1.Have to, Has to = చేయాలి
ఏ ఏ సందర్భాల్లో ఉపయోగిస్తారో తెలుసుకుందాం
బాధ్యతలు (Duties) తెలియజేయడానికి.
నేను ఉదయం 6 గంటలకు మేల్కోవాలి
ఆమె తన కుటుంబం కోసం భోజనం తయారు చేయాలి
మనం ఈ ఉదయం సమావేశానికి హాజరు కావాలి
అతను ఆడుకోకముందు హోంవర్క్ ను పూర్తి చేయాలి
వారు గదిని శుభ్రం చేయాలి.
రూల్స్ (Rules) గురించి తెలుసుకోవడానికి
విద్యార్థులు యూనిఫాం ధరించాలి.
మనం ట్రాఫిక్ నియమాలు పాటించాలి
బైక్ నడిపేటప్పుడు హెల్మెట్ ధరించాలి
ఉద్యోగులు రిపోర్ట్స్ సమయానికి సమర్పించాలి.
మన అవసరాల (necessity) గురించి తెలియజేయడానికి
నాకు ఈ వారానికి సరుకులు కావాలి
అతను ప్రయాణం చేయడానికి ముందే కారు రిపేర్ చేపించుకోవాలి
ఈనెల కరెంట్ బిల్ చెల్లించాలి
ఈ విధంగా ప్రతిదానికి కూడా చివర “లి” అని వస్తుంది.
2.Have to , Has to ఉపయోగించినప్పుడు Verb1 మాత్రమే ఉపయోగించాలి.
3. Structures:
He, She,It + Has to + verb1 + object/ Extra words
We, You, They + Have to + verb1+ object/ Extra words
Example:
She has to come here -ఆమె ఇక్కడికి రావాలి
పై సెంటెన్స్ కి నెగటివ్ సెంటెన్స్ రాయటానికి ముందు ఒక చిన్న విషయం గమనించాలి.
ఏ Tense లో నైనా వ్యతిరేక వాక్యాలు రాయుటకు సహాయక క్రియల తర్వాతనే Not రాయాలి ఇది గ్రామర్ రూల్. సహాయక క్రియలు అంటే ఏమిటో ఇక్కడ చూడండి. CLICK HERE
పై వాక్యంలో verb (come) మొదటి రూపంలో ఉంది కాబట్టి ఇది సింపుల్ ప్రెసెంట్ టెన్స్. సింపుల్ ప్రెసెంట్ టెన్స్ లో negative sentence రాయుటకు subject singular అయితే Does not, subject plural అయితే Do not ఉపయోగించాలని మనం గతంలో తెలుసుకున్నాము.
పై వాక్యంలో She అనే సబ్జెక్టు సింగులర్ కాబట్టి నెగిటివ్ సెంటెన్స్ ని క్రింది విధంగా రాస్తాము
She does not has to come here
కానీ పై విధంగా రాయడం కూడా తప్పు అవుతుంది.
ఎందుకంటే sentence లో Do, Does, Did అనే సహాయ క్రియలు వచ్చినప్పుడు verb ఎల్లప్పుడూ మొదటి రూపంలోనే ఉండాలి.
పై వాక్యంలో Has యొక్క మొదటి రూపం Have. కాబట్టి పై వాక్యానికి నెగిటివ్ సెంటెన్స్ క్రింది విధంగా రాస్తాము
She does not have to come here. ఈ ఒక్క చిన్న మార్పుని బాగా గుర్తుంచుకోండి.
పై రెండు వాక్యాలను ప్రశ్నా వాక్యాలుగా మార్చుటకు సహాయక క్రియ Does ను సెంటెన్స్ ప్రారంభంలో ఉంచుతాము.
Does she have to come here =ఆమె ఇక్కడికి రావాలా?
Does she not have to come here = ఆమె ఇక్కడికి రాకూడదా?
ఏ వాక్యం లో నైనా సబ్జెక్టు సింగులర్ వుండి ఆ వాక్యంలో has వుంటే మాత్రమే ఈ చిన్న మార్పుని చేయాల్సి ఉంటుంది. subject plural వుంటే అవసరం లేదు.
క్రింద 3 sentences కి Negative, Interrogative and Negative interrogative sentences ఇవ్వబడినాయి .
