Parts of speech overview

Parts of Speech

ఇంగ్లీష్ సెంటెన్స్ లో వివిధ భాగాలు ఉంటాయి వాటిని భాషాభాగాలు (Parts of speech) అంటారు. ఇవి మొత్తం ఎనిమిది క్రింది పట్టిక ద్వారా ఎనిమిదింటిని గురించి చూడండి.

Word Pronunciation  Meaning 
Noun నౌన్ నామవాచకం
Pronoun ప్రోనౌన్ సర్వనామం
Adjective అడ్జెక్టివ్ విశేషణం
Verb వర్బ్ క్రియ
Adverb అడ్వర్బ్ క్రియవిశేషణం
Preposition ప్రీపొజిషన్ విభక్తి
Conjunction కన్జంక్షన్ సముచ్ఛయము
Interjection ఇంటర్జెక్షన్ ఆశ్చర్యర్దకాం

అలాగే క్రింది పట్టికను కూడా గమనించండి.

Wow, the young boy ran quickly to his house and sat down. వావ్, యువకుడు త్వరగా తన ఇంటికి పరిగెత్తి కూర్చున్నాడు.
Oh, her beautiful cat jumps gracefully onto the table, but she doesn’t mind. ఓహ్, ఆమె అందమైన పిల్లి అందంగా టేబుల్‌పైకి దూకింది, కానీ ఆమె పట్టించుకోవడం లేదు.
Alas, the tired traveller walked slowly through the forest and he felt hopeless. అయ్యో, అలసిపోయిన ప్రయాణికుడు అడవి గుండా నెమ్మదిగా నడిచాడు మరియు అతను నిరాశకు గురయ్యాడు.

 

1. Wow (interjection) The young ( adjective ) boy  (Noun) ran (verb) quickly (adverb)to (preposition) his  (Pronoun) house and (conjunction) sat down.

2. Oh,(interjection) her beautiful ( adjective ) cat (Noun)jumps (verb) gracefully (adverb) onto  (preposition) the table, but (conjunction) she(Pronoun) doesn’t mind.

3. Alas, (interjection)the tired ( adjective ) traveller (Noun) walked (verb) slowly (adverb) through (preposition) the forest and (conjunction) he (Pronoun) felt hopeless.

పైన మీకు ఎనిమిది భాషాభాగాలు ఉండే మూడు సెంటెన్స్ ని ఇచ్చినాము. అయితే ప్రతి సెంటెన్స్ లో కూడా 8 భాషాభాగాలు ఉండవచ్చు ఉండకపోవచ్చు. కానీ ఇంగ్లీష్ సెంటెన్స్ లో ఉండేటువంటి భాషాభాగాలు మీకు అర్థం అవడం కోసం పై సెంటెన్స్ ఇచ్చినారు  ఇప్పుడు ఒక్కొక్క భాష భాగాన్ని గురించి వివరంగా తెలుసుకుందాం.

 

Noun:

ఇది ఒక సెంటెన్స్ లో ఉన్న పేర్లను గురించి తెలియజేస్తుంది. అది ఒక వ్యక్తి పేరు కావచ్చు, జంతువు, వస్తువు ఏదైనా ఒక సంస్థ, మరేదైనా కావచ్చు కేవలం పేర్లను గురించి మాత్రమే తెలియజేస్తుంది

ఉదాహరణకు : Ramesh, sangeetha, lion, computer, Bank.  etc..

Pronoun:

సెంటెన్స్ లో నామవాచకానికి బదులుగా ఉపయోగించేటువంటి పేర్లను సర్వనామాలు అంటారు.

ఉదాహరణకు రమేష్ బదులు అతడు.  (He =  అతడు)

సంగీత బదులు ఆమె.  (She= ఆమె )

సింహం బదులు అది. (It= అది )

ఇలాంటి పేర్లను నామవాచకాలు కు బదులుగా ఉపయోగిస్తారు.

సర్వనామాలు ఉపయోగించడం వలన ప్రయోజనం ఏమిటి?

