...

Simple Future-1

Simple Future Tense 

In many situations, the simple future tense is employed to denote future actions or events. Here are a few typical cases: భవిష్యత్తులో జరిగే పనులను గురించి తెలియజేయడానికి సింపుల్ ఫ్యూచర్ టెన్స్ ని ఉపయోగిస్తారు. 

He, She, It, I, We, You, They  + will  + V1 + Object

1.Action Sentences: 

భవిష్యత్తులో జరిగే పనులను  తెలియజేసే వాక్యాలు, ఈ వాక్యాల నిర్మాణానికి అన్ని సబ్జెక్టులకు ‘will’ అనే సహాయక క్రియను  ఉపయోగించి verb మొదటి రూపం  V1 తో వాక్య నిర్మాణం చేయాలి.

He, She, It, I, We, You, They  + will  + V1 + Object

Example:

The teacher will explain the topic again (P)  (టీచర్ టాపిక్ ని   మరల వివరిస్తుంది) (మరలా వివరిస్తుంది భవిష్యత్తులో ఎప్పుడో ఈ పని జరుగుతుంది)

దీన్ని నెగిటివ్ సెంటెన్స్ గా మార్చటానికి will  ప్రక్కన not చేర్చాలి.

The teacher will not explain the topic again (N)

పైనున్న రెండు వాక్యాలను ప్రశ్నా వాక్యాలుగా మార్చడానికి ‘will’సబ్జెక్టులకు ముందు ఉంచితే సరిపోతుంది

Will the teacher explain the topic again (I)

Will the teacher not explain the topic again (NI)

మరికొన్ని ఉదాహరణలు కింది పట్టికలో గమనించండి.

1.She will visit her grandparents tomorrow. ఆమె రేపు తన తాతలను సందర్శించనుంది.
She will not visit her grandparents tomorrow. ఆమె రేపు తన తాతలను సందర్శించదు.
Will she visit her grandparents tomorrow? ఆమె రేపు తన తాతలను సందర్శిస్తుందా?
Will she not visit her grandparents tomorrow? ఆమె రేపు తన తాతలను సందర్శించదా?
2.He will finish his homework by evening. అతను సాయంత్రానికి ఇంటి పని పూర్తి చేస్తాడు.
He will not finish his homework by evening. అతను సాయంత్రం వరకు తన ఇంటి పనిని పూర్తి చేయడు.
Will he finish his homework by evening? అతను సాయంత్రంలోగా తన హోంవర్క్ పూర్తి చేస్తాడా?
Will he not finish his homework by evening? అతను సాయంత్రం వరకు తన ఇంటి పనిని పూర్తి చేయడా?
3.They will attend the meeting next week. వారు వచ్చే వారం సమావేశానికి హాజరుకానున్నారు.
They will not attend the meeting next week. వారు వచ్చే వారం సమావేశానికి హాజరుకారు.
Will they attend the meeting next week? వారు వచ్చే వారం సమావేశానికి హాజరవుతారా?
Will they not attend the meeting next week? వారు వచ్చే వారం సమావేశానికి హాజరు కారా?
4.We will go to the beach this weekend. మేము ఈ వారాంతంలో బీచ్‌కి వెళ్తాము.
We will not go to the beach this weekend. మేము ఈ వారాంతంలో బీచ్‌కి వెళ్లము.
Will we go to the beach this weekend? ఈ వారాంతంలో మేము  బీచ్‌కి వెళ్తామా?
Will we not go to the beach this weekend? ఈ వారాంతంలో మేము  బీచ్‌కి వెళ్లమా?
5.The company will launch a new product soon. కంపెనీ త్వరలో కొత్త ఉత్పత్తిని (వస్తువు) ప్రారంభించనుంది.
The company will not launch a new product soon. కంపెనీ త్వరలో కొత్త ఉత్పత్తిని ప్రారంభించదు.
Will the company launch a new product soon? కంపెనీ త్వరలో కొత్త ఉత్పత్తిని విడుదల చేస్తుందా?
Will the company not launch a new product soon? కంపెనీ త్వరలో కొత్త ఉత్పత్తిని ప్రారంభించదా?

