hilsa fish in telugu and hilsa fish in telugu name
ఒడియా లో ilish గా పిలువబడే hilsa చేపకు మరి కొన్ని పేర్లు కూడా ఉన్నాయి అవి hilsa, hilsa herring,hilsa shad.(hilsa fish in telugu)
Hilsa fish in telugu name
హిల్సా సముద్రంలో ఉండి జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో గోదావరి లోని వరద లకు గోదావరి నది లోనికి ప్రవేశించి పులస గా మారుతాయి అని అంటారు. (hilsa fish in telugu name )
Hilsa fish in telugu
హిల్సా చేప భారత దేశ ఉపఖండంలో ఎక్కువ ప్రజాదరణ పొందినటువంటి చేప. అత్యంత ప్రజాదరణ పొందిన హిల్సా చేప చాందిపూర్, బంగ్లాదేశ్, ఒడిషా ప్రాంతాల నుండి వచ్చినదని ఒక విశ్లేషణ. Hilsa చేపను బంగ్లాదేశ్ యొక్క జాతీయ చేప గా పరిగణిస్తున్నారు. మరియు మన దేశంలోని పశ్చిమ బెంగాల్ రాష్ట్రం యొక్క రాష్ట్ర చేప కూడా Hilsa చేపనే. బంగ్లాదేశ్ యొక్క మొత్తం చేపల ఉత్పత్తిలో 12 శాతం గానూ జీడీపీలో 1.5 శాతం గానూ ఈ హిల్సా చేప ఉన్నది. జిడ్డుగా మరియు లేతగా ఉండే ఈ చేప యొక్క ప్రత్యేక లక్షణాల కారణంగా దీనిని “టెరుభోక్ ఉమ్నో” అని పిలుస్తున్నారు.
హిల్సా చేపల జీవనశైలి
- ఈ చేప సముద్రం లోనూ మరియు మంచినీటి లోకూడా జీవించగలుగు తుంది.
- Hilsa చేప మూడు కేజీలబరువుతో 50 నుండి 60 సెంటీమీటర్ల పొడవు వరకుపెరుగుతుంది.
- ఈ చేప బంగ్లాదేశ్, భారతదేశం,పాకిస్థాన్, మయన్మార్,ఇరాన్ మరియు ఇరాక్ప్రాంతాలలోనే మరియు వాటి నదుల ప్రాంతాలలోనేఎక్కువగా కనుగొనబడింది.
- Hilsa చేపలు గుడ్లుపెట్టడానికి జనవరి నుండి ఏప్రిల్ వరకు మరియుజూన్నుండి సెప్టెంబర్ వరకు అనుకూలం.
- ఈ నెలలలో ఇవి నదులువెంబడి 50 నుంచి 100 కిలోమీటర్ల దూరం ప్రయాణంచేసి, అక్కడ నదులలో గుడ్లు పెడతాయి.
- Hilsa చేపలు పెరగడానికి ఏప్రిల్ నెల అత్యంతసారవంతమైన,ప్రయోజనకరమైన నెల గా గుర్తించారు.
- నదులలో ఈ చేపలు యవ్వన దశలో ఉండి సుమారు22 సెంటీమీటర్ల పొడవు వరకు పెరిగిన తర్వాతవాటికి సముద్రంలో జీవించే సామర్ధ్యం ఏర్పడుతుంది.
- సముద్రంలో జీవించగల సామర్థ్యం ఏర్పడిన తర్వాత నదుల నుండి సముద్రంలోకివస్తాయి . ఈ విధంగా నదులనుండి తిరిగిసముద్రంలోకి ప్రవేశించే Hilsa చేపలనుబంగ్లాదేశ్ లో జట్కా అని అంటారు.
హిల్సా చేపల ఉనికి
- ఈ చేప సుమారుగా 11 దేశాలలో ప్రధానంగా కనిపిస్తుంది. బంగ్లాదేశ్, ఇండియా, మయన్మార్, పాకిస్తాన్, ఇరాన్, ఇరాక్, కువైట్, బహ్రెయిన్ ఇండోనేషియా,మలేషియా దేశాలలో ఈ హిల్సా చేప ప్రధానంగా కనిపిస్తుంది.
- ఈ హిల్సా చేపల ఉత్పత్తిలో బంగ్లాదేశ్ ప్రథమ స్థానంలో ఉంటే, మయన్మార్ రెండవ స్థానంలోనూ, భారతదేశం మూడో స్థానంలోనూ ఉన్నది.
- హిల్సా చేపల ఉత్పత్తిలో మొత్తం 86 శాతానికిపైగా ఒక బంగ్లాదేశ్ నుండి మాత్రమే జరుగుతున్నది.
