...

Past perfect continuous tense         

When highlighting the length or continuity of an activity that was in progress prior to another action or point in the past, the past perfect continuous tense is employed. These are the primary scenarios in which it’s employed: 

గతంలో ఒక పని ప్రారంభించబడి కొంత సమయ వ్యవధిలో కొన్ని గంటలుగా లేదా నెలలుగా వారాలగా జరుగుతూ ఉండిన పనులను నొక్కి చెప్పడానికి Past perfect continuous tense ని ఉపయోగిస్తారు. ప్రస్తుతం ఈ పనులు లేవు అవి గతంలో జరిగిపోయినవి.

Past perfect continuous tense లో వాక్య  నిర్మాణం చేయటానికి అన్ని సబ్జెక్టులకు (He, She, It, I, We, You, They)  Had been అనే సహాయక క్రియను  ఉపయోగించి Verb మొదటి రూపానికి ‘Ing’ చేర్చాలి

Sub + Had been + V4 + Obgect

ఈ టెన్స్ ని ఎన్ని రకాలుగా ఉపయోగిస్తారో  తెలుసుకుందాం

Negative sentences and interrogative sentences టేబుల్ చూడడం ద్వారా ఆటోమేటిక్ గా మీకు అర్థం అవుతుంది. 

1. Length of an Action Before Another Action:     

 To express the amount of time that an action has been ongoing prior to another action or earlier in history.

గతంలో ఒక పని కంటే ముందు కొనసాగుతూ ఉండిన మరియొక పనిని తెలియజేయడానికి ఈ Past perfect continuous tense ఉపయోగిస్తారు. 

Example: 

