...

Simple Present -5

5. State of a being or thing         

The simple present tense is also used To describe the present state of  a beeing or thing or organisation (Tenses in Telugu)

Simple present tense ని ఒక ప్రాణి లేదా ఒక వస్తువు యొక్క ప్రస్తుత పరిస్థితిని గురించి తెలియజేయడానికి ఉపయోగిస్తారు.అనగా సబ్జెక్టు ప్రస్తుతం ఏ పరిస్థితులలో ఉన్నాడు లేదా ఉన్నది. ప్రస్తుత స్థితి ఏమిటి.?

సింపుల్ ప్రెసెంట్ టెన్స్ లో సబ్జెక్టు యొక్క స్థితిని తెలియజేసేటప్పుడు subject singular అయితే 

 I, కి am

He ,She, It, That లకు  is

Subject Plural అయితే  We, You, They, Those లకు are ని ఉపయోగిస్తారు.

స్థితి లేదా పరిస్థితి అంటే ఏమిటి?

రాము తింగరి తింగరిగా రోడ్డుమీద  బైక్ నడిపి యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్ లో బెడ్ మీద ఉన్నాడు ఇది అతని పరిస్థితి .

మా కోడిపుంజు ఇంటి మీదకి ఎక్కి ఉన్నది. ప్రస్తుతం కోడిపుంజు పరిస్థితి అది

మహేష్ శ్రద్ధగా చదివి లెక్చరర్ అయి ఉన్నాడు. ప్రస్తుతం  మహేష్ పరిస్థితి ఇది 

వారు బాగా పని చేసి అలసిపోయి ఉన్నారు. ప్రస్తుతం వారి పరిస్థితి అది

సబ్జెక్టు ప్రస్తుతం ఏ స్థితిలో ఉన్నారో తెలియజేయడానికి సింపుల్ ప్రెసెంట్ టెన్స్ ని ఉపయోగిస్తారు.

am= అయి ఉన్నాను

is= అయి ఉన్నాడు/ అయివున్నది 

are= అయి ఉన్నారు

Example: 

1.I am a driver      (నేను ఒక డ్రైవర్ అయి ఉన్నాను)(ప్రస్తుతం అతని పరిస్థితి ఒక డ్రైవర్    

2.She is a lawyer   (ఆమె ఒక లాయర్ అయి ఉన్నది)               

3.They are  farmers (వారు రైతులు అయి ఉన్నారు)               

Example: 

They are soldiers  (PS) ( వారు సైనికులు )

పై వాక్యాన్ని వ్యతిరేక వాక్యంగా మార్చుటకు సహాయక క్రియ అయిన are పక్కన not ఉంచాలి.

They are not soldiers (NS)

పాజిటివ్ సెంటెన్స్ ని మరియు నెగిటివ్  సెంటెన్స్ ని  రెండింటిని ప్రశ్న వాక్యాలుగా మార్చుటకు సహాయక క్రియ అయిన are ని  సబ్జెక్ట్ అయిన They కి  ముందు ఉంచితే సరిపోతుంది.

Are they soldiers? (IS)

Are they not soldiers? (NIS) 

వాక్యంలో am, is, are ఉన్నప్పుడు ఆ వాక్యాన్ని వ్యతిరేక వాక్యంగా మార్చుటకు వాటి పక్కన not వుంచాలి.

క్రింది పట్టికలో ఉదాహరణలు గమనించండి

1.She is a teacher. ఆమె ఉపాధ్యాయురాలు.
She is not a teacher. ఆమె టీచర్ కాదు.
Is she a teacher? ఆమె ఉపాధ్యాయురాలా?
Is she not a teacher? ఆమె టీచర్ కాదా?
2.He is very kind. అతను చాలా దయగలవాడు.
He is not very kind. అతను చాలా దయగలవాడు కాదు.
Is he very kind? అతను చాలా దయగలవాడా?
Is he not very kind? అతను చాలా దయగలవాడు కాదా?
3.The cat is on the roof. పిల్లి పైకప్పు మీద ఉంది.
The cat is not on the roof. పిల్లి పైకప్పు మీద లేదు.
Is the cat on the roof? పిల్లి పైకప్పు మీద ఉందా?
Is the cat not on the roof? పిల్లి పైకప్పు మీద లేదా?(Tenses in Telugu)
4.It is cold today. ఈరోజు చలిగా ఉంది.
It is not cold today. ఈరోజు చలి లేదు.
Is it cold today? ఈరోజు చలిగా ఉందా?
Is it not cold today? ఈరోజు చలి లేదా?
5.This book is interesting. ఈ పుస్తకం ఆసక్తికరంగా ఉంది.
This book is not interesting. ఈ పుస్తకం ఆసక్తికరంగా లేదు.
Is this book interesting? ఈ పుస్తకం ఆసక్తికరంగా ఉందా?
Is this book not interesting? ఈ పుస్తకం ఆసక్తికరంగా లేదా?
6.I am a student. నేను విద్యార్థిని.
I am not a student. నేను విద్యార్థిని కాదు.
Am I a student? నేను విద్యార్థినా?
Am I not a student? నేను విద్యార్థిని కాదా?
7.I am always on time. నేను ఎల్లప్పుడూ సమయానికి ఉంటాను.
I am not always on time. నేను ఎల్లప్పుడూ సమయానికి ఉండను.
Am I always on time? నేను ఎల్లప్పుడూ సమయానికి ఉంటానా?
Am I not always on time? నేను ఎల్లప్పుడూ సమయానికి ఉండనా?
8.We are ready for the trip. మేము యాత్రకు సిద్ధంగా ఉన్నాము.
We are not ready for the trip. మేము యాత్రకు సిద్ధంగా లేము.
Are we ready for the trip? మేము యాత్రకు సిద్ధంగా ఉన్నామా ?
Are we not ready for the trip? మేము యాత్రకు సిద్ధంగా లేమా?
9.They are friends. వాళ్ళు స్నేహితులు.
They are not friends. వారు స్నేహితులు కాదు.
Are they friends? వారు స్నేహితులా?
Are they not friends? వారు స్నేహితులు కాదా?
10.The children are in the playground. పిల్లలు ప్లేగ్రౌండ్‌లో ఉన్నారు.
The children are not in the playground. పిల్లలు ఆట స్థలంలో లేరు.
Are the children in the playground? పిల్లలు ఆట స్థలంలో ఉన్నారా?(Tenses in Telugu)
Are the children not in the playground? పిల్లలు ప్లేగ్రౌండ్‌లో లేరా?

