Simple Future-4

4. Dangers and Alerts:         

ప్రమాదంలో మరియు హెచ్చరికలు తెలియజేయడానికి కూడా సింపుల్ ఫ్యూచర్ టెన్స్ ని ఉపయోగిస్తారు.

Example:

1.”If you don’t study, you will fail the exam.” “నువ్వు చదువుకోనట్లు అయితే పరీక్షలలో ఫెయిల్ అవుతావు.”
“If you don’t study, you will not fail the exam.” “నువ్వు చదువుకోనట్లు అయితే పరీక్షలలో ఫెయిల్ కావు” 
“Will you fail the exam if you don’t study?” “నువ్వు చదువుకోనట్లు అయితే పరీక్షలలో ఫెయిల్ అవుతావా?”
“Will you not fail the exam if you don’t study?” “నువ్వు చదువుకోనట్లు అయితే పరీక్షలలో ఫెయిల్ అవ్వవా?”
2.”If you don’t stop yelling, I will leave.” “నువ్వు అరవడం ఆపకపోతే నేను వెళ్ళిపోతాను.”
“If you don’t stop yelling, I will not leave.” “నువ్వు అరవడం ఆపకపోతే నేను వెళ్ళను.” 
“Will I leave if you don’t stop yelling?” “నువ్వు అరవడం ఆపకపోతే నేను వెళ్ళిపోతానా?”
“Will I not leave if you don’t stop yelling?” “నువ్వు అరవడం ఆపకపోతే నేను  వెళ్ళిపోనా?”
3.”You will regret it if you don’t apologize.” “మీరు క్షమాపణ చెప్పకపోతే మీరు చింతిస్తారు.”
“You will not regret it if you don’t apologize.” “మీరు క్షమాపణ చెప్పకపోతే మీరు చింతించరు.”
“Will you regret it if you don’t apologize?” “మీరు క్షమాపణ చెప్పకపోతే మీరు చింతిస్తారా?”
“Will you not regret it if you don’t apologize?” “మీరు క్షమాపణ చెప్పకపోతే మీరు చింతించరా?”
4.”If you keep playing video games, you will fail your exams.” “మీరు వీడియో గేమ్‌లు ఆడుతూ ఉంటే, మీరు మీ పరీక్షలలో ఫెయిల్ అవుతారు.”
“If you keep playing video games, you will not fail your exams.” “మీరు వీడియో గేమ్‌లు ఆడుతూ ఉంటే, మీరు మీ పరీక్షలలో ఫెయిల్ అవ్వరు.”
“Will you fail your exams if you keep playing video games?” “మీరు వీడియో గేమ్‌లు ఆడుతూ ఉంటే మీ పరీక్షలలో ఫెయిల్ అవుతారా?”
“Will you not fail your exams if you keep playing video games?” “మీరు వీడియో గేమ్‌లు ఆడుతూ ఉంటే మీ పరీక్షలలో ఫెయిల్ కారా?”
5.”She will be very upset if you forget her birthday.” “మీరు ఆమె పుట్టినరోజును మరచిపోతే ఆమె చాలా బాధపడుతుంది.”
“She will not be very upset if you forget her birthday.” “మీరు ఆమె పుట్టినరోజును మరచిపోతే ఆమె చాలా బాధపడదు.”
“Will she be very upset if you forget her birthday?” ” మీరు ఆమె పుట్టిన రోజు మర్చిపోతే ఆమె చాలా బాధపడుతుందా?”
“Will she not be very upset if you forget her birthday?” “మీరు ఆమె పుట్టినరోజును మరచిపోతే ఆమె చాలా బాధపడదా?”
6.”If you touch that, you will get burned.” “అది ముట్టుకుంటే మీరు కాలిపోతారు.”
“If you touch that, you will not get burned.” “అది ముట్టుకుంటే మీరు కాలిపోరు”
“Will you get burned if you touch that?” “అది ముట్టుకుంటే మీరు కాలిపోతారా?”
“Will you not get burned if you touch that?” “అది ముట్టుకుంటే మీరు కాలిపోరా ?”
7.”You will get a fine if you park here.” “మీరు ఇక్కడ పార్క్ చేస్తే జరిమానా పడుతుంది.”
“You will not get a fine if you park here.” “మీరు ఇక్కడ పార్క్ చేస్తే మీకు జరిమానా పడదు.”
“Will you get a fine if you park here?” “మీరు ఇక్కడ పార్క్ చేస్తే మీకు జరిమానా పడుతుందా ?”
“Will you not get a fine if you park here?” “మీరు ఇక్కడ పార్క్ చేస్తే మీకు జరిమానా పడదా?”
8.”If you don’t wear a helmet, you will get injured.” మీరు హెల్మెట్ ధరించకపోయినట్లు అయితే మీకు గాయాలు అవుతాయి.
“If you don’t wear a helmet, you will not get injured.” మీరు హెల్మెట్ ధరించకపోయినట్లు అయితే మీకు గాయాలు అవ్వవు.
“Will you get injured if you don’t wear a helmet?” “మీరు హెల్మెట్ ధరించకపోయినట్లు అయితే మీకు గాయాలు.అవుతాయా?”
“Will you not get injured if you don’t wear a helmet?” ‘‘మీరు హెల్మెట్ ధరించకపోయినట్లు అయితే మీకు గాయాలు అవ్వవా.?
9.”He will be in trouble if he lies to his parents.” “అతను అతని యొక్క తల్లిదండ్రులకు అబద్ధం చెప్పినట్లు అయితే అతను  ఇబ్బందులలో పడుతాడు.”
“He will not be in trouble if he lies to his parents.” “అతను అతని యొక్క తల్లిదండ్రులకు అబద్ధం చెప్పినట్లు అయితే అతను  ఇబ్బందులలో పడడు.”
“Will he be in trouble if he lies to his parents?” “అతను అతని యొక్క తల్లిదండ్రులకు అబద్ధం చెప్పినట్లు అయితే అతను  ఇబ్బందులలో పడుతాడా?”
“Will he not be in trouble if he lies to his parents?” “అతను అతని యొక్క తల్లిదండ్రులకు అబద్ధం చెప్పినట్లు అయితే అతను  ఇబ్బందులలో పడడా?
10.”If you don’t clean your room, you will lose your allowance.” “మీరు మీ గదిని శుభ్రం చేయకపోతే, మీ భత్యం కోల్పోతారు.”
“If you don’t clean your room, you will not lose your allowance.” “మీరు మీ గదిని శుభ్రం చేయకపోతే, మీరు మీ భత్యాన్ని కోల్పోరు.”
“Will you lose your allowance if you don’t clean your room?” “మీరు మీ గదిని శుభ్రం చేయకపోతే మీ భత్యం కోల్పోతారా?”
“Will you not lose your allowance if you don’t clean your room?” “మీరు మీ గదిని శుభ్రం చేయకపోతే మీ భత్యం కోల్పోరా ?”
11.”The dog will bite you if you tease it.” “నువ్వు ఆటపట్టిస్తే కుక్క నిన్ను కొరికేస్తుంది.”
“The dog will not bite you if you tease it.” “నువ్వు ఆటపట్టిస్తే కుక్క నిన్ను కొరకదు.”
“Will the dog bite you if you tease it?” “నువ్వు ఆటపట్టిస్తే కుక్క నిన్ను కరుస్తుందా?”
“Will the dog not bite you if you tease it?” “నువ్వు ఆటపట్టిస్తే కుక్క నిన్ను కరవదా ?”