Present Perfect Continuous-1

Present perfect continuous tense 

గతంలో ఒక పని ప్రారంభించబడి అది ఇప్పటికీ కూడా  ఇంకా కంటిన్యూగా కొనసాగుతూ ఉంటే ఇటువంటి సందర్భాలలో ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ని ఉపయోగిస్తారు.

He, She, It  + Has been + V1 + Ing + Object 

I, We, You, They   + Have Been + V1 + Ing + Object

నెగిటివ్ సెంటెన్స్ కి Has మరియు Have తర్వాత Not ఉంచాలి. ప్రశ్నా వాక్యాలను తయారు చేయడానికి, Has, Have లను సబ్జెక్టుకి మొదట ఉంచితే సరిపోతుంది. క్రింది  టేబుల్ ని జాగ్రత్తగా గమనించండి. 

1.Ongoing Actions:            

ఒక పని గతంలో ప్రారంభించబడి ఇంకా కొనసాగుతూ ఉంటే గతం అనగా నిన్న కావచ్చు, అంతకు ముందు కావచ్చు, ఇప్పటికీ కూడా ఇంకా ఆ పనులు కంటిన్యూగా జరుగుతూ ఉంటే అటువంటి వాక్యాలను Present perfect continuous tense లో తెలియజేస్తారు.

Examples: I have been reading (నేను ఇంకా చదువుతూనే ఉన్నాను. అంటే ఈ చదవడం అనేది ఎప్పుడో ప్రారంభమైంది కానీ ఇంకా కొనసాగుతూనే ఉంది అని అర్థం) 

 

1. I have been reading. నేను ఇంకా చదువుతూనే ఉన్నాను.
I have not been reading. నేను ఇంకా చదవలేదు.(నేను చదవలేదు.  అని సింపుల్ గా కూడా చెప్పవచ్చు)
Have I been reading? నేను ఇంకా చదువుతున్నానా?
Haven’t I been reading? ఇంకా నేను  చదవలేదా?

(నేను చదవలేదా?. అని కూడా చెప్పవచ్చు)

