...

Simple Past-1

Simple past tense     

జరిగిపోయిన విషయాలను తెలియజేయడానికి సింపుల్ పాస్ట్ టెన్స్ ను  ఉపయోగిస్తారు.

1.సింపుల్ పాస్ట్ టెన్స్ లో Action sentences ఏ విధంగా నిర్మిస్తారో  తెలుసుకుందాం.

Subject + verb2 + object

సింగులర్ మరియు ఫ్లూరల్ అన్ని సబ్జెక్టులకు కూడా He, She, It, I, We, You, They  లకు Verb2 ఉపయోగించి వాక్య నిర్మాణం చేస్తారు.

Verb1 + Did= Verb2 అన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. Verb2 లో Did అనే సహాయక క్రియ దాగి ఉంటుంది.

Examples:

Go  + Did = Went.

Ask + Did = Asked.

Talk + Did = Talked.

ఇక్కడ Did అనేది Do యొక్క భూతకాల రూపం.

V1       V2           V3

Do      Did         Done

సింపుల్ ఫాస్ట్ టెన్స్ లో  పాజిటివ్ సెంటెన్స్ ని నెగటివ్ సెంటెన్స్ గా మార్చడానికి అన్ని సబ్జెక్టులకు కూడా  (He, She, It, I, We, You, They  లకు)  Did not ఉపయోగిస్తే సరిపోతుంది.

సాధారణంగా వ్యతిరేక వాక్యాలకు not ఉపయోగించాలి. అయితే Tenses లో వ్యతిరేక వాక్యాలు రాయుటకు ఆయా Tenses లకు కేటాయించబడిన సహాయక్రియ సపోర్ట్ తోటి మాత్రమే Not ఉపయోగించాలి. కాబట్టి సింపుల్ పాస్ట్ టెన్స్ కు కేటాయించబడిన సహాయక క్రియ అయిన Did  సపోర్ట్ తోటి Not ఉపయోగించాలి. కాబట్టి Simple past tense లో  వ్యతిరేక వ్యాఖ్యలు రాయటకు Did not ఉపయోగించాలి.

Example:

He went to office yesterday (PS)

పై సెంటెన్స్ ని నెగటివ్ సెంటెన్స్ గా మార్చడానికి సబ్జెక్టు He ప్రక్కన Did not ఉంచాలి.

He did not went to office yesterday (NS)

నెగిటివ్ సెంటెన్స్ ని పై విధంగా రాయడం కూడా తప్పు అవుతుంది. ఎందుకంటే

పై సెంటెన్స్ లో Did మరియు Went  ఈ రెండు కూడా verb2 రూపాలు. ఒక సెంటెన్స్ లో రెండు verb2 లు ఉండడం గ్రామర్ ప్రకారంగా తప్పు అవుతుంది.

Do మరియు Does లు ఉపయోగించినప్పుడు అది ప్రజెంట్ టెన్స్ అని, Did ఉపయోగించినప్పుడు పాస్ట్ టెన్స్ అని అర్థమవుతుంది. కాబట్టి Do, Does,Did లు   వాక్యంలో Tens ని (కాలాన్ని) తెలియజేస్తున్నప్పుడు ,Verb ఎల్లప్పుడూ మొదటి రూపంలోనే ఉండాలి.

కాబట్టి నెగిటివ్ సెంటెన్స్ ని క్రింది విధంగా రాస్తాము

He did not go to office yesterday (NS)(అతను నిన్న ఆఫీస్ కి వెళ్ళలేదు)

పైనున్న రెండు వాక్యాలను మరొకసారి కింద రాద్దాము

He went to office yesterday (PS)

He did not go to office yesterday (NS)

పైన ఉన్న పాజిటివ్ సెంటెన్స్ ని ఈ విధంగా కూడా రాయవచ్చు.

He did go to office yesterday

( Went = did + go కాబట్టి)

ఈ వాక్యాన్ని ప్రశ్న వాక్యంగా మార్చుటకు Did ని  He కి ముందు ఉంచితే సరిపోతుంది.

