Types of Verbs
1. Action verbs:
ఇవి రెండు రకాలు 1.భౌతికంగా శరీరంతో 2. మనసుతో చేసేటువంటి పనులను గురించి తెలియజేసేటువంటి వాటిని Action verbs అంటారు. వీటిని Main verbs అని కూడా అంటారు.
Physical actions |
|
She runs every morning. | ఆమె ప్రతి ఉదయం పరిగెత్తుతుంది. |
He writes poems. | అతను పద్యాలు రాస్తాడు. |
They build houses. | వారు ఇల్లు నిర్మిస్తారు. |
Mental Actions |
|
She thinks about her future. | ఆమె తన యొక్క భవిష్యత్తు గురించి ఆలోచిస్తుంది. |
He remembers his childhood days. | అతను అతని యొక్క చిన్ననాటి రోజులు గుర్తు చేసుకుంటాడు. |
She believes in hard work. | ఆమె కష్టపడి పని చేయడం నమ్ముతుంది. |
పైన Red కలర్ లో కనిపిస్తున్న verbs శరీరంతో చేసే పనులకు ఉదాహరణ అయితే, కింద Green కలర్ లో కనిపిస్తున్న verbs మనసుతో చేసే పనులకు ఉదాహరణగా చెప్పవచ్చు.
2.Transistive & Intransistive verbs:
A.Transistive verbs: (సకర్మక క్రియలు)
కొన్ని verbs వాక్యంలో ఉన్నప్పుడు ప్రశ్నించే స్వభావాన్ని కలిగి ఉంటాయి లేదా Object ని ఆశిస్తాయి. ఆ ప్రశ్నకి జవాబు చెప్పకపోతే ఆ వాక్యం అసంపూర్తిగానే మిగిలిపోతుంది. ఉదాహరణకు నేను తిన్నాను అని చెప్పినప్పుడు ఏమి తిన్నానో చెప్పకపోతే ఆ మాటకి అర్థం ఉండదు. అలాగే నేను చూశాను అని చెప్పినప్పుడు ఏమి చూశానో చెప్పకపోతే ఆ మాటకు అర్థం ఉండదు. అలాగే నేను అడిగాను అని చెప్పినప్పుడు ఏమి అడిగానో చెప్పకపోతే ఆ మాటకి అర్థం ఉండదు. క్రింది టేబుల్ ని గమనించండి.
Eat: She (S) ate (V) an apple (O) for breakfast.
ఆమె అల్పాహారం కోసం ఒక ఆపిల్ తిన్నది. |
|
Buy: I (S) bought (V) a new phone (O) yesterday.
నేను నిన్న కొత్త ఫోన్ కొన్నాను. |
|
Make: They (S)made (V) a delicious cake(O) for the party.
వారు పార్టీ కోసం రుచికరమైన కేక్ తయారు చేశారు |
|
Send: He(S) sent (V) a letter (O) to his friend.
అతను తన స్నేహితుడికి ఒక లేఖ పంపాడు. |
|
Teach: The teacher(S) teaches (V) the students grammar.
ఉపాధ్యాయుడు విద్యార్థులకు వ్యాకరణాన్ని బోధిస్తాడు |
|
Love: She(S) loves (V) her family (O) deeply.
ఆమె తన కుటుంబాన్ని గాఢంగా ప్రేమిస్తుంది. |
|
Read: He (S) reads (V) the newspaper(O) every morning.
అతను ప్రతి ఉదయం వార్తాపత్రిక చదువుతాడు. |
పైన కనిపిస్తున్న ఇటువంటి verbs నే transistive verbs అని అంటారు. ఉదాహరణకు Eat అనే verb ని తీసుకుంటే దేనిని తిన్నాడో చెప్పకపోతే ఆ వాక్యం పూర్తికాదు. దేనిని తిన్నాడో అదే ఆబ్జెక్ట్ అవుతుంది.