| 1. He has to wake up early. | 1. అతను త్వరగా నిద్ర లేవాలి. |
| హీ హ్యాస్ టు వేక్ అప్ ఎర్లీ. | |
| He does not have to wake up early. | అతను త్వరగా నిద్ర లేవకూడదు |
| Does he have to wake up early? | అతను త్వరగా నిద్ర లేవాలా ?. |
| Does he not have to wake up early? | అతను త్వరగా నిద్ర లేవకూడదా ?. |
| 2. You have to finish your homework. | 2. మీరు మీ హోంవర్క్ పూర్తి చేయాలి. |
| యూ హ్యావ్ టు ఫినిష్ యోర్ హోంవర్క్. | |
| You do not have to finish your homework. | మీరు మీ హోంవర్క్ పూర్తి చేయకూడదు . |
| Do you have to finish your homework? | మీరు మీ హోంవర్క్ పూర్తి చేయాలా ?. |
| Do you not have to finish your homework? | మీరు మీ హోంవర్క్ పూర్తి చేయకూడదా ?. |
| 3. She has to cook dinner for her family. | 3. ఆమె తన కుటుంబానికి రాత్రి భోజనం వండాలి. |
| షీ హ్యాస్ టు కుక్ డిన్నర్ ఫర్ హెర్ ఫ్యామిలీ. | |
| She does not have to cook dinner for her family. | ఆమె తన కుటుంబానికి రాత్రి భోజనం వండకూడదు. |
| Does she have to cook dinner for her family? | ఆమె తన కుటుంబానికి రాత్రి భోజనం వండాలా ?. |
| Does she not have to cook dinner for her family? | ఆమె తన కుటుంబానికి రాత్రి భోజనం వండకూడదా ?. |
| 4. I have to call my friend tonight. | 4. నేను ఈ రాత్రి నా స్నేహితుడికి ఫోన్ చేయాలి. |
| ఐ హ్యావ్ టు కాల్ మై ఫ్రెండ్ టునైట్. | |
| 5. We have to clean the house before guests arrive. | 5. అతిథులు రాకముందే మనం ఇంటిని శుభ్రం చేయాలి. |
| వి హ్యావ్ టు క్లీన్ ది హౌస్ బిఫోర్ గెస్ట్സ് అరైవ్. | |
| 6. They have to wear school uniforms every day. | 6. వారు ప్రతిరోజూ స్కూల్ యూనిఫాం ధరించాలి. |
| దే హ్యావ్ టు వేర్ స్కూల్ యూనిఫార్మ్స్ ఎవ్రీ డే. | |
| 7. It has to be repaired soon. | 7. దీన్ని త్వరలో మరమ్మతు చేయాలి. |
| ఇట్స్ హ్యాస్ టు బీ రిపేర్డ్ సూన్. | |
| 8. He has to attend the meeting tomorrow. | 8. అతను రేపు సమావేశానికి హాజరు కావాలి. |
| హీ హ్యాస్ టు అటెండ్ ది మీటింగ్ టుమారో. | |
| 9. You have to pay the electricity bill today. | 9. మీరు ఈరోజే విద్యుత్ బిల్లు చెల్లించాలి. |
| యూ హ్యావ్ టు పే ది ఎలక్ట్రిసిటీ బిల్ టుడే. | |
| 10. She has to study for her exams. | 10. ఆమె పరీక్షల కోసం చదువుకోవాలి. |
| షీ హ్యాస్ టు స్టడీ ఫర్ హెర్ ఎగ్జామ్స్. | |
| 11. I have to complete my assignment today. | 11. నేను ఈరోజు నా పనిని పూర్తి చేయాలి. |
| ఐ హ్యావ్ టు కంప్లీట్ మై అసైన్మెంట్ టుడే. | |
| 12. We have to attend the workshop next Monday. | 12. మనం వచ్చే సోమవారం వర్క్‌షాప్‌కు హాజరు కావాలి. |
| వి హ్యావ్ టు అటెండ్ ది వర్క్‌షాప్ నెక్ట్ మండే. | |
| 13. They have to repair their car before the trip. | 13. వారు ప్రయాణానికి ముందు తమ కారును రిపేర్ చేసుకోవాలి. |
| దే హ్యావ్ టు రిపేర్ థెయిర్ కార్ బిఫోర్ ది ట్రిప్. | |
| 14. It has to be cleaned before use. | 14. ఉపయోగించే ముందు దానిని శుభ్రం చేయాలి. |
| ఇట్స్ హ్యాస్ టు బీ క్లీన్డ్ బిఫోర్ యూస్. | |
| 15. He has to take his medicine twice a day. | 15. అతను రోజుకు రెండుసార్లు తన మందు తీసుకోవాలి. |
| హీ హ్యాస్ టు టేక్ హిస్ మెడిసిన్ ట్వైస్ ఎ డే. | |
| 16. You have to check your email regularly. | 16. మీరు మీ ఇమెయిల్‌ను క్రమం తప్పకుండా తనిఖీ చేయాలి. |