Did he go to office yesterday? (IS)

పైన ఉన్న negative సెంటెన్స్ ని negative interrogative sentence గ మార్చుటకు Did ని He కి ముందు ఉంచాలి.

Did he not go to office yesterday? (NIS)

ఇప్పుడు పై వాక్యాలనుటిని వరుసగా రాద్దాం

He went to the office yesterday (P).

He did not go to the office yesterday (N).

Did he go to the office yesterday? (I).

Did he not go to the office yesterday? (NI).

2.పాస్ట్ టెన్స్ లో  (State sentences) స్థితిని లేదా పరిస్థితిని తెలియజేసే వాక్యాల నిర్మాణం ఏ విధంగా ఉంటుందో చూద్దాం.

  1. నేను పోయిన సంవత్సరం విద్యార్థిగా ఉండినాను (పోయిన సంవత్సరం నా పరిస్థితి అది)
  2. నిన్న అతను హైదరాబాదులో ఉండినాడు (నిన్న అతని పరిస్థితి అది)
  3. వారు ఇంతకుముందు ఉద్యోగస్తులుగా ఉండినారు (గతంలో వారి పరిస్థితి ఇది)
  4. మేము నిన్న కాలేజీలో ఉండినాము (నిన్న మా పరిస్థితి ఇది)

ఈ విధంగా గతంలో సబ్జెక్టు యొక్క స్థితి లేదా పరిస్థితిని తెలియజేయటానికి ఉండినాను, ఉండినాడు, ఉండినారు, ఉండినాము అని వచ్చినప్పుడు సింపుల్ పాస్ట్ టెన్స్ లో

I, He, She, It లకు was  మరియు We, You, They లకు were సహాయక్రియలను ఉపయోగిస్తారు. 

Sub + was/were   

am, is, are, was, were  లాంటి సహాయక్రియలు సబ్జెక్టు యొక్క స్థితిని తెలియజేస్తాయి. సబ్జెక్టు యొక్క స్థితిని తెలియజేసే వాక్యాలలో object ఉండదు. ఎందుకంటే ఇక్కడ సబ్జెక్టు యొక్క ప్రభావానికి గురి అయ్యే మరొకరు వ్యక్తి లేదావస్తువు లేదా జంతువు ఉండదు.

 

I was at the bus station yesterday(P) (నేను నిన్న బస్ స్టేషన్ వద్ద ఉండిన్నాను)

పై వాక్యమును వ్యతిరేక వాక్యంగా మార్చటకు was ప్రక్కన not ఉంచాలి. 

I was not at the bus station yesterday.(N) (నేను నిన్న బస్ స్టేషన్ వద్ద ఉండలేదు) 

పై రెండు వాక్యాలను ప్రశ్నా వాక్యాలుగా మార్చడానికి సబ్జెక్టు ‘I’ ప్రక్కన ఉన్నwas ని మొదటిలో ఉంచితే సరిపోతుంది. 

Was I at the bus station yesterday (I)

was I not at the bus station yesterday (NI) ( wasn’t I at the bus station yesterday ఈ విధంగా కూడా రాయవచ్చు)

క్రింది వాక్యాలను పై విధంగా మార్చడానికి ప్రయత్నించండి

1.She was a grade teacher

2.He was happy with the results

3.It was at the forest yesterday

4.We were at the park all yesterday 

5.They were at the concert together

6.You were at the meeting

3.సింపుల్ ప్రెసెంట్ టెన్స్ లో Possessive వాక్య నిర్మాణాన్ని ఏ విధంగా చేస్తారు  possessive అంటే కలిగి ఉండడం అని అర్థము. 

He, She, It, I, We, You, They లకు అన్నిటికీ కూడా గతంలో కలిగి ఉండిన అనే భావాన్ని తెలియజేయుటకు అన్నిటికీ Had అనే  సహాయక క్రియ ఉపయోగిస్తారు.

Sub + had + object

గతంలో ఏదైనా కలిగి ఉండేది, కలిగి ఉండేవాడు, కలిగి ఉండేవారు, అని చెప్పడానికి Had అనే సహాయక క్రియ  ఉపయోగిస్తారు.