1.She had been studying for hours when he arrived. అతను వచ్చేసరికి ఆమె గంటల తరబడి చదువుతూ ఉండింది.
She had not been studying for hours when he arrived. అతను వచ్చేసరికి ఆమె గంటల తరబడి చదువుతూ  ఉండలేదు.
Had she been studying for hours when he arrived?  అతను వచ్చేసరికి ఆమె గంటల తరబడి చదువుతూ  ఉండిందా?
Had she not been studying for hours when he arrived? అతను వచ్చేసరికి ఆమె గంటల తరబడి చదువుతూ  ఉండలేదా? 
2.She had been studying for hours when her friend finally called. ఆమె స్నేహితురాలు చివరకు ఫోన్ చేసినప్పుడు ఆమె గంటల తరబడి చదువుకుంటూ ఉండింది.
She had not been studying for hours when her friend finally called. ఆమె స్నేహితురాలు చివరకు ఫోన్ చేసినప్పుడు ఆమె గంటల తరబడి చదువుకుంటూ ఉండలేదు.
Had she been studying for hours when her friend finally called? ఆమె స్నేహితురాలు చివరకు ఫోన్ చేసినప్పుడు ఆమె గంటల తరబడి చదువుకుంటూ ఉండిందా.?
Had she not been studying for hours when her friend finally called? ఆమె స్నేహితురాలు చివరకు ఫోన్ చేసినప్పుడు ఆమె గంటల తరబడి చదువుకుంటూ ఉండ లేదా.?
3.They had been travelling for days before they reached their destination. వారు తమ గమ్యాన్ని చేరుకోవడానికి ముందు రోజుల తరబడి ప్రయాణం చేస్తూ ఉండినారు.
They had not been travelling for days before they reached their destination. వారు తమ గమ్యాన్ని చేరుకోవడానికి ముందు రోజుల తరబడి ప్రయాణం చేస్తూ ఉండలేదు.
Had they been travelling for days before they reached their destination? వారు తమ గమ్యాన్ని చేరుకోవడానికి ముందు రోజుల తరబడి ప్రయాణం చేస్తూ ఉండినార.?
Had they not been travelling for days before they reached their destination? వారు తమ గమ్యాన్ని చేరుకోవడానికి ముందు రోజుల తరబడి ప్రయాణం చేస్తూ ఉండలేదా.?
4. He had been waiting at the bus stop for thirty minutes when the bus arrived. బస్సు వచ్చేసరికి అరగంట పాటు అతను బస్ స్టాప్  వద్ద వెయిట్ చేస్తూ ఉండినాడు.
He had not been waiting at the bus stop for thirty minutes when the bus arrived. బస్సు వచ్చేసరికి అరగంట పాటు అతను బస్ స్టాప్  వద్ద వెయిట్ చేస్తూ  ఉండలేదు.
Had he been waiting at the bus stop for thirty minutes when the bus arrived? బస్సు వచ్చేసరికి అరగంట పాటు అతను బస్ స్టాప్  వద్ద వెయిట్ చేస్తూ ఉండినాడ.?
Had he not been waiting at the bus stop for thirty minutes when the bus arrived? బస్సు వచ్చేసరికి అరగంట పాటు అతను బస్ స్టాప్  వద్ద వెయిట్ చేస్తూ ఉండలేదా?
5.We had been working on the project for weeks before we presented it. మేము దానిని అందించడానికి ముందు వారాలపాటు ప్రాజెక్ట్‌పై పని చేస్తూ ఉండినాము.
We had not been working on the project for weeks before we presented it. మేము దానిని అందించడానికి ముందు వారాలపాటు ప్రాజెక్ట్‌పై పని చేస్తూ ఉండలేదు.
Had we been working on the project for weeks before we presented it? మేము దానిని అందించడానికి ముందు వారాలపాటు ప్రాజెక్ట్‌పై పని చేస్తూ ఉండినామ.?
Had we not been working on the project for weeks before we presented it? మేము దానిని అందించడానికి ముందు వారాలపాటు ప్రాజెక్ట్‌పై పని చేస్తూ ఉండలేదా.?
6. I had been living in that apartment for a year before I found a new place. నేను కొత్త స్థలాన్ని కనుగొనడానికి ముందు నేను ఆ అపార్ట్మెంట్లో ఒక సంవత్సరం పాటు నివసిస్తూ ఉండినాను.
I had not been living in that apartment for a year before I found a new place. నేను కొత్త స్థలాన్ని కనుగొనడానికి ముందు నేను ఆ అపార్ట్మెంట్లో ఒక సంవత్సరం పాటు నివసిస్తూ ఉండలేదు.
Had I been living in that apartment for a year before I found a new place? నేను కొత్త స్థలాన్ని కనుగొనడానికి ముందు నేను ఆ అపార్ట్మెంట్లో ఒక సంవత్సరం పాటు నివసిస్తూ    ఉండి నాన.?