| యూ హ్యావ్ టు చెక్ యోర్ ఇమెయిల్ రెగ్యులర్లీ. | |
| 17. She has to wake up early for school. | 17. ఆమె పాఠశాలకు త్వరగా లేవాలి. |
| షీ హ్యాస్ టు వేక్ అప్ ఎర్లీ ఫర్ స్కూల్. | |
| 18. I have to buy groceries for the week. | 18. నేను వారానికి కిరాణా సామాను కొనాలి. |
| ఐ హ్యావ్ టు బై గ్రోసరీస్ ఫర్ ది వీక్. | |
| 19. We have to submit the report by Friday. | 19. మేము శుక్రవారం నాటికి నివేదికను సమర్పించాలి. |
| వి హ్యావ్ టు సబ్మిట్ ది రిపోర్ట్ బై ఫ్రైడే. | |
| 20. They have to finish the project before the deadline. | 20. వారు గడువుకు ముందే ప్రాజెక్ట్ పూర్తి చేయాలి. |
| దే హ్యావ్ టు ఫినిష్ ది ప్రాజెక్ట్ బిఫోర్ ది డెడ్‌లైన్. | |
| 21. It has to be replaced immediately. | 21. దీన్ని వెంటనే భర్తీ చేయాలి. |
| ఇట్స్ హ్యాస్ టు బీ రిప్లేస్‌డ్ ఇమ్మీడియట్లీ. | |
| 22. He has to leave early for the airport. | 22. అతను విమానాశ్రయానికి త్వరగా బయలుదేరాలి. |
| హీ హ్యాస్ టు లీవ్ ఎర్లీ ఫర్ ది ఎయిర్పోర్ట్. | |
| 23. You have to attend the meeting on time. | 23. మీరు సమావేశానికి సమయానికి హాజరు కావాలి. |
| యూ హ్యావ్ టు అటెండ్ ది మీటింగ్ ఆన్ టైమ్. | |
| 24. She has to complete the report by evening. | 24. ఆమె సాయంత్రం నాటికి నివేదికను పూర్తి చేయాలి. |
| షీ హ్యాస్ టు కంప్లీట్ ది రిపోర్ట్ బై ఈవెనింగ్. | |
| 25. I have to go to the market this afternoon. | 25. నేను ఈ మధ్యాహ్నం మార్కెట్‌కి వెళ్ళాలి. |
| ఐ హ్యావ్ టు గో టు ది మార్కెట్ ధిస్ ఆఫ్టర్నూన్. | |
| 26. We have to finish cleaning the garden. | 26. మనం తోట శుభ్రం చేయడం పూర్తి చేయాలి. |
| వి హ్యావ్ టు ఫినిష్ క్లీనింగ్ ది గార్డెన్. | |
| 27. They have to follow the rules at work. | 27. వారు పనిలో నియమాలను పాటించాలి. |
| దే హ్యావ్ టు ఫాలో ది రూల్స్ æt వర్క్. | |
| 28. It has to be done by tonight. | 28. ఈ రాత్రి లోపు పూర్తి చేయాలి. |
| ఇట్స్ హ్యాస్ టు బీ డన్ బై టునైట్. | |
| 29. He has to attend the training session. | 29. అతను శిక్షణా సమావేశానికి హాజరు కావాలి. |
| హీ హ్యాస్ టు అటెండ్ ది ట్రైనింగ్ సెషన్. | |
| 30. You have to submit the application before Monday. | 30. మీరు సోమవారం ముందు దరఖాస్తును సమర్పించాలి. |
| యూ హ్యావ్ టు సబ్మిట్ ది అప్లికేషన్ బిఫోర్ మండే. | |
| Long Sentences | |
| I have to go Hyderabad, to meet Mr. Ramao. | నేను మిస్టర్ రామారావు గారిని కలవడానికి హైదరాబాద్ వెళ్ళాలి. |
| ఐ హ్యావ్ టు గో హైదరాబాద్, టు మీట్ మిస్టర్ రామావ్. | |
| He has to visit the office, to submit the report. | నివేదిక సమర్పించడానికి అతను కార్యాలయాన్ని సందర్శించాలి. |
| హీ హ్యాస్ టు విసిట్ ది ఆఫీస్, టు సబ్మిట్ ది రిపోర్ట్. | |
| She has to buy groceries, for the weekend party. | వారాంతపు పార్టీకి ఆమె కిరాణా సామాను కొనాలి. |
| షీ హ్యాస్ టు బై గ్రోసరీస్, ఫర్ ది వీకెండ్ పార్టీ. | |
| You have to call your friend, to confirm the meeting. | మీటింగ్ కన్ఫర్మ్ చేసుకోవడానికి మీరు మీ స్నేహితుడికి కాల్ చేయాలి. |
| యూ హ్యావ్ టు కాల్ యోర్ ఫ్రెండ్, టు కాన్ఫర్మ్ ది మీటింగ్. | |
| We have to clean the house, before the guests arrive. | అతిథులు రాకముందే మనం ఇంటిని శుభ్రం చేయాలి. |
| వి హ్యావ్ టు క్లీన్ ది హౌస్, బిఫోర్ ది గెస్ట్സ് అరైవ్. | |