2. State Sentences:

Describe future conditions,Feelings, or  states of being భవిష్యత్తులో ఏదైనా స్థితి లేదా పరిస్థితులను గురించి తెలియజేయడానికి సింపుల్ ఫ్యూచర్ టెన్స్ ని ఉపయోగిస్తారు.

రేపు మీటింగ్ ఉంటుంది ( రేపు మీటింగ్ పరిస్థితి అది).

అతను రేపు ఇంటిలో ఉంటాడు ( రేపు అతని పరిస్థితి అది).

తరువాత రైలు నాలుగు గంటలకు ఉంటుంది ( తరువాత రైలు పరిస్థితి ఇది).

వారు రేపు రైల్వే స్టేషన్లో ఉంటారు ( రేపు వారి పరిస్థితి ఇది) .

రేపు ఆమె సంతోషంగా ఉంటుంది ( రేపు ఆమె పరిస్థితి ఇది).

ఈ విధంగా భవిష్యత్తులో స్థితి లేదా పరిస్థితులను గురించి తెలియజేస్తూ ఉంటుంది, ఉంటాడు, ఉంటారు అని వస్తే ఇటువంటి వాక్యాలను భవిష్యత్తుస్థితిని తెలియజేసే వాక్యాలు అంటారు. స్థితిని తెలియజేసే వాక్యాలను క్రింది స్ట్రక్చర్ ప్రకారం నిర్మించాలి.

అన్ని సబ్జెక్టులకు ‘will be’అనే సహాయక్రియతో సెంటెన్స్ రూపొందించాలి.

 

He, She, It, I, We, You, They   + will be + స్థితిని తెలియజేసే వాక్యాలకు object ఉండదు.

Example:

The meeting will be at 9:00 a.m. tomorrow (P) (మీటింగ్ రేపు ఉదయం 9 గంటలకు ఉంటుంది)

ఫై సెంటెన్స్ ని  నెగిటివ్ సెంటెన్స్ గా మార్చుటకు will  తర్వాత ‘not’  ని చేర్చాలి. 

The meeting will not be at 9:00 a.m. tomorrow (N)

పై రెండు సెంటెన్స్ ని ప్రశ్న వాక్యాలుగా మార్చుటకు will ని  మొదట ఉంచాలి.

Will the meeting be at 9:00 a.m. tomorrow? (I) ( రేపు ఉదయం 9 గంటలకు మీటింగ్ ఉంటుందా?) 

Will the meeting not be at 9:00 a.m. tomorrow? (NI) (రేపు ఉదయం 9 గంటలకు మీటింగ్ ఉండదా?)

కింద మరికొన్ని ఉదాహరణలు గమనించండి

 

1.She will be happy with the results. ఆమె ఫలితాలతో సంతోషంగా ఉంటుంది.
She will not be happy with the results. ఆమె ఫలితాలతో సంతోషంగా ఉండదు.
Will she be happy with the results? ఫలితాలతో ఆమె సంతోషంగా ఉంటుందా?
Will she not be happy with the results? ఆమె ఫలితాలతో సంతోషంగా ఉండదా?
2.They will feel tired after the journey. ప్రయాణం తర్వాత వారు అలసిపోతారు.
They will not feel tired after the journey. ప్రయాణం తర్వాత వారికి అలసట అనిపించదు.
Will they feel tired after the journey? ప్రయాణం తర్వాత వారు అలసిపోతారా?
Will they not feel tired after the journey? ప్రయాణం తర్వాత వారు అలసిపోరా?
3.I will know the answer by tomorrow. రేపటి లోగా నేను సమాధానం తెలుసుకుంటాను
I will not know the answer by tomorrow. రేపటి లోగా నేను సమాధానం  తెలుసుకోను
Will I know the answer by tomorrow? రేపటి లోగా నేను సమాధానం తెలుసుకుంటానా?
Will I not know the answer by tomorrow? రేపటిలోగా నేను సమాధానం తెలుసుకో నా?
4.He will become a great leader. అతను గొప్ప నాయకుడు అవుతాడు
He will not become a great leader. అతను గొప్ప నాయకుడు కాడు
Will he become a great leader? అతను గొప్ప నాయకుడు అవుతాడా?
Will he not become a great leader? అతను గొప్ప నాయకుడు కాడా?
5.We will stay calm during the meeting. మేము సమావేశంలో ప్రశాంతంగా ఉంటాం.
We will not stay calm during the meeting. సమావేశంలో మేము ప్రశాంతంగా ఉండము.
Will we stay calm during the meeting? మీటింగ్ సమయంలో మనం ప్రశాంతంగా ఉంటామా?
Will we not stay calm during the meeting? మీటింగ్ సమయంలో మనం ప్రశాంతంగా ఉండమా?