Had I not been living in that apartment for a year before I found a new place? నేను కొత్త స్థలాన్ని కనుగొనడానికి ముందు నేను ఆ అపార్ట్మెంట్లో ఒక సంవత్సరం పాటు నివసిస్తూ   ఉండలేదా.?
7.She had been cooking dinner for an hour when her guests arrived. ఆమె యొక్కఅతిథులు వచ్చినప్పుడు ఆమె ఒక గంట పాటు రాత్రి భోజనం  వండుతూ ఉండింది.
She had not been cooking dinner for an hour when her guests arrived. ఆమె యొక్కఅతిథులు వచ్చినప్పుడు ఆమె ఒక గంట పాటు రాత్రి భోజనం  వండుతూ  ఉండలేదు.
Had she been cooking dinner for an hour when her guests arrived? ఆమె యొక్కఅతిథులు వచ్చినప్పుడు ఆమె ఒక గంట పాటు రాత్రి భోజనం  వండుతూ  ఉండిందా.?
Had she not been cooking dinner for an hour when her guests arrived? ఆమె యొక్కఅతిథులు వచ్చినప్పుడు ఆమె ఒక గంట పాటు రాత్రి భోజనం  వండుతూ  ఉండ లేదా.?
8.They had been playing soccer for an hour before it started to rain. వర్షం పడటానికి గంట ముందు వారు సాకర్ ఆడుతూ ఉండినారు.
They had not been playing soccer for an hour before it started to rain. వర్షం పడటానికి గంట ముందు వారు సాకర్ ఆడుతూ ఉండలేదు.
Had they been playing soccer for an hour before it started to rain? వర్షం పడటానికి గంట ముందు వారు సాకర్ ఆడుతూ ఉండినార.?
Had they not been playing soccer for an hour before it started to rain? వర్షం పడటానికి గంట ముందు వారు సాకర్ ఆడుతూ ఉండ లేదా.?
9. He had been practising the guitar for months before he performed on stage. అతను వేదికపై ప్రదర్శన ఇవ్వడానికి ముందు నెలల తరబడి గిటార్ ప్రాక్టీస్ చేస్తూ ఉండినాడు.
He had not been practising the guitar for months before he performed on stage. అతను వేదికపై ప్రదర్శన ఇవ్వడానికి ముందు నెలల తరబడి గిటార్ ప్రాక్టీస్ చేస్తూ ఉండలేదు
Had he been practicing the guitar for months before he performed on stage? అతను వేదికపై ప్రదర్శన ఇవ్వడానికి ముందు నెలల తరబడి గిటార్ ప్రాక్టీస్ చేస్తూ ఉండినాడ?
Had he not been practicing the guitar for months before he performed on stage? అతను వేదికపై ప్రదర్శన ఇవ్వడానికి ముందు నెలల తరబడి గిటార్ ప్రాక్టీస్ చేస్తూ ఉండ లేదా?
10.We had been driving for hours when we decided to take a break. మేము విరామం తీసుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు మేము గంటల తరబడి డ్రైవింగ్ చేస్తూ ఉండినాము.
We had not been driving for hours when we decided to take a break. మేము విరామం తీసుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు మేము గంటల తరబడి డ్రైవింగ్ చేస్తూ ఉండలేదు.
Had we been driving for hours when we decided to take a break? మేము విరామం తీసుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు మేము గంటల తరబడి డ్రైవింగ్ చేస్తూ ఉండినామ.?
Had we not been driving for hours when we decided to take a break? మేము విరామం తీసుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు మేము గంటల తరబడి డ్రైవింగ్ చేస్తూ ఉండ లేదా.?
11.I had been reading that book for days before I finally finished it నేను ఆ పుస్తకాన్ని చివరిగా పూర్తి చేయడానికి చాలా రోజుల ముందు  చదువుతూ ఉండిన్నాను
I had not been reading that book for days before I finally finished it. నేను ఆ పుస్తకాన్ని చివరిగా పూర్తి చేయడానికి చాలా రోజుల ముందు  చదువుతూ  ఉండలేదు
Had I been reading that book for days before I finally finished it? నేను ఆ పుస్తకాన్ని చివరిగా పూర్తి చేయడానికి చాలా రోజుల ముందు  చదువుతూ ఉండినాన?
Had I not been reading that book for days before I finally finished it? నేను ఆ పుస్తకాన్ని చివరిగా పూర్తి చేయడానికి చాలా రోజుల ముందు  చదువుతూ ఉండలేదా?