| They have to repair the car, to travel tomorrow morning. | వాళ్ళు రేపు ఉదయం ప్రయాణం చేయాలంటే, కారు రిపేర్ చేయాలి. |
| దే హ్యావ్ టు రిపేర్ ది కార్, టు ట్రావెల్ టుమారో మోర్నింగ్. | |
| It has to be fixed, before the inspector comes. | ఇన్స్పెక్టర్ రాకముందే దాన్ని సరిచేయాలి. |
| ఇట్స్ హ్యాస్ టు బీ ఫిక్స్డ్, బిఫోర్ ది ఇన్స్పెక్టర్ కమ్స్. | |
| I have to attend the class, to complete my syllabus. | నా సిలబస్ పూర్తి చేయడానికి నేను తరగతికి హాజరు కావాలి. |
| ఐ హ్యావ్ టు అటెండ్ ది క్లాస్, టు కంప్లీట్ మై సిలబస్. | |
| He has to finish the work, to meet the deadline. | గడువును చేరుకోవాలంటే అతను పనిని పూర్తి చేయాలి. |
| హీ హ్యాస్ టు ఫినిష్ ది వర్క్, టు మీట్ ది డెడ్‌లైన్. | |
| She has to prepare dinner, for her family tonight. | ఆమె ఈ రాత్రి తన కుటుంబానికి విందు సిద్ధం చేయాలి. |
| షీ హ్యాస్ టు ప్రిపేర్ డిన్నర్, ఫర్ హెర్ ఫ్యామిలీ టునైట్. | |
| You have to submit the forms, to get permission. | అనుమతి పొందడానికి మీరు ఫారమ్‌లను సమర్పించాలి. |
| యూ హ్యావ్ టు సబ్మిట్ ది ఫార్మ్స్, టు గెట్ పర్మిషన్. | |
| We have to water the plants, because it is very hot. | చాలా వేడిగా ఉంటుంది కాబట్టి మనం మొక్కలకు నీళ్లు పోయాలి. |
| వి హ్యావ్ టు వాటర్ ది ప్లాంట్స్, బికాజ్ ఇట్ ఇస్ వెరీ హాట్. | |
| They have to leave early, to catch the train. | వాళ్ళు రైలు పట్టుకోవాలంటే త్వరగా బయలుదేరాలి. |
| దే హ్యావ్ టు లీవ్ ఎర్లీ, టు క్యాచ్ ది ట్రైన్. | |
| It has to be cleaned, before the party starts. | పార్టీ ప్రారంభమయ్యే ముందు దానిని శుభ్రం చేయాలి. |
| ఇట్స్ హ్యాస్ టు బీ క్లీన్డ్, బిఫోర్ ది పార్టీ స్టార్ట్స్. | |
| I have to study tonight, to pass the exam. | పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలంటే నేను ఈ రాత్రి చదువుకోవాలి. |
| ఐ హ్యావ్ టు స్టడీ టునైట్, టు పాస్ ది ఎగ్జాం. | |
| He has to meet the client, to discuss the project. | అతను ప్రాజెక్ట్ గురించి చర్చించడానికి క్లయింట్‌ని కలవాలి. |
| హీ హ్యాస్ టు మీట్ ది క్లయింట్, టు డిస్కస్ ది ప్రాజెక్ట్. | |
| She has to buy clothes, for the festival tomorrow. | రేపు పండుగకి ఆమె బట్టలు కొనుక్కోవాలి. |
| షీ హ్యాస్ టు బై క్లోద్స్, ఫర్ ది ఫెస్టివల్ టుమారో. | |
| You have to attend the workshop, to learn new skills. | కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడానికి మీరు వర్క్‌షాప్‌కు హాజరు కావాలి. |
| యూ హ్యావ్ టు అటెండ్ ది వర్క్‌షాప్, టు లర్న్ న్యూ స్కిల్స్. | |
| We have to pay the bills, before the due date. | మేము గడువు తేదీకి ముందే బిల్లులు చెల్లించాలి. |
| వి హ్యావ్ టు పే ది బిల్స్, బిఫోర్ ది డ్యూ డేట్. | |
| They have to clean the office, before the manager comes. | మేనేజర్ రాకముందే వాళ్ళు ఆఫీసు శుభ్రం చేయాలి. |
| దే హ్యావ్ టు క్లీన్ ది ఆఫీస్, బిఫోర్ ది మేనేజర్ కమ్స్. | |
Had to = చేయాల్సి వచ్చింది
Had to సింగులర్ సబ్జెక్టులకు, ప్లూరల్ సబ్జెక్టులకు కామన్ గా ఉపయోగిస్తారు .
Had to ఉపయోగించిన తర్వాత verb మొదటి రూపంలోనే ఉండాలి.
ఇటువంటి వాక్యాలలో పని ఆల్రెడీ జరిగిపోయి ఉంటుంది. కాబట్టి చేయాల్సి వచ్చింది, వెళ్లాల్సి వచ్చింది, చూడాల్సి వచ్చింది, అడగాల్సి వచ్చింది, ఇవ్వాల్సి వచ్చింది. ఈ విధంగా చివరిలో చేయాల్సి వచ్చింది అని అర్థం వస్తుంది.
