...

Past continuous-1

Past continuous tense

గతంలో ఒక సమయం నుండి మరొక సమయం వరకు కంటిన్యూగా జరుగుతూ ఉండిన కార్యకలాపాలను వివరించడానికి, ఈ  Past continuous tense ని ఉపయోగిస్తారు. 

ఫాస్ట్ కంటిన్యూస్ టెన్స్ లో సెంటెన్స్ ని రూపొందించడానికి. 

He, She, It లకు Was + V1 + Ing + object.

I, We, You, They  లకు Were  + V1 + Ing  

నెగిటివ్ సెంటెన్స్ కి   was, were తర్వాత not ఉంచాలి.

ప్రశ్నా వాక్యాలలో  was, were లను సబ్జెక్టుకు ముందు ఉంచితే సరిపోతుంది

 

1  Ongoing Action at a Specific Time in the past:     

గతంలో ఒక ఖచ్చితమైన సమయంలో జరుగుతూ ఉండిన కార్యకలాపాలను వివరించడానికి, Past continuous tense ని ఉపయోగిస్తారు.

Example: 

1.I was reading a book at 8 PM last night. నేను నిన్న రాత్రి 8 గంటలకు ఒక పుస్తకం చదువుతూ ఉండినాను .
I was not reading a book at 8 PM last night. నేను నిన్న రాత్రి 8 గంటలకు పుస్తకం  చదువుతూ ఉండ లేదు.

(నేను నిన్న రాత్రి 8 గంటలకు పుస్తకం  చదవలేదు. అని సింపుల్ గా కూడా  చెప్పవచ్చు).

Was I reading a book at 8 PM last night? నేను నిన్న రాత్రి 8 గంటలకు పుస్తకం  చదువుతూ ఉండినానా?
Was I not reading a book at 8 PM last night?  నేను నిన్న రాత్రి 8 గంటలకు పుస్తకం చదువుతూ ఉండలేదా?
2.At 10 AM yesterday, I was having breakfast. నిన్న ఉదయం 10 గంటలకు, నేను అల్పాహారం  తీసుకుంటూ  ఉండినాను.
At 10 AM yesterday, I was not having breakfast. నిన్న ఉదయం 10 గంటలకు, నేను అల్పాహారం  తీసుకుంటూ ఉండలేదు.
At 10 AM yesterday, was I having breakfast? నిన్న ఉదయం 10 గంటలకు, నేను అల్పాహారం  తీసుకుంటూ ఉండినానా?
At 10 AM yesterday, was I not having breakfast? నిన్న ఉదయం 10 గంటలకు, నేను అల్పాహారం తీసుకుంటూ ఉండలేదా?
3.She was studying for her exams when the power went out. కరెంటు పోయినప్పుడు ఆమె పరీక్షల కోసం చదువుకుంటూ ఉండింది.
She was not studying for her exams when the power went out. కరెంటు పోయినప్పుడు ఆమె పరీక్షలకు చదువుకుంటూ ఉండలేదు.
Was she studying for her exams when the power went out? కరెంటు పోయినప్పుడు ఆమె పరీక్షలకు  చదువుకుంటూ ఉండినదా?
Was she not studying for her exams when the power went out? కరెంటు పోయినప్పుడు ఆమె పరీక్షలకు  చదువుకుంటూ ఉండలేదా?
4.They were playing football at 3 PM last Saturday. వారు గత శనివారం మధ్యాహ్నం 3 గంటలకు ఫుట్‌బాల్  ఆడుతూ ఉండినారు.
They were not playing football at 3 PM last Saturday. గత శనివారం మధ్యాహ్నం 3 గంటలకు వారు ఫుట్‌బాల్  ఆడుతూ ఉండలేదు.
Were they playing football at 3 PM last Saturday? వారు గత శనివారం మధ్యాహ్నం 3 గంటలకు ఫుట్‌బాల్  ఆడుతూ ఉండినారా?
Were they not playing football at 3 PM last Saturday? గత శనివారం మధ్యాహ్నం 3 గంటలకు వారు ఫుట్‌బాల్  ఆడుతూ ఉండలేదా?
5.He was reading a book while waiting for the bus. బస్ కోసం వేచి చూస్తూ ఉండగా అతడు పుస్తకం చదువుతూ ఉండినాడు.
He was not reading a book while waiting for the bus. బస్ కోసం వేచి చూస్తూ ఉండగా అతడు పుస్తకం చదువుతూ ఉండలేదు.
Was he reading a book while waiting for the bus? అతను బస్సు కోసం వేచి ఉండగా పుస్తకం  చదువుతూ ఉండినాడా?
Was he not reading a book while waiting for the bus? అతని బస్సు కోసం వేచి ఉండగా పుస్తకం చదువుతూ ఉండలేదా?
6.We were watching a movie at midnight. మేము అర్ధరాత్రి సినిమా చూస్తూ ఉండినాము.
We were not watching a movie at midnight. మేము అర్ధరాత్రి సినిమా  చూస్తూ ఉండలేదు.