 

Where had I been reading that book for days before I finally finished it? నేను ఆ పుస్తకాన్ని పూర్తి చేయడానికి ముందు రోజుల తరబడి ఎక్కడ చదువుతున్నాను?
Why had I been reading that book for days before I finally finished it? నేను చివరికి ఆ పుస్తకాన్ని పూర్తి చేయడానికి ముందు రోజుల తరబడి ఎందుకు చదువుతున్నాను?
How had I been reading that book for days before I finally finished it? నేను ఆ పుస్తకాన్ని పూర్తి చేయడానికి ముందు రోజుల తరబడి ఎలా చదివాను?
Where hadn’t I been reading that book for days before I finally finished it? నేను ఆ పుస్తకాన్ని పూర్తి చేయడానికి చాలా రోజుల ముందు ఎక్కడ చదవలేదు?
Why hadn’t I been reading that book for days before I finally finished it? నేను ఆ పుస్తకాన్ని పూర్తి చేయడానికి ముందు రోజుల తరబడి ఎందుకు చదవలేదు?
How hadn’t I been reading that book for days before I finally finished it? నేను ఆ పుస్తకాన్ని పూర్తి చేయడానికి చాలా రోజుల ముందు ఎలా చదవలేదు?

 

2. Reason behind a former event or circumstance:   

To demonstrate how a current action led to a specific circumstance or outcome in the past.

గతంలో జరుగుతూ ఉండిన ఒక పని మరొక ఫలితానికి కారణం అవుతుంది ఇటువంటి వాక్యాలను తెలియజేయటానికి కూడా Past perfect continuous tense ని ఉపయోగిస్తారు.

 

యాక్టీవ్ వాయిస్, పాసివ్ వాయిస్ గురించి కొంత తెలుసుకొని కింది ఉదాహరణలు చదవండి. కొద్దిరోజుల తర్వాత మేము ఇదే ప్లేస్ లో యాక్టీవ్ వాయిస్ మరియు పాసివ్ వాయిస్  అప్డేట్ చేస్తాము

Examples: 