- మన భారతదేశం విషయానికి వస్తే ఈ చేప ప్రధానంగా పశ్చిమ బెంగాల్, ఒడిస్సా, ఆంధ్ర ప్రదేశ్, అస్సాం, గుజరాత్, త్రిపుర వంటి రాష్ట్రాలలో దీనికి ప్రజాదరణ ఉన్నది అనగా ఈ ప్రాంతాలలో కనిపిస్తుంది.
- ఉత్తర అమెరికా ప్రాంతాలలో ఈ చేపలు వారికి దొరకవు కానీ అక్కడ ఈ చేపల కు బదులుగా శాడ్ చేపలు వారికి దొరుకుతాయి.
- అంతేకాకుండా భారతదేశంలోని గంగా డెల్టా, రూప నారాయణ్,హుగ్లీ, నర్మద, గోదావరి మరియు చిలుక సరస్సులు ఈ చేపలకు ప్రధానమైన వేట ప్రాంతాలుగా చెప్పవచ్చు.
హిల్సా(hilsa fish in telugu) చేపల ఆరోగ్య ప్రయోజనాలు
- హిల్సా చేపను ఒక ఆయిల్ ఫిష్ గా చెప్పవచ్చు. ఈ చేప ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలను సమృద్ధిగా కలిగి ఉంది.
- దీని యొక్క ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలుతో ఎలుకల మీద ప్రయోగం చేసినప్పుడు దాని యొక్క కొలెస్ట్రాల్ స్థాయి మరియు ఇన్సులిన్ స్థాయిలు తగ్గినట్టుగా కూడా పరిశోధకులు కనుగొన్నారు.
- ఈ చేప ఆయిల్ ఫిష్ అయినందువలన ఎక్కువ నూనె ఖర్చు చేయకుండానే ఈ చేపలతో వంట చేయవచ్చు.
హిల్సా(hilsa fish in telugu name )పులస గా మారడం
అయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ హిల్సా చేపలు గోదావరి నది కి వరదలు వచ్చే ఈ సమయంలో అనగా, జూన్ నుండి సెప్టెంబర్ మధ్య కాలంలో ఈ చేపలు గోదావరి నది లోనికి ప్రవేశించి పులస గా మారుతాయి అని ఒక నానుడి కూడా ఉన్నది. మన దేశంలోని గోదావరి జిల్లాలలో ఈ చేపను పులస చేప అని కూడా అంటున్నారు.”పుస్తెలు అమ్మి అయినా పులస పులుసు తినాలి” అనే ఒక సామెత కూడా మన తెలుగు రాష్ట్రాలలో ఉన్నది. ఈ పులస చేపలు మన తెలుగు రాష్ట్రంలో ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి మరియు ఖరీదైన చేపలు గా ప్రసిద్ధి చెందినవి. కొన్ని సమయాలలో ఈ చేప కేజీ 7000 రూపాయల వరకు ధర పలుకుతుంది అంటే దాని గొప్పతనం ఏమిటో మనకి అర్థం అవుతుంది కదా!(hilsa fish in telugu name )
హిల్సా ఉనికి తగ్గిపోతున్న దా!
పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో పవిత్రమైనటువంటి దినాలలో ఈ చేపలు కూర తినడం ఒక ఆనవాయితీ. వారు విగ్రహాలు పూజించేటప్పుడు ఈ చేపలను ఉపయోగిస్తారు.
బంగ్లాదేశ్లో వర్షాకాలాన్ని హిల్సా నెలగా వారు పిలుస్తున్నారు. బంగ్లాదేశ్ మరియు బెంగాల్ ప్రాంతం లో వారు ఈ చేపను క్వీన్ ఆఫ్ ఫిషెస్ అని అంటున్నారు.
హిల్సా చేపల జాతికి అత్యంత ప్రజాదరణ ఉండడం వలన ఎక్కువ గా ఉపయోగిస్తున్నారు. కాబట్టి క్రమక్రమంగా వీటి యొక్క ఉత్పత్తి తగ్గిపోతున్నది. చిన్న చిన్న చేపలను కూడా వలలు వేసి పెట్టడం వలన ఈ చేపలకు ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. భారతదేశంలో అయితే రెండు నుండి మూడు కేజీల చేపలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. ఒరిస్సా మరియు పశ్చిమ బెంగాల్ ప్రాంతాలలో చేపలను తమ పూజలలో, సాంస్కృతిక కార్యక్రమాలలో ఉపయోగించడం వలన ఉత్పత్తి గణనీయంగా తగ్గి పోతున్నది.
బంగ్లాదేశ్ లో అయితే యువ జట్కా చేపలను పట్టడం పూర్తిగా నిషేధించారు. వీటిని నిషేధించడం వలన నిరుద్యోగం పెరుగుతున్నప్పటికీ తప్పడం లేదు.