  1. He had two cars ( అతనికి రెండు కార్లు ఉండేవి). (  అతను గతంలో రెండు కార్లను కలిగి ఉండేవాడు.  అని ఇంత పొడుగున చెప్పలేక సింపుల్ గా అతనికి రెండు కార్లు ఉండేవి అంటారు) 

పై వాక్యంలో

He= subject

Had= verb

Two cars = object. 

 

  1. They had a great time at the party last night. (గత రాత్రి వారు పార్టీలో గొప్పగా గడిపారు) (గత రాత్రి పార్టీలో వారు మంచి సమయాన్ని కలిగి ఉండినారు) 
  2. She had a headache after a long meeting. ( సుదీర్ఘ  సమావేశం తరువాత ఆమెకు తలనొప్పి వచ్చింది.) ( సుదీర్ఘ సమావేశం తర్వాత ఆమె తలనొప్పిని కలిగి ఉండింది అని చెప్పడం భాషాపరంగా కొంత ఎబ్బెట్టుగా ఉంటుంది) 
  3. She had a strange dream last night. (గత రాత్రి ఆమెకు వింత కల వచ్చింది) (గత రాత్రి ఆమె ఒక వింతైన కలను కలిగి ఉండింది)

5.They had a lot of homework to do.( చేయటానికి వారికి చాలా హోం వర్క్ ఉండింది)

ఇక్కడ  did +have = had అని మనం గుర్తుంచుకోవాలి. 

Present (V1) past (V2) past participle (V3)
has/have  had had

2వ  వాక్యాన్ని నెగటివ్ సెంటెన్స్ గా మార్చడానికి ప్రయత్నిద్దాం 

They had a great time at the party last night. (They did have a great time at the party last night.(P)   (గత రాత్రి వారు పార్టీలో గొప్పగా గడిపారు లేదా గత రాత్రి వారు పార్టీలో గొప్ప సమయాన్ని కలిగి ఉండినారు) 

సింపుల్ పాస్ట్ టెన్స్ లో పై వాక్యానికి వ్యతిరేక వాక్యం రాయాలంటే,  గత రాత్రి వారు పార్టీలో గొప్పగా గడప లేదు అని రాయాలి.

Simple past లో ‘లేదు’  అంటే ‘Did not’ అని అర్ధం. ఇప్పుడు పై వాక్యానికి వ్యతిరేక వాక్యం రాద్దాము

They did not had a great time at the party last night.

ఈ  విధంగా రాయడం కూడా తప్పు అవుతుంది ఎందుకంటే  Did మరియు had లు రెండు రెండు కూడా పాస్ట్ టెన్స్ లో ఉన్నాయి సహాయక క్రియ మరియు verb రెండు కూడా ఒకే కాలాన్ని సూచించేదిగా ఉండకూడదు. సహాయక క్రియలు కాలాన్ని తెలియజేస్తున్నప్పుడు verb ఎప్పుడూ మొదటి రూపంలోనే ఉండాలి. ఇది గ్రామర్  రూల్. కాబట్టి Had కి బదులుగా దాని మొదటి రూపమైన Have ని ఉపయోగిస్తారు.

పై వాక్యంలో Had మెయిన్ వెర్బ్ గా వ్యవహరిస్తూ ఒక సంపూర్ణ వాక్యాన్ని నిర్మిస్తుంది. Had సాధారణంగా సహాయక్రియ అయినప్పటికీ ఈ వాక్యంలో verb స్థానంలో తానే  verb గా వ్యవహరిస్తుంది.

Do, Does, Did  లు  వాక్యంలో ఉన్నప్పుడు, verb ఎప్పుడు మొదటి రూపంలోనే ఉండాలి.

 

కాబట్టి, పై వాక్యాన్నిThey did not have a great time at the party last night (N).అని రాస్తాము. 

పై వాక్యాలను రెండిటిని ప్రశ్నా వాక్యాలుగా మారుద్దాం.