Structure:
He, She, It, I, We, You, They + had to + verb 1+ object/Extra words.
Example:
They had to see= వారు చూడాల్సి వచ్చింది.
పై సెంటెన్స్ ని They did have to see అని కూడా రాయవచ్చు ఎందుకని
verb1 + did = verb2
have + did = had కాబట్టి
కానీ నెగెటివ్ sentence రాసేటప్పుడు did తప్పకుండా ఉపయోగించాలి .
పై వాక్యం లో had ఉపయోగించడం వలన అదిపాస్ట్ టెన్స్ లో ఉంది అని మనకు తెలుసు
ఫాస్ట్ టెన్స్ లో వ్యతిరేక వాక్యాలు రాయుటకు సాధారణంగా Did not ఉపయోగిస్తారు. దీని ప్రకారం పై వాక్యాన్ని They did not had to see అని రాయాలి ఈ విధంగా రాయటం కూడా తప్పు అవుతుంది ఎందుకని?
పైన Did మరియు Had రెండూ కూడా పాస్ట్ టెన్స్ గురించి తెలియజేస్తున్నాయి. ఈ విధంగా ఒక tense గురించి తెలియజేసే రెండు సహాయక్రియలు ఒకే సెంటెన్స్ లో ఉండకూడదు
Do,Does, Did లో వాక్యంలో ఉన్నప్పుడు verb ఎప్పుడూ మొదటి రూపంలోనే ఉండాలి.
కాబట్టి had మొదటి రూపమైన Have సెంటెన్స్ లో రాస్తాము.కాబట్టి నెగిటివ్ సెంటెన్స్ ని క్రింది విధంగా రాస్తాము
They did not have to see = వారు చూడాల్సి రాలేదు
పై రెండు సెంటెన్స్ ని Interrogative sentences గా మార్చుటకు Did ని సెంటెన్స్ ప్రారంభంలో ఉంచుతాము.
Did they have to see =వారు చూడాల్సి వచ్చిందా?
Did they not have to see = వారు చూడాల్సి రాలేదా ?
| 1. He had to leave early. | 1. అతను త్వరగా బయలుదేరాల్సి వచ్చింది. |
| హీ హాడ్ టు లీవ్ ఎర్లీ | |
| He did not have to leave early. | అతను త్వరగా బయలుదేరాల్సి రాలేదు . |
| Did he have to leave early? | అతను త్వరగా బయలుదేరాల్సి వచ్చిందా ?. |
| Did he not have to leave early? | అతను త్వరగా బయలుదేరాల్సి రాలేదా?. |
| 2. You had to study today. | 2. నువ్వు ఈరోజు చదువుకోవలసి వచ్చింది. |
| యూ హాడ్ టు స్టడీ టుడే | |
| You did not have to study today. | నువ్వు ఈరోజు చదువుకోవలసి రాలేదు . |
| Did you have to study today? | నువ్వు ఈరోజు చదువుకోవలసి వచ్చిందా ? . |
| Did you not have to study today? | నువ్వు ఈరోజు చదువుకోవలసి రాలేదా? |
| 3. She had to call him. | 3. ఆమె అతనికి కాల్ చేయాల్సి వచ్చింది. |
| షీ హాడ్ టు కాల్ హిమ్ | |
| She did not have to call him. | ఆమె అతనికి కాల్ చేయాల్సి రాలేదు . |
| Did she have to call him? | ఆమె అతనికి కాల్ చేయాల్సి వచ్చిందా ?. |
| Did she not have to call him? | ఆమె అతనికి కాల్ చేయాల్సి రాలేదా?. |
| 4. It had to stop raining. | 4. వర్షం ఆగాల్సి వచ్చింది. |
| ఇట్ హాడ్ టు స్టాప్ రైనింగ్ | |
| 5. I had to buy bread. | 5. నేను బ్రెడ్ కొనవలసి వచ్చింది. |
| ఐ హాడ్ టు బై బ్రెడ్ | |
| 6. We had to clean room. | 6. మేము గదిని శుభ్రం చేయాల్సి వచ్చింది. |
| వీ హాడ్ టు క్లీన్ రూమ్ | |
| 7. They had to finish homework. | 7. వారు హోంవర్క్ పూర్తి చేయాల్సి వచ్చింది. |
| థే హాడ్ టు ఫినిష్ హోమ్‌వర్క్ | |
| 8. He had to pay bills. | 8. అతను బిల్లులు చెల్లించాల్సి వచ్చింది. |
| హీ హాడ్ టు పే బిల్స్ | |
| 9. You had to cook dinner. | 9. మీరు రాత్రి భోజనం వండాల్సి వచ్చింది. |
| యూ హాడ్ టు కుక్ డిన్నర్ | |