2.She has been working. ఆమె ఇంకా పని చేస్తూనే ఉంది.
She has not been working. ఆమె ఇంకా పని చేయడం లేదు.
Has she been working? ఆమె ఇంకా పని చేస్తూనే ఉందా?
Hasn’t she been working? ఆమె ఇంకా పని చేయలేదా?
3.They have been living. వారు ఇంకా జీవిస్తూనే ఉన్నారు.
They have not been living. వారు ఇంకా జీవిస్తూనే ఉండలేదు.
Have they been living? వారి ఇంకా జీవిస్తూనే ఉన్నారా?
Haven’t they been living? వారి ఇంకా జీవిస్తూనే ఉండలేదా?
4.He has been studying. అతను ఇంకా చదువుకుంటూనే ఉన్నాడు.
He has not been studying. అతని ఇంకా చదువుకుంటూనే ఉండలేదు.
Has he been studying? అతను ఇంకా చదువుకుంటూనే ఉన్నాడా.?
Hasn’t he been studying? అతని ఇంకా చదువుకుంటూనే ఉండలేదా?
5.We have been waiting. మేము ఇంకా వేచి ఉన్నాము.
We have not been waiting. మేం ఇంకా ఎదురుచూడలేదు.
Have we been waiting? మేము ఇంకా వేచి ఉన్నామా?
Haven’t we been waiting? మేము ఇంకా వేచి ఉండలేదా?
6.I have been practicing. నేను ఇంకా సాధన చేస్తూనే ఉన్నాను.
I have not been practicing. నేను ఇంకా సాధన చేయలేదు.
Have I been practicing? నేను ఇంకా సాధన చేస్తూనే ఉన్నానా?
Haven’t I been practicing? నేను ఇంకా సాధన చేయలేదా?
7.She has been trying. ఆమె ఇంకా ప్రయత్నిస్తూనే ఉంది.
She has not been trying. ఆమె ఇంకా ప్రయత్నించలేదు.
Has she been trying? ఆమె ఇంకా  ప్రయత్నిస్తూనే ఉందా?
Hasn’t she been trying? ఆమె ఇంకా ప్రయత్నించలేదా?
8.They have been building a new one. వారు ఇంకా కొత్తది  నిర్మిస్తూనే ఉన్నారు.
They have not been building the new. వారు ఇంకా కొత్తది నిర్మిస్తూ  లేరు.
Have they been building the new? వారు ఇంకా కొత్తది  నిర్మిస్తూనే ఉన్నారా?
Haven’t they been building the new? వారు ఇంకా  కొత్తది నిర్మిస్తూ లేరా?
9.He has been cooking. అతను ఇంకా వంట చేస్తూనే ఉన్నాడు.
He has not been cooking. అతను ఇంకా వంట చేయడం లేదు.
Has he been cooking? అతను ఇంకా వంట  చేస్తూనే ఉన్నాడా?
Hasn’t he been cooking? అతను ఇంకా వంట చేయలేదా?
10.We have been discussing. మేము ఇంకా చర్చిస్తూనే ఉన్నాం.
We have not been discussing. మేం ఇంకా చర్చించుకోలేదు.
Have we been discussing? మేము ఇంకా  చర్చిస్తూనే  ఉన్నామా?
Haven’t we been discussing? మేము ఇంకా చర్చించుకోలేదా?
11.The team has been training. జట్టు ఇంకా శిక్షణ  పొందుతూనే ఉంది.
The team has not been training. జట్టు ఇంకా శిక్షణ తీసుకోలేదు.
Has the team been training? జట్టు ఇంకా శిక్షణ  పొందుతూనే ఉందా?
Hasn’t the team been training? జట్టు  ఇంకా శిక్షణ పొందుతూ లేదా?
12.You have been improving. మీరు ఇంకా  మెరుగుపడుతూనే ఉన్నారు.
You have not been improving. మీరు ఇంకా మెరుగుపడలేదు.
Have you been improving? మీరు ఇంకా  మెరుగుపడుతూనే ఉన్నారా?
Haven’t you been improving? మీరు ఇంకా మెరుగుపడలేదా?
13.My friends have been planning. నా స్నేహితులు ఇంకా ప్లాన్ చేస్తూనే ఉన్నారు. 
My friends have not been planning. నా స్నేహితులు ఇంకా ప్రణాళిక వేయలేదు.
Have my friends been planning? నా స్నేహితులు ఇంకా ప్లాన్ చేస్తూనే ఉన్నారా?
Haven’t my friends been planning? నా స్నేహితులు ఇంకా ప్లాన్ చేయలేదా?
14.The company has been developing. సంస్థ ఇంకా అభివృద్ధి చెందుతూనే ఉంది.
The company has not been developing. కంపెనీ ఇంకా అభివృద్ధి చెందలేదు.
Has the company been developing? కంపెనీ ఇంకా అభివృద్ధి  చెందుతూనే ఉందా?
Hasn’t the company been developing? కంపెనీ ఇంకా అభివృద్ధి చెందలేదా?
15.The tiger has been hunting. పులి ఇంకా వేటాడుతూ ఉంది. 
The tiger has not been hunting. పులి ఇంకా వేటాడలేదు.
Has the tiger been hunting? పులి  ఇంకా వేటాడుతూ ఉందా?
Hasn’t the tiger been hunting? పులి  ఇంకా వేటాడలేదా?
16.Ramesh has been seeing. రమేష్  ఇంకా చూస్తూనే ఉన్నాడు.
Ramesh has not been seeing. రమేష్  ఇంకా చూడలేదు.
Has Ramesh been seeing? రమేష్  ఇంకా  చూస్తూనే ఉన్నాడా?
Hasn’t Ramesh been seeing? రమేష్ ఇంకా చూడలేదా?
17.It has been eating. అది  ఇంకా తింటూనే ఉంది.
It has not been eating. అది ఇంకా తినలేదు.
Has it been eating? అది  ఇంకా తింటూనే ఉందా?
Hasn’t it been eating? అది ఇంకా తినడం లేదా?
18.They have been coming. వాళ్లు ఇంకా వస్తూనే ఉన్నారు.
They have not been coming. వారు ఇంకా రావడం లేదు.
Have they been coming? వారు ఇంకా వస్తూనే ఉన్నారా?
Haven’t they been coming? వారు ఇంకా రావడం లేదా?
19.Sangeetha has been writing. సంగీత ఇంకా రాస్తూనే ఉంది.
Sangeetha has not been writing. సంగీత ఇంకా రాయలేదు.
Has Sangeetha been writing? సంగీత  ఇంకా రాస్తూనే ఉందా?
Hasn’t Sangeetha been writing? సంగీత ఇంకా రాయలేదా?
20.We have been swimming. మేము ఇంకా ఈత కొడుతూనే ఉన్నాము.
We have not been swimming. మేము ఇంకా ఈత కొట్టలేదు.
Have we been swimming? మేము ఇంకా  ఈత కొడుతూనే ఉన్నామా?
Haven’t we been swimming? మేము ఇంకా కొడుతూనే ఉండ లేదా? 

 

Where have we been swimming? మేము ఎక్కడ  ఇంకా  కొడుతూనే ఉన్నాము?
When have we been swimming? మేము ఎప్పుడు  ఇంకా ఈత కొడుతూనే ఉన్నాము?
Why have we been swimming? మేము ఎందుకు ఇంకా ఈత కొడుతూనే ఉన్నాము?
How have we been swimming? మేము ఎలా  ఇంకాఈత కొడుతూనే ఉండలేదు?
Where haven’t we been swimming? మేము ఎక్కడ ఇంకాఈత కొడుతూనే ఉండలేదు?
When haven’t we been swimming? మేము ఎప్పుడు ఇంకాఈత కొడుతూనే ఉండలేదు?
Why haven’t we been swimming? మేము ఎందుకు ఇంకాఈత కొడుతూనే ఉండలేదు?
How haven’t we been swimming? మేము ఎలా ఇంకాఈత కొడుతూనే ఉండలేదు?