రెండవ వాక్యాన్ని గమనిస్తే నేను నిన్న కొన్నాను. దేనిని కొన్నాడో ఆ object ని రాయకపోతే ఆ వాక్యం పూర్తి కాదు.
మిగతా వ్యాఖ్యలను కూడా గమనించండి.ఈ విధంగా Transistive verbs ఉండే వాక్యాలకు తప్పనిసరిగా ఆబ్జెక్ట్ ఉంటుంది object లేకపోతే ఆ వాక్యం పూర్తి కాదు. లేదా object ఉండే ప్రతి వాక్యంలో కూడాTransistive verb ఉంటుందని అర్థం
Transistive verbs ఉండే వాక్యాలను మాత్రమే పాసివ్ వాయిస్ లోకి మార్చగలము |
B.Intransitive verbs: కొన్ని verbs ఆబ్జెక్ట్ తో సంబంధం లేకుండానే వాక్యాన్ని పూర్తి చేసుకుంటాయి. అటువంటి verbs నే intransistive verbs (అకర్మక క్రియలు) అంటారు.
ఈ verbs వాక్యాన్ని పూర్తి చేసుకోవడానికి
1. Adverb
2.Prepositional phrases
ని ఉపయోగించుకుంటాయి.
- క్రియా విశేషణాలు (adverbs) గురించి పై చాప్టర్లో మనం నేర్చుకున్నాము. క్రింద ఉన్న సెంటెన్స్ గమనించండి.
He dances gracefully | అతను మనోహరంగా నృత్యం చేస్తాడు. |
The baby sleeps soundly | పాప హాయిగా నిద్రపోతుంది. |
She runs quickly | ఆమె త్వరగా పరుగెత్తుతుంది. |
Dances అనే వెర్బ్ gracefully అనే క్రియా విశేషణ ను ఉపయోగించుకుని వాక్యాన్ని అర్థవంతంగా పూర్తి చేసుకుంది.
రెండవ వాక్యంలో sleeps అనే verb ‘soundly’ అనే క్రియా విశేషణాన్ని ఉపయోగించుకుని వాక్యాన్ని అర్థవంతంగా పూర్తి చేసుకుంది.
మూడవ వాక్యంలో runs అనే వెర్బ్ quickly అనే క్రియా విశేషణాన్ని ఉపయోగించుకుని వాక్యాన్ని అర్థవంతంగా పూర్తి చేసుకుంది.
- Prepositional phrases : (ప్రిపోజిషనల్ ఫ్రేసెస్)అంటే రెండు లేదా మూడు పదాల సమూహమును ప్రిపోజిషనల్ ప్రిజస్ అంటారు. ఇందులో మొదటి పదం కచ్చితంగా ఒక Preposition అయి ఉంటుంది. క్రింది ప్రిపోజిషనల్ ఫ్రేసెస్ ని గమనించండి .
“On the table”
“under the bed”
“with a smile”
“In the garden”
“At the station”
The book is on the table | పుస్తకం టేబుల్ మీద ఉంది. |
The cat hid under the table | పిల్లి టేబుల్ కింద దాక్కుంది. |
She greeted me with a smile | ఆమె చిరునవ్వుతో నన్ను పలకరించింది. |
The children are playing in the garden | పిల్లలు తోటలో ఆడుకుంటున్నారు. |
పైన చూపిన విధంగా is, hid, greeted,are అనే వెర్బ్స్ ఆబ్జెక్ట్ లేకుండానే Prepositional phrases తో వాక్యాన్ని అర్థవంతంగా పూర్తి చేసుకుంటున్నాయి.
ఈ విధంగా object తో సంబంధం లేకుండా adverb తో గాని Prepositional phrases గాని వాక్యాన్ని పూర్తి చేసుకునే verbs ని Instransistive verbs అని అంటారు.
3. Regular & Irregular verbs :
Regular verbs క్రింది వెర్బ్స్ గమనించండి .