| 10. She had to open door. | 10. ఆమె తలుపు తెరవవలసి వచ్చింది. |
| షీ హాడ్ టు ఓపెన్ డోర్ | |
| 11. It had to be fixed. | 11. దాన్ని సరిచేయవలసి వచ్చింది. |
| ఇట్ హాడ్ టు బీ ఫిక్స్డ్ | |
| 12. I had to feed dog. | 12. నేను కుక్కకు ఆహారం పెట్టాల్సి వచ్చింది. |
| ఐ హాడ్ టు ఫీడ్ డాగ్ | |
| 13. We had to leave immediately. | 13. మేము వెంటనే బయలుదేరాల్సి వచ్చింది. |
| వీ హాడ్ టు లీవ్ ఇమीडియట్లీ | |
| 14. They had to run fast. | 14. వారు వేగంగా పరిగెత్తవలసి వచ్చింది. |
| థే హాడ్ టు రన్ ఫాస్ట్ | |
| 15. He had to answer question. | 15. అతను ప్రశ్నకు సమాధానం చెప్పాల్సి వచ్చింది. |
| హీ హాడ్ టు ఆన్సర్ క్వేషన్ | |
| 16. You had to finish your homework quickly. | 16. మీరు మీ ఇంటి పనిని త్వరగా పూర్తి చేయాల్సి వచ్చింది. |
| యూ హాడ్ టు ఫినిష్ యోర్ హోమ్‌వర్క్ క్విక్లీ | |
| 17. She had to buy a new dress. | 17. ఆమె కొత్త దుస్తులు కొనవలసి వచ్చింది. |
| షీ హాడ్ టు బై ఎ న్యూ డ్రెస్స్ | |
| 18. It had to be repaired immediately. | 18. దానిని వెంటనే మరమ్మతులు చేయాల్సి వచ్చింది. |
| ఇట్ హాడ్ టు బీ రిపేర్డ్ ఇమीडియట్లీ | |
| 19. I had to wake up very early. | 19. నేను చాలా త్వరగా నిద్ర లేవాల్సి వచ్చింది. |
| ఐ హాడ్ టు వెయిక్ అప్ వెరీ ఎర్లీ | |
| 20. We had to cancel our trip yesterday. | 20. మేము నిన్న మా ప్రయాణాన్ని రద్దు చేసుకోవలసి వచ్చింది. |
| వీ హాడ్ టు క్యాన్సెల్ అవర్ ట్రిప్ యెస్టర్డే | |
| 21. They had to wait outside the school. | 21. వారు పాఠశాల బయట వేచి ఉండాల్సి వచ్చింది. |
| థే హాడ్ టు వెయిట్ అవుట్‌సైడ్ ది స్కూల్ | |
| 22. He had to explain everything to teacher. | 22. అతను గురువుగారికి ప్రతిదీ వివరించాల్సి వచ్చింది. |
| హీ హాడ్ టు ఎక్స్ప్లైన్ ఎవ్రిథింగ్ టు టీచర్ | |
| 23. You had to submit the report today. | 23. మీరు ఈరోజే నివేదికను సమర్పించాల్సి వచ్చింది. |
| యూ హాడ్ టు సబ్మిట్ ది రిపోర్ట్ టుడే | |
| 24. She had to take care of baby. | 24. ఆమె బిడ్డను జాగ్రత్తగా చూసుకోవాల్సి వచ్చింది. |
| షీ హాడ్ టు టేక్ కేర్ ఆఫ్ బేబీ | |
| 25. It had to be cleaned before party. | 25. పార్టీకి ముందు దానిని శుభ్రం చేయాల్సి వచ్చింది. |
| ఇట్ హాడ్ టు బీ క్లీన్డ్ బిఫోర్ పార్టీ | |
| 26. I had to attend the meeting yesterday. | 26. నేను నిన్న సమావేశానికి హాజరు కావాల్సి వచ్చింది. |
| ఐ హాడ్ టు అటెండ్ ది మీటింగ్ యెస్టర్డే | |
| 27. We had to repair the broken window. | 27. మేము విరిగిన కిటికీని బాగు చేయాల్సి వచ్చింది. |
| వీ హాడ్ టు రిపేర్ ది బ్రోకెన్ విండో | |
| 28. They had to finish the task quickly. | 28. వారు పనిని త్వరగా పూర్తి చేయాల్సి వచ్చింది. |
| థే హాడ్ టు ఫినిష్ ది టాస్క్ క్విక్లీ | |
| 29. He had to visit his grandmother today. | 29. అతను ఈరోజు తన అమ్మమ్మని చూడవలసి వచ్చింది. |
| హీ హాడ్ టు విజిట్ హిస్ గ్రాండ్‌మదర్ టుడే | |
| 30. You had to check all the documents. | 30. మీరు అన్ని పత్రాలను తనిఖీ చేయాల్సి వచ్చింది. |
