...

Present continues -1

Present continuous tense        

The present continuous tense is used in several cases:

ఒక పని ఎప్పుడు ప్రారంభమైందో మనకి అనవసరం ఎప్పుడు ముగుస్తుందో మనకు అనవసరం కానీ ప్రస్తుతానికి కంటిన్యూషన్ గా ఆగకుండా,మనం మాట్లాడుతున్నప్పుడు జరుగుతూ ఉంటే దాన్ని ఈ Present continuous tense లో తెలియజేస్తారు.

I + am + v1 + ing + object

He, She, It   + is + v1+ ing + Object

We, You, They  + are + V1 + ing + Object

ఈ టెన్స్ లో సబ్జెక్టు ఏదైనా క్రియ మొదటి రూపానికి (V1) ‘ing’ ఫామ్ కలపాలి

v1 + ing = v4 అని కూడా అంటారు.

Examples:

go+ing= going

Come+ing= Coming

Run+ing= Running

ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ లో వాక్యాలను వ్యతిరేక వాక్యాలుగా మార్చడానికి am, is,are  పక్కన Not  చేర్చాలి.

Example: 

She is reading a book right now. (PS) (ఆమె ప్రస్తుతం పుస్తకం చదువుతూ ఉంది  )

 పై వాక్యమును నెగిటివ్ సెంటెన్స్ గా మార్చుటకు is ప్రక్కన Not చేర్చాలి.

She is not reading a book right now (NS)

పాజిటివ్ సెంటెన్స్ మరియు నెగటివ్ సెంటెన్స్ రెండింటినీ ప్రశ్న వాక్యాలుగా మార్చుటకు సహాయక క్రియ అయిన is ని సబ్జెక్ట్ అయిన she కి ముందు ఉంచాలి.

Is she reading a book right now? (Interrogative Sentence)

Is she not reading a book right now (NIS) is not = isn’t   (Isn’t she reading a book right now అని కూడా చదవవచ్చు.)

 

1. Actions happening at the moment of  speaking:  

 Describes  actions currently in progress

మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు, మన కళ్ళ ముందు కంటిన్యూగా జరుగుతూ ఉండేటువంటి పనులను గురించి తెలియజేయడానికి Present continuous tense ని ఉపయోగిస్తారు

Example: 

1.She is reading a book right now.                                   (Positive) ఆమె ప్రస్తుతం ఒక పుస్తకం చదువుతూ…. ఉంది.
She is not reading a book right now.               ( negative) ఆమె ప్రస్తుతం పుస్తకం చదవడం లేదు.(ఆమె ప్రస్తుతం పుస్తకం చదవడం లేదు.  ఆమె ప్రస్తుతం ఒక పుస్తకం చదువుతూ ఉండలేదు. అని దీర్ఘంగా నెగటివ్ లో చెప్పడం ఎబెట్టుగా ఉంటుంది. కాబట్టి సింపుల్ గా ఆమె ఇప్పుడు పుస్తకం చదవడం లేదు అని చెప్పవచ్చు). 
Is she reading a book right now?      ( interrogative) ఆమె ప్రస్తుతం పుస్తకం చదువుతూ….. ఉందా?
Isn’t she reading a book right now?   ( negative interrogative) ఆమె ప్రస్తుతం పుస్తకం చదవడం లేదా?
2.He is watching TV at the moment. అతను ప్రస్తుతం టీవీ చూస్తూ ఉన్నాడు.
He is not watching TV at the moment. ప్రస్తుతం అతను టీవీ చూడటం లేదు.
Is he watching TV at the moment? అతను ప్రస్తుతం టీవీ చూస్తూ ఉన్నాడా?
Isn’t he watching TV at the moment? అతను ప్రస్తుతం టీవీ చూడటం లేదా?
3.They are playing cricket in the park. వారు పార్కులో క్రికెట్ ఆడుతూ ఉన్నారు.
They are not playing cricket in the park. వారు పార్కులో  క్రికెట్ ఆడటం లేదు.
Are they playing cricket in the park? వారు పార్కులో  క్రికెట్ ఆడుతూ ఉన్నారా?
Aren’t they playing cricket in the park? వారు పార్కులో  క్రికెట్ ఆడటం లేదా?
4.I am writing an email to my friend. నేను నా స్నేహితుడికి ఇమెయిల్ రాస్తూ ఉన్నాను.
I am not writing an email to my friend. నేను నా స్నేహితుడికి ఇమెయిల్ రాయడం లేదు.
Am I writing an email to my friend? నేను నా స్నేహితుడికి ఇమెయిల్ రాస్తూ ఉన్నానా?
Am I not writing an email to my friend? నేను నా స్నేహితుడికి ఇమెయిల్ రాయడం లేదా?
5.She is cooking dinner in the kitchen. ఆమె వంటగదిలో రాత్రి భోజనం వండుతూ ఉంది.
She is not cooking dinner in the kitchen. ఆమె వంటగదిలో రాత్రి భోజనం చేయడం లేదు.
Is she cooking dinner in the kitchen? ఆమె వంటగదిలో రాత్రి భోజనం వండుతూ ఉందా?
Isn’t she cooking dinner in the kitchen? ఆమె వంటగదిలో రాత్రి భోజనం చేయడం లేదా?
6.He is taking a shower right now. అతను ప్రస్తుతం స్నానం చేస్తూ ఉన్నాడు.
He is not taking a shower right now. అతను ప్రస్తుతం స్నానం చేయడం లేదు.
Is he taking a shower right now? అతను ప్రస్తుతం స్నానం చేస్తూ ఉన్నాడా?
Isn’t he taking a shower right now? అతను ప్రస్తుతం స్నానం చేయడం లేదా?
7.The baby is sleeping in the crib. పాప తొట్టిలో నిద్ర పోతూ ఉంది.
The baby is not sleeping in the crib. పాప  తొట్టిలో నిద్రపోవడం లేదు
Is the baby sleeping in the crib? పిల్లవాడు తొట్టిలో నిద్ర పోతూ ఉన్నాడా?
Isn’t the baby sleeping in the crib? పిల్లవాడు తొట్టిలో నిద్రపోవడం లేదా?
8.We are listening to music. మేము సంగీతం వింటూ ఉన్నాము.