 ఉదాహరణకు:

     రమేష్ హైదరాబాదుకి వెళ్ళినాడు. రమేష్ హైదరాబాదులోని పర్యాటక స్థలాలని చూడాలి అనుకున్నాడు. రమేష్ చార్మినార్ని సందర్శించినాడు.రమేష్ చార్మినార్ వద్ద నుండి గోల్కొండ కి వెళ్ళినాడు.రమేష్ గోల్కొండ నుండి ఎయిర్ పోర్ట్ కు వెళ్ళినాడు. 

       ఈ విధంగా ప్రతిసారి రమేష్, రమేష్,  రమేష్ అని ఉపయోగించడం వలన వాక్య నిర్మాణాలు అర్థవంతంగా ఉండవు చదివేవానికి విసుగు కలుగుతుంది. అందుకే నామవాచకాలకు(Nouns) బదులుగా సర్వనామాలు(Pronouns) ఉపయోగిస్తారు. రమేష్ అని మొదటి వాక్యంలో ఉపయోగించిన తర్వాత ప్రతిసారి అతను.(He= అతను) అని సంబోధిస్తే అర్థవంతంగా ఉంటుంది.

        రమేష్ హైదరాబాదుకి వెళ్ళినాడు. అతను హైదరాబాదులోని పర్యాటక స్థలాలని చూడాలి అనుకున్నాడు. అతను చార్మినార్ని సందర్శించినాడు.అతను  చార్మినార్ వద్ద నుండి గోల్కొండ కి వెళ్ళినాడు.అతను  గోల్కొండ నుండి ఎయిర్ పోర్ట్ కు వెళ్ళినాడు. ఇలా చెప్పడం వలన వాక్యము అర్థం గా ఉంటుంది. అందుకే నామవాచకాలకు (Nouns)  బదులుగా సర్వనామాలు (Pronouns) ఉపయోగిస్తారు.

లేడీస్ పేర్లకు బదులు She,  జంతువులు లేదా వస్తువుల పేర్లకు బదులు It , ఇద్దరు లేదా అంతకన్నా ఎక్కువమంది ఉన్నప్పుడు We, You, They లను సర్వనామాలుగా ఉపయోగిస్తారు.

సర్వ నామాలు ( Pronouns) ఎన్ని రకాలుగా ఉంటాయో ప్రత్యేక పేజీలో ఇవ్వడం జరిగింది.

 

Adjective

ఇది సెంటెన్స్ లో ఉన్న నామవాచకం (Noun) లేదా సర్వనామం (Pronoun) యొక్క గుణాన్ని, ఆకారమును, పరిమాణమును, రంగును, లేక ఇతర, లక్షణాలు ఉంటే వాటిని గురించి వివరిస్తుంది.

పైన ఇచ్చిన మూడు వాక్యాలలో మొదటి వాక్యంలో అబ్బాయి కుర్రవాడు అని   అతని ఆకారమును వివరిస్తుంది .

రెండవ వాక్యంలో పిల్లి అందమైనది అని దాని స్వరూపమును  వివరిస్తుంది

మూడో వాక్యంలో ప్రయాణికుడు అలసిపోయినాడు అని అతని లక్షణాన్ని గురించి తెలియజేస్తుంది.

ఈ విధంగా adjective అనేది నామవాచకం లేదా సర్వనామం గురించి వర్ణిస్తుంది

The blue sky looks beautiful. నీలి ఆకాశం అందంగా కనిపిస్తుంది.
She wore a long dress to the party. ఆమె పార్టీకి పొడవాటి దుస్తులు ధరించింది.
The intelligent student answered the question correctly. తెలివైన విద్యార్థి ప్రశ్నకు సరిగ్గా సమాధానం చెప్పాడు.
We visited a small village near the river. మేము నదికి సమీపంలో ఉన్న ఒక చిన్న గ్రామాన్ని సందర్శించాము.
He gave me five apples from the basket. బుట్టలోంచి ఐదు యాపిల్స్ ఇచ్చాడు.

1.పై పట్టికలో ఆకాశం నామవాచకం అయితే ఆ ఆకాశం బ్లూ కలర్ లో ఉంది అని adjective వర్ణిస్తుంది.