| యూ హాడ్ టు చెక్ ఆల్ ది డాక్యుమెంట్స్ | |
Long sentences:
| 1. I had to go Hyderabad, to meet Mr. Ramao. | 1. నేను మిస్టర్ రామారావు గారిని కలవడానికి హైదరాబాద్ వెళ్ళవలసి వచ్చింది. |
| ఐ హాడ్ టు గో హైదరాబాద్, టు మీట్ మిస్టర్ రామావ్. | |
| 2. He had to finish his homework, before going to the park. | 2. అతను పార్కుకి వెళ్ళే ముందు, తన హోంవర్క్ పూర్తి చేయాల్సి వచ్చింది. |
| హీ హాడ్ టు ఫినిష్ హిస్ హోంవర్క్, బిఫోర్ గోయింగ్ టు ది పార్క్. | |
| 3. She had to cook dinner, because her parents were coming. | 3. ఆమె తల్లిదండ్రులు వస్తున్నందున ఆమె రాత్రి భోజనం వండవలసి వచ్చింది. |
| షీ హాడ్ టు కుక్ డిన్నర్, బికాజ్ హర్ పేరెంట్స్ వెర్ కమింగ్. | |
| 4. You had to call your friend, to confirm the meeting time. | 4. మీటింగ్ సమయాన్ని నిర్ధారించుకోవడానికి మీరు మీ స్నేహితుడికి కాల్ చేయాల్సి వచ్చింది. |
| యూ హాడ్ టు కాల్ యోర్ ఫ్రెండ్, టు కాన్ఫర్మ్ ది మీటింగ్ టైం. | |
| 5. We had to clean the house, before the guests arrived. | 5. అతిథులు రాకముందే మేము ఇంటిని శుభ్రం చేయాల్సి వచ్చింది. |
| వి హాడ్ టు క్లీన్ ది హౌస్, బిఫోర్ ది గెస్ట్സ് అరైవ్డ్. | |
| 6. They had to repair the car, to travel the next day. | 6. వారు కారు రిపేర్ చేయాల్సి వచ్చింది, మరుసటి రోజు ప్రయాణించడానికి. |
| దే హాడ్ టు రిపేర్ ది కార్, టు ట్రావెల్ ది నెక్ట్ డే. | |
| 7. It had to be fixed, because it was broken yesterday. | 7. నిన్న అది పాడైపోయింది కాబట్టి దాన్ని సరిచేయవలసి వచ్చింది. |
| ఇట్ట్ హాడ్ టు బీ ఫిక్స్డ్, బికాజ్ ఇట్ వాస్ బ్రోకెన్ యెస్టర్డే. | |
| 8. I had to attend the meeting, to discuss the project updates. | 8. ప్రాజెక్ట్ నవీకరణలను చర్చించడానికి నేను సమావేశానికి హాజరు కావాల్సి వచ్చింది. |
| ఐ హాడ్ టు అటెండ్ ది మీటింగ్, టు డిస్కస్ ది ప్రాజెక్ట్ అప్డేట్స్. | |
| 9. He had to leave early, because he had another appointment. | 9. అతనికి వేరే అపాయింట్మెంట్ ఉన్నందున అతను త్వరగా బయలుదేరాల్సి వచ్చింది. |
| హీ హాడ్ టు లీవ్ ఎర్లీ, బికాజ్ హీ హాడ్ అనదర్ అప్పాయింట్మెంట్. | |
| 10. She had to study all night, to prepare for the exam. | 10. పరీక్షకు సిద్ధం కావడానికి ఆమె రాత్రంతా చదువుకోవాల్సి వచ్చింది. |
| షీ హాడ్ టు స్టడీ ఆల్ నైట్, టు ప్రిపేర్ ఫర్ ది ఎగ్జాం. | |
| 11. You had to submit the forms, before the office closed. | 11. ఆఫీసు మూసే ముందు మీరు ఫారమ్‌లను సమర్పించాల్సి వచ్చింది. |
| యూ హాడ్ టు సబ్మిట్ ది ఫార్మ్స్, బిఫోర్ ది ఆఫీస్ క్లోస్డ్. | |
| 12. We had to finish the work, because the deadline was yesterday. | 12. గడువు నిన్నటితో ముగిసిపోయింది కాబట్టి, మేము పనిని పూర్తి చేయాల్సి వచ్చింది. |
| వి హాడ్ టు ఫినిష్ ది వర్క్, బికాజ్ ది డెడ్‌లైన్ వాస్ యెస్టర్డే. | |
| 13. They had to wake up early, to catch the train on time. | 13. వారు సమయానికి రైలు పట్టుకోవడానికి, త్వరగా నిద్ర లేవవలసి వచ్చింది. |
| దే హాడ్ టు వేక్ అప్ ఎర్లీ, టు క్యాచ్ ది ట్రైన్ ఆన్ టైమ్. | |
