Past Perfect-4

4. Statements with Conditions:        

To explain hypothetical circumstances or events that might have occurred if a condition had been met, use third-conditional statements.

గతంలో జరగవలసిన రెండు పనులు జరగలేదు. ఒకవేళ  మొదటి పని జరిగి ఉంటే  రెండో పని కూడా జరిగి ఉండేది అని ఊహాజనితంగా  చెప్పడానికి. ఈ Past perfect tense ని ఉపయోగిస్తారు. ఇటువంటి వాక్యాలను ‘if’ కండిషన్తో  ‘would’ ను ఉపయోగించి తెలియజేస్తారు. 

If=అయితే. 

would ని  will  కి భూతకాల పదం ( past word )  అని అంటారు

I will do .నేను చేస్తాను (feature simple)                     I would do .నేను చేసి ఉండేది

I will have done.నేను చేసి ఉంటాను (feature perfect) I would have done నేను చేసి ఉండేది.

Example:  She would have passed the exam, if she had studied harder.

       (ఆమె బాగా చదివి ఉండినట్లు అయితే, ఆమె పరీక్ష పాస్ అయి ఉండేది)                                                                                                                                                   

పై సెంటెన్స్ లో would have బదులు would had ఎందుకు ఉపయోగించలేదు?

Would అనే  సహాయక క్రియ ఆల్రెడీ గతించిన కాలాన్ని తెలియజేస్తుంది Had కూడా గతించిన కాలాన్ని తెలియజేస్తుంది. కాబట్టి had  యొక్క  మొదటి రూపమైన have  ఉండాలి

Negative మరియు  interrogative sentences గురించి పట్టికలో చూడండి.

Examples: 