లేక (మేము అర్ధరాత్రి సినిమా చూడలేదు) 

Were we watching a movie at midnight? మేము అర్ధరాత్రి సినిమా చూస్తూ ఉండినామా?
Were we not watching a movie at midnight? మేము అర్ధరాత్రి సినిమా చూస్తూ ఉండలేదా?
7.I was working on my project all evening. నేను సాయంత్రం అంతా నా ప్రాజెక్ట్‌లో పని  చేస్తూ ఉండినాను.
I was not working on my project all evening. నేను సాయంత్రం అంతా నా ప్రాజెక్ట్‌లో పని  చేస్తూ ఉండలేదు.
Was I working on my project all evening? నేను సాయంత్రం అంతా నా ప్రాజెక్ట్‌లో పని  చేస్తూ ఉండి నాన?
Was I not working on my project all evening? నేను సాయంత్రం అంతా నా ప్రాజెక్ట్‌లో పని  చేస్తూ ఉండలేదా?
8.She was cooking dinner when the doorbell rang. డోర్‌బెల్ మోగినప్పుడు ఆమె రాత్రి భోజనం వండుతూ ఉండింది.
She was not cooking dinner when the doorbell rang. డోర్‌బెల్ మోగినప్పుడు ఆమె రాత్రి భోజనం  వండుతూ ఉండలేదు.
Was she cooking dinner when the doorbell rang? డోర్‌బెల్ మోగినప్పుడు ఆమె రాత్రి భోజనం  వండుతూ ఉండిందా?
Was she not cooking dinner when the doorbell rang? డోర్‌బెల్ మోగినప్పుడు ఆమె రాత్రి భోజనం  వండుతూ ఉండలేదా?
9.They were walking in the park during the afternoon. మధ్యాహ్నం సమయంలో వారు పార్కులో నడుస్తూ ఉండినారు.
They were not walking in the park during the afternoon. మధ్యాహ్నం సమయంలో వారు పార్కులో  నడుస్తూ ఉండలేదు.
Were they walking in the park during the afternoon? వారు మధ్యాహ్నం సమయంలో పార్కులో  నడుస్తూ ఉండినారా?
Were they not walking in the park during the afternoon? వారు మధ్యాహ్నం సమయంలో పార్కులో  నడుస్తూ ఉండలేదా?
10.He was writing emails when his computer crashed. అతని కంప్యూటర్ క్రాష్ అయినప్పుడు అతను ఇమెయిల్స్  వ్రాస్తూ ఉండినాడు.
He was not writing emails when his computer crashed. అతని కంప్యూటర్ క్రాష్ అయినప్పుడు అతను ఇమెయిల్స్  రాస్తూ ఉండలేదు.
Was he writing emails when his computer crashed? అతని కంప్యూటర్ క్రాష్ అయినప్పుడు అతను ఇమెయిల్‌లు  వ్రాస్తూ ఉండినాడా?
Was he not writing emails when his computer crashed? అతని కంప్యూటర్ క్రాష్ అయినప్పుడు అతను ఇమెయిల్‌లు  రాస్తూ ఉండలేదా?
11.We were exploring the city during our vacation last summer. మేము గత వేసవి సెలవుల్లో నగరాన్ని అన్వేషిస్తూ ఉండినాము. 
We were not exploring the city during our vacation last summer. గత వేసవి సెలవుల్లో మేము నగరాన్ని  అన్వేషిస్తూ ఉండలేదు.
Were we exploring the city during our vacation last summer? గత వేసవి సెలవుల్లో మేము నగరాన్ని  అన్వేషిస్తూ ఉండినామా?
Were we not exploring the city during our vacation last summer? గత వేసవి సెలవుల్లో మేము నగరాన్ని  అన్వేషిస్తూ ఉండ లేదా?

 

Where were we exploring during our vacation last summer? గత వేసవిలో మా సెలవుల్లో మేము ఎక్కడ అన్వేషిస్తూ ఉండినాము?
When were we exploring the cityduring our vacation last summer? గత వేసవిలో మా సెలవుల్లో మేము ఎప్పుడు నగరాన్ని అన్వేషిస్తూ ఉండినాము?
Why were we exploring the city during our vacation last summer? గత వేసవి సెలవుల్లో మేము నగరాన్ని ఎందుకు అన్వేషిస్తూ ఉండినాము?
How were we exploring the city during our vacation last summer? గత వేసవి సెలవుల్లో మేము నగరాన్ని ఎలా అన్వేషిస్తూ ఉండినాము?
Where weren’t we exploring the city during our vacation last summer? గత వేసవిలో మా వెకేషన్‌లో మేము ఎక్కడ నగరాన్ని అన్వేషిస్తూ ఉండలేదు? 
When weren’t we exploring the city during our vacation last summer? గత వేసవిలో మా వెకేషన్‌లో మేము ఎప్పుడు  నగరాన్ని అన్వేషిస్తూ ఉండలేదు?
Why weren’t we exploring the city during our vacation last summer? గత వేసవిలో మా వెకేషన్‌లో మేము ఎందుకు నగరాన్ని అన్వేషిస్తూ ఉండలేదు?
How weren’t we exploring the city during our vacation last summer? గత వేసవిలో మా వెకేషన్‌లో మేము ఎలా  నగరాన్ని అన్వేషిస్తూ ఉండలేదు?

 

 

 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!
Scroll to Top
Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.