1.He was tired because he had been working all day. రోజంతా పనిచేస్తూ ఉండడం వలన అతను అలసిపోయి ఉండినాడు.
He was not tired because he had not been working all day. రోజంతా పనిచేస్తూ ఉండకపోవడం వలన అతను అలసిపోయి ఉండలేదు
Was he tired because he had been working all day? రోజంతా పనిచేస్తూ ఉండడం వలన అతను అలసిపోయి ఉండినాడా?
Was he not tired because he had not been working all day? అతను రోజంతా పనిచేస్తూ ఉండకపోవడం వలన అతను అలసిపోయి ఉండ లేదా?
2.He was exhausted because he had been working all night. రాత్రంతా పనిచేస్తూ ఉండడం వలన అతను అలసిపోయి ఉండినాడు
He was not exhausted because he had not been working all night. రాత్రంతా పనిచేస్తూ ఉండకపోవడం వలన అతను అలసిపోయి ఉండలేదు.
Was he exhausted because he had been working all night? రాత్రంతా పనిచేస్తూ ఉండడం వలన అతను అలసిపోయి ఉండినాడా?
Was he not exhausted because he had not been working all night? రాత్రంతా పనిచేస్తూ ఉండకపోవడం వలన అతను అలసిపోయి ఉండ లేదా?
3.She was drenched because she had been walking in the rain for an hour.  ఆమె గంటపాటు వర్షంలో నడుస్తూ ఉండడం వలన ఆమె తడిసిపోయి ఉండింది. 
She was not drenched because she had not been walking in the rain for an hour. ఆమె గంట పాటు వర్షంలో నడుస్తూ ఉండకపోవడం వలన ఆమె తడిసిపోయి ఉండలేదు.
Was she drenched because she had been walking in the rain for an hour? ఆమె గంట పాటు వర్షంలో నడుస్తూ ఉండడం వలన ఆమె తడిసిపోయి ఉండిందా?
Was she not drenched because she had not been walking in the rain for an hour? ఆమె గంటపాటు వర్షంలో నడుస్తూ ఉండకపోవడం వలన ఆమె తడిసిపోయి ఉండ లేదా?
4.They were upset because they had been arguing all morning. తెల్లవారే వరకు గొడవ పడుతూ ఉండడం వలన వారు కలతపడి ఉండినారు
They were not upset because they had not been arguing all morning. తెల్లవారే వరకు వారు గొడవ పడుతూ ఉండకపోవడం వలన వారు  కలతపడి ఉండలేదు
Were they upset because they had been arguing all morning? తెల్లవారే వరకు గొడవ పడుతూ ఉండడం వలన వారు కలతపడి ఉండినారా?
Were they not upset because they had not been arguing all morning? తెల్లవారే వరకు వారు గొడవ పడుతూ ఉండకపోవడం వలన వారు కలతపడి ఉండలేదా?
5.I was hungry because I had been skipping meals for a few days. కొన్ని రోజులుగా నేను భోజనం మానేస్తూ ఉండడం వలన ఆకలితో ఉండినాను.
I was not hungry because I had not been skipping meals for a few days. కొన్ని రోజులుగా నేను భోజనం మానేస్తూ ఉండకపోవడం వలన నేను ఆకలితో ఉండలేదు.
Was I hungry because I had been skipping meals for a few days? కొన్ని రోజులుగా నేను భోజనం మానేస్తూ ఉండడం వలన ఆకలితో ఉండి నాన?
Was I not hungry because I had not been skipping meals for a few days? కొన్ని రోజులుగా నేను భోజనం మానేస్తూ ఉండకపోవడం వలన నేను ఆకలితో ఉండలేదా?
6. She was relieved yesterday because she had been worrying about the exam results for weeks. కొన్ని వారాలుగా పరీక్షా ఫలితాల గురించి ఆమె ఆందోళన చెందుతూ ఉండడం వలన నిన్న ఉపశమనం పొందింది
She was not relieved yesterday because she had not been worrying about the exam results for weeks. కొన్ని వారాలుగా పరీక్ష ఫలితాల గురించి ఆమె ఆందోళన చెందుతూ  ఉండకపోవడం  వలన నిన్న ఉపశమనం పొందలేదు
Was she relieved yesterday because she had been worrying about the exam results for weeks? కొన్ని వారాలుగా పరీక్ష ఫలితాలు గురించి ఆందోళన చెందుతూ ఉండడం వలన నిన్న  ఆమె ఉపశమనం పొందిందా?