1.They had a great time at the party last night.(P) 

పై వాక్యాన్ని have + did = had కాబట్టి క్రింది విధంగా కూడా రాయవచ్చు

They did have a great time at the party last night.(P)  

2.They did not have a great time at the party last night (N)

పై రెండు వాక్యాలను Interrogative sentence గా మార్చుటకు they ప్రక్కన ఉన్న Did ని  ముందు ఉంచితే సరిపోతుంది.

  1. Did They have a great time at the party last night? (I)  
  2. Did They not have a great time at the party last night? (NI)

(or)

     Didn’t They have a great time at the party last night అని కూడా రాయవచ్చు

1,3,4,5, వాక్యాలను ఇదేవిధంగా  Negative, interrogative, negative interrogative లలో రాయడానికి ప్రయత్నించండి.

 

సింపుల్ పాస్ట్ టెన్స్ ని ఏ ఏ సందర్భాలలో ఉపయోగిస్తారో  ఇప్పుడు తెలుసుకుందాం

1 Completed Actions in the Past:           

గతంలో పూర్తి చేయబడినటువంటి పనులను గురించి తెలియజేయడానికి Simple past tense ని ఉపయోగిస్తారు

Example: 

1.I visited Paris last summer. నేను గత వేసవిలో పారిస్ సందర్శించాను.
I didn’t visit Paris last summer. నేను గత వేసవిలో పారిస్‌ని సందర్శించలేదు.
Did I visit Paris last summer?. నేను గత వేసవిలో పారిస్‌ని సందర్శించానా?.
Didn’t I visit Paris last summer?. నేను గత వేసవిలో పారిస్‌ని సందర్శించలేదా?.

(Did not = Didn’t)