2.రెండవ వాక్యంలో వారు పార్టీలో ధరించిన డ్రెస్ నామవాచకం అయితే ఆ డ్రెస్ పొడవుగా ఉంది అని adjective వర్ణిస్తుంది.

3.మూడో వాక్యంలో విద్యార్థి నామవాచకం అయితే ఆ విద్యార్థి తెలివైనవాడు అని Adjective వర్ణిస్తుంది.

4.నాలుగవ వాక్యంలో విలేజ్ నామవాచకం అయితే ఆ విలేజ్ చిన్నది అని adjective వర్ణిస్తుంది.

5.ఐదవ వాక్యంలో ఆపిల్స్ నామవాచకం అయితే ఆ యాపిల్స్ అయిదు అని ఆపిల్స్ పరిమాణాన్ని adjective వర్ణిస్తుంది.

adjective ప్రత్యేక పేజీలో ఇచ్చి ఉన్నాయి వాటిని చదవండి.

 

4. Verb

వాక్యంలో ఉన్న పనిని గురించి తెలియజేసే దానిని Verb అంటారు  పని అంటే ఏమిటి? చూడడం, మాట్లాడడం, ఆలోచించడం, రాయడం, చదవడం, ఇవన్నీ కూడా పనులే

పై మూడు వాక్యాలలో ఉన్న Ran = పరిగెత్తడం,  Jumps = దుమకడం, walked = నడవడం ఇవన్నీ కూడా పనులే. ప్రత్యేక  పేజీలో verbs ఇచ్చి ఉన్నాము.

 

5. Adverb

సెంటెన్స్ లో ఉన్న verb  గురించి వర్ణించే దానినే adverb అంటారు.పని ఏ విధంగా జరుగుతుందో ఇది వర్ణిస్తుంది. 

1. పై  సెంటెన్స్ లో  The young boy ran quickly to his house .అబ్బాయి వేగంగా ఇంటికి పరిగెత్తాడు అని ఉంది. ఇక్కడ పరిగెత్తడం అనే క్రియ.  జరుగుతుంది. కానీ  ఆ పరిగెత్తడమనే .క్రియ    వేగంగా అని వర్ణించడం జరిగింది.

2. రెండవ సెంటెన్స్ లో cat jumps gracefully onto the table. పిల్లి టేబుల్ మీదకి అందంగా దూకింది అని ఉంది. ఇక్కడ దూకడం.  అనే పని జరిగింది కానీ ఏ విధంగా జరిగిందే అంటే అందంగా అనివర్ణించడం జరిగింది

3.She sings beautifully. ఆమె అందంగా పాడుతుంది.

పాడడం అనే క్రియ జరుగుతుంది కానీ ఆ పాడడం అందంగా అని వర్ణించబడింది.

4.He arrived early. అతను త్వరగా వచ్చాడు.

అతను వచ్చాడు అనే క్రియ జరిగింది కానీ త్వరగా అని వర్ణించబడింది.

5.The movie was very interesting. ఆ సినిమా చాలా ఆసక్తికరంగా ఉంది.

ఆ సినిమా ఆసక్తిగా ఉంది కానీ చాలా ఆసక్తిగా ఉంది అని వర్ణించబడింది.

6.They worked extremely hard. వారు చాలా కష్టపడి పనిచేశారు.

ఇక్కడ కూడా వారు కష్టపడడం అనే క్రియ జరిగింది కానీ చాలా కష్టపడ్డారు అని వర్ణించడం జరిగింది.

7.She will leave tomorrow. ఆమె రేపు వెళ్ళిపోతుంది.

ఆమె వెళ్ళిపోతుంది అనే క్రియ భవిష్యత్తులో జరుగుతుంది. కానీ రేపు అని వర్ణించడం జరిగింది

Adverb ఈ విధంగా  verb ని  వర్ణిస్తుంది. ఆ పని ఏ విధంగా జరుగుతుంది నిదానంగా జరుగుతుందా., వేగంగా జరుగుతుందా, అందంగా జరుగుతుందా, అని వర్ణిస్తుంది.

Adjective  పై విధంగా Noun, Pronoun  గురించి వర్ణిస్తే adverb మాత్రం verb ను గురించి వర్ణిస్తూ ఉంటుంది.