Was she not relieved yesterday because she had not been worrying about the exam results for weeks? కొన్ని వారాలుగా పరీక్ష ఫలితాలు గురించి ఆమె ఆందోళన చెందుతూ ఉండకపోవడం వలన నిన్న ఉపశమనం పొందలేదా?
7.He was in pain because he had been running without proper shoes.  అతను సరైన బూట్లు లేకుండా పరిగెత్తుతూ ఉండడం వలన  అతను నొప్పితో ఉండినాడు.
He was not in pain because he had not been running without proper shoes. అతను సరైన  బూట్లు లేకుండా పరిగెత్తుతూ ఉండకపోవడం వలన అతను నొప్పితో ఉండలేదు
Was he in pain because he had been running without proper shoes? అతను సరైన బూట్లు లేకుండా పరిగెత్తుతూ ఉండటం వలన అతను నొప్పితో ఉండినాడా?
Was he not in pain because he had not been running without proper shoes? అతను సరైన బూట్లు లేకుండా పరుగెత్తుతూ ఉండకపోవడం వలన అతను నొప్పితో ఉండలేదా?
8.They were late because they had been stuck in traffic for hours. వారు గంటల తరబడి ట్రాఫిక్ లో చిక్కుకొని పోవడం వలన ఆలస్యమైనారు.
They were not late because they had not been stuck in traffic for hours. ఒక గంటల తరబడి ట్రాఫిక్ లో చిక్కుకొని పోకపోవడం వలన ఆలస్యం కాలేదు.
Were they late because they had been stuck in traffic for hours? వారు గంటల తరబడి ట్రాఫిక్ లో చిక్కుకొని పోవడం వలన ఆలస్యమైనారా?
Were they not late because they had not been stuck in traffic for hours? వారు గంటల తరబడి ట్రాఫిక్ లో చిక్కుకొని పోక పోవడం వలన ఆలస్యం కాలేదా?
9. We were delighted because we had been planning the surprise party for months. మేము నెలల తరబడి ఆశ్చర్యకరమైన పార్టీని ప్లాన్ చేస్తున్నందున మేము సంతోషంగా ఉండినాము.
We were not delighted because we had not been planning the surprise party for months. మేము నెలల తరబడి ఆశ్చర్యకరమైన పార్టీని ప్లాన్ చేయనందున మేము సంతోషంగా  ఉండలేదు.
Were we delighted because we had been planning the surprise party for months? మేము నెలల తరబడి ఆశ్చర్యకరమైన పార్టీని ప్లాన్ చేస్తున్నందున మేము సంతోషంగా ఉండినామ?
Were we not delighted because we had not been planning the surprise party for months? మేము నెలల తరబడి ఆశ్చర్యకరమైన పార్టీని ప్లాన్ చేయనందున మేము సంతోషంగా  ఉండ లేదా?
10.She was annoyed because she had been waiting for him for over an hour. గంటకు పైగా అతని కోసం ఎదురుచూస్తూ ఉండి నందన ఆమె  చిరాకుగా ఉండింది.
She was not annoyed because she had not been waiting for him for over an hour. గంటకు పైగా అతని కోసం ఎదురు చూస్తూ ఉండనందన ఆమె చిరాకుగా ఉండలేదు.
Was she annoyed because she had been waiting for him for over an hour? గంటకు పైగా అతని కోసం ఎదురు చూస్తూ ఉండినందున ఆమె చిరాకుగా ఉండిందా?
Was she not annoyed because she had not been waiting for him for over an hour? గంటకు పైగా అతని కోసం ఎదురుచూస్తూ ఉండనందున ఆమె చిరాకుగా ఉండ లేదా?
11.He was satisfied because he had been practising the speech for days. అతను చాలా రోజులుగా ప్రసంగం ప్రాక్టీస్ చేస్తూ ఉండి నందున అతను సంతృప్తిగా ఉండినాడు.
He was not satisfied because he had not been practising the speech for days. అతను చాలా రోజులుగా ప్రసంగం ప్రాక్టీస్ చేస్తూ ఉండకపోవడం వలన అతను సంతృప్తిగా ఉండలేదు.
Was he satisfied because he had been practising the speech for days? చాలా రోజులుగా ప్రసంగం సాధన చేస్తూ ఉండడం వలన అతను సంతృప్తిగా ఉండినాడా?
Was he not satisfied because he had not been practising the speech for days? చాలా రోజులుగా ప్రసంగం సాధన చేస్తూ ఉండకపోవడం వలన అతని సంతృప్తిగా ఉండ లేదా? 