| 14. It had to be cleaned, because it was very dirty. | 14. అది చాలా మురికిగా ఉన్నందున దానిని శుభ్రం చేయాల్సి వచ్చింది. |
| ఇట్ట్ హాడ్ టు బీ క్లీన్డ్, బికాజ్ ఇట్ వాస్ వెరీ డర్టీ. | |
| 15. I had to buy groceries, because the fridge was empty. | 15. ఫ్రిజ్ ఖాళీగా ఉన్నందున నేను కిరాణా సామాను కొనవలసి వచ్చింది. |
| ఐ హాడ్ టు బై గ్రోసరీస్, బికాజ్ ది ఫ్రిడ్జ్ వాస్ ఎమ్ప్టీ. | |
| 16. He had to attend the workshop, | 16. అతను వర్క్‌షాప్‌కు హాజరు కావాల్సి వచ్చింది, |
| 16. He had to attend the workshop, to learn new computer skills. | 16. కొత్త కంప్యూటర్ నైపుణ్యాలను నేర్చుకోవడానికి అతను వర్క్‌షాప్‌కు హాజరు కావాల్సి వచ్చింది. |
| హీ హాడ్ టు అటెండ్ ది వర్క్‌షాప్, టు లర్న్ న్యూ కంప్యూటర్ స్కిల్స్. | |
| 17. She had to go to the hospital, to meet her sick friend. | 17. ఆమె అనారోగ్యంతో ఉన్న తన స్నేహితురాలిని కలవడానికి ఆసుపత్రికి వెళ్ళవలసి వచ్చింది. |
| షీ హాడ్ టు గో టు ది హాస్పిటల్, టు మీట్ హర్ సిక్ ఫ్రెండ్. | |
| 18. You had to organize the files, to submit them to the manager. | 18. మీరు ఫైళ్ళను నిర్వహించి, వాటిని మేనేజర్‌కు సమర్పించాల్సి వచ్చింది. |
| యూ హాడ్ టు ఆర్గనైజ్ ది ఫైల్స్, టు సబ్మిట్ ది మేనేజర్. | |
| 19. We had to repair the roof, because it was leaking during the rain. | 19. వర్షంలో పైకప్పు లీక్ అవుతోంది కాబట్టి మేము దానిని బాగు చేయాల్సి వచ్చింది. |
| వి హాడ్ టు రిపేర్ ది రూఫ్, బికాజ్ ఇట్ వాస్ లీకింగ్ డ్యూరింగ్ ది రేన్. | |
| 20. They had to cancel the trip, because the train was delayed. | 20. రైలు ఆలస్యం అయినందున వారు ప్రయాణాన్ని రద్దు చేసుకోవలసి వచ్చింది. |
| దే హాడ్ టు కాన్సెల్ ది ట్రిప్, బికాజ్ ది ట్రైన్ వాస్ డిలేడ్. | |
| 21. It had to be replaced, because it stopped working suddenly. | 21. అది అకస్మాత్తుగా పనిచేయడం మానేసినందున దానిని మార్చవలసి వచ్చింది. |
| ఇట్ట్ హాడ్ టు బీ రిప్లేస్‌డ్, బికాజ్ ఇట్ స్టాప్డ్ వర్కింగ్ సడ్న్లీ. | |
| 22. I had to wake up early, to catch the morning bus. | 22. ఉదయం బస్సు పట్టుకోవడానికి నేను త్వరగా నిద్ర లేవాల్సి వచ్చింది. |
| ఐ హాడ్ టు వేక్ అప్ ఎర్లీ, టు క్యాచ్ ది మార్నింగ్ బస్. | |
| 23. He had to explain the report, to the director in the meeting. | 23. సమావేశంలో ఆయన డైరెక్టర్‌కు నివేదికను వివరించాల్సి వచ్చింది. |
| హీ హాడ్ టు ఎక్స్ప్లెయిన్ ది రిపోర్ట్, టు ది డైరెక్టర్ ఇన్ ది మీటింగ్. | |
| 24. She had to finish her homework, to join her friends for the movie. | 24. ఆమె తన ఇంటి పనిని పూర్తి చేయాల్సి వచ్చింది, సినిమా కోసం తన స్నేహితులతో చేరడానికి |
| షీ హాడ్ టు ఫినిష్ హెర్ హోంవర్క్, టు జాయిన్ హెర్ ఫ్రెండ్స్ ఫర్ ది మూవీ. | |
| 25. You had to clean the office, to prepare for the manager’s inspection. | 25. మేనేజర్ తనిఖీకి సిద్ధం కావడానికి మీరు కార్యాలయాన్ని శుభ్రం చేయాల్సి వచ్చింది. |
| యూ హాడ్ టు క్లీన్ ది ఆఫీస్, టు ప్రిపేర్ ఫర్ ది మేనేజర్’స్ ఇన్స్పెక్షన్. |