(we= మేము/ మనము)పైన మేము అనే స్థానంలో మనము కూడా ఉంచవచ్చు 

We are not listening to music. మేము సంగీతం వినడం లేదు.
Are we listening to music? మేము సంగీతం వింటూ ఉన్నామా?
Aren’t we listening to music? మేము సంగీతం వినడం లేదా?
9.She is talking on the phone with her mother. ఆమె తన తల్లితో ఫోన్‌లో మాట్లాడుతూ ఉంది.
She is not talking on the phone with her mother. ఆమె తన తల్లితో ఫోన్‌లో మాట్లాడటం లేదు.
Is she talking on the phone with her mother? ఆమె తన తల్లితో ఫోన్‌లో మాట్లాడుతూ ఉందా?
Isn’t she talking on the phone with her mother? ఆమె తన తల్లితో ఫోన్‌లో మాట్లాడటం లేదా?
10.He is studying for his exams. అతను తన పరీక్షల కోసం చదువుతూ  ఉన్నాడు.
He is not studying for his exams. అతను తన పరీక్షల కోసం చదవడం లేదు.
Is he studying for his exams? అతను తన పరీక్షల కోసం చదువుతూ ఉన్నాడా? రేయ్
Isn’t he studying for his exams? అతను పరీక్షలకు చదువుకోవడం లేదా?
11.The cat is sitting on the window. పిల్లి కిటికీ మీద కూర్చుని ఉంది.
The cat is not sitting on the window. పిల్లి కిటికీ మీద కూర్చోలేదు.
Is the cat sitting on the window? పిల్లి కిటికీ మీద కూర్చుని ఉందా?
Isn’t the cat sitting on the window? పిల్లి కిటికీ మీద కూర్చోలేదా?
12.They are dancing at the party. వారు పార్టీలో డ్యాన్స్ చేస్తూ ఉన్నారు.
They are not dancing at the party. వారు పార్టీలో డ్యాన్స్ చేయడం లేదు.
Are they dancing at the party? వారు పార్టీలో డ్యాన్స్ చేస్తూ ఉన్నారా?
Aren’t they dancing at the party? వారు పార్టీలో డ్యాన్స్ చేయడం లేదా?
13.I am drinking a cup of coffee. నేను ఒక కప్పు కాఫీ తాగుతూ ఉన్నాను.
I am not drinking a cup of coffee. నేను కప్పు కాఫీ తాగడం లేదు.
Am I drinking a cup of coffee? నేను ఒక కప్పు కాఫీ తాగుతున్నానా?
Am I not drinking a cup of coffee? నేను ఒక కప్పు కాఫీ తాగడం లేదా?
14.She is painting a picture. ఆమె ఒక చిత్రాన్ని పెయింటింగ్ చేస్తోంది.
She is not painting a picture. ఆమె ఒక చిత్రాన్ని పెయింటింగ్ చేయడం లేదు 
Is she painting a picture? ఆమె ఒక చిత్రాన్ని పెయింటింగ్ చేస్తుందా?
Isn’t she painting a picture? ఆమె ఒక చిత్రాన్ని పెయింటింగ్ చేయడం లేదా?
15.He is fixing his bicycle. అతను తన సైకిల్‌ను సరి చేస్తూ ఉన్నాడు.
He is not fixing his bicycle. అతను తన సైకిల్‌ను సరిచేయడం లేదు.
Is he fixing his bicycle? అతను తన సైకిల్‌ను సరిచేస్తున్నాడా?
Isn’t he fixing his bicycle? అతను తన సైకిల్‌ను సరిచేసుకోవడం లేదా?
16.The kids are playing video games. పిల్లలు వీడియో గేమ్‌లు ఆడుతూ ఉన్నారు.
The kids are not playing video games. పిల్లలు వీడియో గేమ్‌లు ఆడడం లేదు.