 

3. History of a former occurrence:          

To give background information about a Past action or event while highlighting its continuing character. 

గతంలో జరిగిపోయిన ఒక పని గురించి వివరించడానికి ఆ పని వెనక దానికి అనుబంధంగా కొంతకాలంగా జరుగుతూ వచ్చినటువంటి వాటిని గురించి తెలియజేయడానికి కూడా ఈ Past perfect continuous tense ని ఉపయోగిస్తారు.

Example: 

1. They had been living in the city for a few years before they moved to the countryside. పల్లెలకు వెళ్ళకు ముందు వారు కొన్ని సంవత్సరాలుగా పట్టణంలో నివసిస్తూ ఉండినారు
They had not been living in the city for a few years before they moved to the countryside. పల్లెలకు వెళ్ళకు ముందు వారు కొన్ని సంవత్సరాలుగా పట్టణంలో నివసిస్తూ ఉండలేదు
Had they been living in the city for a few years before they moved to the countryside? పల్లెలకు వెళ్ళకు ముందు వారు కొన్ని సంవత్సరాలుగా పట్టణంలో నివసిస్తూ ఉండినారా?
Had they not been living in the city for a few years before they moved to the countryside? పల్లెలకు వెళ్ళకు ముందు వారు కొన్ని సంవత్సరాలుగా పట్టణంలో నివసిస్తూ ఉండలేదా?
2. She had been teaching at the school for five years when she decided to pursue a different career. ఆమె వేరే వృత్తిని కొనసాగించాలని నిర్ణయించుకున్నప్పుడు ఆమె ఐదు సంవత్సరాలు పాఠశాలలో  బోధిస్తూ ఉండింది.
She had not been teaching at the school for five years when she decided to pursue a different career. ఆమె వేరే వృత్తిని కొనసాగించాలని నిర్ణయించుకున్నప్పుడు ఆమె ఐదు సంవత్సరాలు పాఠశాలలో  బోధిస్తూ  ఉండలేదు.
Had she been teaching at the school for five years when she decided to pursue a different career? ఆమె వేరే వృత్తిని కొనసాగించాలని నిర్ణయించుకున్నప్పుడు ఆమె ఐదు సంవత్సరాలు పాఠశాలలో  బోధిస్తూ  ఉండిందా?
Had she not been teaching at the school for five years when she decided to pursue a different career? ఆమె వేరే వృత్తిని కొనసాగించాలని నిర్ణయించుకున్నప్పుడు ఆమె ఐదు సంవత్సరాలు పాఠశాలలో  బోధిస్తూ  ఉండలేదా?
3. He had been working at the company for a decade before he was promoted to manager. అతను మేనేజర్‌గా పదోన్నతి పొందక ముందు ఒక దశాబ్దం పాటు కంపెనీలో పని చేస్తూ ఉండినాడు.
He had not been working at the company for a decade before he was promoted to manager. అతను మేనేజర్‌గా పదోన్నతి పొందకముందు ఒక దశాబ్దం పాటు కంపెనీలో పని  చేస్తూ ఉండలేదు.
Had he been working at the company for a decade before he was promoted to manager? అతను మేనేజర్‌గా పదోన్నతి పొందే ముందు ఒక దశాబ్దం పాటు కంపెనీలో పని  చేస్తూ ఉండినాడా?
Had he not been working at the company for a decade before he was promoted to manager? అతను మేనేజర్‌గా పదోన్నతి పొందే ముందు ఒక దశాబ్దం పాటు కంపెనీలో పని  చేస్తూ ఉండలేదా?
4. We had been saving money for a long time before we bought our first house. మేము మా మొదటి ఇంటిని కొనడానికి ముందు చాలా కాలం నుండి డబ్బు ఆదా చేస్తూ ఉండినాము.
We had not been saving money for a long time before we bought our first house. మేము మా మొదటి ఇంటిని కొనడానికి ముందు చాలా కాలం నుండి డబ్బు ఆదా  చేస్తూ ఉండలేదు.
Had we been saving money for a long time before we bought our first house? మేము మా మొదటి ఇంటిని కొనడానికి ముందు చాలా కాలం నుండి డబ్బు ఆదా చేస్తూ ఉండినామా?
Had we not been saving money for a long time before we bought our first house? మేము మా మొదటి ఇంటిని కొనడానికి ముందు చాలా కాలం నుండి డబ్బు ఆదా  చేస్తూ ఉండలేదా?
5.They had been talking for several months before they got engaged. వారు నిశ్చితార్థానికి ముందు చాలా నెలల పాటు మాట్లాడుకుంటూ ఉండినారు.
They had not been talking for several months before they got engaged. వారు నిశ్చితార్థానికి ముందు చాలా నెలలపాటు మాట్లాడుకుంటూ ఉండలేదు.
Had they been talking for several months before they got engaged? వారు నిశ్చితార్థానికి ముందు చాలా నెలల పాటు మాట్లాడుకుంటూ ఉండినారా?