 

3.Possession Sentences:

Indicate future ownership or Possession

భవిష్యత్తులో ఏదైనా కలిగి ఉంటారు అని  చెప్పడం

రేపు నాకు మీటింగ్ ఉంది. ( రేపు నేను మీటింగ్ ని కలిగి ఉన్నాను).

భవిష్యత్తులో  నాకు కారు ఉంటుంది ( భవిష్యత్తులో నేను ఒక కారుని కలిగి ఉంటాను).

సాయంత్రం మాకు డిన్నర్ ఉంది ( సాయంత్రం మేము ఒక డిన్నర్ ని కలిగి ఉన్నాము).

ఈ విధంగా కలిగి ఉండు లేక  సొంతమవుతాయి అని చెప్పడాన్ని  పొసెసియన్  సెంటెన్సెస్ అంటారు. ఈ సెంటెన్స్ ని నిర్మించడానికి అన్ని సబ్జెక్టులకు ‘will have’ ఉపయోగించాలి.

He, She, It, I, We, You, They  +  Will have  + Object

Example:

He will have two houses next year (P) (వచ్చే సంవత్సరం అతనికి రెండు ఇల్లు ఉంటాయి). 

subject: He

Verb: Will have

Object: Two  houses.

పై సెంటెన్స్ ని నెగటివ్ సెంటెన్స్ గా మార్చుటకు Will have తర్వాత Not ఉంచాలి.

He will not have two houses next year (N)

పై రెండు సెంటెన్స్ ని ప్రశ్నా వాక్యాలుగా (Interrogative sentences) మార్చుటకు ‘will’ సబ్జెక్టు ‘He’ కి ముందు  ఉంచాలి. 

Will he have two houses next year? (I) ( అతనికి వచ్చే సంవత్సరం రెండు   ఇల్లు ఉంటాయా?)

Will he not have two houses next year? (NI) (అతనికి వచ్చే సంవత్సరం రెండు ఇల్లు ఉండవా) ఈ వాక్యాన్ని Won’t he have two houses next year అని కూడా రాయవచ్చు.

క్రింద ఉన్న మరి కొన్ని ఉదాహరణలు గమనించండి.

 