1.If I had known about the traffic, I would have left earlier. ట్రాఫిక్ గురించి నాకు తెలిసినట్లు అయితే, ముందుగానే బయలుదేరి ఉండేది 
If I had not known about the traffic, I would not have left earlier. ట్రాఫిక్ గురించి నాకు తెలియనట్లు అయితే, ముందుగానే బయలుదేరి ఉండేది కాదు 
Would I have left earlier if I had known about the traffic? ట్రాఫిక్ గురించి నాకు తెలిసి ఉండి నట్లయితే ముందుగానే బయలుదేరి ఉండే వాడినా?
Would I not have left earlier if I had known about the traffic? ట్రాఫిక్ గురించి నాకు తెలిసి ఉండినట్లయితే నేను ముందుగానే బయలుదేరి ఉండే వాడిని కాదా?
2.She would have passed the exam if she had studied harder. కష్టపడి చదివినట్లయితే ఆమె  పరీక్ష పాస్ అయి ఉండేది.
She would not have passed the exam if she had not studied harder. ఆమె కష్టపడి చదవకపోయినట్లు అయితే, పరీక్ష పాస్ అయి ఉండేది కాదు.
Would she have passed the exam if she had studied harder? కష్టపడి చదివితే ఆమె పరీక్షలో పాసయ్యేదా?
Would she not have passed the exam if she had studied harder? ఆమె కష్టపడి చదివినట్లు అయితే, ఆమె పరీక్షలలో పాస్ అయి ఉండేది కాదా?
3. He would have completed the project on time if he had received the materials sooner. మెటీరియల్స్ త్వరగా అందితే అనుకున్న సమయానికి ప్రాజెక్ట్ పూర్తి చేసేవాడు.
He would not have completed the project on time if he had not received the materials sooner. అతను త్వరగా సామాగ్రిని పొందకపోతే అతను ప్రాజెక్ట్ను సకాలంలో పూర్తి చేసేవాడు కాదు.
Would he have completed the project on time if he had received the materials sooner? మెటీరియల్స్ త్వరగా అందితే అతను అనుకున్న సమయానికి ప్రాజెక్ట్ పూర్తి చేసేవాడా?
Would he not have completed the project on time if he had received the materials sooner? మెటీరియల్స్ త్వరగా అందితే అతను అనుకున్న సమయానికి ప్రాజెక్ట్ పూర్తి చేసేవాడు కాదు?
4.We would have visited the museum if we had arrived earlier. మేము ముందుగానే చేరినట్లు అయితే మ్యూజియంను సందర్శించి ఉండేవాళ్లం
We would not have visited the museum if we had not arrived earlier. మేము ముందుగానే చేరకపోయి ఉన్నట్లు అయితే మ్యూజియం సందర్శించి ఉండే వాళ్ళము కాదు 
Would we have visited the museum if we had arrived earlier? మేము ముందుగానే వచ్చి ఉండినట్లు అయితే మ్యూజియంను సందర్శించి ఉండే వాళ్ళమా?
Would we not have visited the museum if we had arrived earlier? మేము ముందుగానే వచ్చి ఉండనట్లు అయితే మ్యూజియంను  సందర్శించి ఉండే వాళ్ళము కాదా?
5.If she had known about the sale, she would have bought the dress. అమ్మకం గురించి ఆమెకి తెలిసి ఉండినట్లు అయితే, ఆమె డ్రెస్ కొని ఉండేది
If she had not known about the sale, she would not have bought the dress.  అమ్మకం గురించి ఆమెకి తెలియక పోయినట్లు అయితే, ఆమె అడ్రస్ కొని ఉండేది కాదు
Would she have bought the dress if she had known about the sale? అమ్మకం గురించి ఆమెకు తెలిసి ఉండినట్లు అయితే, ఆమె డ్రస్ కొని ఉండేదా?
Would she not have bought the dress if she had known about the sale? అమ్మకం గురించి ఆమెకు తెలిసి ఉండినట్లు అయితే ఆమె అడ్రస్ కొని ఉండేది కాదా?
6.They would have attended the wedding if we had invited them. మేము వారిని ఆహ్వానించినట్లు అయితే, వారు వివాహానికి హాజరు అయి ఉండేవారు
They would not have attended the wedding if we had not invited. మేము వారిని ఆహ్వానించకపోయినట్లు అయితే వారు  వివాహానికి హాజరు అయి ఉండేవారు కాదు.
Would they have attended the wedding if we had invited? మేము వారిని ఆహ్వానించినట్లు అయితే వారు  వివాహానికి హాజరయ్యి ఉండేవారా?
Would they not have attended the wedding if we had invited? మేము వారిని ఆహ్వానించినట్లు అయితే వారు వివాహానికి హాజరై ఉండేవారు కాదా?
7.I would have joined you for dinner if I had finished work earlier. నేను ఇంతకుముందే పని పూర్తి చేసి ఉంటే మీతో డిన్నర్‌కి చేరి ఉండేవాడిని.
I would not have joined you for dinner if I had not finished work earlier. నేను ఇంతకు ముందు పని పూర్తి చేయకపోతే నేను మీతో భోజనానికి చేరేవాడిని కాదు.
Would I have joined you for dinner if I had finished work earlier? నేను ఇంతకుముందే పని పూర్తి చేసి ఉంటే నేను మీతో డిన్నర్‌కి చేరి ఉండే వాడినా?
Would I not have joined you for dinner if I had finished work earlier? నేను ఇంతకుముందే పని పూర్తి చేసి ఉంటే నేను మీతో డిన్నర్‌కి చేరకుండా ఉండేవాడినా?
8.He would have met us at the party if he had known the time. ఆయనకు సమయం తెలిసి ఉండినట్లు అయితే, అతను మమ్ములను పార్టీలో కలిసి ఉండేవాడు.
He would not have met us at the party if he had not known the time. ఆయనకు సమయం తెలియక పోయినట్లు అయితే, అతను మమ్మల్ని పార్టీలో కలిసి ఉండేవాడు కాదు
Would he have met us at the party if he had known the time? ఆయనకు సమయం తెలిసి ఉన్నట్లు అయితే మమ్ములను పార్టీలో కలిసి ఉండేవాడా?
Would he not have met us at the party if he had known the time? ఆయనకు సమయం తెలిసి ఉన్నట్లు అయితే మమ్ములను పార్టీలో కలిసి ఉండేవాడు కాదా?
9.If they had known about the traffic, they would have left earlier. వారికి ట్రాఫిక్ గురించి తెలిసి ఉండినట్లు అయితే, ముందుగానే బయలుదేరి ఉండేవారు
If they had not known about the traffic, they would not have left earlier. వారికి ట్రాఫిక్ గురించి  తెలియక ఉండనట్లు అయితే ముందుగానే బయలుదేరి ఉండేవారు కాదు
Would they have left earlier if they had known about the traffic? వారికి ట్రాఫిక్ గురించి తెలిసి ఉండినట్లు అయితే ముందుగానే బయలుదేరి ఉండేవారా?
Would they not have left earlier if they had known about the traffic? వారికి ట్రాఫిక్ గురించి తెలిసి ఉండనట్లు అయితే, ముందుగానే బయలుదేరి ఉండేవారు కాదా?