2.I visited New York City last year. నేను గత సంవత్సరం న్యూయార్క్ నగరాన్ని సందర్శించాను.
I didn’t visit New York City last year. నేను గత సంవత్సరం న్యూయార్క్ నగరాన్ని సందర్శించలేదు.
Did I visit New York City last year?. నేను గత సంవత్సరం న్యూయార్క్ నగరాన్ని సందర్శించానా?.
Didn’t I visit New York City last year?. నేను గత సంవత్సరం న్యూయార్క్ నగరాన్ని సందర్శించలేదా?.
3.She finished her novel yesterday. ఆమె నిన్న తన నవల పూర్తి చేసింది.
She didn’t finish her novel yesterday. ఆమె నిన్న తన నవల పూర్తి చేయలేదు.
Did she finish her novel yesterday?. ఆమె నిన్న తన నవల పూర్తి చేసిందా?.
Didn’t she finish her novel yesterday?. ఆమె నిన్న తన నవల పూర్తి చేయలేదా?.
4.They watched a movie on Friday night. వారు శుక్రవారం రాత్రి ఓ సినిమా చూశారు.
They didn’t watch a movie on Friday night. శుక్రవారం రాత్రి వారు సినిమా చూడలేదు.
Did they watch a movie on Friday night?. వారు శుక్రవారం రాత్రి సినిమా చూశారా?.
Didn’t they watch a movie on Friday night?. శుక్రవారం రాత్రి వాళ్ళు సినిమా చూడలేదా?.
5.He graduated from college in 2010. అతను 2010 లో కళాశాల నుండి పట్టభద్రుడయ్యాడు.
He didn’t graduate from college in 2010. అతను 2010లో కళాశాల నుండి పట్టభద్రుడు కాలేదు.
Did he graduate from college in 2010?. అతను 2010లో కళాశాల నుండి పట్టభద్రుడయ్యాడా?.
Didn’t he graduate from college in 2010?. అతను 2010లో కళాశాల నుండి పట్టభద్రుడు కాలేదా?.
6.We had dinner at a new restaurant last weekend. మేము గత వారాంతంలో కొత్త రెస్టారెంట్‌లో డిన్నర్ చేసాము.(డిన్నర్ కలిగి ఉండినాము)
We didn’t have dinner at a new restaurant last weekend. మేము గత వారాంతంలో కొత్త రెస్టారెంట్‌లో డిన్నర్ చేయలేదు.
Did we have dinner at a new restaurant last weekend?. మేము గత వారాంతంలో కొత్త రెస్టారెంట్‌లో డిన్నర్ చేశామా?.
Didn’t we have dinner at a new restaurant last weekend?. గత వారాంతంలో మేము కొత్త రెస్టారెంట్‌లో డిన్నర్ చేయలేదా?.
7.I completed the project two days ago. రెండు రోజుల క్రితమే ప్రాజెక్ట్ పూర్తి చేశాను.
I didn’t complete the project two days ago. నేను రెండు రోజుల క్రితం ప్రాజెక్ట్ పూర్తి చేయలేదు.
Did I complete the project two days ago?. నేను రెండు రోజుల క్రితం ప్రాజెక్ట్ పూర్తి చేసానా?.
Didn’t I complete the project two days ago?. నేను రెండు రోజుల క్రితం ప్రాజెక్ట్ పూర్తి చేయలేదా?.
8.She travelled to Japan last summer. గత వేసవిలో ఆమె జపాన్‌కు వెళ్లింది.
She didn’t travel to Japan last summer. గత వేసవిలో ఆమె జపాన్‌కు వెళ్లలేదు.
Did she travel to Japan last summer?. గత వేసవిలో ఆమె జపాన్‌కు వెళ్లిందా?.
Didn’t she travel to Japan last summer?. గత వేసవిలో ఆమె జపాన్‌కు వెళ్లలేదా?.
9.They bought a new car last month. గత నెలలో వారు కొత్త కారు కొన్నారు.
They didn’t buy a new car last month. గత నెలలో వారు కొత్త కారు కొనుగోలు చేయలేదు.
Did they buy a new car last month?. వారు గత నెలలో కొత్త కారు కొన్నారా?.
Didn’t they buy a new car last month?. గత నెలలో వారు కొత్త కారు కొనుగోలు చేయలేదా?. 
10.He repaired the computer last night. అతను నిన్న రాత్రి కంప్యూటర్ రిపేర్ చేశాడు.
He didn’t repair the computer last night. అతను నిన్న రాత్రి కంప్యూటర్ రిపేరు చేయలేదు.
Did he repair the computer last night?. అతను నిన్న రాత్రి కంప్యూటర్ రిపేర్ చేసాడా?.
Didn’t he repair the computer last night?. అతను నిన్న రాత్రి కంప్యూటర్ రిపేర్ చేయలేదా?.
11.We attended a concert last Saturday. మేము గత శనివారం ఒక సంగీత కచేరీకి హాజరయ్యాము.
We didn’t attend a concert last Saturday. మేము గత శనివారం ఒక సంగీత కచేరీకి హాజరు కాలేదు.
Did we attend a concert last Saturday?. గత శనివారం మేము ఒక సంగీత  కచేరీకి హాజరయ్యామా?.
Didn’t we attend a concert last Saturday?. గత శనివారం మేము ఒక సంగీత కచేరీకి హాజరు కాలేదా?

 

Where did we attend the concert last Saturday?. గత శనివారం మేము కచేరీకి ఎక్కడ హాజరయ్యాము?.
When did we attend the concertlast Saturday?. గత శనివారం మేము కచేరీకి ఎప్పుడు హాజరయ్యాము?.
Why did we attend the concert last Saturday?. గత శనివారం మేము కచేరీకి ఎందుకు హాజరయ్యాము?.
How did we attend the concert last Saturday?. గత శనివారం మేము కచేరీకి ఎలా హాజరయ్యాము?.
Where didn’t we attend the concert last Saturday?. గత శనివారం మేము కచేరీకి ఎక్కడ హాజరు కాలేదు?.
When didn’t we attend the concert last saturday?. గత శనివారం మేము కచేరీకి ఎప్పుడు హాజరు కాలేదు?.
Why didn’t we attend the concert last Saturday?. గత శనివారం మేము కచేరీకి ఎందుకు హాజరు కాలేదు?.
How didn’t we attend the concert last Saturday?. గత శనివారం మేము కచేరీకి ఎలా హాజరుకాలేదు?.

 

 

 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!
Scroll to Top
Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.