1.She will have a new job next month. వచ్చే నెలలో ఆమెకు కొత్త ఉద్యోగం ఉంటుంది.
She will not have a new job next month. వచ్చే నెలలో ఆమెకు కొత్త ఉద్యోగం ఉండదు.
Will she have a new job next month? వచ్చే నెలలో ఆమెకు కొత్త ఉద్యోగం ఉంటుందా?
Will she not have a new job next month? వచ్చే నెలలో ఆమెకు కొత్త ఉద్యోగం ఉండదా?
2.We will have dinner at 7 PM. మేము రాత్రి 7 గంటలకు డిన్నర్ చేస్తాము.
We will not have dinner at 7 PM. మేము రాత్రి 7 గంటలకు డిన్నర్ చేయము.
Will we have dinner at 7 PM? రాత్రి 7 గంటలకు డిన్నర్ చేస్తామా?
Will we not have dinner at 7 PM? మేము రాత్రి 7 గంటలకు డిన్నర్ చేయమా?
3.They will have a meeting tomorrow morning. రేపు ఉదయం  వారికి సమావేశం ఉంటుంది.
They will not have a meeting tomorrow morning. రేపు ఉదయం వారికి సమావేశం ఉండదు.
Will they have a meeting tomorrow morning? రేపు ఉదయం  వారికి మీటింగ్ ఉంటుందా?
Will they not have a meeting tomorrow morning? రేపు ఉదయం వారికి మీటింగ్  ఉండదా?
4.The company will have a new CEO next year. వచ్చే ఏడాది కంపెనీకి కొత్త సీఈవో ఉంటాడు.
The company will not have a new CEO next year. వచ్చే ఏడాది కంపెనీకి కొత్త సీఈవో ఉండరు.
Will the company have a new CEO next year? వచ్చే ఏడాది కంపెనీకి కొత్త సీఈవో  ఉంటారా?
Will the company not have a new CEO next year? వచ్చే ఏడాది కంపెనీకి కొత్త సీఈవో  ఉండరా?
5.The students will have a holiday next Friday. వచ్చే శుక్రవారం విద్యార్థులకు సెలవు.
The students will not have a holiday next Friday. వచ్చే శుక్రవారం విద్యార్థులకు సెలవు లేదు.
Will the students have a holiday next Friday? వచ్చే శుక్రవారం విద్యార్థులకు సెలవు ఉంటుందా?
Will the students not have a holiday next Friday? వచ్చే శుక్రవారం విద్యార్థులకు సెలవు ఉండదా?

 

భవిష్యత్తులో జరిగే చర్యలు లేదా సంఘటనలను సూచించడానికి వివిధ సందర్భాల్లో Simple Feature Tense ఉపయోగించబడుతుంది. ఈ టెన్స్ ని ఏ ఏ సందర్భాల్లో ఉపయోగిస్తారో  ఇప్పుడు తెలుసుకుందాం. 

1. Predictions:          

When making predictions  about the future.

భవిష్యత్తు గురించి కొన్ని అంచనాలు తెలియజేసేటప్పుడు Simple Feature Tense ని ఉపయోగిస్తారు.

Example:

1.”It will rain tomorrow.” “రేపు వర్షం పడుతుంది.”
“It will not rain tomorrow.” “రేపు వర్షం పడదు.”
“Will it rain tomorrow?” “రేపు వర్షం కురుస్తుందా?”
“Will it not rain tomorrow?” “రేపు వర్షం కురవదా?”
2.”The economy will improve next year.” “వచ్చే ఏడాది ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుంది.”
“The economy will not improve next year.” “వచ్చే సంవత్సరం ఆర్థిక వ్యవస్థ మెరుగుపడదు.”
“Will the economy improve next year?” “వచ్చే ఏడాది ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుందా?”
“Will the economy not improve next year?” “వచ్చే ఏడాది ఆర్థిక వ్యవస్థ మెరుగుపడదా?”
3.”She will become a successful artist.” “ఆమె విజయవంతమైన కళాకారిణి అవుతుంది.”
“She will not become a successful artist.” “ఆమె విజయవంతమైన కళాకారిణిగా  అవ్వదు.”
“Will she become a successful artist?” “ఆమె విజయవంతమైన కళాకారిణి అవుతుందా?”
“Will she not become a successful artist?” “ఆమె విజయవంతమైన కళాకారిణి  అవ్వదా?”
4.”They will win the championship.” “వారు ఛాంపియన్‌షిప్ గెలుస్తారు.”
“They will not win the championship.” “వారు ఛాంపియన్‌షిప్ గెలవరు.”
“Will they win the championship?” “వారు ఛాంపియన్‌షిప్ గెలుస్తారా?”
“Will they not win the championship?” “వారు ఛాంపియన్‌షిప్  గెలవరా?”
5.”Technology will advance rapidly in the coming decade.” “రాబోయే దశాబ్దంలో సాంకేతికత వేగంగా అభివృద్ధి చెందుతుంది.”
“Technology will not advance rapidly in the coming decade.” “రాబోయే దశాబ్దంలో సాంకేతికత వేగంగా అభివృద్ధి చెందదు.”
“Will technology advance rapidly in the coming decade?” “రాబోయే దశాబ్దంలో సాంకేతికత వేగంగా అభివృద్ధి చెందుతుందా?”
“Will technology not advance rapidly in the coming decade?” “రాబోయే దశాబ్దంలో సాంకేతికత వేగంగా అభివృద్ధి చెందదా?”
6.”You will feel better after some rest.” “కొంత విశ్రాంతి తర్వాత మీరు మంచి అనుభూతి చెందుతారు.”
“You will not feel better after some rest.” “కొంచెం విశ్రాంతి తీసుకున్న తర్వాత మీకు మంచి అనుభూతి చెందరు.”
Will you feel better after some rest? “కొంచెం విశ్రాంతి తీసుకున్నాక   మీరు మంచి అనుభూతి చెందుతారా?”
“Will you not feel better after some rest?” “కొంచెం విశ్రాంతి తీసుకున్న తర్వాత  మీరు మంచి అనుభూతి చెందర?”
7.”This new policy will bring positive changes.” “ఈ కొత్త విధానం సానుకూల మార్పులను తీసుకువస్తుంది.”
“This new policy will not bring positive changes.” “ఈ కొత్త విధానం సానుకూల మార్పులను తీసుకురాదు.”
“Will this new policy bring positive changes?” “ఈ కొత్త విధానం సానుకూల మార్పులను తీసుకువస్తుందా?”
“Will this new policy not bring positive changes?” “ఈ కొత్త విధానం సానుకూల మార్పులు తీసుకురాదా?”
8.”He will get the job he’s applying for.” “అతను దరఖాస్తు చేసుకున్న ఉద్యోగం అతనికి లభిస్తుంది.”
“He will not get the job he’s applying for.” “అతను దరఖాస్తు చేసుకున్న ఉద్యోగం అతనికి రాదు.”
“Will he get the job he’s applying for?” “అతను దరఖాస్తు చేసుకున్న ఉద్యోగం వస్తుందా?”
“Will he not get the job he’s applying for?” “అతను దరఖాస్తు చేసుకున్న ఉద్యోగం రాదా?”
9.”It will snow heavily this winter.” “ఈ శీతాకాలంలో మంచు ఎక్కువగా కురుస్తుంది.”
“It will not snow heavily this winter.” “ఈ శీతాకాలంలో మంచు ఎక్కువగా  కురవదు.”
“Will it snow heavily this winter?” “ఈ శీతాకాలంలో మంచు విపరీతంగా కురుస్తుందా?”
“Will it not snow heavily this winter?” “ఈ చలికాలంలో మంచు ఎక్కువగా పడదా?”
10.”The population of the city will grow significantly.” “నగర జనాభా గణనీయంగా పెరుగుతుంది.”
“The population of the city will not grow significantly.” “నగర జనాభా గణనీయంగా పెరగదు.”
“Will the population of the city grow significantly?” “నగర జనాభా గణనీయంగా పెరుగుతుందా?”
“Will the population of the city not grow significantly? ‘‘నగరంలో జనాభా గణనీయంగా పెరగదా?

 

Where will the population of the city grow significantly? నగరంలో జనాభా ఎక్కడ గణనీయంగా పెరుగుతుంది?
When will the population of the city grow significantly? నగర జనాభా ఎప్పుడు గణనీయంగా పెరుగుతుంది?
Why will the population of the city grow significantly? నగర జనాభా ఎందుకు గణనీయంగా పెరుగుతుంది?
How will the population of the city grow significantly? నగర జనాభా గణనీయంగా ఎలా పెరుగుతుంది?
Where will the population of the city not grow significantly? నగరంలో జనాభా ఎక్కడ గణనీయంగా పెరగదు?
When will the population of the city not grow significantly? నగర జనాభా ఎప్పుడు గణనీయంగా పెరగదు?
Why will the population of the city not grow significantly? నగర జనాభా ఎందుకు గణనీయంగా పెరగదు?
How will the population of the city not grow significantly? నగర జనాభా గణనీయంగా ఎలా పెరగదు?

 

 

 

 

 

 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!
Scroll to Top
Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.