Are the kids playing video games? పిల్లలు వీడియో గేమ్‌లు  ఆడుతూ ఉన్నారా?
Aren’t the kids playing video games? పిల్లలు వీడియో గేమ్‌లు ఆడటం లేదా?
17.We are walking in the park. మేము/ మనం పార్కులో నడుస్తూ ఉన్నాము.
We are not walking in the park. మేము పార్కులో నడవడం లేదు.
Are we walking in the park? మేము పార్కులో  నడుస్తూ ఉన్నామా?
Aren’t we walking in the park? మనం పార్కులో నడవడం లేదా?
18.She is looking for her keys. ఆమె తన తాళం  కోసం వెతుకుతూ ఉంది.
She is not looking for her keys. ఆమె తన తాళం  కోసం వెతకడం లేదు.
Is she looking for her keys? ఆమె తన తాళం  కోసం వెతుకుతూ ఉందా?
Isn’t she looking for her keys? ఆమె తన తాళం  కోసం వెతకడం లేదా?
19.He is doing his homework. అతను తన హోంవర్క్ చేస్తూ ఉన్నాడు.
He is not doing his homework. అతను తన హోంవర్క్ చేయడం లేదు.
Is he doing his homework? అతను తన హోంవర్క్ చేస్తూ ఉన్నాడా?
Isn’t he doing his homework? అతను హోంవర్క్ చేయడం లేదా?
20.They are having a meeting in the conference room. కాన్ఫరెన్స్ హాల్‌లో వారు సమావేశం అవుతూ ఉన్నారు.
They are not having a meeting in the conference room. వారు సమావేశ మందిరంలో సమావేశం కావడం లేదు.
Are they having a meeting in the conference room? వారు కాన్ఫరెన్స్ హాల్‌లో సమావేశమవుతున్నారా?
Aren’t they having a meeting in the conference room? వాళ్ళు కాన్ఫరెన్స్ హాల్‌లో మీటింగ్ పెట్టుకోవడం లేదా?

 

Wh,  Questions  అంటే ఏమిటి?

who,what,where,when,why,how అను పదాలను ఉపయోగించి ప్రశ్నావ్యాలను తయారు  చేయ్యడాన్ని wh questions అంటారు.

who=ఎవరు?, what= ఏమిటి?, where= ఎక్కడ?, when= ఎప్పుడు?, why= ఎందుకు?, how=ఎలా?

కొన్ని వాక్యాలకు Wh పదాలను అన్నిటిని ఉపయోగించి ప్రశ్న వాక్యాలు తయారు చేయడం సాధ్యపడదు.

పైనున్న రెండు వాక్యాలను ప్రశ్నా వాక్యాలుగా మార్చడానికి wh పదాలను తీసుకెళ్లి వాటి ముందు అతికిస్తే  సరిపోతుంది.

 

Where is he doing his homework? అతను తన హోంవర్క్ ఎక్కడ చేస్తున్నాడు?
When is he doing his homework? అతను తన హోంవర్క్ ఎప్పుడు చేస్తున్నాడు?
Why is he doing his homework? అతను తన హోంవర్క్ ఎందుకు చేస్తున్నాడు?
How is he doing his homework? అతను తన హోంవర్క్ ఎలా చేస్తున్నాడు?
Where isn’t he doing his homework? అతను తన హోంవర్క్ ఎక్కడ చేయడం లేదు?
When isn’t he doing his homework? అతను తన హోంవర్క్ ఎప్పుడు చేయడం లేదు?
Why isn’t he doing his homework? అతను తన హోంవర్క్ ఎందుకు చేయడం లేదు?
How isn’t he doing his homework? అతను తన హోంవర్క్ ఎలా చేయడం లేదు?

 

 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!
Scroll to Top
Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.