Walk, Walked, Walked, Walking
Play, Played, Played, Playing
Talk, Talked, Talked, Talking
Jump, Jumped, Jumped, Jumping
Look, Looked, Looked, Looking
Verb మొదటి రూపం v2,v3,v4 లో కూడా కనిపించి, చివర d తో గాని ed తో గాని ముగించబడితే అటువంటి వెర్బ్స్ ని regular verbs అంటారు.
Irregular verbs:
Go, Went, Gone, Going
See, Saw, Seen, Seeing
Write, Wrote, Written, Writing
Take, Took, Taken, Taking
Speak, Spoke, Spoken, Speaking
పై verbs గమనించినట్లయితే v1,v2,v3,v4 లు పూర్తిగా ఒకదానికొకటి వేరువేరుగా ఉన్నాయి కాబట్టి ఇటువంటి వెర్బ్స్ ని irregular verbs అంటారు.
4. Auxiliary verbs (or) Helping verbs:
ఆక్సిలరీ వెర్బ్స్ వీటిని సహాయక క్రియలు అని కూడా అంటారు. వాక్యాన్ని నిర్మించడంలో Main verbs కి సహాయం చేయడం వలన వీటికి ఆ పేరు వచ్చింది.Tenses ని రూపొందించడంలో Main verbs కి Auxiliary verbs సహాయం చేస్తాయి.
పైన నేర్చుకున్న Action verbs, regular and irregular, transitive and intransitive verb, అన్ని కూడా Main verbs కిందికే వస్తాయి.
auxiliary verbs మొత్తం 24
DO, DOES, DID, AM, IS, ARE, WAS, WERE, HAVE, HAS, HAD,
WILL, WOULD, SHALL, SHOULD, CAN, COULD, MAY, MIGHT, MUST, NEED TO , OUGHT TO, DARE TO, USED TO.
ఈ Auxiliary verbs ని తిరిగి రెండు రకాలుగా విభజించారు
అవి: 1.Primary auxiliary verbs 2. Modal verbs
Primary auxiliary verbs ఇవి మొత్తం 11 :DO, DOES, DID, AM, IS, ARE, WAS, WERE, HAVE, HAS, HAD, (Tenses రూపొందించడంలో ఇవి ప్రముఖ పాత్ర వహిస్తాయి.)
Modal verbs ఇవి మొత్తం 13: WILL, WOULD, SHALL, SHOULD, CAN, COULD, MAY, MIGHT, MUST, NEED TO , OUGHT TO, DARE TO, USED TO.
Primary auxiliary verbs వీటిని తిరిగి మూడు రకాలుగా విభజించారు అవి
- “Do” forms: DO, DOES, DID
- “Be” forms: AM, IS, ARE, WAS, WERE,
- “Have” forms: HAVE, HAS, HAD.
Do forms: సబ్జెక్టు ఏ పని చేస్తున్నాడు అనే దానిని వివరించడానికి ఉపయోగిస్తారు.
Be forms: సబ్జెక్టు యొక్క స్థితిని తెలియజేయడానికి ఉపయోగిస్తారు.
Have froms: సబ్జెక్టు ఏమి కలిగి ఉన్నాడో తెలియజేయడానికి ఉపయోగిస్తారు.
Model verbs: సబ్జెక్టు యొక్క అవకాశాలు, అవసరాలు మరియు సామర్థ్యాలను గురించి తెలియజేయడానికి ఉపయోగపడతాయి.
పైన కనిపిస్తున్న Auxiliary verbs ఏ సబ్జెక్టుకి ఏ విధంగా ఉపయోగిస్తారు. వాక్య నిర్మాణంలో Main verbs కు ఏ విధంగా సహాయం చేస్తాయనేది కింది చాప్టర్లో మీకు పూర్తిగా వివరించబడింది.
Linking verbs యాక్షన్ ని లేదా చర్యని తెలియజేయవు, కానీ వాక్యం లోని సబ్జెక్టుకి మిగతా సమాచారాన్ని లింక్ చేస్తాయి.