Had they not been talking for several months before they got engaged? వారు నిశ్చితార్థానికి ముందు చాలా నెలలు పాటు మాట్లాడుకుంటూ ఉండలేదా?
6.I had been learning Spanish for two years before I traveled to Spain. నేను స్పెయిన్‌కు వెళ్లడానికి ముందు రెండు సంవత్సరాలు స్పానిష్ నేర్చుకుంటూ ఉండినాను
I had not been learning Spanish for two years before I traveled to Spain. నేను స్పెయిన్ కి వెళ్లడానికి ముందు రెండు సంవత్సరాలు స్పానిష్ నేర్చుకుంటూ ఉండలేదు.
Had I been learning Spanish for two years before I traveled to Spain? నేను స్పెయిన్‌కు వెళ్లడానికి ముందు రెండు సంవత్సరాలు స్పానిష్  నేర్చుకుంటూ ఉండి నాన?
Had I not been learning Spanish for two years before I traveled to Spain? నేను స్పెయిన్ కి వెళ్లడానికి ముందు రెండు సంవత్సరాలు స్పానిష్ నేర్చుకుంటూ ఉండలేదా?
7.She had been writing her novel for three years before it was published. ఆమె తన నవల ప్రచురించబడటానికి ముందు మూడు సంవత్సరాలుగా వ్రాస్తూ ఉండింది.
She had not been writing her novel for three years before it was published. ఆమె తన నవల ప్రచురించడానికి ముందు మూడు సంవత్సరాలుగా వ్రాస్తూ ఉండలేదు.
Had she been writing her novel for three years before it was published? ఆమె తన నవల ప్రచురించడానికి ముందు మూడు సంవత్సరాలుగా వ్రాస్తూ ఉండిందా?
Had she not been writing her novel for three years before it was published? ఆమె తన నవల  ప్రచురించడానికి ముందు మూడు సంవత్సరాలుగా వాస్తు ఉండలేదా?
8. He had been training for the marathon for six months before he ran the race. అతను రేసులో పరుగెత్తడానికి ముందు ఆరు నెలల పాటు మారథాన్ కోసం శిక్షణ  పొందుతూ ఉండినాడు.
He had not been training for the marathon for six months before he ran the race. అతను రేసులో పరుగెత్తడానికి ముందు ఆరు నెలల పాటు మారథాన్ కోసం శిక్షణ  పొందుతూ ఉండలేదు.
Had he been training for the marathon for six months before he ran the race? అతను రేసులో పరుగెత్తడానికి ముందు ఆరు నెలల పాటు మారథాన్ కోసం శిక్షణ పొందుతూ ఉండినాడా?
Had he not been training for the marathon for six months before he ran the race? అతను రేసులో పరుగెత్తడానికి ముందు ఆరు నెలల పాటు మారథాన్ కోసం శిక్షణ  పొందుతూ ఉండలేదా?
9. We had been planning our vacation for weeks before we finally booked the tickets. మేము చివరకు టిక్కెట్లు బుక్ చేయడానికి ముందు వారాలపాటు మా సెలవులను   ప్లాన్ చేస్తూ ఉండినాము.
We had not been planning our vacation for weeks before we finally booked the tickets. మేము చివరకు టిక్కెట్లు బుక్ చేసుకునే ముందు వారాలపాటు మా సెలవులను ప్లాన్  చేసుకుంటూ ఉండలేదు.
Had we been planning our vacation for weeks before we finally booked the tickets? మేము చివరకు టిక్కెట్లు బుక్ చేయడానికి ముందు వారాలపాటు మా సెలవులను ప్లాన్  చేస్తూ ఉండినామా?
Had we not been planning our vacation for weeks before we finally booked the tickets? మేము చివరకు టిక్కెట్లు బుక్ చేయడానికి ముందు వారాలపాటు మా సెలవులను ప్లాన్ చేస్తూ ఉండలేదా?
10. They had been researching the topic for months before they presented their findings.  వారు తమ ఫలితాలను సమర్పించడానికి ముందు వారు నెలల తరబడి అంశంపై పరిశోధన చేస్తూ ఉండినారు.
They had not been researching the topic for months before they presented their findings వారు తమ ఫలితాలను సమర్పించడానికి ముందు నెలల తరబడి ఈ అంశంపై పరిశోధన  చేస్తూ ఉండలేదు
Had they been researching the topic for months before they presented their findings? వారు తమ ఫలితాలను సమర్పించడానికి ముందు వారు నెలల తరబడి అంశంపై పరిశోధన  చేస్తూ ఉండినారా?
Had they not been researching the topic for months before they presented their findings? వారు తమ ఫలితాలను సమర్పించడానికి ముందు నెలల తరబడి అంశంపై పరిశోధన  చేస్తూ ఉండలేదా?

 

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!
Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.