 

11.The sky is blue. ఆకాశం నీలంగా ఉంది.
The sky is not blue. ఆకాశం నీలంగా లేదు.
Is the sky blue? ఆకాశం నీలంగా ఉందా?
Is the sky not blue? ఆకాశం నీలంగా లేదా?
12.My brother is a doctor. నా సోదరుడు డాక్టర్.
My brother is not a doctor. నా  సోదరుడు డాక్టర్ కాదు.
Is my brother a doctor? నా సోదరుడు వైద్యుడా?
Is my brother not a doctor? నా సోదరుడు డాక్టర్ కాదా?
13.This cake is delicious. ఈ కేక్ రుచికరమైనది.
This cake is not delicious. ఈ కేక్ రుచికరమైనది కాదు.
Is this cake delicious? ఈ కేక్ రుచికరమైనదా .?
Is this cake not delicious? ఈ కేక్ రుచికరమైనది కాదా.?
14.The car is fast. కారు వేగంగా ఉంది.
The car is not fast. కారు వేగంగా లేదు.
Is the car fast? కారు వేగంగా ఉందా?
Is the car not fast? కారు వేగంగా లేదా?
15.The room is clean. గది శుభ్రంగా ఉంది.
The room is not clean. గది శుభ్రంగా లేదు.
Is the room clean? గది శుభ్రంగా ఉందా?
Is the room not clean? గది శుభ్రంగా లేదా?
16.I am excited about the trip. నేను యాత్ర గురించి ఉత్సాహంగా ఉన్నాను.
I am not excited about the trip. నేను యాత్ర గురించి ఉత్సాహంగా లేను.
Am I excited about the trip? నేను యాత్ర గురించి ఉత్సాహంగా ఉన్నానా?(Tenses in Telugu)
Am I not excited about the trip? నేను యాత్ర గురించి ఉత్సాహంగా లేనా?
17.I am responsible for this project. ఈ ప్రాజెక్ట్‌కి నేను బాధ్యత వహిస్తాను.
I am not responsible for this project. ఈ ప్రాజెక్ట్‌కు నేను బాధ్యత వహించను.
Am I responsible for this project? ఈ ప్రాజెక్ట్‌కి నేను బాధ్యత వహిస్తానా?
Am I not responsible for this project? ఈ ప్రాజెక్ట్‌కి నేను బాధ్యత వహించనా?
18.You are a good singer. నువ్వు మంచి గాయకుడివి.
You are not a good singer. నువ్వు మంచి గాయకుడవు కాదు .
Are you a good singer? నువ్వు మంచి గాయకుడివా ?
Are you not a good singer? నువ్వు మంచి గాయకుడివి కాదా?
19.The students are attentive in class. విద్యార్థులు తరగతిలో శ్రద్ధగా ఉన్నారు .
The students are not attentive in class. విద్యార్థులు తరగతిలో శ్రద్ధగా లేరు  .
Are the students attentive in class? తరగతిలో విద్యార్థులు శ్రద్ధగా ఉన్నారా?
Are the students not attentive in class? విద్యార్థులు తరగతిలో శ్రద్ధగా లేరా .?
20.The flowers in the garden are red తోటలోని పూలు ఎర్రగా ఉన్నాయి
The flowers in the garden are not red తోటలోని పూలు ఎర్రగా లేవు
Are The flowers in the garden red? . తోటలోని పూలు ఎర్రగా ఉన్నాయా?
Are The flowers in the garden are not red? తోటలోని పూలు ఎర్రగా లేవా? 

 

1 Where are the flowers in the garden red? తోటలో పువ్వులు ఎక్కడ ఎర్రగా ఉన్నాయి?
2 When are the flowers in the garden red? తోటలోని పువ్వులు ఎప్పుడు ఎర్రగా ఉంటాయి?
3 Why are the flowers in the garden red? తోటలో పువ్వులు ఎందుకు ఎర్రగా ఉంటాయి?(Tenses in Telugu)
4 How are the flowers in the garden red? తోటలోని పువ్వులు ఎలా ఎర్రగా ఉంటాయి?
1 Where are the flowers in the garden not red? తోటలోని పువ్వులు ఎరుపు రంగులో ఎక్కడ లేవు?
2 When are the flowers in the garden not red? తోటలోని పువ్వులు ఎప్పుడు ఎర్రగా ఉండవు?
3 Why are the flowers in the garden not red? తోటలోని పువ్వులు ఎందుకు ఎర్రగా లేవు?
4 How are the flowers in the garden not red? తోటలోని పువ్వులు ఎలా ఎర్రగా లేవు?

 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!
Scroll to Top
Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.