుగా ఉండెను
పై ఉదాహరణలను గమనిస్తే వాక్యాల నిర్మాణంలో verb లేకపోయినప్పటికీ సహాయక క్రియలు అయిన is, are, was మెయిన్ వెర్బ్ గా పనిచేసి ఒక అర్థవంతమైనటువంటి వాక్య నిర్మాణాన్ని చేపడుతున్నాయి. అందు అందుచేతనే వీటికి సహాయక క్రియలు అని పేరు వచ్చింది. సహాయక క్రియలనే ఇంగ్లీషులో ఆక్సిలరీ వెర్బ్స్ లేదా హెల్పింగ్ వెర్బ్స్ అంటారు.